16-02-1996 అవ్యక్త మురళి

         16-02-1996         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వజ్రోత్సవ సంవత్సరంలో విశేష ధ్యాస పెట్టుకుని సమయం మరియు సంకల్పం యొక్క ఖజానాలను జమ చేసుకోండి.

ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా పిల్లలకి మూడు శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలు బాబాకి శుభాకాంక్షలు ఇవ్వడానికి వచ్చారు. బాబా దానికి ఫలితంగా మూడు శుభాకాంక్షలు ఇస్తున్నారు. 

1. శివజయంతి యొక్క 2. వజ్రోత్సవం యొక్క 3. వర్తమాన సమయంలో ఉత్సాహ, ఉల్లాసాలతో సేవ చేయడానికి, శుభాకాంక్షలు ఇస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలందరికి బాప్ దాదా ఈ మూడు శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాబా దగ్గరికి అందరి మనస్సు యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో చేసిన సేవా సమాచారం చేరుకుంది. ఈ అలౌకిక జయంతి కల్పమంతటిలో ఇంకెప్పుడు జరగదు. ఎందుకంటే మొత్తం కల్పంలో దేవాత్మలైనా, మహాత్మలైనా, సాధారణాత్మలైనా కానీ ఆత్మలు, ఆత్మల జయంతి జరుపుకుంటారు. కానీ ఈ సంగమయుగంలో శ్రేష్టాత్మలైన మీరు ఎవరి జయంతి జరుపుకోవడానికి వచ్చారు? పరమాత్మ యొక్క జయంతి జరుపుకోవడానికి వచ్చారు మరియు పరమాత్మ పిల్లల జయంతి జరుపుతున్నారు. సత్య-త్రేతాయుగాలలో కూడా మీ జయంతిని పరమాత్మ జరుపరు. మీరు పరమాత్మ జయంతిని జరుపరు. అంటే మీరు ఎంత పదమా, పదమాపద భాగ్యశాలి ఆత్మలు! ఇలా మీ శ్రేష్ఠ భాగ్యం గురించి ఎప్పుడైనా కలలో అయినా కానీ ఆలోచించారా? ఆలోచించలేదా? కానీ ఈ రోజు సాకారరూపంలో జరుపుకుంటున్నారు. సంతోషంగా ఉంది కదా? భారత వాసీయులు అయినా, విదేశీయులు అయినా, మధువనం వారు అయినా కానీ ఈ గ్రూప్లో కూర్చున్న వారందరూ ఎంత అదృష్టవంతులు! లోపల ఏమి పాట పాడుతున్నారు? ఓహో నా భాగ్యం! బాబా కూడా పాట పాడుతున్నారు - ఓహో నా పిల్లల భాగ్యం! సేవాధారి గ్రూప్ కూర్చున్నారు కదా! అన్ని వైపుల యొక్క విశేషమైన వారు. విశేష సేవ యొక్క విశేష ప్రత్యక్షఫలం పొందే ఆత్మలు. బాబా కూడా ఇటువంటి శ్రేష్ట పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ఎక్కువగా హర్షిస్తున్నారా? బాబా ఎక్కువగా హర్షిస్తున్నారా? ఇద్దరూనా? లేక బాబాకి ఎక్కువ ఉంటుందా లేదా మీకు ఎక్కువగా ఉందా? 

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న సేవాధారి వజ్రాల మాలను చూస్తున్నారు. మీరందరు కూడా మాలలో ఉన్నారు కదా? బాబా కంఠానికి ఉన్న మాలలోని మెరిసే వజ్రంగా అయ్యారా లేక ఇంకెవరైనా ఉంటారా? మీరే కదా ఇతరులు కాదు కదా? 108 మాల అని ప్రజలు కూడా అంటారు. కానీ బాప్ దాదా మెడలో వజ్రాలైన మీ అందరి యొక్క మాల ఎంత పెద్దదిగా ఉంది? కేవలం 108 అయితే క్రింద కూర్చున్నవారు సరిపోతారు. వెనుక ఉన్నవారు కూడా ఉన్నారు కదా? మొదట వెనుక ఉన్నవారే. బాప్ దాదా వెనుక వారికి ఎక్కువ శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇది కూడా త్యాగానికి ప్రత్యక్షఫలం. క్రింద (బయట) ఉన్నవారికి ఇంకా ఎక్కువ శుభాకాంక్షలు. బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డ యొక్క విశేషత చూస్తున్నారు. సంపూర్ణంగా అవ్వకపోయినా, పురుషార్థి అయినా కానీ బాబా పిల్లలలో ఏ విశేషత లేకుండా ఒకరు కూడా లేరు. అందరిలో ఏదోక విశేషత ఉంటుంది. అన్నింటికంటే మొదటి విశేషత కోట్లలో కొద్దిమంది అనే జాబితాలోకి వచ్చారు కదా! పెద్ద పెద్ద తపస్వీలు, మహాన్ ఆత్మలు 16,108 జగద్గురువు అయినా, శాస్త్రవాదులైనా, మహామండలేశ్వరులు అయినా కానీ బాబాని తెలుసుకోలేదు. కానీ బాబా యొక్క పిల్లలందరు బాబాని తెలుసుకున్నారు కదా! బాబాని తెలుసుకోవటం అనేది ఎంత పెద్ద విశేషత. మనస్సుతో నా బాబా అంటున్నారు కదా! నా బాబా అన్నారు అంటే అధికారిగా అయిపోయారు కదా! దీనిని ఏమంటారు? బాబాని పరిశీలించారు, గుర్తించారు. ఇలా గుర్తించడం కూడా బుద్ది యొక్క విశేషత, పరిశీలనా శక్తి. అంటే మీ అందరి పరిశీలనా శక్తి చాలా శ్రేష్టమైనది. మంచిది. ఈ రోజు విశేషంగా జరుపుకోవడానికి వచ్చారు కదా? ఈ రోజు జరుపుకునే రోజా లేక వినే రోజా? వినాలి కూడా? మంచిది. 

శివరాత్రి అంటున్నారు కానీ మీ కోసం ఇప్పుడు ఏమిటి? మీకు రాత్రి కాకపోతే ఏమిటి? అమృతవేళ. మీరు రాత్రి నుండి తొలగిపోయారా లేదా ఇంకా కొంచెం రాత్రి ఉందా? సెలవు తీసుకుని వెళ్ళిపోయిందా? కొంచెం అయినా ఏ రకంగా అయినా అంధకారం ఉందా లేక సమాప్తి అయిపోయిందా? అమృతవేళ సదా వరదాని సమయం మీకు రోజూ వరదానం లభిస్తుంది కదా? బాబా రాత్రిలో వస్తారు అని మీరు చెప్తారు. కానీ మనకి అయితే అమృతవేళ స్వర్ణిమ ఉదయం, వజ్రతుల్య ఉదయం అయిపోయింది. మీ యొక్క ఈ వరదాని స్వరూపాన్ని చూస్తున్నారా? మాయ మీ వరదానాన్ని మరిపింపచేయటం లేదు కదా? మాయ వస్తుందా? అప్పుడప్పుడు వస్తుందా? మాయ అయితే అంతిమ ఘడియ వరకు వస్తుంది. మామూలుగా వెళ్ళిపోదు. కానీ మాయ పని రావటం మరియు మీ పని దూరం నుండే పారద్రోలాలి. వచ్చిన తర్వాత పంపించడం కాదు. ఆ సమయం ఇప్పుడు సమాప్తి అయిపోయింది. మాయ వచ్చింది. మిమ్మల్ని కదిలించింది మరలా మీరు దానిని వెళ్ళగొట్టారు అంటే సమయం వ్యర్థం అయిపోయింది కదా! కానీ శాంతి యొక్క సాధనాల ద్వారా మీరు దూరం నుండే ఇది మాయ అని గ్రహిస్తున్నారు. దీనిలో కూడా సమయం వ్యర్థం చేసుకోకండి మరియు మాయ కూడా చూస్తుంది రానిస్తున్నారు కదా అని. ఇక వచ్చేటువంటి అలవాటు అయిపోతుంది. ఎలా అయితే ఏదైనా పశువునైనా, జంతువునైనా మీ ఇంటికి వచ్చే అలవాటు చేస్తే మరలా మీరు విసిగిపోయి పారద్రోలినా కానీ అలవాటు అయిపోతుంది కదా! బాప్ దాదా చెప్పారు కదా - కొంతమంది పిల్లలు మాయకి తేనీటి విందు ఇస్తున్నారు. ఏ తేనీరు త్రాగిస్తున్నారో తెలుసా? తెలుసు కదా? ఏమి చేయము, ఎలా చేయము, ఇప్పుడు పురుషార్థులం, ఇప్పుడింకా సంపూర్ణంగా కాలేదు. చివరికి అయిపోతాము... ఈ సంకల్పాలే తేనీటి విందు. అది చూస్తుంది నీరు - టీ లభిస్తుంది అని. ఎవరికైనా టీ - నీరు ఇస్తే వారు వెళ్ళిపోతారా లేక కూర్చుంటారా? ఎప్పుడైనా పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు, ఏమిటి, ఈవిధంగా అప్పుడప్పుడు అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరు పాస్ అయ్యారు. అందరి దగ్గర ఉంది అని అనటం అంటే మాయని ఆతిథ్యం ఇచ్చినట్లు. కొంచెం ఉప్పు కలిపిన పిండివంట (హాట్), కొంచెం తీపి కలిగినది (స్వీట్) కూడా తినిపిస్తున్నారు. మరలా ఏమి చేస్తున్నారు? మరలా విసిగిపోయి బాబా నీవే పారద్రోలు అంటున్నారు. మీరు రానిస్తున్నారు, బాబా పారద్రోలాలి, ఎందుకు? ఎందుకు రానిస్తున్నారు? మాయ మాటిమాటికి ఎందుకు వస్తుంది? ప్రతి సమయం, ప్రతి కర్మ చేస్తూ త్రికాలదర్శి సీట్ పై సెట్ అవ్వటం లేదు. త్రికాలదర్శి అంటే భూతకాలం, వర్తమానం మరియు భవిష్యత్తు తెలిసినవారు. ఎందుకు, ఏమిటి అనరు. త్రికాలదర్శి అయిన కారణంగా మొదటే తెలుసుకుంటారు. ఈ విషయాలు రావలసిందే, జరగవలసిందే, స్వయం ద్వారా అయినా, ఇతరుల ద్వారా అయినా, మాయ ద్వారా అయినా, ప్రకృతి ద్వారా అయినా, అన్ని రకాలుగా పరిస్థితులు వస్తాయి. రావల్సిందే అని. కానీ స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి దాని ముందు ఏమి కాదు. పరిస్థితి ఉన్నతమైనదా లేక స్వస్థితి ఉన్నతమైనదా? లేదా అప్పుడప్పుడు స్వస్థితి ఉన్నతంగా, అప్పుడప్పుడు పరిస్థితి ఉన్నతంగా ఉంటుందా? దీనికి సాధనం 1. ఆది, మధ్య, అంత్యం మూడు కాలాలు పరిశీలించుకుని, అర్ధం చేసుకుని ఏదైనా చేయండి. కేవలం వర్తమానాన్ని చూడకండి. కేవలం వర్తమానాన్నే చూస్తే ఒకోసారి పరిస్థితి ఉన్నతంగా, ఒకోసారి స్వస్థితి ఉన్నతంగా అవుతుంది. ప్రపంచంలో కూడా చెప్తారు - మొదట ఆలోచించండి. తర్వాత చేయండి అని. ఆలోచించి చేయకుండా, చేసిన తర్వాత ఆలోచిస్తే పశ్చాత్తాపరూపం అవుతుంది. ఇలా చేయకూడదు. ఇలా చేయాలి, ఇలా వెనుక ఆలోచించడం అంటే పశ్చాత్తాపరూపం మరియు మొదట ఆలోచించటం అనేది జ్ఞానీ ఆత్మ గుణం. ద్వాపర, కలియుగాలలో అనేక రకాలుగా పశ్చాత్తాపమే పొందారు కదా? కానీ ఈ సంగమయుగంలో పశ్చాత్తాపపడటం అంటే జ్ఞానీ ఆత్మ కాదు. ఇలా మిమ్మల్ని మీరు తయారుచేసుకోండి - మీలో మీకు కూడా, మనస్సులో కూడా ఒక సెకను కూడా పశ్చాత్తాపం ఉండకూడదు. 

ఈ వజ్రోత్సవంలో విశేషంగా రోజంతటిలో 1. సమయం మరియు 2. సంకల్పం ఈ రెండు ఖజానాలపై పూర్తి ధ్యాస పెట్టండి. ఖజానాలు చాలా ఉన్నాయి కానీ విశేషంగా ఈ రెండు ఖజానాలపై ధ్యాస పెట్టండి. ప్రతి రోజూ శ్రేష్ట, శుభ సంకల్పాలు ఎన్ని జమ చేసుకున్నాను? అని. ఎందుకంటే మొత్తం కల్పానికి జమ చేసుకునే బ్యాంక్ ఇప్పుడే తెరిచి ఉంటుంది. సత్యయుగంలో జమ బ్యాంక్ మూసేస్తారు. ఈ బ్యాంక్ ఉండదు. మామూలు బ్యాంక్ కూడా ఉండదు. ఎవరి నుండి కొంచెం కూడా తీసుకోవలసిన అవసరం ఉండదు. అంతగా మీ దగ్గర ధనం ఉంటుంది. బ్యాంక్ లో ధనం ఎందుకు ఉంచుకుంటారు? రక్షణ కోసం మరియు వడ్డీ లభిస్తుంది. కొందరు తెలివిగా ఆ వడ్డీతోనే నడుస్తారు. ఈ సమయంలో ఆ తెలివి ఉంటే మంచిది. జమ చేసుకుంటున్నారు కదా! కానీ ఆ వడ్డీని ఏవిధంగా ఉపయోగిస్తున్నారు అనేది చూసుకోవాలి. సత్యయుగంలో అయితే ఈ బ్యాంక్ ఉండదు మరియు ఆత్మిక ఖజానా జమ చేసుకునే బ్యాంక్ కూడా ఉండదు. రెండు బ్యాంకులు ఉండవు. ఈ సమయంలో అయితే ఒకటికి కోటానుకోట్ల రెట్లు లభించే బ్యాంక్ ఉంటుంది. లెక్క ఉంది. వజ్రోత్సవంలో సత్యమైన వజ్రంగా అవ్వవలసిందే. ఇది పక్కాయే కదా? అవ్వగలమో-లేదో? అనే సంకల్పం ఎప్పుడైనా వస్తుందా? ఏమో తెలియదు అనేది రావటం లేదు కదా? ఏదైనా కానీ, త్యాగం చేయవలసి వచ్చినా, తపస్సు చేయవలసి వచ్చినా, నిర్మానంగా అవ్వవలసి వచ్చినా ఏది ఏమైనా కానీ తప్పకుండా తయారవ్వాలి. అవుతారా? అవ్వరా? చెప్పండి (అవుతాం) అలాగే అనటం చాలా సహజం. కానీ అలా తయారవ్వడంలో ధ్యాస పెట్టాలి. మొట్టమొదట ఈ నేను అనే మాటను త్యాగం చేయాలి. నేను అనే మాట చాలా పాతది. కానీ ఈ రోజుల్లో ఇది చాలా రాయల్ రూపంగా అయిపోయింది. భాషలో కూడా నేను అనే మాట సమాప్తి అయిపోయి బాబా - బాబా అనే మాట రావాలి. సాధారణ విషయమే చెప్పటంలో ఎలా చెప్తారో చూడండి. నేను యోగ్యుడిని కదా అందువలన సౌకర్యాలు మరియు సేవ కూడా ఆవిధంగానే లభించాలి. నేను యోగ్యుడిని, నేను చేస్తున్నాను అని అనటం సత్యమేనా? చేసేది మీరే కదా! అయితే నేను చేస్తున్నాను అని ఎందుకు అనకూడదు! నేను సత్యం, నేను అసత్యం, నేను చేస్తున్నాను....... ఇలా అంటున్నారంటే మీరే చేస్తున్నారు కదా! కానీ చేస్తున్నాను అని ఎందుకు అనకూడదు! మీరు చేయటం లేదా? బాబా చేస్తున్నారా? బాబా చేయించేవారు కానీ చేసేవారు మీరే. అయితే నిజానికి నేను అనటం తప్పు ఎలా అయ్యింది? నేను అనే మాటను ప్రయోగిస్తున్నారు వాస్తవానికి నేను అనే మాట ఎవరికి వర్తిస్తుంది? ఆత్మకా లేక శరీరానికా? నేనెవరు? ఆత్మ కదా, శరీరం కాదు. ఆత్మాభిమానిగా అయ్యి నేను ఆత్మను అనే స్మృతిలో నేను అనే మాట వాడితే అది సత్యమే కానీ దేహాభిమానంతో నేను అని అనటం తప్పు. రోజంతటిలో నేను అనే మాట చాలా సార్లు వస్తుంది మరియు రావల్సిందే. నేను అనే మాట వస్తున్నప్పుడు నేనెవరు? అనేది అభ్యాసం చేయండి. వాస్తవానికి నేను అంటేనే ఆత్మ. శరీరాన్ని నాది అంటారు. ఆత్మాభిమానిగా అయ్యి నేను అని అంటే ఆత్మకి స్వతహాగానే బాబా స్మృతి ఉంటుంది. చెప్పవలసిన అవసరం లేదు. నేను ఆత్మను అనే అభ్యాసం చేయండి. నేను అని అన్నప్పుడు మీ నామ రూపాల స్మృతి సహజంగా వచ్చే అభ్యాసం అయిపోయింది కదా! నేనెవరు? అంటే నేను ఫలానా అని సహజంగా వచ్చేస్తుంది. ఆలోచించవలసిన పని ఉండటం లేదు. ఇలా వ్యతిరేక భావంతో నేను అనే మాటని వాడుతున్నారు. కనుకనే శ్రమ ఎక్కువ మరియు ప్రాప్తి తక్కువ అయిపోతుంది. కొంతమంది పిల్లలు అంటున్నారు - చాలా సేవ చేస్తున్నాం. చాలా శ్రమ చేస్తున్నాం కానీ ఫలం అంతగా రావటం లేదు అని దానికి కారణం ఏమిటి? వరదానం అయితే అందరికీ ఒక్కటే, 30 సంవత్సరాల వారు ఆయనా, ఒక నెల వారికి అయినా ఒక్కటే. ఖజానా అందరికీ ఒకే విధంగా లభించింది. పాలన, దినచర్య, మర్యాదలు అందరికీ ఒక్కటే. వేర్వేరుగా లేవు. విదేశీయులకి ఒకవిధమైన మర్యాదలు, భారతవాసీయులకి ఒకవిధమైన మర్యాదలు అలా లేవు కదా! కొంచెం కొంచెం తేడా ఉందా? లేదు కదా! అన్నీ ఒకటే అయినప్పుడు కొందరికి సఫలత లభిస్తుంది, కొందరికి తక్కువ లభిస్తుంది. దానికి కారణం ఏమిటి? బాబా తక్కువ సహాయం చేస్తున్నారా? కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ ఇస్తున్నారా? లేదు! అయినా ఎందుకు అలా అవుతుంది? దాని అర్ధం ఏమిటి? అది మీ పొరపాటు. ఒక్కొక్కసారి వస్తే దేహాభిమానం యొక్క నేను అనే భావం వస్తుంది. ఒక్కొక్కసారి తోటి వారి సఫలత చూసి ఈర్ష్య కూడా వస్తుంది. ఆ ఈర్ష్య కారణంగా మనస్సుతో సేవ చేయవలసింది, బుద్ధితో చేస్తున్నారు కానీ మనస్సుతో చేసిన సేవకే ఫలితం లభిస్తుంది. కొన్నిసార్లు పిల్లలు బుద్దితో సేవ చేస్తున్నారు. మనస్సు మరియు బుద్ధి కలిపి చేయడం లేదు. మంచి బుద్ది ఉంది. దానిని కార్యంలో ఉపయోగించటం మంచిదే కానీ కేవలం బుద్దినే కాదు. మనస్సుతో చేసేవారి మనస్సులో బాబా యొక్క స్మృతి కూడా సదా ఉంటుంది. కేవలం బుద్ధితో చేస్తే బుద్ధిలో కొంచెం సమయమే స్మృతి ఉంటుంది - బాబా చేయించేవారు, చేయించేవారు బాబా అనుకుంటారు మరలా కొంచెం సమయం తర్వాత నేను అనే భావం వచ్చేస్తుంది. అందువలన బుద్ధి మరియు మనస్సు రెండింటి యొక్క సమానత ఉంచుకోండి. 

వజ్రోత్సవంలో ఏమి చేయాలో చెప్పాను కదా! విశేషంగా పొదుపుఖాతాను జమ చేసుకోండి. రోజంతటిలో నా ద్వారా ఎటువంటి పొరపాటు జరగలేదు, ఎవరికి దు:ఖం ఇవ్వలేదు, ఎవరితో గొడవ పడలేదు. అంటే ఏమి పోగొట్టుకోలేదు మంచి విషయమే. ఏమీ పొగొట్టుకోలేదు సరే కానీ జమ చేసుకున్నారా? సేవ కూడా చేసారు. కానీ మీ ఆత్మీయతతో సేవలో సఫలత పొందారా? సఫలతను జమ చేసుకున్నారా? సమయాన్ని సేవలో ఉపయోగించారు మంచిదే. కానీ ఏ విధితో సేవ చేసారు? కొందరు అంటున్నారు - మేము రోజంతా ఎంతగా సేవలో బిజీగా ఉంటున్నామో మాకే తెలియదు. అలా బిజీగా ఉంటున్నారు మంచిదే. కానీ సేవ యొక్క ప్రత్యక్షఫలం జమ అయ్యిందా? లేక కేవలం శ్రమ చేసారా? 8 గంటలు సేవలో వినియోగించారు. కానీ 8 గంటలు సేవలో జమ అయ్యాయా? సమయం అంతా జమ అయ్యిందా? లేక సగం జమ అయ్యి మిగతా సగం పెరిగెత్తడం మరియు ఆలోచించడంలో పోయిందా? శ్రేష్ట సంకల్పాలు, శుభభావన, శుభకామన యొక్క సంకల్పాలు జమ అవుతాయి. రోజంతటి యొక్క జమ ఖాతాను వ్రాసుకోండి. జమ ఖాతా పెరుగుతూ ఉంటే స్వతహాగానే వజ్రంగా అవ్వవలసిందే. ఇప్పుడు కూడా సమయం మరియు సంకల్పాలు మంచిగా ఉంటంలేదు. చెడులో ఉండటం లేదు. చెడుగా ఉండటం లేదు అంటే రక్షించుకున్నారు. కానీ మంచిలో జమ అయినవా? అర్థమైందా? సమయం మరియు సంకల్పాలను పొదుపు చేయండి. ఇప్పుడు ఎంతగా పొదుపు చేస్తారో, జమ చేస్తారో అంతగానే మొత్తం కల్పంలో రాజ్యం చేస్తారు మరియు పూజ్యులుగా కూడా అవుతారు. సాకారరూపంలో ద్వాపరయుగం నుండి పడిపోయే కళలోకి వచ్చేస్తారు. కానీ మీరు జమ చేసుకున్న ఖాతా మీ జడ చిత్రాలను పూజ్యనీయంగా చేస్తుంది. సమయం వ్యర్ధంగా లేదా సాధారణంగా పోతుందా అనేది వ్రాసుకోండి. అప్పుడు మీకే తెలిసిపోతుంది. సాధారణ సంకల్పాలు ఎన్ని ఉంటున్నాయి? అనేది కూడా పరిశీలించుకోండి. కానీ ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ ఈరోజు మీ యొక్క జమాతో చాలా తక్కువ అయ్యింది అనుకోండి. దాన్ని చూసి మీరు బలహీనులుగా అవ్వకండి. జమ చేసుకోవడానికి ఇప్పుడు కూడా అవకాశం ఉంది అని భావించండి. ఇలా మీకు మీరు ఉత్సాహ ఉల్లాసాలలోకి రండి. మీతో మీరు పోటి పడండి, ఇతరులతో కాదు. ఈ రోజు 8 గంటలు జమ అయితే రేపు 10 గంటలు జమ చేసుకుంటాను అని మీతో మీరు పోటీ పడండి అంతే కానీ బలహీనులుగా అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు కూడా జమ చేసుకునే సమయం మిగిలి ఉంది. బాగా ఆలస్యం అయిపోయింది అనే బోర్డు ఇంకా పెట్టలేదు. అంతిమ ఫలితం యొక్క సమయం ఇప్పుడు ఇంకా చెప్పలేదు. లౌకికంలో కూడా పేపర్ యొక్క తారీఖు నిర్ణయం అయినప్పుడు మంచి పురుషార్థిలు  ఏమి చేస్తారు? భాధపడతారా? లేక పురుషార్థాన్ని పెంచుకుంటారా? అలాగే మీరు కూడా బలహీనంగా అవ్వకండి. నేను ఇంకా నా ఖాతాను పెంచుకోవాలి అనే మరింత ఉత్సాహ ఉల్లాసాలలోకి వచ్చి ధృడసంకల్పం చేయండి. అర్థమైందా? బలహీనంగా అవ్వరు కదా! ఒకవేళ అయితే బాబా మరలా శ్రమ చేయవలసి ఉంటుంది. ఏమయిపోయిందో... ఇలా అయిపోయింది... బాబా రక్షించు, రక్షించు అంటూ పెద్ద, పెద్ద ఉత్తరాలు వ్రాయటం మొదలు పెడతారు. ఇక అలా చేయకూడదు. మమ్మల్ని రక్షించు అని, మీ జడచిత్రాల దగ్గరకు వెళ్ళి అడుగుతారు కదా! అంటే మీరు రక్షించేవారు అంతేకానీ రక్షించు, రక్షించు అనేవారు కాదు.” 

మాకు కూడా పూజ జరుగుతుంది అని డబల్ విదేశీయులు భావిస్తున్నారా! లేదా భారతవాసీయులకే జరుగుతుందా? ఎవరికి జరుగుతుంది? మీకు జరుగుతుందా? సదా మీ రాజ్యాధికారి స్వరూపం మరియు పూజ్య స్వరూపం అంటే నేను పూజ్య ఆత్మను, ఇతరులకి ఇచ్చే దాతను తీసుకునేవాడిని కాదు, దేవతను అని స్మృతి ఉంచుకోండి. బాబా తనకి తానుగా ఇచ్చారు కదా లేక మీరు అడిగితే ఇచ్చారా? మీకు అయితే అడగటం కూడా రాదు కదా! భక్తిలో ఏమి అడిగేవారు? సంతానం కావాలి, ఇల్లు కావాలి లేదా పరీక్షలో పాస్ అవ్వాలి అని కోరుకునేవారు. వారసత్వానికి అధికారులుగా భావించేవారు కాదు మరియు బాబా అయితే వారసత్వంలో అన్నీ ఇచ్చేశారు. తన దగ్గర ఏమైనా ఉంచుకున్నారా? అడగకుండానే ఇచ్చారు. మేము విశ్వానికి రాజు అవుతాం అని ఎప్పుడైనా ఆలోచించారా? సంగమయుగి బ్రాహ్మణులుగా అవుతాం అని ఎప్పుడైనా ఆలోచించారా? అందువలన జమ చేస్కోండి. ఎందుకంటే బాప్ దాదా చూసారు, చాలా శ్రమ పడుతున్నారు కానీ జమ ఖాతా ఎంత ఉండాలో అంత లేదు. తారీఖు చెప్పేసిన తర్వాత మాకు తెలియదు తెలిస్తే చేసేసేవాళ్ళం అంటే కుదరదు. అందువలన ఈ వజ్రోత్సవంలో స్మృతితో, సేవతో, శుభభావన, శుభకామనతో ఖాతాను జమ చేసుకోండి. ఏమి చేయాలో అర్థమైందా? జమ చేసుకోవాలి. అందరి ఖాతాలు బాప్ దాదా దగ్గరికి చేరుకుంటాయి. మీకు మీరు ఒక నెల యొక్క ఫలితం చూసుకోండి. ఇక్కడికి ఉత్తరం వ్రాసి పంపటం కాదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మరియు పరిశీలన చేసుకుని పరివర్తన చేసుకోండి. బలహీనంగా అవ్వవద్దు, పరివర్తన అవ్వండి. బాబా తోడుగా ఉన్నారు కదా! బాబాని ఉపయోగించుకోండి. తక్కువగా ఉపయోగించుకుంటున్నారు. బాబా తోడు ఉన్నారు, ఉన్నారు అని అంటున్నారు కానీ బాబాని ఉపయోగించుకోండి. సర్వశక్తివంతుడు తోడు ఉంటే సఫలత మీ చరణాల దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది. 

మంచిది. శివజయంతి లేదా శివరాత్రికి సంబంధించి మీ యొక్క కంబైండ్ రూపానికి మహిమ ఉంది అది ఏమిటి? (శివశక్తి) పక్కాయేనా! లేక శక్తి వేరు, శివుడు వేరా? శివశక్తి అంటేనే కంబైండ్ రూపం, వేరు కాదు. అయితే మరలా ఎలా వేరు చేసేస్తున్నారు? వేరు అవ్వగలరా? మరలా ఎలా అవుతున్నారు? కలిసి ఉంటే మరలా ఎలా వేరు అయిపోతున్నారు? కలిసి ఉన్నవారు వేరవ్వరు. కానీ మాయ ముఖం తిప్పేస్తుంది. అందువలన వేరు అయిపోతున్నారు. నేను శివశక్తిని అనే స్మృతియే ఈనాటి శివజయంతి యొక్క స్మృతిచిహ్నం. పాండవులు ఎవరు? మీరు శివశక్తులేనా? లేదా శివ పాండవులా? ఎవరు? శక్తులే కదా! 

పిల్లలు అడిగారు - భవిష్యత్తులో ఎలాంటి సేవ జరుగుతుంది? అని. బాబా ఇంతకు ముందు కూడా చెప్పారు. ఎంత వీలైతే అంత తయారైన వేదికపై మీరు ముఖ్య అతిథిగా అయ్యి వెళ్ళాలి, ఆ సేవను పెంచండి. దీని కొరకు పెద్ద పెద్ద అసోసియేషన్స్ లేదా కంపెనీలు, సొసైటీలలో ఉండే విశేషమైన ఆత్మలకు పరిచయాన్నిచ్చి సమీపంగా తీసుకురండి. అప్పుడు ఒక్కొక్కరికి వేరుగా సేవ చేయడానికి బదులు ఒకే సమయంలో అనేక ఆత్మల సేవ అయిపోతుంది. దీనిపై మరింత ధ్యాస ఉంచుకుని దీనిని పెంచండి. ఇప్పుడు మీరు పెద్ద స్పీకర్ ని తయారుచేయండి. పెద్ద మైక్ అయితే ఎలాగూ తయారుచేయాలి అది వేరే విషయం. కానీ సంపర్కంలో ఉండే వారిని జ్ఞానంలోకి తీసుకురండి. మీ జ్ఞానం యొక్క విషయాలు మీరు చెప్పడం కాదు కానీ ఈ విషయం ఈ కారణంగా యదార్థమైనది అని ఈ విషయాన్ని వారు ఋజువు చేసి చెప్పాలి. ఇప్పుడు శాంతి మరియు ప్రేమ వరకూ చేరుకున్నారు. ఇక్కడ ప్రేమ లభించింది, శాంతి అనుభవం అయ్యింది. బ్రహ్మాబాబా యొక్క అద్భుతం ఇప్పటికి ఇంతవరకు వచ్చారు కానీ బ్రహ్మాబాబాలో ఉన్న పరమపిత అద్భుతం అనేంతవరకు చేరుకోవాలి. విదేశీయులకు బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ధైర్యం ఉంచుకుని విశేష వ్యక్తులని సమీపంగా తీసుకువచ్చారు. ప్రతి సంవత్సరం రోజురోజుకి ఎంతో కొంత ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఒక 10-15 మంది ఉండాలి. ఎక్కువమంది కాదు. కానీ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉండాలి. వినే వారిపై వారి ప్రభావం పడే విధంగా ఉండాలి. భారతదేశంలోనైనా, విదేశంలోనైనా అటువంటి వారిని జ్ఞానానికి సమీపంగా తీసుకురండి. పరమాత్మ జ్ఞానాన్ని వారు అర్ధం చేసుకుని వారే ఇతరులకి స్పష్టం చేసే విధంగా ఉండాలి. దీనిలో శ్రమ ఉంది కానీ బాబా యొక్క మరియు పరమాత్మ యొక్క ప్రత్యక్షత డైమండ్ జూబ్లీ తర్వాత కూడా చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు! ఇప్పుడు 62 దేశాలలో సేవాకేంద్రాలు ఉన్నాయి. కానీ ప్రతీ ఒక్క దేశంలో పెద్ద మైక్ కంటే ముందు ఇటువంటి చిన్న, పెద్ద స్పీకర్స్ ని తయారు చేయండి. భారతదేశంలోని మరియు ప్రతి దేశంలో కూడా ఇటువంటి గ్రూప్ ని లేదా ఒకరిద్దరిని తయారుచేయండి. ఇతరులు ఋజువు చేసినప్పుడే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. ఇంతవరకు చేసిన సేవలో ఇతరుల యొక్క అనుభవం ద్వారా మీ పరిచయం విని వృద్ధి జరిగింది. అక్కడ స్వర్గంలా ఉంది, శాంతి ఉంది, ప్రేమ ఉంది. ఇలా ఒకరిద్దరి అనుభవం విని త్వరగా వృద్ధి అయ్యింది. ఇలా ఇంతవరకు సేవ చేసారు. దానికి శుభాకాంక్షలు. కానీ ఇక ముందు ఏమి చేయాలి? ఈవిధంగా సమీపంగా తీసుకురండి. వారి కొరకు వేరుగా జ్ఞానయుక్త శ్రమ చేయండి. సంఘటనలో కుదరదు. ప్రత్యేకంగా వారి గురించి శ్రమ చేసి సంపర్కంలో ఉన్నవారిని సేవలో పెట్టండి. ఇప్పటి వరకు భూమిని తయారుచేసారు కానీ ఆ భూమిలో పరమాత్మ జ్ఞానం, పరమాత్మ గుర్తింపు అనే బీజాలు వేసే లక్ష్యం పెట్టుకోండి. దీని కొరకు సమయం పడుతుంది. విదేశీ సేవ గురించి లక్ష్యం పెట్టుకుని చేసారు కనుక సఫలత లభించింది కదా! లేకపోతే ఇంతకు ముందు అనుకునేవారు. విదేశాల నుండి ఇక్కడికి ఎలా వస్తారు? చాలా కష్టం అని కానీ ఇప్పుడు 200-250 మంది వస్తున్నారు కదా? అంటే ఇప్పుడు ఈ విధంగా భూమిని తయారుచేసారు, దున్నారు, మంచి శ్రమ చేసారు, అలాగే ఇప్పుడు ఇటువంటి గ్రూప్ ని తయారుచేయండి. పరమాత్మ సర్వవ్యాపి కాదు అనేటటువంటి కఠినమైన విషయాలు వారు స్పష్టం చేయలేకపోయినా కానీ తక్కువలో తక్కువ, ఇది పరమాత్మ శక్తి అని స్పష్టం చేయగలిగేలా ఉండాలి. బ్రహ్మని వేరుగా చేయడం కాదు. పరమాత్మ శక్తి బ్రహ్మ ద్వారా కార్యం చేయించింది అని బాబా యొక్క గుర్తింపు ఇవ్వాలి. ఇది ఏదో ఒక శక్తి అన్నంత వరకూ వచ్చారు. కానీ ఇది పరమాత్మ కార్యం అని రావాలి. పరమాత్మ యొక్క గుర్తింపు లభించినప్పుడే సమాప్తి అవుతుంది. ఇంతవరకు చేసింది మంచిగా చేసారు. కానీ ఇప్పుడు ఇంకా మంచిగా చేయాలి. దీని కొరకు చాలా కష్టపడవలసి వస్తుంది అని బాబాకి తెలుసు కానీ చేయవలసిందే. ఇటువంటి కార్యక్రమం తయారు చేయండి. దానికి యోగ్యులుగా భావించే వారిని చిన్న చిన్న గ్రూప్ ని తయారు చేసి సమీపంగా తీసుకురండి. ఒక్కొక్కరు చేసినా పర్వాలేదు. చిన్న చిన్న గ్రూప్లుగా అయ్యి చేసినా పర్వాలేదు. ఎటువంటి వ్యక్తియో ఆవిధమైన సేవ చేయండి. ఏమి చేయాలో అర్థమైందా?  

నలువైపుల ఉన్న శివజయంతి యొక్క శుభాకాంక్షలు ఇచ్చే పిల్లలకు, సదా బాబాతో పాటు ఉండే కంబైండ్ రూపధారి పిల్లలకు, సదా ఉత్సాహ ఉల్లాసాల ద్వారా స్వయాన్ని మరియు ఇతరులకి కూడా ముందుకి తీసుకువెళ్ళే పిల్లలకు, నాలుగువైపుల ఉన్న సేవలో ముందుకు వెళ్ళే సేవాధారి పిల్లలకు, బాప్ దాదా యొక్క పదమాపదమ శుభాకాంక్షలు. ప్రియస్మృతులతో పాటూ బాబా కూడా పిల్లల యొక్క శుభాకాంక్షలు, ప్రియస్మృతులు స్వీకరిస్తున్నారు, చూస్తున్నారు - అన్ని వైపుల నుండి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు అనే మనస్సు యొక్క పాట వినబడుతుంది. ఇలా శుభాకాంక్షలు ఇచ్చే మరియు తీసుకునే ఇలా రెండింటి సంగమం యొక్క విశేష ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments