15-12-2006 అవ్యక్త మురళి

 15-12-2006         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్మృతి స్వరూపంగా, అనుభవ స్వరూపంగా అయ్యి తీవ్రవేగంతో సెకనులో పరివర్తన చేసుకుని పాన్ విత్ ఆనర్‌గా అవ్వండి.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్నటటువంటి పిల్లల మస్తకంలో మెరుస్తున్న మూడు విశేష భాగ్యరేఖలను చూస్తున్నారు. అందరి మస్తకం భాగ్యరేఖలతో మెరుస్తూ ఉంది. 1. పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ. 2. శ్రేష్టశిక్షకుని ద్వారా శిక్షణ యొక్క భాగ్యరేఖ. 3. సద్గురువు ద్వారా శ్రీమతం యొక్క భాగ్యరేఖ. వాస్తవానికి మీ భాగ్యం అపారమైనది కానీ ఈ రోజు విశేషంగా మూడు రేఖలు చూస్తున్నారు. మీరు కూడా మీ మస్తకంలో మెరుస్తున్న రేఖలను అనుభవం చేసుకుంటున్నారు కదా! అన్నింటికంటే శ్రేష్టమైనది - పరమాత్మ ప్రేమ యొక్క పాలనా రేఖ. ఎలా అయితే బాబా ఉన్నతోన్నతమైనవారో అదేవిధంగా పరమాత్మ పాలన కూడా ఉన్నతోన్నతమైనది. ఈ పాలన కొద్దిమందికే ప్రాపిస్తుంది కానీ మీరందరు ఈ పాలనకు పాత్రులు అయ్యారు. ఈ పాలన మొత్తం కల్పంలో పిల్లలైన మీకు ఒకేసారి లభిస్తుంది. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లభించదు. ఈ పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ ప్రాప్తులు కోట్లలో కొద్దిమంది ఆత్మలకే అనుభవం అవుతాయి. మీరందరు అనుభవీలే కదా! అనుభవం ఉందా? పాలన యొక్క అనుభవం కూడా ఉంది, చదువు మరియు శ్రీమతం యొక్క అనుభవం కూడా ఉంది. అనుభవీ మూర్తులు. సదా మీ మస్తకంలో ఈ భాగ్యసితార మెరుస్తూ కనిపిస్తుందా? సదా కనిపిస్తుందా? అప్పుడప్పుడు డీలా అయిపోతుందా? డీలా అవ్వకూడదు. సితార యొక్క మెరుపు డీలా అవుతుంది అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? 

బాప్ దాదా కారణం ఏమి చూసారంటే స్మృతి స్వరూపంగా అవ్వలేదు. నేను ఆత్మను అని ఆలోచిస్తున్నారు, ఆలోచనా స్వరూపంగా అవుతున్నారు. కానీ స్మృతిస్వరూపంగా తక్కువగా అవుతున్నారు. ఎంత వరకు సదా స్మృతిస్వరూపంగా అవ్వరో అంతవరకు సమర్థస్వరూపంగా కాలేరు స్మృతియే సమర్థతను ఇస్తుంది. స్మృతిస్వరూపులే సమర్థ స్వరుపులు. అందువలనే భాగ్యసితార తక్కువగా మెరుస్తుంది. మిమ్మల్ని మీరు అడగండి - ఎక్కువ సమయం ఆలోచనా స్వరూపంగా అవుతున్నానా లేక స్మ్మతిస్వరూపంగా అవుతున్నానా అని. ఆలోచనా స్వరూపంగా అవ్వటం ద్వారా నేను ఇది, నేను అది ..... అని చాలా ఆలోచిస్తున్నారు కానీ స్మృతిస్వరూపంగా అవ్వని కారణంగా వ్యర్థ, సాధారణ సంకల్పాలు కూడా కలిసిపోతున్నాయి. వాస్తవానికి మీ అనాదిస్వరూపం - స్మృతిస్వరూపం నుండి సమర్థస్వరూపం. ఆలోచించేవారిగా కాదు, స్వరూపులు. మరియు ఆదిలో కూడా ఈ సమయం యొక్క స్మ్మతిస్వరూపానికి ప్రాలబ్దం ప్రాప్తిస్తుంది. అనాది, ఆది స్వరూపం కూడా స్మృతిస్వరూపమే మరియు ఈ అంతిమ సమయంలో కూడా స్మృతిస్వరూపంగా అవుతున్నారు. ఆది, అనాది మరియు అంత్యం మూడు కాలాలలో స్మృతిస్వరూపులు. ఆలోచనా స్వరూపులు కాదు. అందువలనే బాప్ దాదా గతంలో కూడా చెప్పారు - వర్తమాన సమయంలో అనుభవీ మూర్తిగా అవ్వటమే శ్రేష్టస్థితి. నేను ఆత్మను, పరమాత్మ లభించారు అని ఆలోచిస్తున్నారు కానీ అర్థం చేసుకోవటం మరియు అనుభవం చేసుకోవటంలో చాలా తేడా ఉంది. అనుభవీ మూర్తులు ఎప్పుడు మాయతో మోసపోరు, దు:ఖం, అనుభవించరు. మధ్యమధ్యలో మాయ యొక్క ఆటలు చూస్తున్నారు లేదా ఆడుతున్నారు కూడా అంటే అనుభవీ మూర్తులుగా అవ్వటంలో లోపమే. అనుభవం అనేది సర్వ శ్రేష్ట అధికారం. బాప్ దాదా చూసారు - చాలా మంది పిల్లలు ఆలోచిస్తున్నారు కానీ స్వరూపం యొక్క అనుభూతి తక్కువగా ఉంది. 

ఈరోజుల్లో ప్రపంచంలో ఆత్మలు చూడటం మరియు వినటం ద్వారా అలసిపోయారు కానీ అనుభవం ద్వారా ప్రాప్తి కోరుకుంటున్నారు. అనుభవీలే అనుభవం చేయించగలరు. మరియు అనుభవీ ఆత్మ సదా ముందుకు వెళ్తూ ఉంటుంది మరియు ఎగురుతూ ఉంటుంది. ఎందుకంటే అనుభవీ ఆత్మలో ఉత్సాహ, ఉల్లాసాలు ప్రత్యక్ష రూపంలో ఉంటాయి. కనుక పరిశీలన చేసుకోండి - ప్రతి పాయింట్ యొక్క అనుభవీ మూర్తిగా అయ్యానా? అని. అనుభవం యొక్క అధికారం మీ యొక్క ప్రతి కర్మలో కనిపిస్తుందా? ప్రతి మాట మరియు ప్రతి సంకల్పం అనుభవం యొక్క అధికారంతో ఉన్నాయా లేక కేవలం అర్థం చేసుకునే ఆధారంగానే ఉన్నాయా? అని పరిశీలన చేసుకోండి. 1. అర్ధం చేసుకోవటం మరియు 2. అనుభవం చేసుకోవటం. ప్రతి సబ్జక్టులో, జ్ఞానం యొక్క పాయింట్స్ వర్ణన చేయటంలో బయట ఉపన్యాసకులు కూడా చాలా మంచిగా ఉపన్యాసం చెప్తారు. కానీ ప్రతి వాక్యం యొక్క అనుభవీ స్వరూపంగా అవ్వటమే జ్ఞానీ ఆత్మగా అవ్వటం. 3. యోగం జోడించేవారు, యోగంలో కూర్చునేవారు కూడా చాలామంది, కానీ యోగం యొక్క అనుభవం అంటే శక్తి స్వరూపంగా అవ్వటం. శక్తి స్వరూపానికి పరిశీలన - ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో ఆ శక్తిని ఆహ్వానం చేసి నిర్విఘ్నస్వరూపంగా అవ్వాలి. ఒకవేళ ఒక శక్తి అయినా తక్కువగా ఉంటే, వర్ణన చేస్తున్నారు. కానీ స్వరూపంగా కాకపోతే సమయానికి మోసపోతారు. మీకు సహనశక్తి కావాలి మీరు ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగిస్తే మిమ్మల్ని యోగయుక్త అనుభవీస్వరూపులు అనరు. నాలుగు సబ్జక్టులలో స్మృతిస్వరూపులు, అనుభవీస్వరూపులు అయిన వారి గుర్తు ఏమి ఉంటుంది? స్థితిలో నిమిత్తభావం, వృత్తిలో సదా శుభ భావం, ఆత్మికభావం, నిస్వార్ధభావం. వాయుమండలంలో లేక సంబంధ, సంపర్కంలో సదా నిర్మాణభావం, వాణీ సదా నిర్మలంగా ఉంటుంది. ఈ విశేషతలు అనుభవీ మూర్తికి ప్రతి సమయం స్వతహాసంస్కారంగా ఉంటాయి. సంస్కారం స్వతహాగా పని చేస్తుంది, ఆలోచించవలసిన అవసరం లేదు. కనుక మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి - నా యొక్క స్వతహా సంస్కారం ఏమిటి? అని. ఒకవేళ ఏదైనా పాత సంస్కారం అంశమాత్రంగా అయినా ఉండిపోతే అది ప్రతి సమయం కార్యంలోకి వస్తూ, వస్తూ పక్కా సంస్కారంగా అయిపోతుంది. ఆ పాత సంస్కారాన్ని, పాత స్వభావాన్ని సమాప్తి చేసుకోవాలనుకుంటున్నారు కానీ చేసుకోలేకపోతున్నారు, కారణం ఏమిటి? అన్నింటిలో జ్ఞానస్వరూపంగా అయితే అయ్యారు కానీ ఏది జరగకూడదు అనుకుంటున్నారో అది జరుగుతుంది దానికి కారణం ఏమిటి? పరివర్తన చేసుకునే శక్తి తక్కువగా ఉంది. పరివర్తనాశక్తి గురించి అర్థం చేసుకుంటున్నారు, వర్ణన కూడా చేస్తున్నారు, పరివర్తనా శక్తి యొక్క టాపిక్ గురించి వ్రాయండి లేక ఉపన్యాసం చెప్పండి అంటే దీనిలో అందరు తెలివైనవారే చాలా మంచిగా వ్రాయగలరు మరియు చెప్పగలరు మరియు ఇతరులు ఎవరైనా వస్తే వారికి కూడా ఏమీ పర్వాలేదు, పరివర్తన అవ్వండి అని చాలా మంచిగా చెప్తున్నారు. కానీ వర్తమాన సమయం యొక్క గొప్పతనం అనుసరించి ఇప్పుడు స్వయాన్ని పరివర్తన చేసుకోవటంలో సమయం పట్టకూడదు. సెకనులో పరివర్తన చేసుకునే శక్తి ఉండాలి. ఇది జరగకూడదు అని అర్థం చేసుకుంటున్నారు కానీ పరివర్తన చేసుకోలేకపోతున్నారు అంటే దానికి కారణం - ఆలోచిస్తున్నారు కానీ స్వరూపంగా అవ్వటం లేదు. మొత్తం రోజంతటిలో ఆలోచనా స్వరూపంగా ఎక్కువగా అవుతున్నారు స్మృతిస్వరూపం నుండి సమర్థస్వరూపంగా చాలా మంది తక్కువగా అవుతున్నారు. ఇప్పుడు సమయం తీవ్రవేగంతో వెళ్తుంది, తీవ్రపురుషార్థం చేసే సమయం, సాధారణ పురుషార్థం చేసే సమయం కాదు. సెకనులో పరివర్తన అంటే అర్థం - స్మృతిస్వరూపం ద్వారా ఒక సెకనులో నిర్వికల్పంగా, వ్యర్థసంకల్పాల నుండి నివృత్తి అయిపోవాలి, ఎందుకు? మీరు సమయం యొక్క సమాప్తిని సమీపంగా తీసుకువచ్చే నిమిత్తులు. ఇప్పటి సమయం యొక్క మహత్వం ఆధారంగా అడుగులో కోట్ల సంపాదన ఉంది అని తెలుసుకున్నారు, పెంచుకోవటాన్ని ఎలా అయితే బుద్దిలో ఉంచుకుంటున్నారో అదేవిధంగా పోగొట్టుకోవటం కూడా బుద్దిలో ఉంచుకోండి. అడుగులో కోట్లు సంపాదించుకోగలం అయితే అడుగులో కోట్లు పోగొట్టుకుంటున్నాం కదా! అవునా, కాదా? ఒక్క నిమిషం అనే రోజులు కూడా గడిచిపోయినవి, ఇతరులకు ఒక నిమిషం శాంతిగా ఉండండి అని చెప్తారు కానీ మీకు ఒక సెకను యొక్క విషయం అవ్వాలి. అవునా, కాదా అని ఆలోచించడానికి ఎంత సమయం పడుతుంది? సెకను పడుతుంది. అలాగే పరివర్తనా శక్తి కూడా ఇంత వేగంగా ఉండాలి. ఇది మంచిది, ఇది మంచిది కాదు అని తెలుసుకున్నారు, మంచిది కాదు అన్నదానికి బిందువు పెట్టాలి మరియు మంచిది అనే దానిని ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ఇప్పుడు బిందువు యొక్క గొప్పతనాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురండి. మూడు బిందువులు గురించి తెలుసు కదా! ఎలా అయితే వైజ్ఞానికులు అన్ని విషయాలలో తీవ్రవేగంతో ఉన్నారు మరియు పరివర్తనా శక్తిని కూడా కార్యంలో ఉపయోగిస్తున్నారో అదేవిధంగా శాంతిశక్తి కలిగిన మీరు అన్ని విషయాలలో ఇప్పుడు లక్ష్యం పెట్టుకోండి - ఇప్పుడు జ్ఞానస్వరూపంతో పాటు శక్తిస్వరూపంగా అవ్వండి సెకనులో అవ్వాలి. చేస్తున్నాము, అయిపోతుంది .... చేస్తాము..... అని కాదు. ఇలా అవుతారా లేక కష్టమా? ఎందుకంటే అంతిమ సమయంలో సెకను యొక్క పరీక్ష ఉంటుంది కానీ నిమిషం యొక్క పరీక్ష కాదు. సెకను యొక్క అభ్యాసం చాలా సమయం నుండి ఉన్నప్పుడే అంతిమ సమయంలో సెకనులో పాస్ విత్ ఆనర్ అవుతారు. ఈశ్వరీయ విద్యార్థులు, పరమాత్మ చదువు చదువుకుంటున్నారు అంటే పాస్ విత్ ఆనర్ అవ్వాలి కదా! పాస్ మార్కులు తీసుకోవటం కూడా కాదు, పాస్ విత్ ఆనర్ అవ్వాలి. ఏమి లక్ష్యం పెట్టుకున్నారు? ఎవరైతే పాస్ విత్ ఆనర్‌గా అవుతాము అనే లక్ష్యం పెట్టుకున్నారో వారు చేతులెత్తండి! పాస్ విత్ ఆనర్ అవ్వాలి, ఆనర్ అనే మాట అండర్‌లైన్ చేసుకోవాలి. మంచిది, ఇప్పుడేమి చేయాలి? నిమిషం యొక్క విషయం సాధారణమే కానీ ఇప్పుడు సెకను యొక్క పని చేయాలి. 

పంజాబ్ వారు చెప్పండి, ఇప్పుడు సెకను యొక్క పని. దీనిలో ఎవరు మొదటి నెంబర్ అవుతారు? పంజాబ్. పెద్ద విషయమా అంటున్నారు. ఎంతో నిశ్చయంతో చెప్తున్నారు, చాలా మంచిగా చెప్తున్నారు, ఇది విని బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు, బాప్ దాదా తోడు ఉండగా పెద్ద విషయమేమిటి అంటున్నారు. తోడు అయితే సర్వశక్తివంతుడు ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమి చేయాలి? తీవ్రం అవ్వవలసి ఉంది. సేవ అయితే చేస్తున్నారు, సేవ చేయకుండా ఇంకేమి చేస్తారు? ఖాళీగా కూర్చుంటారా? సేవ అనేది బ్రాహ్మణాత్మల ధర్మం మరియు కర్మ. కానీ ఇప్పుడు సేవతో పాటూ సమర్థ స్వరూపులు అవ్వండి. సేవ అంటే చాలా ఉత్సాహ ఉల్లాసాలు కనబరుస్తున్నారు దానికి బాప్ దాదా సంతోషిస్తున్నారు మరియు శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. కానీ సేవా కిరీటం ఎలా అయితే లభించిందో కిరీటధారులుగా ఉన్నారు చూడండి, ఎంత మంచిగా అనిపిస్తుందో! ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అయ్యే కిరీటాన్ని ధరించి చూపించండి. యువకుల గ్రూప్ కదా! మరి అయితే ఏమి అద్భుతం చేస్తారు? సేవలో కూడా మొదటి నెంబర్ మరియు సమర్ధ స్వరూపంలో కూడా మొదటి నెంబర్. బాబా సందేశం ఇవ్వటం కూడా బ్రాహ్మణ జీవితం యొక్క ధర్మం మరియు కర్మ కానీ ఇప్పుడు బాప్ దాదా సైగ చేస్తున్నారు - పరివర్తనా యంత్రాన్ని వేగం చేయండి. లేకపోతే పాస్ విత్ ఆనర్ అవ్వటం కష్టమైపోతుంది. చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి. ఆలోచించారు మరియు చేశారు. కేవలం ఆలోచనాస్వరూపులుగా అవ్వకండి, సమర్థ స్మృతి ద్వారా స్మృతి స్వరూపులు అవ్వండి. వ్యర్థాన్ని తీవ్ర వేగంతో సమాప్తి చేయండి. వ్యర్థ సంకల్పం, వ్యర్థ మాట, వ్యర్థ కర్మ, వ్యర్థ సమయం మరియు సంబంధ సంపర్కాలలో కూడా వ్యర్థ విధి, రీతి అన్నింటినీ సమాప్తి చేయండి. ఎప్పుడైతే బ్రాహ్మణాత్మలు తీవ్రవేగంతో స్వయంలో వ్యర్థాన్ని సమాప్తి చేస్తారో అప్పుడే ఆత్మల యొక్క ఆశీర్వాదాలు మరియు స్వయం యొక్క పుణ్య ఖాతా తీవ్రగతిలో జమ అవుతుంది. 

బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - బాప్ దాదా మూడు ఖాతాలను పరిశీలిస్తున్నారు. 1. పురుషార్థం యొక్క వేగం యొక్క ఖాతా 2. ఆశీర్వాదాల ఖాతా 3. పుణ్య ఖాతా. ఎక్కువ మంది యొక్క ఖాతా ఇప్పుడు తక్కువగా ఉంది. అందువలన బాప్ దాదా ఈరోజు ఒక స్లోగన్ స్మృతి ఇప్పిస్తున్నారు - ఇప్పుడు తీవ్రంగా అవ్వండి, తీవ్ర పురుషార్థిగా అవ్వండి. తీవ్ర వేగంతో సమాప్తి చేసుకునే వారిగా అవ్వండి. తీవ్ర వేగంతో మనస్సు ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసేవారిగా అవ్వండి. బాప్ దాదా ఒక విషయంలో పిల్లలందరి పట్ల సంతోషంగా ఉన్నారు. ఏ విషయం గురించి? ప్రేమ అయితే అందరికీ బాబాపై ప్రాణపదంగా ఉంది. దానికి శుభాకాంక్షలు. కానీ ఏమి చేయాలో చెప్పనా? ఈ సీజన్ సమాప్తి వరకు, ఇప్పుడు ఇంకా సమయం ఉంది కనుక ఈ సీజన్ చివరికి తీవ్ర వేగం యొక్క ఏదొక అద్భుతం చేసి చూపించండి. ఇష్టమేనా? సరేనా? లక్ష్యం మరియు లక్షణాలు రెండింటినీ స్మృతిలో ఉంచుకుంటాం అనేవారు చేతులెత్తుండి. 

డబల్ విదేశీయులు, టీచర్స్, యువకులు, మొదటి వరుసలోని వారు అందరూ పెట్టుకుంటారా, మంచిది. ముందుగానే పదమా, పదమా, పదమ్ శుభాకాంక్షలు మంచిది. . 

ఇప్పుడిప్పుడే అభ్యాసం చేయండి - ఒక్క సెకనులో నిర్వికల్పంగా, నిర్వర్థ సంకల్పంగా ఏకాగ్రంగా, ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే ఒకే సంకల్పంలో ఏకాగ్రమై కూర్చోగలరా! ఒకే సంకల్పం యొక్క ఏకాగ్రత శక్తి యొక్క అనుభవంలో కూర్చోండి. ఒక్క సెకనులో స్థితులైపోవాలి, సమయం పట్టకూడదు. సదా స్మృతి స్వరూపులకి, సమర్ధ స్వరూపులకి, అనుభవీ స్వరూప శ్రేష్ట పిల్లలకు, సదా శుభ ఆలోచనను వెనువెంటనే కర్మలోకి తీసుకువస్తే ఎలా అయితే గొప్పతనమో అలాగే వెనువెంటనే పరివర్తన అయిపోవటం కూడా గొప్పతనం. ఆవిధంగా వెనువెంటనే పరివర్తన చేసే విశ్వ పరివర్తక పిల్లలకు, సదా పరమాత్మ పాలన, ప్రేమ, చదువు మరియు శ్రీమతాన్ని ప్రతీ కర్మలోకి తీసుకువచ్చే మహావీర్ పిల్లలకు, సదా ధైర్యం, ఏకాగ్రత, ఏకత ద్వారా నెంబర్ వన్ తీవ్ర పురుషార్ధం చేసే పిల్లలకు బాప్ దాదా యొక్క హృదయ పూర్వక ప్రియస్మృతులు, మనస్సు యొక్క ఆశీర్వాదాలు మరియు నమస్తే. 

Comments