15-12-2005 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
క్రొత్త సంవత్సరంలో స్నేహం మరియు సహయోగం యొక్క రూపురేఖను వేదిక పైకి తీసుకురండి, ప్రతి ఒక్కరికీ గుణాలు మరియు శక్తుల యొక్క బహుమతి ఇవ్వండి.
ఈరోజు పరమాత్మ తండ్రి నలువైపుల ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారులైన పిల్లలను చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ విశ్వంలో కోట్లలో కొద్దిమందికే లభిస్తుంది. పరమాత్మ ప్రేమ నిస్వార్ధమైన ప్రేమ ఎందుకంటే పరమాత్మ తండ్రి ఒక్కరే నిరాకారుడు, నిరంహంకారి, మనుష్యాత్మలు శరీరధారి అయిన కారణంగా ఏదొక స్వార్ధంలోకి వస్తూనే ఉంటారు. పరమాత్మ తండ్రి ఒక్కరే తన పిల్లలకు ఈ విధమైన నిస్వార్ధ ప్రేమ ఇస్తారు. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి విశేష ఆధారం, బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాణదానం. ఒకవేళ బ్రాహ్మణజీవితంలో పరమాత్మ ప్రేమ తక్కువగా అనుభవం అయితే జీవితం రమణీయంగా అనిపించదు, నిస్సారంగా ఉంటుంది. పరమాత్మ ప్రేమయే బ్రాహ్మణజీవితంలో సదా సహయోగం కూడా ఇస్తూ ఉంటుంది మరియు తోడుగా అయ్యి సదా సహయోగిగా ఉంటుంది. ఎక్కడ ప్రేమ, తోడు ఉంటుందో అక్కడ అన్నీ సహజం మరియు సరళం అవుతాయి. శ్రమ అనుభవం అవ్వదు. ఈ విధమైన అనుభవం ఉంది కదా! పరమాత్మ ప్రేమలో ఉన్నవారు ఏ వ్యక్తి లేక సాధనాల యొక్క ఆకర్షణలోకి రారు. ఎందుకంటే పరమాత్మ ప్రేమ అనేది ఎలా అనుభవం చేయిస్తుందంటే సదా ప్రేమ కారణంగా లవలీనం అయిపోతారు. దీనినే ప్రజలు పరమాత్మలో లీనం అయిపోవటం అనుకుంటారు. పరమాత్మలో లీనం అవ్వరు కానీ పరమాత్మ ప్రేమలో లీనం అవుతారు.
బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలను చూస్తున్నారు - పరమాత్మకి ప్రియంగా అందరు అయ్యారు కానీ 1.లవ్లీ (ప్రియమైన) పిల్లలు 2. లవలీన పిల్లలు. కనుక మిమ్మల్ని మీరు అడగండి - ప్రియమైన వారిగా అందరు అయ్యారు కానీ ఎంత వరకు లవలీనంగా ఉండగలుగుతున్నారు? లవలీన పిల్లల యొక్క గుర్తు - వారు సదా సహజంగా పరమాత్మ ఆజ్ఞపై నడస్తారు. ఆజ్ఞానుసారం నడుచుకుంటారు మరియు దేహాభిమానాన్ని బలిహారం కూడా చేస్తారు. ఎందుకంటే ప్రేమలో బలి అవ్వటం కష్టం అనిపించదు. అన్నింటికంటే మొదటి ఆజ్ఞ - యోగి భవ! పవిత్ర భవ! బాబాకి పిల్లలపై ప్రేమ ఉన్న కారణంగా పిల్లల యొక్క శ్రమ చూడలేకపోతున్నారు. ఎందుకంటే 63 జన్మల నుండి శ్రమ చేసారు అని బాబాకి తెలుసు. ఇప్పుడు ఈ అలౌకికజన్మలోనే శ్రమ నుండి ముక్తి అయ్యి అతీంద్రియ సుఖం యొక్క ఆనందం పొందేది. ఆనందంలో ఉంటున్నారా లేక శ్రమ చేయవలసి వస్తుందా? ప్రేమలో ఆజ్ఞపై నడవటంలో శ్రమ అనిపించదు, ఒకవేళ శ్రమ చేయవలసి వస్తుంది. అంటే ప్రేమలో శాతం తక్కువగా ఉన్నట్లే. ఎక్కడో అక్కడ ప్రేమలో లీకేజ్ ఉన్నట్లే. రెండు విషయాల యొక్క లీకేజ్ శ్రమ పడేలా చేస్తుంది. 1. పాత ప్రపంచం యొక్క ఆకర్షణ దీనిలో ప్రాపంచిక సంబంధాలు, పదార్థాలు అన్నీ వచ్చేస్తాయి. 2. పాత సంస్కారాల యొక్క ఆకర్షణ. పాతప్రపంచం మరియు పాత సంస్కారాలు తమ వైపు ఆకర్షితం చేసుకుంటాయి. పరమాత్మ ప్రేమలో శాతం వచ్చేస్తుంది. ఈ రెండు లీకేజ్ నుండి ముక్తి అయ్యానా? అని పరిశీలన చేసుకోండి. ఆత్మ యొక్క అనాది, ఆది సంస్కారాలు ఏమిటి మరియు అంతము బ్రాహ్మణజీవితం యొక్క సంస్కారం ఏమిటి? అని పరిశీలన చేసుకోండి. అనాది, ఆది మరియు అంతిమంలో కూడా మీ సంస్కారం శ్రేష్టమైనది. ఈ పాత సంస్కారాలు మధ్య సంస్కారాలు, అనాది, ఆది మరియు అంతిమ సంస్కారాలు కావు. కానీ అందరి లక్ష్యం ఏమిటి? ఏ పిల్లవాడిని అడిగినా బాబా సమానంగా అవ్వటమే అని సమాధానం చెప్తారు. ఇదే కదా! అయితే చేతులు ఎత్తండి! ఈ లక్ష్యం పక్కాగా ఉందా? లేక మధ్యమధ్యలో మారిపోతుందా?
బాబా పిల్లలను అడుగుతున్నారు - బాబా మరియు దాదా ఇద్దరి యొక్క సమాన సంస్కారాలు ఏమిటి? బాబా సదా ప్రతి ఆత్మ పట్ల ఉదారచిత్ గా ఉన్నారు. ప్రతి ఆత్మ పట్ల స్నేహం మరియు సన్మానరూపంలో సహయోగిగా ఉన్నారు. ఇలా స్వయం కూడా ప్రతి ఆత్మ పట్ల సహయోగి అవుతున్నారా? సహయోగం ఇస్తే సహయోగం ఇస్తాము అని అనకూడదు, స్నేహం ఇస్తే స్నేహం ఇస్తాము అని కాదు. ఎలా అయితే బ్రహ్మాబాబా ప్రతి ఆత్మకు సహయోగిగా, స్నేహిగా అయ్యారో అదేవిధంగా మీరు కూడా సర్వులకు సదా స్నేహిగా, సహయోగిగా అవ్వాలి. దీనినే సమానంగా అవ్వటం అంటారు. ఒకవేళ సంస్కారాలు పరివర్తన చేసుకోవటంలో ఏ పిల్లలైనా శ్రమ పడుతుంటే దానికి కారణం ఏమిటి? బ్రహ్మాబాబా తనపై తాను ధ్యాస పెట్టుకునేవారు కానీ శ్రమ చేయలేదు, సంస్కారాల పరివర్తనలో శ్రమకి కారణం - ప్రియంగా అయ్యారు కానీ లవలీనం అవ్వలేదు. బాప్ దాదా అయితే ప్రతి ఒక పిల్లవాడిని ప్రియమైన వారిగా భావిస్తారు. ప్రతి ఒక్కరి చరిత్ర బాబాకి తెలుసు అయినప్పటికీ ఏమంటారు? ప్రియమైనవారు అంటారు. బాప్ దాదా ప్రతి ఒక పిల్లవానికి ఒకే చదువు, ఒకే పాలన, ఒకే వరదానం సదా ఇస్తూ ఉంటారు. చివరి నెంబర్ అని బాబాకి తెలిసినా కానీ ఏ పిల్లవాని యొక్క అవగుణం, బలహీనత సంకల్పంలో కూడా పెట్టుకోరు. ప్రియమైనవారు, గారాభమైనవారు, మధురాతి మధురమైనవారు ... అనే దృష్టి, వృత్తితో చూస్తారు, ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు ఈ వృత్తి,ర దృష్టితో బలహీనులు కూడా మహావీరులు అవుతారు. అలాగే మీ యొక్క శ్రేష్టవృత్తి మరియు శుభభావన, శుభకామన ద్వారా ఎవరినైనా పరివర్తన చేయగలరు! ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాము అని ప్రతిజ్ఞ చేసారు కదా! మరి ఆత్మలను పరివర్తన చేయలేరా?
ఇప్పుడు క్రొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కదా - కనుక క్రొత్త సంవత్సరంలో బ్రాహ్మణ పరివారం అందరిలో ఒకరి పట్ల ఒకరు శుభభావన, శుభకామన ద్వారా ప్రతి ఒక్కరు ఒకరికొకరు పరివర్తన చేయటంలో సహయోగిగా అవ్వండి. వీరి సంస్కారంలో ఈ బలహీనత ఉంది అని తెలిసినా కానీ మీ స్నేహం మరియు సహయోగం యొక్క శక్తి ద్వారా సహయోగి అవ్వండి. ఒకరికొకరు సహయోగం యొక్క చేతులు కలపండి. ఈ సహయోగం యొక్క చేతులు కలవటం ద్వారా ఎలా అయితే చేయి, చేయి కలపటం ద్వారా స్నేహ మిలనం జరుగుతుందో అదేవిధంగా సహయోగం యొక్క కలయిక ద్వారా మాల తయారవుతుంది. శిక్షణ ఇవ్వకండి, స్నేహంతో నిండిన సహయోగం ఇవ్వండి. అతీతంగా అవ్వకండి, తొలగించకండి, సహయోగిగా అవ్వండి. ఎందుకంటే విజయీమాల మీ యొక్క స్మృతిచిహ్నం. ప్రతి ఒక మణి, మణితో సహయోగి కనుకే చిత్రం కూడా తయారయ్యింది.
క్రొత్త సంవత్సరంలో ఏమి చేయాలి అని అందరు బాప్ దాదాని అడుగుతున్నారు. సందేశం ఇచ్చే కార్యాలు చాలా చేసారు, చేస్తున్నారు, చేస్తూ ఉంటారు. అప్పుడు సందేశ వాహకుల యొక్క సహయోగం మరియు స్నేహం యొక్క రూపురేఖను స్టేజ్ పైకి తీసుకురండి. మహాదానిగా అవ్వండి. మీ గుణాలతో సహయోగిగా అవ్వండి, ఇతరులను తయారుచేయండి. మీ గుణాలు అంటే వాస్తవానికి అవి పరమాత్మ గుణాలే కానీ వాటిని మీ సొంతం చేసుకున్నారు కనుక మీ ఆ గుణాల యొక్క శక్తి ద్వారా వారి యొక్క బలహీనతను దూరం చేయండి. చేస్తారా? చేస్తారా లేక కష్టమా? టీచర్స్ చెప్పండి చేస్తారా? చేస్తారా లేక చేయవలసిందేనా? చేయవలసిందేనా? ఎవరూ బలహీనంగా ఉండకూడదు, ఎందుకంటే కోట్లలో కొద్దిమంది కదా! మాలలో చివరి పూస అయినా కానీ కోట్లలో కొద్దిమంది. మీ యొక్క బిరుదే - మాస్టర్ సర్వశక్తివాన్. కనుక సర్వశక్తివంతుల యొక్క కర్తవ్యం ఏమిటి? శక్తి ఇవ్వటం మరియు తీసుకోవటం. బాబా ద్వారా లభించిన గుణాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకోండి. సహయోగం యొక్క బహుమతి ఒకరికొకరు ఇచ్చుకోండి. క్రొత్త సంవత్సరంలో ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటారు కదా! ఈ సంవత్సరంలో ఒకరికొకరు గుణాల యొక్క బహుమతి ఇవ్వండి. ఉపన్యాసం ద్వారా సందేశం ఇస్తున్నారు కదా! అదేవిధంగా మీ కళ్యాణ భావన ద్వారా, కళ్యాణ వృత్తి ద్వారా, కళ్యాణకారి వాయుమండలం ద్వారా గుణాలు, శక్తుల బహుమతి ఇవ్వండి. ఈ సమయంలో ఇచ్చే బహుమతి ఏమిటంటే బలహీనులకు శక్తినివ్వాలి. పడిపోయిన వారిని ఇంకా పడేయకండి, పైకి లేవనెత్తండి. వీరు ఇలా, వీరు అలా ...... అనద్దు. వీరు ప్రభు ప్రేమకు పాత్రులు, కోట్లలో ఒక ఆత్మ, విశేషాత్మ, విజయీగా అయ్యే ఆత్మ ... ఈ దృష్టి పెట్టుకోండి. ఇప్పుడు వృత్తి, దృష్టి, వాయుమండలాన్ని పరివర్తన చేయండి. ఏదోక కొత్తదనం చేయాలి కదా! బలహీనత చూస్తూ కూడా చూడకండి, ఉత్సాహం ఇవ్వండి, సహయోగం ఇవ్వండి. ఈ విధమైన బ్రాహ్మణ పరివారం యొక్క సంఘటన తయారుచేస్తే బాబా విజయం యొక్క చప్పట్లు మ్రోగిస్తారు. మీరు కూడా మాటిమాటికి చప్పట్లు మ్రోగిస్తారు కదా! అలాగే బాప్ దాదా స్వాగతం, శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ అంటూ చప్పట్లు మ్రోగిస్తారు. మీరందరు కూడా వెనువెంట చప్పట్లు మ్రోగిస్తారు కదా! మీరు చప్పట్లు మ్రోగించటం మంచిదే కానీ విశ్వమంతా మ్రోగించాలి. అందరి నోటి నుండి మా ఇష్టదేవతలు వచ్చారు, మా పూజ్యులు వచ్చారు అనే మాట రావాలి. లక్ష్యం పక్కాగా ఉంది కదా! చేయవలసిందే అనే లక్ష్యం పక్కాగా ఉంది కదా? లేక చూస్తాము, ప్లాన్ తయారుచేస్తాము అంటారా! ప్లాన్ తయారుచేసుకోవటం కాదు, చేయాల్సిందే. ఇప్పుడు అందరు ఎదురుచూస్తున్నారు వారి నిరీక్షణ పూర్తి చేయండి. ప్రత్యక్షమయ్యే తయారీ చేయండి. చూడండి, ఇప్పుడు ప్రకృతి కూడా ఎంత విసిగిపోతుందో! కనుక ప్రకృతిని కూడా శాంతి చేయండి. మీరు ప్రత్యక్షం అయిపోతే స్వతహాగానే విశ్వశాంతి కూడా వచ్చేస్తుంది. మంచిది.
ఈ సారి కూడా క్రొత్త క్రొత్త పిల్లలు చాలా మంది వచ్చారు. మంచిది, బాప్ దాదాకి కూడా ఆనందంగా ఉంది. కోనకోనలో దాగి ఉన్న కల్పపూర్వపు పిల్లలందరు చేరుకుంటున్నారు అని. వెనుక వచ్చినవారు కూడా ఈ లక్ష్యం పెట్టుకోండి. సమయం తక్కువగా ఉంది కనుక తీవ్రపురుషార్థం ద్వారా మొదటి నెంబర్ తీసుకోగలరు. ఇప్పుడు ఆలశ్యం అయ్యింది కానీ చాలా ఆలశ్యం అనే బోర్డ్ పెట్టలేదు, కనుక ఎంత పురుషార్టం చేయాలనుకుంటే అంత చేయవచ్చు. మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి! ఎవరైతే చేతులెత్తారో వారు తీవ్రపురుషార్ధం చేయాలి కదా! ఎంత పురుషార్థం చేయాలంటే అంత చేయవచ్చు. బాబా మేము వెనుక వచ్చాము అని బాబాని నిందించకండి. ఇప్పుడు కూడా డబల్ లైట్ అయ్యి ఎగరగలరు! ఇంత ఉత్సాహం ఉందా, చేతులెత్తిన వారికి ఇంత ఉత్సాహం ఉందా? ముందుకు వెళ్ళి చూపించాల్సిందే అనే ఉత్సాహం ఉన్నవారు చేతులెత్తండి! వారికి బాప్ దాదా ముందుగానే శుభాకాంక్షలు ఇస్తున్నారు. మంచిది.
ఈరోజులలో విశ్వంలో రెండు విషయాలు నడుస్తున్నాయి - 1. వ్యాయామం 2.ఆహారంపై ధ్యాస. మీరు కూడా ఈ రెండు విషయాలు చేస్తున్నారు కదా? మీ వ్యాయామం ఏమిటి? శారీరక వ్యాయామం అయితే అందరు చేస్తున్నారు కానీ మనస్సు యొక్క వ్యాయామం అంటే ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి ఫరిస్తా, మరియు ఫరిస్తా నుండి దేవత. ఇలా మనస్సు యొక్క వ్యాయామం సదా చేస్తూ ఉండండి మరియు శుద్ధ భోజనం అంటే మనస్సు యొక్క శుద్ధసంకల్పాలు. ఒకవేళ వ్యర్థసంకల్పాలు, వ్యతిరేక సంకల్పాలు నడుస్తున్నాయి అంటే అది అశుద్ధ భోజనం . మనస్సులో సదా శుద్ధసంకల్పాలు నడవాలి. ఈ రెండు చేయటం వస్తుంది కదా! ఎంత సమయం కావాలంటే అంత సమయం శుద్ధసంకల్ప స్వరూపంగా అయిపోండి. మంచిది.
నలువైపుల ఉన్నటువంటి పరమాత్మ ప్రేమ యొక్క అధికారి విశేషాత్మలకు, సదా ఒకరికొకరు సహయోగిగా అయ్యే బాబాకి స్నేహి, సహయోగి పిల్లలకు, సదా విజయీ మరియు విజయం యొక్క జెండాను విశ్వంలో ఎగురవేసేవారికి, ఈ లక్ష్యాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే విజయీ పిల్లలకు, సదా ఈ పాత్ర ప్రపంచం మరియు సంస్కారాల యొక్క ఆకర్షణకు అతీతంగా ఉండే బాబా సమానమైన పిల్లలకు మనోభిరాముడైన బాబా యొక్క మనస్పూర్వక ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment