15-12-2004 అవ్యక్త మురళి

    15-12-2004         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"బాప్ దాదాల విశేష ఆశ- పిల్లలు ప్రతి ఒక్కరూ దీవెనలు ఇవ్వాలి మరియు దీవెనలు తీసుకోవాలి"

ఈరోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న నిశ్చింత మహారాజుల సభను చూస్తున్నారు. ఈ రాజ్యసభ మొత్తం కల్పమంతటిలోనూ ఈ సమయంలోనే ఉంటుంది. మీరు ఆత్మిక నషాలో ఉంటారు. కావుననే నిశ్చింత మహారాజులు. ఉదయం లేచినప్పటి నుండీ నిశ్చింతగా ఉంటారు. నడుస్తూ, తిరుగుతూ, కర్మ చేస్తూ కూడా నిశ్చింతగా ఉంటారు. అలాగే నిదురించేటప్పుడు కూడా నిశ్చింతమయమైన నిదురలో నిదురిస్తారు. ఇలా అనుభవం చేసుకుంటున్నారు కదా! నిశ్చింతగా ఉన్నారా? అలా అయ్యారా లేక అవుతున్నారా? అయిపోయారు కదా! నిశ్చింతగానూ ఉన్నారు మరియు మహారాజులుగానూ ఉన్నారు. మీరు స్వరాజ్యాధికారులు. ఈ కర్మేంద్రియాలపై రాజ్యము చేసే నిశ్చింత మహారాజులు, అనగా స్వరాజ్యాధికారులు. కావున పిల్లలైన మీ యొక్క సభ ఇటువంటిది. చింత ఏదైనా ఉందా? ఎందుకంటే, మీ చింతలన్నింటినీ బాబాకు ఇచ్చేసారు, కావున భారము తగ్గిపోయింది కదా! చింత సమాప్తమైపోయింది, దానితో నిశ్చింత మహారాజులుగా అయి అమూల్య జీవితమును అనుభవం చేసుకుంటున్నారు. అందరి శిరస్సుపైనా పవిత్రతరూపీ ప్రకాశ కిరీటము స్వతహాగానే ప్రకాశిస్తూ ఉంటుంది. నిశ్చింత మహారాజులపై ప్రకాశ కిరీటము ఉంది. ఏదైనా చింత ఉన్నట్లయితే, ఏదైనా భారమును స్వయం పైకి ఎత్తుకున్నట్లయితే అప్పుడు మీ శిరస్సుపైకి ఏమి వస్తుందో తెలుసా? భారంతో ఉన్నతట్టలు వచ్చేస్తాయి. కావున మీరే ఆలోచించండి. కిరీటమును, అలాగే తట్టను రెండింటినీ మీ ముందుకు తీసుకురండి. మీకు ఏమి నచ్చుతుంది? ఆ తట్ట నచ్చుతుందా లేక ప్రకాశ కిరీటము నచ్చుతుందా? టీచర్లు చెప్పండి. మీకు ఏమి నచ్చుతుంది? కిరీటమే మంచిగా అనిపిస్తుంది కదా! మీరు కర్మేంద్రియాలన్నింటి పైనా రాజ్యం చేసే మహారాజులు. పవిత్రత ప్రకాశ కిరీటధారులుగా తయారుచేస్తుంది. కావుననే మీ స్మృతి చిహ్నాలైన జడచిత్రాలలో డబుల్ కిరీటమును చూపించారు. ద్వాపరయుగము నుండి మహారాజులుగా ఎంతో మంది తయారయ్యారు. రాజులుగానూ ఎంతో మంది అయ్యారు. కానీ డబుల్ కిరీటధారులుగా ఎవ్వరూ అవ్వలేదు. అలాగే నిశ్చింత మహారాజులుగానూ, స్వరాజ్యాధికారులుగానూ ఎవ్వరూ అవ్వలేదు. ఎందుకంటే పవిత్రతా శక్తి మాయాజీతులుగా, కర్మేంద్రియజీతులుగా, విజయులుగా చేసేస్తుంది. నిశ్చింత మహారాజులకు గుర్తు- వారు స్వయమూ సంతుష్టముగా ఉంటారు. అలాగే ఇతరులను కూడా సంతుష్టముగా ఉంచుతారు. అసంతుష్టముగా అయ్యేందుకు అసలు వారి వద్ద అప్రాప్తి అనేది ఏదీ ఉండదు. ఎక్కడైతే అప్రాప్తి ఉంటుందో అక్కడే అసంతుష్టత ఉంటుంది, ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. మరి మీరు ఈ విధంగా అయ్యారా? సదా సర్వప్రాప్తి స్వరూపులుగా, సంతుష్టులుగా ఉన్నారా? పరిశీలించుకోండి. అప్రాప్తి అన్న వస్తువేమీలేదు అన్న గాయనముకూడా ఉంది. కానీ అది దేవతల ఖజానాలో కాదు, బ్రాహ్మణుల ఖజానాలో సంతుష్టత జీవితము యొక్క శ్రేష్ట సింగారము, శ్రేష్ఠమైన విలువ. కావున మీరు సంతుష్ట ఆత్మలే కదా! బాప్ దాదా ఇటువంటి నిశ్చింత మహారాజులైన పిల్లలను చూసి, ఓహో! నా నిశ్చింత మహారాజులైన పిల్లలూ, ఓహో! అని సంతోషిస్తారు. మీరు అలా ఉన్నారు కదా! ఎవరైతే నిశ్చింతులుగా ఉన్నారో వారు చేతులెత్తండి. నిశ్చింతగా ఉన్నారా? మీకు ఎటువంటి చింత కలుగదా? అప్పుడప్పుడూ కలుగుతుందా? కలుగదా? బాగుంది. నిశ్చింతగా అయ్యేందుకు విధి చాలా సహజము. అది కష్టమేమీకాదు. కేవలం ఒక్క పదము యొక్క మాత్రలో తేడా ఉంది. అది అంత సహజము! నాది అన్నదానిని నీదిగా పరివర్తన చేయండి. అదే ఆ పదము. నాది కాదు, నీది. హిందీ భాషలో నాది అని వ్రాసినా లేక నీది అని వ్రాసినా అందులో తేడా ఏమిటి? ఒక్క అక్షరమే కదా! కానీ, అందులో తేడా ఎంత ఉంటుందో చూడండి! కావున మీరందరూ నాది, నాది అని అనేవారా లేక మీది, మీది అని అనేవారా? మీరెవరు? నాది అన్న దానిని నీదిగా పరివర్తన చేసేసారా? చేయకపోతే చేసేయ్యండి. నాది, నాది అనగా దాసులుగా అయ్యేవారు. ఉదాసీనులుగా అయ్యేవారు. మాయకు దాసులుగా అయిపోతే ఉదాసులుగా అయిపోతారు కదా! కావున మీరు మాయాజీతులు మాయకు దాసులు కారు. ఉదాసినత వస్తుందంటే, దానిని అప్పుడప్పుడూ రుచి చూస్తున్నారు! ఎందుకంటే 63 జన్మలు ఉదాసీనులుగా ఉండే అభ్యా సముంది కదా! కావున అప్పుడప్పుడు అది ఎమర్ట్ అయిపోతుంది. కావున బాపదాదా ఏమన్నారు? పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చింత మహారాజులు. ఇప్పుడు కూడా ఏమూలలోనైనా, ఏ చింతనైనా ఉంచినట్లయితే దానిని ఇచ్చేయండి. మీ వద్ద ఆ భారమును ఎందుకు ఉంచుకుంటున్నారు? భారాన్ని ఉంచుకోవడం అలవాటైపోయిందా? భారాన్ని నాకు ఇచ్చేయండి. మీరు తెలికగా అయిపోండి అని బాబా అన్నాక మరి డబులైట్‌గా ఉండడం మంచిదా లేక భారంతో ఉండడం మంచిదా? కావున మంచిగా పరిశీలించుకోండి. అమృతవేళ లేచినప్పుడు విశేషముగా వర్తమాన సమయంలో సబ్ కాన్షియస్ లో కూడా ఎటువంటి భారమూ లేదు కదా! అని పరిశీలించుకోవాలి. సబ్ కాన్షియస్ లోనే కాదు, స్వప్నమాత్రముగా కూడా భారము అనుభవమవ్వకూడదు. మీరైతే డబుల్ లైట్ గా ఉండడమే ఇష్టం కదా! కావున విశేషముగా ఈ హోంవర్క్ ను ఇస్తున్నారు. దీనిని అమృతవేళ పరిశీలించుకోండి. పరిశీలించుకోవడమైతే వస్తుంది కదా! కానీ, కేవలం పరిశీలించుకోవడమే కాదు, దానితోపాటు పరివర్తన కూడా చేయాలి. నాది అన్న దానిని నీదిగా పరివర్తన చేయాలి. నాది అన్నది వారిదిగా అయిపోవాలి. కావున పరిశీలించుకోండి మరియు పరివర్తన చేసుకోండి. ఎందుకంటే బాప్ దాదా సమయమును మరియు స్వయమును రెండింటినీ చూసుకోండి అని పదే పదే తెలియజేస్తున్నారు. సమయం యొక్క వేగమునూ చూడండి. అలాగే స్వయం యొక్క వేగమును కూడా చూడండి. మాకైతే తెలియలేదు. సమయం ఎంతో వేగంగా వెళ్ళిపోయింది అని మళ్ళీ తర్వాత అనకండి. ఇప్పుడు పురుషార్థము కొద్దిగా డీలాగా ఉన్నా అంతిమంలో చురుకుగా ముందుకు వెళ్ళిపోతాములే అని చాలామంది పిల్లలు భావిస్తూ ఉంటారు కానీ బహుకాలపు అభ్యాసము అంతిమంలో సహయోగిగా అవుతుంది. కావున మహారాజులుగా అయితే అయి చూడండి. అలాగైతే అయ్యారు కానీ కొందరు అయ్యారు. కొందరు అవ్వలేదు, నడుస్తున్నాము కదా! చేస్తున్నాము కదా! సంపన్నముగా అయిపోతాములే.. అని భావిస్తారు. ఇప్పుడు నడువడమో చేయడమో కాదు, ఇక ఎగరాలి. ఇప్పుడు ఎగిరే వేగం కావాలి. రెక్కలైతె లభించాయి కదా! ఉల్లాన, ఉత్సాహాలు మరియు ధైర్యము యొక్క రెక్కలు అందరికీ లభించాయి మరియు బాబా యొక్క వరదానము కూడా ఉంది. ఆ వరదానము గుర్తుందా? మీరు ఒక్క అడుగు ధైర్యముతో వేస్తే బాబా యొక్క సహాయం వేలాది అడుగులుగా లభిస్తుంది. ఎందుకంటే, బాబాకు పిల్లలపై హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. కావున ఏ పిల్లలపై అయితే ప్రేమ ఉందో. ఆ పిల్లల కష్టమును బాబా చూడలేరు. ప్రేమలో ఉన్నట్లయితే తమ అనేది సమాప్తమైపోతుంది. మీకు కష్టం నచ్చుతోందా? అలసిపోయారు కదా! 63 జన్మలు భ్రమిస్తూ, భ్రమిస్తూ,కష్టపడుతూ అలసిపోయారు మరియు బాబా తమ ప్రేమతో భ్రమించేందుకు బదులుగా మూడు సింహాసనాలకు అధిపతులుగా చేసినారు. ఆ మూడు సింహాసనాలు ఏమిటో మీకు తెలుసు కదా! తెలియడమేమిటి, మీరు ఆ సింహాసనాలపై నివసిస్తున్నారు. మీరు అకాల సింహాసన నివాసులు, బాప్ దాదాల హృదయ సింహాసనాధికారులుగానూ ఉన్నారు. అలాగే భవిష్య విశ్వరాజ్య సింహాసనాధికారులుగానూ ఉన్నారు. కావున బాప్ దాదా పిల్లలందరిని సింహాసనాధికారులుగా చూస్తున్నారు. ఇటువంటి పరమాత్మ హృదయ సింహాసనమును మొత్తం కల్పమంతటిలోనూ అనుభవం చేసుకోలేరు. పాండవులు ఏమి భావిస్తున్నారు? మీరు మహారాజులుగా ఉన్నారా? చేతులెత్తుతున్నారు. మీరు సింహాసనమును వదలకండి. దేహాభిమానములోకి రావడం అనగా మట్టిలోకి రావడం. ఈ దేహము మట్టి. సింహాసనాధికారులుగా అయితే మహారాజులుగా కూడా అవుతారు.

బాప్దాదా పిల్లలందరి పురుషార్థము యొక్క చార్టును పరిశీలిస్తున్నారు. నాలుగు సబ్జెక్టులలోనూ ఎవరెవరు ఎక్కడెక్కడి వరకు చేరుకున్నారో పరిశీలిస్తున్నారు. కావున ఏ ఖజానాలనైతే ఇచ్చాను ఖనాలన్నింటిని ఎంతవరకూ జమచేసుకున్నారు అని బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి చార్టును పరిశీలించారు. కావున జమ ఖాతాను పరిశీలించారు. ఎందుకంటే బాబా ఖజానాలను అందరికీ ఒకే విధముగా, సమానముగా ఇచ్చారు. కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇవ్వలేదు. ఖాజానాలు జమ అయినదానికి గుర్తు ఏమిటి? ఖజానాల గురించి అయితే తెలుసు కదా! అన్నింటికన్నా పెద్ద ఖజానా శ్రేష్ట సంకల్పాల ఖజానా. సంకల్పము కూడా ఖజానాయే. అలాగే వర్తమాన సమయం కూడా చాలా పెద్ద ఖజానాయే. ఎందుకంటే వర్తమాన సమయంలో ఏమి ప్రాప్తించుకోవాలనుకుంటే అది ప్రాప్తించుకోగలరు. ఏ వరదానమును తీసుకోవాలనుకుంటే ఆ వరదానమును పొందగలరు. ఎంతగా స్వయమును శ్రేష్ఠముగా చేసుకోవాలనుకుంటే అంతగా ఇప్పుడే చేసుకోగలరు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేసుకోలేరు. సంకల్పాల ఖజానాలు వ్యర్థం చేసుకోవడం అనగా తమ ప్రావులను పోగొట్టుకోవడం, అలాగే సమయం యొక్క ఒక్క ఘడియనైనా వ్యర్ధం చేసుకున్నట్లయితే అనగా సఫలం చేసుకోకపోతే ఎంతో పోగొట్టుకున్నట్టే. అలాగే వాటితో పాటు జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా, శక్తుల ఖజానా, వాటితో పాటు ప్రతి ఆత్మ మరియు పరమాత్మ ద్వారా దీవెనల ఖజానా. పురుషార్థములో అన్నింటికన్నా సహజమైనది దీవెనలు తీసుకోవడం మరియు దీవెనలు ఇవ్వడం. సుఖమును ఇవ్వండి మరియు సుఖమును తీసుకోండి. దుఃఖమును ఇవ్వకండి, దుఃఖమును తీసుకోకండి. దుఃఖమును ఇవ్వలేదు కానీ తీసుకున్నట్లయితే అలాగైనా దుఃఖితులుగా అయితే అవుతారు కదా! కావున దీవెనలు ఇవ్వండి, సుఖమును ఇవ్వండి మరియు సుఖమును తీసుకోండి. దీవెనలు ఇవ్వడం వస్తుంది కదా! వస్తుందా? తీసుకోవడం కూడా వస్తుందా? ఎవరికైతే దీవెనలు తీసుకోవడం మరియు ఇవ్వడం వస్తుందో వారు చేతులెత్తండి. అచ్చా! అందరికి వస్తుందా? అచ్చా! డబుల్ విదేశీయులకు కూడా వస్తుందా? అభినందనలు ఇవ్వడం వస్తుంది, తీసుకోవడమూ వస్తుంది. కావున అభినందనలు. తీసుకోవడము మరియు ఇవ్వడం కూడా వస్తే మరి ఇంకేమి కావాలి? అందరికి అభినందనలు. దీవెనలు తీసుకుంటూ ఉండండి, దీవెనలు ఇస్తూ ఉండండి. సంపన్నముగా అయిపోతూ ఉంటారు. ఎవరైనా శాపాలు ఇస్తే ఏమిచేస్తారు? తీసుకుంటారా? వారు మీకు శాపాలు పెడితే మీరు ఏమి చేస్తారు? తీసుకుంటారా? మీరు ఆ శాపాలను తీసుకున్నట్లయితే మరి మీలో స్వచ్ఛత ఉంటుందా? శాపాలు చెడ్డవే కదా! మరి మీరు దానిని మీ లోపలికి తీసుకున్నట్లయితే మీ లోపల స్వచ్ఛత అయితే ఉండదు కదా! కొద్దిగా డిఫెక్ట్ ఉన్నా ఫర్ఫెక్ట్ గా అవ్వలేరు. చెడు వస్తువును ఎవరైనా ఇస్తే మీరు తీసుకుంటారా? చూడడానికి చాలా సుందరమైన ఫలముగా ఉన్నా లోపల పాడైన దానిని ఇస్తే ఫలమైతే బాగుంది కదా! మరి మీరు దానిని తీసేసుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరు కదా! లేక చూడడానికైతే బాగానే ఉంది కదా వారైతే ఇచ్చేసారు కదా అని అయితే ఆలోచించరు కదా! ఎవరైనా, ఎప్పుడైనా ఏవైనా శాపాలు ఇస్తే, మీరు మనస్సులో ధారణ చేయకండి. ఇది శాపం లాంటిది అని అర్థమయ్యాక ఇక దానిని మీలో పలధారణ చేయకండి. లేకపోతే అది డిఫెక్ట్ గా అయిపోతుంది. కావున ఇప్పుడు ఈ పాత సంవత్సరం పూర్తయ్యేందుకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయి. కానీ మీ హృదయంలో దృఢ సంకల్పము చేయండి. ఇప్పుడు కూడా ఎవరి పట్లైనా మనస్సులో ఉంటే వాటిని తొలగించేసేయండి మరియు రేపటి నుండి దీవెనలు ఇస్తాము మరియు దీవెనలు తీసుకుంటాము అని దృఢ సంకల్పము చేయండి. అది మీకు ఇష్టమేనా? లేక చేయవలసిందేనని భావిస్తున్నారా? ఇష్టమే కానీ చేసి తీరాలి. ఏమైనా కానీ చేసి తీరాలి అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి, చేయవలసిందే..

ఏ స్నేహీ సహయోగులైతే ఈ రోజు వచ్చారో వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. అచ్చా! అందరూ ఒకే లైన్ లో కూర్చున్నారు. కావున స్నేహీ సహయోగులెవరైతే వచ్చారో బాప్ దాదా వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే సహయోగులుగానూ ఉన్నారు. స్నేహులుగానూ ఉన్నారు. మరియు ఈ రోజు ఇంకొక అడుగును ముందుకు వేసి బాబా ఇంటికి, మీ ఇంటికి వచ్చేసారు. కావున మీ ఇంటికి చేరుకున్నందుకు అభినందనలు, అచ్చా! స్నేహీ సహయోగులెవరైతే వచ్చారో వారు కూడా దీవెనలు ఇస్తాము మరియు దీవెనలు తీసుకుంటాము అని భావిస్తున్నారా? అలా భావిస్తున్నారా? ధైర్యమును ఉంచుతున్నారా? స్నేహీ సహయోగులెవరైతే ధైర్యమును ఉంచుతున్నారో వారికి సహాయం లభిస్తుంది.. కావున చేతులు పైకి ఎత్తండి. బాగుంది. అలాగైతే ఇక మీరు కూడా సంపన్నముగా అయిపోతారు. అభినందనలు, అచ్చా! ఈశ్వరీయ విద్యార్థులెవరైతే రెగ్యులర్ గా ఉన్నారో, బ్రాహ్మణ జీవితములో బాప్ దాదాను తెలుసుకునేందుకు మొదటి సారే వచ్చినా ఎవరైతే స్వయమును బ్రాహ్మణులుగా భావిస్తున్నారో నియమిత విద్యార్థులుగా భావిస్తున్నారో వారు, ఎవరైతే ఇది చేసి తీరాలి అని భావిస్తున్నారో వారు చేతులెతండి? దీవెనలు ఇస్తారా? దీవెనలు తీసుకుంటారా? టీచర్లు చేతులెత్తుతున్నారా? ఈ క్యాబిన్లో ఉన్నవారు చేతులెత్తడం లేదు. మేమైతే ఇస్తూనే ఉన్నాము అని వీరు భావిస్తున్నారు. ఇప్పుడు ఇది చేయవలసిందే. ఏమి జరిగినా కానీ చేయవలసిందే. ధైర్యమును ఉంచండి, దృఢ సంకల్పము చేయండి. ఎప్పుడైనా శాపనార్థాల ప్రభావము పడినా, 10 రెట్లు దీవెనలు ఎక్కువగా ఇచ్చి దానిని కూడా అంతం చేసేయండి. ఒక శాపనార్ధపు ప్రభావాన్ని 10 రెట్లు దీవెనలు ఇచ్చి తేలిక చేసేయండి. అప్పుడు ధైర్యము వస్తుంది. నష్టమైతే మనం కలుగుతుంది కదా! ఇతరులైతే శాపనార్థాలు పెట్టి వెళ్లిపోతారు. కానీ ఎవరైతే వాటిని తమలో ఇముడ్చుకుంటారో, మరి దుఃఖితులుగా ఎవరు అవుతారు? ఇచ్చేవారా లేక తీసుకునేవారా? ఇచ్చేవారుకూడా అవుతారు, కానీ తీసుకునేవారు ఎక్కువగా అవుతారు. ఇచ్చేవారైతే నిర్లక్ష్యముతో ఉంటారు. ఈ రోజు బాప్ దాదా తమ హృదయంలోని విశేష ఆశను వినిపిస్తున్నారు. బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపైనా, వారు దేశంలోని వారు అయినా లేక విదేశంలో ఉన్నా లేక సహయోగులుగా ఉన్నా, ఎందుకంటే సహయోగులకు కూడా పరిచయమైతే లభించింది కదా! కావున పరిచయం లభించాక ఆ పరిచయం యొక్క ఆధారముపై ప్రాప్తిని కూడా పొందాలి కదా! కావున పిల్లలందరి పట్ల బాప్ దాదాకు ఉన్న ఆశ ఏమిటంటే- పిల్లలు ప్రతి ఒక్కరూ దీవెనలు ఇస్తూ ఉండాలి. దీవెనల ఖజానాను ఎంతగా జమ చేసుకోగలిగితే అంతగా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎంతగా దీవెనలను, పోగు చేసుకుంటారో, జమ చేసుకుంటారో అంతగానే ఎప్పుడైతే మీరు పూజ్యులుగా అవుతారో అప్పుడు ఆత్మలకు దీవెనలు ఇవ్వగలుగుతారు. కేవలం ఇప్పుడు దీవెనలను మీరు మాత్రమే తీసుకోవడం కాదు. ద్వాపరయుగం నుండి భక్తులకు కూడా దీవెనలను అందించాలి. కావున దీవెనల యొక్క స్టాకు ఇంతగా జమ చేసుకోవాలి. మీరు రాజా పిల్లలే కదా? బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ రాజా పిల్లలుగా చూస్తారు, తక్కువగా చూడరు. అచ్చా!

సేవ యొక్క టర్న్ ఢిల్లీ జోన్ వారిది. అచ్చా! ఢిల్లీ వారందరూ లేవండి. ఢిల్లీ పేరును విని అందరూ సంతోషిస్తున్నారు కదా! ఎందుకంటే, ఇది మీ యొక్క కల్పకల్పపు రాజధాని. డ్రామాలో ఢిల్లీ రాజధానిగానే ఉంది. కాని సేవ యొక్క ప్రారంభం కూడా ఢిల్లీ నుండే జరిగింది. ఆది నుండి భిన్న భిన్న సేవల యొక్క కొత్త కొత్త ఇన్వెన్షన్లను కూడా ఢిల్లీ వారు కనుగొన్నారు. ఇతరులు కూడా కనుగొన్నారు. కానీ ఢిల్లీ వారు కూడా కనుగొన్నారు. సేవ యొక్క అవకాశం లభించింది. ఇది యజ్ఞ సేవ. యజ్ఞసేవ యొక్క ఫలము చాలా ఉన్నతమైనది. ఎందుకంటే యజ్ఞసేవ అనగా బ్రాహ్మణ ఆత్మల సేవ. భక్తిలోనైతే 8-10 మంది బ్రాహ్మణులకు భోజనం తినిపించి ఏదైనా చేస్తే చాలా పుణ్యము లభించేస్తుంది అని భావిస్తారు. కానీ ఇక్కడైతే 10 వేలమంది. 12 వేలమంది, 8 వేలమంది బ్రాహ్మణులకు సేవచేసే అవకాశం లభిస్తుంది. ఇది యజ్ఞపిత యొక్క యజ్ఞసేవ. బ్రహ్మాభోజనం యొక్క, యజ్ఞము యొక్క కణకణమూ ఎంతో విలువైనది మరియు బ్రాహ్మణులైన మీకు ఆ బ్రహ్మా భోజనము ఎంత ప్రేమగా ప్రాప్తమవుతుంది! ఈ బ్రహ్మాభోజనం తక్కువేమీ కాదు. ఎవరి భాగ్యములోనైతే బ్రహ్మాభోజనం ఉంటుందో దాని ఫలము ఎలా లభిస్తుంది అన్నది వారికి తెలియదు. కానీ అది తప్పకుండా లభిస్తుంది. కావున భక్తిలో కూడా శివుని భండాగారము నిండుగా ఉంటుంది. కాలకంఠకాలనుండి దూరంగా ఉంటుంది అని అంటారు. కావున మరి దానిని తినేవారికి ఎంతటి ఫలము లభిస్తుంది. బాగుంది. ఢిల్లీలోనైతే సేవ యొక్క ప్లాన్లను తయారుచేస్తూ ఉంటారు. కానీ బాప్ దాదా ఒక విశేషతను విన్నారు. అది బాబాకు నచ్చింది. ఢిల్లీవారు మన నిమిత్తమైన ప్రెసిడెంట్ యొక్క సేవను చాలా బాగా చేసారు మరియు తాను నిమిత్తముగా అయి ఇతరులకు కూడా సందేశమును ఇస్తూ, ఉంటాడు. కావున మంచి మైకును, శక్తిశాలీ మైకును తయారుచేసారు కదా! ఇప్పుడు ఢిల్లీవారు సేవ యొక్క ఇంకేదైనా కొత్త ప్లాన్ను తయారుచేయాలి. ఇంకే జోన్ వారైనా బాంబే వారుకూడా చేయవచ్చు. ప్రతి జోన్లోనూ ఏదో ఒక ప్లాన్ యొక్క ఇన్వెన్షన్ చేసేవారు ఉన్నారు. ఇప్పుడు మెగా ప్రోగ్రాంలుకూడా జరిగాయి. అవి కూడా సామాన్యమైనవిగా అయిపోయాయి. ఇది విశేషముగా మీ దాదీజీ యొక్క ఇన్వెన్షన్. ఇది ఎంత సహజముగా అవుతోందో చూడండి! లక్షమందిని ఒక చోటికి చేర్చడం చాలా కష్టమైన విషయం అని ప్రారంభంలో భావించేవారు. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడైతే జరిగాయో అక్కడ అంతా చాలా హృదయపూర్వకంగా చేసారు మరియు చాలా మంచి సఫలత లభించింది. బాప్ దాదా ఎవరి పేరునూ తీసుకోరు. కానీ ఎంతగా అయితే విశాల హృదయంతో చేసారో అంతగా సఫలత లభించడం అమలులో చూసారు. సఫలత అయితే లభించవలసిందే. సఫలత అయితే బ్రాహ్మణ ఆత్మల కంఠహారం, తమ జన్మసిద్ధ అధికారం. కావున ఢిల్లీవారు ఇప్పుడేదైనా కొత్తదానిని చేయాలి. సరేనా? ఢిల్లీవారూ, సరేనా? ఇన్వెన్షన్ చేయువారు కూడా చాలా మంది ఉన్నారు. బాగుంది. ప్రతి ఒక్క వర్గం వారు ఏఏసేవలనైతే ఇప్పటివరకూ చేసారో వాటిని బాగా చేసారు. ఇప్పుడు ఇంకా చాలా బాగా చేస్తారు, బాగా చేసారు. ఇంకా బాగా జరుగుతూ ఉంటుంది. చివరికి సైన్స్ శక్తిపై సైలెన్స్ యొక్క శక్తి విజయమును ప్రాప్తించుకోవలసిందే. ఇప్పుడు సైన్స్ వారు కూడా సంపర్కములోకి వస్తున్నారు. ఎవరెవరైతే సంబంధ సంపర్కాలలోకి వస్తారో, ఎవరికైతే పరిచయం లభిస్తుందో వారు కార్యమైతే బాగుంది అని భావిస్తారో, అటువంటివారికి కూడా జ్ఞానానికి చెందిన ఒక్క కణము, గింజ అయినా బుద్దిలో స్వీకరింపబడితే దాని ఫలము తప్పకుండా లభిస్తుంది. జ్ఞానము యొక్క ఒక్క కణము కూడా వినాశనమవ్వదు. దానికి అవినాశి ఫలము ఉంటుంది. కావున ఇప్పుడు ఢిల్లీవారు ఏమి చేయాలో అర్థం చేసుకున్నారు కదా! ఇంకా మైకులను తయారుచేయండి, తయారుచేస్తారు. బాప్ దాదా వద్దకు లిస్ట్ చేరుకుంది, కానీ ఇంకా తయారుచేయండి. అన్ని జోన్లవారుఎవరెవరైతే ఈరోజు వచ్చారో వారంతా సేవ యొక్క ప్రమాణమును తీసుకొని వచ్చారు కదా!
స్నేహీ సహయోగులెవరైతే వచ్చారో వారు లేవండి, కాస్త లేచి నిల్చోండి. కూర్చొని, కూర్చొని అలసిపోయి ఉంటారు. ఇప్పుడు కాస్త లేచి నిల్చోండి, అచ్చా - చాలా మంచి, మంచివారు వచ్చారు. మీరు ఎవరి సందేశకులుగా అయ్యారో మీకు తెలుసా? ఈశ్వరీయ సందేశకులుగా అయ్యారు కదా! మీరు ఈశ్వరుని పరిచయమును ఇస్తారు కదా! కావున మీరు ఈశ్వరీయ సందేశకులు. మీరు ఈ సేవ చేసినా, దాని ఫలము మీకు తప్పక లభిస్తుంది. దానినుండి ఎవ్వరూ తప్పించలేరు. సంతోషకరమైన విషయం ఏమిటంటే- మీరు ఈశ్వరీయ సందేశకులుగా అయి ఇతరులకు సందేశమును ఇస్తే వారికి మన కొత్త ప్రపంచం యొక్క గేట్ పాస్ అయితే లభిస్తుంది. కేవలం గేట్ పాస్ అయితే లభించింది. ఇప్పుడిక సీటు పాసును తీసుకోవాలి. బాగుంది. మిమ్మల్ని ఎవరు కలిసినా వారికి దారినైతే చూపిస్తారు కదా! పుణ్య కర్మనైతే చేస్తున్నారు కదా! కావున పుణ్య ఖాతా ఎప్పుడూ అంతమవ్వదు. కావున పుణ్య ఆత్మగా అయితే అయిపోయారు కానీ ఇప్పుడు కేవలం పుణ్యాత్మగా అవ్వడం మాత్రమే కాదు. కొద్ది ప్రాప్తిలో సంతోషపడిపోయేవారిగా ఉన్నారా? లేక అంతా తీసుకోవాలా? అంతా తీసుకోవాలి కదా! కావున పుణ్యాత్మగా అయితే అయ్యారు. పుణ్య కర్మలను చేసారు కదా! చేస్తున్నారు. ఇంకా చేస్తూ ఉంటారు కూడా. కానీ బాబా తమ పిల్లలు రాజపిల్లలుగా అయిపోవాలి. స్వరాజ్యాధికారులుగా అయిపోవాలి అని ఏదైతే కోరుకుంటున్నారో మరి ఆవిధంగా అవుతారు కదా! అలా అవ్వాలి కదా! అవ్వాలా? చేతులైతే ఉపండి. చాలా మంచి పని చేసారు..మీరు అతిధులు కారు, గెస్టు కారు, హోస్టులు. మీరు మీ ఇంట్లోకి వచ్చారు. మీ యొక్క ఇంత పెద్ద ఇల్లు మీకు నచ్చింది కదా! మీ ఇల్లు మీకు నచ్చింది కాబట్టి ఇప్పుడిక వస్తూ ఉండండి. ఇక్కడి ఆచారం ఏమిటంటే, ఇక్కడికి ఎవరైతే వస్తారో వారు ఏదో ఒక రోజు వెళతారు కదా! ఆ వెళ్లే రోజున దాది వారికి "గో సూన్, కం సూన్" అనే టోలిని తినిపిస్తారు. అది మీకు కూడా లభిస్తుంది. కాబట్టిగా "గో సూన్, కం సూన్" మీ ఇంట్లోకి వస్తూ ఉండండి. ఎందుకంటే, ఇక్కడికి రావలసిందే కదా! చాలా బావుంది. పిల్లలందరూ కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు. ఎందుకంటే సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణాన్ని తీసుకు వచ్చారు కదా! కాబట్టి అందరూ సంతోషిస్తున్నారు. మిమ్మల్ని ఎవరెవరైతే తీసుకువచ్చారో వారందరూ సంతోషిస్తున్నారు, మరియు వేల మంది బ్రాహ్మణ ఆత్మల ద్వారా మీకు అభినందనలు, అభినందనలు. అందరూ బాగున్నారా? విశ్రాంతిగా ఉన్నారా? తప్పక విచ్చేయండి. మొదటి గ్రూపులో వచ్చారు. మొదటి గ్రూపుకు కూడా మహత్వము ఉంటుంది కదా! అచ్చా కూర్చోండి. అలసిపోయి ఉంటారు.

బిజినెస్ వింగ్ - బిజినెస్ వింగ్ వారు లేవండి, బిజినెస్ వింగ్ వారు ఏ మైకును తయారుచేసారు? తయారుచేసారా? చేసారు కదా? ఎందుకంటే, బిజినెస్ వింగ్ వారికి బిజినెస్ చేసే మరియు చేయించే అలవాటు ఉంటుంది. కావున బాబాతో బిజినెస్ చేయించడం కూడా బిజినెస్ గ్రూప్ వారికి సహజము. బాగుంది. ఎప్పటినుండైతే వర్గాల సేవ చేసేందుకు ఇలా వర్గాలు తయారయ్యాయో అప్పటి నుండి ప్రతి ఒక్కరికి సేవ యొక్క విస్తారమును చేసి ఉల్లాస, ఉత్సాహాలు మంచిగా ఉండడం బాప్ దాదా గమనించారు. ఇప్పుడు బాప్ దాదా ఇంతకుముందు చెప్పారు కదా! ఇప్పుడిక ప్రతి విషయములోనూ బాప్ దాదాకు ఇంకా తీవ్రత కావాలి. పురుషార్థములోనూ మరియు సేవలోనూ కష్టపడడమైతే కష్టపడుతున్నారు. సమాచారాలు లభిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు సమయం యొక్క వేగం అనుసారముగా ఇంకా వేగమును తీవ్రతరం చేయండి. ఎందుకంటే అకస్మాత్తుగా ఏమైనా జరుగవచ్చు. కావున ఎటువంటి ఫిర్యాదు మిగిలియుండకూడదు. మాకు తెలియనే తెలియదు అంటూ ఎటువంటి ఆత్మా ఫిర్యాదు చేయకూడదు అనే బాప్ దాదాకు ఉంది. బాప్ దాదాకు సేవా సమాచారాలైతే లభిస్తూ ఉంటాయి. బాగా చేస్తున్నారు. తమ, తమ ఏరియాలో ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటారు కదా! నలువైపులా ప్రఖ్యాతము చేయండి. ప్రభు సందేశమును ప్రఖ్యాతము చేసేయండి, ప్రఖ్యాతముచేసేయండి, అచ్చా!

సోషల్ వింగ్ వారు:- సామాజిక వర్గం వారు సోషల్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారందరి స్థానాలేవైతే తయారై ఉన్నాయో వారందరికి సందేశమును ఇచ్చేసారా? ఎవరు ఏ దేశమునుండి లేక నగరము నుండి వస్తారో ఆ దేశములో మీ వర్గానికి చెందినవారు ఎవ్వరూ సందేశము నుండి వంచితులవ్వకుండా ఉండడం ఆ దేశవాసుల బాధ్యత. చేయడమైతే చేస్తున్నారు. బాప్ దాదాకు కూడా తెలుసు. నలువైపులా కార్యక్రమాలు కూడా తయారై ఉన్నాయి. కానీ ప్రతి దేశానికి చెందిన ప్రతి వర్గం వారెవరైతే ఉన్నారో వారిలో తక్కువలో తక్కువ తమ దేశానికి చెందినవారెవ్వరూ మిగిలియుండకూడదు. ప్రతి స్థానములోనూ చేస్తూనే ఉన్నారు. జరుగుతూ ఉంటుంది కదా! చేసేవాటియొక్క రిపోర్ట్ అయితే చేరుతోంది. చేయడమైతే చేస్తున్నారు. ఇంకా కొద్దిగా తీవ్రతరం చేయండి. ఎందుకంటే, బాప్ దాదా సమయం యొక్క వేగమును చూసి సూచనను ఇస్తున్నారు. సేవ అయితే బాగా చేస్తున్నారు. అభినందనలు.ఇంకా బాగా చేస్తూ ఉంటారు.

ట్రాన్స్ పోర్ట్ వింగ్:- ఎంతమంది ఆత్మలను గమ్యానికి చేర్చారు? ఎందుకంటే. గమ్యం వరకూ చేర్చడం ట్రాన్స్ పోర్ట్ వింగ్ వారి బాధ్యత. బాప్ దాదా సంతోషిస్తున్నారు. సేవ యొక్క ఉత్సాహం బాగుంది... అందరికి మంచి అవకాశము లభిస్తుంది. సేవ కొరకు మీటింగ్ కూడా అయిపోతుంది. అలాగే బాబాతో మిలనము కూడా జరుగుతుంది. తద్వారా డబుల్ సంపాదన జరుగుతుంది. అన్ని వర్గాల వారూ తెలివైనవారే. డబుల్ ఛాన్స్ తీసుకొనేవారే. ఇప్పుడు ఇక మనసా సేవను కూడా ఇంకా తీవ్రతరం చేయండి. ఎందుకంటే,వాణి యొక్క సేవ ద్వారా మొత్తం విశ్వం వరకూ చేరుకోవడంలో సమయం పడుతుంది. కానీ మనసా సేవ వేగవంతమైన సేవ, అలాగే అది శక్తివంతమైన సేవ కూడా. అందులో కష్టం కూడా తక్కువగా ఉంటుంది. కేవలం శక్తిశాలి స్థితిని తయారుచేసుకోవాలి. కావున సదా మనసా, వాచా, కర్మణా - మూడు సేవలను ఒకే సమయంలో కలిపి చేయవచ్చు. కర్మణా సేవ అనగా మీ సంబంధ, సంపర్కాలలోకి ఎవరైతే వస్తారో వారి సంబంధంలోకి రావడం కూడా కర్మణా సేవయే. సంబంధం ద్వారా కూడా ఎంతో సేవ జరుగుతుంది. కావున అన్ని వర్గాల వారూ, ఏవిధంగా ఇతర ప్లాన్లను తయారుచేస్తారో, సేవ యొక్క సాధనాలను తయారుచేస్తారో అలా తమ, తమ వర్గాలలో మనసా సేవ యొక్క విధినికూడా తయారుచేయండి. తద్వారా విశేషంగా ఆత్మల యొక్క మనసా సేవ కూడా జరగాలి. అచ్చా! అభినందనలు. మంచి సేవ చేస్తున్నారు. అన్ని వర్గాల వారి రిజల్టు బాగుందని బాప్ దాదా చెప్పారు కదా! అచ్చా!

యూత్ గ్రూప్ - యూత్ గ్రూప్ వారికి అభినందనలు. కాని సమయంలో ఆర్డర్ లభించగానే వచ్చి చేరుకున్నారు. అందుకు విశేష అభినందనలు. అచ్చా! ఇక్కడికైతే వచ్చారు. కానీ మనసా సేవను చేసారా? విశేష ఆత్మలైతే ఇక్కడకు రావలసి ఉందో వారిని గూర్చి ఇక్కడ కూర్చొని మనసా సేవను చేసారా? ఏ కారణముగానో వారు రాలేకపోయారు. కానీ మనసా సేవ ద్వారా ఆ ఆత్మలకు ఏమైనా చేరుకుందా లేక కేవలం మీటింగ్ చేసారా? ఆ ఆత్మలు కూడా రావలసింది, చేరుకోవలసింది అంటూ స్మృతి అయితే చేస్తూ ఉంటాయి కదా! బాగుంది. యూత్ గ్రూప్ ఇంకా పెరుగుతూ ఉండాలి. తద్వారా భారతదేశము యొక్క సమస్య అంతమైపోవాలి. తమ, తమ స్థానాలలో యువతను బ్రాహ్మణ యువతగా తయారుచేయాలి. భ్రష్టాచారము నుండి రక్షించి శ్రేష్టాచారులుగా తయారుచేయాలి. అదే యువత యొక్క కర్తవ్యము. ఇప్పుడు చూడండి. గవర్నమెంట్ వారి వరకూ కూడా శబ్దము చేరుకుంది. కానీ రిజల్టు స్పష్టంగా వారి బుద్ధిలో స్పష్టమయ్యేందుకు వారిని ఇంకా సమీపముగా తీసుకురావలసి ఉంటుంది. ప్రతి నగరానికి చెందిన, ప్రతి స్థానానికి చెందిన భ్రష్టాచారము, పోట్లాటలలో ఉండే యూత్ గ్రూప్ వారు ఎవరైతే ఉన్నారో వారి సేవ యొక్క విధానమునేదైనా తయారుచేయాలి. అటువంటి యువతనెవరినైనా పరివర్తన చేసి చూపించండి. ప్రతి నగరములోనూ యూత్ గ్రూప్ వారైతే ఉంటారు కదా! కావున ప్రతి నగరం వారూ ఎవరైనా 2,3 యూత్ గ్రూపులవారిని పరివర్తన చేసి చూపించండి. తద్వారా అందరి ధ్యానములోకి రావాలి. జైలులో సేవ చేయడం ద్వారా అనేకమంది పరివర్తన చెందారు. వారు అనేకచోట్ల అనుభవాలను వినిపించేవారు. అలాగే యూత్ గ్రూపువారి అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో వారిని పరివర్తన చేసి చూపించండి మరియు ఆ యువత ఇతర యువతకు అనుభవము వినిపించాలి. చేస్తున్నారు. బాగుంది. కానీ ఇప్పుడు ఇటువంటి ఉదాహరణనేదైనా తయారుచేయండి. ఎవరైతే అతి గొడవలలో ఉన్నారో వారిని సరిచేసి చూపించండి. వారు ప్రసిద్ధులై ఉండాలి. అంతటి ధైర్యము ఉంది కదా! ఇటువంటి పరివర్తననేదైనా చేసి చూపించండి. మైకులను తయారుచేయండి అని బాప్ దాదా అంటారు కదా! అలా మీరు గొడవ పడే వారిని శాంతమయంగా తయారుచేసి మంచి ఉదాహరణను చూపించండి. ఇటువంటి గ్రూపును తీసుకురావాలి. అటువంటి గ్రూపును తయారుచేసి ఇక్కడకు తీసుకురావాలి. చూడండి. ఎంతమంది యువత వచ్చారు. చాలా మంది వచ్చారు. మంచి, మంచివారు ఉన్నారు మరియు అన్ని వైపులవారూ ఉన్నారు. విదేశీయులు కూడా ఉన్నారు. బాగుంది. ఇప్పుడేదైనా శబ్దమును వ్యాపింపజేయండి. కొద్దికొద్దిగా సేవనైతే చేస్తున్నారు. ఖాళీగా అయితే కూర్చోలేదు. కానీ ఇప్పుడు ఎటువంటి సేవను చేయాలంటే ఏవిధముగా బాంబును వేసినప్పుడు శబ్దము వ్యాపించేస్తుందో అలా ఆత్మిక బాంబును ఏదైనా వేయండి. ఆటమ్ బాంబును కాదు. ఆత్మిక బాంబును వేయండి. అచ్చా - చాలా చాలా అభినందనలు, సమయానికి వచ్చినందుకు అభినందనలు. అచ్ఛా!

డబుల్ విదేశీయులతో:- డబుల్ విదేశీయులు చేతులూపండి. అందరూ చూసారా? డబుల్ విదేశీయులకు బాగా సదా డబుల్ అభినందనలు తెలుపుతారు. ఎందుకంటే మెజారిటీ డబుల్ విదేశీయుల విశేషత ఏమిటంటే, వారు డబుల్ కార్యమును చేస్తున్నారు. లౌకిక కార్యమునూ చేస్తున్నారు. అలాగే సెంటర్‌ను కూడా నడుపుతున్నారు. సెంటర్లు నడుపుతున్నా లేక సెంటర్లలో సహయోగులుగా ఉన్నా కానీ మెజారిటీ డబుల్ పనిచేస్తున్నారు. భారతదేశములో కూడా అలాంటివారు ఉన్నారు. కానీ అక్కడ మెజారిటీ అలా ఉన్నారు. బాప్ దాదా అప్పుడప్పుడూ కావాలనే దృశ్యమును చూస్తారు. బాప్ దాదా వద్ద సహజసిద్ధమైన టెలివిజన్ ఉంది. అది ఇక్కడి టి.వి. లాంటిది కాదు. బాప్ దాదా ఎలా పరిగెడుతుంటారో గమనిస్తూ ఉంటారు. ఉదయమే అల్పాహారం తినగానే ఆ పనులు, ఈ పనులు చేసుకొని ఇక పరిగెడుతూ ఉంటారు. మంచిగా అనిపిస్తుంది. అలాగే పురుషార్థములో కూడా డబుల్ మార్కులను తీసుకోవాలి. తీసుకునేవారే, అలాగే పరివర్తన చేసారు కూడా. అలాగే చేసే ఉత్సాహము కూడా బాగుంది. బాప్ దాదాకు డబుల్ విదేశీయులలోని ఒక సహజ స్వభావము ఎంతో నచ్చుతుంది. వారు స్వచ్చ హృదయం కలిగి ఉంటారు. ఏమి జరిగినా కానీ వారు దాచరు. స్పష్టముగా వినిపించేస్తారు. పడిపోయినా స్పష్టంగా ఉంటారు. పైకెక్కి నా స్పష్టంగా ఉంటారు. కావున స్వచ్చ హృదయం బాప్ దాదాకు ప్రియమనిపిస్తుంది, బాగుంది. డబుల్ అభినందనలు. మిమ్మల్నందరినీ చూసి కూడా అందరూ సంతోషిస్తారు. ఏదైనా టర్నులో డబుల్ విదేశీయులు లేకపోతే ఆ సమూహములో ఏదో లోటు అనిపిస్తుంది. కావున చాలా బాగుంది. ప్రతి గ్రూపులోనూ వస్తూ ఉండండి. శోభ ఉంది కదా! పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ దర్బారు యొక్క సింగారము, కావున ఎగురుతూ ఉండండి. నడవడం కాదు, పరిగెత్తడం కాదు, హైజంప్ చేయడం కాదు, ఎగరండి. ఎగిరే వారిగా అవ్వండి. డబుల్ విదేశీయులు స్థూలంగా కూడా ఎగరకుండా ఇక్కడకు రాలేరు. వారు కూడా ఎగురుతూనే రావలసి ఉంటుంది. కావున ఈ సంపన్నముగా అయ్యే గమ్యమును చేరుకోవడంలో కూడా ఎగిరే కళలో ఉండండి. అచ్చా! అభినందనలు, అచ్చా!

ఏ వర్గములోనూ లేచి నిల్చోనివారికి అభినందనలు లేవని కాదు. వారికి కోటానురెట్ల అభినందనలు, అలాగే ఎవరైతే దూరంగా కూర్చొని వింటున్నారో, చూస్తున్నారో, కొందరు వినేవారు ఉన్నారు, కొందరు చూస్తూ వినేవారు ఉన్నారు. ఇరువురికి, నలువైపులా ఉన్న పిల్లలకు చాలా చాలా చాలా అభినందనలు మరియు ప్రియస్మృతులు. ఎందుకంటే ప్రతి సీజన్లోనూ, ప్రతి టర్నులోనూ అందరూ ఎన్నో ఉత్తరాలు పంపుతూ ఉంటారు. కావున బాప్ దాదాకు ఆ ఉత్తరాలు చేరుతూ ఉంటాయి. అవేవో అలా వెళ్లిపోవు. బాబా వద్దకు చేరుతాయి. కొందరు ప్రేమతో కూడిన ఉత్తరాలు పంపితే మరికొందరు తమ పురుషార్ధమును గూర్చి ఉత్తరాలు పంపుతారు. కొందరు సేవ యొక్క ఉత్తరాలు పంపితే, మరికొందరు తమ ప్రతిజ్ఞల లేఖలు పంపుతారు. చాలా మంచి, మంచి ప్రతిజ్ఞలు కూడా చేస్తారు. కావున బాప్ దాదా వద్దకు అన్ని రకాల మరియు అన్నివైపుల నుండి ఉత్తరాలు వచ్చి చేరుకుంటాయి. మీలా బాబా కూర్చొని ఆ లేఖలను చదవరు. కానీ అవన్నీ నేరుగా హృదయంలోకి వచ్చి చేరుకుంటాయి. ఈ ఉత్తరాల పోస్టాఫీసు బాపి దాదాల హృదయంలో ఉంది. కావున అవి అక్కడకు వచ్చి చేరుకుంటాయి.

అచ్చా! బాప్ దాదాల ఆశను అండర్ లైన్ చేసారా? ఎవరు చేసారో వారు చేతులెత్తండి. అండర్ లైన్ చేసారా?బాప్ దాదా 6 మాసాల హోంవర్క్ ను కూడా ఇచ్చారు కదా! అది గుర్తుందా? టీచర్లకు గురుందా? కానీ ఈ రిజల్టు కావాలి. కొత సంవతరమైతే త్వరగా ప్రారంభమవ్వనున్నది. కావున ఈ ఒక్క మాసంలో మీ దృఢసంకల్పమును చూద్దాము, 6 మాసాల హోంవర్క్ వేరు, ఈ ఒక్క మాసం దృఢసంకల్పముయొక్క రిజల్టును చూద్దాము. సరేనా? టీచర్లూ, ఈ ఒక్క మాసమూ సరేనా? పాండవులకు సరేనా? అచ్చా - ఎవరైతే మొదటిసారి మధువనానికి వచ్చారో వారు చేతులెత్తండి, చాలా బాగుంది. బాప్ దాదాలకైతే సదా కొత్తపిల్లలు ఎంతో ప్రియమనిపిస్తారు. ఏవిధముగా వృక్షము నుండి వెలువడే చిన్న చిన్న చిగురుటాకులు పక్షులకు ప్రియమనిపిస్తాయో అలాగే కొత్త, కొత్త పిల్లలు ఎవరైతే వస్తారో వారు మాయకు కూడా చాలా ప్రియమనిపిస్తారు. కావున కొత్తవారు ఎవరైతే ఉన్నారో, వారు ప్రతిరోజూ తమ నవీనతను పరిశీలించుకోవాలి. ఈ రోజున తమలో ఏ నవీనతను తీసుకువచ్చారో చూసుకోవాలి. ఏ విశేషగుణమును, ఏ శక్తిని తమలో విశేషముగా ధారణ చేసారో పరిశీలించుకోవాలి. కావున ఈ విధంగా పరిశీలించుకుంటూ స్వయమును పరిపక్వముగా చేసుకుంటూ ఉన్నట్లయితే సురక్షితముగా ఉంటారు. అమరులుగా ఉండాలి మరియు అమరపదవిని పొందాలి, అచ్చా!

నలువైపులా ఉన్న నిశ్చింత మహారాజులకు, సదా ఆత్మిక నషాలో ఉండే శ్రేష్ట ఆత్మలకు, సదా ప్రాప్తించిన ఖజానాలను జమ ఖాతాలో పెంచుకునే తీవ్ర పురుషార్టీ ఆత్మలకు, సదా ఒకే సమయంలో మూడు రకాల సేవలనూ చేసే శ్రేష్ఠ సేవాధారీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు, కోటానురెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే,

జైపూర్‌లో 19 వ తేదీన మెగా ప్రోగ్రాం జరగబోతోంది, ఆ సమాచారమును బాప్ దాదాకు వినిపించారు. రాజస్థాన్ రాజధానిలో మెగా ప్రోగ్రాం జరుగబోతోందని బాప్ దాదా సమాచారమును విన్నారు. పూనా వారిది కూడా చాలా బాగా జరిగింది. మంగళూరులో కూడా చాలా బాగా జరిగింది. అన్నిస్థానాలలోనూ బాగా జరిగిందని చెప్పడం జరిగింది. ఇప్పుడేవైతే జరుగనున్నాయో అవి కూడా బాగా జరుగుతాయి, అచ్చా! - జైపూర్ మేళా రాజస్థాన్లో ఇంకా ఎక్కువ శబ్దాన్ని వ్యాపింపజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్య కేంద్రం ఉంది. కావున ముఖ్య కేంద్రం యొక్క శబ్దముకూడా ముఖ్యముగా ఉండాలి కదా! కావున బాగుంది. పరస్పరం మీటింగ్ జరుపుతున్నారు. అందరూ కలిసి చేసారు. సఫలత అయితే మీ కంఠహారంగానే ఉంది. కావున ధైర్యము ఉంది మరియు విశేషముగా మధువనము యొక్క సహాయం కూడా ఉంది. బాప్ దాదాల సహాయమైతే ఉండనే ఉంది. కావున సదా సఫలత లభిస్తుంది. ఈ నిశ్చితమైన విజయము ద్వారా ముందుకు వెళుతూ ఉండండి, సరేనా? పూనా వారికి కూడా చాలా, చాలా అభినందనలు. అలాగే మంగళూరులో చిన్న, చిన్నవారు కూడా అద్భుతం చేసి చూపించారు. కావున చిన్నవారు ధైవంతో సమానము అన్న ప్రాక్టికల్ ప్రమాణమును చూపించారు. కావున అందరికీ అభినందనలు, అభినందనలు, అచ్చా! ఓంశాంతి,

Comments