15-11-2005 అవ్యక్త మురళి

  15-11-2005         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సత్యమైన మనస్సుతో బాబాకి మరియు పరివారానికి స్నేహిగా అయ్యి శ్రమ నుండి ముక్తి అయ్యే ప్రతిజ్ఞ చేయండి మరియు లాభం పొందండి.

ఈరోజు బాప్ దాదా తన యొక్క నలువైపుల ఉన్న శ్రేష్ట స్వరాజ్యాధికారి, స్వమానధారి పిల్లలను చూస్తున్నారు. బాబా పిల్లలకు తన కంటే ఉన్నతమైన స్వమానాన్ని ఇచ్చారు. పాదాల దగ్గర ఉండే పిల్లలను విడిపించి శిరోకిరీటాలుగా చేసారు. స్వయాన్ని సదా ప్రియమైన పిల్లలకు సేవాధారి అన్నారు. ఇంత ఉన్నతమైన అధికారం యొక్క స్వమానాన్ని పిల్లలకు ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఈ విధంగా మిమ్మల్ని మీరు స్వమానధారిగా భావిస్తున్నారా? స్వమానధారి యొక్క విశేష లక్షణాలు ఏమిటి? 1. ఎవరు ఎంత స్వమానధారి ఉంటారో అంతగానే సర్వులకు సన్మానాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. ఎంత స్వమానధారిగా ఉంటారో అంతగా నిర్మాణంగా, సర్వులకు స్నేహిగా ఉంటారు. స్వమానధారి యొక్క గుర్తు - బాబాకి ప్రియంగా ఉండటంతో పాటు సర్వులకు ప్రియంగా ఉంటారు. హద్దు యొక్క ప్రేమ కాదు, బేహద్ ప్రేమ. బాబా అందరికీ ప్రియమే అందువలనే ఒక నెల పిల్లలైనా, ఆదిరత్నాలైనా నేను బాబా వాడిని, బాబా నావాడు అని అంగీకరిస్తారు. ఇదే సర్వలకు ప్రియంగా, శ్రేష్టస్వమానం యొక్క గుర్తు. ఎందుకంటే అటువంటి పిల్లలు తండ్రిని అనుసరించే విధంగా ఉంటారు. బాబా ప్రతి ఒక వర్గం వారికి, చిన్న పిల్లల నుండి ముసలివారైనా పిల్లలకు కూడా స్వమానాన్ని ఇచ్చేవారు. యువకులకు వినాశకారి నుండి కళ్యాణకారి యొక్క స్వమానాన్ని ఇచ్చారు. మహాన్ గా చేసారు. ప్రవృత్తిలో ఉండేవారిని మహాత్మలు, జగద్గురువుల కంటే ఉన్నతంగా ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండేవారిని మహాత్ముల తలను కూడా వంచేవారిగా చేసారు. కన్యలకు శివశక్తి స్వరూపం యొక్క స్వమానాన్ని స్మృతి ఇప్పించారు. అలా తయారుచేసారు. ముసలివారిని బ్రహ్మాబాబాకి భుజాలుగాను, అనుభవీ ఆత్మలు అనే స్వమానాన్ని ఇచ్చారు. అలాగే స్వమానధారి ఆత్మ కూడా ప్రతి ఆత్మను ఈవిధమైన స్వమానంతో చూస్తుంది. కేవలం అలా చూడటమే కాదు, సంబంధ, సంపర్కంలోకి వస్తుంది. ఎందుకంటే స్వమానం దేహాభిమానాన్ని తొలగిస్తుంది. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహం యొక్క అభిమానం ఉండదు. దేహాభిమానం తొలగించుకోవడానికి సహజసాధనం - సదా స్వమానంలో ఉండాలి. సదా ప్రతి ఒక్కరిని స్వమానంతో చూడాలి. కాలిబలంవారైనా, 16 వేలలో చివరి నెంబర్ అయినా కానీ చివరి నెంబర్లో కూడా డ్రామానుసారం ఏదోక విశేషత ఉంటుంది. స్వమానధారి విశేషతలను చూసి స్వమానాన్ని ఇస్తారు. వారి దృష్టిలో, వృత్తిలో, కృతిలో ప్రతి ఒక్కరి విశేషత ఇమిడి ఉంటుంది. ఎవరు బాబా పిల్లలుగా అయినా విశేషాత్మలే. నెంబర్ వార్ అయినా ప్రపంచంలో కొద్దిమందిలో కొద్దిమంది. ఇలా మిమ్మల్ని మీరు విశేషాత్మగా భావిస్తున్నారా? స్వమానంలో స్థితులవ్వాలి, దేహాభిమానంలో కాదు. 

బాబాకి ప్రతి ఒక పిల్లవాడిపై ప్రేమ ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే నన్ను గ్రహించి, నా వారిగా అయ్యారు అని. ఈ మేళాలో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారిని కూడా బాబా నా ప్రేమకు పాత్రులు అంటారు. బాప్ దాదాకి నలువైపుల ఉన్న పిల్లలందరు ప్రియమైనవారే. ఎవరు అప్రియం కాదు, అందరు ప్రియమైనవారే. చూడండి ఏ పిల్లలైనా నా బాబా అని అంటున్నారంటే ఈ నావాడు అనేది ఎలా వచ్చింది? స్నేహం ద్వారా. ఇక్కడ కూర్చున్న వారందరిని స్నేహమే బాబా వారిగా చేసింది అని భావిస్తున్నారా! బాబా యొక్క స్నేహం అనేది అయస్కారం, ఈ అయస్కాంతమే బాబా వారిగా చేసింది. స్నేహం అనేది కేవలం చెప్పటం వరకు కాదు. మనస్ఫూర్వకమైన స్నేహం ఉండాలి. మనస్ఫూర్వకమైన స్నేహమే బ్రాహ్మణ జీవితానికి పునాది. బాబాని కలుసుకునేటందుకు ఎందుకు వస్తున్నారు? స్నేహమే తీసుకువచ్చింది కదా! ఇక్కడ కూర్చున్న వారందరు ఎందుకు వచ్చారు? స్నేహమే ఆకర్షించింది కదా! ఎంత స్నేహం ఉంది? 100 శాతమా లేక ఇంకా తక్కువ ఉందా? ఎవరైతే 100 శాతం ఉంది అంటారో వారు చేతులు ఎత్తండి! స్నేహంలో 100 శాతం ఉందా, కొద్దిగా కూడా తక్కువ లేదు కదా? మంచిది. మరి ఇంత స్నేహమే బ్రాహ్మణపరివారంపై ఉందా? దీనిలో చేతులు ఎత్తతున్నారా? దీనిలో శాతం ఉంది. ఎలా అయితే బాబా అందరికీ స్నేహియో అదేవిధంగా పిల్లలు కూడా సర్వులకు స్నేహిగా, సర్వుల నుండి స్నేహం తీసుకునేవారిగా ఉండాలి. ఇతరుల బలహీనతలు చూడకండి. ఒకవేళ ఎవరైనా సంస్కారాలకు వశీభూతం అయితే ఎవరిని అనుసరించాలి? వశీభూతం అయినవారిని అనుసరించాలా? మీరు వశభూత మంత్రం ఇచ్చేవారా, వశీభూతం నుండి విడిపించే మంత్రం ఇచ్చేవారా? విడిపించేవారు కదా! లేక చూస్తూ ఉండేవారా? ఏమి కనిపిస్తుంది? ఒకవేళ ఏదైనా చెడు వస్తువు కనిపిస్తే ఏం చేస్తారు? చూస్తూ ఉంటారా లేక దానిని తొలగించేస్తారా? ఎందుకంటే ఎవరైతే బాబాపై మనస్పూర్వకమైన స్నేహం పెట్టుకుంటారో వారు సర్వులకు తప్పకుండా స్నేహిగా అవుతారు. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేటందుకు సహజ విధి - మనస్పూర్వకమైన స్నేహం. ఎవరు ఎంత జ్ఞానిగా ఉన్నా కానీ ఒకవేళ మనస్ఫూర్వకమైన స్నేహం లేకపోతే బ్రాహ్మణజీవితంలో రమణీయత ఉండదు. ఎందుకంటే జ్ఞానంలో స్నేహం లేకుండా ఒకవేళ జ్ఞానం ఒకటే ఉంటే దానిలో ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి. కానీ జ్ఞానసహితమైన స్నేహం ఉంటే స్నేహి సదా స్నేహంలో లవలీనమై ఉంటారు. స్మ్మతి చేయడానికి శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. కేవలం జ్ఞానిగా ఉండి స్నేహం లేకపోతే శ్రమ చేయవలసి వస్తుంది. వీరు శ్రమ యొక్క ఫలం తింటారు, వారు ప్రేమ యొక్క ఫలం తింటారు. జ్ఞానమనేది బీజం స్నేహమనేది నీరు. జ్ఞాన బీజానికి స్నేహమనే నీరు లభించకపోతే ఫలం రాదు. 

కనుక ఈరోజు బాప్ దాదా పిల్లలందరి యొక్క మనస్సు యొక్క స్నేహాన్ని పరిశీలిస్తున్నారు. బాబాతో మరియు సర్వులతో ఎంత స్నేహం ఉంది? అని. మీరందరు మిమ్మల్ని మీరు ఏమని భావిస్తున్నారు? స్నేహీలేనా? స్నేహీలేనా? మనస్సు యొక్క స్నేహం మాకు ఉంది అనే వారు చేతులు ఎత్తండి! సర్వుల స్నేహీలేనా? సర్వుల పట్ల స్నేహం ఉందా? మంచిది. బాబాతో మనస్ఫూర్వకమైన స్నేహం ఉంది అలాగే సర్వులతో ఉందా? ఉందా సర్వులతో? వీరు నా సోదరి లేదా సోదరుడు అని అందరు భావిస్తున్నారా? వీరు నా వారు అని ప్రతి ఒక్కరు భావిస్తున్నారా? భావిస్తున్నారా? లేక కొందరే భావిస్తున్నారా? బాబాపై స్నేహం విషయంలో అందరు చేతులు ఎత్తుతారు అదేవిధంగా సర్వుల స్నేహీలేనా అనే విషయంలో కూడా చేతులు ఎత్తుతారా? వీరు సర్వుల స్నేహి అనే సర్టిఫికెట్ మీకు లభిస్తుందా? ఎందుకంటే బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - కేవలం బాబాతోనే సర్టిఫికెట్ తీసుకోవటం కాదు, బ్రాహ్మణ పరివారంతో కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో బాబా ధర్మం మరియు రాజ్యము రెండింటినీ వెనువెంట స్థాపన చేస్తున్నారు. రాజ్యంలో కేవలం బాబాయే ఉండరు. పరివారం కూడా ఉంటారు. కనుక బాబాకి మరియు పరివారానికి కూడా ప్రియంగా ఉండాలి. జ్ఞానిగా అయ్యారు కానీ వెనువెంట స్నేహీగా కూడా తప్పక కావాలి. స్వమానంలో ఉండాలి మరియు సర్వులకి సన్మానం (గౌరవం) ఇవ్వాలి. రెండూ తప్పనిసరి. బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే బాబా ప్రతి ఒక పిల్లవానికి గౌరవాన్ని ఇచ్చారు. అప్పుడే మీరు ఉన్నతంగా అయ్యారు. ఈ ఒక జన్మలో గౌరవం ఇవ్వటం ద్వారా దానికి ప్రాలబ్దంగా కల్పమంతా గౌరవం ప్రాప్తిస్తుంది. అర్దకల్పం రాజ్యాధికారి యొక్క గౌరవం లభిస్తుంది, మిగతా అర్థకల్పం భక్తిలో భక్తుల ద్వారా గౌరవం లభిస్తుంది. 

ఈరోజు ఈ సీజన్ యొక్క మొదటి మిలనం. నలువైపుల ఉన్న పిల్లలందరు స్నేహంతో చేరుకున్నారు. మొదటిసారిగా వచ్చినవారు చేతులు ఎత్తండి! చాలా మంది వచ్చారు. మొదటిసారి వచ్చారు, మొదటి అవకాశం తీసుకున్నారు. శుభాకాంక్షలు. పరివారం యొక్క వృద్ధి చూసి అందరికీ సంతోషంగా ఉంది కదా! మా సోదరీ, సోదరులందరు ఓహో భలే చేరుకున్నారు అనుకుంటున్నారు. కదా! బాప్ దాదాకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది.. తప్పిపోయిన పిల్లలు మరల తమ అధికారం తీసుకునేటందుకు చేరుకున్నారు. కనుక అందరు సంతోషంగా ఉన్నారా లేక చాలా చాలా చాలా సంతోషంగా ఉన్నారా? చాలా, చాలా సంతోషంగా ఉన్నారు. మంచిది. డబల్ విదేశీయులు కూడా వచ్చారు. డబల్ విదేశీయులు తెలివైనవారు. ఏ మిలనాన్ని వదులుకోరు. మంచిది. అవకాశం తీసుకునేవారిని అవకాశదారులు అంటారు. అవకాశం తీసుకోవటంలో తెలివైనవారు. డబల్ విదేశీయులకి బాప్ దాదా విశేషంగా ఒక విషయం గురించి విశేష శుభాకాంక్షలను ఇస్తున్నారు. ఏ విషయం గురించి? ఎక్కడెక్కడికో చెల్లాచెదురైపోయారు, దేశం మారిపోయారు, కొందరైతే ధర్మం కూడా మారిపోయారు, సంస్కృతి మారిపోయింది కానీ మారిపోయి కూడా మరలా గుర్తించే నేత్రం శక్తివంతంగా ఉంది. గుర్తించడంలో తెలివైనవారు. గుర్తించారు మరియు బాబాని తమవారిగా చేసుకున్నారు. పరివారాన్ని కూడా సొంతం చేసుకున్నారు, బ్రాహ్మణ సంస్కృతిని అలవరుచున్నారు అంటే తెలివైనవారు కదా! బాప్ దాదా సదా వీరిలో ఏమి విశేషత చూస్తారంటే బాబాతో కూడా ప్రేమ ఉంటుంది, సేవతో చాలా ప్రేమ ఉంటుంది, సేవతో ప్రేమ ఉన్న కారణంగా చాలా బిజీగా ఉంటారు. డబల్ సేవ చేస్తారు. డబల్ సేవ కాదు త్రిబుల్ సేవ చేస్తారు. అంటే మూడు రకాల సేవలు చేస్తారు. ఒకటి - లౌకిక ఉద్యోగం, రెండు - జ్ఞానం చెప్పే సేవ, మరియు వీటితో పాటు ఎక్కువ మంది సెంటర్‌లో కర్మణాసేవలో కూడా సహయోగి అవుతారు. బాప్ దాదా ఎప్పుడు చూసినా కానీ మూడు రకాల సేవలలో పిల్లలు బిజీగా ఉంటారు, అది చూసి బాబా సంతోషిస్తారు, మనస్సులోనే శుభాకాంక్షలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా బాప్ దాదా చూస్తున్నారు - నలువైపుల విదేశాలలో కొందరు రాత్రిలో, కొందరు పగలులో కలయిక జరుపుకుంటున్నారు. పురుషార్థం యొక్క వేగాన్ని మంచిగా పెంచేటందుకు మంచి దాదీ కూడా మీకు లభించారు. అవును కదా? ఏ కొంచెం లోపం చూసినా కానీ వెంటనే క్లాస్ మీద క్లాస్ చేయిస్తారు. దేశంలో కానీ, విదేశాలలో కానీ ఏ పిల్లవానికైనా ఏ విషయంలోనైనా శ్రమ అనిపిస్తుందంటే దానికి ముఖ్య కారణం - మనస్సు యొక్క స్నేహం లోపంగా ఉండటం. స్నేహమంటే లవలీనమైపోవటం. స్నేహముంటే స్మృతి చేయటం కష్టమనిపించదు, మర్చిపోవటం కష్టమనిపిస్తుంది. కనుక శ్రమ అనిపిస్తుందంటే మనస్సు యొక్క స్నేహాన్ని పరిశీలించుకోండి. ఎక్కడా లీకేజ్ లేదు కదా? వ్యక్తితో కానీ, వ్యక్తి యొక్క విశేషతతో కానీ, సాధనాలతో కానీ, సౌకర్యాలతో కానీ తగుల్పాటు ఉంటే లీకేజ్ ఉన్నట్లు. నియమప్రమాణంగా సౌకర్యాలను ఉపయోగించుకోవటం సరైనదే కానీ సౌకర్యాలతో ఎక్కువ ప్రేమ పెట్టుకోవటం తగుల్పాటు. ఆ సౌకర్యాలే జ్ఞాపకం వస్తూ ఉంటాయి. దానికి గుర్తు ఏమిటంటే - ఎక్కడైనా కానీ లీకేజ్ ఉంటే జీవితంలో సదా ఏదొక కారణంగా అసంతుష్టత అనుభవం అవుతుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ సదా ప్రసన్నత ఉంటుంది. ఆత్మికగులాబి వలె సదా నవ్వుతూ ఉంటారు, వికసించి ఉంటారు, మూడ్ ఆఫ్ అవ్వరు. సదా డబల్ గా ఉంటారు. కనుక ఇప్పుడు అర్థమైందా! శ్రమ నుండి రక్షించబడండి. పిల్లల యొక్క శ్రమ బాప్ దాదాకి ఇష్టమనిపించదు. అర్దకల్పం శ్రమ చేసారు, ఇప్పుడు మజాగా ఉండండి. ప్రేమలో లవలీనమై ఉండండి. జ్ఞానసాగరం యొక్క లోతులో అనుభవం యొక్క ముత్యాలు పొందండి. కేవలం సాగరంలో మునిగి వచ్చేయకండి. లవలీనం అవ్వండి. 

అందరు ప్రతిజ్ఞ చేసారు కదా! బాబా నీ వెంటే ఉంటాము, నీ వెంటే వెళ్తాము అని. చేసారా? చేసారా ప్రతిజ్ఞ వెంట వెళ్తారా లేక వెనుక వస్తారా! వెంట వెళ్ళడానికి తయారుగా ఉన్నవారు చేతులు ఎత్తండి? తయారేనా? ఆలోచించుకుని చేయి ఎత్తండి! తయారేనా అంటే బాబా సమానమేనా? బాబా వెంట ఎవరు వెళ్ళగలరు? బాబా సమానమైనవారే బాబా వెంట వెళ్ళగలరు. ఎవరెడీయేనా? మొదటి వరసలో వారు ఎవరెడీయేనా? ఎవరెడీయేనా? రేపే వెళ్ళేటందుకు ఆజ్ఞ ఇస్తే వెళ్తారా? పిల్లలు జ్ఞాపకం రారా? మాతలు వెళ్తారా? తయారేనా మాతలు? ఎవరు గుర్తురారా? టీచర్లకి సెంటర్ గుర్తు వస్తుందా? విద్యార్థులు గుర్తు వస్తారా? గుర్తురారా? మంచిది, అందరు నిర్మోహి అయిపోయారా? అయితే చాలా మంచిది. అప్పుడిక శ్రమ చేయవలసిన అవసరం లేదు. 

ఈ రోజు బాప్ దాదా అందరినీ అంటే ఎదురుగా కూర్చున్నా కానీ దూరంగా కూర్చున్న కూడా బాబా హృదయంలో కూర్చున్నవారందరినీ శ్రమ నుండి ముక్తులు చేయాలనుకుంటున్నారు. అవుతారా? చప్పట్లు అయితే కొట్టేసారు. కానీ తయారవుతారా? రేపటి నుండి ఎవరు దాదీల దగ్గరికి రారు కదా? శ్రమ ఇవ్వరు కదా? మజాగా కలుసుకుంటారు కదా? జోన్ హెడ్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదులు చేయరు కదా! సంపూర్ణంగా ఉంటారు కదా? సరేనా? ఇప్పుడు చేతులు ఎత్తండి? ఆలోచించుకుని ఎత్తండి? మామూలుగా ఎత్తేయటం కాదు. మొదటి లైన్లో వారు చేతులు ఎత్తటం లేదు. మీరు చేతులు ఎత్తారు. నేను అనేది ఉండకూడదు, నాది అనేది ఉండకూడదు. ప్రతిజ్ఞ అయితే చేసారు కదా, మంచిది, శుభాకాంక్షలు. కానీ ఆ ప్రతిజ్ఞ యొక్క లాభం పొందటం లేదు. ప్రతిజ్ఞ చాలా త్వరగా చేసేస్తున్నారు కానీ దాని యొక్క లాభం పొందేటందుకు ఒకటి - దానిని అనుభవం చేసుకోండి, రెండు - దానిని రివైజ్ చేసుకోండి. అమృతవేళ బాబాని కలుసుకున్న తర్వాత ప్రతిజ్ఞ మరియు దాని యొక్క లాభం రెండింటి సమానతను పరిశీలించుకోండి. ఏ ప్రతిజ్ఞ చేసాము మరియు ఆ ప్రతిజ్ఞను ఎంత వరకు నిలుపుకున్నాను! ఇలా మీలో మీరు అనుభవం చేసుకోండి. మరియు మాటిమాటికి రివైజ్ చేసుకోండి. సమానత ఉంటే మంచిది. బాప్ దాదాకి తెలుసు - మీటింగ్ వారు ప్రతిజ్ఞ చేసారు, మీటింగ్ వారు నిల్చోండి. మంచిది. ప్రతిజ్ఞ పక్కాగా చేసారా? లేక ఫైల్ లో ఉండేటందుకు ప్రతిజ్ఞ చేసారా? చేసారా? నిజంగానే చేసారా? చప్పట్లు కొట్టండి. బాగా కొట్టండి. చాలా మంచిగా చేసారు, కూర్చోండి. ఇంతమంది సంపూర్ణం అయిపోతే వెనుక నెంబర్ వారు తప్పక సంపూర్ణం అయిపోతారు. ఎందుకంటే సేవకి మీరు విశేష ఆధారమూర్తులు, నిమిత్తులు. స్వసేవ ద్వారానే సేవలో సఫలత లభిస్తుంది. స్వసేవయే విశ్వసేవకి ఆధారం. ఇంతమంది ప్రతిజ్ఞ నిలుపుకునేవారైతే మీ నిమిత్తభావం ఇతరులకు కూడా సహయోగం ఇస్తుంది. మాటిమాటికి మనస్సులోనే అనుభూతి చేసుకోవాలి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని. చేయకూడదు అనే విషయానికి 21 జన్మల వరకు ఆల్ మైటీ గవర్నమెంట్ సీల్ వేసేయండి. మాస్టర్ సర్వశక్తివంతులు కదా! అంటే ఏది కావాలంటే అది చేయగలరు. అంత అధికారం బాబా నుండి లభించింది. ఏ సంకల్పమైనా, మాట అయినా, కర్మ అయినా చేసేముందు ఇది బాబా సమానంగా ఉందా, లేదా అని పరిశీలించుకోండి. పరిశీలించుకున్న తర్వాత చేయండి. మీ వివేకం చేయమని చెప్తే చేయండి. సమానంగా అవ్వాలంటే సమానంగా చేయాలి కదా! సమానంగా నడవాలి కదా! బాప్ దాదా అయితే ప్రతి ఒక బిడ్డపై చాలా, చాలా ఉన్నతోన్నత ఆశతో చూస్తున్నారు, వీరే తయారవ్వాలి అని. ఒకప్పుడు అయ్యారు, ఇప్పుడు కూడా తప్పక తయారవుతారు అని అనుకుంటారు. కేవలం రెండు మాటలని జ్ఞాపకం పెట్టుకోండి - నిమిత్తము మరియు నిర్మాణం. నాది, నేను అనేవి సమాప్తి అయిపోవాలి. నేను నిమిత్తము మరియు నిర్మాణంగా అవ్వాలని భావించండి. ఇప్పుడు 70వ సంవత్సరం జరుపుకుంటున్నారు. విదేశీయులు మరియు భారతవాసీయులు కార్యక్రమం జరిపేటందుకు మీటింగ్ పెట్టుకున్నారు కదా! బాప్ దాదా ఈ 70వ సంవత్సరాన్ని ఏ విధితో జరుపుకోవాలనుకుంటున్నారో తెలుసా? జరుపుకునేటందుకు అందరికీ ఉత్సాహం ఉంది కదా? మాతలకి ఉందా? డబల్ విదేశీయులకి ఉందా? జరుపుకోవాలా? సేవ ప్రోగ్రామ్ అయితే మీరే తయారుచేస్తారు, దీనిలో తెలివైనవారే. బాప్ దాదా చూస్తున్నారు - చాలా మంచి, మంచి ప్లాన్స్ తయారుచేస్తున్నారు, అవి బాబాకి కూడా ఇష్టమే. కానీ బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? బాప్ దాదా కేవలం ఒక మాట కోరుకుంటున్నారు - సఫలం చేసుకోండి, సఫలులు అవ్వండి. ఏవైతే ఖజానాలు, శక్తులు ఉన్నాయో అంటే సంకల్పం, మాట, కర్మ కూడా ఒక శక్తి, సమయం కూడా ఒక ఖజానా. ఇలా శక్తులను, ఖజానాలను అన్నింటినీ సఫలం చేసుకోండి. స్థూలధనమైనా, అలౌకికఖజానా అయినా అన్నింటినీ సఫలం చేసుకోండి. సఫలతామూర్తులు అనే సర్టిఫికెట్ తీసుకోవలసిందే. సఫలం చేసుకోండి మరియు సఫలం చేయించండి. ఒకవేళ ఎవరైనా అసఫలం చేస్తున్నా కానీ మాట ద్వారా శిక్షణ ఇవ్వటం కాదు, మీ శుభభావన, శుభకామన సదా శుభగౌరవాన్ని ఇవ్వటం ద్వారా సఫలం చేసుకోండి. 

కేవలం శిక్షణ ఇవ్వకండి, శిక్షణ ఇవ్వవలసి వచ్చినా కానీ క్షమ మరియు శిక్షణ అనగా క్షమారూపులై శిక్షణనివ్వండి. దయాహృదయులు అవ్వండి. మీ దయాహృదయరూపం మీ శిక్షణకి ఫలాన్ని తప్పక ఇస్తుంది. చూడండి, ఈ రోజుల్లో వైద్యులు ఆపరేషన్ చేసే ముందు ఏం చేస్తారు? మత్తు ఇచ్చి పడుకోపెడతారు. తర్వాత కోస్తారు. అలాగే మీరు కూడా ముందు దయాహృదయులు అవ్వండి, తర్వాత శిక్షణ ఇవ్వండి అప్పుడు ప్రభావం పడుతుంది. లేకపోతే ఏమౌతుంది? మీరు శిక్షణ ఇస్తున్నారు, కానీ వారు మీ కంటే పెద్ద శిక్షకులు, శిక్షకుడు శిక్షకుని శిక్షణ వినడు కదా! ఇలా చేయకండి, ఇలా చేయండి అని మీరు ఒక పాయింట్ చెప్తే దానిని కట్ చేయడానికి వాళ్ళ దగ్గర 10 పాయింట్లు ఉంటాయి. అందువలన క్షమ మరియు శిక్షణ వెనువెంట ఉండాలి. కనుక ఈ 70వ సంవత్సరం జరుపుకునే పద్ధతి ఏమిటంటే - సఫలం చేసుకోండి మరియు సఫలం చేయించండి, సఫలతా మూర్తులు అవ్వండి, అన్నింటినీ సఫలం చేసుకోండి. డబల్ లైట్ గా అవ్వాలి కదా! కనుక సఫలం చేసుకోండి. సంస్కారాన్ని కూడా సఫలం చేసుకోండి. మీ వాస్తవిక అనాది సంస్కారాలు మరియు ఆది దేవతా సంస్కారాలను నింపుకోండి. వ్యతిరేక సంస్కారాల యొక్క అంతిమ సంస్కారం చేయండి. ఆది, అనాది సంస్కారాలను ప్రత్యక్షం చేయండి. సంస్కారాలు మారటం లేదు, సంస్కారాలు మారటం లేదు ..... ఇదే అందరి ఫిర్యాదు. కనుక ఈ 70వ సంవత్సరంలో ఏదోక అద్భుతం చేస్తారు కదా! కనుక పరివర్తన యొక్క విశేషతను చూపించండి. సరేనా? ఈ 70వ సంవత్సరంలో చేస్తారు కదా! చేయాలి, చేస్తారా? లేక అదే జరగనున్నదా? కేవలం నిమిత్తంగా అవ్వాలంతే. మంచిది. 

ఇప్పుడు ఒక నిమిషంలో అందరు శ్రమ నుండి ముక్తులు అవుతాము అని ఏదైతే ప్రతిజ్ఞ చేసారో, చేసారు కదా? చేసారా? ఫోటో తీయండి. ఇప్పుడు ఒక నిమిషంలో మీ మనస్సుతో ఈ ప్రతిజ్ఞను ధృఢం చేసుకోండి. అండర్‌లైన్ చేసుకోండి. మనస్సులో పక్కాగా చేయండి. మంచిది. 

నలువైపుల ఉన్న స్వమానధారి పిల్లలకు, సదా బాబా యొక్క మనస్సు యొక్క స్నేహీలకు, సర్వుల యొక్క స్నేహీ శ్రేషాత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా, జీవన్ముక్తులుగా అనుభవం చేసుకునే తీవ్ర పురుషార్ధి పిల్లలకు, సదా ప్రతిజ్ఞ మరియు ప్రతిజ్ఞ యొక్క లాభాన్ని తీసుకునే వారికి, సమానత ఉంచుకుని ఆశీర్వాదాలు పొందే ఆత్మలకు, సదా ఆనందంలో ఉండేవారికి, ఇతరులను కూడా ఆనందంలో ఉంచేవారికి, ఇలా సంగమయుగీ శ్రేష్ట భాగ్యం యొక్క అధికారి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనోభిరాముని యొక్క మనస్సు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి, ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments