15-10-2004 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఒకే బాబాని ప్రత్యక్షం చేసేటందుకు ఏకరస స్థితిని తయారు చేస్కోండి, స్వమానంలో ఉండండి మరియు సర్వులకి సన్మానం ఇవ్వండి.
ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో మూడు భాగ్య సితారలు మెరుస్తున్నట్లు చూస్తున్నారు. 1.పరమాత్మ పాలన యొక్క భాగ్య సితార 2. పరమాత్మ చదువు యొక్క భాగ్య సితార 3. పరమాత్మ వరదానాల యొక్క భాగ్యసితార. ఈ మూడు సితారలను సర్వుల మస్తకంలో చూస్తున్నారు. మీరు కూడా మెరిసే మీ భాగ్య సితారలను చూసుకుంటున్నారా? కనిపిస్తున్నాయా? ఇటువంటి శ్రేష్ట భాగ్యసితారలు విశ్వంలో ఎవరి యొక్క మస్తకంలో కనిపించవు. ఈ భాగ్య సితారలు అయితే అందరి మస్తకంలో మెరుస్తున్నాయి, కానీ మెరుపులో అక్కడక్కడ తేడా కనిపిస్తుంది. కొందరి మెరుపు చాలా శక్తివంతంగా ఉంది, కొందరి మెరుపు మధ్యమంగా ఉంది. భాగ్య విధాత బాబా పిల్లలందరికీ సమాన భాగ్యాన్ని ఇచ్చారు. ఎవరికీ విశేషంగా ఇవ్వలేదు. పాలన ఒకే విధంగా ఇచ్చారు, చదువు కూడా ఒకరి ద్వారానే చెప్తున్నారు. వరదానం కూడా అందరికీ ఒకే విధంగా లభించింది. విశ్వం అంతటి మూలమూలల్లో కూడా చదువు ఒక్కటే కదా! మురళీ ఒక్కటే, ఒకే తారీఖు మరియు ఒకే అమృతవేళలో చదువుకుంటారు. దేశాలను బట్టి కాలం మారవచ్చు కానీ అదే సమయం. ఇలా చదువు మరియు వరదానం, స్లోగన్ అన్నీ ఒకటే అయినా కానీ తేడా ఎందుకో ఆశ్చర్యం కదా! చదువులో తేడా ఏమైనా ఉంటుందా? అమెరికాలో చదువు మరియు లండన్లో చదువుకి తేడా ఉంటుందా? ఉండదు. మరి అయితే తేడా ఎందుకు వస్తుంది?
నలువైపుల అమృతవేళ అందరికీ ఒకే బాబా పాలన ఇస్తున్నారు. నిరంతర స్మృతి యొక్క విధి కూడా అందరికీ ఒకే విధంగా లభిస్తుంది, అయినా నెంబరు వారీగా ఎందుకు తయారవుతున్నారు? విధి ఒక్కటే కానీ సిద్ది లభించే విషయంలో తేడా ఎందుకు వస్తుంది? నలువైపుల ఉన్న పిల్లలపై బాప్ దాదాకి సమానమైన ప్రేమ ఉంది. పురుషార్థంలో చివరి నెంబరు అయినా కానీ బాప్ దాదా యొక్క ప్రేమ సమానంగానే ఉంటుంది. ఇంకా ప్రేమతో పాటు చివరి నెంబరు వారిపై దయ కూడా ఉంటుంది, వీరు తీవ్ర పురుషార్థం చేసి చివరి నుండి మొదటికి రావాలి అని. మీరందరు దూరదూరాల నుండి వచ్చారు, ఎలా వచ్చారు? పరమాత్మ యొక్క ప్రేమ ఆకర్షించి తీసుకువచ్చింది కదా! ప్రేమ అనే బంధనకి బందీ అయి వచ్చారు. అంటే అందరికీ బాప్ దాదాకి అందరిపై ప్రేమ ఉంది కదా! నాపై ప్రేమ ఉందో లేక తక్కువగా ఉందేమో అనే ప్రశ్న వస్తుందా? బాప్ దాదాకి పిల్లలందరిపై ఒకరి కంటే ఒకరిపై ఎక్కువ ప్రేమ ఉంది. ఈ పరమాత్మ ప్రేమయే పిల్లలందరి పాలనకి విశేష ఆధారం. ప్రతి ఒక్కరు ఏమని భావిస్తున్నారు? నాకు అందరి కంటే ఎక్కువగా బాబాపై ప్రేమ ఉంది అని భావిస్తున్నారా లేక ఇతరులకి ఎక్కువ, నాకు తక్కువగా ఉంది అంటారా? నాకే ఎక్కువ ప్రేమ ఉంది అని అంటారు కదా! అంటారు కదా! పాండవులకి ఉందా? ప్రతి ఒక్కరు నా బాబా అంటారు. సెంటర్ ఇన్చార్జి యొక్క బాబా, దాదీ యొక్క బాబా, జానకీ దాదీ యొక్క బాబా అని అనరు కదా! నా బాబా అంటారు. బాబా నా వాడు అన్నారు, మీరు నా వారు అని బాబా అన్నారు. నా బాబా అనే ఒకే మాట ద్వారా పిల్లలు బాబా వారిగా అయిపోయారు మరియు బాబా పిల్లల వారిగా అయిపోయారు. దీనిలో శ్రమ అనిపించిందా?" అనిపించిందా? కొంచెం కొంచెం శ్రమ చేశారా? లేదా? అప్పుడప్పుడు అనిపిస్తుందా? అనిపించటం లేదా? అనిపిస్తుంది. శ్రమ చేసి ఎలా అయిపోతున్నారు? అలసిపోతున్నారా? హృదయంతో మరియు ప్రేమతో నా బాబా అనండి, శ్రమ అనేది ప్రేమలోకి మారిపోతుంది. “నా బాబా” అనగానే బాబా దగ్గరకి మీ మాట చేరుకుంటుంది మరియు బాబా విశేష సహాయం చేస్తారు. కానీ హృదయంతో అనాలి. నోటితో కాదు. ఇది మనస్సు యొక్క వ్యాపారం. మనస్సుతో వ్యాపారం చేయటంలో తెలివైనవారు కదా! వ్యాపారం చేయటం వస్తుంది కదా! వెనుక కూర్చున్న వారికి వస్తుంది కదా! అందువలనే వచ్చారు కదా! కానీ అందరి కంటే దూరదేశి ఎవరు? అమెరికా వాళ్ళు దూరదేశీలా లేక బాబా దూరదేశీయా? అమెరికా అయితే ఈ ప్రపంచంలోనే ఉంది కానీ బాబా మరో ప్రపంచం నుండి వస్తున్నారు. కనుక అందరి కంటే దూరదేశి ఎవరు? అమెరికా దూరదేశం కాదు. అందరి కంటే దూరదేశి బాప్ దాదా. ఒకరు (బ్రహ్మబాబా) ఆకారి వతనం నుండి వస్తున్నారు, మరొకరు (శివబాబా) పరంధామం నుండి వస్తున్నారు. వాటి కంటే అమెరికా దూరమే కాదు.
కనుక ఈరోజు దూరదేశి బాబా ఈ సాకార ప్రపంచంలో దూరదేశి పిల్లలను కలుసుకుంటున్నారు. నషా ఉంది కదా! ఈరోజు బాబా మా కోసం వచ్చారు అనే నషా ఉంది కదా! భారతవాసీయులు అయితే బాబా వారే కానీ డబల్ విదేశీయులను చూసి బాప్ దాదా విశేషంగా సంతోషిస్తున్నారు. ఎందువలన? భారతదేశంలో అయితే బాబా అవతరించారు. అందువలన భారతవాసీయులకు ఇది విశేష నషా. కానీ డబల్ విదేశీయులపై ప్రేమ ఎందువలనంటే భిన్న భిన్న సంస్కృతులకు చెందిన వారు అయి ఉండి కూడా బ్రాహ్మణ సంస్కృతిలోకి పరివర్తన అయ్యారు. అయ్యారు కదా? ఇది భారతవాసీయుల సంస్కృతి, మాది వేరే సంస్కృతి అనే సంకల్పం రావటం లేదు కదా! బాప్ దాదా చూస్తున్నారు అందరూ ఒకే సంస్కృతికి చెందిన వారిగా అయిపోయారు. సాకార శరీరం ద్వారా భిన్న భిన్న దేశాలలో ఎక్కడ ఉన్నా కానీ ఆత్మ బ్రాహ్మణ సంస్కృతిలో ఉంటుంది కదా! డబల్ విదేశీయుల యొక్క ఒక విషయం బాప్ దాదాకి చాలా ఇష్టం అనిపిస్తుంది, అది ఏమిటో తెలుసా? (త్వరగా సేవ చేయటంలో నిమగ్నం అయిపోయారు) ఇంకా చెప్పండి! (ఉద్యోగం చేస్తారు మరియు సేవ కూడా చేస్తారు) అలాంటి వారు భారతదేశంలో కూడా ఉన్నారు. (ఏది జరిగినా కానీ సత్యతతో తమ బలహీనత చెప్పేస్తారు, స్పష్టవాదిగా ఉంటారు) మంచిది. బారతవాసీయులు స్పష్టవాదులు కాదా?
బాప్ దాదా ఏమి చూశారంటే దూరంగా ఉన్నా కానీ బాబాపై ప్రేమలో మెజారిటీ పాస్ అయిపోయారు. భారతదేశానికి భాగ్యం ఉండనే ఉంది. కానీ మీరు దూరంగా ఉంటూ కూడా బాబాపై ప్రేమలో అందరూ పాస్ అయిపోయారు. బాబాపై ప్రేమలో ఎవరికి అయినా శాతం ఉందా? 100 శాతం ప్రేమ ఉన్న వారు చేతులెత్తండి. 100 శాతం ఉందా? భారతవాసీయులు ఎత్తటం లేదు. భారతదేశానికి అయితే భాగ్యం లభించింది. బాబా భారతదేశంలో అవతరించారు. కనుక చాలా గొప్ప భాగ్యం. ఈ విషయంలో బాప్ దాదాకి అమెరికా ఇష్టం అనిపించలేదు. భారతదేశమే ఇష్టమనిపించి అవతరించారు. మీరు దూరంగా ఉన్నా కానీ ప్రేమలో మంచిగా ఉన్నారు. సమస్య వచ్చినా కానీ బాబా, బాబా అంటూ తొలగించుకుంటారు. ప్రేమలో అయితే బాప్ దాదా పాస్ చేసేశారు, ఇప్పుడిక దేనిలో పాస్ అవ్వాలి? అవ్వాలి కదా! అయ్యారు మరియు అవ్వాలి కూడా. వర్తమాన సమయ ప్రమాణంగా బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు అంటే స్వ పరివర్తన యొక్క శక్తిలో కూడా 100 శాతం పాస్ అవ్వాలి. ప్రేమ అనే శక్తిలో మీరు అందరు 100 శాతం అని చేతులెత్తారు కదా. అంతగానే స్వ పరివర్తనలో తీవ్ర వేగం ఉందా? ఈ విషయంలో సగమే చేయి ఎత్తుతారా లేక పూర్తిగా ఎత్తుతారా? ఎలా ఎత్తుతారు? పరివర్తన అవుతున్నారు కానీ సమయం పడుతుంది. సమయం యొక్క సమీపత అనుసారంగా స్వ పరివర్తన యొక్క శక్తి ఎంత తీవ్రంగా ఉండాలి అంటే కాగితంలో బిందువు పెట్టడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం పట్టాలి. బిందువు పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? సెకను కూడా పట్టదు. అవును కదా! మరి అటువంటి తీవ్ర వేగం స్వ పరివర్తనలో ఉందా? దీనిలో సగమే చేతులెత్తుతారు. సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది కనుక స్వ పరివర్తన యొక్క శక్తి కూడా ఇంత వేగంగానే ఉండాలి. పరివర్తన అనే మాట చెప్తున్నప్పుడు పరివర్తన ముందు స్వ అనే పదాన్ని స్మృతిలో ఉంచుకోండి. కేవలం పరివర్తన కాదు, స్వ పరివర్తన. బాప్ దాదాకి జ్ఞాపకం ఉంది, పిల్లలు ఒక సంవత్సరంలో సంస్కారాల పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. జ్ఞాపకం ఉందా? సంస్కారాల పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన అనే సంవత్సరాన్ని జరుపుకున్నారు. విశ్వం యొక్క వేగం అతిలోకి వెళ్తుంది. కానీ సంస్కారాల యొక్క వేగం ఇంత తీవ్రంగా ఉందా? సాధారణ రూపంగా కూడా విదేశీయులు వేగంగా ఉంటారు. వేగంగా చేస్తారు. మరి సంస్కారాల పరివర్తన అనే విషయంలో వచ్చేస్తుంది కదా? ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు దాని ఓహో! ఓహో అని పరివర్తన చేసుకోండి. ఎవరు ఏమి చేసినా, చెప్పినా ఓహో, ఓహో డ్రామా ఓహో అనుకోండి. వీరు ఎందుకు చేశారు, వీరు ఎందుకు అన్నారు అనకండి. వీరు చేస్తే నేను చేస్తాను అని కూడా అనకండి.
ఈరోజుల్లో బాప్ దాదా ఒక విషయం చూశారు, చెప్పమంటారా? పరివర్తన చేసుకోవాలి కదా! భారతదేశంలో మరియు విదేశంలో రెండు వైపుల ఒక విషయం యొక్క అల ఉంది అది ఏమిటి? ఇది అవ్వాలి, ఇది కావాలి, ఇది వీరు చేయాలి ...... నేను ఏదైతే ఆలోచిస్తానో లేదా అంటున్నానో అది జరగాలి .... ఇలా కావాలి, అవ్వాలి అనే సంకల్పాలు మనస్సులో ఏవైతే ఉన్నాయో అవి వ్యర్థ సంకల్పాలు. వ్యర్థ సంకల్పాలు సమర్థంగా కానివ్వవు. అందరి యొక్క కొద్ది సమయం యొక్క వ్యర్థ చార్టుని బాప్ దాదా గమనించారు. పరిశీలించారు. బాప్ దాదా దగ్గర చాలా శక్తివంతమైన యంత్రాలు ఉన్నాయి. మీ యొక్క కంప్యూటర్ వంటివి కావు. మీ యొక్క కంప్యూటర్ అయితే అపశబ్దాలను కూడా ఇస్తుంది. కానీ బాప్ దాదా దగ్గర చాలా వేగవంతమైన పరిశీలనా పరికరాలు ఉన్నాయి. బాప్ దాదా చూశారు, ఎక్కువ మందికి మధ్య మధ్యలో వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి. వ్యర్థ సంకల్పాల యొక్క బరువు ఎక్కువ అయిపోతుంది, సమర్థ సంకల్పాల యొక్క బరువు తక్కువ అయిపోతుంది. మధ్యమధ్యలో నడిచేది కనుక అది తన వైపుకి లాక్కుంటుంది. అందువలన శుభసంకల్పాలు స్వ ఉన్నతికి లిఫ్ట్ లాంటివి. మెట్లు కాదు, లిఫ్ట్. శుభ సంకల్పాలు తక్కువగా ఉన్న కారణంగా శ్రమ అనే మెట్లు ఎక్కవలసి వస్తుంది. కేవలం రెండు మాటలను జ్ఞాపకం ఉంచుకోండి - వ్యర్థాన్ని సమాప్తి చేసేటందుకు అమృతవేళ నుండి రాత్రి వరకు రెండు మాటలను సంకల్పం, మాట, కర్మలోకి తీసుకురండి, కార్యంలో ఉపయో గించండి. ఆ రెండు మాటలు - స్వమానం మరియు సన్మానం. స్వమానంలో ఉండాలి మరియు సన్మానం (గౌరవం) ఇవ్వాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ మనం గౌరవించాలి. మరియు స్వమానంలో స్థితులవ్వాలి. అప్పుడప్పుడు స్వమానంలో ఎక్కువగా ఉంటున్నారు, అప్పుడు గౌరవం ఇవ్వటంలో లోపం వచ్చేస్తుంది. వారు గౌరవం ఇస్తే నేను గౌరవం ఇస్తాను అని అనుకోకండి. నేను దాతగా అవ్వాలి అనుకోండి. శివశక్తి పాండవసేన అయిన మీరు దాత యొక్క పిల్లలు, దాతలు. వారు ఇస్తే నేను ఇస్తాను అంటే కూడా వేగంగా ఉన్నారా అని బాబా అడుగుతున్నారు. కనుక స్వ పరివర్తన యొక్క వేగాన్ని బాప్ దాదా ఇప్పుడు తీవ్రంగా చూడాలనుకుంటున్నారు. బాప్ దాదా ఏమి కోరు కుంటున్నారు అని అందరు అడుగుతున్నారు కదా! పరస్పర ఆత్మిక సంభాషణలో కూడా బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు అని అనుకుంటున్నారు కదా! కనుక బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు. సెకనులో బిందువు పెట్టినంత సహజంగా మరియు దాని కంటే తీవ్రంగా అయదార్థతని తొలగించి పరివర్తనను తీసుకురావాలి. బిందువు పెట్టడం వస్తుందా? వస్తుంది కదా! కానీ అప్పుడప్పుడు అది ప్రశ్నార్థకం అయిపోతుంది. పెట్టడం అయితే బిందువే పెడుతున్నారు కానీ అది ప్రశ్నార్థకం అయిపోతుంది. ఇది ఎందుకు? ఇది ఏమిటి? ఇలా ఎందుకు, ఏమిటి..... అనేవి బిందువుని ప్రశ్నార్థకంలోకి మార్చేస్తున్నాయి. బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - అయ్యో! అయ్యో! అనకండి, ఓహో! ఓహో!! అనండి లేదా ఎగిరిపోండి, ఎందుకు, ఎందుకు అనకండి. ఎందుకు అని ప్రశ్నించటం త్వరగా వస్తుంది కదా! అది వ్యాపారం అయ్యింది కదా! దాత అయినట్లు కాదు కదా! మీరు వ్యాపారులా లేక దాతలా? దాతలు ఎప్పుడూ తీసుకోరు. నేను చేయాలి కానీ ఇతరులు కాదు అనేది సదా వృత్తి మరియు దృష్టిలో ఉంచుకోండి. నేను సదా ప్రతి ఆత్మ పట్ల వారు ఆజ్ఞాని అయినా, జ్ఞాని అయినా శుభ భావన ఉంచుకోవాలి అని. అజ్ఞాని ఆత్మల పట్ల శుభభావన ఉంచుకుంటున్నారు కానీ జ్ఞాని ఆత్మల పట్ల సదా శుభ భావన, శుభకామన పెట్టుకోవాలి. వృత్తి మరియు దృష్టి ఈ విధంగా తయారైపోవాలి. స్థూలమైన కంటిలో కనుగ్రుడ్డు లేకపోతే ఏమౌతుంది? చూడగలరా? ఎలా అయితే కంటిలో కనుగ్రుడ్డు ఉంటుందో అదేవిధంగా దృష్టిలో సదా ఆత్మ మరియు బాబా యొక్క బిందు రూపం నిండి ఉండాలి. కన్నుల ద్వారా చూసే గ్రుడ్డు ఎప్పుడూ మాయం అవ్వదో అదేవిధంగా ఆత్మ మరియు బాబా స్మృతి యొక్క బిందువు వృత్తి మరియు దృష్టి నుండి మాయం అవ్వకూడదు. తండ్రిని అనుసరించాలి కదా! బాబా యొక్క దృష్టి మరియు వృత్తిలో ప్రతి పిల్లవానికి స్వమానం ఉంటుంది మరియు గౌరవం ఉంటుంది. అదేవిధంగా మీ దృష్టి మరియు వృత్తిలో కూడా స్వమానం మరియు సన్మానం. వీరు మారాలి, ఇది చేయకూడదు, వీరు ఇలా ఉన్నారు..... అనుకుంటున్నారు కదా! కానీ అది శిక్షణ ద్వారా జరుగదు. గౌరవాన్ని ఇస్తే ఇలా జరగాలి, వీరు మారాలి, వీరు ఇలా చేయాలి అని మీ మనస్సుకి ఎలా అనిపిస్తుందో అలా వారు చేయటం మొదలు పెడతారు. వృత్తి ద్వారా మారతారు కానీ మాటల ద్వారా మారరు. కనుక ఏమి చేస్తారు? స్వమానం మరియు సన్మానం రెండూ జ్ఞాపకం ఉంటాయి కదా! లేక కేవలం స్వమానమే జ్ఞాపకం ఉంటుందా? గౌరవం ఇవ్వటం అంటే గౌరవాన్ని తీసుకోవటం. ఎవరికైనా గౌరవాన్ని ఇవ్వటం అంటే గౌరవనీయంగా అవ్వటం. ఆత్మిక ప్రేమకి గుర్తు - ఇతరుల లోపాన్ని మీ శుభ భావన, శుభ కామన ద్వారా పరివర్తన చేయాలి. బాప్ దాదా అంతిమ సందేశం కూడా పంపిచారు - వర్తమాన సమయంలో మీ స్వరూపం దయాహృదయంగా తయారు చేస్కోండి. అంతిమ జన్మలో కూడా మీ జడ చిత్రాలు దయా సాగరులుగా అయి భక్తులపై దయ చూపిస్తున్నాయి. చిత్రమే ఇంత చయ స్వరూపం ఉంటే చైతన్యం అయిన వారు ఎంతగా ఉండాలి? చైతన్యమైన మీరు దయా ఖజానాలు. దయా ఖజానాగా అవ్వండి. ఎవరు వచ్చినా దయ చూపించాలి, ఇదే ప్రేమకి గుర్తు. చేయాలి కదా? లేక కేవలం వినటమేనా? చేయాల్సిందే మరియు తయారవ్వాల్సిందే. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు అనే ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాను. మీరు ప్రశ్నిస్తున్నారు కదా! కనుక బాప్ దాదా జవాబు ఇస్తున్నారు.
ఎన్నో దేశాల నుండి వచ్చారు, బాప్ దాదాకి చాలా సంతోషం ఉంది. భిన్న భిన్న దేశాల నుండి మధువనం వచ్చారు. బాప్ దాదా గత సంవత్సరం మీకు ఒక పని ఇచ్చారు, జ్ఞాపకం ఉందా? ఉందా జ్ఞాపకం? ఎవరికి జ్ఞాపకం ఉంది? పాండవులకా, శక్తులకా? ఈ సంవత్సరం వారసులను లేదా మైకను తయారుచేయండి అని చెప్పారు, సంవత్సరం పూర్తి అయిపోయింది కనుక వారసులను మరియు మైక్ వంటి వారిని బాప్ దాదా ఎదురుగా తీసుకురావాలి. ఎంతమంది వారసులను తయారు చేశారు? ఆస్ట్రేలియా వారు చెప్పండి. ఎంతమంది వారసులు వచ్చారు? అమెరికా నుండి ఎంత మంది వారసులు వచ్చారు? మైక్ తయారవుతూ ఉన్నారా? బాబా ఎదురుగా రాలేదా? మీరు వచ్చేశారు కానీ మైక్ మరియు వారసులను తీసుకురాలేదు. వచ్చారా? క్రొత్త వారసులు ఏ దేశం నుండి వచ్చారు? పాతవారు అయితే ఉండనే ఉన్నారు. ఏ దేశం వారైనా చేతులెత్తండి. ఎన్ని దేశాల నుండి వచ్చారు? (ఒక అక్కయ్య వచ్చారు) వీరు వారసులుగా అయి వచ్చారా! శుభాకాంక్షలు. చాలా మంచిది. ఏ దేశం నుండి వచ్చారు? (కొలంబియా) ఇంకా ఎక్కడి నుండి వచ్చారు? (బ్రెజిల్ నుండి ఒకరు వచ్చారు) శుభాకాంక్షలు. ఇంకా ఎక్కడ నుండి వచ్చారు? (కెనడా, ఆర్జెంటీనా, హాంగ్ కాంగ్, అమెరికా, న్యూజిలాండ్, జర్మనీల నుండి వచ్చారు) చాలా మంచిది, శుభాకాంక్షలు. హాంగ్ కాంగ్ నుండి నలుగురు వచ్చారు. మంచిది, పక్కా వారసులేనా? మంచిది, బ్రాహ్మణులుగా అయి వచ్చారు. చాలా మంచిగా సేవలో వృద్ధి చేశారు. చాలా మంచిది. వర్తమాన సమయంలో సేవలో బాగా వృద్ధి జరుగుతుంది. భారతదేశంలో మరియు విదేశాలలో కూడా అవుతుంది. కానీ బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు అంటే విశేష కార్యం చేసి చూపించే నిమిత్త ఆత్మను ఎవరొకరిని తయారు చేయండి. ఇప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేసి చూపించే సహయోగి ఆత్మను తయారుచేయండి. చాలా కార్యక్రమాలు చేశారు, ఎక్కడ ఏ కార్యక్రమాలు చేశారో వారందరికీ బాప్ దాదా ధన్యవాదములు చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా నవీనతను చూపించండి. మీ వైపు నుండి మీ సమానంగా వారు బాబాని ప్రత్యక్షం చేయాలి. ఇది పరమాత్ముని చదువు అని నోటి నుండి రావాలి. బాబా, బాబా అనే మాట హృదయం నుండి రావాలి. సహయోగిగా అయితే అవుతున్నారు కానీ ఒక్కరే, ఒక్కరే, ఒక్కరే అనే ధ్వని వ్యాపించాలి. బ్రహ్మకుమారీలు మంచి పని చేస్తున్నారు మరియు చేయగలరు అనే వరకు వచ్చారు. కానీ ఇది ఒక్కటే, పరమాత్మ యొక్క జ్ఞానం అని చెప్పాలి. బాబాని ప్రత్యక్షం చేసేవారు నిర్భయంగా మాట్లాడాలి. పరమాత్మ కార్యం చేయిస్తున్నారు. ఇది పరమాత్మ యొక్క కార్యం అని మీరు చెప్తున్నారు కానీ ఏ పరమాత్మను అయితే అందరూ పిలుస్తున్నారో ఆ పరమాత్ముని జ్ఞానం ఇది అని వారు చెప్పాలి. ఇప్పుడు ఈ అనుభవం చేయించండి. మీ మనస్సులో ప్రతి సమయం ఏమి ఉంటుంది? బాబా, బాబా, బాబా అనే మాట...... ఇలా వారికి కూడా స్మృతి ఉండే గ్రూపు తయారయ్యారా? మంచిగా చేస్తున్నారు, చేయగలరు ఇంతవరకు సరే. పరివర్తన జరిగింది. కానీ అంతిమ పరివర్తన - ఒక్కరే, ఒక్కరే, ఒక్కరే. అది ఎప్పుడు జరుగుతుంది అంటే బ్రాహ్మణ పరివారం ఏకరసస్థితి గల వారిగా తయారు అయినప్పుడు. ఇప్పుడు స్థితి మారుతూ ఉంది, ఏకరస స్థితియే ఒకనిని ప్రత్యక్షం చేస్తుంది. సరేనా! కనుక డబల్ విదేశీయులు ఉదాహరణగా అవ్వండి. నెంబరు పొందండి. మోహజీత్ పరివారం యొక్క కథ చెప్తారు కదా! వాళ్ళ నౌకర్లు అందరూ మోహజీతులు అని చెప్తారు. అలా ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా ప్రతి దేశంలో ఏకరస స్థితి, ఏకమతం. స్వమానంలో ఉండేవారు మరియు సన్మానం ఇచ్చేవారు ఉండాలి. దీనిలో నెంబరు తీస్కోండి. తీసుకోగలరు కదా? తీస్కోండి. నెంబరు తీసుకోవాలా? నెంబరు తీసుకుని చూపిస్తే బాబా రెండవసారి వస్తారు. కానీ ఫలితం చూసినప్పుడే. చప్పట్లు కొట్టండి కానీ ఫలితం చూస్తాను. మంచిది. అందరూ ఎగురుతున్నారు కదా! ఎగిరేకళ గలవారు కదా! పైకి, క్రిందకి దిగకండి, అలసిపోతారు. ఎగురుతూ ఉండండి మరియు ఎగిరింపజేయండి. మంచిది.
బాప్ దాదా చూశారు - ఇక్కడికి రానటువంటి పిల్లలు ప్రియస్మృతులు పంపారు. ఉత్తరాలు కూడా చాలా మంది పంపారు. దూరంగా కూర్చుని కూడా చూస్తున్నారు. కానీ బాబా అంటున్నారు వారు దూరంగా లేరు, హృదయంలో ఉన్నారు. అన్నింటికంటే సమీపమైనది మనస్సు కదా! అందువలన ఎక్కడ కూర్చున్నా కానీ చూడకపోతున్నా కానీ మనస్సుతో చూస్తున్నారు. సాధనాల ద్వారా చూడలేనివారు మనస్సుతో చూడగలరు కదా! ఇలా మనస్సుతో చూసేవారు, దూరంలో ఉన్న వారు అందరూ బాప్ దాదా యొక్క హృదయ సింహాసనంపై ఉన్నారు. మనస్సుతో ప్రియస్మృతులు పంపారు, తమ సమాచారం పంపారు. కనుక బాప్ దాదా కూడా అందరికీ ప్రియస్మృతులతో పాటూ వరదానం కూడా ఇస్తున్నారు - జరిగిపోయిందేదో జరిగిపోయింది అని బిందువు పెట్టేయండి. బిందువుగా అయ్యి బిందువైన బాబాని జ్ఞాపకం చేయండి. ఇక్కడికి పంపిన సమాచారం మరియు ప్రియస్మృతులకి బాప్ దాదా జవాబు ఇస్తున్నారు. మొదటి అవకాశం డబల్ విదేశీయులు తీసుకున్నారు. కనుక మొదటి నెంబరులోకి కూడా రావాలి. బాప్ దాదా సంతోషిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా తండ్రిని అనుసరించి సదా సంతోషంగా ఉండండి. మంచిది. ఇలా బాబా యొక్క సయనాలలో లీనమైపోయిన నలువైపుల ఉన్న నయన రత్నాలకు, సదా ఏకరస స్థితిలో స్థితులయ్యే పిల్లలకు, సదా భాగ్య సితార మెరుస్తూ ఉండే భాగ్యవంతులైన ఆత్మలకు, సదా స్వమానం మరియు సన్మానం రెండింటినీ వెనువెంట ఉంచుకునే పిల్లలకు, సదా తీవ్ర వేగవంతమైన పురుషార్థం చేసే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు నమస్తే. స్వ ఉపకారిగా అయ్యి అపకారికి కూడా ఉపకారం చేయండి.
Comments
Post a Comment