14-12-1997 అవ్యక్త మురళి

                        14-12-1997         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వ్యర్థం మరియు వ్యతిరేకాన్ని తొలగించుకుని అవార్డు పొందే యోగ్యులుగా అవ్వండి.


ఈరోజు బాప్ దాదా పరమాత్మ ప్రేమకి పాత్రులైన తన పిల్లలను చూస్తున్నారు. పరమాత్మ ప్రేమ యొక్క ఆనందమయ ఊయలలో సదా ఊగుతూ ఉంటున్నారు. పరమాత్మ ప్రేమ అనేక జన్మల దు:ఖాన్ని ఒక సెకనులో సమాప్తి చేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వశక్తి సంపన్నమైనది, నిర్భల ఆత్మలను శక్తిశాలిగా తయారుచేస్తుంది. ఈ విధమైన పరమాత్మ ప్రేమకి ఇంత కొద్దిమంది ఆత్మలే పాత్రులు. ఈవిధమైన శ్రేష్ట పాత్రులైన పిల్లలను బాప్ దాదా చూసి సంతోషిస్తున్నారు. బాబా ఎలాగైతే సంతోషపడుతున్నారో అలాగే పిల్లలు కూడా సంతోష పడుతున్నారు. కానీ నెంబర్ వారీ. బాప్ దాదా ప్రతి ఒక బిడ్డకి మనస్సుతో వరదానం ఇస్తున్నారు - సదా పరమాత్మ ప్రేమ యొక్క ఊయలలో ఊగే అవినాశి రత్నభవ! ఈ ప్రేమ యొక్క ఊయల నుండి మనస్సు అనే పాదాన్ని క్రింద పెట్టకండి. ఎందుకంటే మొత్తం విశ్వ ఆత్మలలో పరమాత్మకి గారాభమైన, ప్రియమైన పిల్లలు, బాప్ దాదా ఈ పిల్లలకే ఆశీర్వాదం ఇస్తున్నారు - ఈ పరమాత్మ ప్రేమలో లవలీనం అయ్యి ఉండండి. ఇలా లవలీనం అయిన ఆత్మల దగ్గర ఏ పరిస్థితి లేదా అలజడి రాలేదు. పాదం క్రింద పెడుతున్నారు కనుకనే మాయ కూడా రకరకాల ఆటలు ఆడడానికి వస్తుంది. రకరకాల రూపాలను ధరించి ఆకర్షిస్తుంది. లవలీన ఆత్మల సర్వశక్తుల ముందు మాయ తలెత్తి కూడా చూడలేదు. మీ యొక్క మూడవనేత్రం, జ్వాలాముఖి నేత్రం మాయని శక్తి హీనంగా చేసేస్తుంది. మీరందరూ విశేష ఆత్మలు, బ్రాహ్మణ ఆత్మలందరికీ జన్మతోనే మూడవనేత్రం లభించింది. కానీ బాబా చూస్తున్నారు - అప్పుడప్పుడు పిల్లల యొక్క మూడవనేత్రం చాలా పురుషార్ధం యొక్క శ్రమ చేసి చేసి అలసిపోతుంది, అలసిపోయిన కారణంగా అది నేత్రం మూసుకుపోతుంది. మాయకు కూడా చూసేటువంటి నేత్రం దూరదేశీగా ఉంటుంది. దూరం నుండే చూసేస్తుంది. ఇప్పుడు మాయకి కూడా అర్థం అయిపోయింది ఇప్పుడిక నా రాజ్యం పోయింది అని. అందువలన మాయతో భయపడకండి. సంతోషంగా, సర్వశక్తుల ఆధారంగా మాయకి వీడ్కోలు ఇవ్వండి. వచ్చే అవకాశం ఇవ్వకండి. అది కూడా బ్రాహ్మణ ఆత్మలతో, శ్రేష్ట ఆత్మలతో యుద్ధం చేసి, చేసి అలసిపోయింది. మీరు స్వయం బలహీనంగా ఉన్న కారణంగా మాయని ఆహ్వానం చేస్తున్నారు, అది అలసిపోయింది. కానీ మీరు ఆహ్వానం చేయటం వలన అది అవకాశం తీసుకుంటుంది. ఇప్పుడు శక్తిహీనంగా అయిపోయింది. మీరందరు అనుభవం ఏమి చెప్తున్నారు? ఇప్పుడు మాయకి ఆదిలో ఉన్నంత శక్తి ఉందా? దానిలో శక్తి ఉందా లేక మీరు శక్తిశాలియా? అది ప్రయత్నం అయితే చేస్తుంది, మీరు అవకాశం ఇస్తే అది మాత్రం ఎందుకు తీసుకోదు! ఎందుకు బలహీనంగా అయిపోతున్నారు? బాబాకి ఈ ప్రశ్న వచ్చింది - మీరు మాస్టర్ సర్వశక్తివంతులేనా, కాదా? అందరూ మాస్టర్ సర్వశక్తివంతులేనా? అప్పుడప్పుడు సర్వశక్తివంతులా లేక సదా సర్వశక్తివంతులా? ఏమిటి? సదా శక్తిశాలియేనా? మాయకు చెప్పనా - ఇప్పుడు రమ్మని! మీరు దానిని పిలవకండి. బాబా మాయకి చెప్తున్నారు, సమాప్తి అయిపో అని. కానీ మాయ చెప్తుంది నన్ను ఆహ్వానం చేస్తున్నారు అని. కనుక బాబా ఏమి చేస్తారు? ఒకవేళ ఏ రకంగా అయినా మనస్సులో అయినా, వాచాలో అయినా, సంబంధ, సంపర్కాలలో అయినా బలహీనత వస్తే మాయని ఆహ్వానం చేసినట్లే. దానికి కూడా ఆహ్వానం యొక్క తరంగాలు త్వరగా చేరిపోతాయి. ఈ మహా ఉత్సవాన్ని చాలా బాగా జరుపుకుంటున్నారు. కానీ ఉత్సాహం సదా ఉండాలి. అందువలనే ఉత్సవం జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం చాలా ఉత్సవాలు జరుపుకుంటున్నారు కదా? (ఈ గ్రూప్ లో ఈశ్వరీయ సేవ యొక్క ఆది రత్నాలైన అన్నయ్యల యొక్క సమారోహం మరియు టీచర్స్ యొక్క సిల్వర్ జూబ్లీ కార్యక్రమం జరుగుతుంది) ప్రతి గ్రూప్ కి ఉత్సవం జరుగుతుంది అంటే బాప్ దాదా ఈ సంవత్సరం ఉత్సవం జరపటం అంటే మాయకి వీడ్కోలు ఇవ్వటం అని భావిస్తున్నారు. కేవలం గోల్డెన్ చున్నీ ధరించి కూర్చోవటం కాదు. గోల్డెన్ చున్నీ వేసుకోవటం అంటే గోల్డెన్ యుగాన్ని తీసుకురావటం. దృశ్యం చాలా బావుంది. కానీ గోల్డెన్ చున్నీ ధరించినంత సేపు ఆనందంగా ఉండి తర్వాత సమాప్తి అయిపోవటం కాదు. సదా గోల్డెన్ స్థితి యొక్క చున్నీ ధరించి ఉండాలి. ఉత్సాహం ఇప్పించే ఫంక్షన్ ఇది. ఎవరైతే ఉత్సవం జరుపుకున్నారో, జరుపుకోవడానికి వచ్చారో వారు చేతులు ఎత్తండి. బాప్ దాదా చాలా సంతోషిస్తున్నారు. మంచిగా జరుపుకోండి కానీ జరుపుకోవటం అంటే తయారవ్వటం మరియు ఇతరులను తయారుచేయటం. ఉత్సవం జరుపుకునే సమయంలో ఇదే స్మృతిలో ఉంచుకోండి, అండర్‌లైన్ చేసుకోండి - "సదా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండే ఆత్మను నేను”. బాప్ దాదాకి కూడా దృశ్యం మంచిగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం బాప్ దాదా మాయకి వీడ్కోలు ఇచ్చే సంవత్సరంగా జరుపుకోవాలి అనుకుంటున్నారు. ఇలా ఉత్సవం జరుపుకుంటున్నారు కదా? నిన్న జరుపుకున్నట్లే జరుపుకుంటారా? సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటారు కదా? గోల్డెన్ జూబ్లీ అయినా, సిల్వర్ జూబ్లీ అయినా ఉత్సవమే కదా? మేము సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటున్నాము, మొదట గోల్డెన్ జూబ్లీ వారు తయారవుతారు తర్వాత మేము తయారవుతాము అనుకోకండి. అలాగే ఉత్సవం జరుపుకోని ఆత్మలు బాప్ దాదా ఉత్సవం జరుపుకునే పిల్లలకు చెప్తున్నారు అని అనుకోకండి. అందరి కోసం చెప్తున్నాను. బ్రాహ్మణ జీవితం యొక్క ఉత్సవం అయితే జరుపుకున్నారు కదా! బ్రాహ్మణులుగా అయితే అందరూ అయిపోయారు లేక బ్రాహ్మణులుగా కూడా అవ్వాలా? అయిపోయారు కదా! కనుక బ్రాహ్మణ జన్మ యొక్క ఉత్సవం జరుపుకునేవారు అంటే సదా ఉత్సాహంలో ఉండాలి, ఇతరులను ఉత్సాహంలోకి తీసుకురావాలి. ఇదే బ్రాహ్మణుల వ్యాపారం. అక్కడ బ్రాహ్మణులు అయితే నోటితో కథ చెప్తారు. మీరు నోటితో మాట్లాడినా ఉత్సాహం ఇచ్చే మాటలు మాట్లాడతారు. ఎలాంటి ఆత్మ అయినా, విరోధి ఆత్మ అయినా, బ్రాహ్మణుల పని ఏమిటంటే ఉత్సాహంతో నిండిన కథ వినిపించాలి. ఎందుకంటే అన్ని కర్మల ఖాతాలు ఇక్కడే పూర్తి చేసుకోవాలి. కనుక ఎటువంటి ఆత్మకైనా ఉత్సాహంతో నిండిన విషయాలు వినిపించాలి. వారు ఏడుస్తుంటే వారిని మీరు ఉత్సాహంలోకి తీసుకురావాలి. ఎవరికైనా మనస్సులో ఉత్సాహం ఉంటే ఏమి చేస్తారు? పాదాలు నాట్యం చేస్తాయి. ఇప్పుడు ఫంక్షన్ చేసుకుంటున్నారు కదా, చివరిలో ఏమి చేస్తారు? అందరూ నాట్యం చేస్తారు కదా? ఇది పాదాల నాట్యం. కానీ ఉత్సాహంలో ఉండటం, ఉత్సాహం ఇవ్వటం అనేది బ్రాహ్మణులు తప్ప ఎవరూ చేయలేరు. ఈ సంవత్సరంలో బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ఉత్సాహం తొలగించే విషయాలు వస్తాయి మరియు రావచ్చు కూడా. కానీ జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించండి. ఇప్పటినుండి ఎలాంటి ఆత్మలు సంబంధ, సంపర్కంలో ఉన్నా, వ్యతిరేకం చేసేవారైనా, ఎదుర్కునే వారైనా, బ్రాహ్మణ జీవితాన్ని చలింపచేసేవారైనా, కానీ ఈ సంవత్సరంలో వ్యతిరేకత మరియు వ్యర్థం యొక్క దృష్టి సమాప్తం చేయండి. స్నేహం, శక్తి ఇవ్వండి. ఒకవేళ స్నేహం, శక్తి ఇవ్వలేకపోతే వ్యర్థం మరియు వ్యతిరేక విషయాలు వింటూ మనస్సులో ధారణ చేయకుండా వాటిని తొలగించుకోండి. మనస్సు, బుద్ధిలో ధారణ చేయకూడదు, తొలగించుకోవాలి, పరివర్తన చేసుకోండి. వ్యతిరేకాన్ని, వ్యర్థాన్ని పరివర్తన చేసుకుని మనస్సుతో ఇముడ్చుకోండి. ఇలా ఈ రెండు విషయాలు తొలగించుకున్నవారికి బాప్ దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా అవార్డ్ లభిస్తుంది. ఇతర ఆత్మలకైతే అవార్డ్ ఇచ్చేవారు ఉంటారు కానీ ఇది పరమాత్మ అవార్డ్. కనుక వాటిని తొలగించుకుని అవార్డ్ తీసుకోండి. ధైర్యం ఉందా? మంచిది! 

పాండవులు ఎవరైతే ఫంక్షన్ జరుపుకుంటున్నారో వారికి ధైర్యం ఉందా? అవార్డ్ తీసుకుంటారా? అందరు చేతులు ఎత్తారు, ఈ రోజు తారీఖు నోట్ చేసుకోండి. ఈరోజు తారీఖు ఏది? (14 డిసెంబర్) ప్రతి నెల 14వ తారీఖున పరిశీలించుకోండి. మంచిది - సిల్వర్‌ జూబ్లీ వారిలో అవార్డ్ తీసుకునేవారు చేతులు ఎత్తండి! అలా కనిపించనట్లు ఎత్తకండి. సిగ్గుతో ఎత్తకండి! బాప్ దాదా అవకాశం ఇస్తున్నారు, ఎవరికైనా ధైర్యం లేకపోతే ఎత్తకండి. ఏమి పర్వాలేదు. బాప్ దాదా మరింత శక్తినిస్తారు, దీనిలో ఏమి లేదు. కొద్దిగా ధైర్యం కావాలి అని ఎవరైనా భావిస్తున్నారా? సిల్వర్ జూబ్లీ టీచర్స్ ఎవరైనా ఇలా ఉన్నారా? ఒకవేళ సిగ్గుతో ఇక్కడ చేతులు ఎత్తకపోయినా, తర్వాత వ్రాసి ఇవ్వండి. ఫంక్షన్ జరుగుతుంది కదా అప్పుడు ఇవ్వండి, ధైర్యం కావాలి అన్నవారికి విశేష ట్యూషన్ పెడతాను. చదువులో బలహీనంగా ఉన్నవారికి ఏమి చేస్తారు? ట్యూషన్ పెడతారు కదా? మంచిది! మధువనం వారు చేతులు ఎత్తండి? మధువనం వారు అవార్డ్ తీసుకుంటారా? అందరూ ఎత్తారా? ట్యూషన్ అవసరం లేదా? తెలివైనవారు. మంచిది - బాప్ దాదా లెక్క తీస్తారు. మధువనం వారికి శుభాకాంక్షలు. కోనకోనల నుండి స్నేహి, సహయోగి, సంబంధంలో ఉండే క్రొత్త, పాత పిల్లలు ఎవరైతే వచ్చారో వారికి బాప్ దాదా మొదట వచ్చినందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు, రెండు మర్యాదలలో నడుస్తున్నందుకు కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. కొంతమంది చతురులు కూడా ఉంటారు కానీ ఎక్కువమంది మర్యాదలు పాలన చేసేవారే. ప్రవృత్తిలో ఉంటూ మర్యాదలలో నడిచేవారికి, మర్యాదలలో ఉండేవారికి మర్యాద యొక్క శుభాకాంక్షలు. 

మంచిది - మాతలు మేము మాయకి వీడ్కోలు ఇస్తాము అని దైర్యం పెట్టుకుంటున్నారా? ఒకవేళ అవును అంటే ఒక చేతితో చప్పట్లు కొట్టండి (చేతులు ఉపటం). మంచిది - ప్రవృత్తిలో ఉండే పాండవులకు ధైర్యం ఉందా? అవార్డ్ తీసుకుంటారా? ఒక చేతితో చప్పట్లు కొట్టండి. బాప్ దాదాకి కూడా సంతోషంగా ఉంది. బేహద్ హాల్ కదా! బేహద్ నషా ఎక్కుతుంది. విశ్రాంతిగా కూర్చునే స్థలం ఉంది కదా? దూరం నుండి చూడలేకపోతున్నాము అని నిందిస్తున్నారు. కానీ ఇప్పుడైతే ఇంకా విశ్రాంతిగా కూర్చుని వింటున్నారు, టి.విలో చూస్తున్నారు. 9 లక్షలమంది తయారైపోతే ఏం చేస్తారు? అప్పుడు కూర్చోవడానికి స్థలం లభిస్తుందా? అందువలన ఎవరు ఎంత ముందు వచ్చారో అంత భాగ్యవంతులు. ఎలా అయితే మీరు ఇప్పుడు మొదటి వారి మహిమ చేస్తున్నారు కదా! మీరు చాలా మంచివారు అని అదేవిధంగా అంతిమంలో వచ్చేవారు మీరు చాలా అదృష్టవంతులు అని మీ మహిమ చేస్తారు. వృద్ధి అయితే అవుతుంది కదా? లేకపోతే రాజధాని ఎలా తయారవుతుంది? 

ఈ సంవత్సరం వీడ్కోలు మరియు శుభాకాంక్షలు యొక్క సంవత్సరం. మరియు ఈ సంవత్సరంలో ఏ పిల్లలైతే సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చిన వారికి బాప్ దాదా యొక్క ఎగస్ట్రా సహయోగం లభిస్తుంది. మధ్యమధ్యలో డ్రామా పేపర్ తీసుకుంటుంది కానీ సంకల్పంలో ధృడత ఉండాలి. సంకల్పరూపి పాదం కదలకూడదు. అచంచలంగా ఉంటే కనుక బాప్ దాదా యొక్క ఎగస్ట్రా సహాయం అనుభవం అవుతుంది. కేవలం తీసుకునే శక్తి ఉండాలి. ఒకే బలం, ఒకే నమ్మకం..... ఏది ఏమైనా తయారవ్వవలసిందే అనే సంకల్పరూపీ పాదం కదలకూడదు, గట్టిగా ఉండాలి. అనేక రకాల విషయాలు వస్తాయి కానీ విమానంలో వెళ్తున్నప్పుడు మేఘాలు కిందే ఉండిపోతాయి మీరు పైకి ఎగిరిపోతారు. మేఘాలు ఒక మనోరంజన దృశ్యంగా అనిపిస్తాయి. అలాగే ఎన్ని కారు మేఘాల్లాంటి పరిస్థితులు వచ్చినా, దానిలో ఏ సమస్యకి అయినా సమాధానం కనిపించకపోవచ్చు కానీ ఈ మేఘాలు వచ్చింది వెళ్ళిపోవడానికే అనే ధృఢ నిశ్చయం ఉండాలి. ఈ మేఘాలు తొలగిపోయేవే కానీ ఉండిపోయేవి కాదు. ఇలా ఎగిరేకళ యొక్క స్థితిలో స్థితులవ్వండి. ఎంత దట్టమైన, కారు మేఘాలు వచ్చినా మీ ధృడతా బలంతో విజయం పొందండి. ఇది ఎలా అవుతుంది అని భయపడకండి. మంచే జరుగుతుంది ఎందుకంటే బాప్ దాదాకి తెలుసు - ఎంత సమయం సమీపంగా వస్తుందో అంత క్రొత్త, క్రొత్త విషయాలు, సంస్కారాలు, కర్మల ఖాతా పూర్తి చేయడానికి నల్లని మేఘాల రూపంలో వస్తాయి. ఇక్కడే అన్నీ పూర్తి అవ్వాలి. కొంతమంది పిల్లలు అంటున్నారు రోజురోజుకి ఇలాంటి విషయాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? అని. ఏ పిల్లలకైతే దర్మరాజుపురి దాటవలసిన అవసరం ఉండదో వారు సంగమయుగంలోనే అంతిమసమయంలో స్వభావ, సంస్కారాల రూపంలో ఇక్కడే కర్మల ఖాతా పూర్తి చేసుకోవాలి. ధర్మరాజుపురికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. మీ ఎదురుగా యమదూతలు రారు. ఈ విషయాలే యమదూతలు. ఇక్కడే సమాప్తి అవ్వాలి. జబ్బు బయటికి వస్తుంది అంటే సమాప్తి అవుతున్నదానికి గుర్తు, పైకి తెలియటం లేదు కానీ సమయం సమీపంగా వచ్చే కొలది వ్యర్థ సంకల్పాలు ఇంకా పెరిగిపోతున్నాయి అని అనుకోకండి. కానీ ఇవి సమాప్తి అయిపోవడానికి బయటికి వచ్చేస్తున్నాయి. వాటి పని బయటికి రావటం మరియు మీ పని ఎగిరేకళ ద్వారా, శక్తి ద్వారా పరివర్తన చేయటం. భయపడకండి. కొంతమంది పిల్లల యొక్క విశేషత ఏమిటంటే పైకి భయపడుతున్నట్లు కనిపించరు కానీ లోపల మనస్సులో భయపడిపోతూ ఉంటారు. బయటికి ఏమి లేదు, ఏమి లేదు అంటారు. కానీ లోపల దాని సెగ తగులుతూ ఉంటుంది. బాప్ దాదా ముందే చెప్తున్నారు - భయానక విషయాలు వస్తాయి కానీ భయపడకండి. మీ శస్త్రాలను వదలకండి. భయపడేవారు చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు కింద పడేస్తారు. అలాగే మనస్సులో భయం వచ్చినప్పుడు శస్త్రాలు, శక్తులు ఏవైతే ఉన్నాయో అవి క్రింద పడిపోతున్నాయి అంటే గుప్తం అయిపోతున్నాయి. ముందే తెలుసు కనుక భయపడకండి. త్రికాలదర్శి అవ్వండి, నిర్భయంగా అవ్వండి. బ్రాహ్మణ ఆత్మల సంపర్కంలో నిర్భయంగా అవ్వటం కాదు, మాయతో నిర్భయంగా అవ్వండి. సంబంధంలో స్నేహం మరియు నిర్మాణత ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా మీరు మనస్సుతో స్నేహం ఇవ్వండి, శుభభావన ఉంచుకోండి, దయ చూపించండి. నిర్మాణంగా అయ్యి వారిని ముందు పెట్టి ముందుకు తీసుకువెళ్ళండి. దీనినే కారణం అనే అశుభాన్ని సమాధానం అనే శుభంలోకి మార్చుకోండి. ఇది కారణం, కారణం, కారణం అని అనకండి. కారణం లేదా సమస్యను సమాధానంగా తయారుచేస్కోండి. బాప్ దాదాకి ఒక విషయంలో అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. ఏ విషయం గురించో తెలుసా? ఒకవైపు ప్రతిజ్ఞ చేస్తున్నారు - బాబా మేము ప్రకృతిజీత్ అని. ప్రకృతిని కూడా మారుస్తాము అని చెప్తున్నారు కదా! ప్రకృతిని మారుస్తారు కదా? ఇలా ప్రతిజ్ఞ చేసేవారు ప్రకృతిని మారుస్తారు కానీ సంబంధ, సంపర్కంలో ఏవైనా విషయాలు వస్తే వాటిని సమాధాన పరుచుకోలేకపోతున్నారు. పరివర్తన చేసుకోలేకపోతున్నారు. నవ్వు వచ్చే విషయం కదా - ప్రకృతి జడం దానిని మార్చడానికి ప్రతిజ్ఞ చేస్తున్నారు. కానీ బ్రాహ్మణ ఆత్మలను పరివర్తన చేయలేకపోతున్నారు. మరలా ఏమి ఆలోచిస్తున్నారు? వారు అవ్వటం లేదు, వీరు తయారవ్వరు, మారరు అంటున్నారు. కనుక ప్రకృతిని ఎలా మారుస్తారు? స్వయం మారి ఇతరులను మార్చండి. వారు 100% తప్పు అయినా కానీ మీ ప్రతిజ్ఞ ఏమిటి? బాబాతో ఏమి ప్రతిజ్ఞ చేసారు? స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేస్తాము అని. ఇది జ్ఞాపకం ఉందా లేక మర్చిపోయారా? ఉంది అని అందరు అంటున్నారు. ఎలాంటి విషయాలు అయినా విషయాలను మార్చడానికి సహయోగం ఇవ్వండి కానీ వీరు మారరు అని మాత్రం సర్టిఫికెట్ ఇవ్వకండి. ఈ సర్టిఫికెట్ ఇచ్చే అధికారం ఎవరిచ్చారు మీకు? ఇలా అవ్వకూడదు, ఇది సరైనది కాదు అని అంటున్నారు. మిమ్మల్ని ఎవరు న్యాయమూర్తిగా చేశారు? మీకు మీరే న్యాయమూర్తి సీట్ లో కూర్చుండిపోతున్నారా? అయితే ఇలా అవుతున్నారు లేకపోతే న్యాయవాది అయిపోతున్నారు చాలా చట్టాలు, నియమాలు చెప్తున్నారు, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని వాదిస్తున్నారు. ఇలా న్యాయవాదిగా కాకండి మరియు న్యాయమూర్తిగా కూడా కాకండి. ఈ అధికారం బాబా ఎవరికీ ఇవ్వలేదు. నిమిత్తం అయినవారి సహయోగం తీసుకోండి. ఆ నిమిత్త ఆత్మలు కూడా బాబా సలహా ప్రకారం చేస్తారు. తమ మన్మతానుసారం చేయరు. 

ఈ సంవత్సరంలో ఈ విషయాలన్నింటినీ సమాప్తి చేయండి అంటే మనస్సుతో పరివర్తన చేయండి. తొలగించండి. పెద్దవారికి విషయాన్ని చెప్పారు, మీ భాధ్యత అయిపోయింది అంతే. మీరు పరివర్తన చేయలేకపోతే నిమిత్త ఆత్మలకు చెప్పటం మీ కర్తవ్యం. అంతేకానీ నియమాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. అప్పుడే అవార్డుకి పాత్రులుగా అవుతారు. కనుక సదా ఉత్సాహంలో ఉండండి, ఉత్సాహం పెంచుకోండి. ఇదే స్మృతిని బాప్ దాదా ప్రత్యక్షం చేస్తున్నారు. ఎప్పుడైతే స్వయం ఉత్సాహంలో ఉంటారో అప్పుడు అందరి చేతిలో చేయి అంటే మనస్సు స్నేహం యొక్క చేతిలో చేయి కలిసి నాట్యం చేస్తారు, సంతోషంగా ఉంటారు. దీనినే చేతిలో చేయి కలవటం అంటారు. స్నేహం ఏమైనా చేయగలదు. పరమాత్మ స్నేహం, పరమాత్మ ప్రేమ చేయలేనిది ఏది? అసంభవం అనేది బ్రాహ్మణుల డిక్షనరీలోనే లేదు. ఉత్సాహం ఉన్నవారు ఎప్పుడూ ఏ విషయంలో నిరాశ చెందరు, బలహీనం అవ్వరు. 

నలువైపుల పరమాత్మ ప్రేమ యొక్క సుఖమయ, ఆనందమయ ఊయలలో ఊగేవారికి, లక్కీ మరియు లవ్లీ ఆత్మలకు, సదా ధృడసంకల్పం ద్వారా సమాధాన స్వరూప శ్రేష్ట ఆత్మలకు, సదా పరమాత్మ అవార్డు తీసుకోవడానికి పాత్రులు అయ్యే హీరో పాత్రధారి ఆత్మలకు, సదా బాప్ దాదా యొక్క పాలనకు రిటర్న్ ఇచ్చే హృదయసింహాసనాధికారి అయ్యే ఆత్మలకు, బాప్ దాదా యొక్క కోటానుకోట్ల కంటే ఎక్కువ ప్రియస్మృతులు మరియు నమస్తే 

Comments