14-03-2006 అవ్యక్త మురళి

  14-03-2006         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పరమాత్మ కలయిక యొక్క అనుభూతి కొరకు వ్యతిరేకమైన నేను అనే భావాన్ని కాల్చే హోలీ జరుపుకోండి, దృష్టి అనే పిచికారి ద్వారా సర్వ ఆత్మలకు సుఖం, శాంతి, ప్రేమ, ఆనందం యొక్క రంగుని వేయండి.

ఈరోజు పవిత్ర బాబా తన యొక్క పవిత్ర పిల్లలతో కలయిక జరుపుకుంటున్నారు. నలువైపుల ఉన్న పవిత్ర పిల్లలందరూ దూరంగా ఉన్నా కానీ సమీపమే. బాప్ దాదా ఇటువంటి మహా పవిత్ర పిల్లల మస్తకంపై మెరుస్తున్న భాగ్యసితారను చూస్తున్నారు. ఇటువంటి మహాన్ పవిత్రులుగా కల్పం మొత్తంలో మరెవ్వరూ కాలేరు. ఈ సంగమయుగంలో పవిత్రత యొక్క వ్రతం తీసుకునే భాగ్యవంతులైన పిల్లలు భవిష్యత్తులో డబల్ పవిత్రులు. శరీరంతో కూడా పవిత్రులు, ఆత్మ కూడా పవిత్రం. కల్పం అంతా తిరిగి చూడండి - ఎంతమంది మహానాత్మలు వచ్చినా కానీ తనువు మరియు ఆత్మ రెండూ పవిత్రంగా ఉండేవారు ఎవరూ లేరు. ధర్మాత్మలు లేరు, మహానాత్మలు లేరు. పిల్లలైన మీ గురించి బాప్ దాదాకి గర్వంగా ఉంది. ఓహో నా పవిత్ర పిల్లలూ! ఓహో!! అని. ఇలా డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటధారులుగా కూడా ఎవరూ అవ్వరు. డబల్ కిరీటధారులుగా శ్రేష్ట ఆత్మలైన మీరే అవుతారు. మీ యొక్క ఆ డబల్ పవిత్ర మరియు డబల్ కిరీటధారి స్వరూపం ఎదురుగా వస్తుంది కదా! అందువలన ఈ సంగమయుగంలో పిల్లలైన మీ ప్రత్యక్ష జీవితం యొక్క విశేషత యొక్క స్మృతిచిహ్నాన్నే ప్రపంచంలోని వారు ఉత్సవం రూపంగా జరుపుకుంటున్నారు. 

ఈరోజు కూడా మీరందరు స్నేహం అనే విమానంలో హోలీ జరుపుకునేటందుకు చేరుకున్నారు. హోలీ జరుపుకునేటందుకు వచ్చారు కదా! మీరందరు మీ జీవితంలో పవిత్రత యొక్క హోలీ జరుపుకున్నారు. ప్రతీ ఆధ్యాత్మిక రహస్యానికీ ప్రపంచం వారు స్థూల రూపాన్ని ఇచ్చేశారు. ఎందుకంటే దేహాభిమానం కదా! మీరు ఆత్మాభిమానులు. ఆధ్యాత్మిక జీవితం గలవారు. కానీ వారు దేహాభిమానులు కనుక అన్నింటినీ స్థూల రూపంగా తీసేసుకున్నారు. మీరు యోగాగ్ని ద్వారా మీ పాత స్వభావ సంస్కారాలను భస్మం చేశారు. దానికి వారు స్థూలంగా కాలుస్తారు. ఎందుకు? ఎందుకంటే పాత సంస్కారాలు కాల్చకుండా పరమాత్మ సాంగత్యం యొక్క రంగు అంటదు. పరమాత్మ యొక్క కలయికను అనుభవం చేసుకోలేరు. మీ జీవితానికి ఎంత విలువ ఉంది అంటే మీ ఒకొక్క అడుగును ఉత్సవ రూపంలో జరుపుకుంటున్నారు. ఎందువలన? మీరు సంగమయుగం అంతా ఉత్సాహ ఉల్లాసాలతో నిండిన జీవితాన్ని తయారు చేసుకున్నారు. మీ జీవితానికి స్మృతిచిహ్నంగా ఒక్కరోజు పండుగ జరుపుకుంటారు. మీ అందరిదీ ఇటువంటి సదా ఉత్సాహ ఉల్లాసాలు సంతోషంతో నిండిన జీవితమే కదా! జీవితమేనా లేక అప్పుడప్పుడా? సదా ఉత్సాహమేనా లేక అప్పుడప్పుడా? సదా ఉత్సాహంలో ఉంటున్నాం, సంతోషంలో ఉంటున్నాం, సంతోషం అనేది మా జీవితానికి పరమాత్మ ఇచ్చిన కానుక అని అనుభవం అవుతుందా? ఏది జరిగినా కానీ బ్రాహ్మణ జీవితం యొక్క సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం తొలగిపోకూడదు. బాప్ దాదా ప్రతి ఒక్కరి ముఖం సదా సంతోషవంతంగా చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ వంటి అదృష్టవంతులు ఎవరూ లేరు మరియు ఉండరు. భిన్న భిన్న వర్గాల వారు కూర్చున్నారు కదా! మరి ఇటువంటి అనుభవీ మూర్తిగా అయ్యేటందుకు స్వయం పట్ల ప్లాన్ తయారుచేసుకున్నారా? 

ఈ రోజు ఫలానా, ఫలానా వర్గాల వారు వచ్చారు అని బాప్ దాదా సంతోషిస్తున్నారు. స్వాగతం, వచ్చినందుకు శుభాకాంక్షలు. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు మంచిగా ఉన్నాయి కానీ మొదట స్వయం గురించి ప్లాన్ తయారుచేస్కోండి. బాప్ దాదా చూశారు - అన్ని వర్గాల వారు ఒకరికంటే ఒకరు ముందుగా మరియు మంచిగా ప్లాన్స్ తయారుచేస్తున్నారు. వాటితో పాటు స్వ ఉన్నతి కొరకు ప్లాన్ తయారుచేయటం చాలా అవసరం. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు అంటే స్వ ఉన్నతి కొరకు ప్రత్యక్ష ప్లాన్ తయారు చేసుకోవాలి మరియు నెంబరు తీసుకోవాలి. సంఘటనలో అందరు కలుస్తారు కదా! విదేశీయులు, భారతీయులు అందరు మీటింగ్ పెట్టుకుంటారు. ప్లాన్ తయారుచేసుకుంటారు. బాప్ దాదా ఆ విషయంలో రాజీ కానీ ఏవిధంగా అయితే ఉత్సాహ ఉల్లాసాలతో సంఘటిత రూపంగా సేవ కొరకు ప్లాన్స్ తయారు చేస్తున్నారో అదేవిధంగా ఇంత ఉత్సాహ ఉల్లాసాలతోనే స్వ ఉన్నతి పట్ల ధ్యాస పెట్టుకుని తయారవ్వాలి. ఈ నెలలో ఈ వర్గం వారు స్వ ఉన్నతి యొక్క ప్లాన్ ని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారు అని బాప్ దాదా వినాలనుకుంటున్నారు. ఏయే వర్గం వారు వచ్చారో చేతులెత్తండి. అన్ని వర్గాల వారు వచ్చారు మంచిది. చాలా మంది వచ్చారు. 5-6 వర్గాల వారు వచ్చినట్లు విన్నారు. వచ్చారు, చాలా మంచిది. ఇప్పుడు ఇక చివరి మిలనం ఉంది. బాప్ దాదా అయితే హోమ్ వర్క్ ఎప్పుడో ఇచ్చేశారు. బాప్ దాదా రోజూ ఫలితం చూస్తున్నారు. చివరి మిలనంలో బాప్ దాదా ఫలితం యొక్క లెక్క చూస్తారు అని మీరు అనుకుంటున్నారు. కానీ బాప్ దాదా రోజూ చూస్తున్నారు. ఇప్పటికీ ఇంకా 15 రోజులు ఉన్నాయి. ఏయే వర్గాల వారు వచ్చారో వారు మరియు ఇక్కడికి రానటువంటి వర్గాలకు నిమిత్తమైన వారందరికీ బాప్ దాదా సైగ చేస్తున్నారు - స్వ ఉన్నతి కొరకు ఏదొక ప్లాన్ తయారుచేస్కోండి అంటే ఏదొక విశేష శక్తి స్వరూపంగా అయ్యేటటువంటి, విశేషంగా ఏదొక గుణమూర్తిగా అయ్యేటటువంటి ప్లాన్ తయారుచేస్కోండి. మరియు విశ్వ కళ్యాణం కొరకు లైట్ - మైట్ ఇచ్చేటటు వంటి ప్లాన్ ప్రతీ వర్గం వారు పరస్పరంలో నిర్ణయించుకోండి. పరిశీలన చేస్కోండి. వర్గంలో సభ్యులుగా అయ్యి మంచి పని చేశారు కానీ ప్రతీ సభ్యుడు నెంబర్ వన్ అవ్వాలి. ఫలానా వర్గం యొక్క సభ్యులుగా పేరు నమోదయితే సరిపోదు. స్వ ఉన్నతిలో పేరు నమోదు అవ్వాలి. వర్గాలకు నిమిత్తమైన వారు నిల్చోండి. ఇలా అవుతారా? విదేశీయులు కూడా నిల్చోండి. విదేశాలలో నిమిత్తమైనవారు నిల్చోండి. విదేశీయులు నలుగురు, అయిదుగురు నిమిత్తులు ఉన్నారు కదా! వారు కూడా నిల్చోండి. బాప్ దాదాకి అయితే అందరూ శక్తిశాలి మూర్తులుగా కనిపిస్తున్నారు. చాలా మంచి మూర్తులు. 15 రోజుల్లో చేసి చూపిస్తాం అని మీరందరు భావిస్తున్నారు కదా! కాగలరా? చెప్పండి. అవుతుందా? (పూర్తిగా పురుషార్ధం చేస్తాం) మిగతావారు చెప్పండి, కాగలరా? (అడ్మిన్ స్టేషన్ వర్గం వారు క్రోధముక్తులు అవుతాం అని ప్లాన్ తయారుచేశారు) వారి గురించి ఎంక్వెయిరీ చేస్తున్నారా? అక్కయ్యలైన మీరు (టీచర్లు) 15 రోజుల్లో ఎంక్వెయిరీ చేసి ఫలితం చెప్పండి! విదేశీయులు అలాగే అని అంటున్నారు. మీరు ఏమని భావిస్తున్నారు? అవుతుందా? భారతవాసీయులు చెప్పండి, కాగలరా? మీ అందరి ముఖాలను చూసి బాప్ దాదాకి ఫలితం బావుంది అని అనిపిస్తుంది. కానీ ఈ 15 రోజులు కూడా ధ్యాస పెట్టుకునే పురుషార్థం చేస్తే ఈ అభ్యాసం మున్ముందు కూడా పనికి వస్తుంది. ఏదొక గుణం యొక్క లేదా ఏదొక శక్తి రూపం యొక్క లక్ష్యం కొరకు మీటింగ్ పెట్టుకోవాలి. ఈ విషయంలో బాప్ దాదా నెంబరు ఇస్తారు. బాప్ దాదా అయితే చూస్తూనే ఉంటారు. స్వ సేవలో ఎవరెవరు నెంబర్ వన్ వర్గం అని. ఎందుకంటే బాప్ దాదా చూశారు, ప్లాన్స్ చాలా బాగా తయారవుతున్నాయి కానీ సేవ మరియు స్వ ఉన్నతి రెండూ వెనువెంట లేకపోతే సేవా ప్లాన్లో రావాల్సిన సఫలత రాదు. అందువలన సమయం యొక్క సమీపతను ఎదురుగా చూస్తూ సేవ మరియు స్వ ఉన్నతి రెండింటినీ కంబైండ్ గా ఉంచండి. కేవలం స్వ ఉన్నతియే కాదు, సేవ కూడా కావాలి కానీ స్వఉన్నతి యొక్క స్థితిలో సేవలో సఫలత అధికం అవుతుంది. సేవలో లేదా స్వ ఉన్నతిలో సఫలతకి గుర్తు - స్వయంతో స్వయం సంతుష్టం మరియు ఎవరికైతే సేవ చేస్తున్నారో వారికి కూడా సేవ ద్వారా సంతుష్టత యొక్క అనుభవం అవుతుంది. ఒకవేళ స్వయానికి లేదా ఎవరి సేవకి నిమిత్తం అవుతున్నారో వారికి సంతుష్టత యొక్క అనుభవం అవ్వటం లేదు అంటే సఫలత తక్కువ వస్తుంది మరియు శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుంది. సేవలో లేదా స్వ ఉన్నతిలో సహజంగా సఫలతను పొందే స్వర్ణిమ తాళంచెవి ఏమిటో మీకు తెలుసా? అనుభవం అయితే అందరికీ ఉంది కదా! ఆ స్వర్ణిమ తాళంచెవి - నడవడిక, ముఖం, సంబంధ సంపర్కాలలో నిమిత్తభావం, నిర్మాన భావం, నిర్మల మాట ఉండాలి. బ్రహ్మాబాబా, మమ్మాలను చూశారు కదా! ఇప్పుడు అక్కడక్కడ సేవ యొక్క సఫలతలో శాతం వస్తుంది. దానికి కారణం ఏమిటి? ఎంతగా కావాలనుకుంటున్నారో అంతగా, ఎంత చేస్తున్నారో అంత, ఎంత ప్లాన్ తయారు చేస్తున్నారో అంతగా సఫలత రాకుండా శాతం ఎందుకు వస్తుంది? బాప్ దాదా మెజారిటీలో చూసిన కారణం ఏమిటంటే సఫలతలో లోటు రావడానికి కారణం ఒక మాట, అది ఏమిటి? “ నేను” అనే మాట. నేను అనే మాట మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. దేహి అభిమాని స్థితిలో కూడా “నేను ఆత్మను” అని. నేను అనే మాట వస్తుంది. దేహాభిమానంలో కూడా నేను అనే మాట వస్తుంది. అంటే నేను ఏదైతే చెప్తున్నానో, చేస్తానో అది సరైనది, నేను బుద్ధిమంతుడిని.. ఇలా హద్దులో కూడా నేను అనే మాట వస్తుంది. మూడవది - మనస్సు బలహీనం అయినప్పుడు కూడా నేను అనే మాట వస్తుంది. నేను ఇది చేయలేను, నాలో ధైర్యం లేదు, నేను ఇది వినలేను, నేను వీటిని ఇముడ్చుకోలేను..... ఇలా మూడు రకాలుగా నేను అనే మాటను బాప్ దాదా వింటూ ఉంటారు. బ్రహ్మాబాబా, మమ్మా మొదటి నెంబరు తీసుకున్నారు వారి విశేషత ఏమిటంటే వ్యతిరేకమైన నేను అనే భావం కూడా లేకుండా (అభావం) అవిధ్యాగా ఉన్నారు. నేను సలహా ఇస్తున్నాను, నేను సత్యం...ఇలా బ్రహ్మాబాబా ఎప్పుడూ అనలేదు. బాబా, బాబా....... బాబా చేయిస్తున్నారు. నేను చేయటం లేదు అనేవారు. నేను తెలివైనవాడిని కాదు, పిల్లలు తెలివైనవారు అనేవారు. జగదాంబ యొక్క స్లోగన్ కూడా జ్ఞాపకం ఉందా, పాత వారికి జ్ఞాపకం ఉండి ఉంటుంది. జగదాంబ అనేవారు - యజమాని ఆజ్ఞ నన్ను నడిపిస్తుంది, నేను నడవటం లేదు నడిపించే బాబా నడిపిస్తున్నారు. చేయించే బాబా చేయిస్తున్నారు. కనుక ముందుగా అందరూ మీలో ఉన్న అభిమానం లేదా అవమానం యొక్క నేను అనే దానిని సమాప్తి చేసుకుని ముందుకి వెళ్ళండి. స్వతహాగా ప్రతీ విషయంలో బాబా, బాబా అని రావాలి. స్వతహాగా రావాలి. ఎందుకంటే బాబా సమానంగా తయారవ్వాలి అనే సంకల్పం అందరూ తీసుకునే ఉన్నారు కదా! కనుక సమానంగా అయ్యేటందుకు కేవలం ఈ ఒక్క సూక్ష్మ నేను అనే భావాన్ని కాల్చేయండి. మంచిది, క్రోధంలోకి రారు కదా! క్రోధం ఎందువలన వస్తుంది? నేను అనే భావం వలన వస్తుంది.

హోలీ జరుపుకునేటందుకు వచ్చారు. అందుకే వచ్చారు కదా! అయితే హోలీలో మొదట ఏమి చేస్తారు? కాలుస్తారు. వాస్తవానికి చాలా మంచివారు, మంచి యోగ్యులు, బాబా యొక్క ఆశాదీపాలు కేవలం ఈ చిన్న నేను అనేది తొలగించుకుంటే సరిపోతుంది. రెండు రకాలైన నేను (దేహాభిమానం, బలహీనత) అనే భావాన్ని తొలగించుకుని ఒక నేను (ఆత్మాభిమానం) అనే భావాన్ని ఉంచుకోండి. ఎందుకు? బాప్ దాదా చూస్తున్నారు. మీ యొక్క అనేక సోదరీ సోదరులు, బ్రాహ్మణులు కాదు. అజ్ఞానీ ఆత్మలు తమ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయారు. ఇప్పుడు వారికి ధైర్యం యొక్క రెక్కలు ఇవ్వవలసి ఉంటుంది. పూర్తిగా నిస్సహాయులుగా అయిపోయారు, నిరాశావాదులుగా అయిపోయారు. కనుక ఓ దయాహృదయులూ! కృపాళువులూ! విశ్వాత్మల యొక్క ఇష్ట దేవతలూ! మీ శుభ భావన, దయా భావన, ఆత్మిక భావన ద్వారా వారి భావనను పూర్తి చేయండి. వారి దు:ఖం, అశాంతి యొక్క తరంగాలు మీకు రావటం లేదా? మీరు నిమిత్త ఆత్మలు, పూర్వీకులు, పూజ్యులు, వృక్షానికి ఆధారమూర్తులు. మా రక్షకులు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ అందరూ మిమ్మల్ని వెతుకుతున్నారు. బాబాకి అయితే చాలా పిలుపులు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్వ ఉన్నతి ద్వారా భిన్న - భిన్న శక్తులను ఇవ్వండి. ధైర్యం అనే రెక్కలు ఇవ్వండి. దృష్టియే మీ పిచికారి కనుక మీ దృష్టి ద్వారా సుఖం, శాంతి ప్రేమ, ఆనందం యొక్క రంగు అంటించండి. మీరయితే పరమాత్మ సాంగత్యం యొక్క రంగులోకి వచ్చేశారు. కనుక ఇతరాత్మలకు కూడా కొంచెం ఆధ్యాత్మిక రంగు యొక్క అనుభవం చేయించండి. పరమాత్మ యొక్క మంగళ కలయికను అనుభవం చేయించండి. భ్రమించే ఆత్మలకు గమ్యం యొక్క మార్గం చూపించండి. 

స్వ ఉన్నతి కొరకు ప్లాన్ తయారుచేసుకుంటారు కదా! దీనిలో స్వయానికి స్వయం పరిశీలకులుగా అయ్యి సూక్ష్మమైన నేను అనే భావం రావటం లేదు కదా పరిశీలించుకోండి. ఎందుకంటే ఈరోజు హోలీ జరుపుకునేటందుకు వచ్చారు కదా! కనుక బాబా మీకు ఇచ్చే సంకల్పం ఏమిటంటే దేహాభిమానం, అవమానం అనగా మనస్సుని బలహీనం చేసుకునే నేను అనే భావాలను కాల్చే వెళ్ళాలి. వెంట తీసుకువెళ్ళకూడదు. ఏదొకటి కాలుస్తారు కదా! అగ్నితో కాలుస్తారా ఏమిటి? జ్వాలాముఖి యోగాగ్నిని వెలిగించండి. వెలిగించటం వస్తుందా? జ్వాలాముఖి యోగం వస్తుందా? లేక సాధారణ యోగం వస్తుందా? జ్వాలాముఖి అవ్వండి. లైట్, మైట్ హౌస్ అవ్వండి. ఇష్టమేనా? దయచేసి ధ్యాస పెట్టండి. నేను అనే భావాన్ని కాల్చేయండి. బాప్ దాదా నేను - నేను అనే పాట వినవలసి వస్తే స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఓహో! ఓహో అనే పాటలు పాడితే ధ్వని పెంచుతారు. ఎందుకంటే నేను - నేను అనే దానిలో పెనుగులాట ఎక్కువ ఉంటుంది. ఇది కాదు, అది కాదు, ఇలా కాదు, అలా కాదు అని లాగుతూ ఉంటారు. పెనుగులాడటం వలన మోహం ఎక్కువ ఉంటుంది. 

కనుక తగుల్పాటు, మోహం, వ్యతిరేక స్వభావం వీటి నుండి ముక్తులవ్వాలి. వాస్తవానికి స్వభావం అనే మాట చాలా మంచిది. స్వభావం అంటే స్వయం యొక్క భావం కానీ దానిని వ్యతిరేకం చేసేశారు. విషయాలలో పట్టుదలగా లాగకండి. మీ వైపుకి ఎవరినీ లాగకండి. అది కూడా చాలా అలజడి చేస్తుంది. ఎవరు ఎంతగా మీకు చెప్పినా కానీ మీ వైపుకి ఎవరినీ లాగకండి, విషయాలను లాగకండి. మీ వైపుకి లాగకండి. బాబా, బాబా మరియు బాబా. ఇష్టమేనా? నేను అనే భావాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళాలి, వెంట తీసుకువెళ్ళకూడదు. లేకపోతే రైలులో బరువు అయిపోతుంది. మీ పాట ఉంది కదా - నేను బాబా వాడిని, బాబా నా వాడు అని. కనుక ఒక నేను అనే భావాన్ని ఉంచుకోండి. మిగిలిన రెండింటినీ సమాప్తి చేయండి. హోలీ అయిపోయిందా? కాల్చేశారా? సంకల్పంలో కాల్చేశారు. ఇప్పుడు సంకల్పం చేస్తారు. సంకల్పం చేశారా? చేతులెత్తండి. చేసేశారా లేక కొంచెం కొంచెం ఉందా? కొంచెం ఉండవచ్చు అని అవకాశం ఇవ్వమంటారా? కొంచెం కొంచెం కావాలనుకునేవారు చేతులెత్తండి. కొంచెం అయితే ఉంటుంది కదా, ఉండదా? అయితే మీరు చాలా బలశాలులు. సంతోషంతో నాట్యం చేయండి, పాడండి. వ్యతిరేక పట్టుదలతో లాగులాటలో ఉండకండి. మంచిది. ఈ రోజు హోలీ కదా, అందువలన బాప్ దాదా కూడా కాల్చమని చెప్తున్నారు. 

నలువైపుల ఉన్న పవిత్రమైన మరియు ఉన్నతమైన పిల్లలకు, విశ్వకళ్యాణకారి విశేషాత్మలకు, పూర్వీకులు, పూజ్యులైన ఆత్మలకు, బాబా యొక్కహృదయ సింహాసనాధికారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనస్సు యొక్క ఆశీర్వాదాల సహితంగా మనస్సు యొక్క ప్రేమ పూర్వక నమస్తే. 

Comments