13-11-1997 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంగమయుగి ప్రాప్తుల యొక్క ప్రాలబ్దాన్ని అనుభవం చేసుకోండి, మాస్టర్ దాత, మహాసహయోగి అవ్వండి.
ఈరోజు భాగ్య విధాత బాబా తన యొక్క శ్రేష్ట భాగ్యవాన్ పిల్లలను చూస్తున్నారు. ప్రతి బిడ్డ యొక్క భాగ్యరేఖలు చూసి భాగ్య విధాత బాబా కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే కల్పమంతటిలో మీ వంటి శ్రేష్టభాగ్యం ఏ ధర్మాత్మకి కానీ, మహాన్ ఆత్మకి కానీ, రాజ్యాధికారి ఆత్మకి కానీ, ఎవరికీ కూడా ఇంత భాగ్యం లేదు. సంగమయుగి శ్రేష్ట ఆత్మలకి ఉన్న భాగ్యం ఇంకెవ్వరికి లేదు. మస్తకం ద్వారా మీ భాగ్యరేఖలు చూసుకుంటున్నారా? బాప్ దాదా ప్రతి ఒక బిడ్డ మస్తకంలో మెరుస్తున్న జ్యోతి యొక్క శ్రేష్ట రేఖను చూస్తున్నారు. మీరందరు కూడా మీ యొక్క శ్రేష్టరేఖలను చూసుకుంటున్నారా? నయనాలలో చూస్తే స్నేహం మరియు శక్తి యొక్క రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నోటి ద్వారా మధుర శ్రేష్టవాణీ యొక్క రేఖలు మెరుస్తున్నాయి. పెదవులపై చూస్తే ఆత్మిక చిరునవ్వు, ఆత్మిక సంతోషం యొక్క రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. హృదయంలో చూస్తే, మనస్సులో చూస్తే మనోభిరాముని ప్రేమలో లవలీనం అయిన రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. చేతులలో చూస్తే సర్వఖజానాల సంపన్నత యొక్క రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. పాదాలలో చూస్తే ప్రతి అడుగులో కోట్ల సంపాదన యొక్క రేఖ స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత ఉన్నతమైన భాగ్యం!
భాగ్యవిధాత బాబా ప్రతి ఒక్క బిడ్డకి పురుషార్ధం ద్వారా, శ్రేష్టకర్మల యొక్క కలం ద్వారా ఈ అన్ని రేఖలు గీసుకోవడానికి విశాల హృదయంతో, విశాలమైన అవకాశం ఇచ్చారు. ఎంత పెద్ద రేఖ కావాలంటే అంత పెద్ద రేఖ గీసుకోండి కానీ సమయం లోపలే గీసుకోవాలి. బాబా కలం మీ చేతికి ఇచ్చారు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది గీసుకోండి. ఆ రేఖ గీసుకోవటం వస్తుందా? గీసుకున్నారా లేక గీసుకోవటం రావటం లేదా? అందరికీ వస్తుందా? (వస్తుంది) చాలా మంచిది. చూడండి, ఇప్పటి మీ శ్రేష్ట భాగ్య రేఖ మొత్తం కల్పం కూడా శ్రేష్టంగా తయారుచేస్తుంది, 21 జన్మలు సదా సంపన్నంగా మరియు సుఖీగా ఉండే రేఖ ఉంటుంది మరియు ద్వాపర, కలియుగాలలో కూడా పూజ్యులుగా అయ్యే రేఖ శ్రేష్టంగా ఉంటుంది. ఈ సమయం యొక్క రేఖ కల్పం అంతా సదా వెంట వస్తుంది ఎందుకంటే అవినాశి బాబా యొక్క అవినాశి రేఖ. మీ భాగ్య రేఖ సదా స్మృతిలో ఉంటుందా? స్మృతి ఉంటుంది కానీ సదా ప్రత్యక్షంగా ఉంటుందా లేక గుప్తంగా ఉంటుందా? సదా ప్రత్యక్షంగా ఉంటుందా? దీనిలో తక్కువగా చేతులు ఎత్తుతున్నారు. సదా ప్రత్యక్షంగా ఉండాలి. ప్రత్యక్షంగా ఉన్నదానికి గుర్తు - పాత స్మృతులు. పాత సంస్కారాల యొక్క రేఖలు గుప్తంగా ఉంటాయి. గుప్తం అయిపోతూ, అయిపోతూ సమాప్తి అయిపోతాయి. ఎక్కడ శ్రేష్టభాగ్యం యొక్క రేఖలు ప్రత్యక్షం అవుతాయో అక్కడ పాత రేఖలు ప్రత్యక్షం అవ్వటం అసంభవం. ఒకవేళ ప్రత్యక్షం అవుతున్నాయి అంటే శ్రేష్టభాగ్యరేఖ ఇంకా ప్రత్యక్షం అవ్వలేనట్లు రుజువు అవుతుంది. ఏమని భావిస్తున్నారు? ఇంత శ్రేష్టభాగ్యం యొక్క రేఖలు ప్రత్యక్షం అవ్వాలా లేక గుప్తంగా ఉండాలా? బాప్ దాదా వర్తమాన సమయంలో పిల్లలందరిని వర్తమాన సంగమయుగ ప్రాప్తుల యొక్క ప్రాలబ్ద రూపంలో చూడాలనుకుంటున్నారు. పురుషార్థం చాలా సమయం చేసారు. ఇప్పుడు పురుషార్థం స్వతహాగా నడవాలి, శ్రమతో కూడిన పురుషార్థం కాదు. అంతిమం వరకు పురుషార్ధం యొక్క శ్రమ చేస్తూనే ఉంటారా? సంగమయుగ ప్రాప్తుల యొక్క అనుభవాన్ని ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటారు! భవిష్య పాలబ్దం వేరే విషయం. అది ఇప్పటి పురుషార్ధం యొక్క నీడ. అది మీ వెనుక స్వతహాగానే వస్తూ ఉంటుంది. కానీ విశేషమైన విషయం ఏమిటంటే ఈ సమయంలోనే ప్రాలబ్దం పొందాలి. ఎవరైనా ఎలా ఉన్నారు? పరిస్థితి ఏమిటి? అని అడిగితే ఇప్పటి వరకు ఇంకా పురుషార్ధం నడుస్తుంది అని చెప్పకూడదు. పురుషార్థులే కానీ ఇప్పుడు పురుషార్థం యొక్క ప్రాలబ్దాన్ని అనుభవం చేసుకోండి. సర్వశక్తిసంపన్నం, సర్వజ్ఞానసంపన్నం, సర్వవిఘ్న వినాశకమూర్తి ఇప్పటి ఈ ప్రాప్తులు భవిష్యత్తులో స్వతహాగా లభిస్తాయి. ఎలా అయితే భవిష్యత్తులో కేవలం ప్రాప్తి తప్ప పురుషార్ధం ఉండదో అదేవిధంగా ఇప్పుడు మిగిలి ఉన్న ఈ సమయంలో కూడా ప్రాలబ్దాన్ని అనుభవం చేసుకోండి. చేసిన పురుషార్ధం అనుసరించే ప్రాలబ్దం కూడా ఉంటుంది.
బాప్ దాదా పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నారు? బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ఉన్న ఈ కొద్ది సమయంలో పురుషార్ధం యొక్క ప్రాలబ్ద స్వరూపంగా అవ్వండి. కాగలరా లేక పురుషార్ధం యొక్క శ్రమయే మంచిగా అనిపిస్తుందా? ప్రాలబ్దం పొందేవారిగా అవుతారా? ఇప్పుడు పురుషార్ధం చేస్తున్నాము, పురుషార్ధం అయిపోతుంది, చేసి చూపిస్తాము ఈ మాటలు సమాప్తి చేయాలి. చేసి చూపిస్తారా, ఎప్పుడు చేసి చూపిస్తారు? వినాశన సమయానికి చేసి చూపిస్తారా? దీనికి చాలా సహజవిధి ఉంది - ఇప్పుడు మాస్టర్ దాత అవ్వండి. బాబా నుండి తీసుకున్నారు మరియు తీసుకుంటూ ఉండండి, కానీ ఆత్మల నుండి తీసుకునే భావన పెట్టుకోకండి - వీరు చేస్తే ఇలా ఉంటుంది, వీరు మారితే నేను మారతాను ఇవన్నీ తీసుకునే భావన ఉంచుకోవటం. ఇలా ఉంటే అలా ఉంటాము ఇవన్నీ తీసుకునే భావనలు. అలా ఉండాలి కాదు, అలా చేసి చూపించాలి. అవుతుంది కాదు, అవ్వవలసిందే నేను చేయవలసిందే. నేను తరంగాలు ఇవ్వాలి, నేను గుణాల సహయోగం ఇవ్వాలి, నేను శక్తుల సహయోగం ఇవ్వాలి. ఇలా మాస్టర్ దాత అవ్వండి. తీసుకోవాలంటే ఒకే బాబాతో తీసుకోండి. ఒకవేళ ఇతర ఆత్మల నుండి లభిస్తున్నా కానీ బాబా నుండి తీసుకున్నదే లభిస్తుంది. దాత అయ్యి విశాలహృదయులు అవ్వండి. ఇస్తూ ఉండండి, ఇవ్వటం వస్తుందా? లేదా కేవలం తీసుకోవటమే వస్తుందా? ఇప్పుడు ఏదైతే జమ చేసుకున్నారో అదే ఇవ్వండి. పరస్పరం బ్రాహ్మణ ఆత్మ పట్ల కూడా దాత అవ్వండి. ఇతరులు ఇస్తే నేను ఇస్తాను అని కాదు, నేను ఇవ్వాలి అనుకోండి. మీ దగ్గర ఖజానా ఉందా? నిండుగా ఉందా? గుణాలతో నిండుగా ఉన్నారా? శక్తులతో నిండుగా ఉన్నారా? మరి ఎందుకు ఇవ్వటం లేదు? మీ కోసం దాచుకుని ఉంచుకున్నారా? ఖజానాలతో నిండుగా ఉన్నప్పుడు వాటిని ఇస్తూ వెళ్ళండి. వీరు ఎందుకు చేస్తున్నారు? వీరు ఎందుకు అంటున్నారు? అని ఆలోచించకండి. దయాహృదయులై మీ యొక్క గుణాలు, శక్తుల సహయోగం ఇవ్వండి, వీరినే మాస్టర్ దాత, మహాసహయోగి అంటారు. సహయోగిగా కూడా కాదు, మహాసహయోగి అవ్వండి. మహాదాత అవ్వండి. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారో అర్థమైందా?
బాప్ దాదా ఇప్పటివరకు పిల్లల యొక్క శ్రమ చూడలేకపోతున్నారు. డైమండ్ జూబ్లీ సమాప్తి అయిపోయింది మరియు ఇప్పుడు మచ్చలేని వజ్రంగా అయ్యేటందుకు పురుషార్ధం చేస్తున్నారు. డ్రైమండ్ జూబ్లీ అంటే ప్రతి బ్రాహ్మణ ఆత్మ వజ్రంగా మెరుస్తూ కనిపించాలి. డైమండ్ జూబ్లీ మనది కాదు, దాదీలది అని భావిస్తున్నారు. మీదా లేక దాదీలదా? ఎవరిది? యజ్ఞస్థాపన యొక్క డైమండ్ జూబ్లీ జరిగింది. కేవలం దాదీలదే కాదు. స్థాపనా కార్యం యొక్క డైమండ్ జూబ్లీ. మీరందరు 2 సం||ల వారైనా 12 సం||ల వారైనా, 50 సం||ల వారైనా కానీ అందరు స్థాపనకి నిమిత్తం అయ్యారు కదా? లేదా? నిమిత్తులేనా? బ్రాహ్మణులు అంటేనే బ్రహ్మాబాబాతో పాటు స్థాపనా కార్యానికి నిమిత్తం అయ్యారు. అటువంటి వారే బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులుగా పిలవబడతారు. అందరూ బ్రహ్మాకుమారీ, కుమారులేనా లేక పురుషార్థి కుమారీ, కుమారులా? ఎవరు? బ్రహ్మాకుమారీ, కుమారులు అంటే జన్మ తీసుకోగానే బ్రహ్మాబాబాతో పాటు స్థాపనకి నిమిత్తం అయ్యారు. మేము ఇప్పుడు క్రొత్త వాళ్ళం, చిన్నవాళ్ళం ఇలా ఆలోచించకండి. కానీ ఇప్పుడు సమయం అనుసరించి సమయం యొక్క సమాప్తి సమీపంగా వస్తుంది కనుక క్రొత్తవారైనా, చిన్నవారైనా తీవ్ర పురుషార్ధం చేయాలి. బ్రాహ్మణులు అయితే ఇంత తీవ్ర పురుషార్ధం చేయండి, ఒకవేళ క్షత్రియులు అయితే వదిలేయండి. బ్రాహ్మణుల నుండి దేవత అని అంటారు కానీ క్షత్రియుల నుండి దేవత అని అనరు. బ్రాహ్మణ ఆత్మలే స్థాపనకి నిమిత్తం అవ్వాలి. నిమిత్తమయ్యే ఉన్నారు. అందువలన ఇప్పుడు మాస్టర్ దాత అవ్వండి. దానం చేయకండి కానీ సహయోగం ఇవ్వండి. బ్రాహ్మణులు బ్రాహ్మణులకి దానం చేయరు, సహయోగం ఇస్తారు. కనుక ఏమంటారు? మహాదాత మరియు మహాసహయోగి అవ్వండి. ఇప్పుడు ఒక సంవత్సరం వారైనా బాల్య విషయాలను సమాప్తి చేయండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరూ వాసప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు. సమయం యొక్క సమీపత అనుసరించి, డ్రామా నియమ ప్రమాణంగా ఇప్పుడు అందరూ వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు.
బాప్ దాదాకి తెలుసు పిల్లలకు బాబాపై ప్రాణప్రదమైన స్నేహం ఉంది అని లేదా పైపై స్నేహం ఉందా? మనస్సుతో స్నేహం ఉంది కనుకే పరుగు పెట్టుకుని వచ్చారు కదా? చూడండి, బేహద్ హాల్ లో, బేహద్ తండ్రి యొక్క పిల్లలు, బేహద్ రూపంలో విరాజమానమై ఉన్నారు. ఈ హాల్ బావుందనిపిస్తుందా లేక దూరంగా అనిపిస్తుందా? కూర్చోవటంలో దూరంగా కూర్చున్నారు కానీ బాప్ దాదా తన మనస్సు అనే చాలా పెద్ద తెరపై దూరంగా కూర్చున్న పిల్లలను కూడా దగ్గరగా చూస్తున్నారు. దూరంగా చూడటం లేదు. బాప్ దాదా హృదయం అనే తెర చాలా పెద్దది. ఇప్పటి వరకు వైజ్ఞానికులు కూడా ఇటువంటి తెరను కనిపెట్టలేదు. అందువలనే మీరు దూరంగా కూర్చోలేదు, బాప్ దాదా హృదయంలో కూర్చున్నారు. ఇలా భావిస్తున్నారా? కుర్చీపై కూర్చున్నారా లేదా తివాచీపై కూర్చున్నారా లేదా బాబా హృదయంలో కూర్చున్నారా? దృశ్యం చాలా బావుంది, పూర్తిగా వెనుక వరకు నిండిపోయింది. ఏదైనా ఖాళీ ఉందా? బాప్ దాదా చూస్తున్నారు, వెనుక కొద్దిగా ఖాళీ ఉంది.
బాప్ దాదా మీ అందరికీ పని ఇచ్చారు. మీరు మర్చిపోయి ఉండవచ్చు. కానీ బాప్ దాదా మర్చిపోలేదు. ఏమి పని ఇచ్చారు? (క్రోధముక్తులు అవ్వండి) ఈరోజు అది అడగటం లేదు. మొదటి అవకాశం తీసుకున్నారు కదా! కనుక ఈరోజే క్రోధముక్తులుగా అయ్యారా అని అడిగితే బలహీనం అయిపోతారు. బాప్ దాదాకి ఫలితం తెలుసు, అడుగుతాను. మిమ్మల్ని కూడా అక్కడి నుండి ఫలితం అడుగుతాను, ఈ రోజు వదిలేస్తున్నాను. 9 లక్షల మందిని తయారుచేయమని పని ఇచ్చాను కదా! ప్రతి జోన్ కి చెప్పాను జ్ఞాపకం ఉందా? ఏ జోన్ 9 లక్షలు తయారు చేశారు?
బెంగాల్, బీహర్ వారి సేవా సమయం కదా! బెంగాల్, బీహర్ వారు 9 లక్షలు తయారుచేసారా? నిశ్శబ్దంగా ఉన్నారు. మాట్లాడటం లేదు. ఒక జోన్ కాదు, అన్ని జోన్లు కలిసి, దేశం వారు, విదేశం వారు కలిసి 9 లక్షలు తయారుచేసారా? విదేశం వారు చెప్పండి? 9 లక్షల మందిని తయారుచేసారా? బాప్ దాదా అయితే తను వచ్చే తారీఖు నిర్ణయం చేసుకుంటున్నారు మరియు ఆ తారీఖుకే వస్తున్నారు. మీరు కూడా అన్ని విషయాలకి తారీఖు నిర్ణయం చేసుకుంటున్నారా? ఈ హాల్ ఎప్పుడు తయారవుతుంది, ఫంక్షన్ ఎప్పుడు అని తారీఖు నిర్ణయించుకుంటారు కదా? మరి దీని తారీఖు ఏమిటి? నిర్ణయించారా? వినాశనానికి ముందా లేదా అంతిమంలోనా? ఏమి ఆలోచించారు? ఏ తారీఖు? ఏదైనా తారీఖు ఉందా లేదా ఇప్పుడింకా నిర్ణయించలేదా? ఇది కూడా బాబా నిర్ణయంచాలా? ఇది మీరే నిర్ణయించాలి. బాప్ దాదా చెప్తారు - శుభకార్యంలో ఆలస్యం చేయకండి అని మరి ఏమి చేస్తారు? ఈ సీజన్ అంతిమంలో అయిపోయినా పర్వాలేదు. ఇంత ధైర్యం ఉందా ? కేవలం దాతగా అవ్వండి. దాతగా అయితే దాత యొక్క భావన ద్వారా మీ యొక్క ఉన్నత కుటుంబీకులు మరియు సమీప ప్రజలు చాలా త్వరగా తయారవుతారు. వారు ఎదురుచూస్తున్నారు, మీరు కేవలం దాత అవ్వండి. దీనిలోనే ఆలస్యం ఉంది. మహా సహయోగిగా అవ్వటంలో ఆలస్యం ఉంది. ఖజానాలను ఎక్కువగా స్వయం పట్ల లేదా స్వయం సేవల పట్ల ఉపయోగిస్తున్నారు. మీ సేవల యొక్క బాధ్యతలలో ఎక్కువ ఉపయోగిస్తున్నారు. మహా దాత అయ్యి, బేహద్ దాత అయ్యి, విశ్వం యొక్క గ్లోబ్ పై నిల్చుని బేహద్ సేవలో తరంగాలు వ్యాపింపచేయండి. విశ్వరాజుగా అవ్వాలి కానీ కేవలం మీ జోన్ కి మీ సేవాపరిధికి రాజు అవ్వటం కాదు. విశ్వకళ్యాణకారులు కనుక ఇప్పుడు బేహద్ లోకి వెళ్ళండి. బేహద్ లోకి వెళ్ళటం ద్వారా హద్దు విషయాలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. మనోబలం చాలా శ్రేష్టమైన బలం దానిని ఉపయోగించటం లేదు. వాణీ మరియు సంబంధ, సంపర్కాల సేవలో బిజీ అయిపోతున్నారు. ఇప్పుడు మనోబలాన్ని పెంచుకోండి. ఇప్పుడు మీరు వాణీ ద్వారా మరియు సంబంధం ద్వారా, సహయోగం ద్వారా బేహద్ సేవ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనోబలం ద్వారా చేయండి. మనోబలం యొక్క బేహద్ సేవ అంటే మీ యొక్క బేహద్ వృత్తి ద్వారా, మనోబలం ద్వారా విశ్వం యొక్క గోళంపై ఉన్నత స్థితిలో స్థితులైతే, బాబాతో పాటు పరంధామం యొక్క స్థితిలో స్థితులై ఈ సేవ కొద్ది సమయం చేసినా దీనికి ప్రాలబ్దం అనేక రెట్లు లభిస్తుంది.
ఈనాటి సమయం మరియు పరిస్థితులు అనుసారంగా మనోబలం యొక్క సేవయే అంతిమసేవ. ఈ అభ్యాసం ఇప్పటినుండి చేయండి. వాణీ ద్వారా లేదా సంబంధ, సంపర్కాల ద్వారా సేవ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఈ సేవ యొక్క అవసరం ఉంది. కనుక వెనువెంట ఈ అభ్యాసం కూడా చేయండి. ఏమి చేయాలో అర్థమైందా? ఆదిలో బాబా యొక్క మనస్సు ద్వారానే ఆత్మిక ఆకర్షణ పిల్లలను ఆకర్షించింది అలాగే ఆ మనసాసేవ కూడా ఇదే అద్భుతం చూపిస్తుంది. మరియు ఆదిలో మనసా సేవ యొక్క ప్రభావం ఇప్పుడు కూడా చూస్తున్నారు, ఆ ఆత్మలే ఇప్పుడు కూడా పునాదిగా అయ్యారు. డ్రామానుసారంగా ఇది బాబా యొక్క మనసా ఆకర్షణకు రుజువు. ఎంతమంది పక్కాగా అయ్యారు! అంతిమంలో కూడా ఇప్పుడు ఎవరైతే బాబాతో పాటు మీ యొక్క మనసా ఆకర్షణ ద్వారా, మీ యొక్క ఆత్మిక ఆకర్షణ ద్వారా ఎవరైతే ఆత్మలు వస్తారో వారు సమయం అనుసరించి సమయం తక్కువ, శ్రమ తక్కువ మరియు బ్రాహ్మణ పరివారంలో వృద్ధికి నిమిత్తం అవుతారు. ఆది స్థితియే అంతిమంలో కూడా చూస్తారు. ఆదిలో బ్రహ్మాబాబా యొక్క సాధారణ రూపం చూసేవారు కాదు, కృష్ణుని రూపాన్ని అనుభవం చేసుకునేవారు. సాక్షాత్కారం వేరే విషయం కానీ నడుస్తూ, తిరుగుతూ, సాక్షాత్ స్వరూపంలో కృష్ణుడిని చూసారు. స్థాపన ఆదిలో బాబా ఒక్కరే చేసారు కానీ అంతిమంలో పిల్లలైన మీరు కూడా ఆత్మల ముందు సాక్షాత్తు దేవీదేవతల రూపంలో కనిపిస్తారు. వీరు సాధారణమైనవారు కాదు అని అప్పుడు అందరు అర్థం చేసుకుంటారు. పూజ్యస్థితి యొక్క అనుభవం చేసుకుంటారు. అప్పుడే బాబాతో పాటు మీ యొక్క ప్రత్యక్షతా పరదా తెరుచుకుంటుంది. ఇప్పుడు ఒంటరిగా బాబా ఒక్కరే కాదు పిల్లలతో పాటు ప్రత్యక్షం అవుతారు. ఎలా అయితే ఆదిలో బ్రహ్మాబాబాతో పాటు పిల్లలు కూడా స్థాపనా కార్యానికి నిమిత్తం అయ్యారో అదేవిధంగా అంతిమంలో కూడా బాబాతో పాటు సాటిలేని పిల్లలు కూడా సాక్షాత్తు దేవీ, దేవతలుగా అనుభవం అవుతారు. దీని కొరకు ఈ రోజు చెప్పాను కదా - ఇప్పటి నుండి ప్రాలబ్ద స్వరూపంలో స్థితులవ్వండి. చిన్న చిన్న విషయాల నుండి ఇప్పుడు ఉన్నతంగా వెళ్ళండి. విశేష ప్రాలబ్ద స్వరూపాన్ని స్వయం కూడా అనుభవం చేసుకోండి మరియు ఇతరులకు కూడా అనుభవం చేయించండి. అర్థమైందా! ఇప్పుడు అందరూ మీ అనాది స్వరూపంలో ఒక సెకనులో స్థితులు కాగలరా? ఎందుకంటే అంతిమంలో ఒక సెకనులో ఈల మ్రోగుతుంది. కనుక ఇప్పటి నుండి అభ్యాసం చేయండి. ఒక సెకనులో ఆ స్వరూపంలో స్థితులైపోవాలి. (డ్రిల్ చేయించారు) మంచిది. అందరూ విశ్రాంతిగా ఉన్నారు కదా? శాంతివనం బావుందా? అందరికీ ఇష్టమేనా? డబల్ విదేవీశీయులు చేతులు ఎత్తండి? డబల్ విదేశీయులకు డబల్ సంతోషం ఉందా లేదా కోటానుకోట్ల రెట్లు ఉందా? విదేశంలో అయితే వింటున్నారు కదా? అన్ని దేశాలలో వింటున్నారు. (శాటిలైట్, ఇంటర్నెట్ ద్వారా 50 దేశాల కంటే ఎక్కువ దేశాలలో డైరెక్ట్ బాప్ దాదా యొక్క మురళి వింటున్నారు) చూడండి, విదేశీయుల ఆవిష్కరణ మొదట విదేశీయులకే ఉపయోగపడింది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. విదేశీయులు బాప్ దాదాని ప్రత్యక్షం చేయటంలో సహయోగి అయ్యారు, ఇక ముందు కూడా అవుతారు. బుద్ధి ద్వారా బాగా ఆలోచిస్తారు. ఆవిష్కరణ మంచిగా ప్రారంభించారు. అందువలనే మొదటి అవకాశం మీకే లభించింది. ఎవరికి వారు తమతమ దేశాలలో వింటున్నారు. బాప్ దాదా పిల్లలందరినీ ఈ సభలో ఫరిస్తా రూపంలో చూస్తున్నారు. డబల్ సభను చూస్తున్నారు. 1. సాకారసభ మరియు 2. ఫరిస్తాల సభ. భారతదేశంలో కూడా నలువైపుల పిల్లలు ఈ సమయంలో ఫరిస్తా రూపంలో శాంతివనం చేరుకున్నారు. సాకారరూపధారి పిల్లలకు మొదట లెక్కలేనన్ని ప్రియస్మృతులు ఇస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు - కోనకోనలో ఉన్న పిల్లలు శాంతివననివాసీ అయ్యి అవ్యక్త అనుభవం చేసుకుంటున్నారు. చాలా మంచి సాధనాలు లభించాయి. సాధన మరియు సాధనాలు రెండూ వెనువెంట ఉంచుకోవాలి. మంచిది.
నలువైపుల ఉన్నటువంటి సదా భాగ్య రేఖలను ప్రత్యక్ష రూపంలో స్మృతిలోకి తీసుకువచ్చే వారికి, సదా మీ యొక్క సంగమయుగి సర్వప్రాప్తుల యొక్క ప్రాలబ్ద స్వరూపాన్ని అనుభవం చేసుకునేవారికి, సదా మాస్టర్ దాత, మహాసహయోగి ఆత్మలకు, సదా మనసా సేవ ద్వారా విశ్వ ఆత్మలకి కళ్యాణం చేసే కళ్యాణకారి ఆత్మలకి బాబా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment