10-03-1996 అవ్యక్త మురళి

         10-03-1996         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

చేసి చేయించేవారి యొక్క స్మృతి ద్వారా కర్మాతీత స్థితి యొక్క అనుభవం.

ఈరోజు కళ్యాణకారి బాప్ దాదా తన తోటి కళ్యాణకారి పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరు చాలా సంలగ్నతతో, ప్రేమతో కళ్యాణం యొక్క కార్యంలో నిమగ్నం అయ్యి ఉన్నారు. అటువంటి తోడు అయిన వారిని చూసి బాప్ దాదా సదా ఓహో నా సహయోగి పిల్లలు! ఓహో!! ఓహో!! అని పాట పాడుతున్నారు. మీరందరూ కూడా ఓహో! ఓహో!! అనే పాట పాడుతున్నారా? ఈరోజు బాప్ దాదా నలువైపుల యొక్క సేవా వేగాన్ని చూసారు. మరియు స్వపురుషార్ధం యొక్క వేగాన్ని కూడా చూసారు. సేవ మరియు స్వపురుషార్థం రెండింటిలో ఏమి చూసి ఉంటారు? మీకు తెలుసా? సేవ యొక్క వేగం తీవ్రంగా ఉందా? లేక స్వ పురుషార్థం యొక్క వేగం తీవ్రంగా ఉందా? ఎలా ఉంది? రెండింటి సమానత ఉందా? లేదా? విశ్వపరికర్తను చేసే ఆత్మలకి మరియు ప్రకృతికి ఎప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి? ఎందుకంటే సమానత ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలే ఇతరులకి లభిస్తాయి. తేడా ఎందుకు ఉంది? కర్మయోగి అని పిలుచుకుంటున్నారా? లేక కేవలం యోగి అంటున్నారా? కర్మ యోగులు కదా! పక్కాయే కదా! సేవ కూడా కర్మయే కదా! కర్మలోకి వస్తున్నారు,మాట్లాడుతున్నారు లేదా దృష్టి ఇస్తున్నారు, కోర్స్ చెప్తున్నారు, మ్యూజియంలో పరిచయం ఇస్తున్నారు. ఇవన్నీ శ్రేష్టకర్మలు అంటే సేవ. కర్మయోగి అంటే కర్మ చేస్తున్న సమయంలో కూడా యోగం యొక్క సమానత ఉండాలి కానీ సమానత తక్కువ అయిపోతుంది అని మీరే చెప్తున్నారు. దీనికి కారణం ఏమిటి? మీకు అది బాగా తెలుసు, క్రొత్త విషయం కాదు. చాలా పాత విషయం. బాప్ దాదా చూసారు - సేవ లేదా కర్మ మరియు స్వ పురుషార్థం అంటే యోగయుక్త స్థితి రెండింటి సమానత ఉంచుకునేటందుకు విశేషంగా ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. అది ఏమిటి? బాబా చేయించేవారు, నేను ఆత్మను, చేసేవాడిని, చేసి చేయించేవాడు బాబా. ఈ ఒక్క మాట మీ సమానతను సహజం చేస్తుంది. స్వ పురుషార్థం యొక్క సమానత లేదా వేగం ఒక్కొక్కసారి తక్కువ అయిపోతుంది. దానికి కారణం ఏమిటి? నేను చేసేవాడిని అని అనుకోవడానికి బదులు నేనే చేసేవాడిని లేదా చేసేదాన్ని అని ఇలా చేసే వారికి బదులు చేయించేవారిగా భావిస్తున్నారు. నేను చేస్తున్నాను అంటున్నారు. ఏదైనా కానీ, ఏ రకంగానైనా మాయ వస్తుంది అంటే దానికి ద్వారం ఏమిటి? మాయకి అన్నింటికంటే మంచి, సహజ ద్వారం మీకు తెలుసు. అది - “నేను” అనే భావం. ఈ ద్వారాన్ని ఇప్పుడింకా పూర్తిగా మూసివేయలేదు. మాయ సహజంగా తెరుచుకుని లోపలికి వచ్చేసే విధంగా మూసారు అంతే. నేను చేసేవాడిని అని అనుకుంటే చేయించేవారు సహజంగానే జ్ఞాపకం వస్తారు. నేను చేస్తున్నాను కానీ చేయించేవారు బాబా, చేయించేవారు లేకుండా చేసేవారిగా అవ్వలేరు. చేయించేవారి స్మృతి డబల్ రూపంలో ఉండాలి. 1. బాబా చేయించేవారు 2. నేను ఆత్మను ఈ కర్మేంద్రియాల ద్వారా చేయించేవాడిని. దీని ద్వారా కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క మంచి లేదా చెడు యొక్క ప్రభావంలోకి రారు. దీనినే కర్మాతీత స్థితి అంటారు. 

మీ అందరి లక్ష్యం ఏమిటి? కర్మాతీతంగా అవ్వాలి కదా! లేదా కొద్దికొద్దిగా కర్మ బంధన ఉన్నా పర్వాలేదా? ఉండాలా లేక ఉండకూడదా? కర్మాతీతంగా అవ్వాలా? బాబాపై ప్రేమకి గుర్తు - కర్మాతీతంగా అవ్వటం. కనుక “చేసేవారు” అయ్యి కర్మ చేయండి, చేయించండి, కర్మేంద్రియాలు మీచే చేయించకూడదు. కానీ మీరు కర్మేంద్రియాలతో చేయించండి. పూర్తిగా మిమ్మల్ని మీరు అతీతంగా భావించి కర్మ చేయించాలి - ఈ భావం ప్రత్యక్షంగా ఉండాలి. గుప్తంగా ఉండటం కాదు. గుప్త రూపంలో అప్పుడప్పుడు “చేయించేవారు” దీనికి బదులు కర్మేంద్రియాలు అంటే మనస్సు, బుద్ధి, సంస్కారాలకు వశం అయిపోతున్నారు. కారణం ఏమిటి? చేయించే ఆత్మను, యజమానిని, విశేష ఆత్మను, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను... ఈ స్మృతి యాజమానత్వం యొక్క స్మృతి ఇప్పిస్తుంది. లేకపోతే ఒక్కొక్కసారి మనస్సు మిమ్మల్ని నడిపిస్తుంది, ఒక్కొక్కసారి మీరు మనసుని నడిపిస్తారు. అందువలన సదా సహజంగా మన్మనాభవ యొక్క స్థితి ఉండటం లేదు. నేను పూర్తిగా వేరు అనుకోవాలి కేవలం వేరు కాదు యజమానిని. బాబాని స్మృతి చేయటంలో నేను పిల్లవాడిని, కర్మ చేయించే యజమానిని. ఇప్పుడు ఈ అభ్యాసంపై ధ్యాసలో లోపం ఉంది. సేవలో చాలా మంచిగా నిమగ్నం అయ్యి ఉన్నారు. కానీ లక్ష్యం ఏమిటి? సేవాధారి అయ్యే లక్ష్యమా? లేక కర్మాతీతంగా అయ్యే లక్ష్యమా? లేక రెండూ వెనువెంట అవుతారా? ఈ అభ్యాసం పక్కాయేనా? ఇప్పుడిప్పుడే కొంచెం సమయం ఈ అభ్యాసం చేయగలరా? వేరు అయిపోగలరా? లేక అతీతంగా అవ్వటంలో సమయం పట్టే విధంగా తగుల్కుని ఉన్నారా? ఎంత సమయంలో వేరవ్వగలరు? అయిదు నిమిషాలు కావాలా, ఒక నిమిషం కావాలి లేక ఒక్క సెకను కావాలా? ఒక్క సెకనులో అవ్వగలరా? 

పాండవులు ఒక్క సెకనులో ఒకేసారి వేరు అయిపోగలరా? ఆత్మ వేరు యజమాని మరియు కర్మచారీలు అయిన కర్మేంద్రియాలు వేరు. ఈ అభ్యాసం ఎప్పుడు కావాలంటే అప్పుడు జరగాలి. మంచిది. ఇప్పుడిప్పుడే ఒక్క సెకనులో అతీతంగా మరియు బాబాకి ప్రియంగా అయిపోండి. నేను అతీతం, ఈ కర్మేంద్రియాలు నాకు సహయోగీలు, కర్మకి తోడు కానీ నేను పూర్తిగా అతీతం మరియు అతిప్రియం అని శక్తిశాలి అభ్యాసం చేయండి. ఇప్పుడు ఒక్క సెకనులో ఈ అభ్యాసాన్ని పెంచండి. సహజం అనిపిస్తుందా లేక కష్టం అనిపిస్తుందా? సహజమే అయితే రోజంతటిలో కర్మ సమయంలో ఈ అభ్యాసం చేయండి. అప్పుడు కర్మాతీత స్థితి యొక్క అనుభవం సహజం అవుతుంది. ఎందుకంటే సేవని లేదా కర్మని వదలగలరా? వదిలేస్తారా? చేయవలసిందే. తపస్సులో కూర్చోవటం కూడా ఒక కర్మ (పని) అంటే కర్మ లేకుండా, సేవ లేకుండా ఉండలేరు మరియు ఉండకూడదు కూడా. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. సేవ ఇప్పుడింకా చాలా ఉంది. సేవ యొక్క రూపురేఖ మారింది. కానీ ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఆత్మల నింద మిగిలి ఉంది. అందువలన సేవ మరియు స్వ పురుషార్థం రెండింటి సమానత ఉంచుకోండి. సేవలో చాలా బిజీగా ఉన్నాం కనుక స్వ పురుషార్థం తక్కువ అయిపోయింది అని అనకండి. సేవలో, స్వ పురుషార్థం యొక్క ధ్యాస మరింత ఉండాలి. ఎందుకంటే సేవలో చాలా రకాలుగా మాయ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. పేరు సేవ కానీ ఉండేది స్వార్థం. స్వయం ముందుకి వెళ్ళాలి. వెళ్తూ సమానతని మర్చిపోకూడదు. ఎందుకంటే సేవలోనే స్వభావ, సంబంధాల యొక్క విస్తారం ఉంటుంది మరియు మాయ కూడా అవకాశం తీసుకుంటుంది. కొంచెం అయినా సమానత తక్కువ అయ్యింది అంటే మాయ క్రొత్త క్రొత్త రూపాలను ధరిస్తుంది. పాత రూపంలో రాదు. క్రొత్త,కొత్త రూపాలలో, క్రొత్త,క్రొత్త పరిస్థితుల రూపంలో, సంపర్కం రూపంలో వస్తుంది. సేవను వదిలేసి వేరుగా ఒక నెల లేదా 15 రోజులు యోగంలో బాప్ దాదా కూర్చోబెడితే కర్మాతీతంగా అయిపోతారా? ఇంకేమీ చేయవద్దు. కూర్చుని తపస్సు చేయండి. భోజనం కూడా ఒకేసారి తయారు చేసుకోండి అంటే అప్పుడు కర్మాతీతంగా అయిపోతారా? అవ్వరా? 

సమానత యొక్క అభ్యాసం లేకపోతే ఒక నెల లేదా రెండు నెలలు అయినా కూర్చుని తపస్సు చేసినా తనువు కూర్చుంటుంది కానీ మనస్సు కూర్చోదు. కేవలం తనువునే కాదు, మనస్సుని కూడా కూర్చోబెట్టాలి. తనువుతో పాటూ మనస్సుని కూడా కూర్చోబెట్టాలి. బాబా మరియు నేను అంతే రెండవవారు లేరు. ఒక నెల ఇలా తపస్సు చేయగలరా లేదా సేవ జ్ఞాపకం వస్తుందా? బాప్ దాదా చెప్తున్నారు లేదా డ్రామా చూపిస్తుంది. రోజు రోజుకి సేవ పెరగవలసిందే ఇక ఎలా కూర్చుంటారు? ఇంతకు ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం యొక్క సేవ పెరిగిందా లేక తగ్గిందా? పెరిగిపోయింది కదా! వద్దనుకున్నా కానీ సేవ యొక్క బంధనలో బంధించబడి ఉన్నారు. కానీ సమానత ద్వారా సేవా బంధన అనేది బంధనం కాదు, సంబంధంగా అవుతుంది. లౌకిక సంబంధంలో కూడా 1. కర్మ బంధన 2. సేవా సంబంధం బంధనగా అనుభవం అవ్వదు. సేవ మధుర సంబంధం. అయితే ఏమి ధ్యాస ఉంచుకుంటారు? సేవ మరియు స్వ పురుషార్థం రెండూ సమానంగా ఉండాలి. అతిగా సేవలోకి వెళ్ళకండి. నేనే చేయాలి, నేనే చేయగలను అని అనుకోకూడదు. చేయించేవారు చేయిస్తున్నారు. నేను కేవలం నిమిత్తంగా చేసేవాడిని అనుకోండి అప్పుడు బాధ్యత ఉన్నా కానీ అలసట తగ్గుతుంది. కొంతమంది పిల్లలు అంటున్నారు - చాలా సేవ చేసాం కదా! అందువలన అలసిపోయాం, తల బరువు అయిపోయింది. కానీ సేవ వలన తల బరువు అవ్వదు. చేయించే బాబా చాలా మంచిగా మసాజ్ చేస్తారు. తల ఇంకా తాజాగా అయిపోతుంది, అలసట అనిపించదు, ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. సైన్స్ యొక్క మందులు శరీరానికి శక్తి ఇస్తున్నాయి అయితే బాబా యొక్క స్మృతితో ఆత్మలో శక్తి రాలేదా? ఆత్మకి శక్తి వస్తే అది స్వతహాగానే తనువుపై ప్రభావం వేస్తుంది. అనుభవీలే కదా! అప్పుడప్పుడు అనుభవం అవుతుంది కదా - మరలా నడుస్తూ, నడుస్తూ లైన్ మారిపోతుంది, అది తెలియటం లేదు. మరలా ఉదాసీనత, అలసట లేదా తల బరువు అయిపోయినప్పుడు ఏమి అయ్యింది? ఎందుకు అయ్యింది? అని తెలివి వస్తుంది. చేసేవారు మరియు చేయించేవారిని జ్ఞాపకం ఉంచుకోండి. సహజమా లేక కష్టమా? అలాగే అని చెప్పండి. మంచిది. 

ఇప్పుడు 9 లక్షల ప్రజలని తయారుచేసారా? విదేశాలలో ఎంత మంది తయారయ్యారు? 9 లక్షలు తయారయ్యారా? భారతదేశంలో తయారయ్యారా? తయారవ్వలేదు. మీరే సమాప్తి యొక్క ముల్లుని ముందుకి వెళ్ళనివ్వటం లేదు. సమానత ఉంచుకోండి. వజ్రోత్సవం కదా! బాగా సేవ చేయండి కానీ సమానత ఉంచుకుని సేవ చేయండి. అప్పుడు తొందరగా ప్రజలు తయారవుతారు, సమయం పట్టదు. ప్రకృతి కూడా చాలా అలసిపోయింది. ఆత్మలు కూడా నిరాశ అయిపోయారు. నిరాశ అయినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారు? భగవంతుడిని, బాబాని జ్ఞాపకం చేస్తారు. కానీ పూర్తి పరిచయం లేని కారణంగా దేవీదేవతలైన మిమ్మల్ని ఎక్కువ జ్ఞాపకం చేస్తున్నారు. కానీ నిరాశా ఆత్మల యొక్క పిలుపు మీకు వినబడటం లేదా? వినబడుతుందా? లేక మీలోనే లీనం అయిపోయారా? దయాసాగరులు కదా! బాబాని కూడా ఏమంటారు? దయాసాగరుడు అంటారు. అన్ని ధర్మాల వారు దయ తప్పక అడుగుతారు. సుఖం అడగరు కానీ దయ అందరికీ కావాలి. ఇచ్చేవారు ఎవరు? మీరు ఇచ్చేవారే కదా లేక తీసుకునేవారా? తీసుకుని ఇచ్చేవారు. దాత యొక్క పిల్లలు కదా! మీ సోదరీసోదరులపై దయాహృదయులు అవ్వండి. దయాహృదయులుగా అయ్యి సేవ చేస్తే దానిలో నిమిత్త భావం స్వతహాగానే ఉంటుంది. ఎవరైనా ఎంత చెడుగా ఉన్నా కానీ వారి పట్ల మీకు దయాభావన ఉంటే ఎప్పుడూ వారి పట్ల ఈర్ష్య, అసూయ లేదా క్రోధం యొక్క భావన ఉత్పన్నం అవ్వదు అంటే దయాభావన సహజంగానే నిమిత్త భావనని తీసుకువస్తుంది. స్వార్థపూరితమైన దయ ఉంకూడదు సత్యమైన దయ ఉండాలి. స్వార్ధంతో కూడిన దయ కూడా ఉంటుంది. ఏదోక ఆత్మపై లోపల తగుల్పాటు ఉంటుంది కానీ వారిపై దయాభావన ఉంచుకుంటున్నాను అని అనుకుంటారు. అది స్వార్ధపూరితమైన దయ అయ్యింది. సత్యమైన దయ కాదు. సత్యమైన దయలో ఏ తగుల్పాటు ఉండదు, ఏ దేహాభిమానం ఉండదు. ఆత్మ ఆత్మపై దయ చూపిస్తున్నారు. దానిలో దేహాభిమానం లేదా దేహ ఆకర్షణ యొక్క నామరూపాలు ఏవీ ఉండవు. కొందరికి శరీరంతో తగుల్పాటు ఉంటుంది. కొందరికి గుణాలతో, విశేషతలతో ఉంటుంది. కానీ విశేషత లేదా గుణాలు ఇచ్చేవారు ఎవరు? ఆత్మ ఎంత గొప్పది అయినా బాబా నుండి తీసుకోవలసిందే. అది మీ స్వంతం కాదు. బాబా ఇచ్చారు. అయితే బాబా నుండే ప్రత్యక్షంగా ఎందుకు తీసుకోరు? అందువలనే స్వార్థపూరితమైన దయ ఉండకూడదు అని చెప్పారు. కొంతమంది పిల్లలు ఒయ్యారం చూపిస్తున్నారు. ఉండేది స్వార్ధం కానీ దయ చూపిస్తున్నాను అంటారు. ఇంకేమీ కాదు. కేవలం దయ ఉంది అంతే అంటారు. కానీ పరిశీలించుకోండి - నిస్వార్ద దయ ఉందా? మోహముక్త దయ ఉందా? ఏదైనా అల్పకాలిక ప్రాప్తి కారణంగా దయ లేదు కదా! అని. మరలా చాలా మంచివారు కదా! చాలా మంచిగా ఉన్నారు కదా అంటారు. అందువలన కొంచెం... అంటారు. ఆ కొంచెం కొరకు కూడా అనుమతి లేదు. కర్మాతీతంగా అవ్వాలంటే ఈ విఘ్నాలన్నీ దేహాభిమానంలోకి తీసుకువచ్చేస్తాయి. మంచివారే కానీ తయారుచేసేవారు ఎవరు? మంచిని ధారణ చేయండి. కానీ మంచికి ప్రభావితం అయిపోకండి. అతీతంగా మరియు బాబాకి ప్రియంగా ఉండండి. బాబాకి ప్రియమైనవారు సదా రక్షణగా ఉంటారు. అర్థమైందా! 

సేవని పెంచుతున్నారు కదా! పెంచవలసిందే. స్థాపనని కూడా సమీపంగా తీసుకురావాలా? లేదా? ఎవరు తీసుకువస్తారు? బాబా తీసుకువస్తారా? అందరు తీసుకువస్తారు. మీరందరు కూడా బాబాకి సహయోగీలు కదా! బాబా కూడా ఒంటరిగా ఏమీ చేయలేరు. పిల్లలు లేకుండా ఏమి చేయలేరు. ఎవరికైనా చెప్పాలంటే కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకోవలసి ఉంటుంది. శరీరం లేకుండా మాట్లాడగలరా? పాత బండి అయినా, మంచిది అయినా కానీ ఆధారంగా తీసుకోవలసిందే. ఆధారం లేకుండా చేయలేరు. బ్రహ్మాబాబాని తోడు తీసుకున్నారు కదా! అప్పుడే బ్రాహ్మణులైన మీరు తయారయ్యారు. బ్రహ్మాకుమారులు అంటున్నారు కానీ శివకుమారులు అనటం లేదు. ఎందుకంటే నిరాకార బాబా కూడా సాకారాన్ని ఆధారంగా తీసుకోవలసిందే. సాకారంలో బ్రహ్మాబాబాని ఆధారంగా తీసుకున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మని అవ్యక్త ఫరిస్తా రూపంలో ఆధారం తీసుకోకుండా మీ పాలన చేయలేరు. సాకారంలో తీసుకున్నా లేదా ఆకారంలో తీసుకున్నా కానీ ఆత్మ యొక్క ఆధారం లేదా తోడు తీసుకోవలసిందే. బాబా సర్వ శక్తివంతుడు. వినాశి గారడి చేసేవారు ఒక్క సెకనులో ఆట చూపించగలరు. సర్వశక్తివంతుడు ఏది కావాలంటే అది చేయలేరా? చేయగలరా? ఇప్పుడిప్పుడే వినాశనం చేయగలరా? ఒంటరిగా చేయగలరా? ఒంటరిగా చేయలేరు. సర్వశక్తివంతుడైన కానీ సహయోగులైన మీ అందరి సంబంధంతో బంధించబడి ఉన్నారు. బాబాకి మీరంటే ఎంత ప్రేమ ఉంది కావాలంటే చేయగలరు. కానీ చేయటం లేదు. గారడి యొక్క కర్ర తిప్పలేరనుకుంటున్నారా? కానీ బాబా అంటున్నారు రాజ్యాధికారిగా ఎవరు అవుతారు? బాబా అవుతారా? మీరే అవుతారు. స్థాపన, వినాశనం రెండూ బాబాయే చేసేస్తే రాజ్యం ఎవరు చేస్తారు? మీరు లేకుండా పని అవుతుందా? అందువలన బాబా మిమ్మల్ని అందరిని కర్మాతీతంగా తయారుచేయవలసిందే. తయారవ్వలిసిందేనా? లేక బలవంతంగా బాబా తయారుచేయాలా? బాబా తయారుచేయాలి మరియు మీరందరూ తయారవ్వాల్సిందే; ఇదే మధురమైన డ్రామా. డ్రామా మంచిగా అనిపిస్తుంది కదా? ఇలా తయారయ్యిందేమిటి అని అప్పుడప్పుడు విసిగిపోతున్నారా? ఈ డ్రామా మారాలి అని అనుకుంటున్నారా? బాబా కూడా అంటున్నారు. అనాదిగా తయారైపోయిన డ్రామా దీన్ని ఎవరూ మార్చలేరు. పునరావృతం అవ్వవలసిందే. కానీ మార్చలేరు. డ్రామాలో మీ అంతిమ జన్మకి చాలా శక్తులు ఉన్నాయి. అవ్వడానికి ఇది డ్రామాయే కానీ ఈ డ్రామాలో ఈ శ్రేష్ట బ్రాహ్మణ జన్మలో చాలా శక్తులు లభించాయి. బాబా విల్ చేసారు. అందువలన విల్ పవర్ ఉంది. అయితే ఏ మాట జ్ఞాపకం ఉంచుకుంటారు? చేసి చేయించేవారి యొక్క స్మృతి ఉండాలి. పక్కాయేనా? లేక విమానంలో వెళ్తూ వెళ్తూ మర్చిపోతారా? మర్చిపోకూడదు. ఇప్పుడు మరలా ఈ శరీరం యొక్క బంధనకి అతీతంగా కర్మాతీత స్థితి అంటే కర్మ చేస్తున్నారు. కానీ అతీతం. చూస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అతీతంగా, యజమానులు మరియు బాబా ద్వారా నిమిత్తం అయిన ఆత్మను అనే స్మృతిలో మనస్సు మరియు బుద్ధిని స్థితులు చేయండి (ఆత్మిక వ్యాయామం) 

మంచిది. నలువైపుల ఉన్న సదా సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలతో ఉండే సేవాధారి ఆత్మలకు, సదా స్వ పురుషార్థం మరియు సేవ రెండింటి సమానత ఉంచుకునే దయాసాగర ఆత్మలకు, సదా నిస్వార్ధ దయా హృదయులుగా అయ్యి సర్వాత్మల పట్ల సత్యమైన దయ చూపించే విశేష ఆత్మలకు, సదా ఒక్క సెకనులో స్వయాన్ని కర్మబంధన లేదా అనేక రాయల్ బంధనాల నుండి ముక్తి చేసుకునే తీవ్ర పురుషార్ధి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments