07-11-1995 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బాప్ దాదాకి విశేషంగా ప్రియమైనది మరియు జ్ఞానానికి పునాది - పవిత్రత.
ఈ రోజు ప్రేమ సాగరుడైన బాప్ దాదా తన ప్రేమ స్వరూప పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. పిల్లలందరిలో బాబా యొక్క ప్రేమ నిండి ఉంది. ప్రేమ అనేది పిల్లలందరినీ దూరం నుండి సమీపానికి తీసుకువస్తుంది. మీరు భక్త ఆత్మగా ఉన్నప్పుడు బాబాకు ఎంత దూరంగా ఉండేవారు. అందువలన నలువైపుల వెతుకుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఎంత సమీపంగా అయిపోయారంటే ప్రతి ఒక్క బిడ్డ నిశ్చయం మరియు నషాతో అంటారు - నా బాబా నా తోడుగా ఉన్నారు అని. తోడుగా ఉన్నారా లేదా ఇంకా వెతకవలసి ఉందా? ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని ఇంకా వెతుకుతున్నారా? అంటే ఎంత సమీపంగా అయిపోయారు? ఎవరైనా పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని అడిగితే ఏం చెప్తారు? నా తోడుగా ఉన్నారు అంటారు కదా! నషాగా చెప్తారు బాబా నేను లేకుండా ఉండలేరు. అంటే అంత సమీపంగా, తోడుగా అయిపోయారు. మీరు కూడా బాబా లేకుండా ఒక్క సెకను అయినా కానీ ఉండలేరు కదా!అయితే మాయ వచ్చినప్పుడు తోడు ఎవరు? ఆ సమయంలో బాబా తోడుగా ఉంటే మాయ రాగలదా? కానీ వద్దనుకున్నా మధ్యమధ్యలో పిల్లలు బాబాతో కళ్ళ గంతల ఆట ఆడుతున్నారు. బాప్ దాదా పిల్లల యొక్క ఈ ఆట చూస్తున్నారు, పిల్లలు ఒకవైపు నా బాబా! నాబాబా! అంటున్నారు, మరొకవైపు బాబాని వేరు చేసేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా ఎవరైనా మిమ్మల్ని ఒక ప్రక్కకి వేరు చేసేస్తే మీరు కనిపించరు కదా. అదేవిధంగా మీరు కూడా మాయ వైపుకి వెళ్ళిపోతున్నారు. బాబాని చూసే దృష్టి మూసుకుని పోతుంది, మాయని చూసే దృష్టి తెరుచుకుంటుంది. ఇటువంటి దాగుడుమూతల ఆట అప్పుడప్పుడు ఆడుతున్నారా? అయినా కానీ బాబా పిల్లలపై దయాహృదయులుగా అయ్యి మాయ నుండి ఏదోక రకంగా వేరు చేస్తున్నారు. మాయ మూర్చితంగా చేస్తుంది. బాబా మరలా మీరు నా వారు అంటూ తెలివిలోకి తీసుకువస్తున్నారు. మూసుకుపోయిన నేత్రాన్ని స్మృతి యొక్క గారడీతో తెరుస్తున్నారు. బాప్ దాదా అడుగుతున్నారు అందరికి ప్రేమ ఎంత శాతంలో ఉంది? అని. అందరు అంటారు 100 శాతం కంటే ఎక్కువ, కోటానుకోట్ల రెట్లు ప్రేమ ఉంది అని అంటారు కదా? మంచిది. కోట్లానుకోట్ల కంటే తక్కువ కోట్లు, లక్ష, వేయి లేదా నూరు శాతం ఉంది అనేవారు చేతులు ఎత్తండి. (ఎవరూ ఎత్తలేదు) మంచిది. అందరు పక్కాగా ఉన్నారు. బాప్ దాదా మరలా రెండవ ప్రశ్న అడుగుతున్నారు మరలా మారిపోకూడదు. మంచిది. చాలా మంచి శుభవార్త వినిపించారు, అందరికి కోటానుకోట్ల రెట్లు ప్రేమ ఉంది.
ఇప్పుడు బాబా అడుగుతున్నారు ప్రేమకి రుజువు ఏమిటి? (సమానంగా అవ్వటం) అయితే సమానంగా అయ్యారా? (లేదు) అంటే కోట్లానుకోట్ల కంటే తక్కువ అయినట్లే కదా! ఇంకా ఇప్పుడు సంపూర్ణంగా అవ్వటంలో సమయం ఉంది, అది కూడా అయిపోతుందిలే, అని అంటున్నారా? ప్రేమ ఉన్నవారు నా ప్రేమ కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేయి అని అంటే ప్రాణం ఇవ్వడానికి కూడా తయారైపోతారు. కానీ ఇక్కడ బాప్ దాదా అయితే ప్రాణం తీసుకోవటం లేదు, ఎందుకంటే ఆ ప్రాణంతోనే సేవ చేయాలి కదా! కానీ ఒక విషయం గురించి బాబా కొంచెం సమయం ఆశ్చర్యపడవలసి వస్తుంది. ఆశ్చర్యపడకూడదు అని మీకు కూడా చెప్తారు, కానీ బాప్ దాదాకి ఆశ్చర్యపడవలసి వస్తుంది. అటువంటి పాత్ర అభినయిస్తున్నారు. ప్రాణ త్యాగం గురించి వదిలివేయండి కానీ ప్రేమకి గుర్తు బలిహారం అవ్వటం, ఏది చెప్తే అది చేయాలి. బాబా కేవలం ఒక విషయంలో బలిహారం అవ్వటం చూడాలనుకుంటున్నారు. విషయాలు చాలా ఉన్నాయి, కానీ బాబా అనేక విషయాలు తీసుకోవటం లేదు. కేవలం ఒక విషయంలో బలిహారం అవ్వాలి. దాని కొరకే చేతులు ఎత్తమని అంటున్నారు, ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు కానీ మరలా చేస్తున్నారు, అది ఏమిటి? మాటిమాటికి బాబా నుండి వేరు అయిపోవడానికి గల ముఖ్య సంస్కారం లేదా ముఖ్య బలహీనత ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా! ప్రతి ఒక్కరు తమ ముఖ్య బలహీనతను తెలుసుకుంటున్నారు కదా? ఆ బలహీనత ఏమిటో తెలిసి కూడా ఎందుకు బలిహారం చేయటం లేదు? 63 జన్మల నుండి తోడు కనుక దానితో ప్రేమ ఉందా?
ప్రేమ అంటే ప్రేమించేవారికి ఏది ఇష్టమో అదే చేయాలి. ప్రేమించినవారు చెప్పేది ఒకటి, మనం చేసింది ఇంకొకటి అయితే ఏమౌతుంది? ప్రేమ అవుతుందా లేక పోట్లాట అవుతుందా? ఆ సమయంలో దానిని ప్రేమ అంటారా! కర్ర తీసుకుని ఒకరినొకరు కొట్టుకుంటారు. అయితే బాబాకి ఏది ఇష్టం? బాప్ దాదా అంటున్నారు సమానంగా అవ్వటంలో అనేక విషయాలు ఉన్నాయి. బ్రహ్మాబాబా యొక్క విశేషతలను చూడండి, బ్రహ్మాబాబా సమానంగా అవ్వాలంటే ఎంత పెద్ద జాబితా ఉంటుంది! దాని గురించి కూడా బాబా ఏమీ అనటం లేదు. ఒకటి, రెండు విషయాలు తక్కువ అయినా పర్వాలేదు. కానీ ముఖ్య పునాది లేదా బ్రహ్మాబాబాకు ఇష్టమైనది మరియు జ్ఞానానికి ఆధారం ఏమిటి? బ్రహ్మాబాబాకు మరియు శివబాబాకు విశేషంగా ప్రియమైనది ఏమిటి? (పవిత్రత, అంతర్ముఖత, నిశ్చయబుద్ధి, స్వచ్ఛత, సత్యత) వాస్తవానికి పునాది - పవిత్రత. కానీ పవిత్రత యొక్క పరిభాష చాలా గహ్యమైనది. పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చయం, సత్యత, స్వచ్చత అన్నీ వచ్చేస్తాయి. కానీ బాప్ దాదా చూస్తున్నారు, పవిత్రత యొక్క గుహ్యభాష, పవిత్రత యొక్క గుహ్యరహస్యం ఇప్పుడింకా బుద్దిలో స్పష్టంగా లేదు. వ్యర్థ సంకల్పాలు నడవటం మరియు నడిపంచటం, ఇవి స్వయంలో కూడా వస్తున్నాయి మరియు ఇతరులలో కూడా ఉత్పన్నం చేయడానికి నిమిత్తం అవుతున్నారు. ఈ వ్యర్ధసంకల్పాలు అనేవి పవిత్రతయా? సంకల్పం యొక్క పవిత్రతా రహస్యాన్ని అందరు ప్రత్యక్షంలోకి తీసుకురావాలి కదా! పంచ వికారాలలో కామం అయినా, మోహం అయినా అంటే మొదటిది కామం, చివరిది మోహం కానీ ఏ వికారం అయినా మొదట సంకల్పంలోనే ఉత్పన్నం అవుతుంది. వ్యర్ధ సంకల్పాలు క్రోధాన్ని కూడా ఉత్పన్నం చేస్తాయి, అలాగే కామం అంటే వ్యర్థ దృష్టి, ఏ ఆత్మ పట్ల అయినా వ్యర్థ దృష్టి ఉంటే ఆ సమయంలో దానిని పవిత్రత అని అనరు. అయితే ఈ వ్యర్థ సంకల్పాలను బాబా ప్రేమలో ఎందుకు బలిహారం చేయటం లేదు? (చేయగలం) "అలాగే" అనటం చాలా సహజం. కానీ బాప్ దాదా దగ్గర అయితే అందరి చార్ట్ ఉంటుంది కదా! ఇప్పటి వరకు పంచవికారాల యొక్క వ్యర్ధ సంకల్పాలు ఎక్కువ మందిలో నడుస్తున్నాయి. అది ఏ వికారం అయినా అవ్వవచ్చు. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇలా అవ్వకూడదు, అలా అవ్వాలి... అని అంటున్నారు మరియు ఒక సాధారణ విషయం బాప్ దాదా చెప్తున్నారు, జ్ఞాని ఆత్మలలో తమ గుణం యొక్క విశేషత యొక్క అభిమానం వస్తుంది లేదా ఎంతగా ముందుకి వెళ్తున్నారో అంతగా ఏదోక విషయంలో లోపాన్ని చూసి, అది స్వపురుషార్ధంలోనిది కాదు, కానీ పేరు, గౌరవం, మర్యాద అడగటంలో, ముందుకి రావటంలో, సెంటర్‌కి ఇన్చార్జి చేయటంలో, సేవలో, విశేషపాత్ర ఇవ్వటంలో లోపాలను చూస్తున్నారు, ఈ వ్యర్థ సంకల్పాలు కూడా విశేషంగా జ్ఞాని ఆత్మలకు చాలా నష్టం చేస్తాయి. మరియు ఈ రోజుల్లో ఈ రెండు విషయాలే విశేషంగా వ్యర్ధ సంకల్పాలకు ఆధారం. మీరు సేవకి వెళ్ళినప్పుడు ఒక రోజు యొక్క దినచర్యని నోట్ చేసుకోండి మరియు పరిశీలించుకోండి, ఒక రోజులో ఈ రెండింటిలో అంటే అభిమానం, అవమానం అంటే "నేను ఏం తక్కువ, నాకు కూడా ఈ పదవి కావాలి, నన్ను కూడా ముందు ఉంచాలి” అంటే ఇది అవమానంగా భావిస్తున్నట్లు కదా! ఈ రెండు విషయాలు అంటే అభిమానం మరియు అవమానం ఈ రెండే వ్యర్థ సంకల్పాల కారణం. ఈ రెండింటిని బలిహారం చేసేస్తే బాబా సమానంగా అవ్వటం కష్టం కాదు. అయితే బలిహారం చేసే శక్తి ఉందా? మంచిది. ఎంత సమయంలో చేస్తారు? ఇది నవంబర్ కదా, ఇంకొక రెండు నెలలలో క్రొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా! కనుక క్రొత్త సంవత్సరంలో క్రొత్త ఖాతా పెట్టుకుంటారు. అందువలన ప్రతి ఒక్కరు అంటే టీచర్ అయినా, విద్యార్థి అయినా, మహారథి అయినా, కాలిబలం వారు అయినా చేయాలి. అంతే కానీ ఇది మహారథీల కోసం, మేము అయితే చిన్న వాళ్ళం అని అనుకోవద్దు. రాజ్యభాగ్యం తీసుకునే సమయంలో మేము చిన్నవాళ్ళం అని ఎవరు అనరు. నన్నే రెండవ నారాయణుడిగా చేయండి అంటారు. ప్రతి ఒక్కరు రెండు మాటలలో మీ సమాచారం ఇవ్వాలి, ఆ కవరు పై “స్థితి యొక్క లెక్కాచారం” అని వ్రాసి పంపండి. అప్పుడు ఆ కవరు వేరేగా ఉంటుంది. ఆ ఉత్తరంలో వ్యర్ధ సంకల్పాలు ఎంత వరకు బలిహారం చేసారో వ్రాయండి. 50 శాతం చేసారా లేదా 100 శాతం చేసారా? అనేది కేవలం ఒకే లైన్ వ్రాయాలి, పెద్దగా వ్రాయకండి. పెద్దగా వ్రాస్తే దానిని మొదటే చించేస్తారు. అయితే తయారేనా? గట్టిగా చెప్పండి - చేస్తారా లేక చేయరా? దీని కొరకు ధైర్యం కావాలి, సమయం కావాలి అనేవారు ఇప్పుడే చేతులు ఎత్తండి. దాని కొరకు మీకు అవకాశం ఇప్పిస్తాను. ఎవరైనా ఉన్నారా? లేదా తర్వాత పురుషార్థం చాలా చేసాను కానీ అవ్వలేదు అని వ్రాస్తారా? అలా వ్రాయరు కదా? పక్కాయేనా? మంచిది. బాప్ దాదా అయితే చూసారు ప్రేమ అనేది మధువనం వరకు తీసుకువస్తుంది, కానీ ఈ ప్రేమతోనే ఇంకెక్కడికి చేరుకోవాలి? బాబా సమానంగా అవ్వాలి కదా! ఎలాగైతే మధువనానికి పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ వస్తారు కదా," నా పేరు తప్పక వ్రాయండి. 'నా పేరు తప్పక వ్రాయండి? అంటారు. వ్రాయకపోతే టీచరు పై కళ్ళు ఎర్ర చేస్తారు. ఎలాగైతే మధువనానికి ప్రేమతో పరిగెత్తుకుంటూ వస్తారో అలాగే బాబా సమానంగా అవ్వటంలో నా పేరు ముందు ఉండాలి అనే పురుషార్థం చేయండి. ఈ పవిత్రత యొక్క పునాదిని గట్టిగా చేసుకోండి. బ్రహ్మాబాబా పవిత్రత కారణంగా, ఈ నవీనత కారణంగానే నిందలు కూడా పడ్డారు. అందువలన పవిత్రతయే పునాది, బ్రహ్మచర్య వ్రతం పాటించటం పవిత్రత యొక్క సాధారణ విషయం, కానీ ఇప్పుడింకా ముందుకి వెళ్ళాలి, బాల్యస్థితి కాదు, ఇప్పుడు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి. నేను బ్రహ్మచారిగానే ఉన్నాను, నాకు పవిత్రత ఉంది అని కేవలం దీనితో సంతోషం అయిపోకండి. ఇప్పుడు దృష్టి,వృత్తి యొక్క పవిత్రతపై ఇంకా ధ్యాస (అండర్‌లైన్) పెట్టండి, ముఖ్య పునాది అయిన మీ సంకల్పాలను శుద్ధంగా చేసుకోండి, జ్ఞాన స్వరూపంగా, శక్తి స్వరూపంగా తయారుచేసుకోండి. ఏం చేయము, చేయలేకపోతున్నాము, ఏమయ్యిందో తెలియటం లేదు .... అంటే ఇది పవిత్రతా శక్తియా? ఏం చేయము, అయిపోయింది, అలా అయిపోతుంది, అవ్వాలి అని అనుకోవటం లేదు కానీ... ఇలా పవిత్ర ఆత్మ అంటుందా? ఇలా ఎటువంటి ఆత్మ అంటుంది? పవిత్ర ఆత్మ అంటుందా లేదా బలహీన ఆత్మ అంటుందా? త్రికాలదర్శి ఆత్మలు కదా! ఎందుకు, ఏమిటి అనే వారిని బాప్ దాదా అంటారు, వీరిని జిజ్ఞాసువుల దగ్గర కూర్చోపెట్టండి అని. వారికి 84 జన్మల చిత్రం గురించి చెప్తారు కదా! 84 జన్మలు గురించి చెప్తారు. కానీ ఏమిటి, ఎందుకు? అని అంటున్నారా! అన్నీ తెలిసి ఉన్నవారు ఏమిటి, ఎందుకు అంటారా? ఇది దీని కారణంగా జరుగుతుంది అని వారికి తెలిసిపోతుంది కదా! ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం స్వయానికే బుద్ధిలోకి వచ్చేస్తుంది, వీరు మాయా ప్రభావానికి పరవశం అయ్యి ఉన్నారు అని. వారు మహారథీలు అయినా, కాలిబలం వారు అయినా, మహారథీల ద్వారా కూడా పొరపాటు జరుగుతుందంటే ఆ సమయంలో వారు మహారథి కాదు, పరవశులు, పరవశం అయిన వారు అలల్లో కొట్టుకుంటారు కానీ వీరు మహారథీ అయి ఉండి కూడా చేస్తున్నారు అని మీరు ఆ రూపంలో చూస్తున్నారు. కానీ ఆ సమయంలో వారు మహారథీ కాదు, పరవశులు. అర్థమైందా? క్రొత్త సంవత్సరంలో ఏమి చేయాలి? వ్యర్థం యొక్క సమాప్తి యొక్క క్రొత్త ఖాతా ప్రారంభించాలి. బాగున్నారా? పక్కాగా ఉన్నారా లేదా ఏదైనా కారణం చెప్తారా? ఇంకా ఏమైనా కారణం ఉంటే క్రొత్త ప్లాన్ చెప్తాను. ఇప్పుడు చెప్పను. ఇప్పుడు చెప్పేస్తే మరలా మీరు ఏదోక కారణం తీస్తారు. కారణం కాదు, నివారణ చేయాలి. సమస్యా స్వరూపంగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వాలి.
ఇప్పుడు ప్రకృతి కూడా అలసిపోయింది. ప్రకృతి యొక్క శక్తి కూడా మొత్తం సమాప్తి అయిపోతుంది. ప్రకృతి కూడా ప్రకృతి పతులైన మీకు విన్నవించుకుంటోంది. ఇప్పుడు త్వరగా చేయండి, ఆలస్యం చేయద్దు అని. మంచిది.
బాప్ దాదా కూడా శరీరాన్ని నడిపించవలసి వస్తుంది. నడిచినా, నడవకపోయినా నడిపించవలసి వస్తుంది. ఎందుకంటే బాబాకి పిల్లలంటే ఇష్టం. ఇంత ప్రియమైన ఆత్మలు వచ్చినప్పుడు బాబా ఆత్మిక సంభాషణ చేయకపోతే ఎలా ఉంటుంది? అందువలన బలవంతంగా అయినా నడిపించవలసి వస్తుంది. మంచిది. అందరు సంతోషమేనా? బాబా లభించారు కదా కనుక సంతుష్టమే కదా?
నలువైపుల ఉన్న కోటానుకోట్ల ప్రేమ స్వరూప ఆత్మలకు, సదా స్వయాన్ని నిర్వికల్పంగా తయారుచేసుకునే విశేషాత్మలకు, సదా బాబా మరియు నిర్విఘ్న సేవ యొక్క సంలగ్నతలో నిమగ్నం అయ్యే ఆత్మలకు, సదా బాబా యొక్క స్నేహంలో బలిహారం అయ్యే ఆత్మలందరికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment