07-03-1995 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బ్రాహ్మణులు అంటే ధర్మశక్తి మరియు స్వరాజ్యశక్తి యొక్క అధికారి ఆత్మలు.
ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలలో విశేషంగా రెండు శక్తులను చూస్తున్నారు. ఆ రెండు శక్తులు 1. ధర్మశక్తి 2. స్వరాజ్య శక్తి. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత - ఈ రెండు శక్తులు ప్రతీ ఒక్కరికి లభిస్తాయి. ధర్మశక్తి అంటే సత్యత, పవిత్రత యొక్క ధారణా స్వరూపం మరియు స్వరాజ్యశక్తి అంటే అధికారి అయ్యి సర్వకర్మేంద్రియాలను మీ అధికారంతో ఆజ్ఞానుసారం నడిపించాలి. స్వరాజ్యా ధికారి, స్వరాజ్యం యొక్క శక్తి కలిగిన వారు ఏ పరిస్థితిలో, ప్రకృతి లేదా మాయ యొక్క సర్వరూపాలకి ఆధీనం అవ్వరు, అధికారిగా ఉంటారు. ప్రతి బ్రాహ్మణాత్మకి బాప్ దాదా ఈ రెండు శక్తులను ఇచ్చారు కదా? అందరిలో ఈ రెండు శక్తులు ఉన్నాయా లేదా ఇప్పుడింకా పూర్తిగా రాలేదా? ఇప్పుడు ఈ రెండు శక్తులను పొందినవారే భవిష్యత్తులో ధర్మం మరియు రాజ్యశక్తికి అధికారిగా అవుతారు. రెండు శక్తులు ధారణ చేసారా? మీ చిత్రం చూసారా? మీకు చిత్రం ఉందా? లేదా భారతదేశం వారిదా? డబల్ విదేశీయులకి చిత్రం ఉందా? లేదా ఇతరుల చిత్రమా? అయితే ఆ చిత్రంలో రెండు శక్తుల యొక్క గుర్తులు చూసారా? తెలుసా? ఇక్కడ స్వర్గం యొక్క చిత్రం ఉంది కదా! దానిలో గుర్తులు ఉన్నాయి కదా? ధర్మశక్తికి గుర్తు - ప్రకాశ కిరీటం మరియు రాజ్యశక్తికి గుర్తు - రత్న జడిత కిరీటం. ఇలా మీ చిత్రం చూసారా? ఈ రెండు శక్తులను ఈ సమయంలోనే ధారణ చేస్తున్నారు. అర్దకల్పం ఈ రెండు శక్తులు మీ అందరి యొక్క ఒకే చేతిలో ఉంటాయి. ద్వాపరయుగం నుండి ఆ ధర్మశక్తి వేరు అయిపోయింది మరియు రాజ్యశక్తి వేరు అయిపోయింది. అందువలనే ధర్మపితలు రావల్సి వచ్చింది. ధర్మపితలు మరియు రాజులు ఇద్దరు వేరువేరుగా ఉంటారు కానీ మీ రాజ్యంలో ధర్మం మరియు రాజ్యం వేరుగా ఉంటాయా? ప్రతి ఒక్కరి దగ్గర రెండు శక్తులు కలిసి ఉంటాయి అందువలనే అఖండ నిర్విఘ్న రాజ్యం నడుస్తుంది. అందువలన ప్రతి ఒక్కరిలో ఈ రెండు శక్తులను చూస్తున్నారు, ప్రతీ ఒక్కరు స్వయంలో ఎంత వరకు ధారణ చేశారు? అని. ఎంత వరకు అధికారిగా అయ్యారు? అని. సదా అధికారిగా ఉంటున్నారా లేదా అప్పుడప్పుడు ఆధీనం, అప్పుడప్పుడు అధికారిగా ఉంటున్నారా? ఇప్పుడిప్పుడే అధికారిగా, ఇప్పుడిప్పుడే ఆధీనం అయితే బావుంటుందా? లేక సదా అయినవారు మంచిగా ఉంటారా? సదా అధికారం కావాలా లేదా కొంచెం సమయం కోసం కావాలా? సదా కావాలా? మంచిది. అయితే సదా అధికారిగా ఉంటున్నారా? కావాలా అంటే అవును అన్నారు. కావాలి కదా? స్వయం బాబా అధికారం ఇస్తున్నారు. ఇచ్చేవారు ఇస్తున్నారు. తీసుకునే వారు ఏం చేయాలి? ఇవ్వటం సహజమా లేదా తీసుకోవటం సహజమా? తీసుకోవటంలో అయితే ఏమీ కష్టం లేదు కదా! ఇవ్వటంలో అయితే ఆలోచిస్తారు. ఇవ్వనా, వద్దా, కొంచెం ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వాలా..... అని కానీ తీసుకోవటంలో ఎంత లభిస్తే అంత తీసుకుంటాం అని అంటారు. తీసుకోవటంలో మొదటి నెంబరా లేదా రెండవ నెంబరా? తీసుకోవటంలో ఎవరు? ఇచ్చే విషయం తర్వాత అడుగుతాను. తీసుకోవటంలో మొదటి నెంబరేనా? దీనిలో ఎవరూ రెండవ నెంబర్‌గా అవ్వరు. మరలా ఇవ్వవలసి వచ్చినప్పుడు ......? ఇవ్వటంలో కూడా మొదటి నెంబరేనా లేదా ఆలోచించవల్సి వస్తుందా, ధైర్యం ఉంచుకోవలసి వస్తుందా! వాస్తవానికి మీరు ఇచ్చేది ఏమిటి? బ్రాహ్మణ జీవితంలో ఇవ్వటమా లేక తీసుకోవటమా? ఇచ్చే వస్తువు కంటే తీసుకునే వస్తువు శ్రేష్టమైనది అయితే అది ఏమైనట్లు? ఇచ్చినట్లు అయ్యిందా లేదా తీసుకున్నట్లు అయ్యిందా? ఇవ్వవలసిందే, ఇవ్వాలి అని ఆలోచిస్తే బరువు అయిపోతారు. తీసుకోవటంలో అయితే సదా సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇవ్వటంలో అయితే ఆలోచిస్తున్నారు ఇవ్వటం కష్టం అని కానీ మొదట తీసుకుంటున్నారు. మరలా మీరు ఇచ్చేది ఏదీ లేదు. బాబాకి ఇవ్వటానికి మీ దగ్గర ఏదైనా ఉందా? ఇచ్చేది మంచి వస్తువు ఇస్తారా లేక చెడు వస్తువు ఇస్తారా? అయితే మీ దగ్గర మంచిది. ఏది ఉంది? తనువు మంచిగా ఉందా? మనస్సు మంచిగా ఉందా? ధనం మంచిగా ఉందా? పనికిరానివి ఉన్నాయి. మందుల యొక్క తోపిడితో శరీరాన్ని నడిపించుకుంటున్నారు. తోస్తే నడిచే వాహనం మంచిగా ఉంటుందా! బ్రాహ్మణ జీవితంలో తీసుకోవడమే తీసుకోవటం. బాబా అయితే నవ్వుకుంటున్నారు - పిల్లలు బాబా కంటే చతురులు అని. మొదట తీసుకుంటున్నారు మరలా ఇవ్వటానికి ఆలోచిస్తున్నారు. తెలివైన వారు కదా! మంచిది, తండ్రికి పిల్లలు తెలివైనవారిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది కానీ నడుస్తూ,నడుస్తూ డల్ గా అయిపోతే మంచిగా అనిపించదు. ఒక్కొక్కసారి పిల్లల యొక్క ముఖం ఎలా ఉంటుందంటే వారికి ఏమైందో కూడా తెలియటం లేదు. ఎలాగైతే శరీరంలో రక్తం తక్కువైపోతే బలహీనంగా అయిపోతారు కదా, ముఖం ద్వారా కూడా ఆ బలహీనత కనిపిస్తుంది, ముఖం పాలిపోతుంది. అలాగే ఇక్కడ కూడా సంతోషం, శక్తులు తక్కువ అయిపోయిన కారణంగా ముఖం ఎలా ఉంటుందంటే ... ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అందరు అనుభవీలే. కదా! ఒకవైపు సంతోషాల యొక్క ఖజానా లభించింది అంటారు, అది అవినాశి అయినా కానీ ఎలా తక్కువ అవుతుంది? బాబా దగ్గర రోజంతటి మీ అందరి మనస్సు యొక్క మూడ్ మరియు ఆ మనస్సు యొక్క మూడ్ అనుసరించి మీ ముఖం ఎలా మారుతుందో చిత్రాలు అక్కడ ఉంటాయి. మీరు చిత్రాలతో ప్రదర్శిని తయారు చేస్తారు కదా! అలాగే బాబా దగ్గర మీ చిత్రాల యొక్క ప్రదర్శిని ఉంటుంది. అందువలన సదా జ్ఞాపకం ఉంచుకోండి నేను బ్రాహ్మణ ఆత్మను, రాజ్యశక్తి మరియు ధర్మశక్తి యొక్క అధికారి ఆత్మను అని. ఈ స్మృతి యొక్క నిశ్చయం ఉంటే నషా ఉంటుంది, నిశ్చయం తక్కువైతే నషా కూడా తక్కువ అవుతుంది. అందువలన పరిశీలించుకోండి - ఈ శక్తులు సదా వెంట ఉంటున్నాయా లేదా అప్పుడప్పుడు పోగొట్టుకుంటున్నానా, అప్పుడప్పుడు వస్తున్నాయా? అని. మంచిది, ఎక్కువమంది డబల్ విదేశీయులు ఉన్నారు. బాప్ దాదా విశేషంగా డబల్ విదేశీయులని అడుగుతున్నారు రోజంతటిలో మీ అధికారం యొక్క సీట్ పై సెట్ అవుతున్నారా లేక తొందరగా అప్ సెట్ అయిపోతున్నారా? ఏమి అవుతుంది? సెట్ అవుతున్నారా, అప్ సెట్ అవుతున్నారా? అవ్వటం లేదు అని చెప్పండి. అవునా? కాదా? అవుతున్నారా అప్ సెట్? లేదా అది పూర్వపు విషయం, ఇప్పటిది కాదు కదా? ఆ విషయం గతించిపోయింది కదా! ఇప్పుడు అవ్వటం లేదు కదా! ఎందుకంటే ఇప్పుడు జ్ఞానసాగరులుగా, శక్తిశాలిగా అయిపోయారు.
చిన్న విషయంలో అప్ సెట్ అవ్వటం, ముఖం మారిపోవటం, మూడ్ మారిపోవటం ఇలా ఉండటం లేదు కదా, లేదా అప్పుడప్పుడు ఇంకా అప్ సెట్ అవుతున్నారా? అప్పుడప్పుడు అవుతున్నారా? అవును అంటున్నారు. పాండవులు కూడా అవును అంటున్నారు. మంచిది. అప్ సెట్ అవ్వటం అనేది ఏమిటో మర్చిపోయాం, అంత శక్తిశాలి ఆత్మలుగా అయిపోయాం అని భావించేవారు చేతులు ఎత్తండి! సత్యం (నిజం) చెప్తున్నారు, శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ సీజన్లో మధువనంలో ఏదొకటి వదిలి, మరొకటి తీసుకుని వెళ్తారా? చాలామంది మధువనంలో శివరాత్రి జరుపుకున్నారు కదా! ఎవరి పుట్టినరోజు అయితే వారికి బహుమతి ఇస్తారు కదా! కనుక బాబాకి ఏమి బహుమతి ఇచ్చారు? అప్ సెట్ అవ్వటం అనే దానిని బాబాకి బహుమతిగా ఇచ్చేయండి. ధైర్యం ఉందా? చేతులెత్తండి, టి.విలో అందరి చేతులు చూపించండి. ఆలోచించి, అర్థం చేసుకుని పక్కాగా చేతులెత్తండి. అనువాదం చేసేవారు కూడా చేతులెత్తండి. అందరి చేతులు ఫోటో తీయబడినవి. బాప్ దాదాకి ఆ ముఖం మంచిగా అనిపించటం లేదు. బాప్ దాదా సదా ప్రతి బిడ్డను వికసించిన ఆత్మిక గులాబీగా చూడాలనుకుంటారు. వాడిపోయినట్లుగా కాదు. వికసించినట్లుగా చూడాలనుకుంటున్నారు. ఎవరితో ప్రేమ ఉంటుందో వారికి ఏది ఇష్టమో అదే చేస్తారు కదా! డబల్ విదేశీయులు అయితే చాలా ప్రేమ ఇస్తారు. అయితే బాబాతో ప్రేమ ఉందా? అందరికి ఉందా? ఎంత ఉంది? చాలా ఉంది. డబల్ విదేశీయులు బాబాని చాలా ప్రేమిస్తారు. అయితే బాబాకి ఏది ఇష్టమనిపిస్తుందో అదే మీకు ఇష్టమనిపిస్తుంది కదా! ఏం చేయను, విషయం అటువంటిది అందువలన అప్ సెట్ అయిపోయాం అనేలాంటి సమాచారం ఎవరి నుండి రాకూడదు. విషయం అప్ సెట్ చేసేది అయినా మీరు అప్ సెట్ అయ్యే స్థితిలోకి రాకండి. ఊయల ఊగుతారు కదా! ఊయల కూడా చాలా పైకి - క్రిందికి తీసుకుని వెళ్తుంది. అది కూడా అప్ సెట్ (అయోమయం) చేస్తుంది. చాలా క్రిందికి లేదా పైకి వేగంగా ఊపుతూ శరీరాన్ని అప్ సెట్ చేస్తుంది కదా! కానీ దానిని ఆటగా భావిస్తారు అంతేకానీ అప్ సెట్ అవుతారా? అవుతారా? ఎందుకు అవ్వటం లేదు? ఆటగా భావిస్తారు కనుక అప్ సెట్ అవ్వటానికి బదులు మనోరంజనంగా భావిస్తారు. కారణం ఏమిటి? దానిని ఆటగా భావిస్తారు. ఇలా ఏవైనా అప్ సెట్ చేసే విషయాలు వచ్చినా, తప్పక వస్తాయి, ఎవరైతే చేతులెత్తారో వారి దగ్గరికి ఇంకా ఎక్కువగా అప్ సెట్ చేసే విషయాలు వస్తాయి. ఎందుకంటే మాయ కూడా మురళి వింటుంది. అందువలన ఇలాంటి విషయాలు వచ్చినా కానీ ఒక ఆటగా భావించండి. భయపడకండి. అది ఊపుతుంది. ఊపనివ్వండి. కానీ మనస్సులో భయపడకూడదు. జ్ఞానసాగరులుగా, శక్తిశాలిగా అయిపోండి. ఆ సీట్ ని వదలవద్దు. ఒకటి, రెండు సార్లు మాయ చూస్తుంది కానీ ఇక వీరు అప్ సెట్ అయ్యేవారు కాదు అనుకుని స్వయం అప్ సెట్ అయిపోతుంది. ఇక మిమ్మల్ని అప్ సెట్ చేయదు. విషయాలను పంచుకోండి, ఏదైనా విషయం వస్తే జ్ఞానసాగరులు కనుక అనుకుంటారు కదా - ఇది సరైనది, ఇది సరైనది కాదు, ఇది ఇలా అవ్వాలి. ఇలా అవ్వకూడదు .... ఇలా విషయాన్ని ఇచ్చిపుచ్చుకోండి కానీ అప్ సెట్ రూపంతో కాదు. ఒకవైపు మాట్లాడుతూ ఉంటారు. రెండవ వైపు గంగ, యమునలు (కన్నీళ్ళు) ప్రవహిస్తూ ఉంటాయి. మనస్సు ద్వారా ఏడవటం మరియు కళ్ళ ద్వారా ఏడవటం రెండూ కూడా మంచిది కాదు. అయితే బహుమతి ఇవ్వటానికి తయారుగా ఉన్నారా? ఆలోచించుకున్నారా లేదా మామూలుగా అవును అని అనేశారా?
బాప్ దాదా చాలా సహజమైన మాటలతో యుక్తి చెప్తున్నారు ఏదైనా పరిస్థితి లేదా ప్రకృతి అలజడి రూపంలో వచ్చినా రెండు మాటలను జ్ఞాపకం ఉంచుకోండి - నాట్ మరియు డాట్. ఇదైతే సహజమే కదా, మర్చిపోరు కదా! ఏదైనా విషయం తప్పు అయితే దానిని నాట్ చేయండి అంటే చేయకండి. ఆలోచించకూడదు, చేయకూడదు, మాట్లాడకూడదు మరియు డాట్ అంటే బిందువు పెట్టేయండి అప్పుడది నాట్ అయిపోతుంది. అది ఆలోచించకండి, బిందువు పెట్టేయండి అంతే అది సమాప్తి అయిపోతుంది కానీ బిందువు పెట్టడం రావడం లేదు. ఆలోచించకండి, బిందువు పెట్టేయండి అంతే. బిందువు పెట్టడంలో ఎంత సమయం పడుతుంది? సెకను కంటే తక్కువ సమయం పడుతుంది. కానీ ఏమౌతుంది? ఇది చేయకూడదు, సరైనది కాదు అని ఆలోచిస్తున్నారు కానీ బిందువు పెట్టడం రావటం లేదు. జ్ఞానసాగరులుగా అయితే అయిపోయారు కానీ జ్ఞానంతో పాటూ ఇప్పుడు శక్తిశాలిగా కూడా అవ్వాలి. ఆ శక్తిశాలి స్థితి లోపంగా ఉంది అందువలనే బిందువు పెట్టలేకపోతున్నారు. బిందువు పెట్టడం ఎవరికి వస్తుందో వారు బాబాని కూడా మర్చిపోరు. ఎందుకంటే బాబా కూడా బిందువే కదా! మీరు కూడా బిందువే. అప్పుడు అన్నీ జ్ఞాపకం వచ్చేస్తాయి. బిందువు పెట్టండి. ప్రశ్నార్ధకం, ఆశ్చర్యార్ధకం, కామా పెట్టకండి. బిందువు పెట్టండి. బిందువు గుర్తు పెట్టడం సహజం కదా! మిగిలిన గుర్తులు పెట్టడం కష్టం. అన్నింటికంటే కష్టమైనది ప్రశ్నార్థకం పెట్టడం కానీ అది పెట్టడం చాలా తొందరగా వస్తుంది. ఎందుకు(వై) అనే మాట వస్తే ఏమి చేయాలో చెప్పాను కదా వై (ఎందుకు) అనే మాట వస్తే ప్లై అంటే ఎగిరిపోవాలి. పైకి ఎగిరిపోవాలి. వై కాదు ఫ్లె, ఎగరటం వస్తుందా?
డబల్ విదేశీయులలో మంచి,మంచి రత్నాలు వచ్చారు. అటువంటి రత్నాలను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎటువంటి అమూల్యమైన రత్నాలంటే అటువంటి అమూల్య రత్నాలలో కొద్దిగా అయినా ఏదైనా మచ్చ ఉంటే అది బావుండదు. అది చిన్నమచ్చే అయినా కానీ మచ్చ అని అంటారు కదా! అమూల్య రత్నాలుగా అయిపోయినప్పుడు మరలా చిన్న మచ్చ ఎందుకు ఉంచుకుంటున్నారు? బావుంది అనిపిస్తుందా ? చంద్రునిలో కూడా కళలు చూపిస్తారు కదా! అందువలన మంచిదే అనుకుంటున్నారా! డబల్ విదేశీయులు ఉదాహరణగా అయ్యి చూపించండి. కొద్దిగా కూడా ఏ లోపం ఉండకూడదు. మచ్చ పడడానికి కారణం ఏమిటి? మచ్చ పడాలి అనుకోవటం లేదు కానీ మచ్చ పడిపోతుంది. ఎందుకు పడుతుంది? ముఖ్య కారణం ఏమిటి? తెలుసుకోవటంలో అయితే తెలివైనవారు, తెలుసుకుంటున్నారు కూడా మరియు పరస్పరం వర్క్ షాప్ చేసుకుంటున్నప్పుడు కూడా బాప్ దాదా వర్క్ షాప్ యొక్క ఫోటో కూడా చూస్తున్నారు. ఈ కారణం, ఈ కారణం.. అని చాలా మంచి విషయాలు వర్క్ షాప్ లో తీస్తున్నారు కానీ కార్యంలోకి తీసుకురావటం లేదు. చాలా సూక్ష్మమైన దేహాభిమానం యొక్క రూపాలను తయారుచేసుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద రూపంలో దేహాభిమానం రావటం లేదు కానీ సూక్ష్మమైన మరియు రాయల్ రూపంలో వస్తుంది. బుద్ధిని మంచిగా నడిపిస్తున్నారు, మంచి,మంచి విషయాలు ఆలోచిస్తుంటే బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ మంచి విషయాలు ఆలోచిస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు కొద్దిగా అయినా ఏవైనా కలపటంలో, సరిదిద్దటంలో నాది అనేది వచ్చేస్తుంది. ఎలా అయితే మీ యొక్క ఆలోచనను సంతోషంతో చెప్తున్నారో అలాగే ఇతరుల ఆలోచనను కూడా తీసుకోండి. ఇది ఎలా అవుతుంది, వీరు ఏం చేసారు, ఇది జరగదు, ఇది నడవదు...... ఇలా భయపడకండి. ఎంతగా మీ విషయానికి గౌరవం ఇస్తున్నారో అంతగానే ఇతరుల యొక్క విషయానికి, సలహాకు కూడా గౌరవం ఇవ్వండి. ఆలోచన చెప్పటం వేరే విషయం కానీ వారి ఆలోచన మీకు మంచిగా అనిపించకపోతే దాని ప్రభావంలోకి రావటం, దాని ద్వారా స్థితి పైకి, క్రిందికి అయిపోతే ఆ సేవ సేవ అవ్వదు. కలుపుకోవటం, ఇతరుల ఆలోచనను కూడా మీ ఆలోచనల వలె ఆలోచించటం, అర్థం చేసుకోవటం ఇదే ఇతరుల ఆలోచనలకు గౌరవం ఇవ్వటం. నేను ఇది ఆలోచించాను లేదా ఈ ఆలోచన చెప్పాను, ఈ పని చేసాను, నా ఆలోచనలకు విలువనివ్వాలి అని ఆలోచిస్తారు కదా, అలాగే ఇతరులకు కూడా గౌరవం ఇవ్వాలి, ఇలా ఇతరుల ఆలోచనలను కూడా మన ఆలోచనలతో కలుపుకోవాలి కానీ ఆ కలుపుకోవటం రావటం లేదు. ఇతరుల ఆలోచనలను ఇతర ఆలోచనలగానే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు డబల్ విదేశీయులు కూడా సేవా క్షేత్రంలో ప్లాన్ తయారుచేయటంలో మంచిగా ఉన్నతి అవుతున్నారు మరియు ఇక ముందు కూడా అవ్వవలసిందే. కానీ కలుపుకునే విశేషత ఉపయోగించండి. ఎవరైనా పిల్లలు ముందుకు వెళ్తుంటే బాప్ దాదాకి కూడా సంతోషంగానే ఉంటుంది. వీరు ఎందుకు ముందుకు వెళ్తున్నారు అని అనుకోరు. ఎవరు ముందుకు వెళ్తుంటే వారు చాలా మంచివారు. డబల్ విదేశీయులంటే బాప్ దాదాకి స్నేహం అయితే ఉంది కానీ సేవా ప్లాన్స్ మరియు సేవలో ప్రత్యక్షంలో ఏదైతే చేస్తున్నారో దానికి చాలా, చాలా గౌరవం ఇస్తున్నారు.
బాప్ దాదా మొదటే చెప్పారు, ఒకవేళ డబల్ విదేశీయులు లేకపోతే బాప్ దాదా యొక్క ఒక బిరుదు ప్రత్యక్షంలో రుజువు అవ్వదు అని. అది ఏమిటి? విశ్వకళ్యాణకారి. ఇప్పుడు చూడండి, నలువైపుల బాబా యొక్క సందేశం ఇస్తున్నారు కదా! ఈ సీజన్లో నలువైపుల నుండి వచ్చారు కదా! మొత్తం ఎన్ని దేశాల నుండి వచ్చారు? (58 దేశాల నుండి వచ్చారు) ఇక ఎన్ని ముఖ్య దేశాలు ఉన్నాయి? (125) చిన్న,చిన్న దేశాలైతే చాలా ఉంటాయి కానీ ముఖ్యమైన దేశాలు 125 ఉన్నాయి. ఇప్పుడు డబల్ విదేశీయులు చాలా పని చేయాలి. భారతదేశంలో కూడా సేవ చేయాలి మరియు విదేశంలో కూడా చేయాలి. రెండు స్థానాలలో చేయాలి. బాప్ దాదా మొదటే చెప్పారు, సేవ యొక్క సంపూర్ణ సఫలతకు గుర్తు ఏమిటంటే - మాకు సందేశం అందలేదు అని ఏ వైపు నుండి ఏ ఆత్మ నిందించకూడదు. సందేశం అందింది. కానీ ఆ ఆత్మ విని కూడా తన భాగ్యం తయారుచేసుకోకపోతే అప్పుడు మీకు నింద రాదు, ఆ ఆత్మకే నింద వస్తుంది కానీ మీకు నింద రాకూడదు. మాస్టర్ విశ్వకళ్యాణకారులు అంటే విశ్వం యొక్క నలువైపుల సందేశం చేరాలి. భారతదేశంలో కూడా అందాలి మరియు విదేశంలో కూడా అందాలి. విజయీ జెండా ఎగురవేసే సమయంలో ఏ ఆత్మ అయినా వచ్చి ఈ నింద వేస్తే బావుంటుందా? ఒక వైపు జెండా ఎగురవేస్తున్నారు, రెండవవైపు ప్రజలు నిందిస్తూ ఉంటే బావుంటుందా? బావుండదు కదా! డబల్ విదేశీయులకు ధైర్యం బావుంది, బాబాపై ప్రేమ అయితే ఉంది కానీ సేవతో కూడా ప్రేమ ఉంది. రెండింటి ప్రేమ యొక్క సర్టిఫికెట్ బావుంది. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ తీసుకోవాలి? ఎంత సేవాధారిగా అవుతున్నారో అంతగా శక్తిధారిగా కూడా అవ్వండి. శక్తి స్వరూపంగా అయిపోయారు అనే సర్టిఫికెట్ తీసుకోవాలి. బాప్ దాదా చూస్తున్నారు, చాలా మంది బాబాపై ప్రేమలో మరియు సేవపై ప్రేమలో పాస్ అయిపోయారు.
ఇప్పుడు ఈ సీజన్లో మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి! మొత్తం ఎంత మంది ఉన్నారు? 600 మంది మొదటిసారి వచ్చారు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మీకు సేవ కొరకు అవకాశం చాలా బాగా లభించింది. ఇప్పుడు 100 స్థానాలలో సేవ మిగిలి ఉంది కనుక 600 మంది ఇద్దరిద్దరు, ముగ్గురు,ముగ్గురు కలిసి చేసినా సేవ పూర్తయిపోతుంది. మీ కొరకు సేవ యొక్క ఆహ్వానం మొదటే తయారుగా ఉంది. చాలా బాగా ఉన్నతి చేసారు. ఈ సీజన్లో 600 మంది వచ్చారంటే సేవ చేసారు కనుకనే వచ్చారు కదా! కనుక ఎన్ని శుభాకాంక్షలు, కోటానుకోట్ల శుభాకాంక్షలు.
(బాప్ దాదా డ్రిల్ చేయించారు) ఒక సెకనులో బిందువు పెట్టగలుగుతున్నారా? ఇప్పుడిప్పుడే కర్మలోకి రావటం మరియు ఇప్పుడిప్పుడే కర్మకి అతీతంగా, కర్మ సంబంధానికి అతీతంగా అవుతున్నారా? ఈ వ్యాయామం వస్తుందా? ఏ కర్మలో అయినా చాలా బిజీగా ఉన్నా, మనస్సు, బుద్ది కర్మ యొక్క సంబంధంలో నిమగ్నమై ఉన్నా, బంధనలో కాదు కానీ సంబంధంలో ఉన్నా కానీ బిందువు పెట్టండి అని బాబా నుండి ఆజ్ఞ లభించగానే బిందువు పెడుతున్నారా లేదా కర్మ యొక్క ఆలోచన నడుస్తుందా? ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది ఇలా, అది అలా...... అని ఆలోచిస్తున్నారా! ఈ అభ్యాసం ఒక సెకను కొరకు అయినా చేయండి కానీ అభ్యాసం చేస్తూ ఉండండి ఎందుకంటే ఒక సెకనులో బిందువు పెట్టటంలోనే అంతిమ సర్టిఫికెట్ లభిస్తుంది. సెకనులో విస్తారాన్ని మలుచుకోవాలి, సారస్వరూపంగా అవ్వాలి. ఈ అభ్యాసం ఎప్పుడు అవకాశం లభిస్తే అప్పుడు చేస్తూ ఉండండి. యోగంలో కూర్చున్నప్పుడే బిందువు పెట్టగలము అనే విధంగా ఉండకూడదు. అలజడిలో కూడా బిందువు పెట్టాలి. మీ బ్రేక్ ఇంత శక్తిశాలిగా ఉందా? లేదా ఇక్కడ బ్రేక్ వేస్తే వేరేచోట పడుతుందా! బిందువు పెట్టవలసిన సమయంలో బిందువు పెట్టకుండా సమయం అయిపోయిన తర్వాత బిందువు పెడితే దాని వలన లాభం ఉండదు. ఆలోచించగానే జరగాలి. నేను శరీరాన్ని కాదు, ఆత్మను,ఆత్మను అని ఆలోచిస్తూ ఉండకండి, నేను బిందువు పెట్టాలి ఏమీ ఆలోచించకూడదు ఇలా ఆలోచిస్తూ ఉంటే కూడా సమయం పడుతుంది. ఇది సెకనులో బిందువు పెట్టటం కాదు. స్వయమే ఈ అభ్యాసం చేయండి. ఎవరూ చేయించవలసిన అవసరం లేదు. క్రొత్తవారైనా, పాతవారైనా అందరికి ఈ విధి అయితే తెలుసు కదా! ఈ అభ్యాసం చాలా సమయం నుండి ఉండాలి. ఆ సమయంలో నేను బిందువు పెట్టగలను అనుకుంటే పెట్టలేరు. ఇది మొదటి నుండే అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో ఆ సమయానుసారం చేస్తాను అంటే చేయలేరు, అది జరగదు. చాలా సమయం యొక్క అభ్యాసమే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సమయానికి ఆ సమయానికి సంబంధం ఉంటుంది. ఇక్కడి చాలా సమయం యొక్క అభ్యాసమే అక్కడ చాలా సమయం యొక్క రాజ్యాభాగ్యాన్ని పొందేలా చేస్తుంది. ఒకవేళ అల్పకాలికంగా అభ్యాసం ఉంటే ప్రాప్తి కూడా అల్పకాలికంగానే ఉంటుంది. మొత్తం రోజంతటిలో ఎప్పుడు అవకాశం లభిస్తే అప్పుడు చేస్తూ ఉండండి. ఒక సెకను వలన పనేమీ పాడవ్వదు, మరలా పని చేసుకోవటం ప్రారంభించండి కానీ అలజడిలో బిందువు పెట్టగలుగుతున్నానా, లేదా అనేది పరిశీలన చేసుకోండి. కర్మసంబంధంలోకి రావటం మరియు కర్మబంధనలోకి రావటంలో కూడా తేడా ఉంది. ఒకవేళ కర్మబంధనలోకి వస్తే కర్మ మిమ్మల్ని ఆకర్షిస్తుంది, బిందువు పెట్టనివ్వదు. మరియు అతీతంగా మరియు ప్రియంగా అయ్యి కర్మసంబంధంలోకి వస్తే సెకనులో బిందువు పెట్టగలరు ఎందుకంటే దానిలో బంధన ఉండదు. బంధన కూడా ఆకర్షిస్తుంది మరియు సంబంధం కూడా ఆకర్షిస్తుంది కానీ అతీతంగా అయ్యి సంబంధంలోకి రావాలి, ఇది అండర్‌లైన్ చేసుకోవాలి. ఈ అభ్యాసం ఉన్నవారే పాస్ విత్ ఆనర్‌గా అవుతారు. ఇది చివరి కర్మాతీత స్థితి. పూర్తిగా అతీతంగా అయ్యి, అధికారి అయ్యి కర్మలోకి రావాలి, బంధనకు వశం కాకూడదు.
కర్మ చేస్తూ, చేస్తూ కర్మబంధనలోకి రావటం లేదు కదా? అని పరిశీలన చేసుకోండి. చాలా అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. ఏమి అభ్యాసం కావాలో అర్థమైందా? కష్టం అనిపించటం లేదు కదా? కొద్ది కొద్దిగా కష్టం అనిపిస్తుందా? కర్మేంద్రియాలకు యజమానులు కదా? మిమ్మల్ని మీరు రాజయోగులు అనుకుంటున్నారు కదా దేనికి రాజులు? అమెరికాకు, ఆఫ్రికాకు రాజులా? కర్మేంద్రియాలకు రాజులు కదా! మరియు రాజు బంధనలోకి వస్తే రాజుగా ఉంటాడా? అందరి బిరుదు చాలా మంచిది, అందరు రాజయోగులే. రాజయోగులేనా లేదా ప్రజాయోగులా? అప్పుడప్పుడు రాజయోగులు, అప్పుడప్పుడు ప్రజాయోగులా? డబల్ విదేశీయులందరు పాస్ విత్ ఆనర్ అవుతారా? బాప్ దాదాకి అయితే చాలా సంతోషంగా ఉంటుంది, అందరు పాస్ విత్ హానర్ అవ్వాలి అని. కొద్దిగా కష్టమా లేదా సహజమా? మంచిది, కష్టం అనే మాట మీ డిక్షనరీ నుండి తీసేసారు. ఈ బ్రాహ్మణ జీవితం కూడా ఒక డిక్షనరి. బ్రాహ్మణ జీవితం యొక్క డిక్షనరీలో కష్టం అనే మాటే లేదు అప్పుడప్పుడు ఎగురుకుంటూ వచ్చేస్తుందా?
ఎన్ని వరదానాలు లభిస్తున్నాయి! ఇప్పటి వరకు ఎన్ని వరదానాలు లభించాయో వాటి లిస్ట్ తీయండి. చాలా లభించాయి కదా! రోజూ వరదానాలు లభిస్తున్నాయి. భక్తిమార్గంలో భక్తులు ఒక వరదానం లభించినా కానీ వారు ఏవిధంగా ఉన్నవారు ఏవిధంగా అయిపోతారు! మరి మీకు రోజూ భగవంతుడు వరదానం ఇస్తున్నారు అంటే ఎంత అదృష్టవంతులు! పాలన కూడా వరదానాల ద్వారానే జరుగుతుంది. వరదానం జ్ఞాపకం ఉంటుందా? లేదా వినే సమయంలోనే జ్ఞాపకం ఉంటుందా? 1. జ్ఞాపకం ఉంచుకోవటం 2. వరదానాన్ని కార్యంలో ఉపయోగించటం. వరదానం ఎలాంటిదంటే ఎటువంటి పరిస్థితి అయినా కానీ వరదానం యొక్క శక్తి పరిస్థితిని అగ్ని నుండి నీరుగా చేసేస్తుంది. అంత శీతలంగా చేసేస్తుంది. కేవలం ఉపయోగించుకునే విధానం రావాలి. మరియు రెండవ విషయం, సమయానికి కార్యంలో ఉపయోగించండి. సగం సమయం గడిచిపోయిన తర్వాత తెలివిలోకి వచ్చే విధంగా ఉండకూడదు. వరదానాన్ని ఉపయోగించుకోవటం వస్తుందా? ఉపయోగిస్తున్నారా లేదా విని సంతోషిస్తున్నారా? డైరీలో అయితే చాలా వరదానాలు నిండిపోయాయి, పుస్తకం కూడా తయారైపోయింది. పుస్తకం అలమారులో అయితే పెట్టేసారు కానీ కార్యంలో ఉపయోగించండి. మరియు ఎంతగా కార్యంలో ఉపయోగిస్తూ ఉంటారో అంతగా వరదానాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి మరియు వరదానం యొక్క విశాలరూపం ఇంకా అనుభవంలోకి వస్తుంది. మంచిది.
నలువైపుల ఉన్న ధర్మశక్తి యొక్క అధికారి ఆత్మలకు, సదా స్వరాజ్య శక్తి యొక్క అధికారి ఆత్మలకు, సదా డబల్ శక్తి కలిగిన డబల్ కిరీటధారి శ్రేష్టాత్మలకు, సదా సర్వశక్తుల ద్వారా శక్తి స్వరూపం యొక్క ప్రత్యక్ష స్వరూపం చూపించే శక్తిశాలి ఆత్మలకు, సదా లక్ష్యాన్ని లక్షణాల రూపంలో చూపించేవారికి, అనుభవం చేయించే శక్తిశాలి, మహావీర్, అచంచలమైన, స్థిరమైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment