05-12-1994 అవ్యక్త మురళి

     05-12-1994         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వర్తమాన సమయం యొక్క ఆవశ్యకత - బేహద్ వైరాగ్యవృత్తి  యొక్క వాయుమండలాన్ని తయారు చేయటం.

ఈరోజు స్నేహ సాగరుడైన బాబా తన స్నేహంలో లీనమైన స్నేహీ పిల్లలను చూస్తున్నారు. ఈ ఈశ్వరీయ స్నేహం పిల్లలైన మీకు తప్ప మరెవరికీ లభించదు. మీ అందరికీ ఇది విశేషమైన ప్రాప్తి, ప్రాప్తి అయితే పిల్లలందరికీ లభించింది కానీ మొదటి స్థితి - ప్రాప్తించటం, తర్వాత స్థితి - ప్రాప్తి యొక్క అనుభవంలో లీనం అయిపోవటం. మొదటి విషయం ప్రాప్తి పొందటం, అందరూ నషాతో అంటారు మాకు బాబా ప్రేమ లభించింది, బాబా లభించారు అంటే ప్రేమ లభించనట్లే. అందరి నోటి నుండి నా బాబా అని వస్తుంది. మొదట స్థితి అందరికీ ప్రాప్తి లభించింది కానీ అనుభూతిలో సదా లీనమై ఉండాలి. దీనిలో నెంబర్ వారీగా ఉన్నారు. ఎవరైతే పరమాత్మ ప్రేమలో లీనమై ఉంటారో వారిని ఆ ప్రేమ నుండి ఎవరూ విడదీయలేరు. పరమాత్మ ప్రేమలో లీనం అయిపోయిన ఆత్మ యొక్క మెరుపు మరియు నషా, అనుభూతి యొక్క కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఎవరైనా సమీపం నుండే కాదు, దూరం నుండే కళ్ళు పైకెత్తి చూడలేరు. ఇటువంటి అనుభూతి సదా ఉంటే ఎప్పుడూ ఏ రకమైన శ్రమ ఉండదు. లేదా యోగం జోడిస్తూ జోడిస్తూ యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు యోగంలో కూర్చుంటున్నారు కానీ అనుభూతిలో లీనం అవ్వటంలేని కారణంగా ఒక్కొక్కసారి యోగం, ఒక్కొక్కసారి యుద్ధం ఇలా రెండూ నడుస్తున్నాయి. “నేను బాబా వాడిని” అని మాటిమాటికి స్మృతిలోకి తీసుకురావల్సి వస్తుంది. మాటిమాటికి స్మృతిలోకి తీసుకురావటం అంటే విస్మృతి అయితేనే కదా స్మృతిలోకి తీసుకువస్తారు! అవును - కాదు, స్మృతి - విస్మృతి ఈ యుద్ధం లవలీనం యొక్క అనుభూతిని చేసుకోనివ్వదు. వర్తమాన సమయంలో పిల్లలు యుద్ధం లేదా శ్రమ ఏదైతే చేస్తున్నారో దానిలో వ్యర్ధం మరియు సమర్ధం యొక్క యుద్ధమే ఎక్కువగా నడుస్తుంది. కొంతమంది పిల్లలకి వ్యర్థం చూడటం స్వతహా సంస్కారంగా అయిపోయింది. కొందరికి వినేటటువంటి, కొందరికి వర్ణన చేసేటటువంటి, కొందరికి ఆలోచించేటటువంటి సహజ సంస్కారం అయిపోయింది. ఇది మేం చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియటం లేదు. ఒకవేళ ఎవరైనా సైగ చేసి చెప్తే మాయ యొక్క తెలివి కారణంగా స్వయాన్ని చాలా తెలివైనవారిగా భావిస్తున్నారు. అయిపోతే మాయ యొక్క తెలివైనవారిగా అయిపోతున్నారు లేదా సోమరిగా అయిపోతున్నారు - ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా అవుతూనే ఉంటుంది అంటారు. మాయా తెలివితో తమని తాము తప్పులో కూడా ఒప్పుగా భావిస్తారు. ఉండేది మాయా తెలివి కానీ, అనుకుంటారు నా వంటి జ్ఞాని, యోగి, సేవాధారి ఎవరూ లేరు అని. ఎందుకంటే ఆ సమయంలో మాయ యొక్క ఛాయ మనస్సుని, బుద్ధిని వశీభూతం చేసేస్తుంది. అప్పుడు యదార్థ నిర్ణయం చేయలేకపోతున్నారు. మాయాయోగి లేదా మాయాజ్ఞానం యొక్క తెలివి ఈశ్వరీయ తెలివి నుండి దూరం చేస్తుంది. మాయా తెలివి కూడా తక్కువైనది కాదు. మాయతో యోగం జోడించే యోగులు కూడా అచంచలంగా, స్థిరంగా ఉంటారు. అందువలన తేడా తెలీదు. ఆ సమయంలో వారి మాటల యొక్క నషా కూడా ఎంత గొప్పగా ఉంటుందో అందరికి తెలుసు కదా! అందువలన బాప్ దాదా సదా పిల్లలకి చెప్తారు - ప్రాప్తుల అనుభూతుల యొక్క సాగరంలో లీనమై ఉండండి. సాగరంలో లీనం అవడం అంటే సాగరుని సమానంగా బేహద్ ప్రాప్తి స్వరూపులుగా అయ్యి కర్మలోకి రావటం. బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క చార్టుని పరిశీలించారు. ఎంత సమయంలో పరిశీలించగలరు? ఎంత సమయం పడుతుంది? ఏమి చూసారు? సమయం యొక్క సమీపత ప్రమాణంగా వర్తమాన వాయుమండలంలో బేహద్ వైరాగ్యం ప్రత్యక్ష స్వరూపంలో ఉండటం చాలా అవసరం. బేహద్ వైరాగ్యం గురించి వర్ణన కూడా చేస్తారు కదా! చాలా పాయింట్స్ తీస్తారు. ఉపన్యాసం కూడా చాలా బాగా చెప్తారు. అందరి దగ్గర పాయింట్స్ ఉన్నవి కదా? ఎన్ని ఉంటాయి? ఈ విషయంపై ఏడు రోజుల క్లాసు చేయగలరు కదా? పాయింట్స్ వర్ణన చేయడం మరియు ఆలోచించటంలో మెజారీజీ పాస్ అయ్యారు. ఈ చిన్న చిన్న కుమారీలకు కూడా ఉపన్యాసం తయారు చేసి ఇస్తే చెప్పేస్తారు. హాస్టలు వాళ్ళు చేస్తారు కదా? 

యదార్ధ వైరాగ్యవృత్తి యొక్క సహజ అర్ధం - ఆత్మల యొక్క సంపర్కంలోకి వచ్చినా, సాధనాల యొక్క సంబంధంలోకి వచ్చినా, సేవా అవకాశం యొక్క భాగ్యం లభించినా, సర్వ సంబంధంసంపర్కాలలో ఎంత అతీతమో అంత ప్రియంగా ఉండాలి, రెండింటి బాలన్స్ (సమానత) ఉండాలి. కానీ జరిగేది ఏమిటి? ఒక్కొక్కసారి అతీతం యొక్క శాతం పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి అతి ప్రియం యొక్క శాతం పెరిగిపోతుంది. ప్రియం అంటే నిమిత్త భావం, నిర్మాణ భావం ఉండాలి. కానీ దీనికి బదులు. “నాది” అనే భావం వచ్చేస్తుంది. ఇది నా పని, ఈ స్థానం నాది, ఈ సర్వ సాధనాలు నా భాగ్యానుసారం లభించాయి, ఇంత శ్రమతో నేను ఈ సాధనాలను, స్థానాన్ని లేదా సేవని లేదా సేవా సహయోగులను (విద్యార్థులను) తయారుచేశాను. కనుక ఇవి నావి, నా శ్రమకు ఏ విలువా లేదా? ఇలా నిమిత్త భావం మరియు నాది అనే భావం రెండింటికి తేడా ఉన్నదా? లేక రెండూ ఒకటేనా? ఈ నాది అనేది రాయల్ (సూక్ష్మ) రూపంగా పెరిగిపోయింది. ఈ నాది అనే సూక్ష్మ భావం యొక్క సూక్ష్మ భాష, సూక్ష్మ సంకల్పాలను ఆత్మిక సంభాషణలో కూడా బాప్ దాదా చాలా వింటున్నారు. చాలా ప్రేమతో బాబా లేదా నిమిత్త ఆత్మలు ఒప్పుకోవడానికి లేదా వారిని ఒప్పించడానికి వస్తున్నారు - బాబా ఈ విషయంలో నీవే నాకు సహాయం చేయాలి. బాబా నీవు ఏమి అనుకుంటున్నావు, ఇది నా పని కాదా, నా భాధ్యత కాదా? నా అధికారం నాకే లభించాలి కదా...ఇలా బాబాకి కూడా జ్ఞానం చెప్పే తెలివి చూపిస్తున్నారు. అయితే బాప్ దాదా నవ్వుకుంటున్నారు. మేము నిమిత్తులం, ఏది, ఎలా లభించినా, ఎక్కడ కూర్చోబెడితే, ఏది తినిపిస్తే, ఏది చేయిస్తే అది చేస్తాము అని అందరి యొక్క మొట్టమొదటి ప్రతిజ్ఞ కదా! ప్రతిజ్ఞ చేసారు కదా? లేక కేవలం ఆహారపానీయాల విషయంలోనే చేసారా? ఈ నాది అనే భావంపై వైరాగ్యమే బేహద్ వైరాగ్యం. నాది అనే భావం కొత్త కొత్త రకాలుగా బయటికి వస్తుంది. వర్తమాన సమయంలో మాయ క్రొత్త క్రొత్త రకాలుగా నాది అనే భావం యొక్క ఛాయను వేస్తుంది. అందువలన సమయం యొక్క సమీపత ప్రత్యక్ష రూపంలో రావటం లేదు. జ్ఞానులు మరియు అజ్ఞానులు ఇద్దరికీ తెలుసు మరియు అంటున్నారు కూడా. ప్రపంచం యొక్క పరిస్థితులు చాలా ఖరాబుగా ఉన్నవి, ఈ ప్రపంచం ఎంతవరకూ నడుస్తుంది, ఎలా నడుస్తుంది అని, అయినా కానీ ప్రపంచం నడుస్తూ ఉన్నది. సమయం యొక్క సమీపతకు పునాది - బేహద్ వైరాగ్యవృత్తి. బాప్ దాదా పరిశీలించారు - బేహద్ వైరాగ్యవృత్తికి బదులు క్రొత్త క్రొత్త రకాల చిన్న చిన్న తగుల్పాటు యొక్క విస్తారం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ విస్తారం సారాన్ని దాచి వేసింది. అర్థమయ్యిందా?  ఇప్పుడు ఏమి చెయ్యాలి? 

ఈ తగుల్పాటు చాలా రుచిగా అనిపిస్తుంది. ఒకటి రెండు సార్లు రుచి చూసారంటే అది ఆకర్షిస్తూ ఉంటుంది. సేవ చేస్తున్నారు, చాలా మంచిది కానీ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - నిమిత్త భావం ఉన్నదా? లేక తగుల్పాటు యొక్క భావం ఉన్నదా? బాబా - బాబా అని అనడానికి బదులు నాది -నాది అనేది రావటం లేదు కదా? అనుకోవటం నీది అని. కానీ అయ్యేది నాది అని. అయితే ఇప్పుడు ఏమి చేస్తారు? నాది - నాది అనేది ఇష్టమా? 

బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు లేదా నడుస్తూ, నడుస్తూ పొరపాటు జరిగిపోతుంది, చేయాలి అనుకోవటం లేదు కానీ అయిపోతుంది, అది ఏమిటి? ఇతరులకు న్యాయమూర్తి అవుతున్నారు, స్వయానికి మాత్రం న్యాయవాది అవుతున్నారు. అవ్వాల్సింది స్వయానికి న్యాయమూర్తిగా, కానీ ఇతరులకు న్యాయమూర్తి అవుతున్నారు. వీరు ఇది చేయకూడదు, వీరు మారాలి అని ఇతరుల గురించి అంటున్నారు కానీ స్వయం గురించి అయితే ఈ విషయం పూర్తిగా సరి అయినది, నేను ఏది అంటున్నానో అదే సత్యం, వీరు ఇలా ఉన్నారు, వారు అలా ఉన్నారు అని అంటున్నారు. న్యాయవాదులు ఏమి చేస్తారు? అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా రుజువు చేస్తారు కదా! న్యాయవాదులు ఇచ్చేటువంటి రుజువులు మరెవరూ ఇవ్వలేరు. కానీ స్వయానికి న్యాయమూర్తిగా కావాలి, ఇదే పొరపాటు జరుగుతుంది. ఇతరులను రిమార్కు చేయటం (అవగుణాలను గుర్తించటం) చాలా సహజం. కానీ స్వయాన్ని మార్చుకోవాలి. దాని కొరకు స్లోగన్ “స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన” కనుక ముందు స్వయం మారాలి. విన్నారా ఏమి చార్టు చూసారో! బాప్ దాదా కూడా మాయ యొక్క ఆటను చూసి మాయ ఎంత చతురమైనదో అని నవ్వుకుంటూ ఉంటారు. మాస్టర్ శక్తివాన్ ఆత్మలను కూడా తనవారిగా చేసేసుకుంటుంది. అందువలన ఇప్పుడు ఏమి కావాలి? బేహద్ వైరాగ్యవృత్తి యొక్క వాయుమండలాన్ని తయారుచేయండి. ఎలా అయితే సేవ యొక్క వాయుమండలాన్ని కార్యక్రమాన్ని తయారుచేసుకుంటారు కదా! అలాగే ఈ వైరాగ్యవృత్తి అనేది బుద్దిలో వరకే కాదు, మనస్సు వరకు చేరుకోవాలి. అవ్వాలి మరియు చేయాలి అని అందరి బుద్దిలో ఉంది కానీ మనస్సులో ఈ అల ఉత్పన్నం అవ్వటం అవసరం. అర్ధమైందా? అందరూ బాగా అర్ధం చేసుకున్నారా? పాండవులు, శక్తులు బాగా అర్థం చేసుకున్నారు కదా? ఇప్పుడు అర్ధం చేసుకుని మరలా లేచి వెళ్ళిన తరువాత ఇది ఎలా అవుతుంది? ఇది చేయడం చాలా కష్టం అని ఆలోచిస్తారా? వినటం-మాట్లాడటం సహజం కానీ చేయడం కష్టం అని అనరు కదా? లేక ఇదే పరిస్థితి బావున్నదా? 

స్నేహంతో మీరందరూ వచ్చారు మరియు బాప్ దాదా కూడా వచ్చారు. స్నేహంలో ఎంత శక్తి ఉందో చూడండి! స్నేహం అవ్యక్తుడిని వ్యక్తంలోకి తీసుకువచ్చింది, మీ అందరినీ మధువనానికి తీసుకువచ్చింది, అందరూ మంచిగా స్నేహంలో చేరుకున్నారు కదా? ఏది తీసుకొచ్చింది? రైలు తీసుకొచ్చిందా? స్నేహం తీసుకొచ్చిందా? ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ శ్రమ, శ్రమగా అనిపించదు, కష్టం కూడా కష్టం అనిపించదు. ఈ మూడడుగుల స్థలానికి బదులు రెండడుగుల స్థలమే లభించినా కానీ ఏమనిపిస్తుంది? సత్యయుగ పాన్పు కంటే శ్రేష్టం అనిపిస్తుంది కదా? కష్టం అనిపించటం లేదు కదా? అందరూ విశ్రాంతిగా ఉన్నారా లేక కష్టంగా ఉన్నారా? ఏమి చేయము, ఉండాల్సిందే కదా అని అనరు కదా? మాతలు చెప్పండి కష్టంతో నిదురపోవటం లేదు కదా? భక్తి మార్గంలో కేవలం అడుగు పెట్టడానికి ఎంత శ్రమ చేస్తున్నారు? ఇక్కడైతే పడుకోవడానికి రెండడుగులు లభించాయి కదా! మూడు కాదు. కానీ రెండడుగుల స్థలం లభించింది కదా! రెండడుగులు అందరికీ లభించింది కదా? లేదా? మీరయితే అడిగారు, ప్రభూ నీ చరణాలలో చోటు ఇవ్వు అని, బాబా చరణాలకు బదులు, పట్టారాణిగా తయారుచేసారు. ఎక్కడైనా అయినా కానీ మధువనంలోని స్థలమే కదా? ఎక్కడ నిద్రపోతున్నా గానీ మధువనంలోనే కదా? ఇంకా బాబాకి సమీపంగా వచ్చేటటువంటి అధికారం లభిస్తుంది. ఇది కలలో కూడా లేదు కదా? అందరూ సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా లేక సంతోషంగా ఉన్నారా? (చాలా సంతోషం) అయితే రెండు అడుగుల స్థలం బదులు ఒక అడుగు స్థలం లభించినా గాని రాజీ అవుతారా? మంచిది. కూర్చునే నిద్రపోతారా? కొంతమందికి కూర్చుంటే నిద్ర బాగా వస్తుంది, పడుకుంటే నిద్ర రాదు. యోగంలో కూర్చోగానే నిద్ర ప్రారంభం అవుతుంది. అయిదురోజులు అఖండ తపస్సు చెయ్యాల్సి వస్తే తయారేనా? అందరూ తయారేనా? భోజనం దొరకపోయినా కూడా పర్వాలేదా? వ్రతం పెట్టుకుంటారా? మంచిది. అయిదురోజులు తినరు. అయితే ఇప్పుడు భోజనం తయారుచేయకండి. అంగీకారమే కాదా? అలా అనకూడదు అని అనుకుంటున్నారా? అక్కడ తినని పదార్థాలు కూడా మధువనంలో మీకు ఇక్కడ లభిస్తాయి. కానీ ఎవరెడీగా ఉండాలి. లభించినా చాలా మంచిది. లభించకపోయినా చాలా మంచిది. ఎందుకంటే అందరికీ అమృతవేళ దిల్‌ కుష్ మిఠాయి లభిస్తుంది. అందరూ తింటున్నారు కదా! మరియు మొత్తం రోజంతా సంతోషం యొక్క భోజనం లభిస్తుంది. అప్పుడు నడవగలరు కదా? మంచిది ఇది కూడా ట్రైల్ వేస్తారు. మంచిది. 

నలువైపుల ఉన్నటువంటి సర్వశ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలకు సదా సర్వప్రాప్తుల యొక్క అనుభూతులలో సదా లీనమయ్యే శ్రేష్ట ఆత్మలకు, సదా పరిశీలనాశక్తిని, నిర్ణయశక్తిని తీవ్రం చేసుకునే సమీప ఆత్మలకు, సదా సేవలో సమర్థంగా అయ్యి సమర్ధంగా చేసే నిమిత్త ఆత్మలకు, సదా అతీతం మరియు అతిప్రియం యొక్క సమానతను ఉంచుకునేవారికి ఆశీర్వాదాలకు పాత్రులు అయిన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments