04-12-1995 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
యదార్ధ నిశ్చయం యొక్క పునాది ద్వారా సంపూర్ణ పవిత్రతను ధారణ చేయండి.
ఈరోజు బాప్ దాదా దేశవిదేశాలలో నలువైపుల ఉన్న క్రొత్త క్రొత్త పిల్లలను చూస్తున్నారు. సాకారంగా మధువనంలో ఉన్నా, ఆకారరూపంలో తమతమ సేవాస్థానాలలో ఉన్నా కానీ క్రొత్త క్రొత్త పిల్లలను చూసి బాప్ దాదా అందరి నిశ్చయాన్ని పరిశీలిస్తున్నారు. ఎందుకంటే నిశ్చయమే ఈ బ్రాహ్మణ జీవితం యొక్క సంపన్నతకి పునాది మరియు పునాది గట్టిగా ఉంటే సహజంగా మరియు తీవ్రవేగంతో సంపూర్ణత వరకు చేరుకోవటం అనేది నిశ్చితం అయిపోతుంది. బాప్ దాదా చూస్తున్నారు, నిశ్చయం అనేది కూడా రకరకాలుగా ఉంది. యదార్ధ నిశ్చయం అంటే స్వయాన్ని ఆత్మ స్వరూపంలో తెలుసుకోవటం, అంగీకరించటం, నడవటం మరియు బాబాని కూడా ఎవరో అలా తెలుసుకోవాలి.
రెండవ నిశ్చయం - యోగం ద్వారా కొంచెం సమయం అశాంతి నుండి శాంతి యొక్క అనుభవం చేసుకుంటారు మరియు స్థానం యొక్క శక్తిశాలి శాంతి వాతావరణం ఆకర్షితం చేస్తుంది లేదా బ్రాహ్మణ పరివారంలోని బ్రాహ్మణాత్మల యొక్క ఆత్మిక ప్రేమ మరియు పవిత్రతా జీవితం యొక్క ప్రభావం పడుతుంది, సాంగత్యం బావుంది అనిపిస్తుంది, ప్రపంచలోని వాయుమండలం కంటే ఇక్కడి సాగత్యం మంచిగా అనిపిస్తుంది, జ్ఞానం, పరివారం, వాయుమండలం అన్నీ బావుంటాయి ..... ఇలా బావుంది అనే పునాది ఆధారంగా నడుస్తూ ఉంటారు, ఇది రెండవ నెంబర్. మొదటి నెంబర్ వారు యదార్థ నిశ్చయంతో ఉంటారు మరియు రెండవ నెంబర్ వారు బావుంది అని వస్తారు. మూడవ నెంబర్ వారు - ప్రపంచంలో సంబంధీకుల యొక్క దు:ఖమయ వాతావరణం నుండి రక్షించుకుని ఎంత సమయం సేవాకేంద్రంలో ఉంటారో అంత సమయం దు:ఖం నుండి వేరు అయ్యి శాంతిని అనుభవం చేసుకుంటారు. జ్ఞానం యొక్క గుహ్యతలోకి వెళ్ళరు కానీ శాంతి లభిస్తున్న కారణంగా ఒక్కొక్కసారి వస్తారు మరియు ఒక్కొక్కసారి రారు కానీ యదార్థ నిశ్చయబుద్ది అయిన వారే విజయీగా అవుతారు. మొదట వచ్చేటప్పుడు అశాంతితో విసిగిపోయి శాంతి యొక్క కోరికతో వస్తారు, దాహంగా ఉన్న వారికి నీటి యొక్క ఒక్క బిందువు లభించినా అది చాలా గొప్ప విషయంగా భావిస్తారు. అలాగే వారికి అప్రాప్తి నుండి ప్రాప్తి లభిస్తుంది, పరివారంలో, జ్ఞానంలో, యోగంలో వాయుమండలంలో తేడా కనిపిస్తుంది. అందువలన మొదట చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో నడుస్తారు, చాలా నషా ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది కానీ ఒకవేళ మొదటి నెంబర్ యదార్థ నిశ్చయం యొక్క పునాది పక్కాగా లేకుండా రెండవ, మూడవ నెంబర్ యొక్క నిశ్చయం ఉంటే నెమ్మది నెమ్మదిగా ఆదిలో ఉండే సంతోషం మరియు ఆవేశంలో తేడా వచ్చేస్తుంది. ఈ సీజన్లో చాలా మంది క్రొత్త క్రొత్తవారు వచ్చారు. అవకాశం కూడా లభించింది ఇది అయితే చాలా బావుంది. బాప్ దాదాకి కూడా క్రొత్త క్రొత్త పిల్లలను చూసి సంతోషం వస్తుంది, వీరు మరలా తమ పరివారంలోకి చేరుకున్నారు అని కానీ నిశ్చయం యొక్క పునాది గట్టిగా ఉందా? అనేది పరిశీలించుకోండి. మా నిశ్చయం మొదటి నెంబరా లేదా రెండవ నెంబరా? అని. నెంబర్ వన్ నిశ్చయం ఉంటే నడుస్తూ నడుస్తూ ముఖ్యంగా పవిత్రతను ధారణ చేయటంలో కష్టం అనిపించదు. ఒకవేళ కలలో అయినా పవిత్రత చలించినా లేదా అలజడి అయినా నెంబర్ వన్ నిశ్చయం యొక్క పునాది బలహీనంగా ఉన్నట్లు భావించండి ఎందుకంటే ఆత్మ యొక్క స్వధర్మమే పవిత్రత. అపవిత్రత అనేది పరధర్మం, పవిత్రత స్వధర్మం. స్వధర్మంలో నిశ్చయంగా ఉంటే పరధర్మం కదపలేదు. కొంతమంది పిల్లలు అంటున్నారు, మొదట్లో చాలా మంచిగా ఉండేది ఇప్పుడు ఏమైందో తెలియదు? అని. ఏమి అయ్యిందంటే బాబా ఎవరు, ఏవిధంగా ఉంటారు అనేది అనుభవంలోకి రాలేదు. బాబా తోడు ఉన్నారా? అని అడిగితే అందరు చేతులు ఎత్తుతారు. చేయి ఎత్తడం చాలా సహజం కానీ బాబా అయితే తోడు ఉన్నారు మరైతే బాబా యొక్క మొట్టమొదటి మహిమ - సర్వశక్తివంతుడు అని మరి ఈ మహిమను అంగీకరిస్తున్నారా లేదా కేవలం తెలుసుకున్నారా? సర్వశక్తివంతుడైన బాబా తోడు ఉన్నప్పుడు సర్వశక్తివంతుని ముందుకు అపవిత్రత రాగలదా? రాలేదు. ఒకవేళ వస్తుంది అంటే ఎక్కడ నుండి వస్తుంది? ఇంకా వేరే ఏదైనా స్థలం ఉందా? దొంగలు తాము రావడానికి ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దొంగల ద్వారం వేరేగా ఉంటుంది. అలాగే మీ దగ్గర కూడా దొంగ దారి ఏదీ లేదు కదా? పరిశీలించుకోండి. లేకపోతే మాయ ఎక్కడి నుండి వచ్చింది? పై నుండి వచ్చేసిందా? ఒకవేళ పై నుండి కూడా వచ్చేస్తుంటే పైనే సమాప్తి చేసేయాలి. మీకు తెలియకుండా రహస్య ద్వారం గుండా ఏమైనా వస్తుందా? అయితే పరిశీలించుకోండి మాయ ఏమి దొంగ ద్వారం తయారుచేసుకుని ఉంచుకోలేదు కదా!అని. ఆ ద్వారం కూడా ఎలా తయారుచేసుకుంటుందో తెలుసా? మీలో విశేషంగా ఏదైతే స్వభావం లేదా సంస్కారం బలహీనంగా ఉంటుందో అదే మాయ తన ద్వారంగా చేసుకుంటుంది. ఎందుకంటే ఏవైనా బలహీన స్వభావ సంస్కారాలు ఏమైనా ఉంటే మీరు ఆ ద్వారాన్ని ఎంతగా మూసినా మూయబడదు ఎందుకంటే ద్వారం బలహీనంగా ఉంటుంది, మాయకి అన్ని తెలుసు, ఈ ద్వారం బలహీనంగా ఉంది, దీని నుండి మార్గం లభించవచ్చు మరియు లభిస్తుంది కూడా అని. నడుస్తూ నడుస్తూ అపవిత్రత యొక్క సంకల్పాలు కూడా వస్తాయి, మాట మరియు కర్మ కూడా జరుగుతుంది అంటే ద్వారం తెరిచి ఉంది కనుకనే మాయ వచ్చింది. అయితే బాబా ఎలా తోడు ఉన్నట్లు? సర్వశక్తివంతుడు తోడు ఉన్నారు అని అనటం అయితే అంటున్నారు మరలా ఈ బలహీనత ఎక్కడి నుండి వచ్చింది? బలహీనత ఉండగలదా? ఉండలేదు కదా? అయితే ఎందుకు ఉంటుంది? పవిత్రతలో ఏ వికారం అయినా, లోభం అయినా అవ్వవచ్చు లోభం అంటే తినటం, త్రాగటంలో కాదు. కొందరు అనుకుంటున్నారు, మాకు ధరించటంలో, తినటంలో, ఉండటంలో ఏ ఆకర్షణ లేదు, ఏది ఉంటే, ఏది తయారుచేసుకుంటే అది తినేస్తున్నాం అంటారు కానీ ముందుకి వెళ్ళే కొలది మాయ రాయల్ రూపంలో మరియు సూక్ష్మ రూపంలో లోభాన్ని తీసుకువస్తుంది. అయితే ఆ రాయల్ లోభం ఏమిటి? విద్యార్థి అయినా, టీచర్ అయినా ఇద్దరిలో కూడా మాయ రాయల్ లోభం తీసుకురావడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తుంది.
ఒక విద్యార్థి చాలా మంచి నిశ్చయబుద్దిగా, సేవాధారిగా, అన్నింటిలో మంచిగా ఉంటారు కానీ ముందుకి వెళ్తున్న కొలది ఆ విద్యార్థికి కూడా ఈ రాయల్ లోభం ఎలా వస్తుందంటే - నేను ఇంతగా చేస్తున్నాను, అన్ని విధాల సహాయకారి అవుతున్నాను, తనువు, మనసు, ధనాలతో ఏ సమయంలో కావాలనుకుంటే ఆ సమయంలో హాజరు అయిపోతున్నాను, అయినా కానీ నా పేరు టీచర్ ఎప్పుడూ వర్ణన చేయలేదు, వీరు చాలా మంచి విద్యార్థి అనలేదు అని వస్తుంది. ఒకవేళ ఈ రూపంగా రాకపోతే ఇంకా ఎలా వస్తుందంటే - వారికి పేరు వచ్చింది, ఆ పేరు వింటూవింటూ - నేనే అలా ఉన్నాను, నేనే చేస్తాను, నేనే చేయగలను. ఇలా అభిమాన రూపంలో వస్తుంది. లేదా మీరు చాలా పని చేసి వచ్చారు, ఎవరూ మిమ్మల్ని పలకరించలేదు, ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, అసలు చూడనేలేదు. వారి విశ్రాంతిలో, వారి పనిలో వారు ఉన్నారు అనుకోండి. అప్పుడు నేను అంత చేసినా కానీ ఎవరూ అడగలేదు, అలాంటప్పుడు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, అసలు అడిగేవారే లేరు. దీని కంటే హాయిగా ఇంట్లోనే ఉండటం మంచిది, ఎప్పుడు కావాలంటే అప్పుడు సేవ చేయవచ్చు ఇలా రకరకాలుగా వికారాల యొక్క రాయల్ రూపం వస్తుంది. ఒక వికారం అయినా అంటే లోభం రాలేదు. కానీ అభిమానం వచ్చింది, నన్ను గౌరవించాలి లేదా మాకు విలువ ఉండాలి అనే ఇలాంటి భావన వచ్చింది అంటే ఇలా ఎక్కడైనా ఒక వికారం ఉంటే అక్కడ దాని నలుగురు సహయోగులు గుప్తరూపంలో ఉంటాయి. మరియు మీరు ఆ సమయంలో ఒక దానికి అవకాశం ఇచ్చారంటే గుప్తంగా ఉన్న మిగిలిన వికారాలన్నీ కూడా సమయానుసారంగా తమ అవకాశం తీసుకుంటూ ఉంటాయి. అప్పుడు అంటారు, మొదట్లో ఉండే నషా ఇప్పుడు లేదు, మొదట చాలా మంచిగా ఉండేది, ఆదిలో స్థితి బావుండేది, ఇప్పుడు ఏమి అయ్యిందో తెలియటం లేదు అంటారు. మాయ దొంగదారి నుండి వచ్చేసింది. ఇదైతే తెలుసు,తెలియలేదు అనకండి.
టీచర్లకు కూడా లోభం వస్తుంది. టీచర్ కి ఏమి కావాలి? సెంటర్ మంచిగా ఉండాలి, బట్టలు ఎలా ఉన్నా కానీ సెంటర్ మాత్రం కొంచెం ఉండటానికి యోగ్యంగా మంచిగా ఉండాలి మరియు తోడుగా ఉండేవారు మంచిగా ఉండాలి, విద్యార్థులు మంచిగా ఉండాలి, బాబా భండారా మంచిగా ఉండాలి అని. ఒకవేళ మంచి విద్యార్థి కొంచెం ఏమైనా మారిపోతే గుండె వేగంగా కొట్టుకుంటుంది. మరలా అనుకుంటారు, ఏమి చేయము, వీరు మంచి సహాయకారి కదా అలాంటి వారు వెళ్ళిపోయారు అని. ఆ జిజ్ఞాసువు సహాయకారియా? లేదా బాబా సహాయకారియా? ఆ సమయంలో ఎవరు కనిపిస్తున్నారు? జిజ్ఞాసువా లేక బాబానా? అంటే ఇలా వచ్చే రాయల్ మాయ పునాదిని కదపడానికి ప్రయత్నం చేస్తుంది. మీకు సర్వశక్తివంతుడు తోడు ఉన్నారు, అనే నిశ్చయం ఉంటే కనుక ఆ సమయంలో బాబా ఎవరో ఒకరిని నిమిత్తం చేస్తారు. కొందరు మాకు తక్కువలో తక్కువ ఒకసారి అయినా కానీ మౌంట్ ఆబూ కాన్ఫరెన్సులో అవకాశం లభించాలి, పోని యోగశిబిరంలో అయినా కావాలి, ఈ అవకాశం అయినా ఉండాలి కదా, ఉపన్యాసం చెప్పకపోయినా వేదిక పైకి అయినా రావాలి, చివరికి వినాశనం అయిపోయేలా ఉంది కానీ వినాశనం వరకు కూడా మాకు అవకాశం లభించదేమో! మాకు అవకాశం కావాలి కదా! అనుకుంటారు. కానీ బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు మీరు దానికి యోగ్యమైనవారైతే అవకాశం లభిస్తే సంతోషంగా చేయండి కానీ మాకు కూడా అవకాశం కావాలి అనటం అనేది కూడా అడుక్కోవటం. కావాలి,కావాలి అనటం కూడా రాయల్ గా అడుక్కోవటం. ఇలా జరగాలి..... మమ్మల్ని ఎవరు గుర్తించటం లేదు, దాదీ, దీదీలు కూడా అందరినీ గుర్తించటం లేదు, ముందు వచ్చిన వారిని ముందు పెట్టేస్తున్నారు, ఇటువంటి సంకల్పాలు రావటం అనేది కూడా సూక్ష్మంగా అడుక్కోవటం. కానీ బాప్ దాదా చెప్పారు కదా, మీరు వేదిక పైకి వచ్చారు, ఏదోక విశేషత కారణంగా, యోగం లేకున్నా కానీ స్థితి మంచిగా లేకపోయినా కానీ వచ్చారు ఎందుకంటే కొందరి వాణీలో మాధుర్యం ఉంటుంది, స్పష్టత ఉంటుంది మరియు గ్రహణ శక్తి ఉంటుంది, ఇక్కడి, అక్కడి ఉదాహరణలు అన్నీ సేకరించి చెప్తారు. అందువలన వారికి పేరు కూడా వస్తుంది. ఎవరు కావాలి అంటే ఫలానా వారు కావాలి అంటారు. ఎవరు వచ్చారు అంటే ఫలానా వారు వచ్చారు అంటారు. వారు యోగంలో గట్టిగా లేకపోయినా అవకాశం లభిస్తుంది. కానీ దీని ఆధారంగా నెంబర్ నిర్ణయం అవ్వదు. అంతిమ నెంబర్లో వీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్పారు లేదా వీరు ఇంతమంది విద్యార్థులను, ఇన్ని సెంటర్స్ ని తయారుచేశారు అని చూడరు కానీ ఎంతమందిని యోగ్యంగా తయారుచేశారు? అనేది చూస్తారు. సెంటర్స్ తయారుచేయటం గొప్ప విషయం కాదు. ఎంత మంది ఆత్మలను యోగ్యంగా చేసారు? 30 సెంటర్స్ కి ఇన్చార్జి అనే పేరు అయితే ఉంటుంది కానీ 30 సెంటర్లో 15 సెంటర్స్ కదులుతున్నాయి, 15 మంచిగా ఉన్నాయనుకోండి దాని వలన లాభం ఉందా లేదా కేవలం ఇన్ని సెంటర్స్ ఉన్నాయనే పేరు ఉందా? ఫలానా వారికి 30 సెంటర్స్ ఉన్నాయి అనే పేరే ఉంటుంది. కానీ దీని ఆధారంగా నెంబర్ లభించదు. ఎంతమందికి సుఖం ఇచ్చారు, ఎంతగా స్వయం శక్తిశాలిగా ఉన్నారు, దాని ప్రకారం నెంబర్ లభిస్తుంది. అందువలన కావాలి కావాలి అనే దానిని సమాప్తి చేయండి. లేకపోతే యోగం కుదరదు. ఫలానా చోట ప్రోగ్రామ్ జరిగింది అయినా కానీ నన్ను పిలవలేదు, మొన్న అక్కడ జరిగింది, నిన్న ఇక్కడ జరిగింది, ఇలా రోజూ చూసుకుంటూ ఉంటారు. అలా అయితే యోగం కుదురుతుందా? లేదా లెక్క పెట్టుకుంటూ కూర్చుంటారా?
ముఖ్య విషయం ఏమిటంటే యదార్ధ నిశ్చయాన్ని పక్కా చేసుకోండి. నేను ఆత్మను మరియు బాబా సర్వశక్తివంతుడు అని అనడం అయితే అంటున్నారు కానీ ప్రత్యక్ష కర్మలోకి తీసుకురావాలి. తండ్రి సర్వశక్తివంతుడే కానీ మిమ్మల్ని మాయ ఊపుతుంది అంటే మీ తండ్రి సర్వశక్తివంతుడు అని ఎవరు అంగీకరిస్తారు? ఎందుకంటే ఆయన కంటే ఎవరు గొప్పవారు లేరు. అయితే బాప్ దాదా ఈ రోజు నిశ్చయం యొక్క పునాదిని చూస్తున్నారు. క్రొత్తవారైనా, పాతవారైనా ఈ నిశ్చయం యొక్క పునాదిని ప్రత్యక్షంలోకి తీసుకురండి మరియు సమయానుసారంగా ఉపయోగించండి. సమయం అయిపోయిన తర్వాత బాబా ముందుకు పశ్చాత్తాప రూపంలో వస్తున్నారు, ఏం చేయము, బాబా ఇలా అయిపోయింది, మీరు దయాహృదయులు కదా నా పై దయ చూపించండి.... అంటున్నారు అంటే ఇది ఏమయ్యింది? ఇది కూడా రాయల్ పశ్చాత్తాపం. బాబా తోడు ఉంటే ఎవరికీ ధైర్యం ఉండదు? నిశ్చయబుద్ది అంటేనే విజయీ. ఒకవేళ ఏదైనా కర్మల ఖాతా వచ్చినా కానీ మనస్సుని చంచలం చేసుకోకండి. స్థితిని పైకి, క్రిందికి చేసుకోకండి. అది వచ్చింది, వెంటనే దూరం నుండే సమాప్తి చేయండి. ఇప్పుడిక యుద్ధం చేసే వీరునిగా అవ్వకండి. కొంతమంది ఇంకా ఇప్పుడు నిరంతర యోగిగా అవ్వలేదు. కొద్ది సమయం యోగిగా, కొద్ది సమయం యుద్ధం చేసే వీరునిగా ఉంటున్నారు కానీ మిమ్మల్ని మీరు ఏమని పిలిపించుకుంటున్నారు? యుద్ధం చేసే యోగులా? సహజయోగి అని పిలిపించుకుంటున్నారు కదా! క్రొత్తగా ఎవరైతే వచ్చారో వారికి బాప్ దాదా భాగ్యం పొందిన దానికి మరలా శుభాకాంక్షలు ఇస్తున్నారు. కానీ శుభాకాంక్షలతో పాటు పునాది మొదటి నెంబర్ గా ఉందా లేదా రెండవ నెంబర్ గా ఉందా? అని పరిశీలించుకోండి.
కొందరు అంటున్నారు జ్ఞానం, యోగం చాలా మంచిగా అనిపిస్తున్నాయి అని, మంచిది అని అనిపించటం బావుంది కానీ కర్మలోకి తీసుకుస్తున్నారా? జ్ఞానం అంటే ఆత్మ గురించి, పరమాత్మ గురించి, డ్రామా గురించి.... చెప్పటం కాదు. జ్ఞానం అంటే తెలివి. తెలివైనవారు ఎటువంటి సమయమో ఆ సమయానుసారంగా తెలివిని ఉపయోగించి సదా సఫలత పొందుతారు. జీవితంలో ఎప్పుడైనా దు:ఖం వస్తే ఏమి ఆలోచిస్తారు? నాకు ఇది ఎందుకు తెలియలేదు అని అంటారు కదా! అంటే అటువంటి వారు తెలివైనవారా? జ్ఞానులా? అవునా, కాదా చెప్పండి? (అవును). అవును అని చాలా బాగా అంటున్నారు. తెలివైనవారు ఎప్పుడూ మోసపోరు అంటే ఇది జ్ఞాని అయిన వారి గుర్తు. యోగి అయిన వారి గుర్తు ఏమిటంటే సదా స్వచ్చంగా, స్పష్టమైన బుద్ది కలిగి ఉంటారు. స్వచ్ఛంగా కూడా ఉంటారు మరియు స్పష్టంగా కూడా ఉంటారు. తెలియదు, తెలియదు అనే మాట యోగి ఆత్మలు మాట్లాడరు. వారి బుద్ధి సదా స్పష్టంగా ఉంటుంది. ధారణా స్వరూపానికి గుర్తు సదా స్వయం కూడా డబల్ లైట్ గా ఉంటారు. ఎంత బాధ్యత ఉన్నా కానీ ధారణాస్వరూపులైనవారు సదా డబల్ లైట్ గా ఉంటారు, మేళాలో అయినా, అలజడిలో అయినా డబల్ లైట్ గా ఉంటారు. మరియు సేవాధారికి గుర్తు - సదా నిమిత్తంగా మరియు నిర్మాణ భావంతో ఉంటారు. కనుక ఈ గుర్తులన్నీ మీలో పరిశీలన చేసుకోవాలి. నాలుగు సబ్జక్టుల యొక్క ఈశ్వరీయ విద్యార్థులం అని అంటారు కదా! కనుక ఆ గుర్తులు మీలో కనిపించాలి. క్రొత్తవారు ఏమి చేస్తారు? మీ నిశ్చయాన్ని మరింత పక్కా చేసుకోవాలి లేకపోతే రెండు, మూడు సంవత్సరాలు జ్ఞానంలో నడిచి మరలా పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. తిరిగి వెళ్ళిపోయినవారు మరలా ఆ ప్రపంచంలో కూడా ఉండలేరు, ఈ ప్రపంచంలో ఉండలేరు. అందువలన మీ పునాదిని చాలా గట్టిగా చేసుకోండి. సర్వశక్తివంతుడైన బాబా మా తోడుగా ఉన్నారు అనేది అనుభవం చేసుకోండి. ఈ ఒక్క విషయం అనుభవం చేసుకుంటే చాలు అన్నింటిలో పాస్ అయిపోతారు. ఎవరైనా ప్రధానమంత్రి, మంత్రిగా ఉంటే వారి వెనుక ఉన్నవారికి కూడా నషాగా ఉంటుంది. కానీ బాబా అయితే సర్వశక్తివంతుడు.
ఈ కల్పంలో మొదటిసారి వచ్చినవారు చేతులు ఎత్తండి. మొదటిసారి వచ్చిన వారు సదా సంతోషంగా ఉండాలి మరియు సదా సంపన్నంగా ఉండాలి. టీచర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు అవకాశం లభిస్తుంది? ఒకేసారి లభిస్తుంది. 12 నెలలను 13 నెలలు చేయలేం కదా! బాప్ దాదాకి అయితే మనస్సులో ఒక కోరిక ఉంది - టీచర్స్ తాజాగా, శక్తిశాలిగా అవ్వాలి. ఏ సెంటర్ కి ఎవరు వెళ్ళినా కానీ ఒక ఆత్మ కూడా బలహీనంగా కనిపించకూడదు అని. నిర్విఘ్న సేవాకేంద్రంగా ఉండాలి. దానికి మార్కులు లభిస్తాయి. ఈ జోన్ లో వెయ్యి సెంటర్స్ ఉన్నాయి. వెయ్యి గీతాపాఠశాలలు ఉన్నాయి అనుకుని బాబా సంతోషించటం లేదు. ఈ జోన్లో ఏ గొడవలు లేవు, ఎటువంటి ఫిర్యాదులు లేవు అని అంటే అప్పుడు సంతోషిస్తారు. ఎందుకంటే వాస్తవానికి టీచర్ శ్రమ చేస్తున్నారు మరియు గొడవలు కూడా జరుగుతున్నాయి, వాతావరణం అలజడిగా ఉంది అంటే అది సేవ అయ్యిందా? లేదా గొడవ అయ్యిందా? మీరు ఎందుకు వచ్చారు? బ్రహ్మాకుమారీ, కుమారులుగా ఎందుకు అయ్యారు? గొడవలు పెట్టుకోవడానికా? గొడవలు పెట్టుకోవాలంటే ప్రపంచంలో ఇంకా చాలా స్థానాలు ఉన్నాయి. కావాలంటే బాప్ దాదా అక్కడి చిరునామా కూడా ఇస్తారు. కానీ బ్రహ్మాకుమారీ, కుమారులుగా అవ్వటం అంటే కలయిక యొక్క మేళా జరుపుకోవాలి కానీ గొడవలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు ఇక్కడికి ఏ లక్ష్యంతో వచ్చారు? గొడవల కోసం వచ్చారా? కలయిక జరుపుకోవటం కోసం వస్తే బావుంటుంది కదా! ఎప్పుడైనా కానీ ఏ విద్యార్థి అయినా, టీచర్ అయినా, అవ్వటానికి అందరు విద్యార్థులే కనుక ఎప్పుడు కూడా గొడవ పెట్టకండి. గొడవ పెట్టడం అంటే ఏమి చెప్పను! బాప్ దాదాకి అయితే అది చెప్పటం కూడా ఇష్టమనిపించటం లేదు. టీచర్ అయినా, మధువనం వారైనా, మధువనం యొక్క ఉపసేవాకేంద్రం వారైనా, గీతాపాఠశాలల వారైనా లేదా మీ జోన్ల ఉప సేవాకేంద్రాలలో వారైనా లేదా కేంద్రాలలో వారైనా బ్రాహ్మణులుగా పిలవబడే వారందరు గొడవలు పెట్టుకుని బ్రాహ్మణుల పేరు పాడు చేయవద్దు, గొడవలు పెట్టుకుంటే క్షత్రియులుగా పిలుచుకోండి. బ్రాహ్మణులు అంటే విజయీ, గొడవలు పెట్టుకుంటే క్షత్రియులు, బ్రాహ్మణులు కాదు.
ఈరోజు ఏ పాఠం పక్కా చేసుకుంటారు? ఏ సంకల్పం చేస్తారు? ప్రతి ఒక్కరు మనసా, వాచా, కర్మణా, సంబంధ సంపర్కాలలో గొడవల నుండి ముక్తులు అవ్వండి. గొడవలు పెట్టుకోకూడదు. ప్రతి రోజు పరిశీలించుకోండి, ఈ వ్యర్థ సంకల్పాలు కూడా గొడవే. ఇది ఇతరులతో జరిగే గొడవ కాదు మీ మనస్సులో జరిగే గొడవ. అయితే అందరు ఏమి సంకల్పం చేస్తారు? ఎలా అవుతారు? చెప్పండి. గొడవల నుండి ముక్తులు అవుతాము అని చెప్పండి. ఎందుకంటే డైమండ్ జూబ్లీ వస్తుంది కదా! డైమండ్ జూబ్లీలో గొడవలు పెట్టుకునే వజ్రం కావాలి? మీరు ఇష్టపడతారా? లేదా చాలా అందమైన వజ్రాల మధ్య రెండు, నాలుగు గొడవ గల (కలీ) వజ్రాలు ఉంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ దీనికి చాలా సహజవిధి ఉంది, శ్రమ చేయవలసిన అవసరం లేదు. గొడవల నుండి ముక్తి అయ్యే విధి అన్నింటి కంటే సహజం, అదేమిటంటే మొదట స్వయాన్ని గొడవలు నుండి ముక్తులు చేస్కోండి. ఇతరుల వెనుక పడకండి. ఈ విద్యార్థి ఇలా ఉన్నారు, ఈ సహయోగి ఇలా ఉన్నారు, ఈ పరిస్థితి ఇలా ఉంది అని వాటిని చూడకండి. మిమ్మల్ని మీరు గొడవల నుండి ముక్తులు చేస్కోండి. గొడవలు ఉన్నచోట నుండి మీ మనస్సుని, బుద్ధిని వేరు చేస్కోండి. ఈ గొడవ పూర్తి అయిపోతే చాలా మంచిగా అయిపోతుంది, మా సేవ మరియు స్థితి కూడా మంచిగా అయిపోతాయి అని ఆలోచిస్తున్నారు. కానీ గొడవ అనేది పర్వతంతో సమానం. పర్వతానికి తలకొట్టుకుంటే పర్వతం కదులుతుందా? స్వయం వేరు అవ్వండి లేదా ఎగిరేకళతో గొడవ అనే పర్వతం పై నుండి వెళ్ళిపోండి. అప్పుడు పర్వతం కూడా మీకు ఒకసారిగా సహజం అనిపిస్తుంది. నేను తయారవ్వాలి అని అనుకోవాలి. నేను గొడవల నుండి ముక్తి అవ్వాలి అని. అమృతవేళ నుండి స్వయంలో సంకల్పం చేస్కోండి. ఇది గొడవల ప్రపంచం కనుక గొడవలే వస్తాయి. కానీ మీ సేవాకేంద్రమే మీకు ప్రపంచం. మీ ప్రపంచమే అది అయినప్పుడు అక్కడికే వస్తాయి కదా! పేపర్ ఇవ్వడానికి లండన్, అమెరికా వెళ్తారా? సెంటర్లోనే ఇస్తారు కదా! కనుక గొడవలు రాకూడదు అని అనుకోకండి. గొడవల నుండి విముక్తులు అవ్వాలి అని అనుకోండి. అవ్వగలరా? లేదా సెంటర్‌కి, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గొడవని నేను ఏమి చేయ్యలేను అని అంటారా అలా అనరు కదా! పాత ప్రపంచంతో, పాత ప్రపంచం యొక్క ప్రాప్తులతో ఇప్పుడు మీ మనస్సుని బుద్దిని వేరు చేసుకోండి అని బాబా చెప్పారు. అయితే పాత ప్రపంచంతో లంగర్ తీసేసారా లేక వేసి ఉందా? బంధించబడి లేరు కదా? దీని గురించి ఒక కథ చెప్తారు కదా, అజ్ఞానంగా ఉండటం కూడా అంధకారంతో సమానం. స్థూలమైన చీకటి లేకపోయినా అజ్ఞానం అనే చీకటిలో ఉన్నట్లే. అలాగే మీరు కూడా చీకటిలో ఉండిపోకూడదు. బాగా పరిశీలించుకోండి. ఇలా గొడవల నుండి ముక్తులుగా అవ్వటంలో మొదటి నెంబర్ లోకి ఏ కేంద్రం లేదా మధువనం వస్తుందో చూస్తాను.
మధువనం వారు కూడా తయారవ్వాలి. ఇప్పుడు వచ్చిన గ్రూప్ ఒకటే తయారవ్వటం కాదు. మధువనం వారందరు క్రింద కూర్చున్నారు కదా! (ఓంశాంతి భవనం నిండిపోయిన కారణంగా మధువనం వారు పాండవభవనంలో కూర్చుని మురళి వింటున్నారు) ఇక్కడ కూర్చున్నా క్రింద కూర్చున్నా కానీ బాప్ దాదా ఎదురుగానే ఉన్నారు. మీరు టి.వి. ఎదురుగా ఉన్నారు, బాప్ దాదా మీ ఎదురుగా ఉన్నారు. మధువనం వారైనా దేశ, విదేశాల వారైనా అందరు దీనిలో మొదటి నెంబర్ అవ్వండి. అప్పుడు డైమండ్ జూబ్లీని చాలా వైభవంగా జరుపుకోండి. అందరు ముక్తులు అయిపోతారా అని బాప్ దాదాకి కొంచెం కొంచెం అనిపిస్తుంది. కానీ బాప్ దాదా యొక్క ఈ సంకల్పం సరియైనది కాదు కదా! బాబాకి పిల్లలపై నిశ్చయం ఉంటుంది కదా! కానీ కొంచెం కొంచెం అనిపిస్తుంది. మరి ఏం చేస్తారు? ఇక మిగిలి ఉన్నది ఎంత సమయం ? ఒక నెల ఉంది. జనవరి నుండి డైమండ్ జూబ్లీ ప్రారంభమవుతుంది. డైమండ్ జూబ్లీ మధ్యలో చేస్తారా లేక ప్రారంభంలో చేస్తారా, ఏం చేస్తారు చెప్పండి? సలహా చెప్పండి? డైమండ్ జూబ్లీ ప్రారంభంలో ముక్తులైపోతారా లేదా సమాప్తిలో ముక్తులౌతారా? మాకు కొంచెం సమయం కావాలి, ఇంతలో ఎలా జరిగిపోతుంది, 63 జన్మల సంస్కారం కదా! ఒక నెలలో సమాప్తం అవ్వటం కష్టం అని భావించేవారు చేతులెత్తండి? సమయం కావాలా? 2 నెలలు కావాలా లేదా 6 నెలలు కావాలా? కొంచెం సమయం కావాలనేవారు చేతులెత్తండి. చేతులెత్తిన వారందరూ నిల్చోండి. సత్యమే కదా! వీరికి ఫోటో తీయండి, వీరికి సమయం ఇస్తాను. భయపడకండి. చేతులెత్తిన వాళ్ళందరు చీటిలో మీ సెంటర్ పేరు, మీ పేరు వ్రాసి శాంతామణి దాదీకి ఇవ్వండి. ఏమి పర్వాలేదు. మీరు సత్యం చెప్పారు కనుక తొందరగా ముక్తులైపోతారు. ఇంతమంది ముక్తులుగా అయిపోతే మిగిలిన కొద్దిమంది మీ తోక పట్టుకుని అయినా ముక్తులు అయిపోతారు.
నలువైపుల ఉన్నటువంటి సదా శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలకు, భాగ్య విధాతను తమ సొంతం చేసుకునే శ్రేష్టాత్మలకు, సదా బాప్ దాదా యొక్క శ్రీమతం వినగానే వెంటనే చేసే సుపుత్రులకు, సదా సేవలో అంచంచలంగా ఉండేవారికి, గొడవల నుండి ముక్తులుగా మరియు పరమాత్మ మిలనం యొక్క మేళా జరుపుకునే పిల్లలందరికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment