03-04-1997 అవ్యక్త మురళి

         03-04-1997         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పాత సంస్కారాలను సమాప్తి చేసుకుని మీ యొక్క నిజసంస్కారాలను ధారణ చేసి ఎవరెడీ అవ్వండి.

ఈరోజు బాప్ దాదా తన యొక్క నలువైపుల ఉన్నటువంటి విశ్వపిత యొక్క ప్రేమలో లవలీనమైన మరియు అదృష్టవంతులైన పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక బిడ్డ యొక్క భాగ్యం చూసి బాబాకి కూడా గర్వంగా ఉంది - నా పిల్లలు వర్తమాన సమయంలో ఎంత గొప్పవారంటే కల్పమంతటిలో దేవతా స్వరూపంలో ఉన్నా, ధర్మాత్మల రూపంలో ఉన్నా, మహాత్మల రూపంలో ఉన్నా, కోటానుకోట్లకు అధిపతి రూపంలో ఉన్నా బ్రాహ్మణ ఆత్మలైన మీకు ఉన్న భాగ్యం మరెవరికి లేదు.ఇలా మీ యొక్క శ్రేష్ట భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుంటున్నారా? ఓహో భాగ్య విధాత బాబా! మరియు ఓహో నా శ్రేష్ట ఆత్మ యొక్క భాగ్యం! అని ఈ హద్దులేని పాట సదా పాడుతూ ఉంటున్నారు కదా! భాగ్యం యొక్క ఈ పాట సదా స్వతహాగా మ్రోగుతూ ఉంటుందా? బాబా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు కూడా సంతోషిస్తున్నారు కానీ మధ్యమధ్యలో భాగ్యాన్ని ప్రత్యక్షం చేయడానికి బదులు గుప్తం చేసేస్తున్నారు. బాబా చూస్తున్నారు - పిల్లలలో సౌభాగ్యం యొక్క నషా మరియు నిశ్చయం గుప్తం అయిపోతే ఏమంటారు? డ్రామా. కానీ బాప్ దాదా పిల్లలను భాగ్యం యొక్క స్మృతిస్వరూపులుగా చూడాలనుకుంటున్నారు. మీరందరు అనుకుంటున్నారు “కానీ.... అనేది మధ్యలో వచ్చేస్తుంది. ఏ బిడ్డను అడిగినా అందరూ - నేను బాబా సమానంగా తయారవ్వవలసిందే అనే లక్ష్యం పెట్టుకుని నడుస్తున్నారు. లక్ష్యం చాలా మంచిగా ఉంది. లక్ష్యం శ్రేష్టంగా మరియు చాలా మంచిగా ఉంది కానీ అప్పుడప్పుడు ప్రత్యక్ష రూపంలో, అప్పుడప్పుడు గుప్త రూపంలో ఎందుకు ఉంటుంది? కారణం ఏమిటి? బాప్ దాదాతో ఇంత మంచి, మంచి ప్రతిజ్ఞలు చేస్తున్నారు, ఆత్మికసంభాషణ కూడా చేస్తున్నారు. మరలా లక్ష్యం మరియు లక్షణాలలో తేడా ఎందుకు వస్తుంది? బాప్ దాదా ఫలితంలో చూసారు - కారణం ఏమిటి? అని. అలాగే మీ అందరికి కూడా తెలుసు, క్రొత్త విషయం కాదు, అయినప్పటికీ బాప్ దాదా రివైజ్ చేయిస్తున్నారు. 

బాప్ దాదా 3 విషయాలు చూసారు 1. ఆలోచించడం అంటే సంకల్పం చేయటం 2. మాట్లాడటం అంటే వర్ణన చేయటం 3. కర్మలో ప్రత్యక్ష అనుభవంలోకి మరియు నడవడికలోకి తీసుకురావటం అంటే కర్మలోకి తీసుకురావటం. మూడింటి సమానత తక్కువగా ఉంది. సమానత మంచిగా ఉంటే నిశ్చయం మరియు నషా ప్రత్యక్షం అవుతాయి. సమానత తక్కువ అయితే నిశ్చయం మరియు నషా గుప్తం అయిపోతాయి. ఫలితంలో చూస్తే ఆలోచించే విధానం చాలా మంచిగా కూడా ఉంది మరియు తీవ్రంగా కూడా ఉంది. మాట్లాడేటువంటి వేగం మరియు నషా కూడా 75 శాతం మంచిగా ఉంది. మాట్లాడటంలో ఎక్కువమంది తెలివైన వారిగా కూడా ఉన్నారు కానీ ప్రత్యక్ష నడవడికలోకి తీసుకురావటంలో మొత్తం మార్కులు తక్కువగా ఉన్నాయి. రెండు విషయాలలో బావున్నారు కానీ మూడవ విషయంలో చాలా తక్కువగా ఉన్నారు. కారణం ఏమిటి? సంకల్పం కూడా బావుంది, మాట కూడా చాలా సుందర రూపంలో ఉంది. మరలా ప్రత్యక్షంలో తక్కువ ఎందుకు అవుతుంది? కారణం ఏమిటి తెలుసా? అవునా లేక కాదా చెప్పండి. అన్నీ బాగా తెలుసు. ఒకవేళ ఎవరికైనా ఈ టాఫిక్ పై ఉపన్యాసం చెప్పండి లేదా క్లాస్ చేయండి అంటే ఎంత మంచిగా క్లాస్ చేస్తారు! మరియు చాలా నిశ్చయంతో, నషాతో ఉపన్యాసం కూడా చెప్తారు, క్లాస్ కూడా చేస్తారు, చేయిస్తారు. బాప్ దాదా అందరి క్లాసులు వింటున్నారు ఏమేమి చెప్తున్నారు అని. ఓహో! పిల్లలు ఓహో!! అని నవ్వుకుంటున్నారు. 

ముఖ్యమైన విషయం - రివైజ్ కోర్స్ నడుస్తుంది అని బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు. బాబా చెప్తున్నారు కారణం ఒకటే ఉంది, ఎక్కువ కూడా లేవు. ఒకటే కారణం మరియు నివారణ చేసుకోవటం కూడా కష్టం కాదు. చాలా సహజం కానీ సహజాన్ని కూడా కష్టంగా చేసుకుంటున్నారు. అసలు కష్టమే కాదు, కష్టంగా ఎందుకు చేసుకుంటున్నారు? నషా గుప్తం అయిపోతుంది. ఒకటే కారణం - ధారణ విషయాలు ఏవైతే వింటున్నారో, చేస్తున్నారో, శక్తుల రూపంలో, గుణాల రూపంలో, చాలామంచి మంచి విషయాలు చేస్తున్నారు, ఎంత మంచిగా చేస్తున్నారు అంటే వినేవారు అంటే జ్ఞానీ ఆత్మలైనా, అజ్ఞానీ ఆత్మలైనా విని చాలా మంచిది, చాలా బావుంది, చాలా బాగా చెప్పారు అంటూ చప్పట్లు కొడుతున్నారు. కానీ ఎన్నిసార్లు "కానీ” అనే మాట వచ్చింది? ఈ “కానీ” అనే మాటయే విఘ్నం వేస్తుంది. “కానీ” అనే మాట సమాప్తి అవ్వటం అంటే బాబా సమానతకి సమీపంగా రావటం మరియు బాబాకి సమీపంగా రావటం అంటే సమయాన్ని సమీపంగా తీసుకురావటం. కానీ ఇప్పటివరకు “కానీ” అనే మాట అంటున్నారు. కానీ అనటం బాబాకి ఇష్టం అనిపించటం లేదు. కారణం ఏమిటి? ఏదైతే చెప్తున్నారో, ధారణ కూడా చేస్తున్నారో, ధారణ రూపంలో ధారణ చేస్తున్నారు. మరియు ఆ ధారణ కొందరికి కొద్ది సమయం, కొందరికి ఎక్కువ సమయం నడుస్తుంది కానీ ధారణ ప్రత్యక్షంలో సదా పెరుగుతూ ఉండాలి. దాని కొరకు ముఖ్య విషయం ఇదే ఎలా అయితే ద్వాపరయుగం నుండి అంతిమజన్మ వరకు ఏవైతే అవగుణాలు లేదా బలహీనతలు ఉన్నాయో వాటి ధారణ సంస్కార రూపంలో అయిపోయింది మరియు సంస్కారం అయిపోయిన కారణంగా శ్రమ చేయవలసిన అవసరం ఉండటం లేదు. వదలాలి అనుకుంటున్నారు, మంచిగా అనిపించటం లేదు, మరలా ఏమి చేయము, నా సంస్కారమే అంత అంటున్నారు. మీరు చెడుగా అనుకోవద్దు, నా సంస్కారమే అంత అంటున్నారు. ఆ సంస్కారం ఎలా తయారయ్యింది? తయారుచేసుకుంటేనే తయారయ్యింది కదా! ద్వాపరయుగం నుండి తయారైన వ్యతిరేక సంస్కారాలతో బలహీనం కూడా అవుతున్నారు. మరల ఏమి చేయము సంస్కారం అని కూడా అంటున్నారు. ఆ సంస్కారం సహజంగా, అవసరం లేనప్పటికీ ప్రత్యక్షంలోకి వచ్చేస్తుంది కదా! కొంతమందికి క్రోధం వచ్చేస్తుంది, మరలా కొద్ది సమయం తర్వాత అంటున్నారు మీరు చెడుగా అనుకోవద్దు నా సంస్కారమే అంత అని. క్రోధాన్ని సంస్కారంగా చేసుకున్నారు, అవగుణాలను సంస్కారంగా తయారుచేసుకున్నారు. మరి గుణాలను ఎందుకు సంస్కారంగా తయారుచేసుకోలేదు? ఎలా అయితే క్రోధం అజ్ఞానీ ఆత్మల శక్తియో అలాగే జ్ఞానీ ఆత్మల శక్తి - శాంతి, సహనం. అజ్ఞానుల శక్తి అయిన క్రోధాన్ని చాలా మంచిగా సంస్కారంగా తయారు చేసుకున్నారు మరియు ఆ సంస్కారాన్ని ఉపయోగిస్తున్నారు కూడా మరలా క్షమించమని కూడా అడుగుతున్నారు. క్షమించండి, ఇక ముందు ఇలా జరుగదు అంటున్నారు కానీ ఇంకా ఎక్కువగా జరుగుతుంది, కారణం ఏమిటి? ఎందుకంటే సంస్కారంగా తయారుచేసేసుకున్నారు. బాప్ దాదా ఒకే విషయం పిల్లలకు మాటిమాటికి చెప్తున్నారు - ఇప్పుడు ప్రతి గుణాన్ని, ప్రతి జ్ఞానం యొక్క విషయాన్ని సంస్కారంగా చేసుకోండి. 

బ్రాహ్మణాత్మల యొక్క నిజసంస్కారం ఏమిటి? క్రోధమా లేదా సహనశక్తియా? ఏమిటి? సహనశక్తి, శాంతిశక్తి కదా! అవగుణాలను సంస్కారంగా తయారుచేసుకున్నారు, బాగా దంచి లోపల నింపేసుకున్నారు. అందువలనే అవసరం లేనప్పటికీ వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ప్రతి గుణాన్ని బాగా దంచి లోపల సంస్కారంగా తయారుచేసుకోండి. నా యొక్క నిజసంస్కారం ఏమిటి? అనేది సదా స్మృతి ఉంచుకోండి. రావణుని ఆస్తిని సంస్కారంగా తయారుచేసుకుంటున్నారు, పరాయి వస్తువులను మీవిగా చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబా యొక్క ఖజానాను మీదిగా చేసుకోండి. రావణుని వస్తువులను సంభాళించుకుని ఉంచుకుంటున్నారు మరియు బాబా యొక్క వస్తువులను మాయం చేసేస్తున్నారు ఎందుకు? రావణునితో ప్రేమ ఉందా! రావణుడు మంచిగా అనిపిస్తున్నాడా లేదా బాబా మంచిగా అనిపిస్తున్నారా? అనటం అయితే బాబా మంచిగా అనిపిస్తున్నారు అంటున్నారు.మనస్సుతోనే అంటున్నారు కదా? కానీ ఏ విషయం అయితే బాగా అనిపిస్తుందో అది నిశ్చయంతో మనస్సులో ఉంచుకుంటారు కదా! ఏవోక రావణుని సంస్కారాలకు వశం అయిపోతూ ఉంటున్నారు. మరలా బాబా నీతో చాలా ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది అని అంటున్నారు. ఎంత ప్రేమ ఉంది అని బాబా అడుగుతున్నారు? ఆకాశం కంటే ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. బాబా అది విని ఎంత భోళా పిల్లలు అని సంతోషిస్తున్నారు. అయినప్పటికీ బాబా చెప్తున్నారు - పిల్లలందరితో శపథం చేస్తున్నారు. ఒకవేళ మనస్సుతో ఒకసారైనా "నా బాబా” అని తర్వాత పిల్లలు మర్చిపోయినా కానీ ఒకసారి మనస్సుతో " నా బాబా ” అంటే బాబా కూడా అంటున్నారు మీరు ఎవరు ఎలా ఉన్నా నా వారే అని. ఇంటికి తీసుకుని అయితే వెళ్ళాలి కదా! గుంపులో ఒకరిగా రాకూడదు, ప్రేయసిగా అయ్యి రావాలి అని బాబా కోరుకుంటున్నారు. ఇది విని చాలా సంతోషిస్తున్నారు. మీ గురించి మీరే నవ్వుకుంటున్నారు. ఇప్పుడు వినే సమయంలో మీ గురించి మీకు నవ్వు వస్తుంది కదా! కానీ ఆవేశంలోకి వచ్చినప్పుడు ఎర్రగా, పచ్చగా అయిపోతున్నారు. బాబాకి పిల్లల యొక్క ఫలితంలో ఒక విశేషత మంచిగా అనిపించింది. అది ఏమిటి? పవిత్రత పాటించటం. దీనిలో ఎంత సహించవలసి వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ ఈ విషయంలో 75% మంచిగా ఉన్నారు. కొంతమంది గొప్పలు కూడా చెప్పుకుంటున్నారు అయినప్పటికీ 75% ఈ విషయంలో పాస్ అయ్యి ము చూపించారు. ఇప్పుడు దీని తర్వాత రెండవ సబ్జక్టు ఏమిటి? క్రోధం. దేహాభిమానం అనేది మొత్తానికి సంబంధించినది. కానీ క్రోధం యొక్క సబ్జక్టులో చాలా తక్కువమంది పాస్ అవుతున్నారు. క్రోధం వికారం కాదు, శస్త్రం అని భావిస్తున్నారు కానీ క్రోధం జ్ఞానీ ఆత్మలకు మహాశత్రువు. ఎందుకంటే క్రోధం అనేక ఆత్మల సంబంధ, సంపర్కంలోకి రావటం ద్వారా ప్రత్యక్షం అయిపోతుంది. మరియు క్రోధాన్ని చూసి బాబా పేరుకి చాలా గాని (నింద) జరుగుతుంది. జ్ఞానీ పిల్లలు కూడా ఇలా ఉంటారు, మేము చూసాము అంటారు. క్రోధానికి చాలా రూపాలు ఉన్నాయి. 1. మహాన్ రూపం గురించి అయితే మీకు తెలుసు - వీరు క్రోధంలో ఉన్నారు అని తెలిసిపోతుంది. 2. క్రోధం యొక్క సూక్ష్మ రూపం. అంటే ఈర్ష్య, ద్వేషం, అసహ్యం లోపల వస్తాయి. ఈ స్వరూపంలో గట్టిగా మాట్లాడటం లేదా పైకి ఏమీ కనిపించదు కానీ బయటికి కనిపించే క్రోధం ఎలా అయితే అగ్ని రూపమో, వారు స్వయం కూడా కాలిపోతూ ఉంటారు, ఇతరులను కూడా కాల్చేస్తారు. అలాగే ఈ ఈర్ష్య, ద్వేషం, అసహ్యం ఇవి లోలోపలే కాల్చేస్తూ ఉంటాయి. బయటికి ఎర్రగా, పచ్చగా అవ్వరు అలా అయినా మంచిదే కానీ వీరు నల్లగా అయిపోతారు. 3. క్రోధానికి చతురమైన రూపం కూడా ఉంది. అది ఏమిటి? అక్కడక్కడ సీరియస్ అవ్వాలి కదా అని చెప్తారు లేదా భావిస్తారు. అక్కడక్కడ కళ్యాణం కోసం 'లా' (నియమం) తీసుకోవలసి ఉంటుంది అని భావిస్తున్నారు. అది కళ్యాణమా, కాదా అని మిమ్మల్ని మీరు అడగండి. బాబా ఎవరికీ 'లా' చేతిలోకి తీసుకునే అవకాశం ఇవ్వలేదు. క్రోధంలోకి రండి, 'లా' చేతులలోకి తీసుకోండి అని బాబా ఏదైనా మురళీలో చెప్పారా? క్రోధం యొక్క అంశం లోపల ఉన్న కారణంగానే 'లా' చేతులలోకి తీసుకుంటున్నారు. నిమిత్త ఆత్మలు కూడా 'లా' చేతులలోకి తీసుకోరు, కేవలం రివైజ్ చేస్తారు అంతే. 'లా' చేతులలోకి తీసుకోరు కానీ బాబా ద్వారా తయారయిన 'లా' రివైజ్ చేయవలసి వస్తుంది. ఇది కూడా నిమిత్తమైన వారికే అవకాశం ఉంది అందరికి కాదు. 

ఈరోజు బాప్ దాదా కొద్దిగా అధికారికంగా శిక్షణ ఇస్తున్నారు, ప్రేమతో తీసుకోండి. బాప్ వాదా పిల్లలు వ్రాసి ఇచ్చినటువంటి, చేసినటువంటి ప్రతిజ్ఞలు చూసి, విని నవ్వుకుంటున్నారు. ఇప్పుడు బాప్ దాదా ప్రతి గుణాన్ని సంస్కారంగా చేసుకోండి అని చెప్పారు, దీనిని అండర్‌లైన్ చేసుకున్నారా? శాంతి స్వరూపంలో ఉండటం, సహనశీలంగా ఉండటం అనేది నా సంస్కారంగా అయిపోయింది అని ఇప్పుడు చెప్పాలి. మరలా బాప్ దాదా వచ్చే సమయానికి ఈ 5-6 నెలలలో వీటిని మీ నిజ సంస్కారంగా తయారుచేసుకుని చూపించాలి అందువలన ఈరోజు ఫలితం చెప్తున్నాను. క్రోధం యొక్క రిపోర్ట్ చాలా వస్తుంది. చిన్నగా, పెద్దగా, రకరకాల రూపాలతో క్రోధంలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు బాబా ఎక్కువ వివరంగా చెప్పటం లేదు కానీ కథలు చాలా మజాగా ఉంటున్నాయి. కనుక ఈ రోజు నుండి క్రోధాన్ని ఏమి చేస్తారు? వీడ్కోలు ఇచ్చేస్తారా? (అందరూ చప్పట్లు కొట్టారు) చూడండి, చప్పట్లు మ్రోగించటం చాలా సహజం కానీ క్రోధం గురించి చప్పట్లు మ్రోగించలేదు. ఇప్పుడిక బాబా మాటిమాటికి చెప్పకూడదు అని అనుకుంటున్నారు కానీ మరలా దయ వస్తుంది చెప్తున్నారు. బాబాప్రతిజ్ఞ అయితే చేసాము, కానీ... మరలా వచ్చేసింది, ఏమి చేయము అని ఇప్పుడిక చెప్పకూడదు. అనుకోవటం లేదు కానీ వచ్చేసింది అంటున్నారు. నీవే మాయకి చెప్పు, క్రోధానికి చెప్పు అంటున్నారు. ఈ పురుషార్థం కూడా బాబా చేస్తారు కానీ ప్రాప్తి పిల్లలు తీసుకుంటారా? ఈ శ్రమ కూడా బాబా చేయాలా? ఇలాంటి ప్రతిజ్ఞలు చేయవద్దు, మరలా 5 నెలలు తర్వాత ఫలితం చూస్తారు. మీరు చెప్పినా, చెప్పకపోయినా బాబా దగ్గరికి చేరుకుంటుంది. ఏమి చేయము, అయిపోతుంది. పరిస్థితులు ఇలా వస్తున్నాయి. విషయం చాలా పెద్దది కదా... ఇలాంటి ఫలితం చెప్పవద్దు. బాబాకి కూడా అర్థం చేయించడానికి ప్రయతిస్తున్నారు. పిల్లలు చాలా తెలివైనవారు అయిపోయారు. బాబా చిన్న పెద్ద విషయాలను దాటుతున్నాము కదా. ఇది చాలా పెద్ద విషయం అని అంటున్నారు. ఇప్పుడు దోషం ఎవరిపై పెట్టారు? విషయంపై పెడుతున్నారు మరియు విషయం ఏమి చేస్తుంది? వస్తుంది మరియు వెళ్ళిపోతుంది. 5 వేల సంవత్సరాల తర్వాత మరలా వస్తుంది. 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చే విషయంపై దోషం పెడుతున్నారు. ఇలా చేయకూడదు. ఏమి చేయము ...... అనేది సంకల్పంలో కూడా రాకూడదు. బాప్ దాదా క్రోధం గురించి విశేషంగా ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే క్రోధానికి మీరు వీడ్కోలు ఇచ్చేస్తే దీనిలో లోభం, కోరిక అన్నీ వచ్చేస్తాయి. లోభం అంటే కేవలం సంపాదన గురించి లేదా తినటం గురించే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. జ్ఞానీ ఆత్మలకైనా, అజ్ఞానీ ఆత్మలకైనా ఏదైనా కోరిక ఉంటే అది కూడా లోభమే. క్రోధాన్ని సమాప్తి చేయటం ద్వారా లోభం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది, అహంకారం కూడా సమాప్తి అయిపోతుంది. అభిమానం వస్తుంది కదా - నేను పెద్దవాడిని, నేను తెలివైనవాడిని, నాకు అన్నీ తెలుసు వీరు చెప్పేది ఏమిటి! ఇలా అనుకున్నప్పుడే క్రోధం వస్తుంది. కనుక క్రోధానికి వీడ్కోలు ఇచ్చేస్తే అభిమానం మరియు లోభం కూడా వెనువెంట వీడ్కోలు ఇచ్చేస్తాయి. అందువలనే బాబా విశేషంగా లోభం గురించి చెప్పకుండా క్రోధం గురించి అండర్లైన్ చేయిస్తున్నారు. కనుక సంస్కారాన్ని తయారు చేసుకుంటారా? ఇప్పుడు అందరు చేతులు ఎత్తండి మరియు అందరి ఫోటో తీయండి. (అందరు చేతులు ఎత్తారు) ఇప్పుడు కొద్దిగానే శుభాకాంక్షలు ఇస్తున్నాను. చాలా కాదు ఫలితం చూసిన తర్వాత వతనం యొక్క దేవతలు, స్వర్గం యొక్క దేవతలు కూడా ఓహో! ఓహో!! అంటూ మీపై పూలవర్షం కురిపిస్తారు. 

ఈరోజు నుండి ఎవరికి వారు చూసుకోండి, ఇతరులను చూడటం కాదు. ఇతరులలో ఈ విషయాలు చూసే నేత్రాన్ని మూసేయండి. స్థూల కళ్ళు అయితే మూసుకుని ఉండలేరు కదా! కనుక మనస్సు యొక్క నేత్రాన్ని మూసి ఉంచండి - రెండవ వారు చేస్తున్నారా, మూడవ వారు చేస్తున్నారా అని నేను చూడకూడదు అనుకోండి. బాబా ఇంకా గట్టిగా చెప్తున్నారు - ఒకవేళ ఎవరైనా మహారథులు బలహీనంగా ఉన్నా ఆ బలహీనతలు వినటంలో మరియు చూడటంలో మనస్సుని అంతర్ముఖిగా చేసుకోండి. నవ్వు వచ్చే విషయం ఒకటి చెప్పనా - బాప్ దాదా ఈ రోజు కొంచెం స్పష్టంగా చెప్తున్నారు, మరోలా అనుకోకండి. మంచిది - ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్తున్నాను - బాప్ దాదా చూసారు, చాలామంది సమయం అనుసరించి, సదా కాదు అప్పుడప్పుడు మహారథుల యొక్క విశేషతలు తక్కువ చూస్తున్నారు మరియు బలహీనతలు చాలా లోతుగా చూస్తున్నారు మరియు అనుసరిస్తున్నారు కూడా, ఒకొరికొకరు వర్ణన కూడా చేసుకుంటున్నారు. అందరిలో చూసాము అంటున్నారు. మహారథులు కూడా చేస్తున్నారు. మేము అయితే వెనుక వచ్చాము అంటున్నారు. ఇప్పుడు మహారథీలు మారిపోతే మేము కూడా మారిపోతాము అంటున్నారు. కానీ మహారథీల తపస్సు, మహారథీల చాలాకాలం యొక్క పురుషార్థానికి వారికి ఎగస్ట్రా మార్కులు ఇచ్చి పాస్ విత్ ఆనర్ చేస్తాను కానీ మీరు మహారథులు మారితే మేము మారిపోతాము అని అదే నిరీక్షణలో ఉండిపోతారు, మోసపోతారు. అందువలన మనస్సుని అంతర్ముఖిగా చేసుకోండి. అర్థమైందా? ఆది చూసాము, ఇది చూసాము.... అని ఇలాంటి విషయాలు బాబా చాలా వింటున్నారు. మాకు కూడా కళ్ళు ఉన్నాయి కదా, మాకు కూడా చెవులు ఉన్నాయి కదా, మేము కూడా చాలా వింటున్నాము అని అంటున్నారు. కానీ ఈ విషయంలో మహారథులతో పోటీ చేయకండి. మంచిలో పోటీ పడండి. చెడుతో పోటీ చేయకండి, లేకపోతే మోసపోతారు. బాబాకి దయ వస్తుంది - మహారథీల యొక్క పునాది నిశ్చయం తెగిపోనిదిగా, అచంచలంగా ఉంది కనుక వారికి మరిన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి. మనస్సు యొక్క నేత్రాన్ని ఈ విషయాల గురించి తెరిచి ఉంచకండి, మూసేయండి. వినడానికి బదులు మనస్సుని అంతర్ముఖిగా చేసుకోండి. అర్థమైందా! 

ఈరోజు వేడి వేడి హల్వా తిన్నారు. కానీ నిజ సంస్కారంగా తయారుచేసుకోండి. శ్రమ చేస్తున్నారు. ఇది కూడా బాబాకి మంచిగా అనిపించటం లేదు. బాప్ దాదా పిల్లల యొక్క ఒక అద్భుత చిత్రం చూసారు. ఆ చిత్రం చూస్తారా! వినాలనుకుంటున్నారా, లేదా చాలా హల్వా తిన్నారా! అద్భుతమైన చిత్రం. బాప్ దాదాకి కూడా అద్భుతం అనిపిస్తుంది. ఆ చిత్రం ఏమిటి? పిల్లలు చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి, నోటితో మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము, సీతారాములుగా కాదు అని చెప్తున్నారు కానీ చేసేది ఏమిటి? చెప్పటం అయితే లక్ష్మీనారాయణులు అవుతాము అని చెప్తున్నారు. చెప్పేవారి నోటిలో గులాబ్ జామ్. కానీ చేసేది ఏమిటి? పక్కాగా లక్ష్మీ నారాయణులు అవుతారా అంటే 100 శాతం అవుతాము అని చెప్తారు. కానీ చిత్రం ఏమి చూపిస్తున్నారు? త్రేతాయుగీ రాముని సమానంగా యుద్ధం చేస్తున్నారు, చేతిలో సదా బాణాలు ఉంటున్నాయి. అనటం లక్ష్మీ, నారాయణులు అవుతాము అంటున్నారు కానీ త్రేతాయుగీ రాముని సమానంగా యుద్ధం చేస్తున్నారు. సగం సమయం యుద్ధంలో, సగం సమయం యోగంలో ఉంటున్నారు. అందరూ కాదు కానీ చాలామంది అలా ఉంటున్నారు. బాప్ దాదాకి ఈ చిత్రం చూసి అద్భుతంగా అనిపిస్తుంది. ఏదైతే చెప్తున్నారో, ఏవైతే మంచి, మంచి విషయాలు ఆలోచిస్తున్నారో అవే చేయాలి. దానికి సహజ విధి వినిపించాను కదా - అసలైన సంస్కారాలను ప్రత్యక్షం చేయండి. సంస్కారం ద్వారా స్వతహాగానే కర్మ జరుగుతుంది. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ ఉంటుంది, శ్రమ నుండి రక్షించబడతారు. ఎలా అయితే అర్ధ కల్పం విశ్వ మహారాజుగా అయితే కొన్ని రకాలైన శ్రమ నుండి విడిపించబడతారో అదేవిధంగా ఈ సమయంలో నిజ సంస్కారాలను, సంస్కారంగా చేసుకోవటం ద్వారా స్వతహాగా శ్రమ నుండి విడిపించబడతారు. ఇక సమయం అనుసరించి బాణాలు ఉపయోగించి, యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు. నిరంతరయోగి, కర్మయోగి, రాజయోగిగా స్వతహాగానే అయిపోతారు. యోగం జోడించవలసిన అవసరం ఉండదు. ప్రతి సెకను, ప్రతి సమయం యోగి జీవితం తయారైపోతుంది. ఇలాగే అవ్వాలి అనుకుంటున్నారు కదా ? 

జ్ఞానం, యోగం, ధారణ మరియు సేవ ఈ 4 సబ్జక్ట్స్ యొక్క సారం రెండు మాటలలో ఉంది. 1. బాబాయే నా ప్రపంచం. 2. ప్రతి గుణం, ప్రతి శక్తి నా యొక్క నిజసంస్కారం. కనుక ఈ రెండు మాటలు స్మృతిలో ఉంచుకోవాలి - ప్రపంచం మరియు సంస్కారం (సంసార్ ఔర్ సంస్కార్). కష్టమేమైనా ఉందా? కొద్దికొద్దిగా కష్టం అనిపిస్తుందా? ఎప్పుడైనా ఏదైనా విషయం వస్తే కష్టం అనిపిస్తుందా? కానీ విషయం మీ ముందు ఏమిటి? విషయం పెద్దదా లేక బాబా పెద్దవారా? ఎవరు పెద్ద? కానీ ఆ సమయంలో విషయం పెద్దదిగా అనిపిస్తుంది. బాబా దగ్గర ఆ సమయంలో పిల్లల యొక్క ఫోటోలు చాలా ఉన్నాయి. మ్యూజియం ఉంది. ఎప్పుడైనా వస్తే చూడవచ్చు. మీ ఫోటో చూసుకోండి కానీ ఇప్పుడు సమాప్తి సమారోహం జరుపుకోండి. ఎప్పుడైతే మీరు సమాప్తి సమారోహం జరుపుకుంటారో అప్పుడు విశ్వ పరివర్తనా సమారోహం 
మీ ఎదురుగా వస్తుంది. 

మరోవిషయం చెప్పనా, వినడానికి తయారుగా ఉన్నారా? పిల్లలే యజమానులు కదా! కనుక యజమానుల నుండి ఆజ్ఞ తీసుకుని చెప్పవలసి వస్తుంది. బేహద్ హాల్ కదా! రుద్రమాల చూపిస్తారు కదా, అలాగే ఇక్కడికి వచ్చి చూస్తే రుద్రమాలలా ఉంది. కేవలం మీ ముఖాలు ఒకటే కనిపిస్తున్నాయి. కనుక ఈ బేహద్ హాల్ లో బాప్ దాదా కూడా విశాల హృదయంతో బేహద్ విషయాలు చెప్తున్నారు. నిన్న ఏమి వారం? (బుధవారం) బుధవారం యొక్క విషయం చెప్తున్నాను. ఈ రోజు రాత్రి అందరు ఆట చూసి కొద్దిగా అలసిపోయారు కదా! కొద్దిగా అలజడి అయితే అయ్యారు కదా? (రాత్రి తుఫాన్తో పాటు వర్షం కూడా వచ్చింది) అంతిమ సమయంలో ఇంకా చాలా జరగనున్నాయి. కొద్దిగా రిహార్సల్ చూపించాలి కదా! బ్యాగ్, బ్యాగేజ్ సర్దుకుని పరుగు పెట్టడం ఇది కూడా ఎక్సర్సైజ్ (వ్యాయామం) అయ్యింది కదా! మామూలుగా అయితే పెద్ద పెద్ద మాతలు పరుగుపెట్టలేరు కానీ రాత్రి పెట్టె బెడ్డింగ్ పట్టుకుని పరుగుపెట్టారు కదా! అందువలన ఇది కూడా ఆట. వ్యాయమం అయ్యింది కదా! ఇవి చిన్న చిన్నవి మాత్రమే అంతిమంలో జరిగే వాటిముందు ఇవేమీ గొప్పవి కాదు. ఇది కూడా అభ్యాసం ఉండాలి. బాప్ దాదా చెప్పారు కదా, ఎవరెడీగా ఉండండి అని.దీనిలో కూడా ఎవరెడీగా ఉండాలి, వర్షం వచ్చింది సెకనులో వెళ్ళిపోయింది. ఎవరైనా అలజడి అయ్యారా? సెకనులో సెట్ అయిపోయారు. బాప్ దాదా కూడా చెప్పారు - పక్కాగా తయారయ్యేంత వరకు తక్కువ సంఖ్య రండి అని. కానీ ఎంత తక్కువ రమ్మంటే అంత పెరిగిపోతున్నారు. రావద్దు అని ఎర్ర జెండా కూడా చూపిస్తున్నారు అయినా కానీ వస్తున్నారు మరి ఆట చూడండి. బాప్ దాదా పిల్లల యొక్క స్నేహం చూసి సంతోషిస్తున్నారు - రండి పిల్లలూ! రండి!! అనే సదా పిల్లలకు చెప్తున్నారు. రావద్దు అని ఎలా అంటారు ! అంటారా? ఎంతమంది వచ్చారో అంతమంది సంతోషంతో వచ్చారు. మరియు సంతోషం తీసుకుని వెళ్ళాలి. టోలీతో పాటు వెనువెంట మొదట సంతోషం పంచిపెట్టాలి. దానితో పాటు టోలీ కూడా పంచిపెట్టాలి. మంచిది. 

నిన్నటి విషయం చెప్తున్నాను - నిన్న వతనంలో అడ్వాన్స్ పార్టీ ప్రత్యక్షం అయ్యింది. బాప్ దాదాతో ఆత్మికసంభాషణ చేస్తున్నారు మరియు బాబాని అడుగుతున్నారు - మమ్మల్ని నిమిత్తంగా ఏ సేవార్థం పంపించారో ఆ సేవ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అని. బాప్ దాదా ఏమి జవాబు ఇచ్చి ఉంటారు? వారు మాటిమాటికి ఇదే చెప్తున్నారు - అడ్వాన్స్ పార్టీలో మాకు ఏదైతే జన్మ లభించిందో అది విశేషకార్యం కోసం ఇచ్చారు, ఎక్కువమంది మంచి, మంచి యోగీ ఆత్మలు, జ్ఞానీ ఆత్మలు, మహావీర్ ఆత్మలు కూడా చాలామంది అడ్వాన్స్ పార్టీ లోకి వెళ్ళారు మరియు వారి వెంట వెళ్ళినవారు కూడా చాలామంది స్నేహి, గుప్త యోగీ ఆత్మలు ఉన్నారు, కొంతమందిని మీ లెక్క ప్రకారం మహారథీ అని అనరు, ఎక్కువమంది సాధారణమైనవారే అని అంటారు. కానీ అటువంటి వారిలో కూడా స్నేహం మరియు యోగంలో మంచిగా శక్తిశాలిగా ఉన్నవారు ఉన్నారు, విశేషంగా యోగం అనే సబ్జక్టులో ముందు ఉండే ఇటువంటి ఆత్మలు యోగబలం ద్వారా జన్మనిచ్చేటందుకు నిమిత్తులై కొత్త సృష్టిని స్థాపిస్తారు. అటువంటి వారు మా సేవ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని అడుగుతున్నారు? ఇలా వెళ్ళిపోయిన వారిలో కూడా కొన్ని ఆత్మలకి వేరే పాత్ర కూడా ఉంది. అందరి పాత్ర ఒకే విధంగా ఉండదు. కానీ ఎక్కువమందికి కొత్త సృష్టి యొక్క స్థాపనాపాత్ర ఉంది. ఇలా ఆత్మిక సంభాషణ జరుగుతుంది. బాప్ దాదా నవ్వుకుంటూ వారిని వేరే వేరే విషయాలలో బిజీ చేసేసారు. ఎందుకంటే ఎప్పుడు అనే దానికి జవాబు బాబా ఒక్కరే చెప్పేది కాదు, మీరందరు కూడా చెప్పాలి. మీరు ఎప్పుడైతే ఎవరెడీ అంటారో అప్పుడు వారి సేవ ప్రారంభం అవుతుంది. అందువలనే వినాశనం యొక్క సమయం ఎప్పుడూ నిర్ణయం అవ్వదు, అకస్మాత్తుగా జరుగుతుంది. బాప్ దాదా మొదటే సైగ చేస్తున్నారు, తర్వాత ఇక మరలా బాబాని నిందిచవద్దు. సైగ అయినా చేయలేదు అని. అకస్మాత్తుగా జరుగుతుంది, ఎవరెడీగా ఉండాలి. దీని కొరకే ఒక నిమిత్త మహారథిని ఉదాహరణగా చేసాను. (చంద్రమణి దాదీ). డ్రామానుసారం జరిగింది కానీ ఏదోక విశాల సేవకి నిమిత్తం అవుతారు. అందువలన ఏమి చేస్తారు? బాప్ దాదాని కలిసినప్పుడు అందరు మనస్సుతో చెప్పాలి, కాగితంపై వ్రాసి ఇచ్చే ప్రతిజ్ఞ లేదా నోటితో చేసే ప్రతిజ్ఞ కాదు, మనస్సుతో ప్రతిజ్ఞ చేసి చూపించాలి. "మేమందరం అన్ని పాత సంస్కారాలను తొలగించుకుని మా యొక్క నిజ సంస్కారాలను ధారణ చేసే ఎవరెడీ ఆత్మలం” అని. మంచిదేనా? చేస్తారా? చిన్న, చిన్న విషయాలు సమాప్తి చేయండి. 60 సం||లు కలిగిన వారు చిన్న పిల్లల వలె బంతితో ఆడుకుంటే బావుండదు కదా. అలాగే మీరు కూడా బంతితో ఏమిటి, మట్టితో కూడా ఆడుకుంటున్నారు. దేహాభిమానం అనే మట్టితో ఆడుకుంటున్నారు. ఇప్పుడు జ్ఞాన రత్నాలతో ఆడుకోండి, గుణాలతో ఆడుకోండి, శక్తులతో ఆడుకోండి, మట్టితో కాదు. ఏ రకంగా అయినా దేహాభిమానంలోకి వస్తే మట్టితో ఆడుకుంటున్నట్లే. వతనం యొక్క సమాచారం విన్నారా! 

ఈరోజు విశేషంగా యజ్ఞమాత, సరస్వతి మాత పిల్లలందరికీ ప్రియస్మృతులు ఇచ్చారు. అందరూ ఇచ్చారు కానీ విశేషంగా యజ్ఞమాత మీ అందరికీ మనస్సుతో చాలా, చాలా ప్రియస్మృతులు ఇచ్చారు మరియు ఇదే మహామంత్రం స్మృతి ఇప్పిస్తున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి తయారవ్వండి అని. హద్దులను వదిలేయండి, ఎగిరిపోండి అని. యజ్ఞమాతతో ప్రేమ ఉంది కదా! మంచిది! 

ఈరోజు చాలా విషయాలు వినిపించాను, ఇప్పుడు ఒక సెకనులో ఒక్కసారిగా మనస్సు, బుద్ధిని స్పష్టంగా చేసుకుని ఒకే బాబాతో సర్వ సంబంధాల యొక్క , బాబాయే ప్రపంచం - వ్యక్తులైనా, సంబంధం అయినా, ప్రాప్తులు అయినా .... అన్నీ ఒక బాబాయే. ఇలా బాబా స్మృతిలో, ఈ రూపంలో, ఈ రసంలో, ఈ అనుభవంలో లీనం అవ్వండి. (ఇలా బాప్ దాదా 3 నిమషాలు డ్రిల్ చేయించారు) మంచిది! 

నలువైపుల ఉన్న బాబా యొక్క ప్రేమలో లవలీనం అయ్యే ఆత్మలకి, బాబా యొక్క సేవాధారి పిల్లలకి, సహజ పురుషార్ధిగా అయ్యే శ్రేష్ట ఆత్మలకి, సదా బాబా సమానంగా అయ్యే లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా తయారుచేసుకునేవారికి, బాబా యొక్క సమీప ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు నమస్తే. 

Comments