03-03-2007 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
పరమాత్ముని సాంగత్యంలో జ్ఞానం అనే పరిమళ పొడిని, గుణాలు మరియు శక్తుల యొక్క రంగుని రంగరించుకోవటమే సత్యమైన హోలీ జరుపుకోవటం.
ఈరోజు బాప్ దాదా తన అదృష్టవంత మరియు పవిత్ర పిల్లలతో హోలీ జరుపుకునేటందుకు వచ్చారు. ప్రజలు ఏ ఉత్సవాన్ని అయినా కేవలం జరుపుకుంటారు. అంతే కానీ పిల్లలైన మీరు కేవలం జరుపుకోవటమే కాదు, జరుపుకోవటం అంటే తయారవ్వటం. మీరు హోలీ అనగా పవిత్రాత్మలుగా అయిపోయారు. హోలీ ఆత్మలు అనగా మహాన్ పవిత్రాత్మలు. ప్రజలు శరీరాన్ని స్థూల రంగుతో రంగరించుకుంటారు కానీ ఆత్మలైన మీరు ఆత్మని ఏ రంగుతో రంగరించుకున్నారు? అన్నింటికంటే మంచి రంగు ఏది? అవినాశి రంగు ఏది? పరమాత్ముని సాంగత్యం యొక్క రంగుని ఆత్మకి అంటించుకున్నారు. దీని ద్వారా ఆత్మ పవిత్రత యొక్క రంగులో రంగరించబడింది అని మీకు తెలుసు. పరమాత్ముని ఈ సాంగత్యం ఎంత గొప్పది మరియు ఎంత సహజమైనది. పరమాత్ముని సాంగత్యం యొక్క గొప్పతనం ఇప్పుడు అంతిమంలో కూడా సత్సంగం యొక్క గొప్పతనంగా ఉంది. సత్సాంగత్యం అంటేనే పరమాత్ముని సాంగత్యం, ఇది అన్నింటికంటే సహజమైనది. ఇలా ఉత్నతోన్నత సాంగత్యంలో ఉండటం కష్టమా ఏమిటి? ఈ సాంగత్యంలో ఉండటం వలన పరమాత్మ ఎలా అయితే ఉన్నతోన్నతమైనవారో అదేవిధంగా పిల్లలైన మీరు కూడా ఉన్నతోన్నత పవిత్ర మహానాత్మలు, పూజ్యాత్మలుగా అయ్యారు. ఈ అవినాశి సాంగత్యం యొక్క రంగు ప్రియమనిపిస్తుంది కదా! పరమాత్ముని సాంగత్యం అనే విషయాన్ని వదిలేయండి కానీ పరమాత్ముని స్మృతి చేసేటందుకే ప్రజలు ఎంతగా శ్రమిస్తున్నారు! కానీ ఆత్మలైన మీరు బాబాని తెలుసుకున్నారు, నా బాబా అని మనస్సుతో అన్నారు, నా పిల్లలూ అని బాబా అన్నారు అంటే రంగు అంటినట్లే. బాబా ఏ రంగుని అంటించారు? జ్ఞానమనే పరిమళ పొడిని, గుణాలు, శక్తులు అనే రంగుని అంటించారు. ఈ రంగు ద్వారా మీరు దేవత అయిపోయారు కానీ కలియుగం అంతిమం వరకు కూడా మీ పవిత్ర చిత్రాలు దేవాత్మల రూపంలో పూజింపబడుతున్నాయి. పవిత్రాత్మలుగా చాలా మంది అవుతారు, మహానాత్మలుగా కూడా చాలా మంది అవుతారు, ధర్మాత్మలుగా కూడా చాలామంది అవుతారు కానీ మీ పవిత్రత దేవాత్మల రూపంలో ఆత్మ కూడా పవిత్రం మరియు ఆత్మతో పాటు శరీరం కూడా పవిత్రం అవుతుంది. శ్రేష్ట పవిత్రత తయారైంది ఎలా? కేవలం సాంగత్యం యొక్క రంగు ద్వారా. పరమాత్మ ఎక్కడ ఉంటారు? అని పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏమి చెప్తారు? పరంధామంలో ఉండటం అనేది సరే కానీ ఇప్పుడు ఈ సంగమయుగంలో పరమాత్మ మీతో పాటు ఎక్కడ ఉంటారు? మీరు ఏమి సమాధానం చెప్తారు? పవిత్రాత్మలైన మా హృదయ సింహాసనం అంటే పరమాత్మకి ఇష్టం అని ఉప్పొంగుతూ చెప్తారు కదా! అవును కదా? మీ హృదయంలో బాబా ఉంటారు, మరియు బాబా హృదయంలో మీరు ఉంటారు. ఉంటున్నారా? ఉంటున్నాం అనేవారు చేతులెత్తండి. ఉంటున్నారా? మంచిది, చాలా మంచిది. నా హృదయం తప్ప పరమాత్మకి ఇంకేదీ సచ్చదు అని పొంగిపోతూ చెప్తారు కదా! ఎందుకంటే కంబైండ్ గా ఉంటున్నారు కదా! ఉంటున్నారు కదా కంబైండ్ గా! కొంతమంది పిల్లలు కంబైండ్ గా ఉన్నాం అని చెప్తూ కూడా బాబా సహచర్యం యొక్క లాభాన్ని పొందటం లేదు. బాబాని మీ సహచరిగా చేసేసుకున్నారు కానీ సహచర్యాన్ని ప్రతి సమయం అనుభవం చేసుకోవటంలో తేడా వచ్చేస్తుంది. ఈ విషయంలో నెంబరువారీగా లాభాన్ని తీసుకోవటం బాప్ దాదా చూశారు. కారణం ఏమిటో మీ అందరికీ బాగా తెలుసు కదా?
బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - మనస్సులో రావణుని యొక్క పాత ఆస్తి, పాత సంస్కారాల రూపంలో ఉండిపోతే తేడా వస్తుంది. రావణుని వస్తువులు పరాయివి అయిపోయినవి కదా! పరాయి వస్తువులను ఎప్పుడూ తమ వద్ద ఉంచుకోరు. తొలగించేస్తారు. కానీ పిల్లలు బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఏమంటున్నారంటే బాబా నేను ఏమి చేయను? నా సంస్కారమే అంత అంటున్నారు. నా సంస్కారం అని దేనినైతే అంటున్నారో అది మీ సంస్కారమా? "ఇది నా పాత సంస్కారం లేదా నా స్వభావము అనటం సరైనదేనా? సరైనదేనా? సరైనదే అని భావించేవారు చేతులెత్తండి. ఎవరూ ఎత్తటం లేదు. మరి అయితే అలా ఎందుకు అంటున్నారు? పొరపాటుగా అనేస్తున్నారా? మరజీవగా అయిపోయారు కదా, ఇప్పుడు మీ ఇంటి పేరు ఏమిటి? పాత జన్మ యొక్క ఇంటి పేరా మీది? లేక బి.కె. అనే ఇంటిపేరా? ఏమని వ్రాస్తారు? బి.కె.అని వ్రాస్తారా లేక ఫలానా, ఫలానా ..... అని వ్రాస్తారా? మరజీవగా అయిపోయినప్పుడు పాత సంస్కారాలు మీ సంస్కారాలు ఎలా అవుతాయి? ఈ పాత సంస్కారాలు పరాయివి. మీవి కాదు కదా! హోలీలో కాలుస్తారు కదా! హోలీలో కాలుస్తారు మరియు రంగు అంటిస్తారు కూడా, మరి మీరు వేటిని కాలుస్తారు? నా సంస్కారం అనే మాటని బ్రాహ్మణ జీవితం యొక్క నిఘంటువు (డిక్షనరీ) నుండి తీసేయాలి. జీవితం కూడా ఒక నిఘంటువు కదా! పాత సంస్కారాలను నా సంస్కారం అనటం అనేది సంకల్పం అనే విషయాన్ని వదిలేయండి, కనీసం కలలో కూడా రాకూడదు, కలలో కూడా ఆవిధంగా ఆలోచించకూడదు. బాబా సంస్కారాలే మీ సంస్కారాలు. బాబా సమానంగా అవ్వటమే మా లక్ష్యం అని అందరూ చెప్తారు కదా! మరి అయితే అందరు ఈ ధృడ సంకల్పంతో స్వయంతో ప్రతిజ్ఞ చేశారా? పొరపాటున కూడా నాది అనకూడదు. నాది, నాది అని అంటూంటారు కదా! అప్పుడు పాత సంస్కారాలు లాభం పొందుతున్నాయి. నాది అంటే అవి మీ వద్ద కూర్చుండిపోతున్నాయి, బయటికి తొలగటం లేదు.
బాప్ దాదా పిల్లలందరినీ ఏ రూపంలో చూడాలనుకుంటున్నారు? మీకు తెలుసు మరియు అంగీకరిస్తున్నారు కూడా. బాప్ దాదా ప్రతీ బిడ్డని భ్రుకుటి సింహాసనాధికారిగా, స్వరాజ్యాధికారి రాజా పిల్లలుగా చూడాలను కుంటున్నారు. ఆధీన పిల్లలు కాదు, రాజా పిల్లలు , కంట్రోలింగ్ పవర్ మరియు రూలింగ్ పవర్ కలిగి ఉన్న వారిగా, మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో చూస్తున్నారు. మీరు మీ యొక్క ఏ రూపాన్ని చూస్తున్నారు అదే రూపంలో కదా! రాజ్యాధికారులే కదా, ఆధీనులు కాదు కదా! ఆధీన ఆత్మలను మీరందరు అధికారిగా చేసేవారు కదా! ఆత్మలపై దయాహృదయులై వారిని ఆధీనుల నుండి అధికారిగా చేసేవారు కదా! మీరందరు హోలీ జరుపుకునేటందుకు వచ్చా రు కదా!
అందరు స్నేహమనే విమానం ద్వారా చేరుకున్నారు, బాప్ దాదాకి సంతోషంగా ఉంది. అందరి వద్ద విమానం ఉంది కదా! ఉందా విమానం? మనస్సు అనే విమానాన్ని బాప్ దాదా పిల్లలందరికీ జన్మతోనే బహుమతిని ఇచ్చారు. మరి అందరి దగ్గర మనస్సు అనే విమానం ఉందా? చేతులు ఎత్తుతున్నారు, మంచిది. విమానం బాగుందా? పెట్రోలు బాగా ఉందా? రెక్కలు బాగా ఉన్నాయా? బాగానే స్టార్ట్ అవుతుంది కదా! పరిశీలించుకుంటున్నారా? మూడు లోకాల్లోకి సెకనులో వెళ్ళిపోగలరు అటువంటి విమానం. ధైర్యం మరియు ఉత్సాహ ఉల్లాసాలు అనే రెండు రెక్కలు బాగుంటే ఒక్క సెకనులో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసేటందుకు తాళంచెవి ఏది? “నా బాబా” అనే మాట. నా బాబా అనగానే మనస్సు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడకి వెళ్ళిపోతుంది. కానీ రెండు రెక్కలు బావుండాలి. ధైర్యాన్ని ఎప్పుడూ వదలకూడదు. ఎందుకు? బాప్ దాదా యొక్క ప్రతిజ్ఞ లేదా వరదానం ఏమిటి? ధైర్యంతో ఒక్క అడుగు మీది, వేయి అడుగుల సహాయం బాబాది. ఎటువంటి కఠిన సంస్కారం అయినా కానీ ధైర్యాన్ని ఎప్పుడూ వదలకండి, ఎందువలన? సర్వశక్తివంతుడైన బాబా మీ సహాయకారి మరియు కంబైండ్ గా ఉన్నారు, సదా హాజరై ఉన్నారు. అవ్వాల్సిందే, బాబా నా వాడు, నేను బాబా వాడిని ఇలా ధైర్యంగా సర్వశక్తివంతునితో కంబైండ్ గా ఉంటూ బాబాకి అధికారాన్ని ఇచ్చేసి ధైర్యాన్ని మర్చిపోకండి అప్పుడు ఏమవుతుంది? ఎలా చేయను అని ఏదైతే సంకల్పం ఉత్పన్నం అవుతుందో ఆ ఎలా అనే మాట ఇలా అనే విధంగా అయిపోతుంది. ఎలా చేయను? ఏం చేయను అనకండి. ఇలా జరగవలసే ఉంది అనుకోండి. అనుకుంటున్నాము, చేస్తూనే ఉన్నాము, అవ్వాలి, బాబా అయితే సహాయం చేస్తారు .... అంటున్నారు. జరగవలసిందే అనుకోవాలి, నిశ్చయబుద్ది పిల్లలకు సహాయం అందించేటందుకు బాబా బంధింపబడి ఉన్నారు. కానీ పిల్లలు రూపాన్ని కొంచెం మార్చేస్తున్నారు. బాబాకి హక్కునిచ్చేస్తున్నారు. కానీ రూపాన్ని మార్చేస్తున్నారు. బాబా నువ్వు అయితే సహాయం చేస్తావు కదా, నువ్వు బంధింపబడి ఉన్నావు కదా .... ఇలా కదా! కదా! అంటున్నారు. నిశ్చయబుద్ధి గల వారికి విజయం లభించటం నిశ్చితమైపోయింది, ఎందుకంటే బాప్ దాదా ప్రతి బిడ్డకు జన్మతోనే విజయీ తిలకాన్ని మస్తకంపై పెట్టారు. ధృడతను మీ తీవ్ర పురుషార్థానికి తాళంచెవిగా ఉపయోగించుకోండి. ప్లాన్స్ అయితే చాలా బాగా తయారు చేస్తున్నారు. పిల్లల ఆత్మిక సంభాషణ బాబా వినే సమయంలో పిల్లలు చాలా ధైర్యంతో కూడిన ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ప్లాన్స్ కూడా చాలా శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. కానీ ప్లాన్ ని ప్రత్యక్ష కర్మలోకి తీసుకువచ్చే సమయంలో స్వచ్ఛమైన బుద్ధితో చేయటం లేదు. కొంచెం చేయటం అయితే చేస్తున్నాం, అవ్వాలి కానీ ..... ఇలా స్వయంలో నిశ్చయ సంకల్పాలు కాకుండా వ్యర్థ సంకల్పాలను కలిపేస్తున్నారు.
ఇప్పుడు సమయానుసారంగా స్వచ్ఛమైన బుద్ధితో సంకల్పాన్ని సాకార రూపంలోకి తీసుకురండి. కొంచెం అయినా బలహీన సంకల్పాలను రాసిప్పకండి. ఇప్పుడు ఈ ఒక్కసారి చేయటం లేదు, అనేక సార్లు చేసినది ఇప్పుడు పునరావృత్తం చేస్తున్నాం అనే స్మృతి ఉంచుకోండి. కల్పకల్పం ఎన్నిసార్లు విజయీ అయ్యారో గుర్తు తెచ్చుకోండి. విజయం అనేది అనేక కల్పాలుగా మీ జన్మ సిద్ధఅధికారం. ఈ అధికారంతో నిశ్చయబుద్ధియై ధృడత అనే తాళంచెవిని ఉపయోగించండి. విజయం అనేది బ్రాహ్మణ ఆత్మలైన మీ దగ్గరకి తప్ప మరెక్కడికి వెళ్తుంది? బ్రాహ్మణులైన మీకు విజయం జన్మసిద్ధ అధికారం మరియు కంఠహారంగా ఉంది కదా నషా? ఉందా నషా? జరుగుతుందో, లేదో అనకండి, జరగవలసే ఉంది. ఇంత నిశ్చయబుద్దియే ప్రతి కార్యం చేయండి. విజయం నిశ్చితం. ఇటువంటి నిశ్చయబుద్ది మీరు. బాప్ దాదా అంటారా? లేదా? అనుకోకండి. ఒకప్పుడు ఆవిధంగా ఉండేవారు, ఇప్పుడు ఉంటున్నారు మరియు ఇక ముందు కూడా ఉంటారు. ఈవిధమైన పవిత్రాత్మలు కదా! బాప్ దాదా అయితే జ్ఞానమనే పరిమళపొడితో హోలీ ఆడారు, ఇప్పుడు ఏమి ఆడుకుందాం?
ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, ఇలా అయిపోతుంది ..... ఇలా ఎక్కువమంది ఉత్సాహ ఉల్లాసాలతో అనటం బాప్ దాదా చూశారు. బాప్ దాదా కూడా చాలా సంతోషిస్తున్నారు. కానీ ఈ ఉత్సాహ ఉల్లాసాలు సదా ప్రత్యక్షంగా ఉండాలి. అప్పుడప్పుడు మాయమైయిపోతున్నాయి, అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతున్నాయి. మాయం కాకూడదు, ప్రత్యక్షంగానే ఉండాలి ఎందుకంటే మీ కొరకు సంగమయుగం అంతా ఉత్సవమే. ప్రజలు ఎక్కువ సమయం ఒత్తిడిలో ఉంటారు కనుక అప్పుడప్పుడు ఉత్సవాలు జరుపుకుంటారు. ఉత్సాహంలో నాట్యం చేస్తే, పాడితే, తింటే మార్పు వస్తుంది అనుకుంటారు. కానీ మీరైతే ప్రతి సెకను నాట్యం చేస్తుంటారు, పాడుతుంటారు. మీరు సదా సంతోషంతో మనస్సులో నాట్యం చేస్తూ ఉంటారు కదా? లేదా? సంతోషంలో నాట్యం చేయటం వచ్చా? వచ్చినవారు చేతులెత్తండి! నాట్యం చేయటం వచ్చు, మంచిది. వస్తే శుభాకాంక్షలు. మరి అయితే సదా నాట్యం చేస్తున్నారా లేక అప్పుడప్పుడు చేస్తున్నారా?
బాప్ దాదా ఈ సంవత్సరానికి హోమ్ వర్క్ ఇచ్చారు. రెండు మాటలు ఎప్పుడూ ఆలోచించకూడదు. 1. అప్పుడప్పుడు (సమ్ టైమ్) 2. ఏదొకటి (సమ్ థింగ్). ఈ వర్క్ చేశారా? లేక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అంటారా? ఈ రెండు సమాప్తి అయిపోవాలి. 2. సంతోషంలో నాట్యం చేయటంలో అలసట ఉండదు. పడుకుని ఉన్నా, పని చేస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా సంతోషం యొక్క నాట్యం చేయవచ్చు. బాబా ద్వారా లభించిన ప్రాప్తుల యొక్క పాటలను కూడా పాడుకోవచ్చు. పాడటం కూడా వచ్చు కదా, ఈ పాట అయితే అందరికీ వస్తుంది. నోటితో పాడే పాట అయితే కొందరికి వస్తుంది, కొందరికి రాదు కానీ బాబా ద్వారా లభించిన ప్రాప్తుల మరియు బాబా గుణాల పాట అయితే అందరికీ వచ్చు కదా! కనుక ప్రతీ రోజూ ఉత్సవమే. ప్రతి ఘడియ ఉత్సవమే. సదా నాట్యం చేయటం మరియు పాడటం అంతే, ఇంకే పని ఇవ్వలేదు, ఈ రెండు పనులే. మజాగా ఉండండి. భారాన్ని ఎందుకు పెట్టుకుంటారు? మజా చేయండి, నాట్యం చేయండి మరియు పాడండి అంతే. మంచిది. హోలీ జరుపుకున్నారు కదా! ఇప్పుడు రంగుల హోలీ కూడా జరుపుకుంటారా? మంచిది, భక్తులు మిమ్మల్నే కాపీ చేశారు కదా! మీరు భగవంతునితో హోలీ ఆడుకుంటున్నారు. భక్తులు కూడా ఎవరొక దేవతతో ఆడుకుంటూ ఉంటారు. మంచిది, ఈ రోజు చాలామంది పిల్లల ఇ మెయిల్స్ వచ్చాయి, ఉత్తరాలు కూడా వచ్చాయి, ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి, ఉన్న సాధనాలతో శుభాకాంక్షలు పంపారు. మీరు సంకల్పం చేయగానే బాబాకి చేరిపోతుంది. కానీ నలువైపుల ఉన్న పిల్లలు విశేషంగా స్మృతి చేస్తున్నారు మరియు చేశారు. బాప్ దాదా కూడా ప్రతి బిడ్డకి పదమాపదమ ఆశీర్వాదాలు మరియు పదమాపదమ మనస్పూర్వక ప్రియస్మృతులను ప్రతి ఒక్కరి పేరు సహితంగా, విశేషత సహితంగా బదులు ఇస్తున్నారు. సందేశీ వెళ్ళినప్పుడు అందరు తమ తమ వైపుల నుండి స్మృతి ఇస్తారు. స్మృతి ఇవ్వని వారు కూడా బాప్ దాదా దగ్గరకి చేరుకున్నారు. పరమాత్మ ప్రేమ యొక్క విశేషతయే ఇది. ఈ ఒక్క రోజు ఎంత ప్రియమైనది! గ్రామంలో ఉన్నా, పెద్ద పట్టణాలలో ఉన్నా, గ్రామంలో ఉండేవారికి స్మృతిని పంపే సాధనాలు లేనప్పటికీ వారి స్మృతి బాబా దగ్గరకి చేరుకుంటుంది, ఎందుకంటే బాబా దగ్గర అయితే ఆత్మిక సాధనాలు చాలా ఉన్నాయి కదా!
మంచిది, అందరూ కూడా దాదీకి చాలా చాలా స్మృతిని ఇచ్చారు. దాదీ త్వరత్వరగా మధువనానికి చేరుకోవాలి అని అందరి సంకల్పం ఒకటే. బాప్ దాదా కూడా అదే కోరుకుంటున్నారు. దాదీ మాట్లాడటం లేదు కానీ సంకల్పం ద్వారా మధువనం, బ్రాహ్మణులు, బేహద్ సేవా భాధ్యత అన్నింటి స్మృతి ఉంటుంది. ప్రేమతో మీరందరు చాలా స్మృతి చేస్తున్నారు. బాప్ దాదా చూశారు, బాప్ దాదాతో అయితే అందరికీ ప్రేమ ఉంది కానీ దాదీతో కూడా తక్కువగా లేదు. ప్రేమ పూర్వక స్మృతి దాదీని చేరుకుంటుంది. కానీ ఇప్పుడు శక్తిశాలి స్మృతి చేయాలి. శక్తిశాలి మందు ఇస్తారు కదా, మందుల్లో కూడా వాటి పవర్ లో తేడాలు ఉంటాయి కదా! అదేవిధంగా మీరందరు స్నేహమనే మందుని అయితే పంపారు. కానీ ఇప్పుడు అందరు కలిసి శక్తిశాలిగా ఆరోగ్యభవ! అనే ధృడ సంకల్ప కిరణాలను ఎలా పంపాలి అంటే ఆ కిరణాలు తమ పనిని మొదలు పెట్టాలి. కొంచెం సమయం పడుతుంది కానీ బ్రాహ్మణులైన మీ అందరి మనస్పూర్వక సహయోగ కిరణాలు తమ పని చేసి చూపిస్తాయి. అక్కడి గది యొక్క వాయుమండలం కూడా మనస్సు యొక్క శక్తిశాలి తరంగాలతో నిండాలి ఏమైంది, ఏమి జరుగుతూ ఉంది అని ఆలోచించకండి. అవుతూ ఉంది, అవ్వవలసిందే అనుకోండి. ఇలా ఉత్సాహ ఉల్లాసాలతో సర్వ బ్రాహ్మణాత్మలు, ఏ సేవాధారి అయినా కానీ వాయుమండలం శక్తిశాలిగా ఉండాలి. మీ అందరి మనస్పూర్వక ప్రేమ యొక్క తరంగాలు బాప్ దాదా దగ్గరకి కూడా చేరుకుంటున్నాయి. సేవకి నిమిత్తమైన సేవాధారులందరు నిశ్చయబుద్దియై శక్తిశాలి కిరణాల ద్వారా ఆత్మిక శక్తిని సదా ఇస్తూ ఉండాలి, సదా అవే తరంగాలు ఉండాలి. సేవని మనస్సుతో చేస్తున్నారు, భావన చాలా బావుంది కానీ ఇప్పుడు శక్తిశాలి సంకల్పాల ఆశీర్వాదాలను ఇవ్వండి. ఏ వ్యర్థ సంకల్పాన్ని మనస్సులోకి రానివ్వకూడదు. ఏమి జరుగుతుందో అనుకోకూడదు, మంచిగా జరగవలసిందే అనుకోవాలి. మంచిది.
నలువైపుల ఉన్న అదృష్టవంత మరియు పవిత్ర పిల్లలకు, సదా ధృడ సంకల్పం అనే తాళంచెవిని ఉపయోగించే ధైర్యవంతులైన పిల్లలకు, తమ యొక్క మనస్సుని భిన్న భిన్న రకాల సేవలలో బిజీగా చేసే పిల్లలకు, అడుగులో పదమాలు (కోటానుకోట్లు) జమ చేసుకునే పిల్లలకు, సదా ప్రతి రోజు ఉత్సాహంలో ఉండేవారికి, ప్రతి రోజుని ఉత్సవంగా జరుపుకునేవారికి, సదా అదృష్టవంతు లైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment