03-02-2006 అవ్యక్త మురళి

                      03-02-2006         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పరమాత్మ ప్రేమలో వ్యర్ధం యొక్క నామరూపాలు లేని సంపూర్ణ పవిత్రతా స్థితిని తయారుచేసుకోండి.

ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న తన యొక్క ప్రభుప్రియ పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలో ఎన్నుకోబడిన కోట్లలో కొద్దిమంది పిల్లలే ఈ పరమాత్మ ప్రేమకు అధికారులు అవుతారు. పరమాత్మ ప్రేమయే పిల్లలైన మిమ్మల్కి ఇక్కడికి తీసుకువచ్చింది. ఈ పరమాత్మ ప్రేమను మొత్తం కల్పంలో ఈ సమయంలోనే అనుభవం చేసుకుంటారు. మిగతా సమయమంతా ఆత్మల ప్రేమను, మహానాత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేసుకున్నారు. కానీ ఇప్పుడు పరమాత్మ ప్రేమకి అధికారులు అయ్యారు. పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్తారు? పరమాత్మ తండ్రి మా తోడుగా ఉన్నారు, మేము ఆయన తోడుగా ఉన్నాము మేము లేకుండా పరమాత్మ ఉండలేరు, పరమాత్మ లేకుండా మేము ఉండలేము అని అంటారు కదా! అంటే ఇంత ప్రేమను అనుభవం చేసుకుంటున్నారు. గర్వంగా చెప్తారు - ఆయన మా మనస్సులో ఉన్నారు, మేము ఆయన మనస్సులో ఉన్నాము అని. ఇటువంటి అనుభవిలే కదా! మేము అనుభవీ కాకపోతే ఎవరు అవుతారు అని అనిపిస్తుందా? ఇటువంటి ప్రేమకు అధికారులైన పిల్లలను చూసి బాబా కూడా హర్షిస్తున్నారు. 

పరమాత్మ ప్రేమకు గుర్తు - ఎవరితో ప్రేమ ఉంటుందో వారి కోసం దేనినైనా అర్పణ చేయడానికి సహజంగానే తయారవుతారు. అదేవిధంగా మీరందరు కూడా ప్రతి ఒక్కరు బాబా సమానంగా అవ్వాలి ప్రతి ఒక్కరి ముఖం ద్వారా తండ్రి ప్రత్యక్షం అవ్వాలి అని బాబా కోరుకున్నట్లుగా తయారయ్యారా? బాబా మనస్సుకి ఇష్టమైన స్థితి ఏమిటో తెలుసా? సంపూర్ణ పవిత్రత. ఇదే బాబా మనస్సుకి ఇష్టమైన స్థితి. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క పునాది కూడా సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత గురించి తెలుసా? సంకల్పం మరియు స్వప్నంలో కూడా స్వల్పంగా కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. ప్రస్తుత సమయం యొక్క సమీపత ప్రమాణంగా బాబా మాటి, మాటికి ధ్యాస ఇప్పిస్తున్నారు - సంపూర్ణ పవిత్రత యొక్క లెక్క ప్రకారం చూస్తే వ్యర్థసంకల్పాలు కూడా సంపూర్ణత కాదు. కనుక పరిశీలించుకోండి - వ్యర్థసంకల్పాలు నడుస్తున్నాయా? ఏ రకమైన వ్యర్థ సంకల్పం సంపూర్ణత నుండి దూరం చేయటం లేదు కదా? ఎంతెంత పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారో అంత సూక్ష్మరూపంగా వ్యర్థ సంకల్పాలు మరియు సమయం వ్యర్థంగా వెళ్ళటం లేదు కదా? పరమాత్మ ఇచ్చిన మీలోని విశేషతను మీదిగా భావిస్తే ఆ విశేషత యొక్క అభిమానం కూడా కిందకి తీసుకువచ్చేస్తుంది. విఘ్నరూపం అయిపోతుంది. అభిమానం సూక్ష్మరూపంలో వస్తుంది. అది మీకు తెలుసు కూడా! నాది, నా పేరు, గౌరవం ప్రతిష్ట ఇలా నాది అనేది అభిమాన రూపాన్ని ధరిస్తుంది. ఈ వ్యర్థసంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేస్తాయి. ఎందుకంటే బాప్ దాదా కోరుకుంటున్నారు - స్వమానంలో ఉండాలి కానీ అభిమానంలోకి, అవమానంలోకి రాకూడదు. అభిమానం, అవమానం ఈ రెండే వ్యర్థ సంకల్పాలకు కారణం. 

బాప్ దాదా ప్రతి ఒక్కరినీ డబల్ యజమాని స్థితి యొక్క నిశ్చయం మరియు నషాలో చూడాలనుకుంటున్నారు. డబల్ యజమాని స్థితి అంటే ఏమిటి? 1.బాబా ఖజనాలకు  యజమానులు. 2.స్వరాజ్యనికి యజమానులు. రెండింటి యజమానులు. అందరు పిల్లలు కూడా మరియు యజమానులు కూడా! కానీ బాప్ దాదా చూసారు అందరు పిల్లలుగా అవుతున్నారు ఎందుకంటే అందరు నా బాబా అంటున్నారు, నాబాబా అన్నారంటే పిల్లలే కదా! కానీ పిల్లలతో పాటు రెండు రకాలైన యజమానులుగా కావాలి. ఈ యజమాని స్థితిలో నెంబర్ వారీగా ఉంటున్నారు. నేను పిల్లవాని నుండి యజమానిని అని భావించాలి. ఖజానాలు వారసత్వ రూపంలో లభించాయి. అందువలన పిల్లవాని స్థితి యొక్క నిశ్చయం మరియు నషా ఉంటుంది కానీ యజమాని స్థితి యొక్క ప్రత్యక్షనిశ్చయం యొక్క నషాలో నెంబర్‌వారీ అవుతున్నారు. స్వరాజ్యాధికారి యజమానిగా అవ్వటంలో విశేషంగా విఘ్నం వేసేది - మనస్సు, మనస్సుకి యజమానిగా అవ్వాలి, ఎప్పుడు కూడా మనస్సుకి పరవశం కాకూడదు. స్వరాజ్యాధికారి అంటున్నారు కదా, స్వరాజ్యాధికారి అంటే రాజు. బ్రహ్మాబాబా ప్రతి రోజు స్వయాన్ని పరిశీలించుకుని మనస్సుకి యజమాని అయ్యి విశ్వ యజమానిగా అయ్యే అధికారాన్ని పొందారు. మీరు రాజు అయితే మనస్సు, బుద్ది మీ మంత్రులు. వ్యర్థసంకల్పాలు కూడా మనస్సులోనే ఉత్పన్నం అవుతాయి, అప్పుడు మనస్సు వ్యర్థసంకల్పాలకు వశం అయిపోతుంది. ఆ మనస్సుని మీ ఆజ్ఞానుసారం నడిపించకపోతే మనసు చంచలమైనది, కనుక పరవశం అయిపోతుంది, కనుక పరిశీలించుకోండి. మనస్సుని గుఱ్ఱం అని అంటూంటారు కదా! ఎందుకంటే అది చంచలమైనది. కానీ మీ దగ్గర శ్రీమతం అనే కళ్ళెం ఉంది. శ్రీమతమనే కళ్ళెం కొంచెమైనా బలహీనంగా ఉంటే మనస్సు చంచలం అయిపోతుంది. కళ్ళెం ఎందుకు బలహీనం అవుతుంది? అక్కడక్కడ మార్గం మధ్యలో దృశ్యాలు చూడటంలో నిమగ్నమైపోతున్నారు, కళ్ళెం బలహీనం అవుతుంది. అప్పుడు మనస్సుకి అవకాశం దొరుకుతుంది. కనుక పిల్లవాని నుండి యజమానిని అనే స్మృతిలో సదా ఉండండి. ఖజానాలకు యజమాని మరియు స్వరాజ్యానికి యజమాని. డబల్ యజమానినేనా? అని పరిశీలించుకోండి. యజమానిస్థితి తక్కువైతే బలహీన సంస్కారాలు ప్రత్యక్షం అయిపోతాయి. ఆ సంస్కారాలను ఏమంటారు? నా సంస్కారమే అంత అంటున్నారు. కానీ అవి నావా? అనడానికైతే నా సంస్కారం అని అంటున్నారు కదా! నా సంస్కారం అనటం సరైనదేనా? సరైనదేనా? మీవా? లేక రావణుని ఆస్తా? బలహీన సంస్కారాలు రావణుని ఆస్తి, వాటిని నావి అని ఎలా అంటున్నారు? నా సంస్కారాలు ఏమిటి? బాబా సంస్కారాలే నా సంస్కారాలు. అయితే బాబా సంస్కారాలు ఏమిటి? విశ్వకళ్యాణము, శుభభావన, శుభకామన. ఇవే బాబా సంస్కారాలు. కనుక ఏ బలహీన సంస్కారాన్ని అయినా నా సంస్కారం అనటం తప్పు. నా సంస్కారం అనుకున్నారు అంటే వాటిని మీ మనస్సులో కూర్చోపెట్టుకున్నట్లు. అశుద్ద విషయాలను మీ మనస్సులో కూర్చోపెట్టుకుంటున్నారు. మన వస్తువుతో మనకి ప్రేమ ఉంటుంది కదా! కనుక వాటిని నావి అని భావించారు. అంటే మీ మనస్సులో స్థానం ఇచ్చేసారు. అందువలన చాలా సార్లు పిల్లలు యుద్ధం చేయవలసి వస్తుంది ఎందుకంటే అశుభం మరియు శుభం రెండింటినీ మనస్సులో పెట్టేసుకున్నారు. అప్పుడు ఆ రెండు ఏం చేస్తాయి? యుద్ధం చేస్తాయి కదా! నా సంస్కారము అనేది సంకల్పంలోను మరియు వాచాలో కూడా వస్తుంది. కనుక పరిశీలించుకోండి. ఈ అశుద్ధ సంస్కారాలు నా సంస్కారాలు కావు. కనుక సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి. బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లవాడిని పదమాపదమ భాగ్యశాలిగా నడవడిక మరియు ముఖంలో చూడాలనుకుంటున్నారు. కొంత మంది పిల్లలు అంటున్నారు - భాగ్యశాలిగా అయ్యాము కానీ నడుస్తూ తిరుగుతూ ప్రత్యక్షంగా ఉండవలసిన భాగ్యం యొక్క స్మృతి గుప్తం అయిపోతుంది అని. కానీ బాప్ దాదా ప్రతి సమయం ప్రతి పిల్లవాని మస్తకంలో భాగ్యసితార మెరుస్తున్నట్లుగా చూడాలనుకుంటున్నారు. ఎవరు మిమ్మల్ని చూసినా కానీ ముఖం మరియు నడవడిక ద్వారా భాగ్యవంతులుగా కనిపించాలి. అప్పుడే పిల్లలైన మీ ద్వారా తండ్రి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఎందుకంటే వర్తమాన సమయంలో ఎక్కువమంది అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో విజ్ఞానం ప్రతి విషయం ప్రత్యక్ష రూపంలో చూపిస్తుంది, అనుభవం చేయిస్తుంది. వెచ్చదనం మరియు శీతలత రెండింటినీ అనుభవం చేయిస్తున్నారు. అదేవిధంగా శాంతి శక్తి ద్వారా కూడా అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు. 

ఎంతెంత స్వయం అనుభవిగా ఉంటారో అంతంత ఇతరులకు అనుభవం చేయించగలరు. బాప్ దాదా సైగ చేసారు - ఇప్పుడు కంబైండ్ సేవ చేయండి. అంటే కేవలం ధ్వని ద్వారా కాదు, ధ్వనితో పాటు అనుభవీ మూర్తి అయ్యి అనుభవం చేయించే సేవ చేయండి. శాంతి యొక్క అనుభవం, సంతోషం యొక్క అనుభవం, ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం ...... ఇలా ఏదోకటి అనుభవం చేయించండి. అనుభవం ఎలాంటిది అంటే ఒకసారి అయినా అనుభవం అయ్యింది అంటే దానిని వదలలేరు. విన్న విషయాన్ని మర్చిపోవచ్చు కానీ అనుభవం అయిన విషయాన్ని మర్చిపోరు. ఆ అనుభవం అనుభవం చేయించేవారికి సమీపంగా తీసుకువస్తుంది. అందరు అడుగుతున్నారు - భవిష్యత్తులో ఏమి నవీనత చేయము అని. బాప్ దాదా చూసారు - సేవ అయితే అందరు ఉత్సాహ, ఉల్లాసాలతో చేస్తున్నారు. ప్రతి వర్గం వారు కూడా చేస్తున్నారు ఈరోజు కూడా చాలా వర్గాల వారు వచ్చారు కదా! మెగా ప్రోగ్రామ్ కూడా చేసారు, సందేశమైతే ఇచ్చారు, మీ పై నిందని తొలగించుకున్నారు దానికి శుభాకాంక్షలు. కానీ ఇది పరమాత్మ జ్ఞానం అనే మాట ఇప్పటి వరకు వ్యాపించలేదు. బ్రహ్మా కుమారీలు మంచి కార్యం చేస్తున్నారు, బ్రహ్మాకుమారీల జ్ఞానం చాలా మంచిది అని అంటున్నారు కానీ పరమాత్ముని జ్ఞానం ఇదే, పరమాత్మ కార్యం నడుస్తుంది అనే మాట రావాలి. యోగా కోర్సులు కూడా చేయిస్తున్నారు, ఆత్మ యొక్క 

సంబంధాన్ని పరమాత్మతో జోడిస్తున్నారు కూడా. కానీ పరమాత్మతో జోడిస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు పరమాత్మ కార్యం, స్వయం పరమాత్మ చేయిస్తున్నారు అనేది చాలా తక్కువ అనుభవం చేసుకుంటున్నారు. ఆత్మ మరియు ధారణలు ఇవి ప్రత్యక్షం అవుతున్నాయి, మంచి కార్యం చేస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, మంచిని నేర్పిస్తున్నారు అంటున్నారు ఇంత వరకు మంచిదే. జ్ఞానం మంచిది అని కూడా అంటున్నారు కానీ ఇది పరమాత్మ యొక్క జ్ఞానం. .... అనే ధ్వని బాబాకి సమీపంగా తీసుకువస్తుంది. మరియు వారు ఎంతగా బాబాకి సమీపంగా వస్తారో అంతగా అనుభవం స్వతహాగానే చేసుకుంటారు. కనుక దీని కొరకు ప్లాన్ తయారుచేసుకోండి. ఉపన్యాసాలలో ఇటువంటి సారాన్ని నింపండి. దాని ద్వారా వారు పరమాత్మకు దగ్గర అవ్వాలి. దివ్యగుణాల ధారణ, ఆత్మ జ్ఞానం, పరమాత్మ జ్ఞానం ఇస్తున్నారు అని అంటున్నారు కానీ పరమాత్మ వచ్చేసారు, పరమాత్మ కార్యం, స్వయం పరమాత్మ చేయిస్తున్నారు అనేది ప్రత్యక్షం చేయాలి. అప్పుడు ఆ ప్రత్యక్షత అయస్కాంతం వలె బాబాకి సమీపంగా తీసుకువస్తుంది. బాబా లభించారు, బాబాని కలుసుకోవాలి అని అర్థం చేసుకున్నప్పుడే మీరు కూడా సమీపం అయ్యారు కదా! చాలా మంది స్నేహి అవుతున్నారు. ఏమి అర్థం చేసుకుని అవుతున్నారు? కార్యం ముందు, బ్రహ్మకుమారులు చేసే కార్యం ఎవరూ చేయలేరు, పరివర్తన చేస్తున్నారు అంటున్నారు. కానీ పరమాత్మ మాట్లాడు తున్నారు, పరమాత్మ నుండి వారసత్వం తీసుకోవాలి అన్నంత సమీపంగా రావటంలేదు. బ్రహ్మాకుమారీలు ఏమి చేస్తారు, వారి జ్ఞానం ఏమిటి? అనేది ఇంతకుముందు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కానీ పరమాత్మ ప్రత్యక్షత జరగలేదు. ఇది పరమాత్మ జ్ఞానం అని వారికి అర్ధమైతే వారు రాకుండా ఆగగలరా? మీరు ఎలాగైతే పరుగెత్తుకుంటూ వచ్చేసారో అలా పరుగెత్తుకుంటూ వచ్చేస్తారు. కనుక ఇప్పుడు ఇటువంటి ప్లాన్ తయారుచేయండి. ఇటువంటి ఉపన్యాసం తయారుచేయండి. పరమాత్మ అనుభూతి యొక్క ప్రత్యక్ష ఉదాహరణగా అవ్వండి అప్పుడే బాబా యొక్క ప్రత్యక్షత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇది మంచిది అనే వరకు వచ్చారు. కానీ మంచిగా తయారుకావాలి అనే కోరిక పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి జరిగినప్పుడు వస్తుంది. కనుక అనుభవీ మూర్తి అయ్యి అనుభవం చేయించండి. మంచిది. 

ఇప్పుడు డబల్ యజమానిస్థితి యొక్క స్మృతి ద్వారా సమర్థంగా అయ్యి సమర్థంగా తయారుచేయండి. మంచిది. 

అన్ని వైపుల ఉన్న సర్వ ఆత్మిక గులాబీలైన పిల్లలకు, సదా బాబాకి అతిప్రియము మరియు దేహాభిమానానికి అతీతమైన పిల్లలకు, బాబా హృదయానికి అధికారులైన పిల్లలకు, సదా ఒకే బాబా అని ఏకాగ్ర మనస్సుతో ఏకరస స్థితిలో స్థితులై ఉండే పిల్లలకు, నలువైపుల భిన్న భిన్న స్థానాలలో భిన్న భిన్న సమయాలలో విజ్ఞాన సాధనాల ద్వారా మధువనం చేరుకునే పిల్లలకు, సన్ముఖంగా చూస్తున్న వారికి, ప్రియమైన, గారాభ పిల్లలకు, కల్పకల్పము పరమాత్మ యొక్క ప్రేమకు అధికారులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు కోటానుకోట్ల మనస్సు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి. మరియు వెనువెంట డబల్ యజమాని పిల్లలకు బాప్ దాదా యొక్క నమస్తే. 

Comments