03-02-2005 అవ్యక్త మురళి

    03-02-2005         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సేవ చేస్తూ ఉపరామ్ గా (అతీతంగా) మరియు బేహద్ వృత్తి ద్వారా ఎవరెడీగా అయ్యి బ్రహ్మాబాబా సమానంగా సంపన్నంగా అవ్వండి.

ఈరోజు ఉన్నతోన్నతమైన తండ్రి తన యొక్క నలువైపుల ఉన్న కోట్లలో కొద్దిమంది మరియు కొద్ది మందిలో కొద్దిమంది అయిన పిల్లల యొక్క భాగ్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఇంత విశేషమైన భాగ్యం మరెవ్వరికి లభించదు. ప్రతి పిల్లవాని యొక్క విశేషతను చూసి సంతోషిస్తున్నారు. ఏ పిల్లలైతే బాప్ దాదాతో మనసుతో సంబంధం జోడించారో ఆ ప్రతి ఒక పిల్లవాడిలో ఏదోక విశేషత తప్పకుండా ఉంటుంది. అన్నింటికంటే మొదటి విశేషత - సాధారణ రూపంలో వచ్చిన బాబాని గ్రహించి "నా బాబా” అని అంగీకరించారు. ఈ గ్రహింపే చాలా ఉన్నతమైన విశేషత. మనస్సుతో నా బాబా అని అంగీకరించారు, బాబా నా పిల్లలు అని అంగీకరించారు. ఎవరైతే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మాత్మలు ఉన్నారో వారెవరు తెలుసుకోలేకపోయారు. సాధారణ పిల్లలైన మీరు బాబాని గ్రహించి మీ అధికారం మీరు తీసుకుంటున్నారు. ఎవరు ఈ సభలోకి వచ్చినా ఈ పిల్లలను చూసి ఇంత అమాయక మాతలు, సాధారణ పిల్లలు ఇంత ఉన్నతమైన తండిని గ్రహించారా అని అశ్చర్యపోతారు. బాబాని గ్రహించి తన వారిగా చేసుకునే విశేషత కోట్లలో కొద్దిమంది అయిన మీకే ఈ భాగ్యం లభించింది. సన్ముఖంగా కూర్చున్న పిల్లలు లేక దూరంగా కూర్చున్నా సన్ముఖంగా అనుభవం చేసుకుంటున్నారు అంటే పిల్లలందరు మనసుతో బాబాని గ్రహించారు. గ్రహించారా లేక ఇంకా గ్రహిస్తున్నారా? ఎవరైతే గ్రహించారో వారు చేతులు ఎత్తండి! గ్రహించారా? మంచిది. బాప్ దాదా ఈ గ్రహించే విశేషతకు ప్రతి ఒక పిల్లవానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఓహో భాగ్యవాన్ పిల్లలు ఓహో!! అని. గ్రహించే మూడవ నేత్రాన్ని పొందారు. పిల్లల మనస్సు యొక్క పాట బాప్ దాదా వింటూ ఉంటారు, అది ఏమి పాట? పొందవలసినదంతా పొందాము అనే పాట. బాబా కూడా చెప్తారు ఓ గారాభమైన పిల్లలూ! బాబా నుండి తీసుకోవలసినదంతా తీసుకున్నారు అని. ప్రతి ఒక పిల్లవాడు అనేక ఆత్మిక ఖజానాలకు పిల్లల నుండి యజమానిగా అయ్యారు. 

ఈరోజు బాప్ దాదా ఖజానాలకు యజమాని అయిన పిల్లల యొక్క ఖజానాల లెక్కలఖాతా చూస్తున్నారు. బాబా అయితే అన్నీ ఖజానాలు అందరికీ ఒకే విధంగా, ఒకే లెక్కతో ఇచ్చారు. కొందరికి కోట్లు, కొందరికి లక్షలు ఇలా ఇవ్వలేదు. ఖజానాలను తెలుసుకోవటం మరియు పొందటం, జీవితంలో నింపుకోవటంలో నెంబర్‌ వార్‌గా ఉన్నారు. బాప్ దాదా ఈ రోజుల్లో మాటిమాటికి రకరకాలుగా పిల్లలకు ధ్యాస ఇప్పిస్తున్నారు - సమయం యొక్క సమీపతను అనుసరించి మీ యొక్క సూక్ష్మ విశాలబుద్ధితో పరిశీలన చేసుకోవాలి - బాబా నుండి ఏమి లభించాయి, ఏమి తీసుకున్నాము మరియు నిరంతరం ఈ  ఖజానాలతో పాలింపబడుతూ ఉన్నామా? అని. పరిశీలన చాలా అవసరం. ఎందుకంటే వర్తమాన సమయంలో మాయ రకరకాలైన సోమరితనం మరియు రాయల్ నిర్లక్ష్యం రూపంలో చాలా ప్రయత్నం చేస్తుంది. అందువలన సదా పరిశీలన చేసుకుంటూ ఉండండి. ఇంత ధ్యాసతో పరిశీలన చేసుకోవాలి, సోమరితనంలో కాదు. చెడు చేయలేదు, దు:ఖం ఇవ్వలేదు, చెడుదృష్టి లేదు ఇలా పరిశీలన చేసుకోవటం కాదు కానీ మంచి ఏమి చేశాను? అని పరిశీలన చేసుకోవాలి. సదా ఆత్మికదృష్టి స్వతహాగా ఉందా? లేక స్మృతి మరియు విస్మతి యొక్క ఆట నడుస్తుందా? ఎంతమందికి శుభభావన, శుభకామన, ఆశీర్వాదాలు ఇచ్చాను? ఇలా జమాఖాతా ఎంత మరియు ఏవిధంగా ఉంది? అని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఎంత జమ చేసుకోవాలంటే అంత ఇప్పుడే జమ చేసుకోవాలి, ఇది మంచిగా తెలుసుకున్నారు కదా! ఈ సమయం యొక్క జమాఖాతాయే మొత్తం సమయానికి జమ అవుతుంది. మొత్తం సమయం యొక్క జమననుసరించే రాజ్యభాగ్యం మరియు పూజ్య దేవీదేవతగా అవుతారు. జమ తక్కువగా ఉంటే రాజ్య భాగ్యం కూడా తక్కువగా మరియు పూజ్యులుగా అవ్వటంలో కూడా నెంబర్ వారిగా అవుతారు. జమ తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగా ఉంటుంది. విధిపూర్వకంగా జమ చేసుకోకపోతే విధిపూర్వకంగా పూజ కూడా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకంగా చేస్తే అప్పుడప్పుడు విధిపూర్వక పూజ మరియు పదవి కూడా అప్పుడప్పుడు లభిస్తుంది. అందువలనే బాప్ దాదాకి ప్రతి ఒక పిల్లవాడంటే చాలా ప్రేమ ఉంది. కనుక బాప్ దాదా ప్రతి ఒక పిల్లవాడు సంపన్నంగా మరియు సమానంగా అవ్వాలని కోరుకుంటున్నారు. సేవ చేయండి కానీ సేవలో కూడా అతీతంగా, బేహద్ గా ఉండండి. బాప్ దాదా చూశారు - చాలా మంది పిల్లలకు యోగం అంటే స్మృతి యొక్క సబ్జక్టులో అభిరుచి అంటే ఆసక్తి తక్కువగా ఉంటుంది, సేవపై ఎక్కువగా ఉంటుంది. కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉంటే దానిలో హద్దు వచ్చేస్తుంది. అతీతవృత్తి ఉండటంలేదు. పేరు, గౌరవం, పదవి ఈ భావాలన్నీ కలిసిపోతున్నాయి. బేహద్ వృత్తి తక్కువ అయిపోతుంది. అందువలనే బాప్ దాదా కోట్లలో కొద్దిమందిలో కొద్దిమంది అయిన నా పిల్లలు ఇప్పటి నుండి ఎవరెడీ అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఎందుకు? ఎందుకంటే కొంతమంది పిల్లలు సమయం వచ్చేసరికి తయారైపో తాము అని ఆలోచిస్తున్నారు. కానీ సమయం మీ రచన, మీ రచనను మీరు మీ శిక్షకునిగా చేసుకుంటారా? రెండవ విషయం ఏమిటంటే చాలా సమయం యొక్కలెక్క, చాలా సమయం యొక్క సంపన్నత చాలా సమయం యొక్క ప్రాప్తినిస్తుంది. ఇప్పుడు సమయం యొక్క సమీపతను అనుసరించి చాలా సమయం యొక్క జమ అవసరం. మరలా చాలా సమయం ఉంది అని అనుకున్నాము అని బాబాని నిందించవద్దు. ఇప్పటినుండి చాలా సమయం యొక్క ధ్యాస పెట్టుకోండి. అర్థమైందా! దయ ఉంచి ధ్యాస పెట్టుకోండి. బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ప్రతి ఒక పిల్లవానిలో ఏ ఒక సబ్జక్టు యొక్క లోపం ఉండకూడదు అని. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా! బ్రహ్మాబాబా యొక్క ప్రేమకు రిటర్న్ ఇస్తారు కదా! ప్రేమకు రిటర్న్ - మీ యొక్క లోపాన్ని పరిశీలన చేసుకోండి మరియు బదులు ఇవ్వండి, పరివర్తన చేసుకోండి. మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవటమే బాబాకి బదులు ఇవ్వటం. కనుక బదులు ఇవ్వడానికి ధైర్యం ఉందా? చేతులైతే ఎత్తి చాలా సంతోషపరుస్తున్నారు. చేతులు చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు మనసులో పక్కా పక్కాగా ఒక శాతం కూడా కచ్చాగా ఉండకూడదు. పక్కా వ్రతం తీసుకోండి - బదులు ఇవ్వవలసిందే కనుక మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి. 

ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా! కనుక చాలా ప్రేమతో చాలా మంది పిల్లలు ఉత్సాహంతో బాబా యొక్క జయంతి మరియు పిల్లల యొక్క జయంతి జరుపుకునేటందుకు వస్తారు. మంచి, మంచి ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు. సేవ యొక్క ప్లాన్స్ అయితే చాలా మంచిగా తయారుచేస్తున్నారు, ఇది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. కానీ ..... కానీ అనటం మంచిగా అనిపించడం లేదు. జగదాంబ సరస్వతి కానీ అనే మాట అంటే సింధీ భాషలో దాని అర్థం చెప్పేవారు - సింధీ భాషలో లేకిన్ (కానీ) అంటే లే - కిన్ లే అంటే తీసుకోవటం కిన్ అంటే మురికి అని అర్థం. లేకిన్ (కానీ) అనటం అంటే ఏదోక మురికిని తీసుకోవటం. కనుక కానీ అనటం మంచిగా అనిపించటం లేదు. కానీ అనవలసి వస్తుంది. ఎలా అయితే అనేక రకాలైన సేవా ప్లాన్స్ తయారుచేసారు మరియు తయారుచేస్తారు కూడా కానీ ఈ వ్రతం తీసుకునే ప్రోగ్రామ్ కూడా తయారుచేయండి. బదులు ఇవ్వవలసిందే ఎందుకంటే ఎప్పుడైనా బాప్ దాదా కానీ ఎవరైనా కానీ ఎలా ఉన్నారు? అని అడిగితే చాలా మంది నుండి ఇదే జవాబు వస్తుంది - చాలా మంచిగా ఉన్నాము కానీ బాప్ దాదా ఎంతగా ఉండాలంటున్నారో అంతగా ఉండటం లేదు అని. ఇప్పుడు ఈ జవాబు రావాలి - బాప్ దాదా కోరుకునే విధంగా మా స్థితి ఉంది అని. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారో నోట్ చేసుకోండి, లిస్ట్ తీయండి మరియు బాప్ దాదా ఏది కోరుకుంటున్నారో అది ఉందా లేదా? అని. ప్రపంచం వారు పూర్వీకులైన మీ ద్వారా ముక్తి కోరుకుంటున్నారు, అరుస్తున్నారు, ముక్తి ఇవ్వండి, ముక్తి ఇవ్వండి అని. ఎప్పటి వరకు చాలా మంది పిల్లలు తమ యొక్క పాత సంస్కారాలు దానినే మీరు సంస్కారం అంటారు అది స్వతహా స్థితి కాదు సంస్కారం వాటిలో కొద్దిగా అయినా పాత సంస్కారాల నుండి ముక్తి కాకపోతే సర్వాత్మలకు ముక్తి లభించదు. బాప్ దాదా చెప్తున్నారు - ఓ ముక్తిదాత యొక్క పిల్లలు మాస్టర్ ముక్తి దాతలు - ఇప్పుడు మిమ్మల్ని మీరు ముక్తి చేసుకోండి, అప్పుడు ముక్తి యొక్క ద్వారం తెరుచుకుంటుంది అని. ఆ ద్వారం యొక్క తాళంచెవి ఏమిటి? అనేది చెప్పాను కదా! బేహద్ వైరాగ్యమే తాళంచెవి. అన్ని కార్యాలు చేయండి కానీ ఎలా అయితే ఉపన్యాసంలో ప్రవృత్తిలో ఉండేవారు కమలపుష్ప సమానంగా అవ్వండి అని చెప్తారు కదా! అదేవిధంగా మీరు కూడా అన్నీ చేస్తూ కార్యం నుండి ముక్తిగా, అతీతంగా, సాధనాలకు వశం కాకుండా, పొజిషన్ కి (పదవి, గౌరవం) వశం కాకుండా ఉండాలి. ఏమైనా లభించినా కానీ అది పొజిషన్ కాదు మాయ యొక్క అపొజిషన్. అతీతంగా, బాబాకి ప్రియంగా ఉండాలి. దీనిలో కష్టమేమైనా ఉందా? అతీతంగా, ప్రియంగా అవ్వాలి ఇది కష్టమనిపించేవారు చేతులు ఎత్తండి! కష్టమనిపించని వారు శివరాత్రికి సంపన్నం అయిపోతారు. కష్టమనిపించకపోతే తయారవ్వాలి కదా! బ్రహ్మాబాబా సమానంగా అవ్వవలసిందే. సంకల్పంలో, మాటలో, సేవలో, సంబంధ, సంపర్కంలో కూడా బ్రహ్మాబాబా సమానంగా అవ్వాలి. ఎవరికైతే బ్రహ్మాబాబా మరియు దాదా, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్‌ చాలా చాలా అంటే 100 శాతం కంటే ఎక్కువ ప్రేమ ఉందో వారు చేతులు ఎత్తండి! కేవలం ఇప్పుడిప్పుడే సంతోషపరచడం కాదు. అందరు ఎత్తారు. టి.విలో వస్తుంది కదా! శివరాత్రికి ఈ టి.వి చూస్తాను మరియు లెక్క తీస్తాను. కొద్దిగా కూడా సమానతలో తేడా ఉండకూడదు. ప్రేమ ఉన్నప్పుడు బలి చేయటం ఏమైనా గొప్ప విషయమా! ప్రపంచం వారు హద్దు యొక్క ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికే తయారవుతున్నారు. బాప్ దాదా కేవలం మురికిని ఇవ్వండి చాలు అంటున్నారు. మంచి వస్తువులు వద్దు, మురికిని ఇవ్వండి అంటున్నారు. బలహీనతలు, లోపాలు ఇవి ఏమిటి? మురికి కదా! మురికిని ఇవ్వటం ఏమైనా గొప్ప విషయమా! పరిస్థితి సమాప్తి అయిపోవాలి, స్వస్థితి శ్రేష్టంగా అవ్వాలి. పరిస్థితులు ఇలా ఉన్నాయి ఏమి చేయము అని ఇదే చెప్తున్నారు కదా! స్వస్థితి శక్తిశాలిగా అయినప్పుడు పరిస్థితి యొక్క పేరే ఉండదు. మిమ్మల్ని చలింపచేయడానికి. సమాప్తి యొక్క పరదా తెరిచినప్పుడు అందరు ఎలా కనిపించాలి? ఫరిస్తాలుగా మెరుస్తూ కనిపించాలి. పిల్లలందరు మెరుస్తూ కనిపించాలి. అందువలనే ఇప్పుడు పరదా తెరవడానికి ఆగి ఉన్నారు. ప్రపంచం వారు పరదా తెరవండి, పరదా తెరవండి అని అరుస్తున్నారు. కనుక మీ ప్లాన్ మీరే తయారుచేసుకోండి. తయారైన ప్లాన్ ఇస్తే ఏవోక విషయాలు వస్తాయి. కనుక మీ ప్లాన్ మీకు మీరే ధైర్యంతో తయారు చేసుకోండి.  ధృడత యొక్క తాళంచెవి ఉంటే సఫలత లభించవలసిందే. ధృఢ సంకల్పం చేస్తున్నారు ఇది చూసి బాప్ దాదా కూడా ఓహో పిల్లలు ఓహో అని సంతోషిస్తున్నారు. ధృడసంకల్పం చేసారు కానీ ధృఢతలో అప్పుడప్పుడు మరలా కొద్దికొద్దిగా సోమరితనం కలిసిపోతుంది. అందువలనే సఫలత కూడా అప్పుడప్పుడు సగం, అప్పుడప్పుడు పావు శాతం వస్తుంది. ఎలా అయితే ప్రేమ 100 శాతం ఉందో అదేవిధంగా పురుషార్థంలో సంపన్నత కూడా 100 శాతం ఉండాలి. భలే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ కాకూడదు. ఇష్టమేనా? శివరాత్రికి మెరుపు చూపిస్తారు కదా! తయారవ్వలసిందే. మేము కాకపోతే ఎవరు తయారవుతారు అనే ఈ నిశ్చయం పెట్టుకోండి, మేమే అలా ఉండేవారము, ఇప్పుడు మేమే మరియు మరలా మేమే అలా తయారవుతాము ఈ నిశ్చయమే విజయీగా చేస్తుంది. పరదర్శనం చేయకండి, మిమ్మల్ని మీరు చూసుకోండి. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేస్తారు కదా - వారిని కొద్దిగా మంచిగా చేయండి, అప్పుడు మేము మంచిగా అయిపోతాము అని. వారిని కొద్దిగా మారిస్తే నేను కూడా మారిపోతాను అంటారు. కానీ వారు మారరు, మీరు మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది ఉంటే అది చేస్తాను, ఇలా ఏదీ ఆధారం తీసుకోకండి. నేను చేయవలసిందే. మంచిది. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా!

ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి! మొదటిసారి వచ్చిన వారికి బాప్ దాదా చెప్తున్నారు - కొంచెం సమయం ఉండగా వచ్చారు. కనుక పురుషార్థం ఎంత తీవ్రంగా చేయాలంటే లాస్ట్ నుండి ఫాస్ట్ నుండి ఫస్ట్ నెంబర్ లోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు కుర్చీలాట నడుస్తుంది ఇప్పుడు ఎవరు విజయం పొందారు అనేది అవుట్ అవ్వలేదు. ఆలస్యంగా వచ్చారు కానీ వేగంగా వెళ్ళటం ద్వారా చేరుకోగలరు. కేవలం అమృతవేళ మీకు మీరు అమరభవ! అనే వరదానం స్మృతి ఉంచుకోండి. మంచిది - కొంతమంది దూరం నుండి, కొంతమంది దగ్గర నుండి వచ్చారు. బాప్ దాదా మీ ఇంటికి భలే వచ్చారు అంటున్నారు. సంఘటన మంచిగా అనిపిస్తుంది. సభ నిండుగా ఉండటం ద్వారా ఎంత అందంగా ఉంది, టి.విలో కనిపిస్తుంది కదా! ఎవరెడీ, అయిపోయారా? ఎవరెడీ యొక్క పాఠం చదువుకుంటారు కదా! మంచిది, ఇప్పుడేమి చేయాలి? 
 
నలువైపుల ఉన్నటువంటి కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కొద్దిమంది అయిన భాగ్యవాన్ శ్రేష్టాత్మలకు, సదా తీవ్రపురుషార్ధం ద్వారా ఏది ఆలోచిస్తున్నారో అది చేయాలి, శ్రేష్టంగా ఆలోచించడం, శ్రేష్ట కర్మ చేయటం, లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా ఉంచుకోవటం ఈ విధమైన విశేషాత్మలకు, సదా చాలా సమయం యొక్క పురుషార్థం ద్వారా రాజ్యభాగ్యం మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్టాత్మలకు, సదా బాబా యొక్క స్నేహానికి బదులుగా తమని తాము పరివర్తన చేసుకునే నెంబర్ వన్ ఆత్మలకు, విజయం పొందే భాగ్యవాన్ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments