02-02-2007 అవ్యక్త మురళి

 02-02-2007         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పరమాత్మ ప్రాప్తులతో సంపన్న ఆత్మ యొక్క గుర్తు - పవిత్ర స్థితి, ఉన్నత స్థితి మరియు ధనవంత స్థితి.

ఈరోజు విశ్వపరివర్తకుడైన బాప్ దాదా తన యొక్క సహయోగి పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. ప్రతి ఒక పిల్లవాని మస్తకంలో మూడు విశేషమైన ప్రాప్తులను పరమాత్మ చూస్తున్నారు. 1. పవిత్రస్థితి, 2. ఉన్నత స్థితి, 3. ధనవంత స్థితి. ఈ జ్ఞానం యొక్క పునాదియే హోలీ అంటే పవిత్రంగా అవ్వటం. కనుక ప్రతి ఒక పిల్లవాడు పవిత్రమే, పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు కానీ మనసులో, మాటలో, కర్మలో, సంబంధ సంపర్కంలో పవిత్రత ఉండాలి. పరమాత్మ పిల్లలు బ్రాహ్మణాత్మలైన మీరు ఆది, మధ్య, అంత్యం మూడు కాలాలలో పవిత్రంగా ఉంటున్నారు. మొట్టమొదట ఆత్మ పరంధామంలో ఉన్నప్పుడు కూడా పవిత్రంగా ఉండేది, మరలా ఆదిలో దేవతారూపంలో కూడా పవిత్ర ఆత్మగా ఉండేది. పవిత్రాత్మ యొక్క గుర్తు - ప్రవృతిలో (కుటుంబంలో) ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండాలి. మీ పవిత్రత యొక్క విశేషత స్వప్నంలో కూడా అపవిత్రత అనేది టచ్ అవ్వకూడదు. సత్యయుగంలో ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది, శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. దేవాత్మరూపంలో ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి ఇదే శ్రేష్ఠ పవిత్రత. ఎంత పవిత్రంగా అవుతారో అంత ఉన్నతంగా కూడా అవుతారు. అందరికంటే ఉన్నతోన్నతమైన బ్రాహ్మణాత్మలుగా మరియు ఉన్నతోన్నతమైన బాబాకి పిల్లలుగా అయ్యారు. అనాదిగా పరంధామంలో బాబాతో పాటు ఉన్నతంగా ఉంటారు, మధ్యలో కూడా పూజ్య ఆత్మలుగా అవుతున్నారు. ఎంత సుందరమైన మందిరాలు తయారుచేసారు మరియు ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుంది! దేవతలైన మీకు విధిపూర్వకంగా మందిరాలలో పూజ జరుగుతుంది, ఇతరులకు కూడా మందిరాలు తయారుచేస్తారు కానీ మీ దేవతారూపానికే విధిపూర్వక పూజ జరుగుతుంది. పవిత్రాత్మలు, ఉన్నతమైన ఆత్మలు మరియు ధనవంతమైన ఆత్మలు. మీరు ప్రపంచంలో అందరికంటే ధనవంతులు అంటారు కానీ శ్రేష్టాత్మలైన మీరు మొత్తం కల్పం ధనవంతులు. ఎన్ని ఖజానాలకు యజమానులు! ఇలా మీ ఖజానాలు స్మృతి వస్తున్నాయా! ఈ అవినాశి ఖజానా ఒక జన్మలోనే పొందుతున్నారు, ఇది అనేక జన్మలు ఉంటుంది. ఇక ఏ ఖజానా అనేక జన్మలు ఉండదు కానీ మీ ఖజానా ఆధ్యాత్మికమైనది. శక్తులఖజానా, జ్ఞానఖజానా, గుణాలఖజానా, శ్రేష్టసంకల్ప ఖజానా మరియు వర్తమాన సమయం యొక్క ఖజానా ఈ అన్ని ఖజానాలు జన్మజన్మలకి వస్తాయి. ఒక జన్మలో లభించిన ఖజానాలు వెంట వస్తాయి ఎందుకంటే సర్వఖజానాల దాత అయిన బాబా నుండి మీకు ఆ ఖజానాలు లభించాయి. మా ఖజానాలు అవినాశి అనే సంతోషం మీకు ఉందా? ఈ ఆధ్యాత్మిక ఖజానాలు పొందటం కోసమే సహజయోగిగా అయ్యారు. స్మృతిశక్తి ద్వారా ఖజానాలను జమ చేసుకుంటున్నారు. ఈ సమయంలో కూడా ఈ సర్వఖజానాల సంపన్నతతో నిశ్చింతగా ఉన్నారా! ఏదైనా చింత ఉందా? ఉందా చింత? ఎందుకంటే ఈ ఖజానాలు దొంగలు దొంగిలించలేరు, రాజులు తీసుకోలేరు, నీరు ముంచలేదు, అందువలనే నిశ్చింతాచక్రవర్తులు. ఈ ఖజానాలు సదా స్మృతిలో ఉంటున్నాయి కదా! మరియు స్మృతి కూడా సహజమైనదే ఎందుకు? ఎందుకంటే సహజంగా స్మృతి ఉండేవి 1. సంబంధం మరియు 2.ప్రాప్తి. ఎంత ప్రియమైన సంబంధం ఉంటుందో అంత స్వతహాగా స్మృతి ఉంటుంది. ఎందుకంటే సంబంధంలో స్నేహం ఉంటుంది మరియు ఎక్కడ స్నేహం ఉంటుందో స్నేహీలను స్మృతి చేయటం కష్టం కాదు కానీ మర్చిపోవటం కష్టం అవుతుంది. బాబాని సర్వసంబంధాల ఆధారంగా చేసుకున్నారు మరి అందరు మిమ్మల్ని మీరు సహజయోగిగా అనుభవం చేసుకుంటున్నారా? లేక కష్టయోగులా? సహజమేనా? అప్పుడప్పుడు సహజంగా, అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తుందా? ఎప్పుడైతే బాబాని సంబంధంతో మరియు స్నేహంతో స్మృతి చేస్తారో స్మృతి కష్టంగా అనిపించదు మరియు ప్రాప్తులను కూడా స్మృతి చేయండి. 1. సర్వప్రాప్తుల యొక్క దాత సర్వప్రాప్తులను ఇచ్చారు. కనుక మిమ్మల్ని మీరు సర్వఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? 

ఖజానాలను జమచేసుకుని సహజవిధి కూడా బాప్ దాదా వినిపించారు. అవినాశీ ఖజానాలను జమచేసుకునే విధి. బిందువు. ఎలా అయితే వినాశీ ఖజానాలలో కూడా బిందువు పెడుతూ వెళ్తే పెరుగుతుంది కదా! కనుక అవినాశీ ఖజానాలను కూడా పెంచుకునే విధి బిందువు పెట్టాలి. మూడు బిందువులు 1. నేను ఆత్మ బిందువు 2. బాబా కూడా బిందువు. 3 డ్రామాలో ఏది జరిగినా ఫుల్ స్టాప్ అంటే బిందువు. బిందువు పెట్టడం వస్తుందా? అన్నింటికంటే ఎక్కువ సహజమైనది ఏమిటి? బిందువు పెట్టడం కదా. కనుక ఆత్మ బిందువు, బాబా కూడా బిందువు. ఈ స్మృతి ద్వారా స్వతహాగానే ఖజానాలు జమ అవుతాయి కదా! సెకండులో బిందువును జ్ఞాపకం చేయడం ద్వారా ఎంత సంతోషంగా ఉంటుంది. ఈ సర్వఖజానాలు మీ బ్రాహ్మణ జీవితం యొక్క అధికారం. ఎందుకంటే పిల్లలుగా అవడం అంటే అధికారులుగా అవడం. మరియు విశేషంగా మూడు అధికారాలు లభించాయి. పరమాత్మను మీ తండ్రిగా చేసుకున్నారు. శిక్షకునిగా కూడా చేసుకున్నారు. సద్గురువుగా కూడా చేసుకున్నారు. ఈ మూడు సంబంధాల ద్వారా పాలన, చదువు ద్వారా సంపాదన, సద్గురువు ద్వారా వరదానం లభిస్తున్నాయి. ఎంత సహజంగా వరదానం లభిస్తుంది. ఎందుకంటే బాబా యొక్క వరదానం పొందడం అనేది పిల్లల యొక్క జన్మ సిద్ధ అధికారం. 

బాప్ దాదా ప్రతి పిల్లవాని యొక్క జమా ఖాతాను పరిశీలిస్తున్నారు. మీరందరూ కూడా మీ ప్రతి సమయం యొక్క జమా ఖాతాను పరిశీలించుకోండి. జమ అయిందా? లేక అవ్వలేదా? అనేదానికి విధి ఏ కర్మచేసినా ఆ కర్మలో స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి. ఎవరితో కర్మ చేశారో వారు కూడా సంతుష్టం అవ్వాలి. ఇద్దరిలో సంతుష్టత ఉంది అంటే ఆ కర్మ యొక్క ఖాతా జమ అయినట్లుగా భావించండి. ఒకవేళ స్వయంలో లేక ఎవరితో సంబంధం ఉందో వారితో సంతుష్టత లేకపోతే అది జమ అవ్వదు. బాప్ దాదా పిల్లలందరికీ సమయం యొక్క సూచన ఇస్తున్నారు. ఈ వర్తమాన సంగమయుగం యొక్క సమయం మొత్తం కల్పంలోనే శ్రేష్టాతి శ్రేష్టమైన సమయం, ఎందుకంటే ఈ సంగమయుగమే శ్రేష్ట కర్మల యొక్క బీజం నాటుకునే సమయం. ప్రత్యక్ష ఫలం పొందే సమయం. ఈ సంగమయుగంలో ఒక్కొక్క సెకెను శ్రేష్టాతి శ్రేష్టమైనది. అందరూ ఒక సెకనులో అశరీరి స్థితిలో స్థితులవ్వగలుగుతున్నారా? బాప్ దాదా సహజవిధి వినిపించారు. నిరంతరం స్మృతి కోసం ఒక విధి తయారు చేసుకోండి. మొత్తం రోజంతటిలో రెండు మాటలు అందరూ మాట్లాడుతూ ఉంటారు. మరియు అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ రెండు మాటలు నేను మరియు నాది. ఎప్పుడైతే నేను అనే మాట మాట్లాడతారో బాబా నేను ఆత్మను అనే పరిచయం ఇచ్చారు కదా! కనుక నేను అనే మాట వచ్చినప్పుడు నేను ఆత్మను అనేది జ్ఞాపకం చేసుకోండి. నేను అనేది ఒకటే ఆలోచించకండి. నేను ఆత్మను తరువాత నేను శ్రేష్టాత్మను పరమాత్మ పాలనలో ఉండే ఆత్మను ఇలా ఆలోచించండి. నాది అనే మాట వచ్చినప్పుడు నా వారు ఎవరు అనేది ఆలోచించండి. నా బాబా అంటే పరమాత్మ తండ్రి నావాడు. నేను నాది అనే మాట వచ్చినప్పుడు నేను ఆత్మను మరియు నా బాబా అనే మాటలను కలపండి. 

ఎంత బాబాపై నాది అనేది వస్తుందో అంత సహజంగా బాబా స్మృతి ఉంటుంది. ఎందుకంటే నాది అనేది ఎప్పుడూ మర్చిపోరు. మొత్తం రోజంతటిలో నాది అనేది ఎక్కువ వస్తుంది. ఈ విధి ద్వారా సహజంగానే నిరంతర యోగిగా అవుతారు. బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లవాడిని స్వమానం అనే సీట్ పై కూర్చుండబెట్టారు. స్వమానం యొక్క జాబితా జ్ఞాపకం తెచ్చుకుంటే ఎంత పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే స్వమానంలో స్థితులైతే దేహాభిమానం రాదు. ఉంటే దేహాభిమానం ఉంటుంది లేకపోతే స్వమానం ఉంటుంది. స్వమానం అంటే స్వ అంటే ఆత్మ యొక్క శ్రేష్ట స్మృతి యొక్క స్థానం. అందరూ మీ స్వమానంలో స్థితులై ఉన్నారా? ఎంత స్వమానంలో ఉంటారో అంతగా ఇతరులకు గౌరవం స్వతహాగానే ఇవ్వగలరు, స్వమానంలో స్థితులవడం ఎంత సహజం. అందరూ సంతోషంగా ఉంటున్నారా? ఎందుకంటే సంతోషంగా ఉండేవారు. ఇతరులను కూడా సంతోషంగా చేస్తారు. బాప్ దాదా సదా చెప్తుంటారు రోజంతటిలో సంతోషం ఎప్పుడూ పోగొట్టుకోకండి. సంతోషం ఎలాంటిదంటే సంతోషంతోనే ఆరోగ్యం, ధనం, సుఖం, అన్నీ వచ్చేస్తాయి. సంతోషం లేకపోతే జీవితం నీరసంగా అనిపిస్తుంది. సంతోషం వంటి ఖజానా మరేది లేదు అని అంటారు. ఎన్ని ఖజానాలున్నా కానీ సంతోషం లేకపోతే ఆ ఖజానాల నుంచి కూడా ఏమీ పొందలేరు. సంతోషం కొరకే చెప్తారు - సంతోషాన్ని మించిన ఆహారం లేదు అని. సంతోషమే ధనం, సంతోషమే ఆరోగ్యం పేరే సంతోషం అంటే సంతోషమే సంతోషం. సంతోషంలో మూడు విషయాలు ఉంటాయి. బాబా అవినాశీ సంతోషం యొక్క ఖజానా ఇచ్చారు. కనుక బాబా ఇచ్చిన ఖజానా పోగొట్టుకోకూడదు. సదా సంతోషంగా ఉంటున్నారా? బాప్ దాదా హోం వర్క్ ఇచ్చారు కనుక సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి. ఎందుకంటే సంతోషం ఎలాంటిదంటే ఎంత పంచుతూ ఉంటారో అంత పెరుగుతుంది. అనుభవం చేసుకుని చూసారా? అనుభవం చేసుకున్నారు కదా? సంతోషం పెంచుతూ ఉంటే పంచేముందే మీ దగ్గర పెరుగుతుంది. సంతోషపరిచేవారు స్వయమే సంతోషంగా ఉంటారు. అందరూ హోమ్ వర్క్ చేశారా? చేసారా? ఎవరు చేశారో వారు చేతులెత్తండి? సంతోషంగా ఉండాలి. కారణాలు చెప్పకూడదు నివారణలోకి మార్చుకోవాలి. సమాధాన స్వరూపంగా అవ్వాలి. ఈ హోం వర్క్ ఎవరు చేశారో వారు చేతులెత్తండి? ఇది అయిపోయింది అని ఇప్పుడు ఇదైతే చెప్పరు కదా! బాప్ దాదా దగ్గరకి కొంతమంది పిల్లలు మేము ఇంత శాతం ఒకేగా ఉన్నాము అని ఫలితం పంపించారు. లక్షణం పెట్టుకుంటే లక్షణాలు స్వతహాగానే వస్తాయి. మంచిది. ఇప్పుడేమి చేయాలి? 

ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు నిలుచోండి - మీ అందరి బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలు. మంచిది మిఠాయి అయితే లభిస్తుంది కానీ బాప్ దాదా దిల్‌ కుష్ (మనసుని సంతోషం చేసే మిఠాయి) మిఠాయి తినిపిస్తున్నారు. మొదటిసారి మధువనం వచ్చి ఈ దిల్‌ కుష్ మిఠాయి జ్ఞాపకం ఉంచుకోవాలి. స్థూల మిఠాయి అయితే నోటిలో వేసుకోగానే అయిపోతుంది కానీ ఈ దిల్‌ కుష్ మిఠాయి సదా వెంట ఉంటుంది. భలే మిమ్మల్ని బాప్ దాదా మరియు మొత్తం పరివారం దేశ విదేశాలల్లోని మీ పరివారం అందరూ చూస్తున్నారు. అమెరికా వాళ్లు కూడా చూస్తున్నారు. ఆఫ్రికావారు కూడా చూస్తున్నారు. రష్యా వారు కూడా చూస్తున్నారు. లండన్ వారు కూడా చూస్తున్నారు. ఐదు ఖండాల వారు చూస్తున్నారు. వారు అక్కడ కూర్చునే మీకు జన్మదిన శుభాకాంక్షలు ఇస్తున్నారు. మంచిది. బాప్ దాదా నేర్పించిన ఆత్మిక డ్రిల్ జ్ఞాపకం ఉందా. ఇప్పుడు బాప్ దాదా ప్రతి ఒక్క పిల్లవాడు కొత్తవాడైనా, పాతవాడైనా చిన్నవారైనా, పెద్దవారైనా, చిన్నవారు చాలా త్వరగా సమానంగా అవుతారు. ఎప్పుడు ఒక్క సెకెండులో మనసును ఒక్కసెకెండులో ఏకాగ్రత చేయాలంటే అక్కడ ఏకాగ్రం అవ్వాలి. ఇప్పుడు ఒక్క సెకెనులో మనస్సుకి యజమాని అయ్యి నేను మరియు నా బాబాయే ప్రపంచం ఇక వేరెవ్వరూ లేరు. ఈ ఏకాగ్రస్థితిలో స్థితులవ్వండి. 

నలువైపులా ఉన్నటువంటి తీవ్రపురుషార్ధి పిల్లలు, సదా ఉత్సాహ, ఉల్లాసాల రెక్కలతో ఎగిరే కళ యొక్క అనుభవం చేసుకునే అనుభవీ మూర్తులకు సదా స్వమానం యొక్క సీట్ పై సెట్ అయి ఉండే పిల్లలకు, సదా దయా హృదయులుగా అయి విశ్వాత్మలకు మనసా శక్తి ద్వారా సుఖము, శాంతి యొక్క బిందువు ఇచ్చే దయాలు, కృపాలు పిల్లలకు సదా బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉండే హృదయ సింహాసనాధికారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు సమస్తే. 


Comments