18-12-1987 అవ్యక్త మురళి

 18-12-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘కర్మాతీత స్థితి యొక్క గుహ్య నిర్వచనము’’

ఈ రోజు విదేహీ బాప్ దాదా విదేహీ స్థితిలో స్థితులై ఉండే తమ శ్రేష్ఠమైన పిల్లలను చూస్తున్నారు. బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరు విదేహులుగా అయ్యే మరియు కర్మాతీతులుగా అయ్యే శ్రేష్ఠ లక్ష్యాన్ని తీసుకొని సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు. కనుక ఈ రోజు బాప్ దాదా పిల్లలను, కర్మాతీత విదేహీ స్థితికి ఎవరెవరు ఎంత సమీపంగా చేరుకున్నారు, ఎంత వరకు బ్రహ్మాబాబాను ఫాలో చేసారు లేక చేస్తూ ఉన్నారు అనేది చూస్తున్నారు. తండ్రికి సమీపంగా మరియు సమానంగా అవ్వాలనే లక్ష్యమే అందరికీ ఉంది. కానీ ప్రాక్టికల్ లో నంబరువారుగా అవుతారు. ఈ దేహంలో ఉంటూ విదేహీగా అనగా కర్మాతీతంగా అయిన ఉదాహరణగా సాకారంలో బ్రహ్మాబాబాను చూసారు. మరి కర్మాతీతంగా అయ్యే విశేషత ఏమిటి? ఎప్పటివరకైతే ఈ దేహముంటుందో, కర్మేంద్రియాలతో ఈ కర్మక్షేత్రంలో పాత్రను అభినయిస్తారో, అప్పటివరకు కర్మలు లేకుండా ఒక్క సెకండు కూడా ఉండలేరు. కర్మాతీతము అనగా కర్మ చేస్తూ కర్మ బంధనము నుండి అతీతము. ఒకటి - బంధనము మరియు రెండవది - సంబంధము. కర్మేంద్రియాల ద్వారా కర్మ సంబంధంలోకి రావడం వేరే విషయము, కర్మ బంధనంలో బంధించబడడం వేరే విషయము. కర్మ బంధనము, కర్మల యొక్క హద్దు ఫలానికి వశీభూతము చేస్తుంది. వశీభూతము అనే పదమే - ఎవరి వశములోకైనా వస్తారు అన్నదానిని ఋజువు చేస్తుంది. వశము లోకి వచ్చేవారు భూతము సమానంగా భ్రమించేవారిలా అవుతారు. ఉదాహరణకు ఏదైనా అశుద్ధ ఆత్మ భూతముగా అయ్యి ప్రవేశించినప్పుడు, ఆ మనుష్యాత్మ పరిస్థితి ఏమవుతుంది? పరవశమై భ్రమిస్తూ ఉంటారు. అలాగే, కర్మకు వశీభూతులైనట్లయితే అనగా కర్మల వినాశీ ఫలము పట్ల కోరికకు వశీభూతులైనట్లయితే, ఆ కర్మ కూడా బంధనంలో బంధించి బుద్ధి ద్వారా భ్రమింపజేస్తూ ఉంటుంది. దీనినే కర్మబంధనమని అంటారు. ఇది స్వయాన్ని కూడా ఆందోళన పరుస్తుంది మరియు ఇతరులను కూడా ఆందోళన పరుస్తుంది. కర్మాతీతము అనగా కర్మకు వశమయ్యేవారు కాదు, కానీ యజమానిగా అయ్యి, అథారిటీగా అయ్యి, కర్మేంద్రియాల సంబంధంలోకి రావటము, వినాశీ కోరికలకు అతీతులుగా అయ్యి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించటము. యజమాని అయిన ఆత్మను కర్మ తన ఆధీనము చేసుకోకూడదు, కానీ ఆత్మ అధికారిగా అయ్యి కర్మ చేయిస్తూ ఉండాలి. కర్మేంద్రియాలు వాటి ఆకర్షణలోకి ఆకర్షిస్తాయి అనగా కర్మకు వశీభూతులవుతారు, ఆధీనులవుతారు, బంధనంలో బంధించబడతారు. కర్మాతీతము అనగా దీని నుండి అతీతము అనగా భిన్నము. కనుల పని చూడడము కానీ చూడడమనే కర్మను చేయించేవారు ఎవరు? కనులు కర్మ చేసేవి, ఆత్మ కర్మ చేయించేది. కనుక చేయించే ఆత్మ, చేసే కర్మేంద్రియానికి వశమవ్వడము - దీనిని కర్మ బంధనమని అంటారు. చేయించేవారిగా అయ్యి కర్మ చేయించండి - దీనిని కర్మ సంబంధములోకి రావడమని అంటారు. కర్మాతీత ఆత్మ సంబంధములోకి వస్తుంది కానీ బంధనములో ఉండదు. అప్పుడప్పుడు, అలా అనాలని అనుకోలేదు కాని అనేసాను, చేయాలని అనుకోలేదు కాని చేసేసాను అని అంటారు కదా. ఇటువంటివారిని కర్మ బంధనానికి వశీభూతమైన ఆత్మ అని అంటారు. ఇటువంటి ఆత్మను కర్మాతీత స్థితికి సమీపంగా ఉన్నారని అంటారా లేక దూరంగా ఉన్నారని అంటారా?

కర్మాతీతము అనగా దేహము, దేహ సంబంధాలు, పదార్థాలు, లౌకికమైనా లేక అలౌకికమైనా, ఈ రెండు సంబంధాల నుండి, బంధనము నుండి అతీతము అనగా భిన్నము. అనటానికి సంబంధము అనే మాట అంటారు - దేహ సంబంధము, దేహ సంబంధీకుల సంబంధము, కానీ ఒకవేళ దేహము మరియు సంబంధాలలో ఆధీనత ఉన్నట్లయితే, సంబంధము కూడా బంధనంగా అవుతుంది. సంబంధము అనే పదము అతీతమైన మరియు ప్రియమైన అనుభూతిని కలిగించేది. ఈ రోజుల్లో సర్వాత్మల సంబంధము, బంధనము రూపంలోకి మారిపోయింది. ఎక్కడైతే సంబంధము, బంధనము రూపంగా అవుతుందో, అక్కడ ఆ బంధనము స్వయాన్ని సదా ఏదో ఒక రకంగా ఆందోళన పరుస్తుంది, దుఃఖపు అలను అనుభవం చేయిస్తుంది, ఉదాసీనతను అనుభవం చేయిస్తుంది. వినాశీ ప్రాప్తులు ఉన్నప్పటికీ, వారు ఆ ప్రాప్తుల సుఖాన్ని అల్పకాలికముగా అనుభవం చేస్తారు. సుఖముతో పాటు, ఇప్పుడిప్పుడే ప్రాప్తి స్వరూపం అనుభవమవుతుంది, ఇప్పుడిప్పుడే ప్రాప్తులు ఉన్నా సరే, అప్రాప్త స్థితి అనుభవమవుతుంది. నిండుగా ఉన్నా సరే, స్వయాన్ని ఖాళీ ఖాళీగా అనుభవం చేస్తారు. అన్నీ ఉన్నా కానీ, ‘ఇంకా ఏదో కావాలి’ అన్నట్లుగా అనుభవం చేస్తూ ఉంటారు మరియు ఎక్కడైతే ‘కావాలి, కావాలి’ అనేది ఉంటుందో, అక్కడ ఎప్పుడూ కూడా సంతుష్టత ఉండదు. మనసు కూడా రాజీగా, తనువు కూడా రాజీగా, ఇతరులు కూడా రాజీగా ఉండడమనేది సదా జరగదు. అనుకోకపోయినా కూడా ఏదో ఒక విషయంలో, స్వయం పట్ల గాని, ఇతరుల పట్ల గాని, నారాజ్ (అసంతుష్టం) అవుతూ ఉంటారు, నారాజ్ అనగా నా రాజ్ అనగా రహస్యాన్ని అర్థం చేసుకోలేదు. అధికారిగా అయ్యి కర్మేంద్రియాలతో కర్మలు చేయించే రహస్యాన్ని అర్థం చేసుకోలేదు. కనుక అసంతుష్టులుగానే ఉంటారు కదా. కర్మాతీతులు ఎప్పుడూ అసంతుష్టముగా అవ్వరు ఎందుకంటే వారికి కర్మ-సంబంధము మరియు కర్మ-బంధనాల రహస్యము తెలుసు. కర్మ చేయండి కాని వశీభూతులై కాదు, అధికారిగా, యజమానిగా అయ్యి చేయండి. కర్మాతీతులు అనగా తమ వెనుకటి కర్మల లెక్కాచారపు బంధనము నుండి కూడా ముక్తులు. ఒకవేళ వెనుకటి కర్మల లెక్కాచారము ఫలస్వరూపంగా తనువు రోగగ్రస్తమైనా గానీ, మనసు యొక్క సంస్కారము ఇతర ఆత్మల సంస్కారాలతో ఘర్షణ పడుతున్నా గానీ, కర్మాతీతులు, కర్మభోగానికి వశమవ్వకుండా, యజమానులుగా అయ్యి ఆ లెక్కను సమాప్తము చేయిస్తారు. కర్మయోగిగా అయ్యి కర్మభోగాన్ని సమాప్తము చేసుకోవడము - ఇది కర్మాతీతులుగా అయ్యే గుర్తు. యోగముతో కర్మభోగాన్ని, చిరునవ్వుతో బల్లెము నుండి ముల్లుగా చేసి భస్మం చేయాలి అనగా కర్మభోగాన్ని సమాప్తము చేయాలి. వ్యాధి రూపంగా అవ్వకూడదు. వ్యాధి రూపంగా అయితే, వారు స్వయం సదా వ్యాధి గురించే వర్ణిస్తూ ఉంటారు. మనసులో కూడా వర్ణన చేస్తారు, నోటితో కూడా వర్ణన చేస్తారు. రెండవది - వ్యాధి రూపంలో ఉన్న కారణంగా స్వయం కూడా ఆందోళన పడతారు మరియు ఇతరులను కూడా అందోళన పరుస్తారు. ఇటువంటివారు మొరపెట్టుకుంటూ ఉంటారు మరియు కర్మాతీతులు నడిపించేస్తారు. కొందరు కొంచెము నొప్పి ఉన్నా కానీ చాలా అరుస్తారు మరియు కొందరు ఎక్కువ నొప్పి ఉన్నా కానీ నడిపించేస్తారు. కర్మాతీత స్థితి కలవారు దేహానికి యజమానులుగా ఉన్న కారణంగా కర్మభోగము ఉన్నా కానీ అతీతంగా అయ్యే అభ్యాసం ఉన్నవారిగా ఉంటారు. మధ్య మధ్యలో అశరీరి స్థితి యొక్క అనుభవం వ్యాధి నుండి అతీతంగా చేస్తుంది. ఎలాగైతే సైన్సు సాధనాలతో స్పృహ లేకుండా చేసినప్పుడు, నొప్పి ఉన్నా కానీ దానిని మర్చిపోతారు, ఆ నొప్పి అనుభవమవ్వదు ఎందుకంటే మెడిసిన్ యొక్క మత్తు ఉంటుంది. అలా కర్మాతీత అవస్థ కలవారికి, అశరీరులుగా అయ్యే అభ్యాసం ఉన్న కారణంగా, మధ్య మధ్యలో ఈ ఆత్మిక ఇంజెక్షన్ వేయబడుతుంది. దీని వలన కర్మభోగము బల్లెము నుండి ముల్లుగా అనుభవమవుతుంది. ఇంకొక విషయమేమిటంటే - ఫాలో ఫాదర్ చేస్తున్న కారణంగా, విశేషంగా ఆజ్ఞాకారిగా అయినందుకు ప్రత్యక్షఫలంగా, తండ్రి నుండి విశేషంగా హృదయపూర్వక ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఒకటి, అశరీరిగా అయ్యే తమ అభ్యాసము, రెండవది - ఆజ్ఞాకారిగా అయినందుకు ప్రత్యక్షఫలంగా తండ్రి ఆశీర్వాదాలు - ఇవి వ్యాధిని అనగా కర్మభోగాన్ని బల్లెము నుండి ముల్లుగా చేస్తాయి. కర్మాతీత శ్రేష్ఠ ఆత్మ, కర్మభోగాన్ని కర్మయోగ స్థితిలోకి పరివర్తన చేస్తారు. మరి ఇటువంటి అనుభవముందా లేదా దానిని చాలా పెద్ద విషయంగా భావిస్తారా? సులభమా లేక కష్టమా? చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం లేక పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయడం - ఇది మీ స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆందోళన చెందడము లేదా తమ అధికారి స్థితి యొక్క గౌరవములో ఉండడము - ఇది మీ పై ఆధారపడి ఉంటుంది. ఏమైపోయింది అని అనుకోవడము లేక ఏదైతే జరిగిందో, మంచే జరిగింది అని అనుకోవడము - ఇది మీ పై ఆధారపడి ఉంటుంది. ఈ నిశ్చయము చెడును కూడా మంచిలోకి పరివర్తన చేయగలదు. ఎందుకంటే లెక్కాచారాలు సమాప్తమవుతున్న కారణంగా లేక ఎప్పటికప్పుడు డ్రామానుసారంగా ప్రాక్టికల్ పరీక్షలు వస్తున్న కారణంగా, కొన్ని విషయాలు మంచి రూపంలో ఎదురుగా వస్తాయి, మరియు ఎన్నో సార్లు మంచి రూపం ఉన్నవైనా కానీ బయటకు నష్టం కలిగించే రూపంలో ఉంటాయి లేక వాటిని మీరు, ఈ రూపంలో మంచిగా జరగలేదని అంటారు. విషయాలు వస్తాయి, ఇప్పటికీ కూడా ఇలాంటి రూపం కలిగిన విషయాలు వస్తూనే ఉన్నాయి, ఇకముందు కూడా వస్తూ ఉంటాయి. కానీ నష్టం అనే పరదా లోపల లాభం దాగి ఉంటుంది. బాహ్య పరదా నష్టం కలిగించేదిగా కనిపిస్తుంది, ఒకవేళ కొద్ది సమయం ఓర్పుతో, సహనశీల స్థితితో అంతర్ముఖులుగా అయి చూసినట్లయితే, బాహ్య పరదా లోపల ఏదైతే దాగి ఉందో, అదే మీకు కనిపిస్తుంది, బయటకు కనిపిస్తున్నదానిని చూస్తూ కూడా చూడరు. మీరు హోలీ హంసలు కదా? ఆ హంస రాళ్ళను మరియు రత్నాలను వేరు చేయగలిగినప్పుడు, హోలీ హంసలైన మీరు తమ దాగి ఉన్న లాభాన్ని తీసుకుంటారు, నష్టం మధ్యలో లాభాన్ని వెతుకుతారు. అర్థమయిందా? త్వరగా భయపడిపోతారు కదా. దాని వల్ల ఏమవుతుంది? ఏదైతే మంచిగా ఆలోచిస్తారో, అది కూడా భయపడిన కారణంగా మారిపోతుంది. కనుక భయపడకండి. కర్మను చూసి కర్మబంధనంలో చిక్కుకోకండి. ఏమయింది, ఎలా అయ్యింది, ఇలా అవ్వకూడదు కదా, నా వల్లే ఎందుకు జరుగుతుంది, బహుశా నా భాగ్యమే ఇలా ఉందేమో - ఈ తాళ్ళతో బంధించుకుంటూ వెళ్తారు. ఈ సంకల్పాలే తాళ్ళ వంటివి. అందుకే కర్మ యొక్క బంధనంలోకి వచ్చేస్తారు. వ్యర్థ సంకల్పాలే కర్మ బంధనము యొక్క సూక్ష్మమైన తాళ్ళు. కర్మాతీత ఆత్మలు - ఏది జరుగుతుందో అది మంచిది, నేను కూడా మంచి, బాబా కూడా మంచి, డ్రామా కూడా మంచిదే అని అంటారు. ఇది బంధనాలను కట్ చేసే కత్తెర వలె పని చేస్తుంది. బంధనాలు తెగిపోతే కర్మాతీతులుగా అయినట్లు కదా. కళ్యాణకారీ తండ్రికి పిల్లలైన కారణంగా సంగమయుగంలోని ప్రతి సెకండు కళ్యాణకారియే. ప్రతి సెకండు కళ్యాణం చేయడమే మీ వ్యాపారము, మీ సేవయే కళ్యాణం చేయడము. బ్రాహ్మణుల కర్తవ్యమే విశ్వపరివర్తకులుగా, విశ్వకళ్యాణకారులుగా ఉండడము. ఇలాంటి నిశ్చయబుద్ధి ఆత్మల కొరకు ప్రతి ఘడియ నిశ్చితంగా కళ్యాణకారియే. అర్థమయిందా?

ఇప్పుడైతే కర్మాతీతము యొక్క నిర్వచనము ఇంకా చాలా ఉంది. ఎలాగైతే కర్మల గతి లోతైనదో, అలా కర్మాతీత స్థితి యొక్క నిర్వచనము కూడా చాలా మహోన్నతమైనది, అంతేకాక కర్మాతీతంగా అవ్వటము తప్పనిసరి. కర్మాతీతంగా అవ్వకుండా కలిసి వెళ్ళలేరు. తోడుగా ఎవరు వెళ్తారు? సమానులుగా ఉన్నవారు వెళ్తారు. బ్రహ్మాబాబాను చూసారు, వారు కర్మాతీత స్థితిని ఎలా ప్రాప్తి చేసుకున్నారు. కర్మాతీతంగా అయ్యేందుకు ఫాలో చేయడం అనగా తోడుగా వెళ్ళేందుకు యోగ్యులుగా అవ్వడము. ఈ రోజు ఇంతే వినిపిస్తున్నాము, ఇంత చెకింగ్ చేసుకోండి, తర్వాత ఇంకా వినిపిస్తాము. అచ్ఛా.

సర్వ అధికారి స్థితిలో స్థితులై ఉండేవారు, కర్మ బంధనాన్ని కర్మ సంబంధములోకి మార్చేవారు, కర్మభోగాన్ని కర్మయోగ స్థితిలో బల్లెము నుండి ముల్లులా చేసేవారు, ప్రతి సెకండు కళ్యాణం చేసేవారు, సదా బ్రహ్మాబాబా సమానంగా కర్మాతీత స్థితికి సమీపంగా అనుభవం చేసేవారు - ఇటువంటి విశేష ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక

1. సదా స్వయాన్ని సమర్థుడైన తండ్రి యొక్క సమర్థులైన పిల్లలుగా అనుభవం చేస్తున్నారా? ఒక్కోసారి సమర్థంగా, ఒక్కోసారి బలహీనంగా - ఇలా అయితే లేరు కదా? సమర్థులు అనగా సదా విజయులు. సమర్థులు ఎప్పుడూ ఓడిపోరు. స్వప్నములో కూడా ఓడిపోరు. స్వప్నము, సంకల్పము మరియు కర్మ, అన్నింటిలోనూ సదా విజయులు - వీరినే సమర్థులని అంటారు. ఇటువంటి సమర్థులేనా? ఎందుకంటే ఎవరైతే ఇప్పటి విజయులో, వారే బహుకాలము విజయమాలలో గాయన యోగ్యులుగా, పూజన యోగ్యులుగా అవుతారు. ఒకవేళ బహుకాలపు విజయులుగా లేకపోతే, సమర్థులుగా లేకపోతే, బహుకాలపు గాయన యోగ్యులుగా, పూజన యోగ్యులుగా అవ్వలేరు. ఎవరైతే సదా మరియు బహుకాలపు విజయులో, వారే బహుకాలము విజయమాలలో, గాయనములోకి, పూజలోకి వస్తారు మరియు ఎవరైతే అప్పుడప్పుడు విజయులుగా అవుతారో, వారు అప్పుడప్పుడుకు చెందిన మాలలోకి అనగా 16 వేల మాలలోకి వస్తారు. కనుక బహుకాలపు లెక్క ఉంది మరియు సదా యొక్క లెక్క ఉంది. 16 వేల మాల అన్ని మందిరాలలోనూ ఉండదు, అక్కడక్కడా ఉంటుంది.

2. అందరూ స్వయాన్ని ఈ విశాలమైన డ్రామాలో హీరో పాత్రధారి ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? మీ అందరిదీ హీరో పాత్ర. హీరో పాత్రధారులుగా ఎందుకు అయ్యారు? ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన జీరో అయిన తండ్రి ఎవరైతే ఉన్నారో, వారితో పాటు పాత్రను అభినయించేవారు. మీరు కూడా జీరోలు అనగా బిందువులు కానీ మీరు శరీరధారులుగా అవుతారు మరియు తండ్రి సదా జీరోగా ఉంటారు. కనుక జీరోతో పాటు పాత్రను అభినయించే హీరో పాత్రధారులము - ఈ స్మృతి ఉన్నట్లయితే సదా యథార్థ పాత్రను అభినయిస్తారు, స్వతహాగానే అటెన్షన్ వెళ్తుంది. హద్దు డ్రామాలో హీరో పాత్రధారికి ఎంత అటెన్షన్ ఉంటుంది! అందరికంటే పెద్ద హీరో పాత్ర మీ అందరిదీ. ‘వాహ్ నా హీరో పాత్ర’ - సదా ఈ నషా మరియు ఖుషీలో ఉండండి. పూర్తి విశ్వంలోని ఆత్మలు పదే-పదే ‘హియర్ హియర్’ (వన్స్ మోర్, వన్స్ మోర్) అని అంటారు. ఈ సమయంలోని మీ హీరో పాత్రకు స్మృతిచిహ్నంగానే ద్వాపరం నుండి కీర్తన చేస్తారు. ఎంత మంచి స్మృతిచిహ్నము తయారై ఉంది! మీరు స్వయం హీరోలుగా అయ్యారు, అందుకే మీ వెనుక ఇప్పటివరకు మీ మహిమ జరుగుతూ ఉంది. అంతిమ జన్మలో కూడా మీ మహిమను వింటున్నారు. గోపీ వల్లభుని మహిమ కూడా ఉంది, గొల్ల బాలుని మహిమ కూడా ఉంది, గోపికల మహిమ కూడా ఉంది. తండ్రికి శివుని రూపంలో మహిమ ఉంటే, పిల్లలకు శక్తుల రూపంలో మహిమ ఉంది. కావున సదా హీరో పాత్రను అభినయించే శ్రేష్ఠ ఆత్మలము - ఈ స్మృతితో సంతోషంగా ముందుకు వెళ్తూ ఉండండి.

కుమారులతో - 1. సహజయోగీ కుమారులే కదా? నిరంతర యోగీ కుమారులు, కర్మయోగీ కుమారులు ఎందుకంటే కుమారులు స్వయాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటే, అంత ముందుకు వెళ్ళగలరు. ఎందుకు? వారు నిర్బంధనులు, భారము లేదు మరియు బాధ్యతలు లేవు, అందుకే తేలికగా ఉంటారు. తేలికగా ఉన్న కారణంగా ఎంత ఉన్నతంగా వెళ్ళాలనుకుంటే, అంత వెళ్ళగలరు. నిరంతర యోగీ, సహజయోగీ - ఇదే ఉన్నతమైన స్థితి, ఇదే పైకి వెళ్ళడము. ఇటువంటి ఉన్నతమైన స్థితి ఉన్నవారిని ‘విజయీ కుమారులు’ అని అంటారు. విజయులేనా లేక ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి గెలుపు - ఈ ఆటనైతే ఆడరు కదా? ఒకవేళ ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి గెలుపు యొక్క సంస్కారం ఉన్నట్లయితే, ఏకరస స్థితి అనుభవమవ్వదు. ఒక్కరి లగనములో నిమగ్నమై ఉండే అనుభవాన్ని చెయ్యరు.

2. సదా ప్రతి కర్మలోను కమాల్ (అద్భుతం) చేసే కుమారులే కదా? ఏ కర్మ కూడా సాధారణంగా ఉండకూడదు, అద్భుతమునకు చెందినదిగా ఉండాలి. ఎలాగైతే తండ్రిని మహిమ చేస్తారో, తండ్రి చేసే అద్భుతాలను మహిమ చేస్తారో, అలా కుమారులు అనగా ప్రతి కర్మలోనూ అద్భుతాన్ని చూపించేవారు. ఒకసారి ఒకలా, మరోసారి మరోలా ఉండేవారు కాదు. ఎవరు ఎటు లాగితే, అటు వెళ్ళిపోయేవారు కాదు. దొర్లిపోయే చెంబులు కారు. ఒకసారి ఒకచోటకు దొర్లిపోయేవారు, మరోసారి మరోచోటకు దొర్లిపోయేవారు కాదు. అద్భుతము చేసేవారిగా అవ్వండి. అవినాశీ అయినవారు, అవినాశీగా తయారుచేస్తారు - ఇటువంటి ఛాలెంజ్ చేసేవారిగా అవ్వండి. ఎలాంటి అద్భుతమును చేసి చూపించాలంటే, ప్రతి కుమార్ నడుస్తూ-తిరుగుతూ ఉన్న ఫరిస్తాలుగా ఉండాలి, దూరం నుండే ఫరిస్తా స్థితి యొక్క మెరుపు అనుభవమవ్వాలి. వాణి ద్వారా సేవ చేసే ప్రోగ్రాములనైతే చాలా తయారుచేసారు, వాటినైతే ఎలాగూ చేస్తారు కానీ ఈ రోజుల్లో ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరుకుంటారు. ప్రత్యక్ష ప్రమాణము అన్నింటికంటే శ్రేష్ఠమైన ప్రమాణము. ఇంతమంది ప్రత్యక్ష ప్రమాణము జరిగినట్లయితే సేవ సులభంగా జరుగుతుంది. ఫరిస్తాతనపు సేవ చేస్తే శ్రమ తక్కువ, సఫలత ఎక్కువగా ఉంటుంది. కేవలం వాణి ద్వారా సేవ చేయకండి, కానీ మనసు-వాణి మరియు కర్మలు, ఈ మూడు కలిపి సేవ జరగాలి - దీనినే అద్భుతము అని అంటారు. అచ్ఛా.

వీడ్కోలు సమయంలో - నలువైపుల కల తీవ్ర పురుషార్థీలు, సదా సేవాధారులు, సదా డబల్ లైట్ గా అయ్యి ఇతరులను కూడా డబల్ లైట్ గా చేసేవారు, సఫలతను అధికారముతో ప్రాప్తి చేసుకునేవారు, సదా బాబా సమానంగా ముందుకు వెళ్ళేవారు మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళేవారు, సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, స్నేహీ పిల్లలకు బాప్ దాదాల చాలా-చాలా ప్రేమపూర్వక ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.

Comments