18-03-2008 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
కారణం అనే మాటను నివారణగా పరివర్తన చేసుకుని మాస్టర్ ముక్తిదాత అవ్వండి, అందరికీ బాబా సాంగత్యం అనే రంగుని అంటించి సమానంగా అయ్యే హోలీ జరుపుకోండి.
ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్ దాదా నలువైపుల ఉన్న ఖజానాలతో సంపన్నులైన తన యొక్క పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఖజానాలో ఎన్ని ఖజానాలు జమ అయ్యాయి అనేది చూసి హర్షిస్తున్నారు. ఖజానాలు అయితే అందరికీ ఒకే సమయంలో ఒకని ద్వారా ఒకేవిధంగా లభించాయి అయినా కానీ పిల్లలందరి జమా ఖాతా వేర్వేరుగా ఉంది. ఎందుకంటే సమయప్రమాణంగా బాప్ దాదా పిల్లందరినీ సర్వ ఖజానాలతో సంపన్నులుగా చూడాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఖజానాలు ఇప్పటి ఈ ఒక్క జన్మ కొరకే కాదు, ఈ అవినాశి ఖజానాలు అనేక జన్మలు వెంట వచ్చేవి. ఈ సమయంలోని ఖజానాల గురించి పిల్లలందరికీ తెలిసే ఉంటుంది. ఇలా చెప్పటంతో బాప్ దాదా ఏమేమి ఖజానాలు ఇచ్చారో అవన్నీ ఎదురుగా వచ్చేసాయి. అందరి ఎదురుగా ఖజానాల జాబితా ప్రత్యక్షమైపోయింది కదా! ఎందుకంటే బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - ఖజానాలు అయితే లభించాయి, కానీ వాటిని జమ చేసుకునే విధి ఏమిటి? ఎవరు ఎంత నిమిత్తం మరియు నిర్మానంగా అవుతారో అంతగానే ఖజానాలు జమ అవుతాయి. కనుక పరిశీలించుకోండి - నిమిత్తం మరియు నిర్మాణంగా అయ్యే విధి ద్వారా మా ఖాతాలో ఎన్ని ఖజానాలు జమ అయ్యాయి? ఖజానాలు ఎంత జమ అవుతాయో, ఎంత నిండుగా ఉంటారో అంతగా వారి యొక్క నడవడిక మరియు ముఖం ద్వారా సంపన్న ఆత్మ అనే ఆత్మిక నషా స్వతహాగానే కనిపిస్తుంది. వారి ముఖంలో సడు ఆత్మక నషా మరియు గర్వం మెరుస్తూ ఉంటుంది. మరియు ఎంత ఆత్మిక గర్వం ఉంటుందో అంతగానే నిశ్చింతా చక్రవర్తిగా ఉంటారు. ఆత్మిక గర్వం అనగా ఆత్మిక నషా అనేది నిశ్చింతా చక్రవర్తికి గుర్తు. కనుక మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - నా నడివడిక మరియు ముఖంలో నిశ్చింతా చక్రవర్తి యొక్క నిశ్చయం మరియు నషా ఉన్నాయా? దర్పణం అయితే అందరికీ లభించింది కదా! హృదయం అనే దర్పణంలో మీ ముఖాన్ని పరిశీలించుకోండి. ఏ రకమైన చింత లేదు కదా! ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఇలా అవ్వదు కదా ...... ఇలా ఏ సంకల్పాలు మిగిలిపోలేదు కదా? నిశ్చింతా చక్రవర్తుల సంకల్పం ఎలా ఉంటుందంటే ఏదైతే జరుగుతుందో అది చాలా మంచిది మరియు జరగబోయేది ఇంకా మంచిగా జరుగుతుంది అనుకుంటారు. దీనినే ఆత్మిక గర్వం అంటే స్వమానధారి ఆత్మ అని అంటారు. వినాశి ధనం గలవారు ఎంత సంపాదిస్తారో అంత సమయ ప్రమాణంగా చింతలో ఉంటారు. కానీ మీ ఈశ్వరీయ ఖజానాల గురించి మీకు చింత ఉందా? నిశ్చింతులు కదా! ఎందుకంటే ఖజానాలకు యజమాని మరియు పరమాత్మ సంతానం అయిన వారు కలలో కూడా నిశ్చింతా చక్రవర్తులు. ఎందుకంటే ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మలోనే కాదు, అనేక జన్మలు వెంట ఉండేవి మరియు ఉంటాయి అనే నిశ్చయం వారికి ఉంటుంది. అందువలన వారు నిశ్చయబుద్దిగా, నిశ్చింతగా ఉంటారు. అయితే ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల యొక్క జమా ఖాతాను చూస్తున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పాను - విశేషంగా మూడు ఖాతాలను జమ చేసుకున్నారు మరియు చేసుకోగలరు. 1. మీ పురుషార్థం అనుసరించి ఖజానాలను జమ చేసుకోవటం 2. ఆశీర్వాదాల ఖాతా. ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునేటందుకు సదా సంబంధ సంపర్కాలు మరియు సేవలో ఉంటూ సంకల్పం, మాట మరియు కర్మలో స్వయంతో స్వయం కూడా సంతుష్టం మరియు సర్వులు కూడా సదా సంతుష్టం అవ్వాలి. సంతుష్టత ఆశీర్వాదాల ఖాతాను పెంచుతుంది. 3. పుణ్యఖాతా. పుణ్య ఖాతా జమ చేసుకునేటందుకు సాధనం - మనస్సుతో అయినా, వాణితో అయినా, కర్మతో అయినా, సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా సదా నిస్వార్థంగా మరియు బేహద్ వృత్తి, స్వభావం, భావం మరియు భావనతో సేవ చేయాలి. దీని ద్వారా పుణ్యఖాతా స్వతహాగానే జమ అయిపోతుంది. కనుక పరిశీలించుకోండి; పరిశీలించుకోవటం వస్తుంది కదా! వస్తుందా? రాని వారు చేతులెత్తండి! ఎవరూ లేరు అంటే అందరికీ వచ్చు. అయితే పరిశీలించుకున్నారా? స్వ పురుషార్ధం యొక్క ఖాతా, ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్య ఖాతా మూడూ ఎంత శాతంలో జమ అయ్యాయి? పరిశీలించుకున్నారా? పరిశీలించుకునేవారు చేతులెత్తండి. పరిశీలించుకుంటున్నారా? మొదటి వరుసలోని వారు చేసుకోవటం లేదా? పరిశీలించుకోవటం లేదా? ఏమంటారు? చేసుకుంటున్నారు కదా! ఎందుకంటే బాప్ దాదా చెప్పేశారు మరియు సైగ చేసేశారు - ఇప్పుడు సమయం యొక్క సమీపత తీవ్ర వేగంతో ముందుకి వెళ్తూ ఉంది. అందువలన మిమ్మల్ని మీరు మాటిమాటికీ పరిశీలించుకోవాలి. ఎందుకంటే బాప్ దాదా ప్రతి బిడ్డని రాజా బిడ్డగా, రాజయోగి నుండి రాజకుమారుడుగా చూడాలనుకుంటున్నారు. నా యొక్క ఒకొక్క బిడ్డ రాజా బిడ్డ అని పరమాత్మ తండ్రికి ఆత్మిక నషా ఉంది. పరమాత్మ పిల్లలు స్వరాజ్యాధికారి నుండి విశ్వరాజ్యాధికారులు. ఖజానాలు అయితే బాప్ దాదా ద్వారా లభిస్తూనే ఉంటాయి. ఈ ఖజానాలను జమ చేసుకునే అతి సహజ విధి, దీనిని విధి అనండి లేదా తాళంచెవి అనండి ఏదైనా కానీ ఆది ఏమిటో తెలుసు కదా! జమ చేసుకునే తాళంచెవి ఏమిటి? తెలుసా? మూడు బిందువులు. అందరి దగ్గర తాళంచెవి ఉంది కదా? మూడు బిందువులు పెట్టండి, ఖజానాలు జమ అవుతూ ఉంటాయి. మాతలకు తాళంచెవి ఉపయోగించటం వచ్చు కదా! తాళంచెవిని జాగ్రత్త చేయటంలో తెలివైనవారు కదా! అయితే మాతలందరూ ఈ మూడు బిందువుల తాళంచెవిని జాగ్రత్త చేసి ఉంచారా, ఉపయోగించారా? చెప్పండి మాతలూ, తాళంచెవి ఉందా? ఎవరి దగ్గర ఉందో వారు చేతులెత్తండి. మాతలు చేతులెత్తండి. తాళంచెవి దొంగిలించబడటం లేదు కదా? ఇంట్లో ప్రతి తాళంచెవిని దాచుకోవటం మాతలకు వచ్చు. ఈ తాళంచెవి కూడా సదా వెంట ఉంటుంది కదా?
వర్తమాన సమయంలో బాప్ దాదా కోరుకునేది ఏమిటంటే ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది కనుక పిల్లలందరిలో సంకల్పం, మాట మరియు ప్రత్యక్ష కర్మలో ఒక మాటను పరివర్తన చేసుకోవటం చూడాలని అనుకుంటున్నారు. ధైర్యం ఉందా? ప్రతి బిడ్డ యొక్క ఒక మాటను పరివర్తన చేయించాలి అని బాప్ దాదా అనుకుంటున్నారు. ఆ ఒక్క మాటయే మాటిమాటికి తీవ్ర పురుషార్ధి నుండి సోమరితన పురుషార్ధిగా తయారు చేసేస్తుంది. ఇప్పటి సమయంలో ఆ మాటే సోమరిగా చేస్తుంది. అది ఏమిటో తెలుసా? పరివర్తన చేసుకునేటందుకు తయారేనా? తయారేనా? చేతులెత్తండి, తయారేనా? మీ ఫోటో టి.వి.లో వస్తుంది, చూడండి. తయారుగా ఉన్నారు శుభాకాంక్షలు. తీవ్ర పురుషార్ధం ద్వారా పరివర్తన అవ్వాలే కానీ చేస్తాం, చూస్తాం అని అనరు కదా? ఆ ఒక్క మాట ఏమిటో తెలిసిపోయే ఉంటుంది. ఎందుకంటే అందరూ తెలివైనవారు. ఆ ఒక్క మాట ఏమిటంటే 1. కారణం అనే మాటను పరివర్తన చేసుకుని నివారణ అనే మాటను ఎదురుగా తీసుకురండి. కారణం ఎదురుగా రావటం ద్వారా, కారణం గురించి ఆలోచించటం ద్వారా అది నివారణ అవ్వటం లేదు. అందువలన బాప్ దాదా కేవలం చెప్పటం వరకే కాదు, సంకల్పంలో కూడా కారణం అనే మాటను నివారణలోకి పరివర్తన చేసుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకంటే కారణాలు రకరకాలుగా ఉంటాయి. మరియు కారణం అనే మాట ఆలోచించటంలో, మాట్లాడటంలో, కర్మలోకి రావటంలో తీవ్ర పురుషార్థానికి బంధన అయిపోతుంది. ఎందుకంటే బాప్ దాదాతో మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటంటే మేమందరం కూడా బాబా యొక్క విశ్వపరివర్తనా కార్యంలో సహయోగులం అని స్నేహంతో ప్రతిజ్ఞ చేశారు. మీరందరు బాబాకి సహయోగులు, బాబా ఒంటరిగా చేయలేరు. పిల్లలను వెంట తీసుకువస్తారు. విశ్వపరివర్తనా కార్యంలో మీ పని ఏమిటి? సర్వాత్మల కారణాలను నివారణ చేయటం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువమంది దు:ఖీ, అశాంతిగా ఉన్న కారణంగా అందరూ ముక్తి కావాలనుకుంటున్నారు. దు:ఖం, అశాంతితో మరియు సర్వ బంధనాల నుండి ముక్తిని కోరుకుంటున్నారు. మరి ముక్తిదాత ఎవరు? బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా ముక్తిదాత. మీ జడచిత్రాల ద్వారా ఈనాటి వరకు కూడా ఏమి అడుగుతారు? ఇప్పుడు దు:ఖం, అశాంతి పెరిగిపోవటం చూసి ఎక్కువమంది ఆత్మలు ముక్తిదాత ఆత్మలైన మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఓ ముక్తిదాతా! ముక్తినివ్వు అని దు:ఖంతో మనస్సుతో పిలుస్తున్నారు. ఆత్మలైన మీకు దు:ఖం అశాంతి యొక్క పిలుపు వినబడటం లేదా? కానీ ముక్తిదాతలై మొదట కారణం అనే మాటకు ముక్తినివ్వండి. అప్పుడు స్వతహాగానే ముక్తినివ్వమనే పిలుపు మీ చెవులలో మారుమ్రోగుతుంది. మొదట స్వయం ఈ మాట నుండి ముక్తులైతే ఇతరులకు కూడా ముక్తినివ్వగలరు. ఇప్పుడు రోజురోజుకీ మీ ముందు ముక్తి చాలు ముక్తినివ్వండి అనే వారి క్యూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా స్వయం యొక్క పురుషార్ధంలో భిన్న భిన్న కారణాలు అనే మాట కారణంగా ముక్తి ద్వారం మూసి ఉంది. అందువలన ఈ రోజు బాప్ దాదా ఈ మాటకి ముక్తినివ్వమని చెప్తున్నారు, దీనితో పాటు ఇతర బలహీన మాటలు కూడా వస్తున్నాయి. కారణం అనే మాట విశేషమైనది కానీ ఇతర బలహీనతలు కూడా ఉంటాయి, ఇలా, అలా, ఎలా ఇవన్నీ కూడా ఆ మాటకి తోడు, ద్వారం మూసి ఉండడానికి కారణం ఇవే.
ఈరోజు అందరూ హోలీ జరుపుకునేటందుకు వచ్చారు కదా. అందరూ పరుగు పరుగున వచ్చారు. స్నేహం అనే విమానం ఎక్కి వచ్చారు. బాబాతో స్నేహం ఉంది అందువలనే బాబాతో పాటు హోలీ జరుపుకోవడానికి వచ్చారు. వచ్చారు, శుభాకాంక్షలు. బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు చక్రాల కుర్చీలో కూర్చుని కూడా వచ్చారు, ఆరోగ్యం బాగా లేకున్నా కానీ ధైర్యంతో వచ్చేశారు. క్లాసుకి వచ్చేటప్పుడు, ఇతర కార్యక్రమాలకి వచ్చేటప్పుడు కూడా కుర్చీని నడిపించుకుంటూ పండాని పెట్టుకుని వచ్చేస్తున్నారు. ఈ దృశ్యం కూడా బాప్ దాదా చూశారు. దీనిని ఏమంటారు? పరమాత్మపై ప్రేమ అని అంటారు. ఇటువంటి ధైర్యవంతులు, మనస్ఫూర్వక స్నేహి పిల్లలకు బాప్ దాదా కూడా విశేషంగా చాలా చాలా మనస్ఫూర్వక ఆశీర్వాదాలు, మనస్పూర్వక ప్రేమను ఇస్తున్నారు. ధైర్యం పెట్టుకుని వచ్చారు కనుక బాబా మరియు పరివారం యొక్క సహాయం ఉండనే ఉంటుంది. అందరికీ మంచిగా స్థానం లభించిందా? చోటు దొరికిందా? మంచిగా చోటు దొరికిన వారు చేతులెత్తండి. విదేశీయులకి బాగా దొరికిందా? మేళా ఇది. ఆ మేళాలో అయితే భోజనంతో పాటు ఇసుక కూడా వస్తూ ఉంటుంది. మీకు అయితే మంచి బ్రహ్మాభోజనం దొరికింది, దొరుకుతుందా? చేతులు బాగా ఊపుతున్నారు. నిద్రపోవడానికి మూడు అడుగుల స్థలం దొరికింది. ఇటువంటి మిలనం మరలా 5000 సం||ల తర్వాత సంగమయుగంలోనే జరుగుతుంది. ఇంకెప్పుడూ జరగదు.
ఈరోజు బాప్ దాదా యొక్క సంకల్పం ఏమిటంటే పిల్లలందరి యొక్క జమాఖాతాను చూడాలని. చూశారు కూడా మరియు ఇక ముందు చూస్తారు కూడా ఎందుకంటే బాప్ దాదా పిల్లలకు ముందుగానే సూచన ఇచ్చారు - జమా ఖాతాను జమ చేసుకునే సమయం సంగమయుగమే. ఈ సంగమ యుగంలో ఇప్పుడు మీరు ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు. కల్పమంతటి ఖాతా ఇప్పుడు జమ చేసుకోగలరు. ఆ తర్వాత జమ చేసుకునే బ్యాంక్ మూసేస్తారు. అప్పుడు ఏమి చేస్తారు? బాప్ దాదాకి పిల్లలంటే ప్రేమ కదా! పిల్లలు సోమరితనంలో అప్పుడప్పుడు మర్చిపోతున్నారు, అయిపోతుంది. చూద్దాం, చేస్తున్నాం కదా, నడుస్తున్నాం కదా అంటున్నారు. మీరు చూడటం లేదు కానీ మేమయితే చేస్తున్నాం, నడుస్తున్నాం కదా ఇంకేమి చేయాలి అని చాలా మజాగా చెప్తున్నారు. కానీ నడవటం మరియు ఎగరటంలో ఎంత తేడా ఉంది? నడుస్తున్నారు దానికి శుభాకాంక్షలు కానీ ఇప్పుడు నడిచే సమయం సమాప్తి కావస్తుంది. ఇప్పుడు ఎగిరే సమయం. ఎగిరితేనే గమ్యానికి చేరుకో గలరు. సాధారణ ప్రజల్లోకి రావటం బావుంటుందా? భగవంతుని పిల్లలు సాధారణ ప్రజలు అయితే అందంగా ఉంటుందా? హోలీ అంటే జరిగి పోయిందేదో జరిగిపోయింది అనే అర్థం ఉంది కదా, హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా! అందువలన బాప్ దాదా చెప్తున్నారు జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఏ కారణంగానైనా ఏ బలహీనత అయినా ఉండిపోతే ఈ ఘడియే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించి మీ చిత్రాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి, మీకు మీరే చిత్రకారులై మీ చిత్రాన్ని గీయండి. ఇప్పుడు కూడా బాప్ దాదా అందరి యొక్క ఏ చిత్రాన్ని ఎదురుగా చూస్తున్నారో తెలుసా? ఏ చిత్రం చూస్తున్నారో తెలుసా? ఇప్పుడు మీరందరు కూడా మీ చిత్రాన్ని గీయండి. చిత్రం గీయటం వస్తుంది కదా! శ్రేష్ట సంకల్పం అనే కలంతో మీ చిత్రాన్ని ఇప్పుడిప్పుడే ఎదురుగా తెచ్చుకోండి. మొదట అందరూ వ్యాయామం చేయండి, మెదడుతో చేసే వ్యాయామం. కర్మేంద్రియాల వ్యాయామం కాదు, మనస్సు యొక్క వ్యాయామం చేయండి. తయారేనా, వ్యాయామం చేయడానికి తయారు! చేతులూపండి. అయితే చూడండి, అన్నింటికంటే శ్రేష్టాతి శ్రేష్ట చిత్రం ఏమిటంటే కిరీటం, సింహాసనం, తిలకధారిగా ఉన్న చిత్రం. అయితే ఇప్పుడు మీ యొక్క అటువంటి చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోండి. ఇతర సంకల్పాన్నింటినీ దూరం పెట్టండి. మీరందరు బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులు, సింహాసనం ఉంది కదా! ఇటువంటి సింహాసనం మరెక్కడా లభించదు. కనుక మొదట అనుకోండి - నేను విశేషాత్మను, స్వమానధారి ఆత్మను. బాప్ దాదా యొక్క మొదటి రచన అయిన శ్రేష్టాత్మను, బాప్ దాదా యొక్క హృదయసింహాసనాధికారిని. సింహాసనాధికారులు అయిపోయారా! దానితో పాటు నిశ్చింతా చక్రవర్తులు, చింతలన్నింటి భారాన్ని బాప్ దాదాకి అర్పణ చేసే డబల్ లైట్ కిరీటధారిని. కిరీటం, సింహాసనం, తిలకధారిగా పరమాత్మకు ప్రియమైన ఆత్మను. ఇటువంటి మీ చిత్రాన్ని తీసుకున్నారా! ఈ డబల్ లైట్ కిరీటాన్ని నడుస్తూ తిరుగుతూ కూడా ధారణ చేయవచ్చు. ఎప్పుడైనా కానీ మీ స్వమానాన్ని గుర్తు చేసుకోండి. కిరీటం, తిలకం, సింహాసనాధికారి ఆత్మను ఇలా మీ చిత్రాన్ని ధృఢ సంకల్పం ద్వారా ఎదురుగా తెచ్చుకోండి. గుర్తు ఉందా - మొట్టమొదట్లో మీరు మాటిమాటికి ఒక మాట యొక్క స్మృతిలో ఉండే అభ్యాసంలో ఉండేవారు, ఏ మాట ఏమిటంటే నేనెవరు? నేనెవరు అనే మాటను మాటిమాటికి స్మృతిలోకి తెచ్చుకోండి మరియు మీ యొక్క భిన్న భిన్న స్వమానాలు, భగవంతుని ద్వారా లభించిన టైటిల్స్ గుర్తు చేస్కోండి. ఈ రోజుల్లో ప్రజలకు అంటే మనుష్యులకు మనష్యుల ద్వారా టైటిల్స్ (బిరుదులు) లభిస్తేనే వాటిని ఎంత గొప్పగా భావిస్తారు కానీ పిల్లలైన మీకు బాబా ద్వారా ఎన్ని టైటిల్స్ లభించాయి? ఎన్ని స్వమానాలు లభించాయి? కనుక సదా స్వమానాల జాబితా మీ బుద్ది మననం చేసుకుంటూ ఉండండి. నేనెవరు? అనే జాబితా తీయండి. అదే నషాలో ఉండండి అప్పుడు కారణం అనే మాట మారుమైపోతుంది మరియు ప్రతి కర్మలో నివారణ కనిపిస్తుంది. ఇలా నివారణా స్వరూపంగా అయిపోయినప్పుడు సర్వాత్మలకు నిర్వాణధామానికి లేదా ముక్తిధామం వెళ్ళేటందుకు సహజ మార్గాన్ని చెప్పి ముక్తుల్ని చేస్తారు. ధృడ సంకల్పం చేయండి, ధృఢసంకల్పం చేయటం వస్తుందా? ధృడతయే సఫలతకు తాళంచెవి. ధృడ సంకల్పంలో కొద్దిగా కూడా బలహీనత రానివ్వకండి. ఎందుకంటే మిమ్మల్ని ఓడింపచేయటం మాయ పని కానీ మీ పని ఏమిటి? బాబా కంఠహారంగా అవ్వటం, మాయతో ఓడిపోకపోవటం మీ పని. కనుక అందరూ సంకల్పం చేయండి - నేను సదా బాబా యొక్క కంఠానికి ఉండే విజయీ మాలలోని మణిని, బాబా యొక్క కంఠహారాన్ని. బాబా కంఠహారం విజయీ హారం. మీరు ఏమి అవుతారు? అని బాప్ దాదా మీచే చేతులు ఎత్తిస్తే అందరూ ఒకే జవాబు చెప్తారు - మేము లక్ష్మీ నారాయణులం అవుతాం. సీతారాములు కాదు. అంటే లక్ష్మీ నారాయణులుగా తయారయ్యేవారు, బాప్ దాదా యొక్క విజయములలోని మణులు, పూజ్యాత్మలు. మాలలోని మణులైన మిమ్మల్ని జపిస్తూ జపిస్తూ జనులు తమ సమస్యలను సమాప్తి చేసుకుంటారు. అటువంటి శ్రేష్ట మణులు మీరు. అయితే ఈ రోజు బాప్ దాదాకి ఏమి ఇస్తారు? హోలీకి ఏదోక బహుమతి ఇస్తారు కదా! అయితే, అయితే, అని కారణాలు చెప్పేవారు తోతా (చిలుక)గా అయిపోతారు (తో, తో అనే వారు తోతా) ఇలా, అలా అని ఏ రకమైన కారణాలు చెప్పకూడదు. నివారణ అయిపోవాలి. అయితే ఈ రోజు సదా బాప్ దాదా యొక్క సాంగత్యంలో ఉండే, బాబాతో కంబైండ్ గా ఉండే హోలీ జరుపుకున్నారా? బాగా పక్కా సాంగత్యంలో ఉండటం అంటే కంబైండ్ రూపంలో ఉండటం. తోడుగా ఉన్న వారు కొంచెం ముందువెనుకలు అవ్వవచ్చు కానీ కంబైండ్ గా ఉన్నవారు సదా వెంటే ఉంటారు. కనుక హోలీ అనగా బాబా సాంగత్యం యొక్క రంగులో ఉండటం. బాబా రంగుని అంటించుకోవటం అంటే సమానంగా అవ్వటం. అయితే కంబైండ్ గానే ఉన్నారు కదా, లేక అప్పుడప్పుడా? కొంతమంది పిల్లలు పురుషార్ధం చేసి కొద్దిగా బలహీనం అయిపోతున్నారు అప్పుడు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారు. తమ వెంట ఎవరూ ఉండడాన్ని ఇష్టపడటం లేదు, ఒంటరిగా ఉండటం, ఒంటరిగా ఆలోచించటం, ఇలాంటి ఒంటరితనం కూడా సరైనది కాదు. మీరందరు ప్రభు పరివారం. ఇంతమంది ప్రభు పరివారం వెంట ఉంటే ఒంటరివారు ఎలా అవుతారు? ఇది మాయ యొక్క జిత్తులమారి తనం. మొదట ఒంటరిగా చేస్తుంది, ఆ తర్వాత యుద్ధం చేస్తుంది. మాలలో ఒక్క ముత్యమే ఉంటుందా! మాలలో ఉన్న విశేషత ఏమిటి? ఒక ముత్యానికి మరో ముత్యంతో సమీప సంబంధం ఉంటుంది. మధ్యలో ఎక్కడా కూడా దారం కనిపించదు. స్నేహిగా, సహయోగిగా, తోడుగా ఉన్నదానికి స్మృతిచిహ్నమే మాల. అయితే హోలీ జరుపుకున్నారా? బాబా సమానంగా అవ్వటం అంటే సాంగత్యం యొక్క రంగులోకి వచ్చేయటం. అందరి సంకల్పం ఏమిటి? సమానంగా అవ్వాలనే కదా! బాబాకి సంతోషంగా ఉంది, బాబా సమానంగా అవ్వాలని, శ్రేష్ట సంకల్పం చేస్తున్నందుకు బాప్ దాదా ప్రతి బిడ్డకి కోటానుకోట్ల, కోటానుకోట్ల రెట్లు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మా వంటి కోటానుకోట్ల కోటానుకోట్ల భాగ్యవంతులు ఎవరున్నారు? అనే నషా ఉంది కదా! ఇదే నషాలో ఉండండి. మొదటిసారిగా కలుసుకోవడానికి వచ్చినవారు చేతులెత్తండి! ధైర్యం పెట్టుకుని మొదటి సారిగా వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి బాప్ దాదా విశేషంగా ఈ సంఘటన యొక్క మజా జరుపుకునే శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు దానితో పాటు విశేషంగా అమరభవ! అనే విశేష వరదానాన్ని ఇస్తున్నారు. అమృతవేళ బాబాని కలుసుకున్న తర్వాత మరియు రోజంతటిలో ఈ వరదానాన్ని మాటిమాటికి గుర్తు పెట్టుకోండి. నేను అమరుడిని, అమరుడైన తండ్రి యొక్క సంతానాన్ని, అమర పదవిని ప్రాప్తింప చేసుకునే ఆత్మను అని అనుకోండి. జన్మ అయితే తీసుకుంటారు కానీ సుఖం, శాంతి అమరంగా ఉంటాయి. ఇప్పుడు ఒక్క సెకనులో బ్రాహ్మణులందరు మీ యొక్క రాజయోగాభ్యాసాన్ని చేస్తూ మనస్సుని ఏకాగ్రం చేసే యజమానులై మనస్సుని ఎక్కడ, ఎంత సమయం, ఏవిధంగా కావాలంటే ఆవిధంగా ఇప్పుడిప్పుడే ఏకాగ్రం చేయండి. మనస్సు అక్కడికి, ఇక్కడికి ఎక్కడికీ కూడా చంచలం అవ్వకూడదు. నా బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా ఇలా స్నేహం యొక్క సాంగత్యం యొక్క రంగులో ఆధ్యాత్మిక హోలీ జరుపుకోండి. (వ్యాయామం చేయించారు). మంచిది.
నలువైపుల ఉన్న శ్రేష్ట విశేష పవిత్ర మరియు ఉన్నత ఆత్మలకు, సదా స్వయాన్ని బాబా సమానంగా సర్వశక్తులతో సంపన్నంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసుకునేవారికి, సదా ప్రతి బలహీనత నుండి ముక్తులూ ఇతరాత్మలకు కూడా ముక్తినిచ్చే ముక్తిదాత పిల్లలకు, సదా స్వమానం యొక్క స్థితిలో స్థితులయ్యేవారికి, సదా అమరభవ అనే వరదానం యొక్క అనుభవం స్వరూపంలో ఉండేవారికి, నలువైపుల ఉన్నటువంటివారికి, ఎదురుగా కూర్చున్నవారికి, దూరంగా కూర్చుని కూడా స్నేహంలో లీనమైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు మనస్సు యొక్క కోటానుకోట్ల కోటానుకోట్ల రెట్లు ప్రియస్మృతులు స్వీకరించండి మరియు రాజయోగి నుండి రాజ్యాధికారులు అయ్యే పిల్లలకు నమస్తే.
Comments
Post a Comment