05-03-2008 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంగమయుగం యొక్క బ్యాంక్ లో శాంతిశక్తి మరియు శ్రేష్టకర్మను జమ చేసుకోండి, శివమంత్రం ద్వారా నాది అనే దానిని పరివర్తన చేసుకోండి.
ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లల స్నేహాన్ని చూస్తున్నారు. మీరందరు స్నేహమనే విమానంలో ఇక్కడకు చేరుకున్నారు. ఈ స్నేహమనే విమానం చాలా సహజంగా స్నేహి దగ్గరకు చేరుస్తుంది. బాప్ దాదా చూస్తున్నారు - ఈరోజు విశేషంగా లవలీన ఆత్మలందరు పరమాత్మ ప్రేమ అనే ఊయలలో ఊగుతున్నారు. బాప్ దాదా కూడా నలువైపుల ఉన్న పిల్లల స్నేహంలో ఇమిడి ఉన్నారు. ఈ పరమాత్మ స్నేహం బాబా సమానంగా అశరీరీగా సహజంగా తయారు చేస్తుంది. వ్యక్తభావానికి అతీతంగా అవ్యక్త స్థితిలో, అవ్యక్త స్వరూపంలో సహజంగా స్థితులు చేస్తుంది. బాబా కూడా ప్రతి బిడ్డను సమాన స్థితిలో చూసి హర్షిస్తున్నారు.
ఈరోజు పిల్లలందరు శివరాత్రి, శివజయంతి అంటే బాబా మరియు తమ పుట్టినరోజుని జరుపుకునేటందుకు వచ్చారు. బాప్ దాదాలు ఇద్దరు కూడా తమ,తమ వతనాల నుండి పిల్లల పుట్టినరోజు జరిపేటందుకు వచ్చారు. మొత్తం కల్పంలో బాబా మరియు మీ యొక్క ఈ పుట్టినరోజు అతీతమైనది మరియు చాలా ప్రియమైనది. మొత్తం కల్పంలో పరమాత్మ ఎవరి పుట్టినరోజు జరపరు, ఆత్మలు ఆత్మల పుట్టినరోజు జరుపుతారు కానీ ఈ అలౌకిక పుట్టినరోజు ఆత్మలైన మీకు స్వయం పరమాత్మ జరుపుతున్నారు మరియు ఈ జన్మ యొక్క విశేషత కూడా అలౌకికమైనది. ఇది మొత్తం కల్పంలో ఉండదు. తండ్రి మరియు పిల్లలకు ఒకే రోజు పుట్టినరోజు జరుగుతుంది అని ఎప్పుడు వినలేదు. తండ్రి మరియు పిల్లల పుట్టినరోజు ఒకటే అవ్వటం ఇదే ఈ జన్మదినం యొక్క గొప్పతనం. మీరందరు బాబాతో పాటు జరుపుకుంటున్నారు. ఈ జన్మదినాన్ని శివజయంతి అని కూడా అంటారు మరియు శివరాత్రి అని కూడా అంటారు. జన్మతో పాటు కర్తవ్యానికి కూడా స్మృతిచిహ్నం ఉంది. అంధకారం తొలగించి, ప్రకాశాన్ని ఇస్తున్న దానికి స్మృతిచిహ్నం తయారయ్యింది. ఇలా బాబాతో పాటు అలౌకిక జన్మదినం జరుపుకునే భాగ్యవాన్ ఆత్మలు కనుక బాబా పిల్లలకు ఈ దివ్యజన్మ యొక్క కోటానుకోట్ల శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు, ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు మరియు మనస్ఫూర్వక ప్రియస్మృతులు కూడా ఇస్తున్నారు. శుభాకాంక్షలు, కోటానుకోట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
భక్తులు కూడా ఈ ఉత్సవాన్ని చాలా భావనతో మరియు ప్రేమతో జరుపుకుంటారు. మీరు ఈ శ్రేష్టజన్మలో శ్రేష్ట అలౌకిక కర్మ చేసారు మరియు ఇప్పుడు కూడా చేస్తున్నారు. దానిని వారు స్మృతిచిహ్న రూపంలో అల్పకాలికంగా అల్పసమయం జరుపుకుంటున్నారు కానీ భక్తులది కూడా అద్భుతమే. స్మృతిచిహ్నం జరుపుకునేవారిని, స్మృతిచిహ్నం తయారుచేసేవారిని కూడా చూడండి ఎంత అద్భుతమో! కాపీ చేయటంలో కూడా తెలివైనవారు. ఎందుకంటే మీ భక్తులే కదా! మీ శ్రేష్టతకు ఫలం ఆ స్మృతిచిహ్నం తయారుచేసేవారికి కూడా వరదాన రూపంలో లభించింది. మీరు ఒక జన్మ కొరకు ఒకేసారి సంపూర్ణపవిత్రత యొక్క వత్రం తీసుకుంటున్నారు. అది వారు కాపీ చేసి ఒక రోజు కొరకు పవిత్రత యొక్క వ్రతం పెట్టుకుంటున్నారు. మీరు జన్మంతా పవిత్ర ఆహారం యొక్క వ్రతం పెట్టుకుంటున్నారు మరియు వారు ఒక రోజు పెట్టుకుంటున్నారు. ఈరోజు బాప్ దాదా అమృతవేళ చూసారు, మీ భక్తులు కూడా తక్కువేమీ కాదు. వారి విశేషత కూడా బావుంది. మీరు మొత్తం జన్మంతా పక్కా వ్రతం తీసుకున్నారు, ఆహారవ్యవహారాల వ్రతం, మనస్సులో సంకల్పాల వ్రతం, మాట, కర్మ, సంబంధ, సంపర్కాలలోకి వస్తూ కర్మలో మొత్తం జన్మంతా పవిత్రంగా ఉండేలా పక్కా వ్రతం తీసుకున్నారా? లేదా కొద్దికొద్దిగా తీసుకున్నారా? పవిత్రత అనేది బ్రాహ్మణ జీవితానికి ఆధారం. పూజ్యులుగా అయ్యేటందుకు ఆధారం. శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారం. భాగ్యవాన్ ఆత్మలు ఎవరైతే ఇక్కడకు వచ్చారో వారందరు పరిశీలించుకోండి - పవిత్రంగా అయ్యే ఈ జన్మ యొక్క ఉత్సవంలో నాలుగు వైపుల నుండి అంటే పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యవ్రతమే కాదు కానీ మనసా, వాచా, కర్మణా, సంబంధ, సంపర్కంలో కూడా పవిత్రత ఉండాలి. ఈ వ్రతం పక్కాగా తీసుకున్నారా? తీసుకున్నారా? ఎవరైతే పక్కాగా, కచ్చాగా కాదు అటువంటి వారు చేతులెత్తండి! పక్కాయేనా, పక్కాయేనా? పక్కాయేనా? ఎంత పక్కాగా ఉన్నారు? ఎవరైనా కదిలిస్తే కదిలిపోతారా? కదిలిపోతారా? కదలరా? అప్పుడప్పుడు మాయ వస్తుంది కదా లేదా మాయకు వీడ్కోలు ఇచ్చేసారా లేదా అప్పుడప్పుడు రావటానికి అవకాశం ఇస్తున్నారా! పక్కావ్రతం తీసుకున్నారా? అనేది పరిశీలించుకోండి. సదాకాలికంగా వ్రతం తీసుకున్నారా? లేదా అప్పుడప్పుడు ఉండేవిధంగా వ్రతం తీసుకున్నారా? అప్పుడప్పుడు కొద్దిగా, అప్పుడప్పుడు చాలా, అప్పుడప్పుడు పక్కాగా, అప్పుడప్పుడు కచ్చాగా ఇలా లేరు కదా! ఎందుకంటే బాప్ దాదాపై ప్రేమలో అయితే అందరు 100 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు అంగీకరిస్తున్నారు. ఒకవేళ బాప్ దాదా బాబాపై ఎంత ప్రేమ ఉంది? అని అడిగితే అందరు చాలా ఉత్సాహ, ఉల్లాసాలతో చేతులు ఎత్తుతున్నారు. ప్రేమలో శాతం చాలా మందిలో తక్కువ మందికే ఉంటుంది. ఎలా అయితే ప్రేమలో పాస్ అయ్యారో, చాలా మంది ప్రేమలో పాస్ అయ్యారు అని బాప్ దాదా కూడా అంగీకరిస్తున్నారు కానీ పవిత్రత వ్రతంలో నాలుగు రూపాలలో మనసా, వాచా, కర్మణా, సంబంధ, సంపర్కంలో సంపూర్ణపవిత్రత వ్రతం నిలుపుకోవటంలో శాతం వచ్చేస్తుంది. ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు, సమానంగా అయ్యే ప్రతిజ్ఞ చేసారు కదా! దానిలో ప్రతి పిల్లవాని ముఖంలో బాబా యొక్క మూర్తి కనిపించాలి. ప్రతి ఒకరి మాట బాబా సమానంగా ఉండాలి, బాప్ దాదా యొక్క మాట వరదానరూపంగా అవుతుంది. కనుక మీరందరు ఇది పరిశీలన చేసుకోండి, మా ముఖంలో బాప్ దాదా యొక్క మూర్తి కనిపిస్తుందా? బాబా యొక్క మూర్తి ఎలా ఉంటుంది? అన్ని విషయాలలో సంపన్నంగా ఉంటారు. ఇలా ప్రతి బిడ్డ యొక్క నయనాలు మరియు ప్రతి బిడ్డ యొక్క ముఖం బాబా సమానంగా ఉందా? సదా నవ్వుతూ ఉండే ముఖం ఉందా? అప్పుడప్పుడు ఆలోచనలో మునిగి ఉండేవారిగా, అప్పుడప్పుడు వ్యర్ధసంకల్పాల ఛాయలో ఉండేవారిగా, అప్పుడప్పుడు ఉదసీనంగా, అప్పుడప్పుడు శ్రమించేవారిగా ఇలాంటి ముఖం లేదు కదా? సదా గులాబీలా ఉండాలి. అప్పుడప్పుడు వికసించి ఉన్న గులాబీగా ఉన్న ముఖం, అప్పుడప్పుడు వేరేవిధంగా అయిపోకూడదు. ఎందుకంటే బాప్ దాదా జన్మ తీసుకోగానే చెప్పారు, మాయ మీ శ్రేష్టజీవితాన్ని ఎదుర్కుంటూ ఉంటుంది అని. కానీ మాయ పని రావటం, సదా పవిత్రత యొక్క వ్రతం తీసుకున్న ఆత్మల పని మాయను దూరం నుండే పారద్రోలడం. బాప్ దాదా చూసారు, కొంతమంది పిల్లలు మాయను దూరం నుండే పారద్రోలటం లేదు, మాయ వస్తుంది, మాయను రానిస్తున్నారు అంటే మాయా ప్రభువంలోకి వచ్చేస్తున్నారు. ఒకవేళ దూరం నుండే దానిని పారద్రోలకపోతే దానికి వచ్చే అలవాటు అయిపోతుంది. ఎందుకంటే అది నన్ను ఇక్కడ కూర్చోనిస్తారు అని తెలుసుకుంటుంది. మాయను కూర్చోపెట్టిన దానికి గుర్తు, మాయ వస్తుంది, మాయ వచ్చింది అని ఆలోచిస్తున్నారు కానీ మరలా ఏమి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు కొద్దిమందే సంపూర్ణంగా అయ్యారు, ఎవరూ సంపూర్ణంగా కాలేదు, ఇప్పుడు తయారవుతున్నాము, తయారైపోతాము ఇలా అంటూ ఉంటే మాయకు కూర్చునే అలవాటు అయిపోతుంది. ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్నారు, బాబా కూడా ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు ఇస్తున్నారు కానీ బాబా ప్రతి బిడ్డను, చివరి నెంబర్ బిడ్డను కూడా ఎలా చూడాలనుకుంటున్నారు? చివరి నెంబర్ అయినా కానీ బాబాకి ప్రియమైనవారు కదా! బాబా చివరి నెంబర్ బిడ్డను కూడా సదా గులాబీగా, వికసించిన గులాబీగా చూడాలనుకుంటున్నారు. వాడిపోయేవారిగా కాదు. వాడిపోవడానికి కారణం, కొద్దిగా సోమరితనం. అయిపోతుంది, చూస్తాము, చేసేస్తాము, చేరుకుంటాము .... ఈ భాష క్రిందికి తీసుకు వచ్చేస్తుంది. కనుక పరిశీలించుకోండి - ఎంత సమయం గడిచిపోయింది, ఇప్పుడు సమయం యొక్క సమీపత మరియు అకస్మాత్తుగా జరిగే వాటి గురించి బాప్ దాదా సైగ చేసేసారు, చేయటం కాదు, చేసేసారు. అటువంటి సమయానికి ఎవరెడీగా (తయారుగా) మరియు అలర్ట్ గా (సంసిద్ధంగా) ఉండాలి. అలర్ట్ గా ఉండేటందుకు పరిశీలించుకోండి - మా మనస్సు మరియు బుద్ది సదా స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉన్నాయా? స్వచ్చంగా కూడా ఉండాలి మరియు స్పష్టంగా కూడా ఉండాలి. సమయంపై విజయం పొందేటందుకు మనస్సులో, బుద్దిలో గ్రహణశక్తి మరియు ప్రేరణ పొందే శక్తి రెండు చాలా అవసరం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎక్కడో దూరంగా ఉన్నా కానీ స్వచ్చమైన మరియు స్పష్టమైన బుద్ధి ఉంటే బాబా యొక్క సైగ, సలహా, శ్రీమతం గ్రహించగలరు. ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ప్రేరణ వస్తుంది. అందువలనే బాప్ దాదా మొదటే చెప్పారు, వర్తమాన సమయంలో మీ వద్ద శాంతిశక్తిని ఎంతగా కావాలంటే అంతగా జమ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే అలా మీ మనస్సు, బుద్ధిని అదుపులో ఉంచుకోండి. స్వప్నంలో కూడా వ్యర్ధ సంకల్పాలు రాకూడదు, ఇలా మనస్సుని అదుపు చేసుకోండి. అందువలనే మనస్సుని జయించినవారే విశ్వాన్ని జయించగలరు అని అంటారు. ఎలా అయితే స్థూల కర్మేంద్రియం అయిన చేతిని ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత వరకు కావాలంటే అంతవరకు ఆజ్ఞతో నడిపించగలుగుతున్నారు కదా! అలాగే మనస్సు మరియు బుద్ధిని అదుపులో ఉంచుకునే శక్తి ఆత్మలో ప్రతి సమయం ప్రత్యక్షంగా ఉండాలి. యోగం సమయంలో మంచిగా అనుభవం అవ్వటం మరలా కర్మ చేసే సమయంలో, వ్యవహారం చేసే సమయంలో, సంబంధంలోకి వచ్చిన సమయంలో అనుభవం తక్కువ అవ్వకూడదు. పరీక్ష అనేది అకస్మాత్తుగా వస్తుంది. ఎందుకంటే అంతిమ ఫలితానికి ముందు కూడా మద్యమధ్యలో పరీక్షలు వస్తాయి.
ఈ పుట్టినరోజున విశేషంగా ఏమి చేస్తారు? శాంతిశక్తిని ఎంతగా కావాలంటే అంతగా అంటే ఒక సెకనులో మధురమైన శాంతి యొక్క అనుభూతిలో నిమగ్నమవ్వండి. ఎందుకంటే విజ్ఞానశక్తి మరియు శాంతిశక్తి. విజ్ఞానశక్తి కూడా అతిలోకి వెళ్ళిపోతుంది. విజ్ఞానంపై శాంతిశక్తి విజయం పొందుతుంది. శాంతిశక్తి ద్వారా దూరంగా కూర్చున్న ఏ ఆత్మకైనా సహయోగం ఇస్తున్నారు, శక్తిని కూడా ఇస్తున్నారు మరియు భ్రమించే మనస్సుని శాంతి చేస్తున్నారు. బ్రహ్మాబాబాను చూసారు కదా, ఎవరైనా అనన్యమైన పిల్లలు కొద్దిగా అలజడిగా ఉన్నా లేదా శారీరక కర్మలఖాతాతో ఉన్నా ఉదయమే లేచి ఆ పిల్లలకు శక్తినిచ్చేవారు మరియు వారు అనుభవం చేసుకునేవారు. అలాగే అంతిమంలో ఈ శాంతిసేవ యొక్క సహయోగం చేయవలసి ఉంటుంది. పరిస్థితులనుసారంగా ఇది చాలా ధ్యాసలో ఉంచుకోండి. శాంతిశక్తి మరియు మీ శ్రేష్ఠకర్మల యొక్క శక్తి జమ చేసుకునే బ్యాంక్ ఇప్పుడే తెరవబడుతుంది, ఇక ఏ జన్మలో జమ చేసుకునే బ్యాంక్ ఉండదు. ఒకవేళ ఇప్పుడు జమ చేసుకోకపోతే ఇక జమ చేసుకునే బ్యాంకే లేకపోతే దేనిలో జమ చేసుకుంటారు! అందువలనే జమాశక్తిని ఎంతగా సంపాదించుకోవాలనుకుంటున్నారో అంతగా సంపాదించుకోండి. ప్రజలు కూడా ఏది చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేయండి అంటున్నారు. ఏది ఆలోచించాలనుకుంటున్నారో అది ఇప్పుడే ఆలోచించండి. ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన ఆలోచన రూపంలోనే ఉండిపోతుంది కానీ ఎప్పుడైతే సమయం యొక్క సమీపత దగ్గరగా వస్తుందో అప్పుడు ఈ ఆలోచన పశ్చాత్తాప రూపంలో మారిపోతుంది. ఇది చేస్తున్నాను, ఇది చేయాలి...... అనే ఈ ఆలోచన ఉండదు, అది పశ్చాత్తాప రూపంలోకి మారిపోతుంది. అందువలన బాప్ దాదా ముందే సైగ చేస్తున్నారు. ఏది జరిగినా కానీ ఒక సెకనులో శాంతిలోకి వెళ్ళిపోండి. ఈ పురుషార్థం చేయటం లేదా! ఇప్పుడు జమ చేసుకునే పురుషార్ధం చేస్తున్నారా!
బాప్ దాదాకి పిల్లలపై స్నేహం ఉంది కనుక బాప్ దాదా ప్రతి బిడ్డను వెంట తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు. వెంట ఉంటాను, వెంట నడుస్తాను ...... ఈ ప్రతిజ్ఞ నిలుపుకునేటందుకు, సమానంగా అయినవారే వెంట వెళ్తారు. చెప్పాను కదా - డబల్ విదేశీయులకు చేతిలో చేయి వేసి నడవటం ఇష్టం కనుక శ్రీమతమనే చేతిలో చేయి ఉండాలి, బాబా యొక్క శ్రీమతమే మీ మతం; చేతిలో చేయి వేయటం అంటే ఇదే. మంచిది, ఈ రోజు పుట్టినరోజు పండుగ జరుపుకునేటందుకు వచ్చారు. నా పిల్లలు! అని బాప్ దాదాకి కూడా సంతోషంగా ఉంది, బాబాకి గర్వంగా కూడా ఉంది, నా పిల్లలు బుద్ధి సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు అని. ప్రతి రోజు ఉత్సవం జరుపుకుంటున్నారా లేదా విశేషమైన రోజుల్లోనే జరుపుకుంటున్నారా? సంగమయుగమే ఉత్సవం యొక్క యుగం. సంగమయుగంలా ఇక ఏ యుగాలు ఉండవు. మేము సమానంగా అవ్వవలసిందే అని అందరికీ ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నాయి కదా! ఉన్నాయా? తయారవ్వవలసిందే అంటారా లేదా చూస్తాము, తయారవుతాము, చేస్తాము అని అంటారా? ఎవరైతే తయారవ్వవలసిందే అనుకుంటున్నారో వారు చేతులెత్తండి! తయారవ్వవలసిందే, త్యాగం చేయవలసి ఉంటుంది, తపస్సు చేయవలసి ఉంటుంది. ఏది త్యాగం చేయవలసి వచ్చినా తయారేనా? అన్నింటికంటే ఉన్నతమైన త్యాగం ఏమిటి? త్యాగం చేయటంలో అన్నింటికంటే ముఖ్యంగా ఒక మాట విఘ్నం వేస్తుంది. త్యాగము, తపస్సు, వైరాగ్యము అంటే అనంతమైన వైరాగ్యం ఉండాలి. దీనిలో ఒకే మాట విఘ్నం వేస్తుంది, అది తెలుసు. ఆ ఒక మాట ఏమిటి? నేను, దేహాభిమానంతో కూడిన నేను అనే మాట. అందువలన బాప్ దాదా చెప్పారు, ఎప్పుడైనా నాది అనే మాట వస్తే ఏమి జ్ఞాపకం వస్తుంది? నా బాబా, నా బాబా అని వస్తుంది కదా! భలే మనవారు ఎవరైనా చేసినా కానీ మొదట నాది అనే మాట రాగానే బాబా అనే మాట రావటం అలవాటు అయిపోయింది కదా! ఎలా అయితే నా బాబా అనే మాట మర్చిపోవటం లేదో, ఎప్పుడైనా ఎవరైనా నావారు అని వచ్చినా బాబా అనే మాటే వస్తుంది. అలాగే నేను అనే మూట వచ్చినప్పుడు మొదట ఆత్మ జ్ఞాపకం రావాలి. నేనెవరు, ఆత్మ కదా! నేను మరియు నాది, ఈ మాటలు హద్దు నుండి బేహద్ గా అయిపోవాలి. అవుతాయా? అవుతాయా? భుజాలు కదపండి. నేను అనే మాట రాగానే వెంటనే ఆత్మ అని రావాలి ఇది అలవాటు చేసుకోండి. మరియు ఎప్పుడైతే నాది అనేది వస్తుందో అప్పుడు ఒక మాట జ్ఞాపకం రావాలి - చేయించేవారు ఎవరు? చేసి చేయించే బాబా చేయిస్తున్నారు. చేసే సమయంలో చేయించే బాబా స్మృతి సదా ఉండాలి. అప్పుడిక నాది అనేది రాదు. నా ఆలోచన, నా కర్తవ్యం, ఇలా కర్తవ్యం యొక్క నషా కూడా ఉంటుంది కదా! మీ కర్తవ్యమే... కానీ ఆ డ్యూటీ ఇచ్చిన దాత ఎవరు? ఈ బాధ్యతలు ప్రభువు ఇచ్చిన ప్రసాదం. ప్రభు ప్రసాదాన్ని నాది అనుకోవటం బావుంటుందా ఆలోచించండి?
ఇప్పుడిక బాప్ దాదా రావటానికి చివరిగా రెండు మిలనాలు ఉన్నాయి. ఇక ఒక నెల సీజన్ ఉందనుకోండి, ఈ సంవత్సరం యొక్క సీజన్ యొక్క అంతిమంలో బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారో తెలుసా? ఎవరెడిగా ఉన్నారా లేదా ఆలోచించాల్సి ఉంటుందా? మధువనానికి వచ్చినా లేదా రాకపోయినా కానీ ప్రతి స్థానం నుండి బాప్ దాదా ఫలితం రావాలని కోరుకుంటున్నారు. ఈ ఒక నెల స్వతహా సంస్కారంగా చేసుకోండి, ఎందుకంటే స్వతహాగా తయారైన సంస్కారం త్వరగా మారదు. స్వతహా సంస్కారం ఏమిటో చెప్పాను కదా! సదా మీ ముఖం ద్వారా బాబా యొక్క గుణాలు కనిపించాలి, నడవడికలో బాబా యొక్క శ్రీమతం కనిపించాలి, సదా నవ్వుతూ ఉండే ముఖం ఉండాలి, సదా సంతుష్టంగా ఉంటూ మరియు ఇతరులను సంతుష్ఠం చేసే వ్యవహారం ఉండాలి, ప్రతి కర్మలో, కర్మ మరియు యోగం యొక్క సమానత ఉండాలి. కొంతమంది పిల్లలు బాప్ దాదాకి చాలా మంచి, మంచి విషయాలు చెప్తున్నారు, ఏమి చెప్తున్నారో చెప్పమంటారా? బాబా అర్ధం చేసుకోండి, నా సంస్కారమే ఇది, ఇంకేమీ లేదు, నా సంస్కారమే అంత అంటున్నారు. ఇప్పుడిక బాబా ఏమంటారు? అది మీ సంస్కారమా? నా మాటే అంత, కొంతమంది అంటున్నారు - నాకు క్రోధం లేదు, నా మాటే కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం గట్టిగా మాట్లాడతాను అంతే, కోపం లేదు కానీ గట్టిగా మాట్లాడాను అంతే అంటున్నారు. ఇలా చాలా మధురాతి,మధుర విషయాలు చెప్తున్నారు. బాప్ దాదా చెప్తున్నారు, మీరు దేనినైతే నా సంస్కారం అంటున్నారో దానిని నాది అనటమే తప్పు. అది రావణుని సంస్కారమా లేదా మీ సంస్కారమా? మీ సంస్కారం అనేది అనాది, ఆది, పూజ్య కాలంలో ఉండే స్వతహా సంస్కారం. రావణుని వస్తువుని నాది, నాది అంటున్నారు కదా. అందువలనే అది వెళ్ళటం లేదు. పరాయి వస్తువుని మీదిగా చేసుకుని ఉంచుకున్నారు కదా, ఎవరైనా పరాయి వస్తువుని తమ దగ్గర జాగ్రత్త చేయటం, దాచి ఉంచటం చేస్తే బావుంటుందా? మరి రావణుని సంస్కారాన్ని, పరాయి సంస్కారాన్ని నాది అని ఎందుకు అంటున్నారు? చాలా నషాతో నా దోషమేమీ లేదు, నా సంస్కారమే అంత అని చెప్తున్నారు. బాప్ దాదాని కూడా సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ సమాప్తి సమారోహం చేస్తారా? చేస్తారా? చేస్తారా? చూసుకోండి, హృదయపూర్వకంగా చెప్పండి, మనస్సుతో చేయండి, ఎక్కడ మనస్సు ఉంటుందో అక్కడ అన్నీ జరుగుతాయి. ఇది నా సంస్కారం కాదు అని మనస్సుతో అంగీకరించండి. అది ఇతరుల వస్తువు, అది ఉంచుకోకూడదు. మీరు మరజీవ అయిపోయారు కదా? మీది బ్రాహ్మణ సంస్కారమా లేదా పాత సంస్కారమా? బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారో అర్ధమైందా? భలే మనోరంజసం చేసుకోండి, నాట్యం చేయండి, ఆడుకోండి.....కానీ, అన్నీ చేస్తూ కూడా బాబా సమానంగా అవ్వవలసిందే. సమానంగా అవ్వకుండా బాబా వెంట ఎలా వెళ్తారు! కస్టమ్ లో, ధర్మరాజుపురిలో ఆగవలసి ఉంటుంది, వెంట వెళ్ళలేరు. దాదీలు చెప్పండి, ఒక నెల ఫలితం చూస్తారా! చూస్తారా? చూస్తారా చెప్పండి? చూస్తారా? ఒక నెల ధ్యాస పెట్టుకుంటారు. ఒక నెల ధ్యాస పెట్టుకుంటే అది స్వతహా సంస్కారం అయిపోతుంది. నెలలో ఒక రోజు కూడా వదలకూడదు. దాదీలు మంచి బాధ్యత తీసుకుంటున్నారు. అందరు కలిసి ఒకరి పట్ల ఒకరు శుభభావన, శుభకామన యొక్క చేతిని ఇవ్వండి. ఎవరైనా పడిపోతే వారికి చేయి అందించి ప్రేమతో పైకి లేవదీస్తారు కదా! అలాగే శుభభావన మరియు శుభకామన అనే చేతిని ఒకరికొకరు సహయోగంగా ఇచ్చుకుని ముందుకు వెళ్తూ ఉండండి. బావుందా? మీరు తక్కువగా పరిశీలన చేసుకుంటున్నారు, అయిపోయిన తర్వాత పరిశీలన చేసుకుంటున్నారు. అంటే అది అయిపోయింది కదా! మొదట ఆలోచించండి, తర్వాత చేయండి. మొదట చేసి తర్వాత ఆలోచించడం కాదు. చేయాల్సిందే.
డబల్ విదేశీయులు ఏమనుకుంటున్నారు? చేస్తారా? చేస్తారా? డబల్ విదేశీయులు చేస్తారా? చాలా మంచిది. డబల్ విదేశీయులు కనుక ఉదాహరణగా అయితే బాప్ దాదా చాలా చాలా ఆశీర్వాదాల వర్షం కురిపిస్తారు. డబల్ విదేశీయులు ఏమి ఆలోచించారు? ఉదాహరణగా అవుతారా? అవుతాము అంటే రెండు చేతులు ఎత్తండి! అద్భుతం, బాప్ దాదా డబల్ విదేశీయులకు ఇప్పటినుండే ఉత్సాహ, ఉల్లాసాల యొక్క ఆశీర్వాదాలు ఇస్తున్నారు. భారతవాసీయులు కూడా తక్కువ కాదు. వారు కూడా లోలోపల ఆలోచించుకుంటున్నారు. చేసే చూపిస్తాము అని ఆలోచించుకుంటున్నారు. భారతవాసీయులు బావున్నారు కదా! చూడండి, భారతవాసీయులు ఏది చేయలేరు? భారతవాసీయులే బాబాను పై నుండి క్రిందికి తీసుకువచ్చారు. భారతవాసీయులు అద్భుతం చేసారు కదా! దాని ముందు ఇక గొప్ప విషయం ఏముంది! మంచిది, ఎవరైతే బాబాతో మరియు దాదీతో చాలా, చాలా ప్రేమ ఉంది అంటారో వారు చేతులెత్తండి? ప్రేమ ఉంది, మంచిది. ఎంత ప్రేమ ఉంది. ఇప్పుడు మీ అందరి మనస్సు ఏమి పాట పాడుతుంది? ఇంత ప్రేమ ఇచ్చేవారు ఎవరు? అని. ఎంతగా పిల్లలు బాబాని ప్రేమిస్తారో అంతగా బాబా పిల్లలను ప్రేమిస్తారు. ఇంత ప్రేమ ఎవరైనా ఇస్తారా! ప్రేమ ముందు ఈ వదలడం కూడా ఏమీ ఉండదు, ఇది పొందడం అంతేకానీ వదలడం కాదు. బాప్ దాదా శివమంత్రాన్ని ఉపయోగించి అందరినీ సంపన్నరూపంలో చూడాలనుకుంటున్నారు. మీ దగ్గర కూడా శివమంత్రం ఉంది కదా? ఛూ మంత్రం కాదు, శివమంత్రం. శివమంత్రాన్ని ఉపయోగించండి. మరలా ఒకసారి ఆలోచించి, అర్థం చేసుకుని మీ ప్లాన్ మీరే తయారుచేసుకోండి. తయారుచేసి ఇస్తే, ఇలా అయ్యింది, ఇలా అయ్యింది...... అని సాకులు చెప్తున్నారు. కనుక మీ ప్లాన్ మీరే తయారుచేసుకోండి. ఈరోజు బాబా యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్నారు కదా, పుట్టినరోజున ఏమి చేస్తారు? ఏదోక బహుమతి ఇస్తారు. ఇస్తారు కదా? బాబాకి ఏ బహుమతి ఇస్తారు? బాబా ఏది చెప్పారో అది చేసి చూపించడమే బాబాకి బహుమతి ఇవ్వటం. మరియు బాప్ దాదా కూడా మీ అందరికీ బహుమతి ఇస్తున్నారు. మీది కూడా పుట్టినరోజే కదా కనుక బాబా ఏమి బహుమతి ఇస్తున్నారు? ఏది కావాలంటే అది తీసుకుంటున్నారు ఇది పక్కాయే. విశేషంగా వరదానం తీసుకుంటున్నారు, కానీ ఆ వరదానం ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఆ వరదానాన్ని రోజూ అమృతవేళ రివైజ్ చేసుకోవాలి. బహుమతిని రివైజ్ చేసుకుంటారు కదా! బాప్ దాదా ఇదే బహుమతి ఇస్తున్నారు - ధైర్యమనే ఒక అడుగు ఎప్పుడు వదలకండి, బాబా వేల అడుగుల సహాయం ఇస్తారు. బాబా సహాయం చేస్తారా, లేదా చూస్తాము అని బాబాకి పరీక్ష పెట్టకండి. బాబా బంధించబడి ఉన్నారు. మీరు కూడా బంధించబడి ఉన్నారు, బాబా కూడా బంధించబడి ఉన్నారు. కనుక ఈ బహుమతిని రోజూ మాటిమాటికి చూసుకుంటూ ఉండాలి. ఎవరైనా గొప్ప బహుమతి ఇస్తే చాలా బావుంది, చాలా బావుంది అని దానిని మాటిమాటికి చూసుకుంటారు కదా! అలాగే రోజూ అమృతవేళ బాబా ఇచ్చిన బహుమతిని చూసుకోవాలి మరియు కర్మ చేస్తూ కర్మయోగి జీవితంలో కూడా మధ్యమధ్యలో రివైజ్ చేసుకోవాలి. మంచిది, బహుమతి తీసుకున్నారు, బహుమతి ఇచ్చారు. మంచిది.
బాప్ దాదా నలువైపుల పిల్లలను చూస్తున్నారు, అందరు తమ, తమ చిన్న గుడిసెలలో, స్క్రీన్లో చూస్తున్నారు, ఎదురుగా కనిపిస్తుంది. ఎవరైతే రాలేదో వారందరికీ బాప్ దాదా ఈ బహుమతి ఇస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు, అందరు పగలు అయినా, రాత్రి అయినా సమయం తేడా ఉంటుంది కానీ ప్రేమ అనేది అందరిచే జాగరణ చేయిస్తుంది. కార్డు పంపించినా, పంపించక పోయినా, ఈ మెయిల్ పంపించినా, పంపించకపోయినా కానీ అందరి మనస్సు యొక్క సంకల్పం బాప్ దాదా దగ్గరికి చేరుకుంది. ఉత్సాహంలో నాట్యం చేయటం కూడా బాప్ దాదా చూస్తున్నారు. ఎవరు, ఎక్కడ ఉన్నా మీ ప్రియస్మృతులు చేరకపోవటం అనేది లేదు. అందరి ప్రియస్మృతులు అందాయి మరియు తిరిగి బాప్ దాదా బదులుగా సదా ఉత్సాహ, ఉల్లాసాలతో ఉత్సవం జరుపుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. ఇప్పుడు బాప్ దాదా ఏ వ్యాయామం చేయించాలనుకుంటున్నారు? ఒక సెకనులో శాంతిశక్తి యొక్క స్వరూపంగా అయిపోండి. ఏకాగ్రబుద్ధి, ఏకాగ్ర మనస్సు ఉండాలి. మొత్తం రోజుంతటిలో మధ్యమధ్యలో సమయం తీసి ఈ అభ్యాసం చేయండి. శాంతి యొక్క సంకల్పం చేయగానే స్వరూపంగా అయిపోవాలి. దీని కొరకు సమయం అవసరం లేదు. ఒక సెకను శాంతి యొక్క అభ్యాసం చేయండి. మంచిది.
నలువైపుల ఉన్న జన్మదిన ఉత్సవాన్ని జరుపుకునే భాగ్యవాన్ ఆత్మలకు, సదా ఉత్సాహంలో ఉంటూ సంగమయుగం యొక్క ఉత్సవాన్ని జరుపుకునే వారికి, ఇలా ఉత్సాహ, ఉల్లాసాలనే రెక్కలతో ఎగిరే పిల్లలకు, సదా మనస్సు, బుద్ధిని ఏకాగ్రంగా అనుభవం చేసుకునే మహావీర్ పిల్లలకు, సదా సమానంగా అయ్యే ఉత్సాహాన్ని సాకారంలోకి తీసుకువచ్చి తండ్రిని అనుసరించే పిల్లలకు, సదా ఒకరికొకరు, స్నేహం, సహయోగం, ధైర్యం ఇచ్చుకుని, బాబా ద్వారా సహాయం యొక్క వరదానం ఇప్పించే వరదాని పిల్లలకు, మహాదాని పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు పదమ, పదమ, పదమ, పదమ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
Comments
Post a Comment