02-04-2008 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ఈ సంవత్సరం నాలుగు సబ్జక్టులలో అనుభవం యొక్క అధికారం గలవారిగా అవ్వండి, లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి.
ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న సంతుష్టంగా ఉండే తన యొక్క సంతుష్టమణులను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి ముఖంలో సంతుష్టత యొక్క మెరుపు కనిపిస్తుంది. సంతుష్టమణులు స్వయానికి కూడా ప్రియం, బాబాకి కూడా ప్రియం మరియు పరివారానికి కూడా ప్రియం. ఎందుకంటే సంతుష్టత అనేది మహాన్ శక్తి. సర్వప్రాప్తులు లభించినప్పుడే సంతుష్టత కూడా ధారణ అవుతుంది. ఒకవేళ ప్రాప్తులు తక్కువగా ఉంటే సంతుష్టత కూడా తక్కువగా ఉంటుంది. సంతుష్టత ఇతర శక్తులను కూడా ఆహ్వానిస్తుంది. సంతుష్టత యొక్క వాయుమండలం ఇతరులకు కూడా శక్తిననుసరించి సంతుష్టత యొక్క తరంగాలను ఇస్తుంది. సంతుష్టంగా ఉండే వారి గుర్తు - ప్రసన్నచిత్తంతో కనిపిస్తారు. సదా వారి ముఖం స్వతహాగానే హర్షితంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ ముందు ఏ పరిస్థితి స్వస్థితిని కదిలించలేదు. ఎంత పెద్ద పరిస్థితి అయినా కానీ సంతుష్ట ఆత్మకు కార్టూన్ షో (బొమ్మలాట) వలె మనోరంజనంగా కనిపిస్తుంది. అందువలన వారు పరిస్థితిలో అలజడి అవ్వరు మరియు పరిస్థితి వారిపై యుద్ధం చేయదు, ఓడిపోతుంది. అందువలన అతీంద్రియ సుఖమయ మనోరంజన జీవితాన్ని అనుభవం చేసుకుంటారు. శ్రమ చేయవలసిన పని లేదు. మనోరంజనంగా అనుభవం అవుతుంది. కనుక ప్రతి ఒక్కరు స్వయాన్ని పరిశీలన చేసుకోండి. పరిశీలించుకోవటం వస్తుంది కదా? వస్తుందా? ఎవరికైతే పరిశీలించుకోవటం వస్తుందో, ఇతరులను కాదు, స్వయాన్ని పరిశీలించుకోవటం వస్తుందో వారు చేతులెత్తండి, పరిశీలించుకోవటం వస్తుందా? మంచిది, శుభాకాంక్షలు. ప్రతి బిడ్డకు రోజూ అమృతవేళ బాప్ దాదా నుండి భిన్న భిన్న రూపాలలో వరదానం ఇదే లభిస్తుంది - సంతోషంగా ఉండండి, సంపన్నంగా ఉండండి. అందరికీ రోజు వరదానం లభిస్తుంది, బాప్ దాదా అందరికీ ఒకే విధంగా, ఒకేసారి వరదానాన్ని ఇస్తారు. కానీ తేడా ఏమి వస్తుంది? నెంబర్ వారీగా ఎందుకు తయారవుతున్నారు? దాత ఒక్కరే మరియు ఇచ్చింది కూడా ఒకే విధంగా, కొంతమందికి తక్కువ, కొంతమందికి ఎక్కువ ఇవ్వటం లేదు, విశాలహృదయంతో ఇచ్చేస్తున్నారు కానీ ఏమి తేడా వస్తుంది? దీని అనుభవం అందరికీ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాప్ దాదా దగ్గరికి ఈ ధ్వని చేరుతుంది. ఆ ధ్వని ఏమిటో తెలుసు కదా? ఈ ధ్వని అప్పుడప్పుడు మరియు కొద్దికొద్దిగా ఇప్పటి వరకు వస్తుంది. బ్రాహ్మణాత్మల జీవిత నిఘంటువు నుండి ఈ రెండు మాటలు తొలగిపోవాలి అని బాప్ దాదా చెప్పారు. అవినాశి బాబా, అవినాశి ఖజానాలు, మీరందరు కూడా అవినాశి శ్రేష్టాత్మలు. ఏ మాట ఉండాలి? అప్పుడప్పుడు అనాలా లేదా సదా అనాలా? ప్రతి ఖజానా ముందు సర్వ అనే మాటను పరిశీలన చేసుకోండి - సర్వశక్తులు సదా ఉన్నాయా? సర్వగుణాలు సదా ఉన్నాయా? మీ భక్తులు మీ గుణాలు పాడేటప్పుడు ఏమంటారు? అప్పుడప్పుడు గుణదాతలు అని అంటారా? బాప్ దాదా ప్రతి వరదానంలో సదా అనే మాట చెప్పారు. సదా సర్వశక్తివంతులు అన్నారు. కానీ అప్పుడప్పుడు శక్తివంతులు, అప్పుడప్పుడు సర్వశక్తివంతులు అనలేదు. ప్రతి సమయం రెండు మాటలు మీరు కూడా అంటున్నారు, బాబా కూడా అంటున్నారు, సమానంగా అవ్వండి అని అన్నారు కానీ కొద్దికొద్దిగా సమానంగా అవ్వండి అని అనలేదు. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి అని అంటారు కానీ పిల్లలు అప్పుడప్పుడు ఏమి చేస్తున్నారు? బాప్ దాదా కూడా ఆట చూస్తూ ఉంటారు కదా! పిల్లల ఆట చూస్తూనే ఉంటారు. పిల్లలు ఏమి చేస్తున్నారు, కొద్దిమందే, అందరు కాదు. ఏవైతే వరదానాలు లభించాయో వాటన్నింటినీ ఆలోచించి, వర్ణన చేసి పుస్తకంలో నోట్ చేసుకుంటున్నారు, స్మృతి కూడా చేస్తున్నారు కానీ వరదాన రూపి బీజాన్ని ఫలీభూతం చేయటం లేదు. బీజం ద్వారా ఫలాన్ని పొందలేకపోతున్నారు. చాలా మంచి వరదానం అని కేవలం వర్ణన చేసి సంతోషిస్తున్నారు. వరదానం అనేది బీజం, ఆ బీజాన్ని ఎంతగా ఫలీభూతం చేసుకుంటారో అంత వృద్ధి పొందుతారు. ఫలీభూతం చేసుకునే రహస్యం ఏమిటి? సమయానికి కార్యంలో ఉపయోగించటం. కార్యంలో ఉపయోగించటం మర్చిపోతున్నారు, కేవలం పుస్తకాలలో చూసి చాలా మంచి వరదానం, చాలా మంచి వరదానం అని వర్ణన చేస్తున్నారు. బాప్ దాదా చాలా మంచి వరదానం ఇచ్చారు అంటున్నారు, కానీ ఎందుకు ఇచ్చారు? దానిని ఫలీభూతం చేసుకునేటందుకు ఇచ్చారు. బీజం ద్వారా ఫలం యొక్క విస్తారం లభిస్తుంది. వరదానాన్ని స్మరిస్తున్నారు. కానీ వరదాన స్వరూపంగా అవ్వటంలో నెంబర్ వారీగా అవుతున్నారు మరియు బాప్ దాదా ప్రతి ఒక్కరి భాగ్యం చూసి సంతోషిస్తూ ఉంటారు కానీ బాప్ దాదా మనస్సు యొక్క ఆశ ఏమిటో ఇంతకు ముందే చెప్పారు. మేము కారణాలను సమాప్తి చేసి సమాధాన స్వరూపంగా అవుతాము అని అందరు చేతులెత్తారు, గుర్తుందా! హోమ్ వర్క్ జ్ఞాపకం ఉందా? కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో లేదా ఉత్తరాల ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా ఫలితం వ్రాసారు కూడా! మంచిది, ధ్యాస పెట్టారు కానీ బాప్ దాదాకి ఇష్టమైన సదా అనే మాట ఉందా? ఎవరైతే వచ్చారో మీరందరు, విన్నా లేదా చదువుకున్నా కానీ ఒక నెల హోమ్ వర్క్ లో, ఒక నెల అయ్యింది అంతే, ఎక్కువ కూడా అవ్వలేదు, ఒక నెల ఆయితే లక్ష్యం పెట్టుకున్నారు.
ఒకరికొకరు వర్ణన కూడా చేసుకున్నారు కానీ ఎవరైతే ఒక నెల హోమ్ వర్క్ లో మంచి మార్కులు తీసుకునే వారిగా అయ్యారో వారు చేతులెత్తండి! ఎవరైతే పాస్ అయ్యారో వారు, మీరు పాస్ అయ్యారు, పాస్ విత్ ఆనర్ అయిన వారు, పాస్ విత్ ఆనర్ అయిన వారు నిల్చోండి! మాతలు కాదు, అక్కయ్యలలో, టీచర్స్ ఎవరు చేయి ఎత్తలేదు. ఎవరూ లేరు. మధువనం వారు ఉన్నారా? వీరి ఫలితం చాలా తక్కువ ఉంది. (చాలా కొద్దిమంది నిల్చున్నారు) మంచిది, సేవాకేంద్రాలలో కూడా ఉంటారు. శుభాకాంక్షలు, చప్పట్లు అయితే కొట్టండి. బాప్ దాదా నవ్వుకుంటున్నారు, బాప్ దాదాపై ఎవరికి ప్రేమ ఉంది? మరియు ఎంత ఉంది? అంటే ఏమి జవాబు ఇస్తారు? బాబా, ఎంత ప్రేమ ఉంది అంటే చెప్పలేనంత అని అంటారు. చాలా బాగా జవాబు చెప్తారు. బాప్ దాదా కూడా సంతోషపడతారు. కానీ ప్రేమకి రుజువు ఏమిటి? ఎవరితో ప్రేమ ఉంటుందో, ఈ రోజుల్లో ప్రపంచంలో అయితే దేహాభిమానం యొక్క ప్రేమ ఉన్నవారు తమ ప్రేమ కోసం ప్రాణాన్నే అర్పిస్తున్నారు. మరి పరమాత్మ ప్రేమ కోసం బాబా చెప్పింది చేయటంలో పిల్లలకు కష్టమెందుకు? పాటలు అయితే చాలా మంచిగా, బాగా పాడతారు. బాబా, మేము బలిహారం అయిపోయే దీపపు పురుగులం, దీపానికి బలి అయ్యేవారము అని పాడతారు. మరి ఈ కారణం అనే మాటను స్వాహా చేయలేరా? ఇప్పుడు ఈ సంవత్సరం యొక్క అంతిమ మిలనం వచ్చేసింది. తర్వాత సంవత్సరం ఏమౌతుందో అని బాబా మరియు మీరు చూస్తున్నారు, చూస్తారు కానీ సమయం యొక్క పిలుపు అని మీరు చెప్తున్నారు కదా! భక్తుల పిలుపు, సమయం యొక్క పిలుపు, దు:ఖీ ఆత్మల పిలుపు, మీ యొక్క స్నేహి, సహయోగి ఆత్మల పిలుపుని మీరే పూర్తి చేస్తారు కదా! మీ బిరుదు ఏమిటి? మీ కర్తవ్యం ఏమిటి? ఏ కర్తవ్యం కొరకు బ్రాహ్మణులుగా అయ్యారు? మీ బిరుదు - విశ్వ పరివర్తకులు. విశ్వపరివర్తన అనేది మీ కార్యం మరియు మీ తోడు ఎవరు? బాప్ దాదాతో పాటుగా ఈ కార్యానికి నిమిత్తం అయ్యారు. కనుక ఏమి చేయాలి? చేస్తారా అని చేతులు ఎత్తిస్తే ఇప్పుడు కూడా బాగా ఎత్తుతారు. లక్ష్యం పెట్టుకున్నారు, బాప్ దాదా చూసారు, మొత్తం ఈ సంవత్సరం యొక్క సీజన్ అంతటిలో అందరు సంకల్పం చేసారు కానీ సఫలతకు తాళంచెవి - దృఢత. చేయాల్సిందే అనుకోవడానికి బదులు అప్పుడప్పుడు చేస్తున్నారు, నడుస్తున్నాను, చేసేస్తాను అనే ఈ సంకల్పాలు ధృఢతను సాధారణం చేసేస్తున్నాయి. ధృఢతలో కారణం అనే మాట రానే రాదు, నివారణ అయిపోతుంది. కారణమనేది వస్తుంది కానీ పరిశీలన ఉన్న కారణంగా కారణం నివారణలోకి మారిపోతుంది.
బాప్ దాదా ఫలితాన్ని పరిశీలిస్తే ఏమి చూసారు? జ్ఞాని, యోగి, ధారణస్వరూపం, సేవాధారి. నాలుగు సబ్జక్టులలో ప్రతి ఒక్కరు శక్తిననుసరించి జ్ఞానిగా, యోగిగా అయ్యారు, ధారణ కూడా చేస్తున్నారు, సేవ కూడా చేస్తున్నారు. కానీ నాలుగు సబ్జక్టులలో అనుభవీ స్వరూపంగా అవ్వటంలో, అనుభవం యొక్క అధికారంలో లోపం కనిపిస్తుంది. అనుభవీ స్వరూపం, జ్ఞానస్వరూపంలో కూడా అనుభవీ స్వరూపం అంటే జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటారు. కనుక అనుభవీ మూర్తి అయిన ఆత్మలో నాలెడ్జ్ అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే తెలివి, జ్ఞానం యొక్క ప్రకాశం మరియు శక్తి ఉంటాయి, అనుభవీ స్వరూపం అంటే జ్ఞానీ ఆత్మ యొక్క ప్రతి కర్మలో లైట్ మరియు మైట్ స్వతహాగా ఉండాలి. జ్ఞాని అనగా జ్ఞానం తెలుసుకోవటం మరియు వర్ణించటంతో పాటు ప్రతి కర్మలో ఆ ప్రకాశం మరియు శక్తి ఉండాలి. అనుభవీ స్వరూపముతో ప్రతి కర్మ స్వతహాగా శ్రేష్టంగా మరియు సఫలం అవ్వాలి. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు ఎందుకంటే జ్ఞానం యొక్క అనుభవీ మూర్తులు కనుక. అనుభవం యొక్క అధికారం అన్ని అధికారాల కంటే శ్రేష్టమైనది. జ్ఞానాన్ని తెలుసుకోవటం మరియు జ్ఞానం యొక్క అనుభవీ స్వరూపం యొక్క అధికారంతో ప్రతి కర్మ చేయటంలో తేడా ఉంది. అయితే అనుభవీ స్వరూపులేనా? పరిశీలించుకోండి. నాలుగు సబ్జక్టులలో పరిశీలించుకోండి. నేను ఆత్మను సరే కానీ ఈ విషయం యొక్క అనుభవీ స్వరూపమై ప్రతి కర్మ చేస్తున్నారా? అనుభవం యొక్క అధికారం అనే ఆసనంపై ఆసీనులు అయితే శ్రేష్టకర్మ, సఫలతాస్వరూప కర్మ ఆ అధికారం ముందు స్వతహా సంస్కారంగా కనిపిస్తుంది. ఆలోచిస్తున్నారు కానీ అనుభవీ స్వరూపంగా అవ్వాలి, యోగయుక్త, రాజయుక్త సంస్కారం సహజ స్వభావం అయిపోవాలి. ధారణలో కూడా సర్వగుణాలు స్వతహాగానే ప్రతి కర్మలో కనిపించాలి. ఇలా సదా అనుభవీ స్వరూపంలో ఉండాలి, అనుభవమనే సీట్ పై సెట్ అవ్వటంపై ధ్యాస పెట్టుకోవాలి, ఇప్పుడు ఇది అవసరం. అనుభవమనే అధికారం యొక్క ఆసనం చాలా గొప్పది. అనుభవాన్ని మాయ కూడా తొలగించలేదు. ఎందుకంటే మాయా అధికారం కంటే అనుభవమనే అధికారం కోటానుకోట్లరెట్లు ఉన్నతమైనది. ఆలోచించటం వేరే విషయం, మననం చేయటం వేరే విషయం, అనుభవీ స్వరూపంగా అయ్యి నడవటం ఇప్పుడు అవసరం.
అయితే, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు? ఒక సబ్జక్టులో ఎక్కువమంది పాస్ అయిపోయినట్లు బాప్ దాదా చూశారు, అది ఏ సబ్జక్టు? సేవ అనే సబ్జక్టు. బాప్ దాదా దగ్గరకి నలువైపుల నుండి సేవ యొక్క రికార్డ్ చాలా మంచిగా వచ్చాయి మరియు సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలు ఈ సంవత్సరం యొక్క సేవా సమాచారాల కంటే చాలా ఎక్కువ ఉన్నట్లు కనిపించాయి. ప్రతి ఒక వర్గం వారు, ప్రతి జోన్ వారు రకరకాల రూపాలతో సేవలో సఫలత పొందారు. అందువలన బాప్ దాదా ప్రతి జోన్ వారికి, ప్రతి వర్గం వారికి కోటానుకోట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. శుభాకాంక్షలు. మంచి, మంచి ప్లాన్స్ కూడా తయారుచేసారు. కానీ ఇప్పుడు సమయానుసారం ఇది అకస్మాత్తు యొక్క సీజన్. మీరు చూసి ఉంటారు లేదా విని ఉంటారు, ఈ సంవత్సరంలో ఎంతమంది బ్రాహ్మణులు అకస్మాత్తుగా శరీరం వదిలేసారు! కనుక ఇప్పుడు అకస్మాత్తు అనే గంటలు తీవ్రం అవుతాయి. దాని ప్రకారంగా ఇప్పుడు ఈ సంవత్సరంలో నాలుగు సబ్జక్టులలో అనుభవీ స్వరూపంగా ఎంత వరకు అయ్యాను అనేది చూసుకోండి, ఎందుకంటే నాలుగు సబ్జక్టులలో మంచి మార్కులు కావాలి. ఒకవేళ ఒక సబ్జెక్టులో అయినా పాస్ మార్కులు కంటే తక్కువ వస్తే పాస్ విత్ ఆనర్ యొక్క మాలలో మణిగా, బాప్ దాదా యొక్క కంఠహారంగా ఎలా అవుతారు! ఏ రూపంగా ఓడిపోయినా కానీ బాబా యొక్క కంఠహారంగా అవ్వలేరు. ఇక్కడ చేతులెత్తిస్తే అందరు ఏమంటారు? లక్ష్మీ నారాయణులు అవుతాము అంటారు. లక్ష్మీ నారాయణులుగా అయినా లేదా లక్ష్మీనారాయణుల కుటుంబంలోని వారిగా అవ్వటం కూడా శ్రేష్టపదవియే. అందువలన బాప్ దాదా కేవలం ఒక మాట చెప్తున్నారు, ఇప్పుడు తీవ్రవేగంతో ఎగిరేకళలో ఎగురుతూ ఉండండి మరియు మీ ఎగిరేకళ యొక్క తరంగాల ద్వారా వాయుమండలంలో సహయోగం యొక్క వాయుమండలం వ్యాపింప చేయండి. ప్రకృతిని కూడా పరివర్తన చేసి తీరుతాం అని ప్రకృతి గురించి మీరు శపథం చేస్తారు కదా! శపథం చేసారు కదా? చేసారా శపథం? చేసారు. భుజాలు ఊపండి, చేతులు కాదు. మీ సహయోగి మనుష్యాత్మలను దు:ఖల, అశాంతి నుండి పరివర్తన చేయలేం? ఈ ప్రతిజ్ఞ ఒకటి చేసారు, మరియు బాప్ దాదాకి కూడా ప్రతిజ్ఞ చేసారు - మేమందరం ఇప్పుడు కూడా నీ కార్యంలో సహయోగులం, పరంధామంలో కూడా తోడుగా ఉంటాము మరియు రాజ్యంలో కూడా బ్రహ్మాబాబాతో పాటు ఉంటాము అని ప్రతిజ్ఞ చేసారు కదా! వెంట వెళ్తాము, వెంటే ఉంటాము మరియు ఇప్పుడు కూడా వెంటే ఉంటాము అని. కనుక బాబా యొక్క సైగ సమయానుసారం చూస్తున్నారు - అకస్మాత్తు మరియు ఎవరెడి. దాదీ శరీరం వదిలేస్తారు అని అనుకున్నారా? అకస్మాత్తు ఆటను చూసారు కదా! కనుక ఈ సంవత్సరం ఎవరెడీగా ఉండండి. బాబా మనస్సులోని ఆశలు పూర్తి చేసే ఆశాదీపాలుగా అవ్వాల్సిందే. బాబా యొక్క ఆశలు ఏమిటో తెలుసు కదా! అలా తయారవ్వాలా? తయారైపోతాం, చూస్తాం... అని అంటారా? తయారవ్వాల్సిందే అనేవారు చేతులెత్తండి! కెమెరాలో వచ్చేస్తుంది చూడండి. బాప్ దాదాని అయితే చాలా బాగా సంతోషం చేసేస్తారు. బాప్ దాదా కూడా పిల్లలు లేకుండా ఒంటరిగా వెళ్ళలేరు. బ్రహ్మాబాబా కూడా ముక్తి ద్వారాన్ని తెరిచేటందుకు పిల్లలైన మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎడ్వాన్స్ పార్టీ కూడా ఎదురు చూస్తున్నారు. మీరు తయారయ్యేవారు. మీరు ఎదురు చూసేవారు కాదు, తయారయ్యేవారు. కనుక ఈ సంవత్సరం లక్ష్యం పెట్టుకోండి - లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా ఉంచుకోవాలి. లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండి లక్షణాలలో బలహీనంగా ఉండకూడదు. లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉండాలి. సమానంగా అవ్వాలి అని మీ మనస్సు యొక్క ఆశ ఏదైతే ఉందో అది ఎప్పుడు పూర్తవుతుందంటే లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా ఉన్నప్పుడు. లక్ష్యం మరియు లక్షణాలలో ఇప్పుడు కొద్దికొద్దిగా తేడా వస్తుంది. ప్లాన్ అయితే చాలా బాగా తయారు చేస్తున్నారు, పరస్పరం ఆత్మిక సంభాషణ కూడా బాగా చేస్తున్నారు. ఒకరికొకరు ధ్యాస కూడా ఇప్పించుకుంటున్నారు. దృఢత మా జన్మసిద్ధ అధికారం అనే ఈ సంకల్పాన్ని అనుభవీ స్వరూపంలోకి తీసుకురండి. ఏదైతే చెప్తున్నానో దానిని అనుభవం చేసుకుంటున్నానా అని పరిశీలించుకోండి. మొదటి మాట - నేను ఆత్మను అని, దీనినే పరిశీలించుకోండి. ఆత్మ స్వరూపం యొక్క అనుభవం యొక్క అధికారినేనా అని. ఎందుకంటే అనుభవం యొక్క అధికారం నెంబర్ వన్.
(హాల్లో కొంచెం అలజడి జరిగింది) మీరందరు ఏ స్థితిలో ఉన్నారు? అలజడిలో ఉన్నారా? దాని గురించి ధ్యాస పెట్టవలసినవారు ధ్యాస పెడుతున్నారు, మీరు ఏమి చేయాలి? శుభ భావన యొక్క తరంగాలను వ్యాపింప చేయాలి. అయితే ఇలా ప్రతి విషయం ఎదురుగా తెచ్చుకోండి. ఆత్మ, పరమాత్మ, సృష్టిచక్రం అన్నింటిలో అనుభవీమూర్తిగా ఎంత వరకు అయ్యాను? మంచిది. ఏ పరిస్థితిలోనైనా స్వస్థితిలో ఉండగలుగుతున్నారా? మనస్సు యొక్క ఏకాగ్రత ఉండాలి. మంచిది. మూడు బిందువుల యొక్క స్మృతి స్వరూపం కాగలరా! కేవలం బిందువు అంతే. మంచిది.
బాబా ప్రేమలో లీనమై ఉండే నలువైపుల ఉన్న అతి ప్రియ ఆత్మలకు, సదా స్వమానధారి, స్వరాజ్యాధికారి విశేషాత్మలకు, ఉత్సాహ ఉల్లాసాలతో ఎగిరే నలువైపుల ఉన్న పిల్లలకు, మనస్సు యొక్క తరంగాల ద్వారా వాయుమండలాన్ని శాంతిగా, శ్రేష్టంగా తయారు చేసేవారికి, అందరికీ బాబా సందేశానిచ్చి దుఃఖం నుండి విడిపించి ముక్తి వారసత్వాన్ని ఇచ్చేవారికి, సదా ధృడత ద్వారా సఫలతను ప్రాప్తింప చేసుకునేవారికి, మనస్సుకి సమీపంగా ఉండే నలువైపుల పిల్లలకు మరియు ఎదురుగా వచ్చిన పిల్లలందరికీ, మనస్సుకి అతి ప్రియమైన పిల్లలందరికీ, మనస్పూర్వక ఆశీర్వాదాలు, ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment