18-11-1987 అవ్యక్త మురళి

                      18-11-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘సైలెన్స్ శక్తిని జమ చేసుకునేందుకు సాధనము - అంతర్ముఖి మరియు ఏకాంతవాసి స్థితి’’

ఈ రోజు సర్వశక్తివంతుడైన బాప్ దాదా తమ శక్తి సైన్యాన్ని చూస్తున్నారు. ఈ ఆత్మిక శక్తి సైన్యము విచిత్రమైన సైన్యము. పేరేమో ఆత్మిక సైన్యము కానీ విశేషంగా సైలెన్స్ శక్తి ఉంది, ఇది శాంతిని ఇచ్చే అహింసక సైన్యము. కనుక ఈ రోజు బాప్ దాదా శాంతిదేవులైన పిల్లలు ప్రతి ఒక్కరూ శాంతిశక్తిని ఎంతవరకు జమ చేసుకున్నారని చూస్తున్నారు. ఈ శాంతిశక్తి ఆత్మిక సైన్యము యొక్క విశేషమైన శస్త్రము. అందరూ శస్త్రధారులే కానీ నంబరువారుగా ఉన్నారు. శాంతిశక్తి పూర్తి విశ్వాన్ని అశాంతి నుండి శాంతిగా చేసేటువంటిది. కేవలం మనుష్యాత్మలను మాత్రమే కాక ప్రకృతిని కూడా పరివర్తన చేసేటువంటిది. శాంతిశక్తిని ఇప్పుడింకా లోతుగా తెలుసుకుని అనుభవం చేయాల్సి ఉంది. ఎంతగా ఈ శక్తిలో శక్తిశాలిగా అవుతారో, అంతగా శాంతి శక్తి యొక్క మహత్వాన్ని, మహానతను ఎక్కువగా అనుభవం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాణి శక్తి ద్వారా సేవా సాధనాల శక్తిని అనుభవం చేస్తున్నారు మరియు ఈ అనుభవం ద్వారా సఫలతను కూడా ప్రాప్తి చేసుకుంటున్నారు. కానీ వాణి శక్తి లేక స్థూలమైన సేవా సాధనాల కంటే సైలెన్స్ శక్తి అత్యంత శ్రేష్ఠమైనది. సైలెన్స్ శక్తి యొక్క సాధనాలు కూడా శ్రేష్ఠమైనవి. ఎలాగైతే వాణి సేవకు చిత్రాలు, ప్రొజెక్టర్, వీడియో మొదలైన సాధనాలను తయారు చేస్తారో, అలా శాంతి శక్తి యొక్క సాధనాలు - శుభ సంకల్పాలు, శుభ భావన మరియు నయనాల భాష. ఎలాగైతే నోటి భాష ద్వారా తండ్రి మరియు రచనల పరిచయాన్ని ఇస్తారో, అలా సైలెన్స్ శక్తి ఆధారంగా నయనాల భాషతో, నయనాల ద్వారా తండ్రిని అనుభవం చేయించవచ్చు. ఎలాగైతే ప్రొజెక్టర్ ద్వారా చిత్రాలను చూపిస్తారో, అలా మీ మస్తకం మధ్యలో మెరుస్తున్న మీ చిత్రాన్ని మరియు తండ్రి చిత్రాన్ని స్పష్టంగా చూపించవచ్చు. ఎలాగైతే వర్తమాన సమయంలో వాణి ద్వారా స్మృతియాత్రను అనుభవం చేయిస్తారో, అలా సైలెన్స్ శక్తితో, మీ ముఖము మీ ద్వారా రకరకాల స్మృతుల యొక్క స్థితులను స్వతహాగానే అనుభవం చేయిస్తుంది. అనుభవం చేసేవారికి, ఈ సమయంలో బీజరూప స్థితి అనుభవమవుతుందని లేక ఫరిస్తా రూపము అనుభవమవుతుందని సహజంగా అనిపిస్తుంది. మీ శక్తిశాలి ముఖము ద్వారా రకరకాల గుణాల అనుభవము స్వతహాగానే జరుగుతూ ఉంటుంది.

ఎలాగైతే వాణి ద్వారా ఆత్మలలో స్నేహం మరియు సహయోగం యొక్క భావనలను ఉత్పన్నం చేస్తారో, అలా మీరు శుభ భావన, స్నేహ భావనల స్థితిలో స్వయం స్థితులై ఉన్నట్లయితే, అప్పుడు మీ భావన ఎలా ఉంటుందో, వారిలో కూడా అలాంటి భావన ఉత్పన్నమవుతుంది. మీ శుభ భావన వారి భావనను ప్రజ్వలితం చేస్తుంది. ఎలాగైతే దీపము, దీపాన్ని వెలిగిస్తుందో, అలా మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో కూడా సర్వ శ్రేష్ఠ భావనను సహజంగానే ఉత్పన్నం చేయిస్తుంది. ఎలాగైతే ఇప్పుడు వాణి ద్వారా స్థూలమైన కార్యాలన్నింటినీ చేస్తూ ఉంటారో, అలా సైలెన్స్ శక్తి యొక్క శ్రేష్ఠ సాధనమైన శుభ సంకల్పాల శక్తి ద్వారా స్థూల కార్యాలను కూడా అంతే సహజంగా చేయగలరు మరియు చేయించగలరు. ఎలాగైతే సైన్స్ శక్తి యొక్క సాధనాలైన టెలిఫోన్, వైర్లెస్ ఉన్నాయో, అలా ఈ శుభ సంకల్పాలు సన్ముఖంలో మాట్లాడినట్లుగా లేక టెలిఫోన్, వైర్లెస్ ద్వారా కార్యాన్ని చేయిస్తున్నట్లుగా అనుభవం చేయిస్తాయి. సైలెన్స్ శక్తిలో ఇటువంటి విశేషతలున్నాయి. సైలెన్స్ శక్తి తక్కువైనదేమీ కాదు. కానీ ఇప్పుడు వాణి శక్తిని, స్థూల సాధనాలను ఎక్కువగా కార్యంలో ఉపయోగిస్తున్నారు కనుక అవి సహజంగా అనిపిస్తాయి. సైలెన్స్ శక్తి సాధనాలను ప్రయోగంలోకి తీసుకురాలేదు కనుక వీటి అనుభవం లేదు. అది సహజమనిపిస్తుంది, ఇది కష్టమనిపిస్తుంది. కానీ సమయం యొక్క పరివర్తన అనుసారంగా ఈ శాంతిశక్తి సాధనాలను ప్రయోగంలోకి తీసుకురావాల్సిందే, కనుక ఓ శాంతి దేవ శ్రేష్ఠ ఆత్మలారా! ఈ శాంతి శక్తిని అనుభవంలోకి తీసుకురండి. ఎలాగైతే వాణిని అభ్యాసం చేస్తూ-చేస్తూ, వాణి విషయంలో శక్తిశాలిగా అయిపోయారో, అలా శాంతిశక్తిని కూడా అభ్యాసం చేసేవారిగా అవుతూ ఉండండి. మున్ముందు వాణి మరియు స్థూల సాధనాల ద్వారా సేవ చేసేందుకు సమయం లభించదు. అటువంటి సమయంలో శాంతిశక్తి యొక్క సాధనాలు అవసరమవుతాయి, ఎందుకంటే ఏదైనా ఎంత మహాన్ శక్తిశాలిగా ఉంటుందో, అది అతి సూక్ష్మంగా ఉంటుంది. కనుక వాణి కంటే శుద్ధ సంకల్పాలు సూక్ష్మమైనవి కనుక సూక్ష్మమైన వాటి ప్రభావం శక్తిశాలిగా ఉంటుంది. ఇందులో ఇప్పుడు కూడా మీరు అనుభవీలుగా ఉన్నారు. ఎక్కడైనా వాణి ద్వారా ఏదైనా కార్యము సిద్ధించకపోతే, అప్పుడు వీరు మాటల ద్వారా అర్థం చేసుకోరు, శుభ భావనతో పరివర్తన అవుతారని అంటారు. ఎక్కడైతే వాణి కార్యాన్ని సఫలం చేయలేదో, అక్కడ సైలెన్స్ శక్తి యొక్క సాధనాలైన శుభ సంకల్పాలు, శుభ భావన మరియు నయనాల భాష ద్వారా, దయ మరియు స్నేహము యొక్క అనుభూతి అనేది కార్యాన్ని సిద్ధి చేస్తుంది. ఇప్పుడు కూడా ఎవరైనా వాగ్వివాదం చేసేవారు వస్తే, వారు వాణి ద్వారా ఇంకా ఎక్కువగా వాగ్వివాదంలోకి వచ్చేస్తారు. అటువంటివారిని స్మృతిలో కూర్చోబెట్టి సైలెన్స్ శక్తిని అనుభవం చేయిస్తారు కదా. ఒకవేళ ఒక్క సెకండు అయినా స్మృతి ద్వారా శాంతిని అనుభవం చేస్తే, వారంతటవారే తమ వాగ్వివాద బుద్ధిని సైలెన్స్ యొక్క అనుభూతి ముందు సరెండర్ చేసేస్తారు. కనుక ఈ సైలెన్స్ శక్తి యొక్క అనుభవాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఈ సైలెన్స్ శక్తి యొక్క అనుభూతి చాలా తక్కువగా ఉంది. సైలెన్స్ శక్తి యొక్క రసాన్ని ఇప్పటివరకు మెజారిటీ కేవలం దోసిలి అంత మాత్రమునే అనుభూతి చేశారు. ఓ శాంతి దేవా, మీ భక్తులు మీ జడచిత్రాల ద్వారా శాంతినే ఎక్కువగా వేడుకుంటారు ఎందుకంటే శాంతిలోనే సుఖము ఇమిడి ఉంది. వారది అల్పకాలానికి అనుభవం కూడా చేస్తారు. కనుక శాంతిశక్తి యొక్క అనుభవీ ఆత్మలు ఎంతమంది ఉన్నారు, వర్ణన చేసేవారు ఎంతమంది ఉన్నారు మరియు ప్రయోగం చేసేవారు ఎంతమంది ఉన్నారని బాప్ దాదా చూస్తున్నారు. దీని కొరకు - అంతర్ముఖులుగా మరియు ఏకాంతవాసులుగా అయ్యే ఆవశ్యకత ఉంది. బాహ్యముఖతలోకి రావడం సులభము కానీ ఇప్పడు సమయానుసారంగా అంతర్ముఖత యొక్క అభ్యాసం చాలా అవసరము. చాలామంది పిల్లలు - ఏకాంతవాసులుగా అయ్యేందుకు సమయం లభించదు, అంతర్ముఖి స్థితిని అనుభవం చేసేందుకు సమయం లభించదు ఎందుకంటే సేవా ప్రవృత్తి, వాణి శక్తి యొక్క ప్రవృత్తి చాలా పెరిగిపోయిందని అంటారు. కానీ దీని కోసం ఒకేసారి అర్ధగంట లేక గంట సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదు. సేవా ప్రవృత్తిలో ఉంటూ కూడా మధ్య మధ్యలో ఏకాంతవాసులుగా అయ్యే అనుభవాన్ని చేసేంత సమయం లభిస్తుంది.

ఏకాంతవాసి అనగా ఏదైనా ఒక శక్తిశాలి స్థితిలో స్థితులవ్వడము. కావాలంటే బీజరూప స్థితిలో స్థితులవ్వండి, కావాలంటే లైట్ హౌస్ - మైట్ హౌస్ స్థితిలో స్థితులవ్వండి అనగా విశ్వానికి లైట్-మైట్ ఇచ్చే అనుభూతిలో స్థితులవ్వండి. కావాలంటే ఫరిస్తాతనపు స్థితి ద్వారా ఇతరులకు కూడా అవ్యక్త స్థితిని అనుభవం చేయించండి. ఒకవేళ ఒక్క సెకండ్ లేక ఒక్క నిముషము కోసం ఈ స్థితిలో ఏకాగ్రతతో స్థితులైనట్లయితే, ఈ ఒక్క నిముషము యొక్క స్థితి స్వయానికి మరియు ఇతరులకు కూడా చాలా లాభాన్ని అందించగలదు. కేవలం ఈ అభ్యాసం అవసరము. ఇప్పుడిలా ఒక్క నిముషము కూడా తీరిక లభించని వారు ఎవరున్నారు? ఎలాగైతే మొదట్లో ట్రాఫిక్ కంట్రోల్ ప్రోగ్రామ్ తయారైనప్పుడు, చాలామంది, ఇదెలా సాధ్యమవుతుంది, సేవా ప్రవృత్తి చాలా పెరిగిపోయింది, బిజీగా ఉంటాము అని ఆలోచించేవారు. కానీ లక్ష్యము పెట్టుకున్నందుకు జరుగుతుంది కదా. ప్రోగ్రామ్ నడుస్తుంది కదా. సెంటర్లలో ఈ ట్రాఫిక్ కంట్రోల్ ప్రోగ్రామ్ ను నడిపిస్తున్నారా లేక అప్పుడప్పుడు మిస్ చేస్తూ అప్పుడప్పుడు నడిపిస్తున్నారా? ఇది బ్రాహ్మణ కులంలో ఒక పద్ధతి, ఒక నియమము. ఎలాగైతే ఇతర నియమాలు అవసరమని భావిస్తారో, అలా ఇది కూడా స్వఉన్నతి కొరకు లేక సేవలో సఫలత కొరకు, సేవాకేంద్రము యొక్క వాతావరణం కొరకు అవసరము. ఈ విధంగా అంతర్ముఖులుగా, ఏకాంతవాసులుగా అయ్యే అభ్యాసము యొక్క లక్ష్యాన్ని తీసుకొని మీ మనసు యొక్క తపనతో మధ్య మధ్యలో సమయాన్ని తీయండి. మహత్వాన్ని తెలుసుకున్నవారికి సమయం స్వతహాగానే లభిస్తుంది. మహత్వం లేదంటే సమయం కూడా లభించదు. ఒకే శక్తిశాలి స్థితిలో మీ మనసును, బుద్ధిని స్థితి చేయడమే ఏకాంతవాసులుగా అవ్వడము. ఉదాహరణకు సాకార బ్రహ్మాబాబాను చూసారు, సంపూర్ణత యొక్క సమీపతకు గుర్తు - వారు సేవలో ఉంటూ, సమాచారాన్ని వింటూ-వింటూ ఏకాంతవాసిగా అయిపోయేవారు. ఇది అనుభవం చేశారు కదా. ఒక గంట సమాచారాన్ని కూడా 5 నిముషాలలో సారాన్ని అర్థం చేసుకుని పిల్లలను కూడా సంతోషపరచారు, అంతేకాక తమ అంతర్ముఖి, ఏకాంతవాసి స్థితిని కూడా అనుభవం చేయించారు. సంపూర్ణతకు గుర్తు - అంతర్ముఖి, ఏకాంతవాసి స్థితిని నడుస్తూ, తిరుగుతూ, వింటూ, పనులు చేస్తూ అనుభవం చేశారు. మరి ఫాలో ఫాదర్ చేయలేరా? బ్రహ్మాబాబా కంటే ఎక్కువ బాధ్యతలు ఇంకెవరికైనా ఉన్నాయా? బ్రహ్మాబాబా, నేను చాలా బిజీగా ఉన్నానని ఎప్పుడూ అనలేదు. పిల్లల ముందు ఉదాహరణగా అయ్యారు. అలా, ఇప్పుడు సమయం అనుసారంగా ఈ అభ్యాసము యొక్క అవసరముంది. అన్ని సేవా సాధనాలు ఉన్నప్పటికీ సైలెన్స్ శక్తి ద్వారా చేసే సేవ యొక్క అవసరముంటుంది, ఎందుకంటే సైలెన్స్ శక్తి అనుభూతి చేయించే శక్తి. వాణి శక్తి యొక్క బాణము మహా అయితే బుద్ధి వరకు చేరుకుంటుంది, అనుభూతి యొక్క బాణము మనసు వరకు చేరుకుంటుంది. కనుక ఇప్పుడు సమయం అనుసారంగా, ఒక్క సెకండులో అనుభూతి చేయించండి అనే పిలుపే ఉంటుంది. వినడంతో, వినిపించడంతో అలసిపోయి వస్తారు. సైలెన్స్ శక్తి యొక్క సాధనాల ద్వారా దృష్టితో అతీతమైన అనుభూతిని కలిగిస్తారు. శుభ సంకల్పాలతో ఆత్మల వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేస్తారు. శుభ భావనతో బాబా వైపు స్నేహ భావనను ఉత్పన్నం చేయిస్తారు. ఈ విధంగా ఆ ఆత్మలను శాంతిశక్తితో సంతుష్టపరుస్తారు, అప్పుడు చైతన్య శాంతి దేవ ఆత్మలైన మీ ముందు ‘శాంతి దేవా, శాంతి దేవా’ అని అంటూ మహిమ చేస్తారు, మరియు ఈ అంతిమ సంస్కారాన్ని తీసుకువెళ్ళిన కారణంగా ద్వాపరయుగంలో భక్త ఆత్మలుగా అయి మీ జడచిత్రాలకు ఈ మహిమను చేస్తారు. ఈ ట్రాఫిక్ కంట్రోల్ మహత్వం కూడా ఎంత గొప్పది మరియు ఇది ఎంత అవసరము అనేది తర్వాత వినిపిస్తాము. కాని శాంతిశక్తి మహత్వాన్ని స్వయమూ తెలుసుకోండి మరియు సేవలోనూ ఉపయోగించండి. అర్థమయిందా?

ఈ రోజు పంజాబ్ వారు వచ్చారు కదా. పంజాబ్ లో సేవా మహత్వం కూడా సైలెన్స్ శక్తిదే. సైలెన్స్ శక్తితో హింసక వృత్తి వారిని అహింసకులుగా చేయవచ్చు. ఉదాహరణకు స్థాపన యొక్క ఆది సమయంలో, హింసక వృత్తి వారు ఆత్మిక శాంతిశక్తి ఎదురుగా పరివర్తనవ్వడం చూశారు కదా. కనుక హింసక వృత్తిని శాంతపరచేది శాంతిశక్తియే. వాణిని వినేందుకు ఏమాత్రం తయారుగా ఉండరు. ప్రకృతి శక్తితో వేడి లేక చలి యొక్క అలలు నలువైపులా వ్యాపించినప్పుడు, ప్రకృతిపతుల యొక్క శాంతి అలలు నలువైపులా వ్యాపించలేవా? సైన్స్ సాధనాలు కూడా వేడిని, చల్లని వాతావరణంలోకి పరివర్తన చేయగలిగినప్పుడు, ఆత్మిక శక్తి అనేది ఆత్మలను పరివర్తన చేయలేదా? మరి పంజాబ్ వారు ఏమి విన్నారు? ఎవరో శాంతి పుంజము శాంతి కిరణాలను ఇస్తున్నారని అందరికీ వైబ్రేషన్లు అందాలి. ఇలాంటి సేవ చేసే సమయం పంజాబ్ వారికి లభించింది. ఫంక్షన్లు, ప్రదర్శనీలు మొదలైనవి చేస్తూనే ఉంటారు కానీ ఈ శక్తిని అనుభవం చేయండి మరియు ఇతరులకు చేయించండి. కేవలం మీ మనసులో ఏకాగ్ర వృత్తి, శక్తిశాలి వృత్తి ఉండాలి. లైట్ హౌస్ ఎంత శక్తిశాలిగా ఉంటుందో, అంత దూరం వరకు లైట్ ను ఇవ్వగలదు. కనుక పంజాబ్ వారికి, ఇది ఈ శక్తిని ప్రయోగంలోకి తీసుకొచ్చే సమయము. అర్థమయిందా? అచ్ఛా.

ఆంధ్రప్రదేశ్ గ్రూపు కూడా ఉంది. వారు ఏమి చేస్తారు? తుఫాన్లను శాంతపరుస్తారు. ఆంధ్రలో తుఫాన్లు చాలా వస్తాయి కదా? తుఫాన్లను శాంతపరచేందుకు కూడా శాంతిశక్తి కావాలి. తుఫాన్లలో మనుష్యాత్మలు భ్రమించిపోతారు. కనుక భ్రమిస్తున్న ఆత్మలకు శాంతి యొక్క గమ్యాన్ని చూపించడం - ఇది ఆంధ్ర వారి విశేషమైన సేవ. ఒకవేళ శరీరం ద్వారా భ్రమించినా కానీ మొదట మనసు భ్రమిస్తుంది, తర్వాత శరీరం భ్రమిస్తుంది. మనసుకు గమ్యము లభిస్తే శరీరం యొక్క గమ్యము కొరకు కూడా బుద్ధి పని చేస్తుంది. కనుక ఒకవేళ మనసు స్థిరంగా లేకుంటే శరీరానికి కావలసిన సాధనాల కొరకు కూడా బుద్ధి పని చేయదు. కనుక అందరి మనసును స్థిరం చేసేందుకు ఈ శక్తిని కార్యంలో ఉపయోగించండి. రెండింటినీ తుఫాన్ల నుండి రక్షించాలి. అక్కడ (పంజాబ్ లో) హింసాత్మక తుఫాను ఉంది, అక్కడ (ఆంధ్రప్రదేశ్ లో) సముద్రము యొక్క తుఫాను ఉంది. అక్కడ వ్యక్తుల తుఫాను ఉంది, అక్కడ ప్రకృతి తుఫాను ఉంది. కానీ రెండు వైపులా తుఫాను ఉంది. తుఫానులో ఉన్నవారికి శాంతి తోఫా (కానుక) ను ఇవ్వండి. తోఫా (కానుక) తుఫానును పరివర్తన చేసేస్తుంది. అచ్ఛా.

నలువైపులా ఉన్న శాంతి దేవ శ్రేష్ఠ ఆత్మలకు, నలువైపులా ఉన్న అంతర్ముఖి మహాన్ ఆత్మలకు, సదా ఏకాంతవాసులుగా అయి కర్మల్లోకి వచ్చే కర్మయోగి శ్రేష్ఠ ఆత్మలకు, సదా శాంతిశక్తిని ప్రయోగం చేసే శ్రేష్ఠమైన యోగీ ఆత్మలకు, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీజీ ఒక రోజు కొరకు రాజ్ పిప్లా (గుజరాత్) మేళాకు వెళ్ళేందుకు శెలవు తీసుకుంటున్నారు -

విశేష ఆత్మల ప్రతి అడుగులో పదమాల సంపాదన ఉంది. పెద్దవారి సహయోగం కూడా ఛత్రఛాయగా అయి వన్నెను తీసుకొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ అందరికీ, ఒక్కొక్కరి పేరుతో ప్రియస్మృతులను అందించండి. నామాల మాలనైతే భక్తిలో పిల్లలు చాలా జపించారు. ఇప్పుడు బాబా ఈ మాలను ప్రారంభిస్తే పెద్ద మాల అయిపోతుంది. కనుక పిల్లలు (విశేష ఆత్మలు) ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ విశేషంగా ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి. విశేష ఆత్మలు వెళ్ళడం అనగా సేవలో ఇంకా విశేషత రావడం. అది ధరణిలో కేవలం పాదాన్ని మోపి వెళ్ళడం నుండి ప్రారంభమవుతుంది. కనుక పాదం మోపడం అనగా అంతా తిరిగి రావడం. ఇక్కడ సేవలో అంతా తిరిగి వస్తారు, అక్కడ భక్తిలో వారు కేవలం పాదాన్ని మోపే మహత్వాన్ని తయారుచేశారు. కాని అన్నీ ఇక్కడి నుండే ప్రారంభమవుతాయి. కేవలం అర్ధగంట, ఒక గంట కోసమైనా ఎక్కడికైనా వెళ్ళారంటే అందరూ సంతోషిస్తారు. కానీ అక్కడ సేవ జరుగుతుంది. భక్తిలో కేవలం పాదాలను పెట్టుకోవడంతో సంతోషాన్ని అనుభవం చేస్తారు. స్థాపనా కార్యమంతా ఇక్కడి నుండే జరుగుతోంది. పూర్తి భక్తి మార్గానికి ఇక్కడి నుండే పునాది పడుతుంది, కేవలం రూపం మారిపోతుంది. కనుక ఎవరైతే మేళా సేవ కొరకు నిమిత్తులయ్యారో అనగా మిలనాన్ని జరుపుకునే సేవకు నిమిత్తులయ్యారో, వారందరితో బాప్ దాదా, మేళాకు ముందే మిలన-మేళాను జరుపుకుంటున్నారు. ఇది తండ్రి మరియు పిల్లల మేళా, అది సేవ యొక్క మేళా. కనుక అందరికీ హృదయపూర్వకమైన ప్రియస్మృతులు. అచ్ఛా. ప్రపంచంలో నైట్ క్లబ్బులు ఉంటాయి, ఇది అమృతవేళ క్లబ్. (దాదీలతో) మీరందరూ అమృతవేళ క్లబ్బులో మెంబర్లు. అందరూ మిమ్మల్ని చూసి సంతోషపడతారు. విశేష ఆత్మలను చూసినా సరే సంతోషం కలుగుతుంది. అచ్ఛా.

వీడ్కోలు సమయంలో - సద్గురువారము యొక్క ప్రియస్మృతులు (ఉదయం 6 గంటలకు) -

వృక్షపతి రోజున వృక్షము యొక్క మొదటి, ఆది అమూల్యమైన ఆకులకు వృక్షపతి అయిన తండ్రి యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. బృహస్పతి దశ అయితే శ్రేష్ఠ ఆత్మలందరిపై ఉండనే ఉంది. రాహు దశ మరియు అనేక దశలు సమాప్తమయ్యాయి. ఇప్పుడు ఒకే వృక్షపతి యొక్క బృహస్పతి దశ ప్రతి బ్రాహ్మణాత్మకు సదా ఉంటుంది. కనుక బృహస్పతి దశ కూడా ఉంది, రోజు కూడా బృహస్పతి రోజు మరియు వృక్షపతి తన వృక్షములోని ఆది ఆకులతో మిలనం జరుపుకుంటున్నారు. కనుక సదా స్మృతి ఉంది మరియు సదా స్మృతి ఉంటుంది. సదా ప్రేమలో ఇమిడి ఉన్నారు మరియు సదా ప్రియంగా ఉంటారు. అర్థమయిందా!

Comments