18-01-2008 అవ్యక్త మురళి

     18-01-2008         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సత్యమైన స్నేహి అయ్యి బరువులన్నింటినీ బాబాకి ఇచ్చేసి ఆనందాన్ని అనుభవం చేసుకోండి, శ్రమముక్తులు అవ్వండి.

ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న నిశ్చింతాచక్రవర్తుల సంఘటనను చూస్తున్నారు. ఇంత పెద్ద చక్రవర్తుల సభ మొత్తం కల్పంలో ఈ సంగమ యుగంలోనే ఉంటుంది. స్వర్గంలో కూడా ఇంత పెద్ద చక్రవర్తుల సభ ఉండదు. ఇప్పుడు బాప్ దాదా చక్రవర్తుల యొక్క సభను చూసి సంతోషిస్తున్నారు. దూరంగా ఉన్నవారు కూడా మనస్సుకి సమీపంగా కనిపిస్తున్నారు. మీరందరు నయనాలలో ఇమిడి ఉన్నారు మరియు దూరంగా ఉన్నవారు మనస్సులో ఇమిడి ఉన్నారు. ఇది ఎంత సుందరమైన సభ. ఈ విశేష రోజున అందరి ముఖాలలో అవ్యక్త స్థితి యొక్క స్మృతి యొక్క మెరుపు కనిపిస్తుంది. అందరి మనస్సులో బ్రహ్మాబాబా యొక్క స్మృతి ఇమిడి ఉంది. ఆదిదేవ్ బ్రహ్మాబాబా మరియు శివబాబా ఇద్దరూ పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. 

ఈరోజైతే ఉదయం రెండు గంటల నుండి మొదలుకుని బాప్ దాదా మెడలో రకరకాలైన మాలలు చేసారు. ఈ పూలమాలలు అయితే సాధారణమే, వజ్రాల మాలలు వేయటం కూడా గొప్పవిషయమేమీ కాదు కానీ స్నేహం యొక్క అమూల్య ముత్యాలమాల చాలా శ్రేష్టమైనది. ప్రతి ఒక బిడ్డ యొక్క మనస్సులో ఈ రోజు విశేషంగా స్నేహం నిండి ఉంది. బాప్ దాదా దగ్గర నాలుగు రకాలైన భిన్న భిన్న మాలలు ప్రత్యక్షం అయ్యాయి. మొదటి నెంబర్ - శ్రేష్టపిల్లల యొక్క మాల అంటే బాబా సమానంగా అయ్యే శ్రేష్ఠపురుషార్టి పిల్లలు మాల రూపంలో బాబా మెడలో ఉన్నారు. మొదటి మాల అన్నింటికంటే చిన్నది. రెండవమాల - మనస్సు యొక్క స్నేహంతో సమీపంగా, సమానంగా అయ్యే పురుషార్ధం చేసే పిల్లల యొక్క మాల. మూడవమాల - ఇది పెద్దదే, వీరు స్నేహిగా కూడా ఉంటారు, బాబా సేవలో సహయోగిగా కూడా ఉంటారు కానీ అప్పుడప్పుడు తీవ్రపురుషార్ధిగా ఉంటారు మరియు అప్పుడప్పుడు ఎక్కువగా తుఫానులను ఎదుర్కొనేవారిగా ఉంటారు. కానీ సంపన్నంగా అవ్వాలనే కోరిక కలిగి ఉంటారు. నాల్గవమాల - నిందించేవారి మాల. ఇలా రకరకాలైన పిల్లల మాలలు అవ్యక్తఫరిస్తా ముఖం రూపంలో ఉన్నాయి. బాప్ దాదా కూడా ఇలా రకరకాలైన మాలలను చూసి సంతోషిస్తున్నారు మరియు వెనువెంట స్నేహం మరియు శక్తిని ఇస్తున్నారు. ఇప్పుడు మీకు మీరు నేనెవరు? అనేది ఆలోచించుకోండి కానీ నలువైపుల ఉన్న పిల్లలందరిలో వర్తమాన సమయంలో ఇప్పుడు ఏదో చేయాల్సిందే అనే విశేషసంకల్పం ఉంది. ఈ ఉత్సాహ, ఉల్లాసాలు ఎక్కువమందిలో సంకల్ప రూపంలో ఉన్నాయి. స్వరూపంలోకి తీసుకురావటంలో నెంబర్ వారీగా ఉన్నారు కానీ సంకల్పమైతే అందరికీ ఉంది. బాప్ దాదా పిల్లలందరికీ ఈ స్నేహ, స్మృతి మరియు సమర్ధరోజు యొక్క విశేష మనస్పూర్వక ఆశీర్వాదాలు మరియు మనస్ఫూర్వక శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈ రోజు విశేషంగా స్నేహం యొక్క రోజు కనుక ఎక్కువమంది స్నేహంలో లీనమై ఉన్నారు. ఇదేవిధంగా సదా పురుషార్ధంలో మరియు స్నేహంలో లీనమై ఉండండి, లవలీనంగా ఉండండి, సహజ సాధనం - స్నేహం, హృదయపూర్వక స్నేహం, బాబా పరిచయం యొక్క స్మృతి సహిత స్నేహం, బాబా ఇచ్చే ప్రాప్తుల యొక్క స్నేహ సంపన్న స్నేహం. స్నేహం చాలా సహజ సాధనం ఎందుకంటే స్నేహి ఆత్మ శ్రమ నుండి రక్షించబడుతుంది. స్నేహంలో లీనమైన కారణంగా, స్నేహంలో మునిగిపోయిన కారణంగా ఏ రకమైన శ్రమ అయినా కానీ మనోరంజనంగా అనుభవం అవుతుంది. స్నేహి ఆత్మయే దేహం యొక్క అభిమానము, దేహసంబంధీకుల ధ్యాస, దేహప్రపంచం యొక్క ధ్యాసకు అతీతంగా స్వతహాగా స్నేహంలో లీనమై ఉంటుంది. హృదయపూర్వకమైన స్నేహం బాబా యొక్క సమీపతను, తోడును, సమానతను అనుభవం చేయిస్తుంది. స్నేహి ఆత్మ సదా స్వయాన్ని బాబా యొక్క ఆశీర్వాదాలకు పాత్రునిగా భావిస్తుంది. స్నేహం అసంభవాన్ని కూడా సహజ సంభవం చేస్తుంది. సదా తమ మస్తకంపై, తలపై బాబా సహయోగం యొక్క స్నేహం యొక్క చేయి ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. నిశ్చయబుద్ధితో నిశ్చింతగా ఉంటారు. ఆది స్థాపనలో ఉన్న పిల్లలకు ఆది సమయం యొక్క అనుభవం ఉంది, ఇప్పుడు కూడా ఆదిలో సేవకు నిమిత్తమైన పిల్లలకు అనుభవం ఉంది, ఆదిలో పిల్లలందరికీ బాబా లభించారు అనే స్మృతితో ఎంతగా స్నేహం యొక్క నషా ఉండేది! జ్ఞానం తర్వాత అర్ధం అవుతుంది కానీ మొదట స్నేహంలో లీనమైపోయే నషా ఉంటుంది. బాబా స్నేహసాగరుడు కనుక ఎక్కువమంది పిల్లలు ఆది నుండి స్నేహసాగరంలో లీనమై ఉన్నారు. పురుషార్ధంలో కూడా చాలా మంచి వేగంతో నడిచారు కానీ కొంతమంది పిల్లలు స్నేహసాగరంలో మునిగిపోతున్నారు మరియు కొంతమంది కేవలం మునకలు వేసి బయటికి వచ్చేస్తున్నారు. అందువలనే లీనమైపోయిన పిల్లలకు శ్రమ తక్కువ అనిపిస్తుంది, కేవలం మునకలు వేసేవారికి అలా ఉండదు. అప్పుడప్పుడు శ్రమ, అప్పుడప్పుడు ప్రేమ రెండింటిలో ఉంటారు. కానీ ఎవరైతే స్నేహంలో లవలీనం అయ్యి ఉంటారో వారు సదా స్వయాన్ని బాబా యొక్క ఛత్రఛాయలో ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. హృదయపూర్వక స్నేహి పిల్లలు శ్రమని కూడా ప్రేమలోకి పరివర్తన చేసుకుంటారు. వారి ముందు పర్వతంలాంటి సమస్య కూడా పర్వతంగా అనిపించదు, దూది వలె అనుభవం అవుతుంది. రాయి కూడా నీరు వలె అనుభవం అవుతుంది. ఈ రోజు విశేషంగా స్నేహం యొక్క వాయుమండలంలో ఉన్నారు కదా శ్రమ అనిపించిందా లేక మనోరంజనంగా అనిపించిందా! 

ఈరోజైతే అందరికీ స్నేహం అనుభవం అయ్యింది కదా! స్నేహంలో లీనమై ఉన్నారా? అందరూ లీనమై ఉన్నారు! ఈరోజు శ్రమ అనుభవం అయ్యిందా? ఏ విషయంలోనైనా శ్రమ అనిపించిందా? ఏమిటి, ఎందుకు, ఎలా అనే సంకల్పాలు వచ్చాయా? స్నేహం అన్నింటినీ మరిపింపచేస్తుంది. కనుక బాప్ దాదా కూడా చెప్తున్నారు, అందరూ బాప్ దాదా యొక్క స్నేహాన్ని మాత్రం మర్చిపోకండి. స్నేహ సాగరుడు లభించారు, ఆ సాగరంలో బాగా ఈదండి. ఎప్పుడైనా ఏదైనా శ్రమ అనుభవం అయితే, ఎందుకంటే మధ్యమధ్యలో మాయ పరీక్ష తీసుకుంటుంది కానీ ఆ సమయంలో స్నేహం యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు శ్రమ అనేది 
ప్రేమలోకి మారిపోతుంది. అనుభవం చేసుకుని చూడండి. కానీ ఏమి పొరపాటు జరుగుతుందంటే ఆ సమయంలో ఎందుకు, ఏమిటి ...... అనేవాటిలోకి వెళ్ళిపోతున్నారు. ఏదైతే వచ్చిందో అది వెళ్ళిపోతుంది కూడా, కానీ ఎలా వెళ్తుంది? స్నేహాన్ని జ్ఞాపకం చేసుకోవటం ద్వారా శ్రమ వెళ్ళిపోతుంది ఎందుకంటే అందరికీ రకరకాల సమయాలలో బాప్ దాదా ఇద్దరి స్నేహం యొక్క అనుభవం ఉంటుంది. అనుభవం ఉంది కదా! ఎప్పుడో అప్పుడు చేసుకున్నారు కదా, సదా కాకపోయినా కానీ ఎప్పుడో అప్పుడు అయ్యింది కదా! కనుక ఆ సమయాన్ని గుర్తు చేస్కోండి - బాబా యొక్క స్నేహం ఎలా ఉంటుంది. బాబాపై 'స్నేహంతో ఏమేమి అనుభవం చేసుకున్నారో గుర్తు చేస్కోండి. ఇలా స్నేహం యొక్క స్మృతి ద్వారా శ్రమ మారిపోతుంది ఎందుకంటే బాప్ దాదాకి ఏ పిల్లల శ్రమ యొక్క స్థితి మంచిగా అనిపించటం లేదు. నా పిల్లలకు శ్రమ ఏమిటి అనుకుంటారు. శ్రమ నుండి ముక్తులుగా ఎప్పుడు అవుతారు? ఈ సంగమయుగంలోనే శ్రమముక్తులుగా అయ్యి ఆనందంలో ఉండగలరు. ఆనందం లేదు అంటే బుద్ధిలో ఏదోక బరువు ఉన్నట్లే. కనుకనే మీ బరువంతా నాకు ఇచ్చేయండి అని బాబా చెప్పారు. నేను అనేది మర్చిపోయి నిమిత్తంగా అయిపోండి, బాధ్యత బాబాకి ఇచ్చేయండి మరియు స్వయం సత్యమైన మనస్సు కలిగిన పిల్లలుగా అయ్యి తినండి, ఆడుకోండి మరియు మజాగా ఉండండి. ఎందుకంటే ఈ సంగమయుగం అన్ని యుగాల కంటే ఆనందకర యుగం. ఈ ఆనందకరయుగంలో కూడా ఆనందంగా ఉండకపోతే ఇక ఎప్పుడు ఉంటారు? పిల్లలు బరువు ఎత్తుకుని చాలా శ్రమ చేయటం బాప్ దాదా చూస్తున్నారు. బాబాకి ఇవ్వటం లేదు, స్వయమే మోస్తున్నారు కనుక బాబాకి దయ, జాలి అనిపిస్తుంది. ఆనందంగా ఉండే సమయంలో శ్రమ చేయటమేమిటి! అని. స్నేహంలో లీనమైపోండి, స్నేహ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికీ ఏదోక సమయంలో విశేషంగా స్నేహం యొక్క అనుభూతి తప్పకుండా అవుతుంది, అయ్యింది కూడా! బాబాకి తెలుసు, అనుభవం అయితే అయ్యింది కానీ దానిని జ్ఞాపకం చేసుకోవటం లేదు. శ్రమనే చేస్తూ ఉంటున్నారు, అలజడి అవుతూ ఉన్నారు. ఈ రోజు కూడా అమృతవేళ నుండి ఇప్పటివరకు మనస్సులో బాప్ దాదా ఇద్దరి యొక్క స్నేహాన్ని, శక్తిని అనుభవం చేసుకున్నారు కనుక ఈరోజుని జ్ఞాపకం చేసుకున్నా కూడా ఈ స్నేహం ముందు శ్రమ సమాప్తి అయిపోతుంది. 

ఇప్పుడు బాప్ దాదా ఈ సంవత్సరంలో ప్రతి బిడ్డను స్నేహయుక్తంగా, శ్రమముక్తులుగా చూడాలనుకుంటున్నారు. శ్రమ యొక్క నామరూపాలు మనస్సులో ఉండకూడదు, జీవితంలో కూడా ఉండకూడదు. ఇలా కాగలరా? అవ్వగలరా? ఎవరైతే చేసే వదలాలి అని ధైర్యంతో ఉన్నారో వారు చేతులెత్తండి! ఈరోజు విశేషంగా ఆవిధమైన ప్రతి బిడ్డకు బాబా ఇచ్చే విశేష వరదానం ఏమిటంటే శ్రమ నుండి ముక్తులు అవ్వండి. స్వీకరించారా? స్వీకరించారా? మరలా ఏదైనా జరిగితే ఏం చేస్తారు! ఎందుకు, ఏమిటి అని అనరు కదా? ప్రేమ యొక్క సమయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మరియు అనుభవంలో లీనమైపోవాలి. మీ అందరి ప్రతిజ్ఞ ఉంది. బాబా పిల్లలను ప్రశ్నిస్తున్నారు, ఈ రోజు మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటంటే, మేము బాబా ద్వారా 21 జన్మల కొరకు జీవన్ముక్తి స్థితి యొక్క పదవిని పొందుతాము, పొందాము అని మరి జీవన్ముక్తిలో శ్రమ ఉంటుందా? 21 జన్మలలో ఒక జన్మ సంగమయుగం యొక్క జన్మ. మీ ప్రతిజ్ఞ 21 జన్మలకు, 20 జన్మలకు కాదు. కనుక ఇప్పటి నుండి శ్రమ నుండి ముక్తులుగా అంటే జీవన్ముక్తులుగా, నిశ్చింతా చక్రవర్తులుగా ఉండాలి. ఇప్పటి సంస్కారమే ఆత్మలో 21 జన్మలకు నిండుతుంది. కనుక 21 జన్మలకు వారసత్వం తీసుకున్నారు కదా! లేదా ఇప్పుడు తీసుకోవాలా? కనుక దయచేసి ధ్యాస పెట్టుకోండి, శ్రమ నుండి ముక్తులు అవ్వాలి, సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టం చేయాలి. కేవలం సంతుష్టంగా ఉండటమే కాదు, సంతుష్టం చేయాలి కూడా అప్పుడే శ్రమ నుండి ముక్తులు అవుతారు. లేకపోతే రోజూ ఏవోక బరువు యొక్క విషయాలు, శ్రమ యొక్క విషయాలు మరియు ఎందుకు, ఏమిటి అనే భాషలోకి వచ్చేస్తారు. ఇప్పుడు సమయం యొక్క సమీపతను చూస్తున్నారు. సమయం ఎలా అయితే సమీపంగా వస్తుందో అలాగే మీ అందరికీ కూడా బాబా యొక్క తోడు మరియు సమీపత యొక్క అనుభవం పెరగాలి కదా! బాబాతో మీ యొక్క సమీపస్థితియే సమయం యొక్క సమాప్తిని సమీపంగా తీసుకువస్తుంది. పిల్లలైన మీ అందరికీ ఆత్మల దు:ఖం, అశాంతి యొక్క ధ్వని చెవులకు వినిపించటం లేదా! మీరే పూర్వీకులు మరియు పూజ్యులు కూడా! ఓ పూర్వీకులూ! ఓ పూజ్యులూ! విశ్వ కళ్యాణ కార్యాన్ని ఎప్పుడు సంపన్నం చేస్తారు? 

బాప్ దాదా సమాచారాలలో చూసారు, ప్రతి వర్గం వారు తమ, తమ మీటింగ్లు చేస్తున్నారు, విశ్వకళ్యాణం యొక్క వేగం ఎలా తీవ్రం చేయాలి? అని ప్లాన్ తయారుచేస్తున్నారు. ప్లాన్ చాలా బాగా తయారుచేస్తున్నారు కానీ సమాప్తి ఎప్పుడు అవుతుంది? అని బాప్ దాదా అడుగుతున్నారు. దీని జవాబు దాదీలు చెప్తారా? ఆఖరుకి ఎంత వరకు? పాండవులు చెప్తారా? ఎంత వరకు? ప్రతి వర్గం వారు తయారుచేసే ప్లాన్లలో బాబా ప్రత్యక్షం అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకుంటున్నారు. కానీ ప్రత్యక్షత జరిగేది ధృఢప్రతిజ్ఞ ద్వారా ప్రతిజ్ఞలో ధృఢత ఉండాలి. అప్పుడప్పుడు ఏదోక కారణంతో లేదా విషయాలతో ధృఢత తక్కువ అయిపోతుంది. ప్రతిజ్ఞ చాలా బాగా చేస్తున్నారు, అమృతవేళ మీరు వినిపిస్తున్నారు కదా, బాబా వింటూ ఉంటారు. అందరి మనస్సుల ధ్వని వినగలిగే సాధనం మీ విజ్ఞానం ఇవ్వలేదు. బాప్ దాదా అయితే వింటూ ఉంటారు, ప్రతిజ్ఞల మాలలు, సంకల్పం చేసే విషయాలు ఎంత మంచిగా ఉంటాయంటే మనస్సుని సంతోషపరిచేలా ఉంటాయి. కనుక బాప్ దాదా కూడా ఓహో పిల్లలూ! ఓహో!! అంటున్నారు. ఏమేమి చేస్తున్నారో చెప్పమంటారా! మురళీ వరకు కూడా 75% మంచిగా ఉంటున్నారు. కానీ కర్మయోగంలోకి వచ్చినప్పుడు తేడా వచ్చేస్తుంది. కొన్ని స్వభావాలు, కొన్ని సంస్కారాలు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ప్రతిజ్ఞ ధృఢంగా ఉండడానికి బదులు సాధారణం అయిపోతుంది. ధృఢత యొక్క శాతం తక్కువ అయిపోతుంది. 

బాప్ దాదా పిల్లల ఒక ఆట చూసి నవ్వుతున్నారు. ఏ ఆట ఆడుతున్నారో చెప్పమంటారా? చెప్పిన తర్వాత ఆ ఆటను సమాప్తి చేయాలి. చేస్తారా, చేస్తారా? ఈరోజు స్నేహం యొక్క శక్తి ఉంది కదా! చేస్తారా? చేతులెత్తండి! కేవలం చేతులెత్తటం కాదు, మనస్సుతో ఎత్తాలి మరియు చేయవలసి ఉంటుంది. మరలా బాప్ దాదాకి కొంచెం ... కొంచెం ... అని ఇలా చెప్తారా? పాండవులు చెప్పండి, చెప్పమంటారా? మొదటి వరసలో కూర్చున్నవారు చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి, చేయాల్సివస్తుంది. చెప్పమంటారా? సరే అయితే మొదటి వరసలోని వారు చేతులెత్తండి! రెండవ వరసలోని వారు చేతులెత్తండి! మధువనం వారు కూడా చేతులెత్తండి! మనస్సు యొక్క చేయి కదా! మంచిది, బాప్ దాదాకి అయితే ఆటని చూడటంలో దయ వస్తుంది కానీ మజా రావటం లేదు. ఎందుకంటే బాప్ దాదా చూస్తున్నారు, పిల్లల తమ విషయాన్ని ఇతరులపై పెట్టటంలో చాలా తెలివైనవారు ఏమి ఆట ఆడుతున్నారు? విషయాలను తయారుచేస్తున్నారు. ఎవరు చూస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇది నాకు మరియు నా మనస్సుకే తెలుసు అనుకుంటున్నారు. బాబా అయితే పరంధామంలో, సూక్ష్మవతనంలో ఉన్నారు అనుకుంటున్నారు. ఒకవేళ ఎవరికైనా, ఇది చేయకూడదు అని చెప్తే ఏమి ఆట ఆడుతున్నారో తెలుసా? అవును, అలా జరిగింది కానీ .... ఇలా కానీ అనేది తప్పక చెప్తారు. కానీ అని ఏమి చెప్తారు? వారు ఇలా ఉన్నారు కదా, ఇలా చేసారు కదా, ఇలా జరిగింది అందుకే ఇది జరిగింది. నేనైతే చేయలేదు, అప్పుడు ఇలా జరిగింది అని అంటారు. వీరు చేసారు కనుక నేను చేసాను లేకపోతే నేను చేయకపోదును అంటే ఇది ఏమయ్యింది? మీకు అనుభూతిశక్తి, పరివర్తనా శక్తి తక్కువ. ఒకవేళ వారు అలా చేసారు కనుక మీరు కూడా చేసారు, చాలా మంచిది. అంటే మొదటి నెంబర్ వారు అయ్యారు, మీరు రెండవ నెంబర్ అయ్యారు సరేనా. అంటే మీరు మొదటి నెంబర్ కాదు, రెండవనెంబర్ అని బాప్ దాదా కూడా అంగీకరిస్తున్నారు. మొదటి నెంబర్ వారు పరివర్తన చేసుకుంటే నేను సరిగా ఉంటాను అని మీరు ఆ సమయంలో అనుకుంటున్నారు కదా? బాప్ దాదా మొదటి నెంబర్ వారికి చెప్తున్నారు - పొరపాటు మీది కనుక మీరు పరివర్తన అవ్వాలి అని. దీని ఆధారంగా మొదటి నెంబరు వారు పరివర్తన చేసుకున్నారనుకోండి అప్పుడు మొదటి నెంబరు ఎవరికి లభిస్తుంది? మీకు అయితే మొదటి నెంబరు లభించదు కదా! మీరు మొదటి నెంబరుని వారికి ఇచ్చారు అంటే మీ నెంబరు ఏది? రెండవ నెంబరు అయ్యింది కదా? మీది రెండవ నెంబరు అని అంటే మీకు అంగీకారమేనా? అంగీకరిస్తారా? అలా కాదు, ఇలా, అలా, ఇది ఎలా ..... ఇలాంటి భాషతో చాలా ఆట ఆడతారు. ఇప్పుడు ఇలా, అలా, ఎలా అనే ఈ ఆటని సమాప్తి చేసి నేను పరివర్తన అవ్వాలి, నేను పరివర్తన అయ్యి ఇతరులను పరివర్తన చేస్తాను అనుకోవాలి. ఒకవేళ ఇతరులను పరివర్తన చేయలేక పోయినా కానీ శుభభావన, శుభకామన అయితే పెట్టుకోగలరు కదా! అదైతే మీ వస్తువే కదా! నేను అర్జునిగా అవ్వాలి అనుకోవాలి. మొదటి విశ్వ రాజ్యాధికారులైన లక్ష్మీనారాయణులకు సమీపంగా మీరు రావాలా లేదా రెండవ నెంబర్ వారు వస్తారా? బాప్ దాదాకి ఈ సంవత్సరం యొక్క ఆశ ఏమిటంటే బ్రాహ్మణాత్మలందరు, బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులుగా మరియు ఇక్కడ కూడా బ్యాడ్జి పెట్టుకుంటున్నారు కదా, అందరు పెట్టుకుంటున్నారు కదా! ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు బ్యాడ్జి ఇస్తారు కదా, కాగితం యొక్క (కార్డు) బ్యాడ్జి అయినా, బంగారు బ్యాడ్జి అయినా, వెండి బ్యాడ్జి అయినా కానీ బ్యాడ్జి పెట్టుకుంటున్నారు కదా! ఇక్కడ ఎలా అయితే బ్యాడ్జి పెట్టుకుంటున్నారో అలాగే మనస్సులో నేను పరివర్తన అవ్వాలి అనే బ్యాడ్జి పెట్టుకోండి. నేను నిమిత్తంగా అవ్వాలి, పరివర్తనా కార్యంలో బ్రహ్మాబాబా సమానంగా మొదట నేను ఉండాలి. ఇతర విషయాలలో వెనుక ఉండండి అంటే వ్యర్ధ విషయాలలో వెనుక ఉండండి కానీ పరివర్తనలో మొదట నేను అనుకోండి. సరేనా? అంగీకారామేనా? రేపు అమృతవేళ నుండి బాప్ దాదా చూస్తారు, బాప్ దాదాకి ఆలస్యం అవ్వదు, స్విచ్ ఆన్ చేయగానే విశ్వమంతా కనిపిస్తుంది. రేపు అమృతవేళ అందరు బాబాని కలుసుకుంటారు కదా, కలయిక జరుపుకుంటూ ఈ బ్యాడ్జి పెట్టుకోవాలి. ప్రత్యక్షంలో ఎవరు ఈ బ్యాడ్జి పెట్టుకుంటారో చూస్తాను. కేవలం షోగా పెట్టుకోవటం కాదు, పరివర్తన అవ్వవలసిందే. ధృఢత ఉంది కదా! ధృడమైనవారే కదా! అందరు చేతులు ఎత్తుతున్నారు కదా! చేస్తారో, లేదో అని బాప్ దాదాకి అనిపిస్తుంది కానీ ఇక్కడ చేయి ఎత్తారు అంటే ఆ ఒక్క సెకను అయినా మంచి సంకల్పం చేసారు కదా! కానీ చేసే వదిలి పెట్టాలి. నేను మారాలి, మారి మార్చాలి అనుకోవాలి. ఇది మారాలి, ఈ విషయం మారాలి, ఈ వ్యక్తి మారాలి, ఈ పరిస్థితి మారాలి అని అనుకోకూడదు. నేను మారాలి అనుకోవాలి. విషయాలైతే వస్తాయి ఎందుకంటే మీరు ఉన్నతంగా వెళ్తున్నారు, ఉన్నత స్థానంలో సమస్యలు కూడా ఉన్నతంగానే వస్తాయి కదా! కానీ ఎలా అయితే ఈ రోజు నెంబర్ వారీగా శక్తిననుసరించి స్నేహం యొక్క స్మృతి యొక్క వాయుమండలం ఉందో అలాగే మీ మనస్సులో సదా స్నేహంలో లవలీనమై ఉండే వాయు మండలాన్ని సదా ప్రత్యక్షం చేయండి. బాప్ దాదా దగ్గరికి చాలా మంచి మంచి సమాచారాలు వస్తున్నాయి. సంకల్పం వరకు చాలా మంచిగా ఉన్నారు.స్వరూపంలోకి రావటంలో శక్తిననుసరించి అయిపోతున్నారు. ఇప్పుడు రెండు నిమిషాలు అందరూ పరమాత్మ స్నేహం, సంగమయుగీ ఆత్మిక మజా యొక్క స్థితిలో స్థితులవ్వండి. 

మంచిది, ఇదే అనుభవాన్ని మాటిమాటికి ప్రతి రోజు సమయాను సారం అనుభవం చేసుకుంటూ ఉండాలి. స్నేహాన్ని వదలకూడదు. స్నేహంలో లీనమైపోవటం నేర్చుకోండి. మంచిది. 

నలువైపుల యోగయుక్తంగా, యుక్తియుక్తంగా, రాజయుక్తంగా, స్వయం రహస్యాన్ని తెలుసుకుని సదా రాజీ చేసేవారికి, మరియు రాజీగా ఉండేవారికి, కేవలం స్వయం రాజీగా ఉండటమే కాదు, రాజీ చేయాలి కూడా, ఇలా స్నేహసాగరంలో లవలీనం అయి ఉండే పిల్లలకు, సదా బాబా సమానంగా అయ్యే తీవ్ర పురుషార్ధం చేసే పిల్లలకు, సదా అసంభవాన్ని కూడా సహజంగా సంభవం చేసే శ్రేషాత్మలకు, సదా బాబా వెంట ఉండేవారికి మరియు బాబా సేవలో సహయోగిగా ఉండేవారికి ఈ విధంగా చాలా, చాలా అదృష్టమైన మరియు ప్రియమైన పిల్లలకు ఈ అవ్యక్త దినోత్సవం యొక్క అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క ప్రియస్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలు. మంచిది. 

Comments