02-02-2008 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక ఠీవి మరియు వ్యక్తిత్వాన్ని అనుభవం చేసుకుంటూ మీ మాస్టర్ జ్ఞానసూర్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి.
ఈరోజు బాప్ దాదా నలువైపుల ఉన్న ఠీవి మరియు వ్యక్తిత్వం కలిగిన తన యొక్క పరివారాన్ని చూస్తున్నారు. ఈ ఠీవి మరియు ఆత్మిక వ్యక్తిత్వానికి పునాది - సంపూర్ణ పవిత్రత. పవిత్రతకు గుర్తు - అందరి మస్తకంలో, అందరి తలపై లైట్ కిరీటం (ప్రకాశకిరీటం) మెరుస్తుంది. ఇలా మెరిసే కిరీటధారులు, ఆత్మిక ఠీవి, ఆత్మిక వ్యక్తిత్వం కలవారు బ్రాహ్మణ పరివారం అయిన మీరే. ఎందుకంటే పవిత్రతను ధారణ చేసారు కనుక బ్రాహ్మణాత్మలైన మీ యొక్క పవిత్రత యొక్క ప్రభావం ఆదికాలం నుండి ప్రసిద్ధమైనది. మీ అనాది మరియు ఆదికాలం గుర్తు వస్తుందా? గుర్తు చేసుకోండి - అనాది కాలంలో కూడా మీరు పవిత్ర ఆత్మలు. ఆత్మ రూపంలో కూడా విశేషంగా మెరిసే నక్షత్రాలు. ఇతరాత్మలు కూడా మెరుస్తూ ఉంటాయి కానీ మీ నక్షత్రాల యొక్క మెరుపు అందరికంటే విశేషంగా ఉంటుంది. ఆకాశంలో నక్షత్రాలు అనేకం ఉంటాయి కానీ కొన్ని, కొన్ని నక్షత్రాలు విశేషంగా మెరుస్తూ ఉంటాయి. అందరూ స్వయాన్ని చూసుకుంటున్నారు కదా? తర్వాత ఆదికాలంలో కూడా మీ పవిత్రత యొక్క ఠీవి మరియు వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉంది! అందరూ ఆదికాలంలోకి చేరుకున్నారా? చేరుకోండి. నా మెరుపు రేఖ ఎంత శాతంలో ఉంది అని పరిశీలించుకోండి. ఆదికాలం నుండి అంతిమకాలం వరకు మీ పవిత్రత యొక్క ఠీవి మరియు వ్యక్తిత్వం సదా ఉంటాయి. అనాది కాలంలో మెరిసే సితారగా, మెరుస్తూ బాబాతో పాటు నివసించేవారు. ఇప్పుడిప్పుడే మీ విశేషతను అనుభవం చేసుకోండి. అందరూ అనాదికాలంలోకి వచ్చేసారా? తర్వాత, కల్పమంతటిలో పవిత్రాత్మలైన మీ యొక్క ఠీవి భిన్న, భిన్న రూపాలలో ఉంటుంది. ఎందుకంటే ఆత్మలైన మీ వంటి సంపూర్ణపవిత్రులుగా ఎవరూ తయారుకాలేదు. పవిత్రత యొక్క జన్మసిద్ధ అధికారం విశేషాత్మలైన మీకు బాబా ద్వారా ప్రాప్తించింది. ఇప్పుడు ఆదికాలంలోకి వచ్చేయండి. అనాది కాలాన్ని చూసారు, ఇప్పుడు ఆదికాలంలో మీ పవిత్రత యొక్క ఠీవి యొక్క స్వరూపం ఎంత గొప్పది! అందరూ సత్యయుగంలోకి వచ్చేసారా? వచ్చేసారు. వచ్చేసారా? ఆ దేవతారూపంలో ఎంత ప్రియమైన స్వరూపం! దేవతల వంటి ఠీవి, వ్యక్తిత్వం కల్పమంతటిలో ఎవరికీ ఉండదు. దేవతారూపం యొక్క మెరుపు అనుభవం చేసుకుంటూ ఉన్నారు కదా! ఈ ఆత్మీక వ్యక్తిత్వాలన్నీ పవిత్రత ద్వారా ప్రాప్తించాయి. ఇప్పుడు దేవతారూపాన్ని అనుభవం చేసుకుంటూ మధ్యకాలంలోకి వచ్చేయండి. వచ్చేసారా? వచ్చినట్లుగా అనుభవం చేసుకోవటం సహజం కదా? మధ్యకాలంలో కూడా చూడండి, మీ భక్తులు పూజ్యాత్మలైన మిమ్మల్ని పూజిస్తున్నారు, చిత్రాలు తయారు చేస్తున్నారు. ఎంత ఠీవిగా చిత్రాలను తయారుచేస్తారో మరియు ఎంత ఠీవిగా పూజ చేస్తారో కదా! మీ పూజ్య చిత్రం ఎదురుగా వచ్చేసింది కదా? చిత్రాలైతే ధర్మాత్మలకి కూడా తయారుచేస్తారు, ధర్మపితలకు కూడా తయారుచేస్తారు, నాయకులకు కూడా తయారుచేస్తారు కానీ మీ చిత్రంలో ఉండే ఆత్మీయత మరియు మీకు జరిగే విధిపూర్వక పూజలో తేడా ఉంటుంది. మీ పూజ్య స్వరూపం ఎదురుగా వచ్చేసింది. ఇప్పుడు అంత్యకాలానికి సంగమయుగానికి వచ్చేయండి, ఈ ఆత్మిక వ్యాయామం చేస్తున్నారు కదా? అంతా తిరిగి రండి.
మీ పవిత్రతను, మీ విశేష ప్రాప్తిని అనుభవం చేసుకోండి. అంత్యకాలం అనగా సంగమయుగంలో కోట్లలో కొద్దిమంది బ్రాహ్మణాత్మలైన మీకే పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు యొక్క భాగ్యం లభిస్తుంది. స్వయంగా పరమాత్ముని యొక్క మొదటి రచన పవిత్రాత్మలైన మీరే. బ్రాహ్మణులైన మీరే విశ్వాత్మలకి కూడా ముక్తి యొక్క వారసత్వాన్ని బాబా ద్వారా ఇప్పిస్తున్నారు. అనాదికాలము, అదికాలము, మధ్యకాలము మరియు అంత్యకాలము అంటే చక్రమంతటిలో ఇంత శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారం - పవిత్రత. అంతా తిరిగి వచ్చారు కదా! ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, మిమ్మల్ని చూసుకోండి. చూసుకునే అద్దం ఉంది కదా! మిమ్మల్ని చూసుకునే అద్దం ఉంది కదా? ఉన్నవారు చేతులెత్తండి? అద్దం ఉంది, స్పష్టంగా ఉందా? అయితే ఆ అద్దంలో నాలో పవిత్రత ఎంత శాతం ఉంది అని చూసుకోండి. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, పవిత్రత అంటే బ్రహ్మాచారి (బ్రహ్మను అనుసరించేవారు). మనసా, వాచా, కర్మణా, సంబంధ, సంపర్కాలు అన్నింటిలో పవిత్రత ఉందా? ఎంత శాతంలో ఉంది? శాతం తీయటం వస్తుంది కదా? టీచర్స్ కి వచ్చా? పాండవులకు వచ్చా? మంచిది, తెలివైనవారు. మాతలకు వచ్చా? వచ్చా మాతలకు? మంచిది. పవిత్రతకు పరిశీలన - వృత్తి, దృష్టి మరియు కృతి మూడింటిలో పరిశీలించుకోండి, సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి ఎలా ఉంటుందో బుద్ధిలోకి వచ్చింది కదా? ఆలోచించండి, సంపూర్ణపవిత్రత యొక్క వృత్తి అంటే ప్రతి ఆత్మ పట్ల శుభ భావన మరియు శుభకామన. అనుభవీలు కదా? మరియు దృష్టి ఏవిధంగా ఉంటుంది? ప్రతి ఆత్మని ఆత్మ రూపంలో చూడాలి. ఆత్మిక స్మృతిలో మాట్లాడాలి, నడవాలి. క్లుప్తంగా చెప్తున్నాను. వివరాలైతే మీరే ఉపన్య సించగలరు. కృతి అంటే కర్మలో సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి. నా వృత్తి, దృష్టి, కృతి ఈవిధంగా ఉన్నాయా అని పరిశీలించుకోండి. సుఖం తీసుకోవాలి, దు:ఖం తీసుకోకూడదు. అప్పుడప్పుడు దు:ఖం తీసుకోవటం లేదు కదా, పరిశీలించుకోండి. అప్పుడప్పుడు కొద్దికొద్దిగా తీసుకుంటున్నారా? దు:ఖం ఇచ్చేవారు కూడా ఉంటారు కదా? వారు దు:ఖం ఇచ్చారనుకోండి, మీరు వారిని అనుసరించాలా? అనుసరించాలా, అనుసరించకూడదా? ఎవరిని అనుసరించాలి? దు:ఖం ఇచ్చేవారినా లేదా బాబానా? నిరాకారి బాబా విషయం సరే, బ్రహ్మాబాబా కూడా ఏ బిడ్డకైనా దు:ఖం ఇచ్చారా? సుఖం ఇచ్చారు మరియు సుఖం తీసుకున్నారు. అయితే తండ్రిని అనుసరిస్తున్నారా లేదా అప్పుడప్పుడు తీసుకోవలసే వస్తుందా? దాని పేరే దు:ఖం, ఎవరైనా మీకు దు:ఖం ఇచ్చినప్పుడు, నిందించినప్పుడు అవి చెడు విషయాలు అని మీకు తెలుసు కదా, మిమ్మల్ని ఎవరైనా నిందిస్తే దానిని మీరు మంచిది అని భావిస్తారా? చెడు అని భావిస్తారు కదా? వారు మీకు దు:ఖం ఇస్తున్నారు లేదా నిందిస్తున్నారనుకోండి, చెడు వస్తువు మీకు ఎవరైనా ఇస్తుంటే మీరు తీసేసుకుంటారా? తీసేసుకుంటారా? ఎక్కువ సమయం కాదు కానీ కొంచెం సమయం తీసుకుంటారా? చెడు వస్తువు తీసుకోవచ్చా? మరి దు:ఖం, నిందను ఎందుకు తీసుకుంటున్నారు? అంటే మనస్సులో ఫీలింగ్ రూపంలో ఎందుకు పెట్టుకుంటున్నారు? కనుక మిమ్మల్ని మీరు అగడండి - మేము దు:ఖం తీసుకోవటం సరైనదా? ఒప్పా? మధువనం వారు చెప్పండి, సరైనదా? కొద్దికొద్దిగా తీసుకోవాలా? మొదటి వరసలో వారు చెప్పండి, దు:ఖం తీసుకోవాలి కదా! తీసుకోకూడదు కానీ తీసేసుకుంటున్నారు. పొరపాటున తీసేసుకుంటున్నారు. ఈ దు:ఖం యొక్క ఫీలింగ్ లోకి ఎవరు వస్తారు, అలజడిలోకి ఎవరు వస్తారు? మనస్సులో మురికి ఉంచుకుంటే ఎవరు అలజడి అవుతారు? ఎక్కడ మురికి ఉంటుందో అక్కడే అలజడి ఉంటుంది కదా! ఆ సమయంలో మీ ఠీవి మరియు వ్యక్తిత్వాన్ని ఎదురుగా తెచ్చుకోండి. మరియు మిమ్మల్ని మీరు ఏ స్వరూపంలో చూసుకోవాలి? మీ బిరుదు ఏమిటో తెలుసా? మీ యొక్క బిరుదు - సహన శీలతాదేవి లేదా సహనశీలతాదేవ్. మీరెవరు? సహనశీలదేవీలా లేదా సహనశీలదేవ్ లా? కాదా? అప్పుడప్పుడు అవుతున్నారు. మీ పదవిని జ్ఞాపకం చేసుకోండి, మీ స్వమానాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేనెవరు? అనేది స్మృతిలోకి తీసుకురండి. కల్పమంతటి విశేష స్వరూపాలను స్మృతిలోకి తీసుకురండి, స్మృతి వస్తుంది కదా!
బాప్ దాదా చూసారు - నాది అనే మాటను సహజ స్మృతిలోకి పరివర్తన చేసుకున్నారు. నాది అనే విస్తారాన్ని మలచుకునేటందుకు ఏమంటున్నారు? నా బాబా అంటున్నారు. నాది, నాది అనేది ఎప్పుడు వచ్చినా దానిని నా బాబా అనే దానిలోకి మలుచుకుంటున్నారు. మరియు మాటిమాటికి నా బాబా అనటం ద్వారా స్మృతి కూడా సహజం అవుతుంది మరియు ప్రాప్తి కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే రోజంతటిలో ఏదైనా సమస్య లేదా కారణం వస్తుంది అంటే దానికి విశేషంగా నేను, నాది అనే రెండు మాటలే కారణం. బాబా అనే మాటకి ముందు నా బాబా అనే మాట పక్కా స్మృతి అయిపోయింది, అయిపోయింది కదా? ఇప్పుడందరూ బాబా, బాబా అనరు, నా బాబా అంటారు. అలాగే నేను అనే మాటను కూడా పరివర్తన చేసుకునేటందుకు నేను అనే మాట మాట్లాడినప్పుడు నేనెవరు? అని మీ స్వమానాల జాబితాను ఎదురుగా తెచ్చుకోండి. ఎందుకంటే నేను అనే మాట పడవేయడానికి కూడా నిమిత్తం అవుతుంది మరియు స్వమానాన్ని స్మృతి ఇప్పించి పైకి లేవదీస్తుంది. ఎలా అయితే నా బాబా అనే అభ్యాసం అయిపోయిందో అలాగే నేను అనే మాటను దేహాభిమానం యొక్క స్మృతితో అనడానికి బదులు మీ శ్రేష్ట స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి. నేను శ్రేష్టాత్మను, సింహాసనాధికారి ఆత్మను, విశ్వకళ్యాణి ఆత్మను... ఇలా ఏదో ఒక స్వమానాన్ని నేను అనే పదంతో జోడించండి. అప్పుడు నేను అనే మాట ఉన్నతికి సాధనం అయిపోతుంది. ఇప్పుడు నాది అనే మాట చాలా మందికి బాబా యొక్క స్మృతిని ఇప్పిస్తుంది. ఎందుకంటే సమయం ప్రకృతి ద్వారా శపధం చేస్తుంది.
సమయం యొక్క సమీపతను సాధారణ విషయంగా భావించండి, అకస్మాత్తు మరియు ఎవరెడీ అనే మాటలను మీ కర్మయోగి జీవితంలో ప్రతి సమయం స్మృతిలో ఉంచుకోండి. శాంతిశక్తిని స్వయం పట్ల కూడా భిన్న భిన్న రూపాలలో ప్రయోగించండి. విజ్ఞానం క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తుంది. అలాగే ఎంతగా మీరు స్వయం పట్ల ప్రయోగించే అభ్యాసం చేస్తూ ఉంటారో అంతగా ఇతరుల పట్ల కూడా శాంతిశక్తి ప్రయోగం అవుతూ ఉంటుంది, ఇప్పుడు విశేషంగా మీ శక్తుల ప్రకాశాన్ని నలువైపుల వ్యాపింపచేయండి. ప్రాకృతిక సూర్యుని శక్తి అంటే సూర్య కిరణాలు తమ కార్యాన్ని ఎన్ని రూపాలుగా చేస్తున్నాయి! నీటిని కురిపిస్తాయి మరియు నీటిని ఆవిరి కూడా చేస్తాయి! రాత్రిని పగలు, పగలుని రాత్రిగా చేసి చూపిస్తాయి. మరి మీరు మీ శక్తుల ప్రకాశాన్ని వాయుమండలంలో వ్యాపింపచేయలేరా? మీ శక్తుల ప్రకాశం ద్వారా ఆత్మలను దు:ఖం, అశాంతి నుండి విడిపించలేరా! జ్ఞానసూర్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. కిరణాలను వ్యాపింపచేయండి, ప్రకాశాన్ని వ్యాపింపచేయండి, స్థాపన యొక్క ఆది సమయంలో అనేకాత్మలకు బాప్ దాదా నుండి సుఖం, శాంతి యొక్క ప్రకాశం ఇంట్లో ఉండగానే అనుభవం అయ్యింది. వెళ్ళండి అనే సంకల్పం అందేది, అలాగే ఇప్పుడు మాస్టర్ జ్ఞానసూర్య పిల్లలైన మీ ద్వారా సుఖం, శాంతి యొక్క అల వ్యాపించే అనుభూతి అవ్వాలి. కానీ అది ఎప్పుడు అవుతుంది, దీనికి సాధనం - మనస్సు యొక్క ఏకాగ్రత. స్మృతి యొక్క ఏకాగ్రత. స్వయంలో ఏకాగ్రతా శక్తిని పెంచుకోండి. ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే, ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు మనస్సుని ఏకాగ్రం చేయగలగాలి. ఇప్పుడు మాస్టర్ జ్ఞానసూర్యుని స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి మరియు శక్తుల యొక్క కిరణాలను మరియు ప్రకాశాన్ని వ్యాపింపచేయండి.
బాప్ దాదా విన్నారు మరియు సంతోషిస్తున్నారు - పిల్లలు సేవ యొక్క ఉత్సాహ, ఉల్లాసాలతో ప్రతి స్థానంలో సేవ బాగా చేస్తున్నారు. అన్ని వైపుల నుండి సేవా సమాచారం బాహ దాదా దగ్గరికి చాలా మంచిగా చేరుకుంది. ప్రదర్శినీలు పెడుతున్నారు, వార్తాపత్రికల ద్వారా సందేశాన్ని అందిస్తున్నారు, టి.వి ద్వారా సందేశాన్నిచ్చే కార్యాన్ని పెంచుతున్నారు. సందేశం కూడా చేరుతుంది. సందేశాన్ని బాగా అందిస్తున్నారు. గ్రామాలలో కూడా మిగిలిపోయిన స్థానాలకు సందేశాన్నిచ్చి ప్రతి జోన్ వారు తమతమ స్థానాలను పెంచుతున్నారు. వార్తాపత్రికల ద్వారా, టి.వి. ద్వారా, రకరకాల సాధనాల ద్వారా ఉత్సాహ, ఉల్లాసాలతో సేవ చేస్తున్నారు. అలా చేసే పిల్లలందరికీ
బాప్ దాదా చాలా స్నేహయుక్త ఆశీర్వాదాలతో నిండిన శుభాకాంక్షలు ఇస్తున్నారు. సందేశం ఇవ్వటంలో మంచి ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నాయి, నలువైపుల బ్రహ్మాకుమారీలంటే ఏమిటి, చాలా మంచి శక్తిశాలి కార్యం చేస్తున్నారు అనే ధ్వని బాగా వ్యాపిస్తుంది. కానీ ఏమిటో చెప్పనా? చెప్పనా? బ్రహ్మాకుమారీల బాబా ఎంతో మంచివాడు ఈ ధ్వని ఇప్పుడు వ్యాపించాలి. బ్రహ్మాకుమారీలు మంచి పని చేస్తున్నారు కానీ చేయించేవారు ఎవరు ఇప్పుడు ఈ ప్రత్యక్షత రావాలి. బాబా వచ్చారు అనే సందేశం మనస్సు వరకు చేరుకోవాలి. దీనికి ప్లాన్ తయారుచేయండి.
వారసులు లేదా మైక్ అని ఎవరిని అంటారు? అని బాప్ దాదాని పిల్లలు ప్రశ్నించారు. మైక్ వచ్చారు కూడా కానీ ఇప్పటి సమయాన్ని అనుసరించి బాప్ దాదా ఎటువంటి మైక్ కావాలను కుంటున్నారంటే మరియు ఎటువంటి మైక్ అవసరం అంటే వారి మాటకు గొప్పతనం ఉండాలి. బాబా అనే మాటని సాధారణంగా అనటం, మంచిగా చేస్తున్నారు అనేటంత వరకు తీసుకువచ్చారు దానికి బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఎలాంటి మైక్ కావాలంటే ప్రజలలో వారి మాటకు విలువ ఉండాలి. అటువంటి ప్రసిద్ధులు కావాలి. ప్రసిద్ధులు అంటే శ్రేష్టపదవి కలిగినవారు అని అర్ధం కాదు, కానీ వారి మాట విని వీరు ఏదైతే చెప్తున్నారో వీరి మాటలలో చాలా విలువ ఉంది అని అందరూ అనుకోవాలి. అనుభవంతో చెప్తే దానికి విలువ ఉంటుంది. మామూలు మైక్ అయినవారు చాలా మంది ఉంటారు కానీ ఇంత శక్తిశాలి మైక్ అయినవారు ఎంతమంది ఉంటారు! కొద్దిమందే ఉంటారు. అటువంటి మైక్ ని వెతకండి. వారి మాటలో శక్తి ఉండాలి. వర్తమాన సమయంలో ప్రతి జోన్లో, ప్రతి వర్గంలో మైక్ అయినవారు వచ్చారు. సేవకి ప్రత్యక్షఫలం రాలేదు అని బాప్ దాదా అనటంలేదు కానీ ఇప్పుడు సమయం తక్కువగా ఉంది. కనుక సేవలో గొప్ప ఆత్మలను నిమిత్తం చేయాల్సి ఉంది వారి మాటకు విలువ ఉండాలి. ఎలాంటి మైక్ కావాలో అర్థమైందా! ఇక వారసులు ఎవరో తెలుసు కదా! వారి యొక్క ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో బాబా మరియు బాబా యొక్క కర్తవ్యం మరియు వెనువెంట మనసా, వాచా, కర్మణా, తనువు, మనస్సు, ధనం అన్నింటిలో బాబా మరియు బాబా యొక్కయజ్ఞము నిండి ఉంటుంది, బేహద్ సేవ ఇమిడి ఉంటుంది. శక్తిన్నిచ్చే సమర్దులుగా ఉంటారు.
ఇప్పుడు ఒక సెకనులో, ఒక సెకను అయిపోయింది, ఒక సెకనులో సభ అంతటిలో ఎవరు, ఎక్కడున్నా కానీ అక్కడే ఉండి మనస్సుని ఒకే సంకల్పంలో స్థితులు చేయండి, నేను అనాది జ్యోతిర్బిందు స్వరూపాన్ని - ఈ స్థితిలో పరంధామంలో బాబాతో పాటు కూర్చోండి, మంచిది. ఇప్పుడు సాకారంలోకి వచ్చేయండి. ఇప్పుడు వర్తమాన సమయం యొక్క లెక్క ప్రకారంగా మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేసే అవసరం. ఏ కార్యం చేస్తున్నారో అదే కార్యంలో ఏకాగ్రం చేయండి, కంట్రోలింగ్ పవర్ ని బాగా పెంచుకోండి. మనస్సు, బుద్ధి, సంస్కారాలు మూడింటిపై కంట్రోలింగ్ పవర్ ఉండాలి, రాబోయే సమయంలో ఈ అభ్యాసం చాలా సహయోగం ఇస్తుంది. వాయుమండలం అనుసారంగా ఒక సెకనులో కంట్రోల్ చేయాల్సి ఉంటుంది, ఏది కావాలనుకుంటే ఆ స్థితిలోనే ఉండాలి. ఈ అభ్యాసం చాలా అవసరం. దీనిని తేలికగా తీసుకోకండి. మంచిది.
నలువైపుల ఉన్న డబల్ సింహాసనాధికారులకు, బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారులకు మరియు విశ్వరాజ్య సింహాసనాధికారులకు, సదా తమ యొక్క అనాది స్వరూపం, ఆది స్వరూపం, అంతిమ స్వరూపంలో ఎప్పుడు అంటే అప్పుడు స్థితులయ్యే వారికి, సదా సర్వ ఖజానాలను స్వయం కార్యంలో ఉపయోగించేవారికి మరియు ఇతరులను కూడా సర్వఖజానాలతో సంపన్నంగా తయారుచేసేవారికి, సర్వాత్మలకు బాబా నుండి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారికి, ఈ విధమైన పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, మనస్పూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే.
Comments
Post a Comment