31-12-2007 అవ్యక్త మురళి

    31-12-2007         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

క్రొత్త సంవత్సరంలో అఖండ మహాదాని, అఖండ నిర్విఘ్న, అఖండ యోగి మరియు అఖండ సఫలతామూర్తిగా అవ్వాలి. 

ఈరోజు బాప్ దాదా తన ఎదురుగా డబల్ సభను చూస్తున్నారు. 1. సాకారంలో సన్ముఖంగా కూర్చున్న వారి సభ 2. దూరంగా కూర్చున్నా కానీ మనస్సుతో సమీపంగా కనిపిస్తున్న వారి సభ. రెండు సభలలోని శ్రేష్టాత్మల మస్తకంలో ఆత్మ మెరుస్తూ ఉంది. ఎంతో అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. ఇంతమంది కూడా ఒకే సంకల్పంలో, ఏకరస స్థితిలో పరమాత్మ ప్రేమలో లవలీనమై ఏకాగ్ర బుద్దితో స్నేహంలో లీనమై ఎంతో ప్రియంగా అనిపిస్తు న్నారు! మీరందరు కూడా విశేషంగా ఈరోజు క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేటందుకు వచ్చారు. పిల్లలందరి యొక్క ఉత్సాహ ఉల్లాసాలను చూసి, మెరుస్తున్న ఆత్మ దీపాన్ని చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు. 

ఈరోజు సంగమ రోజు. పాత సంవత్సరం యొక్క వీడ్కోలు మరియు క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలికే రోజు. క్రొత్త సంవత్సరం అంటే క్రొత్త ఉత్సాహ ఉల్లాసాలు, స్వ పరివర్తన యొక్క ఉల్లాసం, స్వయానికి ప్రాప్తించిన సర్వప్రాప్తులను చూసి మనస్సులో ఉల్లాసం పొందటం. ప్రపంచం వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు, వారికైతే ఒక రోజే ఉత్సవం, అదృష్టవంతులు, ప్రియమైన పిల్లలైన మీకు అయితే సంగమయుగం యొక్క ప్రతి రోజు ఉత్సవమే. ఎందుకంటే సంతోషం యొక్క ఉత్సాహం మీకు ఉంది. ప్రపంచం వారు అయితే ఆరిపోయి ఉన్న దీపాలను వెలిగించి క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు కానీ బాప్ దాదా అయితే నలువైపుల వెలిగి ఉన్న ఇంతమంది దీపాలతో క్రొత్త సంవత్సరం యొక్క ఉత్సవాన్ని జరుపుకునేటందుకు వచ్చారు. మీరు అనుసరించే ఆచార పద్దతులు అన్నీ నిమిత్తమాత్రంగా చేస్తున్నారు. కానీ మీరందరు కూడా వెలిగి ఉన్న దీపాలు. మీ మెరిసే దీపం కనిపిస్తుంది కదా! ఈ దీపం అవినాశి.

అయితే ఈ క్రొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు మనస్సులో స్వయం కొరకు, విశ్వంలోని ఆత్మల కొరకు క్రొత్త ప్లాన్ ఏదైనా తయారుచేశారా? 12 గం||ల తర్వాత క్రొత్త సంవత్సరం ప్రారంభం అయిపోతుంది. అయితే ఈ సంవత్సరాన్ని విశేషంగా ఏ రూపంలో జరుపుకుంటారు? పాత సంవత్సరం ఎలాగైతే వీడ్కోలు తీసుకుంటుందో అదేవిధంగా మీరందరు కూడా పాత సంకల్పాలు, పాత సంస్కారాలకు వీడ్కోలు ఇచ్చే సంకల్పం చేశారా? సంవత్సరంతో పాటు మీరందరు కూడా పాత వాటికి వీడ్కోలు ఇచ్చేసి క్రొత్త ఉత్సాహ ఉల్లాసాల యొక్క సంకల్పాలను ప్రత్యక్షంలోకి తీసుకువస్తారు కదా! అయితే మీలో ఏమి నవీనత తీసుకువస్తారో ఆలోచించండి! క్రొత్త ఉత్సాహ ఉల్లాసాల యొక్క ఏ అలను వ్యాపిస్తారు? ఏ విశేష సంకల్పం యొక్క తరంగాలను వెదజల్లుతారు? ఆలోచించారా? ఎందుకంటే బ్రాహ్మణాత్మలైన మీరందరు విశ్వంలోని ఆత్మలందరి పరివర్తనకు నిమిత్తులు. మీరు విశ్వానికి పునాది, పూర్వీకులు, పూజ్యులు. కనుక ఈ సంవత్సరం మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా ఏ తరంగాలను వ్యాపింప చేస్తారు? 1. ప్రకృతి అప్పుడప్పుడు వేడిని, అప్పుడప్పుడు చలిని, అప్పుడప్పుడు వసంతం యొక్క తరంగాలను నలువైపుల వ్యాపింపచేస్తుంది కదా! ప్రకృతిపతులు, ప్రకృతిజీతులు అయిన మీరు ఏ తరంగాలను వ్యాపిస్తారు? దాని ద్వారా ఆత్మలకు కొద్ది సమయం అయినా సుఖం, శాంతి అనుభవం అవ్వాలి. దీని కొరకు బాప్ దాదా చేసే సైగ ఏమిటంటే మీకు ఏవైతే ఖజానాలు లభించాయం ఆ ఖజనాలను సఫలము చేస్కోండి మరియు సఫలతా స్వరూపం అవ్వండి. విశేషంగా సమయం యొక్క ఖజానా ఎప్పుడూ వ్యర్ధం కాకూడదు. ఒక్క సెకను కూడా వ్యర్ధ కార్యంలో ఉపయోగించకండి. సమయాన్ని సఫలం చేస్కోండి. ప్రతి శ్వాసను సఫలం చేస్కోండి. ప్రతి సంకల్పాన్ని సఫలం చేస్కోండి. ప్రతి శక్తిని, ప్రతి గుణాన్ని సఫలం చేస్కోండి. ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతామూర్తిగా అయ్యే సంవత్సరంగా జరుపుకోండి. ఎందుకంటే సఫలత మీ జన్మసిద్ధ అధికారం. ఆ అధికారాన్ని కార్యంలో ఉపయోగించి సఫలతామూర్తి అవ్వండి. ఎందుకంటే ఇప్పటి సఫలత అనేక జన్మలు మీతో పాటు ఉంటుంది. సమయం సఫలం చేసుకున్న దాని యొక్క ప్రాలబ్దంగా అర్ధకల్పం అంతా సఫలత యొక్క ఫలాన్ని పొందుతారు. ఇప్పుడు సమయం యొక్క సఫలత యొక్క ప్రారబ్దం మొత్తం సమయం అంతా పొందుతారు. 2. శ్వాసను సఫలం చేసుకోవటం ద్వారా, మీ శ్వాస యొక్క సఫలతకు పరిణామంగా భవిష్యత్తులో ఆత్మలందరు పూర్తి సమయం ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్యం యొక్క గుర్తులు ఉండవు. వైద్యుల రంగమే ఉండదు. ఎందుకంటే వైద్యులందరూ ఎలా అయిపోతారు? రాజులు అయిపోతారు, విశ్వ యజమాని అయిపోతారు. కానీ ఈ సమయంలో శ్వాసను సఫలం చేసుకుంటేనే సర్వాత్మలు ఆరోగ్యంగా ఉండే ప్రాలబ్దం ప్రాప్తిస్తుంది. అదేవిధంగా జ్ఞాన ఖజానా - దీని ఫల స్వరూపంగా స్వర్గంలో మీ రాజ్యంలో ఎంత తెలివైనవారిగా, శక్తివంతులుగా అవుతారంటే అక్కడ ఏ మంత్రి నుండి సలహా తీసుకోవలసిన అవసరం ఉండదు. స్వయమే తెలివైనవారిగా, శక్తివంతులుగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మీరు శక్తులను సఫలం చేసుకుంటున్నారు, దానికి పాలబ్దంగా అక్కడ సర్వశక్తులు అంటే విశేషంగా ధర్మశక్తి, రాజ్యశక్తి రెండు విశేష శక్తులు అక్కడ ప్రాప్తిస్తాయి. అదేవిధంగా గుణాల ఖజానాను సఫలం చేసుకుంటున్నారు. దానికి పాలబ్దంగా దేవతాపదవి పొందుతున్నారు. దేవత అనగా దివ్యగుణధారి అని అర్థం. దానితో పాటు ఇప్పుడు ఈ అంతిమ జన్మలో మీ జడమూర్తులను పూజిస్తున్నప్పుడు ఏమని మహిమ చేస్తారు? సర్వ గుణ సంపన్నులు అని చేస్తారు. అంటే ఈ సమయం యొక్క సఫలత యొక్క ప్రాలబ్దం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. అందువలన పరిశీలించుకోండి - ఖజానాలు లభించాయి, ఖజానాలతో సంపన్నం అయ్యారు కానీ స్వయం కొరకు, విశ్వం కొరకు ఎంత సఫలం చేసుకున్నాను? పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చేస్తున్నారు కనుక ఈ పాత సంవత్సరంలో ఖజానాలు ఎంత సఫలం చేసుకున్నాను? ఎంత జమ చేసుకున్నాను? అని పరిశీలించుకోవాలి మరియు రాబోయే సంవత్సరంలో కూడా ఈ ఖజానాలన్నింటినీ వ్యర్థం చేయకూడదు, సఫలం చేసుకోవాల్సిందే. ఒక్క సెకండు కూడా ఏ ఖజానా వ్యర్ధం కాకూడదు. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా - సంగమయుగి సమయం యొక్క ఒక్క సెకండు కూడా ఒక్క సెకండు కాదు, ఒక సంవత్సరంతో సమానం. కనుక ఒక్క సెకండు లేదా ఒక్క నిమిషమే వ్యర్థంగా వెళ్ళింది కదా అని అనుకోకండి. వ్యర్థం చేయడాన్నే నిర్లక్ష్యం అని అంటారు. బ్రహ్మాబాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలన్నది మీ అందరి లక్ష్యం. కనుక బ్రహ్మాబాబా ఆది నుండి అంతిమ రోజు వరకు సర్వ ఖజానాలను సఫలం చేసుకున్నారు. దాని యొక్క ప్రత్యక్ష రుజువు చూశారు. సంపూర్ణ ఫరిస్తాగా అయిపోయారు. మీ ప్రియ దాదీని కూడా చూశారు కదా, సఫలం చేసుకున్నారు మరియు ఇతరులకు కూడా సఫలం చేసుకునే ఉత్సాహ ఉల్లాసాలను పెంచారు. అందువలనే డ్రామానుసారంగా విశేషంగా విశ్వసేవ యొక్క ఆల్ రౌండ్ పాత్రకు నిమిత్తమయ్యారు. కనుక ఈ సంవత్సరం, రేపటి నుండి ప్రతి రోజు చార్ట్ పెట్టుకోవాలి - వ్యర్ధం అయ్యిందా? సఫలం అయ్యిందా? ఏది అయ్యింది? ఎంత వరకు అయ్యింది? అని చార్జ్ పెట్టుకోవాలి. సఫలత నా జన్మ సిద్ద అధికారం, సఫలత నా కంఠహారం, సఫలతా స్వరూపంగా అవ్వటమే సమానంగా అవ్వటం అని అమృతవేళలోనే ధృడ సంకల్పం చేయాలి లేదా స్మృతి స్వరూపంగా అవ్వాలి. 3.బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా! అయితే బ్రహ్మాబాబాకి అన్నింటికంటే ఎక్కువగా దేనిపై ప్రేమ ఉంది? తెలుసా? మురళీతో ప్రేమ ఉంది. చివరి రోజు కూడా మురళీ పాఠాన్ని మిస్ చేయలేదు. కనుక బాబా సమానంగా అవ్వడానికి పరిశీలించుకోండి - బ్రహ్మాబాబాకి దేనిపై ప్రేమ ఉందో దానిపై నాకు ప్రేమ ఉందా? దేనిపై బ్రహ్మాబాబాకు ప్రేమ ఉందో దానిపై మీకు కూడా ప్రేమ సహజంగా ఉండటమే బ్రహ్మాబాబాపై ఉన్న ప్రేమకు రుజువు. బ్రహ్మాబాబా యొక్క మరొక విశేషత ఏమి ఉండేది? సదా సంసిద్ధంగా ఉండేవారు. సోమరితనం ఉండేది కాదు. చివరి రోజు కూడా సంసిద్ధ రూపంలో తన యొక్క సేవాపాత్రను అభినయించారు. శరీరం బలహీనంగా ఉన్నా కానీ సంసిద్ధంగా ఉన్నారు, ఏ ఆధారం తీసుకుని కూర్చోలేదు మరియు మూడు విషయాల యొక్క మంత్రం చెప్పి వెళ్ళిపోయారు. అవి అందరికీ గుర్తు ఉన్నాయి కదా! అందువలన ఎవరు ఎంత సంసిద్ధంగా ఉంటారో, బాబాను అనుసరిస్తారో అంతగా సోమరితనం సమాప్తి అయిపో తుంది. సోమరితనం యొక్క విశేష మాటలు బాప్ దాదా వింటూ ఉంటారు. తెలుసు కదా! బాబా చెప్పిన ఆ మూడు విషయాలను (నిరాకారి, నిర్వికారి, నిరహంకారి) సదా మీ మనస్సులో త్రిప్పుకుంటూ మరియు అనుభవం చేసుకుంటూ ఉంటే స్వతహాగా మరియు సహజంగా సమానంగా అయిపోతారు. కనుక ఒక విషయం - సఫలం చేస్కోండి మరియు సఫలతామూర్తి అవ్వండి. రెండవ విషయం - బాప్ దాదా పిల్లల యొక్క ఈ సంవత్సరం ఫలితాన్ని చూశారు. ఏమి చూశారు? మహాదానిగా అయ్యారు కానీ అఖండ మహాదానిగా అవ్వాలి, అఖండం అనే విషయంపై ధ్యాస పెట్టుకోవాలి. అఖండ మహాదాని, అఖండ యోగి, అఖండ నిర్విఘ్నంగా అవ్వాలి, ఇప్పుడు ఇవి అవసరం. అఖండంగా కాగలరా? కాగలరా? మొదటి వరుసలోని వారు అఖండంగా కాగలరా? కాగలిగితే చేతులెత్తండి. చేయగలరా? చేయగలిగిన వారు ఎత్తండి. మధువనం వారు చేయి ఎత్తుతున్నారు. బాప్ దాదా మధువనం వారిని మొదట చూస్తున్నారు. మధువనంతో ప్రేమ. శాంతివనం, పాండవ భవనం లేదా దాదీ యొక్క భుజాలు ఎవరైతే ఉన్నారో అందరినీ ధ్యాసగా చూస్తున్నాను. ఒకవేళ అఖండంగా అయిపోతే మనస్సు ద్వారా శక్తిని వ్యాపింప చేసే సేవలో బిజీగా ఉండండి. వాచా ద్వారా జ్ఞాన సేవ మరియు కర్మ ద్వారా గుణదానం లేదా గుణాల సహయోగం ఇచ్చే సేవ చేయండి. ఈరోజుల్లో అజ్ఞాని ఆత్మలు అయినా, బ్రాహ్మణాత్మలు అయినా కానీ అందరికీ గుణాల దానం లేదా గుణాల సహయోగం ఇవ్వటం అవసరం. ఒకవేళ మీరు సహజంగా సాధారణ రూపంలో ఒక ఉదాహరణ అయ్యి ఉంటే గుణమూర్తి అయిన మీ సహయోగం స్వతహాగానే ఇతరులకు లభిస్తుంది. ఈ రోజుల్లో బ్రాహ్మణాత్మలు కూడా ఉదాహరణ చూడాలనుకుంటున్నారు, వినాలనుకోవటం లేదు. పరస్పరం కూడా ఏమి చెప్పుకుంటున్నారు? ఎవరు తయారయ్యారు? అని అంటున్నారు. అంటే గుణమూర్తిని ప్రత్యక్ష రూపంలో చూడాలను కుంటున్నారు. కనుక కర్మ ద్వారా విశేషంగా గుణాల సహయోగం లేదా గుణదానం ఇవ్వవలసిన అవసరం ఉంది. వినాలని ఎవరూ అనుకోవటం లేదు, చూడాలనుకుంటున్నారు. వాచా ద్వారా జ్ఞానం చెప్పే సేవ చేస్తున్నారు మరియు చేస్తూనే ఉండాలి, వదలకూడదు కానీ ఇప్పుడు మనస్సు మరియు కర్మ రెండూ ఉండాలి. మనస్సు ద్వారా తరంగాలు వ్యాపిపచేయండి. తరంగాలు లేదా శక్తి దూరంగా ఉన్నా కానీ పంపవచ్చు. కనుక ఈ సంవత్సరం ఇప్పుడు మనస్సు ద్వారా శక్తి యొక్క తరంగాలను, కర్మ ద్వారా గుణాల సహయోగాన్ని లేదా అజ్ఞాని ఆత్మలకు గుణదానం చేయాలి. క్రొత్త సంవత్సరానికి బహుమతి కూడా ఇస్తారు కదా! కనుక ఈ సంవత్సరం స్వయం గుణమూర్తి అయ్యి గుణాల యొక్క బహుమతి ఇవ్వాలి. గుణాల ప్రసాదాన్ని తినిపిస్తారు కదా! కలుసుకున్నప్పుడు ప్రసాదం పెడతారు కదా! ప్రసాదం పెట్టి సంతోషం అయిపోతారు కదా! కొంతమంది ఆత్మలు మరియు వెళ్ళిపోయినవారు కూడా ప్రసాదాన్ని గుర్తు చేసుకుంటారు. మిగిలినవన్నీ మర్చిపోతారు కానీ టోలీ గుర్తు వస్తుంటుంది. అయితే ఈ సంవత్సరం ఏ టోలీ పంచిపెడతారు? గుణాల ప్రసాదాన్ని పంచాలి. గుణాల విహారయాత్రను చేయాలి. ఎందుకంటే సమయం యొక్క సమీపతను అనుసరించి మరియు దాదీ యొక్క సైగను అనుసరించి సమయం యొక్క సంపన్నత అకస్మాత్తుగా జరగటం సంభవం. అందువలన బాబా సమానంగా అవ్వాలి లేదా దాదీకి ప్రేమకి బదులు ఇవ్వాలంటే మనసా మరియు కర్మ ద్వారా సహయోగిగా అవ్వాలి. ఎవరు ఎలా ఉన్నా కానీ వీరు తయారైతే నేను తయారవుతాను అని అనుకోకూడదు. వీరు తయారైతే నేను తయారవుతాను అని అనుకుంటే మొదట తయారైన వారు మొదటి నెంబరు అవుతారు, మీరు రెండవ నెంబరు అవుతారు. మరయితే మీరు రెండవ నెంబరు అవ్వాలనుకుంటున్నారా లేక మొదటి నెంబరు అవ్వాలనుకుంటున్నారా? ఒకవేళ ఎవరైనా మీరు రెండవ నెంబరు తీస్కోండి అని అంటే తీసేసుకుంటారా? మొదటి నెంబరే కావాలని అందరూ అంటారు కదా! కనుక మొదట నిమిత్తంగా అవ్వాలి. ఇతరులను నిమిత్తంగా ఎందుకు తయారు చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు నిమిత్తంగా చేస్కోండి. బ్రహ్మాబాబా ఏమి అన్నారు? ప్రతి విషయంలో స్వయం నిమిత్తమై నిమిత్తంగా తయారుచేశారు. ఓ అర్జునా! అయ్యి పాత్రను అభినయించారు. నేను నిమిత్తం అవ్వాలి, నేను చేయాలి అని అనుకోవాలి. ఇతరులు చేయాలి అనుకోకూడదు, నన్ను చూసి ఇతరులు చేస్తారు అని అనుకోవాలి కానీ ఇతరులను చూసి నేను చేస్తాను అని అనుకోకూడదు. నన్ను చూసి ఇతరులు చేస్తారు, బ్రహ్మాబాబా యొక్క మొదటి పాఠం ఇదే. మరి ఏమి చేయాలో విన్నారా? సఫలం చేసుకుని సఫలతామూర్తి అవ్వాలి. అఖండ దానిగా అవ్వాలి. అప్పుడు మాయకి వచ్చే ధైర్యమే ఉండదు. ఎప్పుడైతే అఖండ మహాదానిగా అయిపోతారో, నిరంతర సేవాధారిగా ఉంటారో, బిజీగా ఉంటారో, మనస్సు, బుద్ధితో సేవాధారిగా ఉంటారో అప్పుడు మాయ ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు ఈ సంవత్సరం ఏవిధంగా అవ్వాలి? అందరి హృదయాల నుండి ఒక మాట రావాలని బాప్ దాదా కోరుకుంటున్నారు - అది ఏమిటి? సమస్య అనేది లేదు, సంపూర్ణులు. సమస్య లేదు. కానీ సంపూర్ణంగా అవ్వవలసిందే. ధృడ నిశ్చయబుద్దిగా, విజయీమాలలోని సమీప మణిగా అవ్వాల్సిందే. సరేనా! తయారవ్వాలి కదా! మధువనం వారు తయారవ్వాలి. ఫిర్యాదులు లేవా? లేవు ఫిర్యాదులు. ధైర్యం పెట్టుకునేవారు చేతులెత్తండి. ఏ సమస్యా లేదు, ఓహో! శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. 

చూడండి, నిశ్చయానికి ప్రత్యక్ష రుజువు ఆత్మిక నషా. ఆత్మిక నషా లేదు అంటే నిశ్చయం కూడా లేనట్లే. కొద్దిగా అయితే ఉంటుంది కానీ పూర్తి నిశ్చయం లేదు. నషా పెట్టుకుంటే పెద్ద విషయం ఏమి ఉంటుంది! మీరే బాబా సమానంగా ఎన్ని కల్పాలు అయ్యారు. గుర్తు ఉందా? లెక్కలేనన్నిసార్లు అయ్యారు. కనుక మేమే తయారయ్యాం , మేమే అవుతాము మరియు మాటిమాటికి మేమే అవుతూ ఉంటాం అనే నషా పెట్టుకోండి. ఈ నషా సదా కర్మలో కనిపించాలి. సంకల్పం లేదా మాటలో కాదు కానీ కర్మలో కనిపించాలి. కర్మ అంటే నడవడికలో, ముఖంలో కనిపించాలి. అయితే హోమ్ వర్క్ లభించింది. లభించింది కదా? కనుక ఇప్పుడు నెంబరువన్ లోకి వస్తారో, నెంబరువారీలోకి వస్తారో చూస్తాను. మంచిది. 

బాప్ దాదా దగ్గరకి కార్డులు, ఉత్తరాలు, ఈమెయిల్స్, ప్రియస్మృతులు కంప్యూటర్ ద్వారా కూడా చాలా వచ్చాయి. దూరంగా ఉన్నా కానీ హృదయ సింహాసనాధికారులైన పిల్లలను ఎదురుగా ప్రత్యక్షం చేసుకుని ప్రతి ఒక్కరికీ పేరుపేరున ప్రియస్మృతులు మరియు మనస్పూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు. ప్రేమ అయితే అందరికీ ఉంటుంది అని బాప్ దాదాకి తెలుసు మరియు బాప్ దాదా అమృతవేళ విశేష బ్రాహ్మణాత్మలకు ప్రియస్మృతుల యొక్క జవాబు ఇస్తారు. మంచి మంచి కార్డులు తయారుచేశారు, వాటిని ఇక్కడ పెడతారు కానీ వతనంలో బాప్ దాదా దగ్గరకి ముందుగానే చేరిపోతాయి. మంచిది. 

నలువైపుల మెరుస్తున్న ఆత్మిక దీపాలైన పిల్లలకు, సదా సఫలం చేసుకునే సఫలతా స్వరూప పిల్లలకు, సదా అఖండ మహాదాని, అఖండ నిర్విఘ్న, అఖండ జ్ఞాన, యోగయుక్తులకు, సదా ఒకే సమయంలో మూడు సేవలు చేసేవారికి, మనసా తరంగాల ద్వారా, వాయుమండలం ద్వారా, వాచా ద్వారా మరియు నడవడిక లేదా ముఖం ద్వారా అంటే కర్మ ద్వారా ఇలా మూడు సేవలు ఒకే సమయంలో కలిసి ఉంటే అప్పుడు మీ యొక్క ప్రభావం అనేది బావుంది అనే వారిపై కాకుండా, బాగా తయారయ్యేవారిపై పడుతుంది. ఇలా అనుభవీ మూర్తి ద్వారా అనుభవం చేయించే పిల్లలకు బాప్ దాదా యొక్క నూతన సంవత్సరం యొక్క కోటానుకోట్ల ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు మరియు హృదయ సింహాసనంపై సింహాసనాధికారులుగా అయ్యేవారికి, నలువైపుల ఉన్న పిల్లలకు, ఎదురుగా ఉన్నవారికి లేదా దూరంగా ఉన్నా కానీ హృదయసింహాసనంపై ఉండేవారికి అందరికీ పేరుపేరున మరియు విశేషత సహితంగా ప్రియస్మృతులు మరియు నమస్తే

Comments