31-12-1986 అవ్యక్త మురళి

  31-12-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

‘‘పాస్ట్, ప్రెజంట్ మరియు ఫ్యూచర్లను శ్రేష్ఠంగా తయారుచేసుకునే విధి’’

ఈ రోజు గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ మరియు గాడ్ ఫాదర్ తమ అతి మధురమైన, అతి ప్రియమైన పిల్లలకు మనస్ఫూర్వకంగా ఆశీర్వాదాల గ్రీటింగ్స్ ను ఇస్తున్నారు. అల్లారుముద్దు పిల్లలు ప్రతి ఒక్కరు ఎంతటి శ్రేష్ఠమైనవారు, మహానాత్మలు అనేది బాప్ దాదాకు తెలుసు. పిల్లల ప్రతి ఒక్కరి మహానత, పవిత్రత బాబా వద్దకు నంబరువారుగా చేరుకుంటూ ఉంటుంది. ఈ రోజు అందరూ విశేషంగా నూతన సంవత్సరాన్ని జరుపుకునే ఉల్లాస-ఉత్సాహాలతో వచ్చి ఉన్నారు. ప్రపంచములోని వారు ఇది జరుపుకునేందుకు ఆరిపోయిన దీపాలు లేక కొవ్వొత్తులను వెలిగిస్తారు. వారు వెలిగించి జరుపుకుంటారు మరియు బాప్ దాదా వెలిగియున్న లెక్కలేనన్ని దీపాలతో నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. ఆరిపోయిన వాటిని వెలిగించరు, వెలిగించి మరల ఆర్పరు. ఇలా లక్షల అంచనాలో వెలిగియున్న ఆత్మిక జ్యోతుల సంగఠనలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవటము - ఇలా బాబా మరియు మీరు తప్ప ఇతరులెవ్వరూ జరుపుకోలేరు. ఇది ఎంతో సుందరంగా ప్రకాశిస్తున్న దీపాల ఆత్మిక సంగఠన కల దృశ్యము! అందరి ఆత్మిక జ్యోతి స్థిరంగా, ఏకరసంగా మెరుస్తూ ఉంది. అందరి మనసుల్లో ‘‘ఒక్క బాబా’’ - ఈ లగనమే ఆత్మిక దీపాలను ప్రకాశింపజేస్తుంది. ఒకే ప్రపంచము, ఒకే సంకల్పము, ఏకరస స్థితి ఉన్నాయి - జరుపుకోవటము అంటే ఇదే, తయారై తయారుచేయడం అంటే ఇదే. ఈ సమయములో వీడ్కోలు మరియు అభినందనలు, ఈ రెండింటి సంగమము ఉంది. పాతదానికి వీడ్కోలు మరియు కొత్తదానికి అభినందనలు. ఈ సంగమ సమయములో అందరూ చేరుకున్నారు కనుక, పాత సంకల్పాలు మరియు సంస్కారాల వీడ్కోలుకు కూడా అభినందనలు మరియు నూతన ఉల్లాస-ఉత్సాహాలతో ఎగిరేందుకు కూడా అభినందనలు.

ప్రెజంట్ (వర్తమానము) ఏదైతే ఉందో, అది కొంత సమయము తర్వాత పాస్ట్ (గతం) అవుతుంది. ఏ సంవత్సరమైతే నడుస్తూ ఉందో, అది 12.00 గంటల తర్వాత గతం అయిపోతుంది. ఈ సమయాన్ని ప్రెజంట్ (వర్తమానం) అంటారు మరియు రేపటిని ఫ్యూచర్ (భవిష్యత్తు) అంటారు. పాస్ట్, ప్రెజంట్ మరియు ఫ్యూచర్ - ఈ మూడింటి ఆటనే నడుస్తూ ఉంటుంది. ఈ మూడు మాటలను ఈ నూతన సంవత్సరములో కొత్త విధితో ప్రయోగించాలి. ఎలా? పాస్ట్ ను సదా పాస్ విత్ ఆనర్లుగా అయ్యి పాస్ చెయ్యాలి. “పాస్ట్ ఈజ్ పాస్ట్ (గతం గతః)” అయితే జరిగేదే ఉంది కానీ ఎలా పాస్ చెయ్యాలి (దాటాలి)? సమయం పాస్ అయిపోయింది (గడిచిపోయింది), ఈ దృశ్యము దాటిపోయింది అని అంటారు కదా. కానీ పాస్ విత్ ఆనర్లుగా అయ్యి పాస్ చేసారా (దాటారా)? గతం గతః చేసారు, కానీ ఇటువంటి శ్రేష్ఠమైన విధితో గతాన్ని గతః చేసారా, అనగా గతాన్ని స్మృతిలోకి తీసుకువస్తూనే ‘‘వాహ్! వాహ్!’’ అన్న మాట మనసు నుండి వెలువడే విధంగా చేసారా? ఇతరులు మీ గడిచిపోయిన కథ నుండి పాఠాన్ని నేర్చుకునే విధంగా గతాన్ని గతః చేసారా? మీ గతం స్మృతిచిహ్న స్వరూపంగా అవ్వాలి, కీర్తనను అనగా కీర్తిని పాడుతూ ఉండాలి. భక్తి మార్గములో మీ కర్మల కీర్తనలే పాడుతూ ఉంటారు. మీ కర్మల కీర్తనల ద్వారా అనేక ఆత్మలకు ఇప్పటికీ కూడా శరీర నిర్వహణ జరుగుతూ ఉంది. ఈ నూతన సంవత్సరములో ప్రతి పాస్ట్ సంకల్పాన్ని మరియు సమయాన్ని ఇటువంటి విధితో పాస్ చెయ్యాలి (దాటేయాలి). ఏం చెయ్యాలో అర్థమైందా?

ఇప్పుడు ప్రెజంట్ (వర్తమానము) లోకి రండి, ప్రెజంట్ లోని ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పము ద్వారా విశేష ఆత్మలైన మీ నుండి ఏదో ఒక ప్రెజంట్ (కానుక) ప్రాప్తించే విధంగా ప్రెజంట్ ను ప్రాక్టికల్ లోకి తీసుకురండి. అన్నిటికంటే ఎక్కువ సంతోషము ఏ సమయములో ఉంటుంది? ఎవరి నుండైనా ప్రెజంట్ (కానుక) లభించినప్పుడు. ఎటువంటి అశాంతిలో ఉన్నా, దుఃఖితులుగా ఉన్నా లేక వ్యాకులతలో ఉన్నా కానీ, ఎవరైనా చాలా ప్రేమగా ప్రెజంట్ ను ఇచ్చినట్లయితే, ఆ క్షణములో సంతోషపు అల వచ్చేస్తుంది. అది ఆర్భాటాన్ని చూపించే ప్రెజంట్ కాదు, మనస్ఫూర్తిగా ఇచ్చేది అయి ఉండాలి. అందరూ ప్రెజంట్ (కానుక) ను సదా స్నేహానికి గుర్తుగా భావిస్తారు. ప్రెజంట్ గా ఇచ్చిన వస్తువులో విలువనేది ‘స్నేహము’ కు ఉంటుంది, వస్తువుకు కాదు. కావున ప్రెజంట్ ఇచ్చే విధితో వృద్ధిని పొందుతూ ఉండాలి. అర్థమైందా? ఇది సహజమా లేక కష్టమా? భండారీ నిండుగా ఉంది కదా లేక ప్రెజంట్ లను (కానుకలను) ఇస్తూ-ఇస్తూ భండారీ తక్కువైపోతుందా? స్టాక్ జమా అయ్యి ఉంది కదా? కేవలము క్షణకాలపు స్నేహ దృష్టి, స్నేహ సహయోగము, స్నేహ భావన, మధురమైన మాటలు, మనసులోని శ్రేష్ఠ సంకల్పాలు - ఈ ప్రెజంట్ లు చాలు. ఈ రోజుల్లో పరస్పరములోని బ్రాహ్మణ ఆత్మలకైనా, మీ భక్త ఆత్మలకైనా, మీ సంబంధ-సంపర్కములోని ఆత్మలకైనా, వ్యాకులతతో ఉన్న ఆత్మలకైనా కానీ - అందరికీ ఈ ప్రెజంట్ ల యొక్క అవసరము ఉంది, వేరే ప్రెజంట్ లు కాదు. వీటి స్టాక్ అయితే ఉంది కదా? కనుక వర్తమానంలోని ప్రతి క్షణము దాతగా అయ్యి ప్రెజంట్ ను పాస్ట్ లోకి మార్చినట్లయితే అన్నిరకాల ఆత్మలు మనస్ఫూర్తిగా మీ కీర్తనలను పాడుతూ ఉంటారు. అచ్ఛా!

ఫ్యూచర్ (భవిష్యత్తు) లో ఏం చేస్తారు? చివరకు ఫ్యూచర్ ఏంటి అని లోకులు మిమ్మల్ని అడుగుతారు కదా! ఫ్యూచర్ ను మీ ఫీచర్స్ (ముఖ కవళికలు) తో ప్రత్యక్షము చెయ్యండి. మీ ఫీచర్స్ ఫ్యూచర్ ను ప్రత్యక్షము చెయ్యాలి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లోని నయనాలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్ లోని చిరునవ్వు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లోని సంబంధాలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్ లో ఎటువంటి జీవితము ఉంటుంది - మీ ఫీచర్స్ ఈ విషయాలన్నింటినీ సాక్షాత్కారం చేయించాలి. దృష్టి ఫ్యూచర్ యొక్క సృష్టిని స్పష్టము చెయ్యాలి. ‘ఏమవుతుంది’ - అన్న ప్రశ్న సమాప్తమైపోయి ‘ఇలా అవుతుంది’ లోకి మారిపోవాలి. ‘ఎలా’ అన్నది మారిపోయి ‘ఇలా’ అయిపోవాలి. ఫ్యూచర్ ఉన్నదే దేవతగా, దైవత్వపు సంస్కారాలు అనగా దాతాతనపు సంస్కారాలు, దైవత్వపు సంస్కారాలు అనగా కిరీటధారి, సింహాసనాధికారిగా అయ్యే సంస్కారాలు. మిమ్మల్ని ఎవరు చూసినా కూడా, వారికి మీ కిరీటము మరియు సింహాసనము అనుభవమవ్వాలి. ఎటువంటి కిరీటము? సదా లైట్ (తేలిక) గా ఉండే లైట్ (ప్రకాశ) కిరీటము. మరియు సదా మీ కర్మల ద్వారా మరియు మాటల ద్వారా ఆత్మిక నషా మరియు నిశ్చింతత యొక్క గుర్తులు అనుభవమవ్వాలి. సింహాసనాధికారి గుర్తులు ‘నిశ్చింతత’ మరియు ‘నషా’. నిశ్చిత విజయము యొక్క నషా మరియు నిశ్చింత స్థితి - ఇవి బాబా యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మ యొక్క గుర్తులు. ఎవరు వచ్చినా కూడా, వారు ఈ సింహాసనాధికారి మరియు కిరీటధారి స్థితిని అనుభవము చెయ్యాలి - ఫ్యూచర్ ను ఫీచర్స్ ద్వారా ప్రత్యక్షము చెయ్యటము అంటే ఇదే. ఇలా నూతన సంవత్సరాన్ని జరుపుకోవటము అనగా అలా తయారై తయారుచెయ్యటము. నూతన సంవత్సరములో ఏం చెయ్యాలో అర్థమైందా? మూడు మాటల ద్వారా మాస్టర్ త్రిమూర్తి, మాస్టర్ త్రికాలదర్శి మరియు త్రిలోకినాథులుగా అవ్వాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అందరూ దీని గురించే ఆలోచిస్తారు. ప్రతి అడుగు ద్వారా - స్మృతి ద్వారానైనా, సేవ యొక్క ప్రతి అడుగు ద్వారానైనా కానీ, ఈ మూడు విధుల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండాలి.

నూతన సంవత్సరము యొక్క ఉల్లాస-ఉత్సాహమైతే చాలా ఉంది కదా. డబల్ విదేశీయులకు డబల్ ఉల్లాసము ఉంది కదా. న్యూ ఇయర్ ను జరుపుకునేందుకై ఎన్ని సాధనాలను ఉపయోగిస్తారు? వారు సాధనాలను కూడా వినాశనకరమైనవి ఉపయోగిస్తారు మరియు మనోరంజనమును కూడా అల్పకాలానికి చేస్తారు. ఇప్పుడిప్పుడే వెలిగిస్తారు, ఇప్పుడిప్పుడే ఆర్పేస్తారు. కానీ బాప్ దాదా అవినాశీ విధి ద్వారా అవినాశీ సిద్ధిని ప్రాప్తి చేసుకునే పిల్లలతో జరుపుకుంటున్నారు. మీరు కూడా ఏం చేస్తారు? కేకు కట్ చేస్తారు, కొవ్వొత్తులను వెలిగిస్తారు, పాటలు పాడుతారు, చప్పట్లు కొడతారు. వీటన్నింటినీ కూడా బాగా చెయ్యండి, చెయ్యాలనుకుంటే చెయ్యండి. కానీ బాప్ దాదా సదా అవినాశీ పిల్లలకు అవినాశీ అభినందనలను ఇస్తారు మరియు అవినాశీగా అయ్యే విధిని తెలుపుతారు. సాకార ప్రపంచములో సాకారీ మనోరంజనములను జరుపుకోవటాన్ని చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఇటువంటి సుందరమైన పరివారము, ఎందులోనైతే పూర్తి పరివారమంతా కిరీటధారులు, సింహాసనాధికారులు ఉన్నారు మరియు ఇన్ని లక్షల సంఖ్యలో ఒకటే పరివారము, ఇటువంటి పరివారము మొత్తము కల్పములో ఒకేసారి లభిస్తుంది కనుక బాగా నాట్యము చెయ్యండి, పాడండి, మిఠాయిలను తినండి. బాబా అయితే పిల్లలను చూస్తూ, ఆ సుగంధాన్ని తీసుకుని సంతోషిస్తారు. అందరి మనసుల్లో ఏ గీతాలు మోగుతున్నాయి? సంతోషం యొక్క గీతాలు మ్రోగుతున్నాయి. సదా ‘వాహ్! వాహ్!’ అన్న గీతాన్ని పాడుతూ ఉండండి. ‘వాహ్ బాబా’, ‘వాహ్ భాగ్యము’, ‘వాహ్ మధురమైన పరివారము’, ‘వాహ్ శ్రేష్ఠమైన సంగమయుగం యొక్క సుందరమైన సమయము’. ప్రతి కర్మ ‘వాహ్-వాహ్’ గా ఉంది. ‘వాహ్-వాహ్’ అన్న గీతాలు పాడుతూ ఉండండి. చాలా మంది పిల్లలు ‘వాహ్’ అన్న పాటకు బదులుగా వేరే పాటను కూడా పాడుతూ ఉంటారు అని బాప్ దాదా నవ్వుకున్నారు. అది కూడా రెండు మాటల పాట, అదేంటో తెలుసా? ఈ సంవత్సరము ఆ రెండు మాటల పాటను పాడవద్దు. ఆ రెండు మాటలు - ‘వై’ మరియు ‘ఐ’ (‘ఎందుకు’ మరియు ‘నేను’). చాలా వరకు బాప్ దాదా పిల్లల టి.వి.ని చూసినప్పుడు పిల్లలు ‘వాహ్-వాహ్’ కు బదులుగా ‘వై-వై’ (ఎందుకు-ఎందుకు) అని చాలా సార్లు అంటూ ఉంటారు. కనుక ‘వై’ కు బదులుగా ‘వాహ్-వాహ్’ అని అనాలి మరియు ‘ఐ’ కు బదులుగా ‘బాబా-బాబా’ అని అనాలి. అర్థమైందా?

ఎవరైనాకానీ, ఎలా ఉన్నా కానీ, బాప్ దాదాకు ప్రియమైనవారు, కనుకనే అందరూ ప్రేమతో కలుసుకునేందుకు పరుగు తీస్తారు. అమృతవేళ పిల్లలందరూ సదా ఈ పాటనే పాడుతారు - ‘ప్యారా బాబా, మీఠా బాబా’ (ప్రియమైన బాబా, మధురమైన బాబా) మరియు బాప్ దాదా రిటర్న్ లో సదా ‘ప్యారే బచ్చే, ప్యారే బచ్చే’ (ప్రియమైన పిల్లలూ) అన్న పాటను పాడుతారు. అచ్ఛా! వాస్తవానికి ఈ సంవత్సరము అతీతము మరియు ప్రియము యొక్క పాఠము నేర్చుకునేందుకు ఉంది, అయినా కూడా పిల్లల స్నేహపూర్వక ఆహ్వానము బాబాను కూడా అతీతమైన ప్రపంచము నుండి ప్రియమైన ప్రపంచములోకి తీసుకువస్తుంది. ఆకారీ విధిలో వీటన్నింటినీ చూసే అవసరము లేదు. ఆకారీ మిలనం యొక్క విధిలో ఒకే సమయములో ఎంతోమంది అనంతమైన పిల్లలకు అనంతమైన మిలనం యొక్క అనుభూతిని చేయిస్తారు. ఎంతైనా సాకారీ విధిలో హద్దులోకి రావలసి ఉంటుంది. పిల్లలకు కావాల్సింది కూడా ఏమిటి - మురళి మరియు దృష్టి, మురళీలోనే కలుసుకోవడమనేది ఉంది. విడిగా మాట్లాడినా, కలిపి మాట్లాడినా కానీ, మాట్లాడేదైతే అదే విషయము. సంగఠనలో ఏదైతే మాట్లాడుతారో, అదే విడిగా మాట్లాడుతారు. అయినా కానీ చూడండి, మొదటి అవకాశము డబల్ విదేశీయులకు లభించింది. భారతదేశములోని పిల్లలు 18వ తారీఖు (జనవరి 18) కోసం ఎదురుచూస్తున్నారు మరియు మీరు మొదటి అవకాశాన్ని తీసుకుంటున్నారు. అచ్ఛా! 35-36 దేశాలవారు వచ్చి ఉన్నారు. ఇది కూడా 36 రకాల భోగ్ అయినట్లు. 36కు గాయనము ఉంది కదా. 36 వెరైటీలు అయ్యాయి. బాప్ దాదా పిల్లలందరిలోనూ సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తారు. ఎవరెవరైతే తనువు, మనసు, ధనము, సమయములను స్నేహము మరియు ధైర్యముతో సేవలో పెట్టారో, వారికి బాప్ దాదా పదమాలగుణాల అభినందనలను ఇస్తున్నారు. ఈ సమయములో సమ్ముఖములో ఉన్నా, ఆకార రూపములో సమ్ముఖములో ఉన్నా కానీ బాప్ దాదా పిల్లలందరికీ సేవలో లగనముతో నిమగ్నమై ఉన్నందుకు అభినందనలను ఇస్తున్నారు. సహయోగులుగా అయ్యారు, సహయోగులుగా తయారుచేసారు. కనుక సహయోగులుగా అయినందుకు కూడా మరియు సహయోగులుగా తయారుచేసినందుకు కూడా డబల్ అభినందనలు. చాలా మంది పిల్లల ఉల్లాస ఉత్సాహములతో కూడిన సేవా సమాచారాలు మరియు అలాగే నూతన సంవత్సర ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన కార్డుల మాల బాప్ దాదా మెడలో పడింది. ఎవరెవరైతే కార్డులను పంపారో, బాప్ దాదా ఆ కార్డులకు రిటర్న్ లో గౌరవము మరియు ప్రేమ, ఈ రెండింటినీ ఇస్తారు. సమాచారాలను వింటూ-వింటూ హర్షిస్తూ ఉంటారు. గుప్త రూపంలో సేవ చేసినా, ప్రత్యక్ష రూపంలో సేవ చేసినా కానీ బాబాను ప్రత్యక్షము చేసే సేవలో సదా సఫలతయే ఉంటుంది. స్నేహముతో చేసిన సేవకు రిజల్ట్ - సహయోగీ ఆత్మలుగా అవ్వటము మరియు బాబా కార్యములో సమీపంగా రావటము - ఇదే సఫలతకు గుర్తు. సహయోగి ఈ రోజు సహయోగియే, రేపు యోగిగా కూడా అయ్యి వెళ్తారు. కనుక ఎవరెవరైతే సహయోగిగా చేసే విశేషమైన సేవను నలువైపులా చేసారో, వారి కోసం బాప్ దాదా ‘అవినాశీ సఫలతా స్వరూప భవ’ అన్న వరదానమును ఇస్తున్నారు. అచ్ఛా!

ఎప్పుడైతే మీ ప్రజలు, సహయోగులు, సంబంధీకులు వృద్ధిని పొందుతారో, అప్పుడు ఆ వృద్ధి ప్రమాణంగా విధిని కూడా మార్చవలసి వస్తుంది కదా. సంతోషపడతారు కదా, బాగా పెరగండి. అచ్ఛా!

సదా స్నేహీలు, సదా సహయోగులుగా అయ్యి సహయోగులను తయారుచేసేవారందరికీ, సదా అభినందనలను ప్రాప్తి చేసుకునేవారికి, సదా ప్రతి క్షణాన్ని, ప్రతి సంకల్పాన్ని శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా, గాయనయోగ్యంగా తయారుచేసేవారికి, సదా దాతగా అయ్యి సర్వులకు స్నేహము మరియు సహయోగమును ఇచ్చేవారికి - ఇటువంటి శ్రేష్ఠమైన, మహాన్, భాగ్యవాన్ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు సంగమము యొక్క గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్.

విదేశీ సేవలలో హాజరైయున్న టీచర్ల కొరకు - అవ్యక్త మహావాక్యాలు

నిమిత్త సేవాధారీ పిల్లలను బాప్ దాదా సదా ‘సమాన భవ’ అన్న వరదానముతో ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. బాప్ దాదా అందరినీ, వారు పాండవులైనా లేక శక్తులైనా కానీ, ఎవరెవరైతే సేవకు నిమిత్తులై ఉన్నారో, వారందరినీ విశేషంగా పదమాపదమ భాగ్యవాన్, శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తారు. సేవ యొక్క ప్రత్యక్ష ఫలము సంతోషము మరియు శక్తి, ఈ విశేష అనుభవమునైతే చేస్తూనే ఉంటారు. ఇప్పుడు స్వయం ఎంత శక్తిశాలీ లైట్ హౌస్, మైట్ హౌస్ గా అయ్యి సేవ చేస్తారో, అంత త్వరగా నలువైపులా ప్రత్యక్షతా జెండా ఎగురుతుంది. నిమిత్త సేవాధారులు ప్రతి ఒక్కరూ విశేష సేవ యొక్క సఫలత కోసం రెండు విషయాలపై ధ్యానమును పెట్టుకోవాలి - ఒక విషయమేమిటంటే, సదా సంస్కారాలను కలుపుకునే యూనిటీ, ప్రతి స్థానములోనూ ఈ విశేషత కనిపించాలి. రెండవది, సదా నిమిత్త సేవధారులు ప్రతి ఒక్కరూ ముందుగా స్వయానికి ఈ రెండు సర్టిఫికెట్లను ఇచ్చుకోవాలి - ఒకటి ‘ఐక్యత’, రెండవది ‘సంతుష్టత’. సంస్కారాలు రకరకాలుగానే ఉన్నాయి మరియు ఉంటాయి కూడా, కానీ సంస్కారాల ఘర్షణలోకి రావడమా లేక పక్కకు తప్పుకుని స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవటమా అన్నది మీపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు, ఒకవేళ ఎవరి సంస్కారమైనా అలా ఉన్నట్లయితే, రెండవవారు చప్పట్లు మ్రోగించకూడదు. వారు మారినా, మారకపోయినాకానీ మీరైతే మారగలరు కదా! ఒకవేళ ప్రతి ఒక్కరు తమను తాము మార్చుకున్నట్లయితే, ఇముడ్చుకునే శక్తిని ధారణ చేసినట్లయితే, ఇతరుల సంస్కారము కూడా తప్పకుండా శీతలంగా అయిపోతుంది. కావున సదా పరస్పరములో స్నేహ భావనతో, శ్రేష్ఠ భావనతో సంపర్కములోకి రండి, ఎందుకంటే నిమిత్త సేవాధారి - బాబా చిత్రానికి దర్పణము వంటివారు. కనుక మీ ప్రాక్టికల్ జీవితము ఏదైతే ఉందో, అదే బాబా యొక్క చిత్రానికి దర్పణమైపోతుంది. కావున సదా ఇటువంటి జీవనరూపీ దర్పణమవ్వాలి - అందులో బాబా ఎవరో, ఏలా ఉన్నారో, అలాగే కనిపించాలి. ఇకపోతే, చాలా బాగా శ్రమించారు, ధైర్యం కూడా చాలా బాగుంది. సేవ వృద్ధి ఉల్లాసము కూడా చాలా బాగుంది కనుకనే విస్తారాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు. సేవ అయితే బాగుంది, ఇప్పుడు కేవలము బాబాను ప్రత్యక్షము చేసేందుకై ప్రత్యక్ష జీవన ప్రమాణమును సదా చూపించండి. వీరు జ్ఞాన ధారణలలోనూ ఒకేలా ఉన్నారు, అంతేకాక సంస్కారాలను కలుపుకోవడంలో కూడా నంబరు వన్ గా ఉన్నారు అని అందరూ ఏకకంఠంతో అనాలి. ఇండియా టీచర్ వేరు, ఫారెన్ టీచర్ వేరు అన్నట్లు ఉండకూడదు. అందరూ ఒక్కటే, ఇకపోతే కేవలం మీరు సేవకు నిమిత్తముగా అయ్యారు, స్థాపనలో సహయోగిగా అయ్యారు మరియు ఇప్పుడు కూడా సహయోగాన్ని ఇస్తున్నారు, కావున స్వతహాగానే అందరూ విశేష పాత్రను అభినయించవలసి ఉంటుంది. వాస్తవానికి బాప్ దాదా మరియు నిమిత్త ఆత్మలకు విదేశీయులు మరియు దేశీయుల మధ్యన ఎటువంటి తేడా ఉండదు. ఎక్కడ ఎవరి సేవ యొక్క విశేషత ఉంటుందో, అది ఎవరైనా కానీ, అక్కడ వారి విశేషత ద్వారా లాభాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఇకపోతే, ఒకరినొకరు గౌరవించుకోవటం అనేది బ్రాహ్మణ కులం యొక్క మర్యాద, స్నేహాన్ని తీసుకోండి మరియు గౌరవాన్ని ఇవ్వండి. విశేషతకు మహత్వాన్ని ఇవ్వటం జరుగుతుంది కానీ వ్యక్తికి కాదు. అచ్ఛా!

Comments