31-10-2007 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
శ్రేష్టస్వమానం యొక్క నషాలో ఉంటూ అసంభవాన్ని సంభవం చేస్తూ నిశ్చింతా చక్రవర్తిగా ఉండండి.
ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న తన యొక్క శ్రేష్టస్వమానధారి విశేష పిల్లలను చూస్తున్నారు. ప్రతి బిడ్డ యొక్క స్వమానం ఎంత గొప్పది అంటే అటువంటి స్వమానం విశ్వంలో ఏ ఆత్మకి ఉండదు. మీరందరు విశ్వాత్మలందరికీ పూర్వీకులు కూడా మరియు పూజ్యులు కూడా! వృక్షం యొక్క వేర్లలో ఆధారమూర్తులైన మీరే ఉన్నారు. విశ్వమంతటికీ పూర్వీకులు మొదటి రచన మీరే. బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క విశేషతను చూసి సంతోషిస్తున్నారు. చిన్న పిల్లలైనా, వృద్ధ మాతలైనా, కుటుంబంలో ఉండేవారైనా ప్రతి ఒక్కరి విశేషతలు వేర్వేరు. ఈ రోజుల్లో ఎంత పెద్ద వైజ్ఞానికులైనా, ప్రాపంచిక లెక్కతో విశేషమైనవారు అయినా, ప్రకృతిజీత్ గా అయినా, చంద్రుని వరకు కూడా చేరుకున్నా కానీ ఇంత చిన్న జ్యోతిస్వరూపమైన ఆత్మను తెలుసుకోలేకపోయారు. కానీ ఇక్కడ చిన్న పిల్లవానికి కూడా నేను ఆత్మను, జ్యోతిర్బిందువును అని తెలుసు. నేను ఆత్మను అని నిశ్చయంతో చెప్తారు. మాతలు నిశ్చయంతో మేము పరమాత్మను పొందాము అని చెప్తారు. పొందారు కదా! ఎంత పెద్ద మహాత్మలైనా కానీ వారు ఏమంటారు? పరమాత్మను పొందటం చాలా కష్టం అంటారు. కుటుంబంలో ఉండేవారు శపధం చేస్తారు - మేము కుటుంబంలో ఉంటూ, కలిసి ఉంటూ పవిత్రంగా ఉంటున్నాము ఎందుకంటే మా మధ్యలో బాబా ఉన్నారు అని. అందువలనే ఇద్దరూ కలిసి ఉంటూ కూడా సహజంగా పవిత్రంగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే పవిత్రత అనేది స్వధర్మం. పరధర్మం కష్టంగా అనిపిస్తుంది, స్వధర్మం సహజంగా అనిపిస్తుంది. కానీ ప్రజలేమంటారు? అగ్గి మరియు దూది రెండు కలిసి ఉండలేవు, చాలా కష్టం అని అంటారు. కానీ మీరందరు ఏమంటారు? చాలా సహజం అంటారు. మొట్టమొదట్లో మీ అందరి పాట ఒకటి ఉండేది కదా - ఎంత పెద్ద శేర్ అయినా, స్వామి అయినా కానీ భగవంతుడిని తెలుసుకోలేదు, చిన్న బిందువైన ఆత్మను కూడా తెలుసుకోలేదు కానీ పిల్లలైన మీరందరు తెలుసుకున్నారు మరియు పొందారు. అసంభవం సంభవం అవుతుంది అని నిశ్చయం మరియు నషాతో చెప్తున్నారు, బాప్ దాదా కూడా ప్రతి బిడ్డను విజయీరత్నంగా చూసి హర్షిస్తున్నారు. ఎందుకంటే ధైర్యం ఉన్న పిల్లలకు బాబా సహాయం చేస్తారు. అందువలనే ప్రపంచం వారికి అసంభవం అయిన విషయాలు మీకు సహజం మరియు సంభవం అయ్యాయి. మేము స్వయం పరమాత్మకి పిల్లలం అనే నషా ఉంటుందా! ఈ నషా కారణంగా, నిశ్చయం కారణంగా, పరమాత్మకు పిల్లలుగా అయిన కారణంగా మాయ నుండి కూడా రక్షించబడ్డారు. పిల్లలుగా అవ్వటం అంటే సహజంగా రక్షించబడటం. పిల్లలు కనుకనే అన్ని విఘ్నాల నుండి, సమస్యల నుండి రక్షించబడ్డారు.
మీ యొక్క ఇంత శ్రేష్టస్వమానం గురించి తెలుసు కదా! మీకు ఎందుకు సహజం? ఎందుకంటే మీరు శాంతిశక్తి ద్వారా పరివర్తనాశక్తిని కార్యంలో ఉపయోగిస్తున్నారు. అశుభాన్ని శుభంలోకి పరివర్తన చేసుకుంటున్నారు. మాయ ఎంతగా సమస్య రూపంలో వచ్చినా కానీ మీరు పరివర్తనాశక్తి ద్వారా, శాంతిశక్తి ద్వారా సమస్యను సమాధాన స్వరూపంలో చేసుకుంటున్నారు. కారణాన్ని నివారణరూపంలోకి మార్చుకుంటున్నారు. ఇంత శక్తి ఉంది కదా! కోర్స్ కూడా చెప్తున్నారు కదా! అశుభాన్ని శుభంలోకి మార్చుకునే విధి నేర్పిస్తున్నారు. ఈ పరివర్తనాశక్తి బాబా ద్వారా వారసత్వ రూపంలో లభించింది. ఒక శక్తియే కాదు, సర్వశక్తులు పరమాత్మ నుండి వారసత్వంగా లభించాయి. అందువలనే బాప్ దాదా ప్రతి రోజూ చెప్తూ ఉంటారు, ప్రతి రోజు మురళి వింటున్నారు కదా! ప్రతి రోజూ బాబా ఇదే చెప్తూ ఉంటారు - బాబాని జ్ఞాపకం చేయండి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి అని. బాబా స్మృతి కూడా ఎందుకు సహజంగా వస్తుంది? ఎప్పుడైతే వారసత్వం యొక్క ప్రాప్తి జ్ఞాపకం చేసుకుంటారో అప్పుడు ప్రాప్తి కారణంగా బాబా స్మృతి కూడా సహజంగా వస్తుంది. పొందవలసినదంతా పొందాము అని ప్రతి బిడ్డకు ఆత్మిక సంతోషం ఉంటుంది మరియు మనస్సులో ఇదే పాట పాడుకుంటున్నారు, అందరి మనస్సులో ఈ పాట స్వతహాగా మ్రోగుతుంది కదా! నషా ఉంది కదా! ఎంతగా ఈ నషాలో ఉంటారో, నషాకు గుర్తు నిశ్చింతగా ఉంటారు. ఒకవేళ సంకల్పంలో అయినా, మాటలో అయినా లేదా సంబంధ, సంపర్కంలో అయినా చింత ఉంటే నషా లేనట్లే. బాప్ దాదా నిశ్చింతాచక్రవర్తిగా చేసారు. నిశ్చింతాచక్రవర్తులేనా చెప్పండి? నిశ్చింతాచక్రవర్తులు ఎవరో చేతులెత్తండి? నిశ్చింతగా ఉన్నారా లేదా అప్పుడప్పుడు చింత వస్తుందా? మంచిది, తండ్రి నిశ్చింతగా ఉన్నప్పుడు ఇక పిల్లలకు చింత ఏమిటి! మీ చింతలన్నీ లేదా ఏవిధమైన బరువు ఉన్నా అది బాప్ దాదాకి ఇచ్చేయండి అని బాప్ దాదా అయితే చెప్పేశారు. బాబా సాగరుడు కదా! కనుక మీ భారాలన్నీ ఇముడ్చు కుంటారు. అప్పుడప్పుడు బాప్ దాదా పిల్లల యొక్క ఒక పాట విని నవ్వుకుంటున్నారు. ఆ పాట ఏమిటో తెలుసా? ఏం చేయము, ఎలా చేయము .... అప్పుడప్పుడు ఈ పాట పాడుతున్నారు కదా! బాప్ దాదా అయితే వింటూ ఉంటారు. కానీ బాప్ దాదా పిల్లలందరికీ చెప్తున్నారు - ఓ మధురమైన పిల్లలూ, గారాభమైన పిల్లలూ! సాక్షి స్థితి అనే సీట్ పై సెట్ అవ్వండి మరియు సీట్ పై సెట్ అయ్యి ఆటను చూడండి, అప్పుడు చూడండి ఓహో చాలా ఆనందం వస్తుంది. త్రికాలదర్శి స్థితిలో స్థితులవ్వండి. సీట్ దిగి క్రిందికి వచ్చేస్తున్నారు. అందువలనే అప్ సెట్ అయిపోతున్నారు. సెట్ అయ్యి ఉంటే అప్ సెట్ అవ్వరు. మూడు విషయాలు పిల్లలను అలజడి చేస్తున్నాయి. ఏ మూడు విషయాలు? చంచల మనస్సు, భ్రమించే బుద్ధి మరియు పాత సంస్కారాలు. బాప్ దాదాకి పిల్లల యొక్క ఒక విషయం విని నవ్వు వస్తుంది. ఆ విషయం ఏమిటో తెలుసా? బాబా ఏం చేయను, నా పాత సంస్కారం అని అంటున్నారు, బాప్ దాదా నవ్వుకుంటున్నారు. నా సంస్కారం అంటున్నారు అంటే నాదిగా చేసుకున్నారు కదా? మరయితే నాది అనే దానిపై అధికారం ఉంటుంది. కనుక పాత సంస్కారాలను నావి అనుకుంటే నావి అనేవి తమ స్థానాన్ని తీసుకుంటాయి కదా! నా సంస్కారం అని బ్రాహ్మణాత్మ అనవచ్చా? నాది, నాది అన్నారు కనుకనే అవి తమ స్థానాన్ని తీసుకున్నాయి. బ్రాహ్మణులైన మీరు నాది అనకూడదు. ఇవి వెనుకటి జీవితం యొక్క సంస్కారాలు. శూద్రజీవితం యొక్క సంస్కారాలు. బ్రాహ్మణ జీవితానివి కాదు. నాది, నాది అన్నారు కనుక అవి కూడా నా అధికారం అంటూ కూర్చుని ఉండిపోయాయి. బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టసంస్కారాలు తెలుసు కదా! మీరు వేటినైతే పాత సంస్కారాలు అంటున్నారో అవి పాతవి కాదు, అనాది, ఆది సంస్కారాలే శ్రేష్టాత్మలైన మీ యొక్క పాత సంస్కారాలు. ఇవి ద్వాపరయుగం యొక్క మధ్య సంస్కారాలు. బాబా యొక్క సహాయంతో మధ్య సంస్కారాలను సమాప్తి చేసుకోవాలి, కష్టమేమీలేదు. కానీ ఏమౌతుంది? కంబైండ్ అంటే సమయానికి సహయోగిగా అవ్వటం అని అర్ధం. ఇలా కంబైండ్ గా ఉంటున్నారు కానీ ఆ కంబైండ్ ని తెలుసుకుని సమయానికి సహయోగం తీసుకోవటం లేని కారణంగా మధ్య సంస్కారాలు మహాన్ గా అయిపోతున్నాయి.
బాప్ దాదాకి తెలుసు, పిల్లలందరు బాబా యొక్క ప్రేమకు పాత్రులు మరియు అధికారులు. ప్రేమ ఉన్న కారణంగానే అందరు ఇక్కడికి వచ్చారని కూడా బాబాకి తెలుసు. విదేశం నుండి వచ్చినా, దేశం నుండి వచ్చినా అందరు పరమాత్మ ప్రేమ యొక్క ఆకర్షణతో మీ ఇంటికి చేరుకున్నారు. బాప్ దాదాకి కూడా తెలుసు, ప్రేమలో చాలామంది పాస్ అయిపోయారు. ప్రేమ అనే విమానంలో విదేశం నుండి ఇక్కడికి చేరుకున్నారు. చెప్పండి, అందరు ప్రేమ యొక్క బంధనలో బంధించబడే ఇక్కడికి చేరుకున్నారు కదా! పరమాత్మ యొక్క ఈ ప్రేమ మనస్సుకి విశ్రాంతినిచ్చేది. మంచిది, ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి! చేతులు ఊపండి, మంచిది. స్వాగతం. బాప్ దాదా హోమ్ వర్క్ ఇచ్చారు కదా, హోమ్ వర్క్ జ్ఞాపకం ఉందా? బాప్ దాదా దగ్గరికి చాలా చోట్ల నుండి ఫలితం వచ్చింది. కానీ ఇప్పుడేమి చేయాలి? అందరి ఫలితం రాలేదు. కొంతమందిది కొంత శాతంలోనే వచ్చింది. బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - అందరూ పూజ్యనీయ ఆత్మలు. పూజ్యనీయ ఆత్మల యొక్క విశేష లక్షణం - ఆశీర్వాదాలు ఇవ్వటమే. మీ అందరికీ తెలుసు, పూజ్యనీయ ఆత్మలైన మీరు ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వటం అంటే ఆశీర్వాదాలు తీసుకోవటమే అని అర్థం. ఎవరైతే ఆశీర్వాదాలు ఇస్తారో, ఎవరికి ఇస్తారో వారి మనస్సు నుండి మాటిమాటికి ఆశీర్వాదాలు ఇచ్చేవారికి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. పూజ్యాత్మలైన మీ నిజ సంస్కారం - ఆశీర్వాదాలు ఇవ్వటం. ఆశీర్వాదాలు ఇవ్వటమే అనాది సంస్కారం. మీ జడచిత్రాలే ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు చైతన్య పూజ్య ఆత్మలైన మీకు ఆశీర్వాదాలు ఇవ్వటం అనేది స్వతహా సంస్కారంగా ఉండాలి. దీనిని నా సంస్కారం అనండి. ద్వాపరయుగం యొక్క మధ్య సంస్కారాలు స్వతహా సంస్కారాలుగా అయిపోయాయి. వాస్తవానికి ఆశీర్వాదాలు ఇచ్చే ఈ సంస్కారం స్వతహా సంస్కారం. ఎప్పుడైనా, ఎవరికైనా ఆశీర్వాదం ఇస్తే ఆ ఆత్మ ఎంత సంతోషడుతుంది, ఆ సంతోషం యొక్క వాయుమండలం ఎంత సుఖదాయిగా ఉంటుంది! ఎవరైతే ఈ హోమ్ వర్క్ చేసారో, వారు వచ్చినా, రాకపోయినా కానీ అందరూ బాప్ దాదా ఎదురుగా ఉన్నారు, వారందరికీ బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మీరందరూ చేసారు మరియు దీనిని మీ స్వతహా సంస్కారంగా చేసుకుంటూ ఇక ముందు కూడా చేస్తూ, చేయిస్తూ ఉండాలి. మరియు ఎవరైతే ఎంతో కొంత చేసారో వారు లేదా చేయని వారు అందరూ స్వయాన్ని సదా నేను పూజ్యాత్మను, నేను బాబా యొక్క శ్రీమతంపై నడిచే విశేషాత్మను .... అనే స్మృతిని మాటిమాటికి మీ స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మీరు ఎలా తయారయ్యేవారు? అని అడిగితే అందరు మేము లక్ష్మీనారాయణులుగా అవుతాము అని చెప్తారు. రాముడు, సీతగా అవ్వటంలో ఎవరూ చేతులు ఎత్తరు. 16 కళాసంపన్నంగా అయ్యే లక్ష్యం ఉంది, 16 కళాసంపన్నులు అంటే పరమపూజ్యులు, పూజ్యాత్మల యొక్క కర్తవ్యమే ఆశీర్వాదాలు ఇవ్వటం. నడుస్తూ, తిరుగుతూ ఈ సంస్కారాన్ని సహజంగా మరియు సదాకాలికంగా తయారు చేసుకోండి. పూజ్యులు మరియు 16 కళా సంపన్నులు ఇదే లక్ష్యం కదా!
బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఎవరైతే హోమ్ వర్క్ చేసారో వారికి మస్తకంలో విజయీ తిలకం బాబా ద్వారా పెట్టబడింది. వెనువెంట సేవాసమాచారం కూడా బాప్ దాదా దగ్గరికి అన్ని వైపుల నుండి, అన్ని వర్గాల నుండి, సెంటర్స్ నుండి చాలా మంచి ఫలితంతో చేరుకుంది. హోమ్ వర్క్ చేసినందుకు ఒక శుభాకాంక్షలు మరియు వెనువెంట సేవకు కూడా శుభాకాంక్షలు. కోటాను కోటానుకోట్లరెట్లు శుభాకాంక్షలు. బాబా చూసారు, గ్రామ గ్రామంలో సందేశం ఇచ్చే సేవ చాలా మంచి పద్దతితో చాలా ప్రాంతాలలో చేసారు, దయాహృదయులై ఉత్సాహ, ఉల్లాసాలతో చేసారు, కనుక ఫలితం కూడా మంచిగా కనిపించింది. శ్రమతో కాకుండా బాబాపై ప్రేమతో అంటే సందేశం ఇవ్వాలనే ప్రేమతో, ప్రేమలో లీనమై ప్రేమతో ఎవరైతే సేవ చేసారో ఆ సేవాధారులందరికీ బాబా యొక్క కోటానుకోట్ల రెట్లు ప్రేమ స్వతహాగానే ప్రాప్తించింది మరియు ప్రాప్తిస్తుంది. అందరు తమ ప్రియమైన దాదీని చాలా స్నేహంతో జ్ఞాపకం చేస్తూ, దాదీకి ప్రేమ యొక్క బదులు ఇస్తున్నారు, ప్రేమ యొక్క ఈ సువాసన బాప్ దాదా దగ్గరికి చాలా బాగా చేరుకుంది మరియు ఇప్పుడు కూడా మధువనంలో ఏవైతే కార్యాలు జరుగుతున్నాయో, విదేశీయుల యొక్క లేదా భారతవాసీయుల యొక్క కార్యాలన్నీ కూడా పరస్పర సహయోగం, గౌరవం ఆధారంగా చాలా బాగా సఫలం అయ్యాయి మరియు ఇక ముందు జరగనున్న కార్యాలు కూడా సఫలం అవుతాయి. ఎందుకంటే సఫలత మీ కంఠహారం. మీరు బాబా యొక్క కంఠహారం కూడా. బాబా కూడా స్మృతి ఇప్పించారు - మీరు ఎప్పుడూ కూడా ఓడిపోకూడదు. ఎందుకంటే మీరు బాబాకి కంఠహారం. కంఠహారాలు ఎప్పుడూ ఓడిపోరు. హారంగా అవ్వాలా లేదా ఓడిపోవాలా? ఓడిపోకూడదు కదా! హారంగా అవ్వటమే బావుంటుంది కదా! అయితే ఎప్పుడూ ఓడిపోకూడదు. ఓడిపోయేవారు చాలా కోట్ల ఆత్మలు ఉన్నారు కానీ మీరు హారమై మెడ చుట్టూ ఉన్నవారు. ఇలా ఉన్నారు కదా! బాబాపై ప్రేమ విషయంలో మాయ ఎన్ని తుఫానులను ఎదురుగా తీసుకువచ్చినా కానీ మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మల ముందు తుఫాను కూడా కానుకగా అయిపోతుంది. ఇలా సంకల్పం చేయండి, ఈ వరదానం సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఎంత ఉన్నతమైన పర్వతం అయినా పర్వతం దూది వలె అయిపోతుంది. ఇప్పుడు సమయం యొక్క సమీపతననుసరించి ప్రతి సమయం వరదానాలను అనుభవంలోకి తీసుకురండి. అనుభవం యొక్క అధికారిగా అవ్వండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అశరీరిగా అయ్యేటువంటి, ఫరిస్తా స్వరూపంగా అయ్యేటువంటి వ్యాయామం చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణులు, ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే అశరీరి ఇలా నడుస్తూ, తిరుగుతూ, కార్యవ్యవహారాలు చేస్తూ కూడా ఒక నిమిషం, రెండు నిమిషాలు తీసి ఈ అభ్యాసం చేయండి. మరలా ఏ సంకల్పం చేసానో ఆ స్వరూపాన్ని అనుభవంచేసుకున్నానా? అని పరిశీలన చేసుకోండి.
ఈవిధంగా నలువైపుల ఉన్న సదా శ్రేష్టస్వమానధారులకు, సదా స్వయాన్ని పరమ పూజ్యులుగా మరియు పూర్వీకులుగా అనుభవం చేసుకునేవారికి, సదా స్వయాన్ని ప్రతి సబ్జక్టులో అనుభవీ స్వరూపంగా తయారుచేసుకునేవారికి, సదా బాబా యొక్క హృదయసింహాసనాధికారులకు, భృకిటి సింహాసనాధికారులకు, సదా శ్రేష్టస్థితి యొక్క అనుభవాలలో స్థితులయ్యేవారికి, నలువైపుల
ఉన్న పిల్లలందరికీ ప్రియస్కృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment