30-11-2007 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సత్యత మరియు పవిత్రత యొక్క శక్తిని స్వరూపంలోకి తీసుకువస్తూ బాలక్ (పిల్లవాడు) మరియు మాలిక్ (యజమాని) స్థితి యొక్క సమానత ఉంచుకోండి.
ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు తన యొక్క సత్యస్వరూప, శక్తిస్వరూప పిల్లలను చూస్తున్నారు. ఎందుకంటే సత్యతాశక్తి సర్వశ్రేష్టమైనది. ఈ సత్యతాశక్తికి ఆధారం సంపూర్ణపవిత్రత. మనస్సులో, వాచాలో, కర్మలో, సంబంధ, సంపర్కంలో, స్వప్నంలో కూడా అపవిత్రత యొక్క గుర్తులు ఉండకూడదు. పవిత్రత యొక్క ప్రత్యక్ష స్వరూపం ఏమి కనిపిస్తుంది? ఆవిధమైన పవిత్ర ఆత్మ యొక్క నడవడిక మరియు ముఖంలో దివ్యత స్పష్టంగా కనిపిస్తుంది. వారి నయనాలలో ఆత్మిక మెరుపు, ముఖంలో సదా హర్షితముఖత మరియు నడవడికలో ప్రతి అడుగులో బాబా సమానంగా కర్మయోగిగా ఉంటారు. సత్యమైన బాబా ద్వారా ఈవిధమైన సత్యవాదిగా ఈ సమయంలో మీరందరు తయారవుతున్నారు. ప్రపంచంలో కొంతమంది తమనితాము సత్యవాదిగా చెప్పుకుంటారు, సత్యం కూడా మాట్లాడతారు కానీ సంపూర్ణపవిత్రతయే సత్యమైన సత్యతాశక్తి. ఈ సమయంలో ఈ సంగమ యుగంలో మీరందరు ఆవిధంగా అవుతున్నారు. ఈ సంగమయుగం యొక్క శ్రేష్ఠ ప్రాప్తి - సత్యతాశక్తి, పవిత్రతాశక్తి. దీని ప్రాప్తిగా సత్యయుగంలో మీరందరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యి ఆత్మ మరియు శరీరం రెండింటితో పవిత్రంగా అవుతున్నారు. మొత్తం సృష్టిచక్రంలో ఎవరూ ఆత్మ మరియు శరీరంతో పవిత్రంగా అవ్వటంలేదు. ఆత్మ పవిత్రంగా ఉంటుంది కానీ పవిత్రమైన శరీరం లభించదు. ఈ విధమైన సంపూర్ణపవిత్రత ఈ సమయంలో మీరందరు ధారణ చేస్తున్నారు. నిశ్చయంతో చెప్తున్నారు, ఏ నిశ్చయంతో చెప్తున్నారో జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం చేసుకోండి. అందరు మనస్సుతో, అనుభవంతో పవిత్రత మా జన్మసిద్ధ అధికారం అని చెప్తున్నారు. జన్మసిద్ద అధికారం సహజంగా లభిస్తుంది. ఎందుకంటే పవిత్రత మరియు సత్యతను పొందడానికి మీరందరు మొదట మీ సత్యస్వరూపమైన ఆత్మను తెలుసుకున్నారు మరియు మీ సత్యమైన తండ్రిని, శిక్షకుడిని, సద్గురువుని గ్రహించారు. గ్రహించారు మరియు పొందారు. ఎప్పటి వరకు మీ సత్యస్వరూపాన్ని మరియు సత్యమైన తండ్రిని తెలుసుకోరో అంతవరకు సంపూర్ణపవిత్రత మరియు సత్యతాశక్తి రాదు.
మీరందరు సత్యత మరియు పవిత్రత శక్తి యొక్క అనుభవీలే కదా! అనుభవీలేనా? అనుభవీలేనా? ప్రజలు ప్రయత్నిస్తున్నారు కానీ యదార్థరూపంలో తమ యొక్క స్వరూపాన్ని మరియు సత్యబాబా యొక్క యదార్ధస్వరూపాన్ని తెలుసుకోలేదు. మరియు మీరందరు ఈ సమయం యొక్క అనుభవం ద్వారా పవిత్రతను ఎంత సహజంగా మీదిగా చేసుకున్నారంటే ఈ సమయం యొక్క ప్రాప్తి యొక్క ప్రాలబ్దంగా దేవతలకు పవిత్రత స్వతహాగా మరియు సంస్కారంగా ఉంటుంది. ఈవిధమైన స్వతహా సంస్కారం యొక్క అనుభవం మీరే పొందుతారు. కనుక పరిశీలన చేసుకోండి, పవిత్రత మరియు సత్యతాశక్తి స్వతహా సంస్కార రూపంలో తయారయ్యిందా? అని. మీరు ఏమి అనుకుంటున్నారు? ఎవరైతే పవిత్రత మా యొక్క జన్మసిద్ధ అధికారం అనుకుంటున్నారో వారు చేతులు ఎత్తండి! జన్మసిద్ధ అధికారమేనా లేదా శ్రమ చేయవలసి వస్తుందా? శ్రమ చేయవలసిన అవసరం లేదు కదా! సహజమే కదా! ఎందుకంటే జస్మసీద్ద అధికారులు సహజంగా లభిస్తుంది. శ్రమ చేయక్కర్లేదు. ప్రపంచం వారు అసంభవం అంటారు కానీ మీరు అసంభవాన్ని సంభవం మరియు సహజం చేసుకున్నారు.
ఎవరైతే కొత్త,క్రొత్త పిల్లలు మరియు మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి! ఎవరైతే క్రొత్త పిల్లలు మరియు మొదటిసారి వచ్చారో వారికి శుభాకాంక్షలు.ఎందుకంటే భలే ఆలశ్యంగా వచ్చారు. కానీ చాలా ఆలశ్యంగా రాలేదు. మరియు క్రొత్త పిల్లలకు బాబా ఇచ్చే వరదానం ఏమిటంటే చివరి వచ్చినా కూడా తీవ్రపురుషార్ధం చేసి మొదటి డివిజన్లోకి వస్తారు. మొదటి నెంబర్ లోకి రారు కానీ మొదటి తరగతిలోకి వస్తారు. క్రొత్త పిల్లలకు ఇంత ధైర్యం ఉందా! ఎవరైతే మొదటి తరగతిలోకి వస్తారో వారు చేతులు ఎత్తండి! టి.విలో మీ చేతులు కనపడుతున్నాయి మరి చూసుకోండి. మంచిది, ధైర్యవంతులు. ధైర్యానికి శుభాకాంక్షలు. మరియు ధైర్యం ఉన్న వారికి బాబా యొక్క సహాయం అయితే ఉంటుంది కానీ బ్రాహ్మణ పరివారం అందరి యొక్క శుభభావన, శుభకామన మీ అందరి వెంట ఉంటుంది. అందువలన ఎవరైతే క్రొత్తగా మొదటిసారి వచ్చారో వారందరికీ బాప్ దాదా మరియు పరివారం నుండి రెండురెట్లు కోటానుకోట్ల శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మొదటిసారి వచ్చినవారందరికీ కూడా సంతోషంగా ఉంది కదా! విడిపోయిన ఆత్మలు తిరిగి మరలా మీ పరివారంలోకి చేరుకున్నారు. బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు మీరందరు కూడా సంతోషిస్తున్నారు. బాప్ దాదా వతనంలో దాదీతో పాటు ఒక ఫలితం చూసారు. ఏమి ఫలితం చూసారు? మీరందరు తెలుసు కుంటున్నారు, అంగీకరిస్తున్నారు. మేము పిల్లల నుండి యజమానులం అని. అవును కదా! యజమానులు మరియు పిల్లలు కూడా! అందరు కదా? చేతులు ఎత్తండి! ఆలోచించి ఎత్తండి! లెక్కపెడతారు కదా! మంచిది, చేతులు దించేయండి. బాప్ దాదా చూసారు, పిల్లవానిస్థితి యొక్క నషా మరియు నిశ్చయం ఇదైతే సహజంగా ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మాకుమారీ మరియు బ్రహ్మాకుమారులు అనుకుంటున్నారు అంటే పిల్లలుగా అయినప్పుడే బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులు అంటారు. మరియు మొత్తం రోజంతా నా బాబా, నా బాబా అని ఇదే స్మృతి చేస్తున్నారు మరలా మర్చిపోతున్నారు కూడా కానీ మధ్యమధ్యలో మరలా జ్ఞాపకం వస్తుంది మరియు సేవలో కూడా బాబా, బాబా అనే మాట స్వతహాగా నోటి నుండి వస్తుంది. ఒకవేళ బాబా అనే మాట రాకపోతే జ్ఞానం యొక్క ప్రభావం పడనే పడదు. ఏ సేవ చేస్తున్నా, ఉపన్యాసం చెప్తున్నా, కోర్స్ చెప్తున్నా, రకరకాల టాపిక్ పై ఉపన్యాసం చెప్తున్నా సత్యమైన సేవ యొక్క ప్రత్యక్షస్వరూపం లేదా ప్రత్యక్ష ప్రమాణం ఇదే - వినేవారు కూడా నేను కూడా బాబా వాడిని అని అనుభవం చేసుకోవాలి. వారి నోటి నుండి కూడా బాబా, బాబా అనే మాట రావాలి. ఏదో ఒక శక్తి అని కూడా కాదు, బావుంది అని కూడా కాదు. కానీ నా బాబా అని వారు కూడా అనుభవం చేసుకోవాలి దీనినే సేవ యొక్క ప్రత్యక్ష ఫలం అంటారు. పిల్లవానిస్థితి యొక్క నషా మరియు నిశ్చయం మంచిగా ఉంటుంది కానీ యజమాని స్థితి యొక్క నషా మరియు నిశ్చయం నెంబర్ వారీగా ఉంటుంది. పిల్లవాని స్థితి నుండి యజమాని స్థితి యొక్క నషా ప్రత్యక్షనడవడికలో మరియు ముఖం ద్వారా అప్పుడప్పుడు కనిపిస్తుంది మరియు అప్పుడప్పుడు తక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి మీరు డబల్ యజమానులు ఒకటి - బాబా యొక్క ఖజానాలకు యజమానులు. ఖజానాలకు యజమానులు కదా? మరియు బాబా అందరికీ ఒకేవిధంగా ఖజానాలను ఇచ్చారు. కొంతమందికి లక్ష, కొంతమందికి వేలు ఈవిధంగా ఇవ్వలేదు. అందరికీ అన్ని ఖజానాలు బేహద్ గా ఇచ్చారు. ఎందుకంటే బాబా దగ్గర బేహద్ ఖజానాలు ఉన్నాయి. తక్కువ లేవు. కనుక బాప్ దాదా అందరికీ అన్ని ఖజానాలు ఒకేవిధంగా, ఒకే లెక్కతో ఇచ్చారు. మరియు రెండు - స్వరాజ్యానికి యజమానులు. అందువలనే బాప్ దాదా నిశ్చయంతో చెప్తున్నారు, నా ఒక్కొక్క బిడ్డ రాజాబిడ్డ అని. రాజా పిల్లలే కదా? ప్రజలు కాదు కదా? రాజయోగులా లేదా ప్రజాయోగులా? రాజయోగులు కదా! స్వరాజ్యానికి యజమానులు. కానీ బాప్ దాదా దాదీతో కలిసి ఫలితంలో ఏమి చూసారంటే ఎంతగా పిల్లవాని స్థితి యొక్క నషా ఉంటుందో అంతగా యజమాని స్థితి యొక్క నషా తక్కువగా ఉంటుంది. ఎందుకు? స్వరాజ్యానికి యజమానులం అనే నషా సదా ఉంటే మధ్యమధ్యలో సమస్యలు లేదా విఘ్నాలు ఏవైతే వస్తున్నాయో అవి రావు. సమస్యలు లేదా విఘ్నాలు రావడానికి విశేష ఆధారం - మనస్సు. మనస్సే అలజడిలోకి వస్తుంది. అందువలనే బాప్ దాదా యొక్క మహామంత్రం కూడా మన్మనాభవ, తనుమనాభవ, ధనమనాభవ కాదు. మన్మనాభవ. ఒకవేళ స్వరాజ్యానికి యజమానులుగా ఉంటే మనస్సు మీకు యజమాని కాదు. మనస్సు మీ కర్మచారి కానీ రాజు కాదు. రాజు అంటే అధికారి. ఆధీనం అయ్యేవారిని రాజు అనరు. ఫలితంలో ఏమి చూసారు? నేను మనస్సుకి యజమాని అయిన రాజ్యాధికారి యజమానిని అనే స్మృతి మరియు ఈ ఆత్మిక స్థితి తక్కువగా ఉంటుంది. ఇది మొదటి పాఠం. మీరందరు మొదటి పాఠం చేసారా? నేను ఆత్మను అనేది మొదటి పాఠం, పరమాత్మ పాఠం రెండవది. కానీ మొదటి పాఠం - నేను యజమాని రాజును, ఈ కర్మేంద్రియాలకు అధికారి ఆత్మను. శక్తిశాలి ఆత్మను. సర్వశక్తులు ఆత్మ యొక్క నిజగుణాలు. బాప్ దాదా చూసారు, నేను ఎవరు, ఏవిధంగా ఉంటాను అనేది స్మృతిలోకి తీసుకురావటం, ఉండటం, ముఖం ద్వారా అనుభవం చేయించడం, సమస్యలకు అతీతం అవ్వటం దీనిలో ఇప్పుడు చాలా ధ్యాస పెట్టుకోవాలి. కేవలం నేను ఆత్మను అని కాదు, కానీ ఏవిధమైన ఆత్మను అనేది స్మృతిలో ఉంచుకుంటే మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ ముందుకు సమస్య లేదా విఘ్నం యొక్క ఏ శక్తి రాలేదు. ఇప్పుడింకా ఫలితంలో ఏదోక సమస్య లేదా విఘ్నం కనిపిస్తుంది. తెలుసు కానీ నడవడిక మరియు ముఖంలో నిశ్చయం యొక్క ప్రత్యక్ష స్వరూపం యొక్క నషా ఇంకా ప్రత్యక్షం అవ్వాలి. దీని కొరకు ఈ యజమాని స్థితి యొక్క నషాను మాటిమాటికి పరిశీలన చేసుకోండి. పరిశీలన చేసుకోవటం అనేది సెకను యొక్క విషయం. ఏ కర్మ చేస్తున్నా, కర్మను ప్రారంభిస్తున్నా పరిశీలించుకోండి - యజమాని స్థితి యొక్క అధికారంతో కర్మ చేయించగల నియంత్రణా శక్తి మరియు పరిపాలనాశక్తి గల ఆత్మనేనా? లేక కర్మ సాధారణంగా ప్రారంభమైందా? స్మృతి స్వరూపంతో కర్మను ప్రారంభించటం మరియు సాధారణ స్థితితో కర్మను ప్రారంభించటంలో చాలా తేడా ఉంది. హద్దులోని పదవి గల వారు తమ పదవి యొక్క సీట్ లో కూర్చుని కార్యాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా మీ యజమాని స్థితి యొక్క స్వరాజ్యాధికారి అనే ఆసనంపై ఆసీనులైన తర్వాత ప్రతి కార్యం చేయండి. యజమాని స్థితి యొక్క పరిశీలనను మరింత పెంచుకోవాలి. మరియు దీనికి గుర్తు అంటే యజమాని స్థితికి గుర్తు ఏమిటంటే సదా ప్రతి కార్యంలో తేలికతనం మరియు సంతోషం అనుభూతి అవుతుంది మరియు సఫలత యొక్క ఫలితం సహజంగా అనుభవం అవుతుంది. ఇప్పుడు అక్కడక్కడా ఇప్పటి వరకు కూడా అధికారికి బదులు ఆధీనం అయిపోతున్నారు. ఆధీనతకు గుర్తు ఏమి కనిపిస్తుంది? నా సంస్కారం అని మాటిముటికి అంటారు. చేయాలని అనుకోవటం లేదు కానీ ఇది నా సంస్కారం అని అంటారు. బాప్ దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు - ఇది నా స్వభావం లేదా సంస్కారం అని అంటున్నారు, ఈ బలహీన సంస్కారాలు మీవా? మీవా? ఇవి రావణుని యొక్క మధ్యకాల సంస్కారాలు, రావణుడు ఇచ్చినవి. వాటిని నావి అనటం పొరపాటు. మీ సంస్కారం ఏది అంటే బాబా సంస్కారమే మీ సంస్కారం. నావి, నావి అని అనుకుంటూ నావి అని అంటున్నారు. అందువలనే అవి అధికారి అయిపోయాయి, మీరు ఆధీనం అయిపోతున్నారు. బాబా సమానంగా అవ్వాలి కనుక నా సంస్కారం అనేది లేదు. బాబా సంస్కారమే నా సంస్కారం. బాబా సంస్కారాలు ఏవి? విశ్వ కళ్యాణకారి, శుభభావన, శుభ కామనధారి. కనుక ఆ సమయంలో బాబా సంస్కారాలను ఎదురుగా తెచ్చుకోండి. లక్ష్యం అయితే బాబా సమానంగా అవ్వాలని కానీ లక్షణాలు రావణునివి ఉండిపోయాయి. అవి కలిసిపోతున్నాయి, బాబా యొక్క మంచి సంస్కారాలు కొన్ని మరియు పాత సంస్కారాలు కొన్ని కలిసిపోతున్నాయి. ఇలా రెండూ కలిసి ఉండటం వలన గొడవ జరుగుతుంది. సంస్కారం అనేది ఎలా తయారవుతుంది? అది అయితే అందరికీ తెలుసు కదా! మనస్సు, బుద్ధి యొక్క సంకల్పం మరియు కర్మ ఆధారంగా సంస్కారం తయారవుతుంది. మొదట మనస్సు సంకల్పం చేస్తుంది, బుద్ధి దానికి సహయోగం ఇస్తుంది అప్పుడు అదే మంచి లేదా చెడు సంస్కారం అయిపోతుంది. బాప్ దాదా దాదీతో పాటు కలిసి ఫలితంలో ఏమి చూశారంటే బాబా బిడ్డగా అయిన నషా కంటే యజమాని సంస్కారం యొక్క నషా ఎంత సహజంగా ఉండాలో అది తక్కువగా ఉంది. వాటిని సమాధాన పరుచుకోవడానికి తిరిగి యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారు. అవ్వడానికి బ్రాహ్మణులు కానీ మధ్యమధ్యలో క్షత్రియులు అయిపోతున్నారు. కనుక క్షత్రియులుగా కాకూడదు. బ్రాహ్మణుల నుండి దేవతగా అవ్వాలి. క్షత్రియులుగా అయ్యేవారు చాలామంది రానున్నారు. వారు వెనుక వచ్చేవారు కానీ మీరు అధికారి ఆత్మలు. అయితే ఫలితం విన్నారా? అందువలన మాటిమాటికి నేనెవరు? అనేది స్మృతిలోకి తెచ్చుకోండి. అలాగే ఉన్నాను అని అనుకోవటం కాదు, స్మృతి స్వరూపంలోకి తీసుకురండి. సరేనా! మంచిది. ఫలితం కూడా చెప్పాను. ఇప్పుడు సమస్య, విఘ్నం , అలజడి, వ్యర్ధ సంకల్పాలు, వ్యర్ధ కర్మ, వ్యర్ధ సంబంధం, వ్యర్ధ స్మృతి అనే పేర్లను సమాప్తి చేయండి మరియు చేయించండి. సరేనా, చేస్తారా? చేస్తారా? ధృడ సంకల్పం అనే చేయి ఎత్తండి. మామూలుగా చేతులెత్తటం అనేది సాధారణం అయిపోయింది, అందువలన చేతులు ఎత్తించటం లేదు. మనస్సులో ధృడ సంకల్పం అనే చేయి ఎత్తండి. మనస్సులో ఎత్తండి, శరీరం యొక్క చేయి కాదు. అవి అయితే చాలా చూశాను. అందరూ కలిసి మనస్సుతో ధృడ సంకల్పం అనే చేతిని ఎత్తితేనే విశ్వం యొక్క మూలమూలల్లో అందరు సుఖదాత, శాంతి దాత అయిన మా తండ్రి వచ్చేశారు అని సంతోషంతో చేతులెత్తుతారు.
బాబాని ప్రత్యక్షం చేసే భాద్యత తీసుకున్నారు కదా! తీసుకున్నారా? పక్కాయేనా? టీచర్స్ తీసుకున్నారా? మంచిది. పాండవులు తీసుకున్నారా, పక్కా? మంచిది, తారీఖు నిర్ణయించారా? తారీఖు నిర్ణయం కాలేదా? ఎంత సమయం కావాలి? ఒక సంవత్సరం కావాలా, రెండు సంవత్సరాలు కావాలా? ఎన్ని సంవత్సరాలు కావాలి? బాప్ దాదా అన్నారు - ప్రతి ఒక్కరు స్వయం యొక్క పురుషార్ధం యొక్క శక్తిని అనుసరించి సహజంగా నడిచే లేదా ఎగిరే విధితో బాబా సమానంగా సంపన్నంగా అయ్యే తారీఖుని ఎవరికీ వారు నిర్ణయించుకోండి. బాబా అయితే ఇప్పుడే చేయండి అని చెప్తారు, కానీ మీ పురుషార్థం యొక్క శక్తిననుసరించి మీ తారీఖుని మీరు నిర్ణయించుకోండి. మరియు సమయాన్ని అనుసరించి పరిశీలించుకుంటూ కూడా ఉండండి - సమయాన్ని అనుసరించి మనస్సు యొక్క స్థితి, వాచా స్థితి, సంబంధ సంపర్కాల స్థితిలో ఉన్నతి జరుగుతుందా? ఎందుకంటే తారీఖు నిర్ణయించుకోవటం ద్వారా స్వతహాగానే ధ్యాస వెళ్తుంది.
అన్ని వైపుల నుండి, నలువైపుల నుండి సందేశాలు కూడా వచ్చాయి. ఈమెయిల్స్ కూడా వచ్చాయి. ఈమెయిల్ కంటే ముందుగా మీ సంకల్పం బాప్ దాదా దగ్గరకి చేరిపోతుంది. ఈమెయిల్ కంటే మనస్సు యొక్క సంకల్పం వేగవంతమైనది. అది ముందుగానే చేరిపోతుంది. ఎవరైతే ప్రియస్మృతులు పంపారో మరియు తమ స్థితి యొక్క సేవ యొక్క సమాచారం పంపారో వాటన్నింటినీ బాప్ దాదా స్వీకరించారు. అందరూ కూడా చాలా ఉత్సాహ ఉల్లాసాలతో ప్రియస్మృతులు పంపారు. దేశీయులు అయినా, విదేశీయులు అయినా కానీ వారందరికీ కూడా బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు మనస్పూర్వక ఆశీర్వాదాల సహిత ప్రేమను మరియు శక్తిని ఇస్తున్నారు. మంచిది. అన్నీ విన్నారు. వినటం సహజంగా అనిపిస్తుంది కదా! అదేవిధంగా దీని నుండి కూడా అతీతమైన శాంతిస్థితి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయం కావాలంటే అంత సమయం అనుభవం చేసుకోవాలి. మొదట విశేషంగా మనస్సుకి యజమానులు అవ్వాలి అందువలనే మనస్సుని జయించినవారు ప్రపంచాన్నే జయించగలరు అని చెప్తారు. ఇప్పుడు విన్నారు మరియు చూశారు. ఇప్పుడు ఆత్మ రాజు అయ్యి మనస్సు, బుద్ధి, సంస్కారాలను తన ఆధీనంలో ఉంచుకోగలుగుతుందా? మనస్సు, బుద్ధి, సంస్కారం మూడింటికీ యజమాని అయ్యి శాంతిగా ఉండమని ఆజ్ఞాపించండి. అనుభవం చేస్కోమని ఆజ్ఞాపించటం ద్వారా, అధికారిగా అవ్వటం ద్వారా మూడూ అదుపులో ఉంటున్నాయా? ఇప్పుడిప్పుడే అధికారి స్థితిలో స్థితులు అయిపోండి. మంచిది.
నలువైపుల ఉన్న సదా స్వమానధారి, సత్యతాశక్తి స్వరూపులకు, పవిత్రతా సిద్ధి స్వరూపులకు, సదా అచంచల, స్థిరమైన స్థితి యొక్క అనుభవీలకు, స్వపరివరక్తులు మరియు విశ్వ పరివర్తకులకు, సదా అధికారి స్థితి ద్వారా సర్వాత్మలకు బాబా ద్వారా అధికారం ఇప్పించే వారికి, నలువైపుల ఉన్న బాప్ దాదా యొక్క అదృష్టవంతమైన మరియు ప్రియమైన ఆత్మలకు పరమాత్మ యొక్క ప్రియస్మృతులు, మనస్పూర్వక ఆశీర్వాదాలను స్వీకరించండి మరియు బాప్ దాదా యొక్క మధురాతి మధుర పిల్లలకు నమస్తే.
Comments
Post a Comment