29-10-1987 అవ్యక్త మురళి

29-10-197         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 ‘‘తనువు, మనసు, ధనము మరియు సంబంధాల శక్తి’’

ఈ రోజు సర్వశక్తివంతుడైన తండ్రి తమ శక్తిశాలి పిల్లలను చూస్తున్నారు. ప్రతి బ్రాహ్మణాత్మ శక్తిశాలిగా అయ్యారు కానీ నంబరువారుగా ఉన్నారు. సర్వశక్తులు తండ్రి యొక్క వారసత్వము మరియు వరదాత యొక్క వరదానము. తండ్రి మరియు వరదాత - ఈ డబల్సం బంధము ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికీ ఈ శ్రేష్ఠ ప్రాప్తి జన్మిస్తూనే లభిస్తుంది. జన్మించగానే తండ్రి, సర్వశక్తులకు అనగా జన్మ సిద్ధ అధికారానికి అధికారులుగా చేస్తారు, అలాగే వరదాత సంబంధం ద్వారా జన్మ తీసుకుంటూనే మాస్టర్ సర్వశక్తివంతులుగా చేసి ‘సర్వ శక్తి భవ’ అనే వరదానాన్ని ఇస్తారు. పిల్లలందరికీ ఒక్కరి ద్వారా, ఒకే విధంగా డబల్ అధికారము లభిస్తుంది కానీ ధారణ చేసే శక్తి నంబరువారుగా చేసేస్తుంది. బాబా అందరినీ సదా మరియు సర్వ శక్తిశాలిగా చేస్తారు. కానీ పిల్లలు యథా శక్తిగా అవుతారు. వాస్తవానికి లౌకిక జీవితంలోనైనా లేక అలౌకిక జీవితంలోనైనా, శక్తులే సఫలతకు ఆధారము. ఎన్ని శక్తులో, అంత సఫలత. ముఖ్యమైన శక్తులు - తనువు, మనసు, ధనము మరియు సంబంధాలు. నాలుగూ అవసరమే. ఒకవేళ నాల్గింటిలో ఒక్క శక్తి తక్కువగా ఉన్నా సరే జీవితంలో సదా మరియు సర్వ సఫలత ఉండదు. అలౌకిక జీవితంలో కూడా నాలుగు శక్తులు అవసరమే.

ఈ అలౌకిక జీవితంలో ఆత్మ మరియు ప్రకృతి, ఈ రెండిటి ఆరోగ్యము అవసరము. ఆత్మ ఆరోగ్యంగా ఉన్నప్పుడు శారీరిక లెక్కాచారాలు లేక శారీరిక వ్యాధులు శూలము నుండి ముల్లుగా అయిన కారణంగా మరియు స్వ స్థితి కారణంగా స్వయాన్ని ఆరోగ్యంగా అనుభవం చేస్తారు. వారి ముఖం పైన, వ్యాధి వలన కలిగే బాధ యొక్క గుర్తులు ఉండవు. నోటి ద్వారా ఎప్పుడూ వ్యాధి యొక్క వర్ణణ జరగదు, కర్మభోగాన్ని వర్ణన చేసేందుకు బదులుగా కర్మయోగ స్థితిని వర్ణన చేస్తారు, ఎందుకంటే వ్యాధి యొక్క వర్ణన కూడా వ్యాధి వృద్ధి చెందేందుకు కారణమవుతుంది. వారు ఎప్పుడూ వ్యాధి వలన కలిగే బాధను అనుభవం చేయరు, అలానే ఇతరులకు ఆ బాధను వినిపించి బాధ యొక్క అలను కూడా వ్యాపింపజేయరు. పైపెచ్చు పరివర్తన శక్తి ద్వారా బాధను సంతుష్టతలోకి పరివర్తన చేసి సంతుష్టంగా ఉంటూ ఇతరులలో కూడా సంతుష్టతా అలను వ్యాపింపజేస్తారు అనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయి శక్తుల వరదానం నుండి సమయ ప్రమాణంగా సహన శక్తిని, ఇముడ్చుకునే శక్తిని ప్రయోగిస్తారు. సమయానికి శక్తుల వరదానాన్ని మరియు వారసత్వాన్ని కార్యంలోకి తీసుకురావడం - ఈ వరదానము అనగా ఆశీర్వాదమే వారికి మందులా పని చేస్తుంది. ఎందుకంటే సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ఏ సర్వ శక్తులైతే ప్రాప్తించాయో, అవి పరిస్థితిని బట్టి మరియు సమయాన్ని బట్టి, మీరు వాటిని ఎటువంటి విధి ద్వారా కార్యంలో వినియోగించాలనుకుంటే, అదే రూపంతో ఈ శక్తులు మీకు సహయోగిగా అవుతాయి. ఈ శక్తులను లేక ప్రభు వరదానాలను ఏ రూపంలో కావాలనుకుంటే, అవి ఆ రూపాన్ని ధారణ చెయ్యగలవు. ఇప్పుడిప్పుడే శీతలతా రూపంలో, ఇప్పుడిప్పుడే కాల్చే రూపంలో అనగా నీటి యొక్క శీతలతను కూడా అనుభవం చేయించగలవు మరియు అగ్ని యొక్క కాల్చడాన్ని కూడా అనుభవం చేయించగలవు, అలానే మందు వలె కూడా పని చేస్తాయి, అంతేకాక శక్తిశాలిగా తయారుచేసే తీపి లేహ్యం వలె కూడా పని చేస్తాయి. కేవలం సమయానికి కార్యంలో ఉపయోగించే అథారిటీగా అవ్వండి. ఈ సర్వశక్తులు మాస్టర్ సర్వశక్తివంతులైన మీ సేవాధారులు. ఎప్పుడు ఏ శక్తికి ఆర్డర్ చేస్తే, అది ‘హాజిర్ హజూర్’ (చిత్తం ప్రభూ) అని అంటూ సహయోగిగా అవుతుంది కానీ సేవ తీసుకునేవారు కూడా అంతటి చతురులుగా, తెలివైనవారిగా ఉండాలి. కనుక ఆత్మిక శక్తి ఆధారంగా శారీరిక శక్తిని సదా అనుభవం చేయగలరు అనగా సదా ఆరోగ్యంగా ఉంటున్న అనుభవం చేయగలరు.

ఈ అలౌకిక బ్రాహ్మణ జీవితమే సదా ఆరోగ్యవంతమైన జీవితం. వరదాత ద్వారా ‘సదా స్వస్థ భవ’ అనే వరదానం లభించింది. బాప్ దాదా చూస్తున్నారు - చాలామంది పిల్లలు ప్రాప్తించిన వరదానాలను సమయానికి కార్యంలో ఉపయోగించి లాభాన్ని తీసుకోలేకపోతున్నారు లేదా శక్తులు అనగా సేవాధారుల ద్వారా, తమ విశాలత మరియు విశాలబుద్ధి ద్వారా సేవను తీసుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ‘మాస్టర్ సర్వశక్తివాన్’ అనే స్థితి తక్కువైనదేమీ కాదు! ఇది శ్రేష్ఠమైన స్థితి, అంతేకాక డైరెక్ట్ పరమాత్మ ద్వారా లభించిన ‘పరమ టైటిల్’ కూడా. టైటిల్ యొక్క నషాను ఎంతగా ఉంచుకుంటారు! టైటిల్ ఎన్ని కార్యాలను సఫలం చేస్తుంది! మరి ఇది పరమాత్మ ఇచ్చిన టైటిల్, ఇందులో ఎంత సంతోషం మరియు శక్తి నిండి ఉన్నాయి! ఒకవేళ ఈ ఒక్క టైటిల్ యొక్క స్థితి రూపీ సీటుపై సెట్ అయి ఉంటే ఈ సర్వశక్తులు సేవ కొరకు సదా హాజరుగా ఉన్నట్లు అనుభవమవుతుంది. మీ ఆర్డర్ (ఆజ్ఞ) కొరకు వేచి ఉంటాయి. కనుక వరదానాన్ని మరియు వారసత్వాన్ని కార్యంలో ఉపయోగించండి. ఒకవేళ ‘మాస్టర్ సర్వశక్తివాన్’ అనే స్వమానంలో స్థితి అవ్వకపోతే, ఆ శక్తులను ఆజ్ఞపై నడిపించేందుకు బదులుగా మాటిమాటికి బాబాకు - ఈ శక్తినివ్వండి, ఈ పని చేయించండి, ఇది జరగాలి, ఇలా జరగాలి అని అర్జీలు వేస్తూ ఉంటారు. అర్జీలు వేసేవారు ఎప్పుడూ కూడా సదా రాజీగా ఉండలేరు. ఒక విషయం పూర్తి అవ్వగానే రెండవది మొదలైపోతుంది. అందుకే యజమానులుగా అయి, యోగయుక్తులుగా అయి, సేవాధారుల ద్వారా యుక్తియుక్త సేవను తీసుకున్నట్లయితే, సదా స్వతహాగానే ఆరోగ్యాన్ని అనుభవం చేస్తారు. దీనినే శారీరిక శక్తిని ప్రాప్తి చేసుకోవడం అని అంటారు.

అదే విధంగా, మనసా శక్తి అనగా శ్రేష్ఠ సంకల్ప శక్తి. మాస్టర్ సర్వశక్తివాన్ యొక్క ప్రతి సంకల్పంలో ఎంత శక్తి ఉందంటే, వారు ఏ సమయంలో ఏది కావాలనుకుంటే అది చెయ్యగలరు మరియు చేయించగలరు, ఎందుకంటే వారి సంకల్పాలు సదా శుభంగా, శ్రేష్ఠంగా మరియు కళ్యాణకారిగా ఉంటాయి. ఎక్కడైతే శ్రేష్ఠ కళ్యాణము యొక్క సంకల్పాలు ఉంటాయో, అక్కడ సిద్ధి తప్పకుండా ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివాన్ అయిన కారణంగా మనసు ఎప్పుడూ యజమానిని మోసగించలేదు, దుఃఖాన్ని అనుభవం చేయించలేదు. మనసు ఏకాగ్రంగా అనగా ఒకే స్థిరమైన స్థానంలో స్థితియై ఉంటుంది, భ్రమించదు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనసును స్థితి చెయ్యగలరు. మనసు ఎప్పుడూ ఉదాసీనంగా అవ్వలేదు ఎందుకంటే ఆ మనసు అనే సేవాధారి, దాసిగా అయిపోతుంది. ఇలాంటి మనసా శక్తి అలౌకిక జీవితంలో వారసత్వము మరియు వరదానము రూపంలో ప్రాప్తించింది.

అదే విధంగా, మూడవది ధనము యొక్క శక్తి అనగా జ్ఞాన ధనము యొక్క శక్తి. జ్ఞాన ధనము స్థూల ధనాన్ని స్వతహాగానే ప్రాప్తి చేయిస్తుంది. జ్ఞాన ధనము ఎక్కడైతే ఉంటుందో, అక్కడ ప్రకృతి స్వతహాగానే దాసిగా అవుతుంది. ఈ స్థూల ధనము ప్రకృతి సాధనాల కొరకు ఉంది. జ్ఞాన ధనము ద్వారా ప్రకృతి యొక్క సర్వ సాధనాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి, అందుకే జ్ఞాన ధనము అన్ని ధనములకు రాజు. ఎక్కడైతే రాజు ఉంటాడో, అక్కడ సర్వ పదార్థాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి, శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఒకవేళ ఏదైనా లౌకిక పదార్థాన్ని ప్రాప్తి చేసుకునేందుకు శ్రమ చేయవలసి వస్తోందంటే, దానికి కారణము జ్ఞాన ధనం యొక్క లోపమే. వాస్తవానికి జ్ఞాన ధనము పదమపతిగా తయారుచేసేటువంటిది. పరమార్థము, వ్యవహారాన్ని స్వతహాగానే సిద్ధి చేస్తుంది. కనుక పరమాత్మ ధనము కలిగినవారు పరమార్థులుగా అవుతారు. సంకల్పం చేసే అవసరం కూడా లేదు, స్వతహాగానే అన్ని అవసరాలు పూర్తి అవుతూ ఉంటాయి. ధనానికి ఎంత శక్తి ఉందంటే, ఈ జ్ఞాన ధనము అనేక జన్మలకు రాజులకే రాజులుగా చేస్తుంది. కనుక ధనము యొక్క శక్తి కూడా సహజంగా ప్రాప్తిస్తుంది.

అదే విధంగా, సంబంధాల శక్తి. సంబంధాల శక్తిని ప్రాప్తి చేసుకోవాలనే శుభ కోరిక ఎందుకు ఉంటుందంటే, సంబంధాలలో స్నేహము, సహయోగము ప్రాప్తిస్తాయి. ఈ అలౌకిక జీవితంలో సంబంధాల శక్తి డబల్ రూపంలో ప్రాప్తిస్తుంది. డబల్ సంబంధాల శక్తి ఎలా ప్రాప్తిస్తుందో తెలుసా? మొదటిది, తండ్రితో సర్వ సంబంధాలు, రెండవది, దైవీ పరివారంతో సంబంధము. కనుక డబల్ సంబంధమయింది కదా - తండ్రితో మరియు పరస్పరంలో కూడా. సంబంధము ద్వారా సదా నిస్వార్థ స్నేహము, అవినాశీ స్నేహము మరియు అవినాశీ సహయోగము సదా ప్రాప్తిస్తూనే ఉంటాయి. కనుక సంబంధాల శక్తి కూడా ఉంది కదా. మామూలుగా కూడా తండ్రి పిల్లలను ఎందుకు కావాలనుకుంటారు లేదా పిల్లలు తండ్రిని ఎందుకు కావాలనుకుంటారు? సహయోగం కోసము, సమయానికి సహయోగం లభించాలని. ఈ అలౌకిక జీవితంలో నాలుగు శక్తుల ప్రాప్తి వరదానము రూపంలో, వారసత్వము రూపంలో ఉంది. ఎక్కడైతే నాలుగు రకాల శక్తులు ప్రాప్తించాయో, అక్కడ మీ స్థితి ప్రతి సమయం ఎలా ఉంటుంది? సదా మాస్టర్ సర్వశక్తివాన్. ఈ స్థితి అనే సీటుపై సదా స్థితులై ఉన్నారా? ఈ స్థితినే ఇంకొక మాటలో చెప్పాలంటే స్వ యొక్క రాజు లేక రాజయోగి అని అంటారు. రాజుల భాండాగారము సదా నిండుగా ఉంటుంది. కనుక రాజయోగి అనగా సదా శక్తుల భాండాగారము నిండుగా ఉంటుంది, అర్థమయిందా? దీనినే శ్రేష్ఠ బ్రాహ్మణ అలౌకిక జీవితమని అంటారు. సదా యజమానులుగా అయి సర్వ శక్తులను కార్యంలో ఉపయోగించండి. యథా శక్తికి బదులు సదా శక్తిశాలిగా అవ్వండి. అర్జీలు వేసేవారిగా కాక సదా రాజీగా ఉండేవారిగా అవ్వండి. అచ్ఛా.

మధుబన్ కు వచ్చే అవకాశమైతే అందరికీ లభిస్తోంది కదా. ప్రాప్తించిన ఈ భాగ్యాన్ని సదా మీతో ఉంచుకోండి. భాగ్య విధాతను మీతో ఉంచుకోవడమనగా భాగ్యాన్ని మీతో ఉంచుకోవడం. మూడు జోన్ల వారు వచ్చారు. వేరు వేరు స్థానాల నుండి 3 నదులు వచ్చి కలిసాయి - దీనిని త్రివేణి సంగమం అని అంటారు. బాప్ దాదా అయితే వరదాతగా అయి అందరికీ వరదానాలనిస్తారు. వరదానాలను కార్యంలో ఉపయోగించడం అనేది స్వయంపై ఆధారపడి ఉంది. అచ్ఛా.

నలువైపులా ఉన్న వరదానాలు మరియు వారసత్వానికి అధికారులైన శ్రేష్ఠ ఆత్మలందరికీ, మాస్టర్ సర్వ శక్తివాన్ శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా సంతుష్టతా అలను వ్యాపింపజేసే సంతుష్ట ఆత్మలకు, సదా పరమార్థం ద్వారా వ్యవహారంలో సిద్ధిని ప్రాప్తి చేసుకునే మహాన్ ఆత్మలకు, బాప్ దాదా యొక్క స్నేహము మరియు శక్తి సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.

‘‘సర్వుల సహయోగంతో సుఖమయ ప్రపంచం’’ - ఈ కార్యక్రమం గురించి అవ్యక్త బాప్ దాదా ప్రేరణలు

ఈ టాపిక్ ఎలాంటిదంటే, అందరూ సహయోగమిచ్చేందుకు స్వయంగా ఆఫర్ చేస్తారు. సహయోగం ద్వారా తర్వాత సంబంధంలోకి కూడా వస్తారు కనుక ఆఫర్ దానంతట అదే వస్తుంది. కేవలం శుభ భావన, శుభ కామనలతో సంపన్నులై సేవాధారులు సేవలో ముందుకు వెళ్ళాలి. శుభ భావనకు ఫలము ప్రాప్తించకపోవడమనేది జరగనే జరగదు. సేవాధారుల శుభ భావన, శుభ కామనల ధరణి సహజంగా ఫలాన్నిఇచ్చేందుకు నిమిత్తంగా అవుతుంది. ఫలం తయారుగా ఉంది, కేవలం ధరణి తయారయ్యేందుకు కొద్దిగా సమయం పడుతుంది. ఫలాలైతే వెంట వెంటనే వెలువడతాయి కానీ దానికి యోగ్యమైన ధరణి కావాలి. ఇప్పుడు ఆ ధరణి తయారవుతోంది.

సేవ అయితే అందరిదీ చేయవలసిందే కానీ ఏవైతే విశేషమైన సత్తాలున్నాయో, ఆ సత్తాల వారు ఇంకా సమీపంగా రాలేదు. రాజ్య సత్తా వారి సేవ జరిగింది, ధర్మ సత్తా వారి సేవ జరిగింది కానీ వారు సహయోగులుగా అయి ముందుకు రావాలి, సమయానికి సహయోగులుగా అవ్వవలసిన అవసరముంది. దీనికోసం శక్తిశాలి బాణం వేయవలసి ఉంటుంది. శక్తిశాలి బాణం అనగా అందులో సర్వాత్మల పట్ల సహయోగ భావన ఉండాలి, సంతోష భావన ఉండాలి, సద్భావన ఉండాలి. దీని ద్వారా ప్రతి కార్యము సహజంగా సఫలమవుతుంది. ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో, అది వేరు వేరుగా చేస్తున్నారు. కానీ పూర్వ కాలంలో ఏదైనా కార్యం కోసం వెళ్ళేటప్పుడు పూర్తి పరివారం నుండి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళేవారు, ఆ ఆశీర్వాదాలే కార్యాన్ని సహజము చేస్తాయి. కనుక వర్తమాన సేవలో దీనిని కలపాలి. కనుక ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు అందరి శుభ భావనలు, శుభ కామనలు తీసుకోండి, అందరి సంతుష్టతా బలాన్ని నింపండి, అప్పుడు శక్తిశాలి ఫలము వెలువడుతుంది. ఇప్పుడైతే ఎక్కువ శ్రమ చేయవలసిన అవసరం లేదు. అందరూ లోలోపల ఖాళీగా ఉన్నారు. శ్రమ చేయవలసిన అవసరం లేదు. ఊదితే చాలు, ఎగిరి ఇక్కడికి వచ్చేస్తారు, అంత ఖాళీగా ఉన్నారు. అంతేకాక, ఈ రోజుల్లోనైతే రాజ్యాన్ని గాని, ధర్మాన్ని గాని కంట్రోల్ చేసేందుకు ఇంకేదో శక్తి కావాలని అందరూ భావిస్తున్నారు. లోలోపల వెతుకుతున్నారు. కేవలం బ్రాహ్మణాత్మలు సేవ చేసే విధిలో మార్పు కావాలి. అదే మంత్రంగా అయిపోతుంది. ఇప్పుడు ఆ మంత్రాన్ని ఉపయోగిస్తూనే సిద్ధి లభించాలి. 50 సంవత్సరాలు శ్రమ చేశారు. ఇవన్నీ జరగాల్సే ఉండినది, అనుభవీలుగా అయ్యారు. ఇప్పుడు ప్రతి కార్యంలో ‘‘సర్వుల సహయోగం ద్వారా సఫలత’’ అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇది బ్రాహ్మణుల కోసము టాపిక్. మిగతా ప్రపంచంలోని వారి కొరకు - ‘‘సర్వుల సహయోగంతో సుఖమయ ప్రపంచము’’ అనే టాపిక్ పెట్టాలి.

అచ్ఛా. ఇప్పుడిక మీ అందరి సిద్ధి యొక్క ప్రత్యక్ష రూపం కనిపిస్తుంది. ఏదైనా పాడైపోయిన కార్యం కూడా మీ దృష్టి ద్వారా, మీ సహయోగం ద్వారా సహజంగా పరిష్కారమవుతుంది. దీని కారణంగానే భక్తిలో ధన్యులము-ధన్యులము అని అంటూ పిలుస్తారు. ఈ సిద్ధులన్నీ కూడా మీ ఎదురుగా ప్రత్యక్ష రూపంలో వస్తాయి. అయితే మీరు సిద్ధి యొక్క రీతితో - అవును, ఇది జరిగిపోతుంది అని చెప్పరు, మీ డైరెక్షన్ స్వతహాగానే సిద్ధిని ప్రాప్తి చేయిస్తూ ఉంటుంది. దీని ద్వారానే ప్రజలు త్వరత్వరగా తయారవుతారు, అన్ని వైపుల నుండి వెలువడి మీ వైపుకు వస్తారు. ఈ సిద్ధి యొక్క పాత్ర ఇప్పుడు నడుస్తుంది. కానీ ముందు మీరు ఎంత శక్తిశాలిగా అవ్వాలంటే, ఆ సిద్ధిని మీరు స్వీకరించకూడదు, అప్పుడే ఈ ప్రత్యక్షత జరుగుతుంది. లేకుంటే సిద్ధిని ఇచ్చేవారే సిద్ధిలో చిక్కుకుంటే ఇక ఏం చేస్తారు? కనుక ఈ విషయాలన్నీ ఇక్కడి నుండే ప్రారంభమవ్వనున్నాయి. బాబాకు, వారు సర్జన్ కూడా, ఇంజనీర్ కూడా, వకీలు కూడా, జడ్జి కూడా అనే మహిమ ఏదైతే ఉందో, దీనిని అందరూ ప్రాక్టికల్ గా అనుభవం చేస్తారు. అప్పుడు అన్నివైపుల నుండి బుద్ధి తొలగి ఒక్కరి వైపుకు వెళ్తుంది. ఇప్పుడిక మీ వెనుక గుంపు ఏర్పడనున్నది. బాప్ దాదా అప్పుడప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తారు మరియు అప్పుడప్పుడు ఇప్పటి దృశ్యాన్ని చూస్తారు - చాలా తేడా అనిపిస్తుంది. మీరు ఎవరు అనేది బాబాకు తెలుసు. సంకల్పంలో, స్వప్నంలో కూడా లేనటువంటి, చాలా చాలా అద్భుతమైన పాత్ర జరగనున్నది. కేవలం కొద్దిగా ఆగి ఉంది, అంతే. ఎలాగైతే అప్పుడప్పుడు పరదా కొద్దిగా చిక్కుకుంటుంది కదా. జెండాను ఎగరవేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు చిక్కుకుంటుంది కదా, అలా ఇప్పుడు కొద్దికొద్దిగా చిక్కుకుంటుంది. మీరు ఎవరైనా, ఎలా ఉన్నా, చాలా మహాన్ గా ఉన్నారు. ఎప్పుడైతే మీ విశేషత ప్రత్యక్షమవుతుందో, అప్పుడు ఇష్టులుగా అవుతారు. ఆఖరికి భక్తుల మాల కూడా ప్రత్యక్షమవుతుంది కదా, కానీ మొదట ఠాకూర్లు (దేవతల విగ్రహాలు) అలంకరించుకొని తయారైనప్పుడే భక్తులు వస్తారు కదా. అచ్ఛా.

Comments