25-10-1987 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘నాలుగు విషయాల నుండి అతీతులుగా అవ్వండి’’
ఈ రోజు బాప్ దాదా తమ కమల-ఆసనధారీ శ్రేష్ఠ పిల్లలందరినీ చూస్తున్నారు. కమల ఆసనము బ్రాహ్మణ ఆత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు. ఆసనము స్థితులయ్యేందుకు (కూర్చునేందుకు) సాధనము. బ్రాహ్మణ ఆత్మలు కమల స్థితిలో స్థితులవుతారు కనుక కమల-ఆసనధారులుగా పిలవబడతారు. ఏ విధంగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారో, అలా ఆసనధారి నుండి సింహాసనాధికారిగా అవుతారు, కమల ఆసనధారులుగా ఎంత సమయమైతే అవుతారో, బహుకాలముగా లేక అల్పకాలికముగా, అంత సమయమే బహుకాలపు లేక అల్పకాలపు రాజ్య సింహాసనాధికారులుగా అవుతారు. కమల ఆసనము విశేషంగా బ్రహ్మాబాబా సమానంగా అతి అతీతమైన మరియు అతి ప్రియమైన స్థితికి సింబల్ (గుర్తు). బ్రాహ్మణ పిల్లలైన మీరు ఫాలో ఫాదర్ చేసేవారు కనుక బాబా సమానంగా కమల ఆసనధారులు. అతి అతీతమైనవారి లక్షణము - వారు బాబాకు మరియు పరివారమంతటికీ అతి ప్రియమైనవారిగా అవుతారు. అతీతత్వము అనగా నాలుగు వైపుల నుండి అతీతము.
(1) తమ దేహ భానము నుండి అతీతము. ప్రపంచములోని సాధారణ ఆత్మలకు నడుస్తూ తిరుగుతూ, ప్రతి కర్మ చేస్తూ స్వతహాగా మరియు సదా దేహ భానము తప్పకుండా ఉంటుంది, నేను దేహాన్ని అని అనుకోవడానికి శ్రమ చెయ్యరు, అనుకోకపోయినా సరే సహజ స్మృతి తప్పకుండా ఉంటుంది, అలాగే కమల ఆసనధారులైన బ్రాహ్మణ ఆత్మలు కూడా ఈ దేహ భానము నుండి స్వతహాగానే అతీతులుగా ఉండాలి, ఏ విధంగా అజ్ఞానీ ఆత్మలు ఆత్మ-అభిమానము నుండి అతీతులుగా ఉంటారో, అలా. మీరు ఆత్మ-అభిమానులుగానే ఉన్నారు. శరీర భానము తన వైపుకు ఆకర్షితము చెయ్యకూడదు. బ్రహ్మా బాబాను చూసారు కదా, వారికి నడుస్తూ-తిరుగుతూ ఫరిస్తా రూపము మరియు దేవతా రూపము స్వతహాగా స్మృతిలో ఉన్నాయి. అలా నేచురల్ గా దేహీ అభిమాని స్థితి సదా ఉండాలి - దేహ భానము నుండి అతీతము అని దీనినే అంటారు. దేహ భానము నుండి అతీతంగా ఉన్నవారే పరమాత్మ ప్రియులుగా అవుతారు.
(2) ఈ దేహము యొక్క సర్వ సంబంధాల నుండి దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, కృతి ద్వారా అతీతముగా ఉండాలి. దేహ సంబంధాలను చూస్తున్నా కూడా స్వతహాగానే ఆత్మిక, దేహీ సంబంధము స్మృతిలో ఉండాలి కనుకనే దీపావళి తర్వాత భయ్యా-దూజ్ ను జరుపుకున్నారు కదా. మెరుస్తున్న సితారగా లేక ప్రకాశిస్తున్న అవినాశీ దీపంగా అయినట్లయితే భాయి-భాయి సంబంధమైపోతుంది. ఆత్మల పరంగా భాయి-భాయి సంబంధము మరియు సాకార బ్రహ్మావంశీ బ్రాహ్మణుల పరంగా సోదరి-సోదరుల శ్రేష్ఠమైన శుద్ధ సంబంధము స్వతహాగానే స్మృతిలో ఉంటుంది. కనుక అతీతత్వము అనగా దేహము మరియు దేహ సంబంధాల నుండి అతీతము.
(3) దేహానికి చెందిన వినాశీ పదార్థాలలో కూడా అతీతత్వము. ఒకవేళ ఏ పదార్థమైనా, ఏ కర్మేంద్రియమునైనా విచలితము చేస్తే అనగా ఆసక్తి భావము ఉత్పన్నమైనట్లయితే ఆ అతీతత్వము ఉండదు. సంబంధాల నుండి అతీతముగా ఉండటం ఎంతైనా సహజమనిపిస్తుంది కానీ సర్వ పదార్థాల ఆసక్తి నుండి అతీతము - ‘అనాసక్తులు’గా అవ్వటంలో రాయల్ రూపపు ఆసక్తి ఉండిపోతుంది. ఆసక్తి యొక్క స్పష్టమైన రూపము కోరిక అని వినిపించాము కదా! ఈ కోరిక యొక్క సూక్ష్మ రూపము - మంచిగా అనిపించటం. కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది - ఈ సూక్ష్మ రూపము 'అచ్ఛా' (మంచి) బదులుగా 'ఇచ్ఛా' (కోరిక) రూపాన్ని కూడా తీసుకోగలదు. కావున బాగా చెక్ చేసుకోండి - ఈ పదార్థాలు అనగా అల్పకాలిక సుఖ సాధనాలు ఆకర్షించటం లేదు కదా? ఏ సాధనమైనా సమయానికి ప్రాప్తించకపోతే సహజ సాధన అనగా సహజయోగ స్థితి కింద మీద అవ్వటం లేదు కదా? ఏ సాధనానికైనా వశమైపోయి, అలవాటు వలన నిస్సహాయులుగా అవ్వటం లేదు కదా? ఎందుకంటే ఈ పదార్థాలన్నీ అనగా సాధానాలన్నీ ప్రకృతి సాధనాలు. మరి మీరు ప్రకృతిని జయించినవారు అనగా ప్రకృతి ఆధారం నుండి అతీతులైన కమల ఆసనధారీ బ్రాహ్మణులు. మాయాజీతులతో పాటుగా ప్రకృతిజీతులుగా కూడా అవుతారు. మాయాజీతులుగా అవ్వడంతోనే మాయ పదే-పదే భిన్న-భిన్న రూపాలలో ట్రయల్ వేస్తుంది, నా సహచరులు మాయాజీతులుగా అవుతున్నారా అని రకరకాల పరీక్షలను పెడుతుంది. ప్రకృతి నుండి వచ్చే పరీక్ష - సాధనాల ద్వారా మిమ్మల్నందరినీ అలజడిలోకి తీసుకురావటము. ఉదాహరణకు - నీటి కొరత. ఇప్పుడు వచ్చింది పెద్ద పరీక్షేమీ కాదు కానీ నీటితో తయారైన సాధనాలు, అగ్నితో తయారైన సాధనాలు, ఇలా ప్రకృతిలోని ప్రతి తత్వముతో తయారైన సాధనాలు మనుష్యుల జీవితములో అల్పకాలికమైన సుఖాన్నిచ్చేందుకు ఆధారాలు. కనుక ఈ తత్వాలన్నీ పరీక్ష తీసుకుంటాయి. ఇప్పుడైతే కేవలము నీటి కొరత ఏర్పడింది కానీ ఎప్పుడైతే నీటి ద్వారా తయారైన పదార్థాలు ప్రాప్తించవో, అప్పుడు అసలైన పరీక్ష ఉంటుంది. ప్రకృతి ద్వారా వచ్చే ఈ పరీక్ష సమయానుసారంగా వచ్చేదే ఉంది కావున దేహపు పదార్థాల ఆసక్తి మరియు ఆధారము నుండి కూడా నిరాధారముగా ‘అనాసక్తులు’గా అవ్వాలి. ఇప్పుడైతే అన్ని సాధనాలు బాగా ప్రాప్తిస్తున్నాయి, ఎటువంటి లోటు లేదు. కానీ సాధనాలు ఉన్నా, సాధనాలను ప్రయోగములోకి తీసుకువస్తున్నా, యోగ స్థితి కింద మీద అవ్వకూడదు. యోగిగా అయ్యి ప్రయోగము చెయ్యటము - దీనినే అతీతము అని అంటారు. అసలేమీ లేనే లేదు అన్నప్పుడు దానిని అతీతము అని అనరు. అన్నీ ఉన్నా కూడా నిమిత్తమాత్రముగా, అనాసక్త రూపముతో ప్రయోగించాలి, కోరికతో లేక బాగా అనిపించిన కారణంగా ఉపయోగించవద్దు - ఈ చెకింగ్ ను తప్పకుండా చేసుకోండి. ఎక్కడైతే కోరిక ఉంటుందో, అక్కడ మీరు ఎంత శ్రమించినాగానీ ఇచ్ఛా (కోరిక), అచ్ఛా (మంచి)గా అవ్వనివ్వదు. పరీక్ష సమయంలో శ్రమించడంలోనే సమయము గడిచిపోతుంది. మీరు సాధనలో ఉండే ప్రయత్నము చేస్తారు మరియు సాధనాలు తమవైపుకు ఆకర్షిస్తాయి. మీరు యుద్ధము చేసి, శ్రమించి సాధనాల ఆకర్షణను తొలగించుకునే ప్రయత్నము చేస్తున్నట్లయితే, ఇక యుద్ధముతో చేసే ఈ పెనుగులాటలోనే పరీక్ష సమయము గడచిపోతుంది. రిజల్ట్ ఏమైంది? ప్రయోగించాల్సిన సాధనాలు సహజయోగి స్థితిని అలజడిలోకి తీసుకొచ్చాయి కదా. ప్రకృతి పరీక్షలైతే ఇప్పుడు ఇంకా ఎక్కువ వేగంతో రానున్నాయి కావున పదార్థాలకు విశేష ఆధారమైన - తినటము, త్రాగటము, ధరించడము, నడవడము, ఉండటము మరియు సంపర్కములోకి రావటము - వీటిలో ఏదైనా సూక్ష్మ రూపంలోనైనా విఘ్నరూపంగా అవ్వటం లేదు కదా అని ముందు నుండే వీటన్నింటి చెకింగ్ చేసుకోండి. ఇది ఇప్పటి నుండే ట్రయల్ వెయ్యండి. పరీక్ష వచ్చే సమయములో ట్రయల్ వెయ్యద్దు, లేదంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది.
యోగ-స్థితి అనగా ప్రయోగము చేస్తూ కూడా అతీతమైన స్థితి. సహజ యోగపు సాధన, సాధనాలపై అనగా ప్రకృతిపై విజయవంతంగా ఉంటుంది. అది లేకపోయినా ఫర్వాలేదు కానీ ఇది లేకుండా ఉండలేము, అందుకే స్థితి అలజడిలోకి వచ్చింది..... అని ఇలా ఉండకండి. దీనిని కూడా అతీతమైన జీవితము అని అనరు. ఎటువంటి సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలంటే మీ సిద్ధి ద్వారా అప్రాప్తి కూడా ప్రాప్తి యొక్క అనుభవమును చేయించాలి. స్థాపన ఆరంభంలో వీరికి ఆసక్తి ఉందా, లేదా అన్నదాని ట్రయల్ పై మధ్యమధ్యలో కావాలని ప్రోగ్రామ్ ను పెట్టేవారు. ఏ విధంగా అంటే, 15 రోజులు కేవలము సజ్జ రొట్టె మరియు మజ్జిగను తినిపించారు, గోధుమలు ఉన్నా కూడా ఈ ట్రయల్ చేయించటం జరిగింది. ఎలాంటి అనారోగ్యం కలవారైనా 15 రోజులు ఈ భోజనాన్నే తినాలి. ఎవరూ అనారోగ్యం పాలు అవ్వలేదు. శ్వాస సమస్య ఉన్నవారు కూడా బాగైపోయారు కదా! బాప్ దాదా ప్రోగ్రాం ఇచ్చారు అన్న నషా ఉండేది. ‘విషం కూడా అమృతమైపోయింది’ అని భక్తిలో అంటారు, ఇదైతే మజ్జిగనే. నిశ్చయము మరియు నషా ప్రతి పరిస్థితిలోనూ విజయులుగా తయారుచేస్తాయి. కనుక ఎండిపోయిన రొట్టెను తినాల్సి వచ్చే పరీక్ష కూడా వస్తుంది. ఇప్పుడైతే సాధనాలు ఉన్నాయి. పళ్ళు లేవు, అరగదు అని అంటారు కానీ ఆ సమయములో ఏం చేస్తారు? నిశ్చయము, నషా, యోగ సిద్ధి యొక్క శక్తి ఉన్నట్లయితే ఎండిపోయిన రొట్టె కూడా మెత్తటి రొట్టెలా పనిచేస్తుంది, ఇబ్బంది పెట్టదు. మీరు సిద్ధి స్వరూపపు షాన్ (నషా)లో ఉన్నట్లయితే ఎవ్వరూ పరేషాన్ చెయ్యలేరు (కలతను కలిగించలేరు). హఠయోగుల ముందే సింహము పిల్లిలా అయిపోయినప్పుడు, పాము ఆటబొమ్మగా అయిపోయినప్పుడు, మీరైతే సహజ రాజయోగులు, సిద్ధి స్వరూప ఆత్మలు, మీకు ఇదేమీ పెద్ద విషయము కాదు. ఉంటే హాయిగా ఉపయోగించుకోండి కానీ సమయము వచ్చినప్పుడు అవి మోసగించకూడదు - దీనిని చెక్ చేసుకోండి. పరిస్థితి, స్థితిని కిందకు తీసుకురాకూడదు. దేహపు సంబంధాల నుండి అతీతముగా అవ్వటము సహజము కానీ దేహపు పదార్థాల నుండి అతీతముగా అవ్వటములోనే చాలా మంచి అటెన్షన్ ఉండాలి.
4. పాత స్వభావ, సంస్కారాల నుండి అతీతంగా అవ్వాలి. పాత దేహము యొక్క స్వభావము మరియు సంస్కారాలు కూడా చాలా కఠినమైనవి. మాయాజీతులుగా అవ్వటంలో ఇవి కూడా పెద్ద విఘ్నరూపంగా అవుతాయి. చాలాసార్లు బాప్ దాదా చూస్తారు - పాత స్వభావ, సంస్కారాల రూపీ పాము చనిపోతుంది కానీ గీత మిగిలిపోతుంది, సమయము వచ్చినప్పుడు అది పదే-పదే మోసగిస్తుంటుంది. ఈ కఠినమైన స్వభావ, సంస్కారాలు చాలా సార్లు మాయకు ఎంతగా వశీభూతము చేసేస్తాయంటే, ఇక తప్పును తప్పు అని కూడా అర్థం చేసుకోరు. ‘రియలైజేషన్ శక్తి’ సమాప్తమైపోతుంది. దీని నుండి అతీతమవ్వాలి - ఈ చెకింగ్ కూడా బాగా కావాలి. ఎప్పుడైతే ఈ రియలైజేషన్ శక్తి సమాప్తమైపోతుందో, అప్పుడు తమ మాటను నిరూపించుకునేందుకు ఒక అబద్దము వెనుక వెయ్యి అబద్దాలను చెప్పవలసి వస్తుంది. అంతగా పరవశమైపోతారు. తాము సత్యమని నిరూపించుకోవటము - ఇది కూడా పాత సంస్కారానికి వశమవ్వడానికి గుర్తు. ఒకటేమో యథార్థమైన విషయాన్ని స్పష్టము చెయ్యటము, మరొకటి, తమను తాము మొండిగానైనా నిరూపించుకోవటము. కనుక మొండితనంతో నిరూపించుకోవాలని అనుకునేవారు ఎప్పుడూ సిద్ధీ స్వరూపులుగా అవ్వలేరు. కనుక ఏ పాత స్వభావ, సంస్కారమైనా అంశమాత్రమైనా దాగియున్న రూపంలో అయితే లేదు కదా అన్నదానిని కూడా చెక్ చేసుకోండి. అర్థమైందా?
ఎవరైతే ఈ నాలుగు విషయాల నుండి అతీతంగా ఉంటారో, వారినే బాబాకు ప్రియమైనవారు, పరివారమునకు ప్రియమైనవారు అని అంటారు. ఇటువంటి కమల-ఆసనధారులుగా అయ్యారా? దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. బ్రహ్మాబాబా కూడా కమల-ఆసనధారిగా అయ్యారు, అప్పుడే బాబాకు నంబర్ వన్ ప్రియమైనవారిగా అయ్యారు, బ్రాహ్మణులకు ప్రియమైనవారిగా అయ్యారు, అది వ్యక్త రూపములోనైనా లేక ఇప్పుడు అవ్యక్త రూపములోనైనా. ఇప్పుడు కూడా బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి మనసు నుండి ఏం వెలువడుతుంది? మా బ్రహ్మా బాబా. మేమైతే సాకారములో చూడలేదు అని అనుభవము చెయ్యరు. కళ్ళతో చూడకపోయినా మనసుతో చూసారు, బుద్ధి యొక్క దివ్య నేత్రాల ద్వారా చూసారు, అనుభవము చేసారు, కనుకనే ‘నా బ్రహ్మా బాబా’ అని బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అంటారు. ఇది ప్రియంగా ఉండటానికి గుర్తు. నాలుగు వైపులలోని అతీతత్వము విశ్వానికి ప్రియమైనవారిగా తయారుచేసింది. కనుక ఇలా నాలుగు వైపులకు చెందినవాటిలో అతీతముగా మరియు సర్వులకు ప్రియముగా అవ్వండి. అర్థమైందా?
గుజరాత్ సమీపంగా ఉంటుంది కావున ఫాలో చేయడంలో కూడా సమీపంగా ఉంది. స్థానము మరియు స్థితి, రెండింటిలో సమీపంగా అవ్వడము - ఇదే విశేషత. బాప్ దాదా అయితే సదా పిల్లలను చూసి హర్షితులవుతారు. అచ్ఛా!
నలువైపులా కల కమల-ఆసనధారులు, అతీతమైన మరియు బాబాకు ప్రియమైన పిల్లలకు, సదా మాయాజీతులు, ప్రకృతిజీతులైన విశేష ఆత్మలకు, సదా ఫాలో ఫాదర్ చేసే విశ్వాసపాత్రులైన పిల్లలకు బాప్ దాదా యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.
మధుబన్ కు వచ్చిన సేవాధారీ సోదరీ సోదరులతో అవ్యక్త బాప్ దాదా కలయిక
ఎంత సమయమైతే మధుబన్ లో సేవ చేసారో, అంత సమయము నిరంతర యోగాన్ని అనుభవము చేసారా? యోగము తెగిపోలేదు కదా? మధుబన్ లో సేవాధారిగా అవ్వటము అనగా నిరంతర యోగి, సహజయోగి యొక్క అనుభవీలుగా అవ్వటము. కొద్ది సమయపు ఈ అనుభవము కూడా సదా గుర్తుంటుంది కదా. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినాకానీ మనసు ద్వారా మధుబన్ కు చేరుకోండి. మధుబన్ నివాసులుగా అవ్వటంతో పరిస్థితి లేక సమస్య సమాప్తమైపోతుంది మరియు మీరు సహజయోగులుగా అయిపోతారు. మీ ఈ అనుభవమును సదా తోడుగా పెట్టుకోండి. అనుభవాన్ని గుర్తు చేసుకోవటంతో శక్తి వచ్చేస్తుంది. సేవ యొక్క మేవా (ప్రతిఫలం) అవినాశీ అయినటువంటిది. అచ్ఛా. ఈ అవకాశము లభించటం కూడా తక్కువైనదేమీ కాదు, చాలా పెద్ద అవకాశము లభించింది.
సేవాధారి అనగా సదా బాబా సమానంగా నిమిత్తంగా అయ్యేవారు, నిర్మానులుగా ఉండేవారు. నిర్మానతయే అన్నింటికంటే శ్రేష్ఠమైన సఫలతా సాధనము. ఏ సేవలోనైనా సఫలతకు సాధనము నమ్రతా భావము, నిమిత్త భావము. మరి ఈ విశేషతలతో సేవ చేసారా? ఇటువంటి సేవలో సదా సఫలత కూడా ఉంటుంది మరియు సదా అమితానందము కూడా ఉంటుంది. సంగమయుగములోని అమితానందాన్ని అనుభవించారు కనుక సేవ, సేవలా అనిపించలేదు. మల్లయుద్ధము చేసేవారు తమ ఆనందముతో ఆడితే దానిని ఆటలా భావిస్తారు. అందులో అలసట లేక నొప్పి కలగవు, ఎందుకంటే మనోరంజకముగా భావించి చేస్తారు, అమితానందాన్ని పొందటానికి చేస్తారు. అలాగే ఒకవేళ సత్యమైన సేవాధారి యొక్క విశేషతతో సేవ చేసినట్లయితే ఎప్పుడూ అలసట ఉండలేదు. అర్థమైందా? ఇది సేవ కాదు, ఆడుకుంటున్నాము అన్నట్లుగానే ఎప్పుడూ అనిపిస్తుంది. కనుక ఏ సేవ లభించినా కానీ, ఈ రెండు విశేషతలతో సఫలతను పొందుతూ ఉండండి. దీనితో సదా సఫలతా స్వరూపులుగా అయిపోతారు. అచ్ఛా.
2. సత్యమైన తపస్య సదా కాలము కొరకు సత్యమైన బంగారంగా తయారుచేస్తుంది. ఇందులో కొంచెము కూడా మిక్స్ (కల్తీ) ఉండదు. తపస్య సదా ప్రతి ఒక్కరినీ ఎటువంటి యోగ్యులుగా తయారుచేస్తుందంటే, వారు ప్రవృత్తిలో కూడా సఫలత పొందినవారిగా ఉంటారు మరియు ప్రారబ్ధమును ప్రాప్తి చేసుకోవటంలో కూడా సఫలత పొందినవారిగా ఉంటారు. ఇటువంటి తపస్వీలుగా అయ్యారా? తపస్య చేసేవారిని రాజయోగులు అని అంటారు. మరి మీరందరూ రాజయోగులేనా. ఎప్పుడూ ఏ పరిస్థితి కారణంగానూ విచలితులయ్యేవారైతే కారు కదా? కనుక సదా మిమ్మల్ని మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి మరియు చెక్ చేసుకున్న తరువాత ఛేంజ్ చేసుకోండి. కేవలము చెక్ చేసుకోవటంతో నిరాశకు లోనవుతారు, మాలో ఈ లోపము కూడా ఉంది, ఇది కూడా ఉంది, బాగవుతుందో లేదో తెలియదు అని ఆలోచిస్తారు, కనుక చెక్ కూడా చేసుకోండి మరియు చెక్ చేసుకోవడంతో పాటు ఛేంజ్ కూడా చేసుకోండి. లేదంటే బలహీనులుగా అవుతారు, సమయము గడిచిపోతుంది. సమయ ప్రమాణంగా కర్తవ్యము చేసేవారికి సదా విజయము ఉంటుంది. మరి అందరూ సదా విజయులు, శ్రేష్ఠ ఆత్మలేనా? అందరూ శ్రేష్ఠులా లేక నంబరువారుగా ఉన్నారా? మీరు ఏ నంబరు కలవారు అని నంబరును అడిగినట్లయితే అందరూ నంబరు వన్ అనే అంటారు. కానీ ఆ నంబరు కలవారు ఎంతమంది ఉంటారు? ఒక్కరా లేక అనేకులా? ఫస్ట్ నంబరు గా అయితే అందరూ అవ్వరు కానీ ఫస్ట్ డివిజన్లోకైతే రాగలరు. ఫస్ట్ నంబరు ఒక్కటి ఉంటుంది కానీ ఫస్ట్ డివిజన్లోకైతే చాలామంది వస్తారు కనుక ఫస్ట్ నంబరు వారిగా అవ్వగలరు. రాజ్య సింహాసనము పైన ఒక్కరే కూర్చుంటారు కానీ మిగతా సహచరులైతే ఉంటారు కదా! కనుక రాయల్ ఫ్యామిలీలోకి రావటము కూడా రాజ్య అధికారులుగా అవ్వటము. కనుక ఫస్ట్ డివిజన్లోకి అనగా నంబరు వన్ లోకి వచ్చే పురుషార్థమును చెయ్యండి. ఇప్పటివరకు కేవలము ఇద్దరు-ముగ్గురిది తప్ప ఏ సీటూ ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడు ఎంత కావాలంటే అంత, ఎంత పురుషార్థము చెయ్యాలనుకుంటే అంత చెయ్యవచ్చు. ఇప్పుడైతే లేట్ అయ్యింది కానీ టూ లేట్ అవ్వలేదు అని బాప్ దాదా వినిపించారు కదా కనుక ముందుకు వెళ్ళేందుకు అందరికీ అవకాశము ఉంది. విన్ అయ్యి వన్ లోకి వచ్చే అవకాశము ఉంది. కనుక సదా ఉల్లాస-ఉత్సాహాలు ఉండాలి. సరేలే, నంబరు వన్ గా ఎవరైనా అవ్వనీ, నేను నంబర్ టు అయినా ఫర్వాలేదులే అన్నట్లు కాదు. దీనిని బలహీన పురుషార్థము అని అంటారు. మీరందరైతే తీవ్ర పురుషార్థులు కదా? అచ్ఛా.
Comments
Post a Comment