15-10-2007 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంగమయుగం యొక్క జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసుకునేటందుకు అన్ని బరువులు లేదా బంధనాలను బాబాకి ఇచ్చేసి డబల్ లైట్ అవ్వండి.
ఈరోజు విశ్వరచయిత బాప్ దాదా తన యొక్క మొదటి రచన అయిన అతి ప్రియమైన మరియు అదృష్టవంతులైన పిల్లలతో కలయిక జరుపుకుంటున్నారు. కొంతమంది పిల్లలు ఎదురుగా ఉన్నారు, నయనాలతో చూస్తున్నారు, మరికొంతమంది పిల్లలు హృదయంలో ఇమిడి ఉన్నారు. బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క మస్తకంలో మెరుస్తున్న మూడు భాగ్య సితారలను చూస్తున్నారు. మొదటి భాగ్యం - బాప్ దాదా యొక్క శ్రేష్ట పాలన, రెండవది - శిక్షకుని ద్వారా చదువు, మూడవది - సద్గురువు ద్వారా సర్వ వరదానాల యొక్క మెరుస్తున్న సితార. మీరందరు కూడా మీ మస్తకంలో మెరుస్తున్న సితారను అనుభవం చేసుకుంటున్నారు కదా! సర్వ సంబంధాలు బాబాతోనే అయినప్పటికీ జీవితంలో ఈ మూడు సంబంధాలు అవసరం మరియు ఈ మూడు సంబంధాలు ప్రియమైన, గారాభ పిల్లలైన మీ అందరికీ సహజంగా లభించాయి. లభించాయి కదా, నషా ఉంది కదా. ఓహో బాబా! ఓహో!, ఓహో శిక్షకుడు! ఓహో!, ఓహో సద్గురువు ఓహో! అని మనస్సులో పాడుకుంటూ ఉంటున్నారు కదా, ప్రపంచంలోని వారైతే లౌకిక గురువు ద్వారా అంటే మహానాత్మగా పిలవబడే వారి నుండి ఒక వరదానం పొందడానికి కూడా ఎంతో ప్రయత్నం చేస్తారు మరియ బాబా మిమ్మల్ని జన్మతోనే అన్ని వరదానాలతో సంపన్నం చేసారు. భగవంతుడు ఈవిధంగా మాపై బలిహారం అవుతారు అని కలలోనైనా ఆలోచించారా! భక్తులు భగవంతుని పాటలు పాడతారు కానీ భగవంతుడు ఎవరి పాటలు పాడతారు? అదృష్టవంత పిల్లలైన మీ యొక్క పాటలు పాడతారు.
ఇప్పుడు కూడా మీరందరు రకరకాల దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు? స్థూల విమానాలలో వచ్చారా లేక పరమాత్మ ప్రేమ అనే విమానంలో అన్ని వైపుల నుండి చేరుకున్నారు. పరమాత్ముని విమానం ఎంతో సహజంగా తీసుకువస్తుంది, ఏ కష్టం ఉండదు. అందరు పరమాత్మ ప్రేమ అనే విమానంలో వచ్చారు. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మొదటిసారి వచ్చిన వారైనా, చాలాకాలం నుండి వస్తున్నా కానీ బాప్ దాదాకి ప్రతి ఒక్కరి యొక్క విశేషత తెలుసు. బాప్ దాదాకి ఏ బిడ్డ అయినా కానీ అంటే చిన్న బిడ్డ అయినా, పెద్దవారైనా, మహావీరులైనా, పురుషార్థులైనా కానీ ప్రతి ఒక్కరు గారాభమైనవారే, ఎందువలన? మీరు బాబాని వెతికారు కానీ బాబా దొరకలేదు, కానీ బాప్ దాదా మీ ఒకొక్కరిని చాలా ప్రేమతో, దయతో, స్నేహంతో మూలమూలల నుండి వెతికారు. అంటే ప్రేమ ఉంది కనుకే వెతికారు కదా! ఎందుకంటే నా యొక్క ప్రతి బిడ్డ ఏ విశేషత లేకుండా ఉండడు అని బాబాకి తెలుసు. ఏదో విశేషతయే మిమ్మల్ని తీసుకువచ్చింది. గుప్త రూపంలో వచ్చిన బాబాని గ్రహించారు, నా బాబా అన్నారు, అంటే కనీసం ఈ విశేషత అయినా ఉంది కదా! అందరూ నా బాబా అంటారు కదా! నా బాబా కాదు, నీ బాబా అనేవారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా ఎవరైనా? అందరూ నా బాబా అనే అంటారు అంటే విశేషమైన వారు కదా! పెద్ద పెద్ద వైజ్ఞానికులు, పెద్ద పెద్ద విశేష వ్యక్తులు తెలుసుకోలేకపోయారు కానీ మీరందరు తెలుసుకున్నారు, మీ వారిగా చేసుకున్నారు కదా! బాబా కూడా తన వారిగా చేసుకున్నారు. ఈ సంతోషంలో పాలింపబడుతూ ఎగురుతూ ఉన్నారు కదా ఎగురుతున్నారు, నడవటం లేదు, ఎగురుతున్నారు. ఎందుకంటే నడిచేవారు. బాబా వెంట ఇంటికి వెళ్ళలేరు. ఎందుకంటే బాబా ఎగిరేవారు కనుక నడిచేవారు వెంట ఎలా వెళ్ళగలరు!
అందువలన బాబా పిల్లలందరికీ ఏ వరదానం ఇస్తున్నారు? ఫరిస్తా స్వరూప భవ! ఫరిస్తా ఎగురుతుంది కానీ నడవదు. మీరందరు కూడా ఎగిరేకళ గలవారే కదా? అవునా? ఎగిరేకళలో ఉన్నవారు చేతులెత్తండి? లేక అప్పుడప్పుడు నడిచేకళ, అప్పుడప్పుడు ఎగిరేకళ ఉంటుందా? లేదు కదా? సదా ఎగిరేవారు, డబల్ లైట్ కదా? ఎందుకు? ఆలోచించండి, బాబా మీ అందరి నుండి గ్యారంటీ తీసుకున్నారు, ఒకవేళ మనస్సులో కానీ, బుద్దిలో కానీ ఏ రకమైన బరువు ఉన్నా బాబాకి ఇచ్చేయండి, బాబా తీసుకునేటందుకే వచ్చారు. బాబాకి బరువు ఇచ్చేసారా లేదా కొద్దికొద్దిగా జాగ్రత్త చేసి ఉంచుకుంటున్నారా? తీసుకునేవారు తీసుకుంటున్నప్పుడు ఇచ్చేవారు ఆలోచించవలసిన అవసరం ఏముంది? 63 జన్మల నుండి బరువునెత్తే అలవాటు అయిపోయింది. అందువలన కొంతమంది పిల్లలు అనుకోవటం లేదు కానీ అలవాటు కారణంగా బలహీనం అయిపోతున్నాము అని అంటున్నారు. ఇప్పుడైతే బలహీనంగా లేరు కదా! బలహీనంగా ఉన్నారా లేదా గట్టిగా ఉన్నారా? ఎప్పుడు బలహీనంగా కాకూడదు. గట్టిగా ఉండాలి. శక్తులు గట్టిగా ఉన్నారా లేదా బలహీనంగా ఉన్నారా? గట్టిగా ఉన్నారు కదా? ముందు కూర్చున్నారు అంటే ఏమిటి? గట్టిగా ఉన్నట్లే కదా! బరువు పెట్టుకోవటం ఇష్టమనిపిస్తుందా? బరువుపై మనస్సు తగుల్కుంటుందా? వదిలేయండి, వదిలేస్తే వదిలిపోతాయి, వదలకపోతే వదలవు. బరువు వదిలివేయడానికి సాధనం - ధృడసంకల్పం. కొంతమంది పిల్లలు ధృఢసంకల్పం అయితే చేస్తున్నాము కానీ, కానీ..... అని అంటున్నారు, దానికి కారణం ఏమిటి? ధృడసంకల్పం చేస్తున్నారు కానీ చేసిన ధృడసంకల్నాన్ని రివైజ్ చేయటం లేదు. మాటిమాటికి మనస్సులో రివైజ్ చేసుకోండి మరియు బరువు అంటే ఏమిటి, డబల్ లైట్ స్థితి యొక్క అనుభవం ఏమిటి? అని అనుభవం చేసుకోండి. ఇప్పుడు అనుభూతి కోరికపై మరింత ధ్యాస పెట్టండి. చెప్తున్నారు మరియు ఆలోచిస్తున్నారు కానీ బరువు అంటే ఏమిటి మరియు డబల్ లైట్ స్థితి అంటే ఏమిటి? అనేది మనస్సుతో అనుభవం చేసుకోండి మరియు రెండింటి తేడాను ఎదురుగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పటి సమయం యొక్క సమీపత అనుసారంగా బాప్ దాదా ప్రతి ఒక బిడ్డలో ఏమి చూడాలనుకుంటున్నారు? ఏది చెప్తున్నారో అది చేసి చూపించాలి. ఏది ఆలోచిస్తున్నారో అది స్వరూపంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ముక్తి మరియు జీవన్ముక్తి అనేవి బాబా యొక్క వారసత్వం లేదా జన్మసిద్ధ అధికారం. రండి, వచ్చి ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని పొందండి అని అందరినీ ఆహ్వానిస్తారు కదా! కనుక మిమ్మల్ని మీరు అడగండి - ముక్తిని ముక్తిధామంలో అనుభవం చేసుకోవాలని లేదా జీవన్ముక్తిని సత్యయుగంలో అనుభవం చేసుకోవాలా లేక ఇప్పుడు సంగమయుగంలో ముక్తి, జీవన్ముక్తి యొక్క సంస్కారాన్ని తయారు చేసుకోవాలా? ఎందుకంటే మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మేము ఈశ్వరీయ సంస్కారాలతో దైవీ ప్రపంచాన్ని తయారు చేస్తున్నాము అని. మీ సంస్కారాలతో క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ సంగమయుగంలోనే ముక్తి, జీవన్ముక్తి యొక్క సంస్కారాలు ప్రత్యక్షం అవ్వాలి కదా! కనుక పరిశీలించుకోండి - మనస్సు మరియు బుద్ది సర్వబంధనాల నుండి ముక్తి అయ్యాయా? ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో వెనుకటి జీవితంలోని అనేక విషయాల యొక్క బంధనాల నుండి ముక్తి అయ్యారు కానీ అన్ని బంధనాల నుండి ముక్తి కానీ అన్ని బంధనాల నుండి ముక్తి అయ్యారా లేదా ఇప్పుడు కూడా కొన్ని, కొన్ని బంధనాలు బంధిస్తున్నాయా? ముక్తి, జీవన్ముక్తిని అనుభవం చేసుకోవటమే ఈ బ్రాహ్మణజీవితం యొక్క శ్రేష్ఠత, ఎందుకంటే సత్యయుగంలో జీవన్ముక్తి, జీవనబంధన రెండింటి జ్ఞానం ఉండదు. కానీ ఇప్పుడు జీవనబంధన అంటే ఏమిటి, జీవన్ముక్తి అంటే ఏమిటి అనేది అనుభవం చేసుకోవచ్చు.ఎందుకంటే మీ అందరి ప్రతిజ్ఞ, అందరూ చాలాసార్లు ప్రతిజ్ఞ చేసారు, ఏమి ప్రతిజ్ఞ చేసారో జ్ఞాపకం కదా? ఎవరినైనా మీ ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? అని అడిగితే ఏమి జవాబు చెప్తారు? బాబా సమానంగా అవ్వాలి అని అంటారు. పక్కాయే కదా? బాబా సమానంగా అవ్వాలి కదా? కొద్దికొద్దిగా అవ్వాలా? సమానంగా అవ్వాలి కదా? అవ్వాలా సమానంగా? కొద్దిగా తయారైతే చాలా? అప్పుడు దానిని సమానం అని అనరు కదా! అయితే బాబా ముక్తుడా లేదా బంధనుడా? 1. ఒకవేళ ఏవిధమైన బంధన అంటే దేహం యొక్క బంధన, దేహసంబంధాల యొక్క బంధన, తల్లి, తండ్రి, బంధువు, సఖుడు ఈ సంబంధాలే కాదు, దేహంతో పాటు కర్మేంద్రియాలతో కూడా ఏదైతే సంబందం ఉందో, ఆ కర్మేంద్రియాల సంబంధం యొక్క బంధన, అలవాటు యొక్క బంధన, స్వభావం యొక్క బంధన, పాత సంస్కారాల బంధన ఇలా ఏది ఉన్నా కానీ బాబా సమానంగా ఎలా అయినట్లు? బాబా సమానంగా అవ్వాలి అని రోజూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. చేతులు ఎత్తిస్తే కూడా అందరు ఏమి చెప్తారు? లక్ష్మీనారాయణులు అవ్వాలి అంటారు. బాప్ దాదా అయితే సంతోషిస్తున్నారు, ప్రతిజ్ఞలైతే చాలా మంచిమంచివి చేస్తున్నారు కానీ ప్రతిజ్ఞ యొక్క లాభం పొందటంలేదు. ప్రతిజ్ఞ మరియు లాభం రెండింటి సమానత తెలుసుకోవటం లేదు. ప్రతిజ్ఞల యొక్క ఫైల్ అయితే బాప్ దాదా దగ్గర చాలా, చాలా, చాలా పెద్దది ఉంది. అందరి ఫైల్స్ ఉన్నాయి. ప్రతిజ్ఞల యొక్క ఫైల్ తో పాటు వాటి లాభం యొక్క ఫైల్ ఈ రెండింటి సమానత ఉంటే ఎంత బావుంటుంది!
సెంటర్స్ యొక్క టీచర్స్ కూర్చున్నారు కదా! సెంటర్ నివాసీయులు కూడా కూర్చున్నారు కదా? సమానంగా అయ్యేవారు కదా! సేవాకేంద్ర నివాసీయులు, నిమిత్తమైన పిల్లలు సమానంగా ఉండాలి కదా! అలా ఉన్నారా? ఉన్నారు కూడా కానీ అప్పుడప్పుడు కొద్దికొద్దిగా తుంటరివారు అయిపోతున్నారా? బాప్ దాదా అయితే పిల్లలందరి యొక్క మొత్తం రోజంతటి పరిస్థితి మరియు నడవడిక చూస్తూ ఉంటారు. వతనంలో ఉన్నప్పుడు మీ దాదీ కూడా చూసేవారు, దాదీ కూడా ఏమన్నారో తెలుసా? బాబా ఇలా కూడా ఉంటుందా? అన్నారు. ఇలా జరుగుతుంటే, ఇలా చేస్తుంటే నీవు చూస్తూ ఉంటావా? అన్నారు. మీ దాదీ ఏం చూసారో విన్నారు కదా! ఇప్పుడు బాప్ దాదా తన యొక్క ఒక్కొక్క బిడ్డ ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వానికి అధికారిగా అవ్వటం చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే వారసత్వం ఇప్పుడే లభిస్తుంది. సత్యయుగంలో అయితే సహజ జీవితం ఉంటుంది. ఇప్పటి అభ్యాసమే అక్కడ సహజ జీవితం ఉంటుంది కానీ ఈ సంగమయుగంలోనే వారసత్వానికి అధికారిగా అవ్వాలి. అందువలనే బాప్ దాదా ఇదే కోరుకుంటు న్నారు, ప్రతి ఒక్కరు స్వయాన్ని పరిశీలించుకోండి, ఒకవేళ ఏదైనా బంధన ఉంటే దానికి కారణం ఏమిటి అనేది ఆలోచించండి. కారణం ఆలోచించండి మరియు కారణంతో పాటు నివారణ కూడా ఆలోచించండి. బాప వాదా నివారణను అనేకసార్లు రకరకాల రూపాలతో చెప్పారు. సర్వశక్తుల వరదానాన్ని ఇచ్చారు, సర్వగుణాల ఖజానాను ఇచ్చారు, ఖజానాను ఉపయోగిస్తే ఖజానా పెరుగుతుంది. అందరి దగ్గర ఖజానా అయితే ఉన్నట్లుగా బాప్ దాదా చూసారు. ప్రతి ఒక్కరి స్టాక్ కూడా చూస్తున్నారు. బుద్ధియే స్టాక్ రూమ్. స్టాక్ అందరికీ ఉంది కానీ ఖజానాలను సమయానికి ఉపయోగించటం లేదు. అవును, ఇది చేయకూడదు, ఇది చేయాలి అని కేవలం పాయింట్ రూపంలోనే ఆలోచిస్తున్నారు. పాయింట్ రూపంలో ఉపయోగిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ పాయింట్ గా (బిందువుగా) అయ్యి పాయింట్ ని ఉపయోగించటం లేదు. అందువలన ఆ పాయింట్ పాయింట్ గా ఉండిపోతుంది, పాయింట్ గా అయ్యి ఉపయోగిస్తే నివారణ జరుగుతుంది. ఇది చేయకూడదు అని అంటున్నారు మరలా మర్చిపోతున్నారు కూడా! చెప్తున్నారు మరియు మర్చిపోతున్నారు కూడా. చెప్పిన ఈ విధి ఎంత సహజమైనది! సంగమ యుగంలో కేవలం బిందువుతోనే అద్భుతం, కేవలం బిందువుని ఉపయోగించండి, మరే గుర్తులూ అవసరం లేదు. మూడు బిందువులను ఉపయోగించండి. ఆత్మ బిందువు, బాబా బిందువు మరియు డ్రామా బిందువు. ఈ మూడు బిందువులను ఉపయోగిస్తే బాబా సమానంగా అవ్వటం ఏమీ కష్టం కాదు. పెట్టాలనుకునేది బిందువే కానీ పెట్టేటప్పుడు చేయి కదులుతుంది అప్పుడు అది ప్రశ్నార్ధకం అయినా అయిపోతుంది లేదా ఆశ్చర్యార్ధకం అయినా అయిపోతుంది. వ్రాసేటప్పుడు అయితే చేయి కదులుతుంది కానీ ఇక్కడ బుద్ది కదులుతుంది. లేకపోతే మూడు బిందువులను జ్ఞాపకం ఉంచుకోవటంలో కష్టం ఏమి ఉంది? ఉందా కష్టం? బాప్ దాదా మరొక సహజయుక్తి కూడా చెప్పారు, అది ఏమిటి? "ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి”. మంచిది, యోగం శక్తిశాలిగా కుదరటం లేదు, ధారణ తక్కువగా ఉంటుంది, ఉపన్యాసం చెప్పే ధైర్యం లేదు. అయినా కానీ ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ ఒక విషయం చేయండి మిగిలిన అన్ని విషయాలు వదిలేయండి. ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఏది ఏమైనా, ఎవరు ఏమి ఇచ్చినా కానీ నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని పక్కా చేసుకోండి. దీనిలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. ఆశీర్వాదాలు ఇస్తూ మరియు తీసుకుంటూ ఉంటే దీనిలో గుణాలు మరియు శక్తులు రావా? స్వతహాగానే వచ్చేస్తాయి కదా! ఒకే లక్ష్యం పెట్టుకోండి, చేసి చూడండి, ఒక రోజు అభ్యాసం చేసి చూడండి, ఆ తర్వాత వారం రోజులు అభ్యాసం చేసి చూడండి, మిగిలిన అన్ని విషయాలు బుద్దిలో ఉండకపోయినా కానీ ఒక్క విషయం అయితే ఉంటుంది కదా! ఏమైపోయినా కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు తీసుకోవాలి. ఇది చేయగలరా, లేదా? చేయగలరా? మీరు వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని ప్రయత్నించి చూడండి. దీని ద్వారా అందరూ స్వతహాగానే యోగయుక్తులు అయిపోతారు. ఎందుకంటే వ్యర్థకర్మ చేయలేదు అంటే యోగయుక్తులు అయిపోయినట్లే కదా! కానీ ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి అని లక్ష్యం పెట్టుకోండి. ఎవరు ఏమి ఇచ్చినా, శాపం కూడా లభిస్తుంది, క్రోధం యొక్క విషయాలు కూడా వస్తాయి. ఎందుకంటే ప్రతిజ్ఞ చేసారు కదా, మీరు ప్రతిజ్ఞ చేసినప్పుడు మాయ కూడా వింటుంది. కనుక అది కూడా తన పని తను చేస్తుంది కదా! మాయాజీత్ గా అయిపోయినప్పుడు ఏమీ చేయదు. కానీ ఇప్పుడు మాయాజీత్ గా అవుతూ ఉన్నారు. కనుక అది తన పని తను చేస్తుంది కానీ నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి అనుకోండి. ఇది జరుగుతుందా? జరుగుతుందా? అవుతుంది అనేవారు చేతులు ఎత్తండి! మంచిది, శక్తులు చేతులు ఎత్తండి? అలాగే అవుతుంది. అన్నివైపుల టీచర్స్ వచ్చారు కదా! మీరు మీ మీ దేశాలకు వెళ్ళిన తర్వాత మొదట అందరిచే ఒక వారం రోజులు ఈ హోమ్ వర్క్ చేయించండి మరియు ఫలితం పంపించండి. క్లాస్ కి వచ్చేవారి సంఖ్య ఎంత, ఎంతమంది ఓ.కెగా ఉన్నారు, ఎంతమంది కొంచెం బలహీనంగా ఉన్నారు మరియు ఎంతమంది పక్కాగా ఉన్నారు ఇలా క్లుప్తంగా ఒ.కె మధ్యలో లైన్ పెట్టి సమాచారాన్ని పంపాలి. ఇంతమంది ఒ.కె మరియు ఇంతమంది ఒ.కె మధ్యలో గీత అంటే కొంచెం బలహీనంగా ఉన్నారు అని వ్రాసి పంపండి. డబల్ విదేశీయులు వచ్చారు, డబల్ పని చేస్తారు కదా! ఒక వారం రోజుల ఫలితాన్ని పంపించాలి. ఆ తర్వాత బాప్ దాదా చూస్తారు. సహజమే కదా, కష్టం కాదు కదా! మాయ వస్తుంది, మీరు అంటారు, బాబా నాకు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చేసింది అని. అది వస్తుంది కానీ ధృడనిశ్చయం పెట్టుకున్నవారికి విజయం నిశ్చితం. ధృడతకు ఫలం - సఫలత. సఫలత రాకపోవడానికి కారణం - ధృడత యొక్క లోపం. ధృడతకు సఫలత లభించవలసిందే.
డబల్ విదేశీయులు మొదటి నెంబర్ పొందాలి. డబల్ విదేశీయులు అంటే డబల్ కదా కనుక అద్భుతం చేసి చూపించాలి. విదేశాల నుండి ఎంతమంది వచ్చారు? (90 దేశాల నుండి, 300 సెంటర్స్ వారు వచ్చారు) 90 దేశాల వారు అద్భుతం చేస్తారు కదా? 90 దేశాల విదేశీయులు మరియు 10 మంది భారతదేశీయులను కలిపితే 100 అయిపోతుంది కదా! మరయితే చేస్తారా? వచ్చిన వారందరూ కూడా ఏది ఏమైనా కానీ చేసి చూపించాలి. ఇంత ధృడంగా ఉన్నారా లేక చూస్తాము, ప్రయత్నిస్తాము... అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ప్రయత్నిస్తాము అనేవారు చేతులెత్తండి! ఎవరూ లేరు. అయితే శుభాకాంక్షలు, చప్పట్లు కొట్టండి. దాదీలు ఎక్కడ ఉన్నారు? పక్కాయేనా! మంచిది. ఎందుకంటే మమూలుగా కూడా డబల్ విదేశీయులు ఏది ఆలోచిస్తారో అది చేసే సంస్కారం ఉంటుంది దానిని ఈ కార్యంలో ఉపయోగించాలి. విశేషంగా సహనశక్తి యొక్క వరదానం తీసుకుని వెళ్ళండి. బాప్ దాదా సమయానుసారం పిల్లల యొక్క ఒక దృశ్యాన్ని చూసారు, పిల్లల దృశ్యాలు బాబా చూస్తూ ఉంటారు కదా అయితే ఏమి చూసి ఉంటారు! పిల్లలు చాలా బాగా సహించారు. దానికి బాప్ దాదా ఓహో, ఓహో అంటున్నారు. చాలా మంచిది, చాలా మంచిది అంటూ చూస్తున్నారు. కానీ తర్వాత ఏం చేశారు? సహించారు, పాస్ అయిపోయారు కానీ ఆ తర్వాత ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉన్న కారణంగా ఇముడ్చుకోలేకపోయారు కదా, అక్కడక్కడ వర్ణన చేశారు. ఇముడ్చుకునే శక్తి లేదు, సహించే శక్తి ఉంది, పాత్రను బాగా అభియించారు కానీ ఇముడ్చుకునే శక్తి లోపంగా ఉన్న కారణంగా ఇలా జరిగింది, అలా జరిగింది అని వర్ణించారు అంటే పోగొట్టుకున్నట్లే కదా! కనుక ఇలా చేయకూడదు. బాప్ దాదా పిల్లల యొక్క చాలా దృశ్యాలు చూస్తూ ఉంటారు. మొదట చప్పట్లు మ్రోగిస్తారు. ఆ తర్వాత శాంతి అయిపోతారు అలా చేయకూడదు. సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి ఇలా అన్ని శక్తులకు పరస్పరం సంబంధం ఉంటుంది. అందువలనే బాబాని సర్వశక్తివంతుడు అని అన్నారు కానీ శక్తివంతుడు అని అనలేదు. మీ అందరి బిరుదు కూడా మాస్టర్ సర్వశక్తివంతులా, శక్తివంతులా? సర్వశక్తులకు పరస్పరం సంబంధం ఉంది అందువలన ఈ ధ్యాస పెట్టుకోండి. మంచిది. డబల్ విదేశీయులు తమ, తమ స్థానాలలో వృద్ధి చేశారు. దానికి బాప్ దాదా సంతోషిస్తున్నారు. దయాహృదయులయ్యే పాత్రను ప్రత్యక్షంలో బాగా అభినయిస్తున్నారు. బాప్ దాదా దగ్గరికి సమాచారం వస్తూ ఉంటుంది. బాప్ దాదా ఇప్పుడు కూడా విన్నారు, ఆఫ్రికా మరియు రష్యా రెండు వైపుల ఏవైతే స్థానాలు మిగిలి పోయాయో వాటికి మంచిగా సందేశం ఇస్తున్నారు మరియు భారతదేశంలో కూడా ప్రతి వర్గం వారు మంచి ధైర్యంతో, ఉల్లాసంతో తమ తమ వర్గాల వైపు నుండి దయాహృదయులై ఆత్మలకు సందేశం ఇచ్చేటువంటి, పరిచయం ఇచ్చేటువంటి మరియు సంబంధం జోడించేటువంటి కార్యాన్ని చాలా మంచి ఉత్సాహ, ఉల్లాసాలతో చేస్తున్నారు. దీనికి కూడా బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి కానీ ఎలా అయితే దీనికి చప్పట్లు కొట్టారో అలాగే బాప్ దాదా ఇప్పుడు 6 నెలలు ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ప్రారంభం కానున్నది కదా, కనుక 6 నెలలు అంటే ఎక్కువ సమయమే ఇస్తున్నాను. సేవ ఎలా అయితే ఉత్సాహ, ఉల్లాసాలతో చేస్తున్నారో అదేవిధంగా స్వయం పట్ల కూడా సేవ అంటే స్వసేవ మరియు విశ్వసేవ చేయాలి. స్వసేవ అంటే స్వయాన్ని పరిశీలించుకోవాలి మరియు బాబా సమానంగా తయారుచేసుకోవాలి. ఏ లోపం లేదా బలహీనతను అయినా కానీ బాబాకి ఇచ్చేయండి, మీ వద్ద ఎందుకు ఉంచుకున్నారు, అది బాబాకి ఇష్టమనిపించడం లేదు. బలహీనత ఎందుకు ఉంచుకుంటున్నారు? ఇచ్చేయండి. ఇచ్చే సమయంలో చిన్న పిల్లలుగా అయిపోండి. ఎలా అయితే చిన్నపిల్లలు ఏదైనా వస్తువుని జాగ్రత్త చేయలేకపోతే లేదా ఏదైనా వస్తువు ఇష్టమనిపించకపోతే ఏం చేస్తారు? ఇది మీరు తీసేసుకోండి అని అమ్మానాన్నలకు ఇచ్చేస్తారు కదా! అలాగే ఏ రకమైన బరువు లేదా బంధన ఇష్టమనిపించకపోతే, ఎందుకంటే బాప్ దాదా చూస్తున్నారు, ఒకవైపు ఇది మంచిది కాదు, సరి అయినది కాదు అని అనుకుంటున్నారు, ఏమి చేయము, ఎలా చేయము, ఇది మంచిది కాదు అంటున్నారు. మరలా మరోవైపు వాటిని జాగ్రత్త చేసి ఉంచుకుంటున్నారు అంటే దీనిని ఏమంటారు? మంచిది అంటారా? మంచిది కాదు కదా! మీరు ఎలా అవ్వాలి? చాలా మంచిగా కావాలి కదా! కేవలం మంచిగా కూడా కాదు, చాలా మంచిగా అవ్వాలి. కనుక ఇలాంటి విషయం ఏదైనా ఉంటే బాబాకి ఇచ్చేయండి మరియు ఒకవేళ అది మరలా వచ్చేస్తే తాకట్టు వస్తువుగా భావించి తిరిగి ఇచ్చేయండి. తాకట్టు వస్తువుని నాది అనుకోరు కదా! ఎందుకంటే అది మీరు బాబాకి ఇచ్చేసారు అంటే బాబా వస్తువు అయిపోయింది, బాబా వస్తువైనా లేదా ఇతరుల వస్తువు ఏదైనా మీ దగ్గరికి పొరపాటుగా వస్తే దానిని అలమారాలో పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? తీసేస్తారు కదా! ఎలా అయినా దానిని తీసేస్తారు, ఉంచుకోరు కదా! జాగ్రత్త చేయరు కదా! కనుక బాబాకి ఇచ్చేయండి. బాబా తీసుకోవడానికే వచ్చారు. ఇవ్వడానికి మీ దగ్గర మరేమీ కూడా లేవు, ఇవయితే ఇవ్వగలరు కదా! ఇవి జిల్లేడు పూలు, వీటిని ఇచ్చేయండి. వీటిని జాగ్రత్త చేసి ఉంచు కోవటం ఇష్టమనిపిస్తుందా? ఇప్పుడు ఎలా అయితే ఉత్సాహంతో సేవ చేస్తున్నారో, రష్యా యొక్క సమాచారం కూడా విన్నారు మరియు ఆఫ్రికా యొక్క సమాచారం కూడా విన్నారు, ఇతరుల సమాచారం కూడా వింటూ ఉంటారు, అందరు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు విశేషంగా స్వయం కొరకు 6 నెలల సమయాన్ని ఇస్తున్నాను. ఇప్పుడైతే చూశారు కదా! బాప్ దాదా చాలా సమయం నుండి రెండు మాటలు మాటిమాటికి రివైజ్ చేయించారు, ఆ రెండు మాటలు ఏవి? అకస్మాత్తు మరియు ఎవరెడీ (సదా తయారుగా ఉండాలి). జ్ఞాపకం ఉన్నాయి కదా! ఉన్నాయా? చాలా మంచిది. మీ చంద్రమణి దాదీ అకస్మాత్తుగా వెళ్ళిపోయారు కదా, జ్ఞాపకం ఉందా? ఆమె శరీరం వదిలేసి ఇప్పుడు ఎంత సమయం అయ్యింది (10 సంవత్సరాలు అయ్యింది) ఆ తర్వాత ఎంతమంది అకస్మాత్తుగా వెళ్ళిపోయారు? మీ దాదీ ఎలా వెళ్ళిపోయారు? అకస్మాత్తుగా వెళ్ళిపోయారు కదా! దాదీపై ప్రేమ ఉంది కదా! కనుక దాదీ జ్ఞాపకం వచ్చినప్పుడు అకస్మాత్తు అనే పాఠాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాదీ తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు, మామూలుగా వెళ్ళిపోలేదు. ఆమెకు కర్మాతీతం అనే సర్టిఫికెట్ లభించింది, కర్మేంద్రియాలు కూడా ఆకర్షణ యొక్క బంధనలో బంధించలేదు, సాక్షి అయ్యి కర్మేంద్రియాలను శీతలం చేసుకున్నారు. ఏ ఆకర్షణ ఆకర్షించలేదు, కర్మేంద్రియాలు ఆకర్షించలేదు, ఏ ఆత్మపై మోహం ఆకర్షించలేదు. నిర్మోహి మరియు నష్టోమోహ అయ్యారు. కొంతమంది వెళ్ళిపోతూ, వెళ్ళిపోతూ ఫలానా, ఫలానా వారు అని కలవరిస్తూంటారు. కానీ దాదీ నష్టోమోహ స్మృతిస్వరూపంలో వెళ్ళిపోయారు, కర్మేంద్రియజీత్ అయ్యి వెళ్ళారు. ఏ కర్మేంద్రియం తన వైపుకి, దు:ఖం యొక్క అలలోకి ఆకర్షించలేదు. దాదీ అనగానే దాదీ జ్ఞాపకం వస్తారు కదా, రావాలి కూడా. ఎందుకంటే మొదటి నెంబర్ కదా! మొదటి నెంబర్ కనుకే విజయం పొందారు కదా! కానీ ఎప్పుడైనా దాదీ జ్ఞాపకం వచ్చినప్పుడు కేవలం చిత్రం చూడటం కాదు కానీ నేను కూడా ఎవరెడీయేనా? అకస్మాత్తు అనే పాఠం నాకు కూడా జ్ఞాపకం ఉందా? ఇప్పుడిప్పుడే నేను కూడా అకస్మాత్తుగా వెళ్ళిపోవలసి వస్తే నష్టోమోహగా, ప్రకృతిజీత్ గా అయ్యానా? అనేది చూసుకోండి. దాదీ యొక్క ఈ బహుమతి అందరూ మీ దగ్గర ఉంచుకోండి. మంచిది.
నలువైపుల నుండి వచ్చిన ఉత్తరాలు, సందేశాలు, ఈమెయిల్స్ అన్నీ బాప్ దాదా దగ్గరికి చేరుకున్నాయి. అందరూ స్వయంగా రాలేకపోయినా కానీ తమ ప్రేమను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా పంపించారు. బాప్ దాదా ప్రతి ఒక్కరి మనస్పూర్వక ప్రేమ సందేశాన్ని, బహుమతిని స్వీకరించారు. ప్రతి ఒక్కరిని బాప్ దాదా తన నయనాలలో ఇముడ్చుకుని, ప్రేమకు జవాబుని ప్రియస్మృతుల రూపంలో ఇస్తున్నారు. మంచిది, ఈ పరమాత్మ ప్రేమ పురుషార్థములో చాలా సహయోగం చేస్తుంది. ప్రతి ఒక బిడ్డ ప్రియమే, ప్రియంగానే ఉంటారు మరియు ప్రేమ యొక్క ఊయలలో ఊగుతూ బాప్ దాదా వెంట మీ ఇంటికి వెళ్లారు. ఆ సమయం కూడా వస్తుంది.
అందరూ వెంట వచ్చేవారే కదా, వెంట వెళ్ళేవారే కదా! వెనుక, వెనుక రాకూడదు, అలా వస్తే మజా ఉండదు. చేతిలో చేయి వేసి, బాబా వెంట కలిసి వెళ్ళాలి. చేయి అంటే శ్రీమతం అంటే బుద్ధిలో శ్రీమతం ఉంటుంది, ఆత్మ, పరమాత్మ కలిసి ఉంటారు మరియు ఇంటికి వెళ్తారు. అందరూ వెళ్ళేవారే కదా, ఉండిపోకూడదు. ఇప్పుడు కూడా వెంటే ఉన్నారు, ఏ మూల ఉన్నా కానీ బాబా తోడు ఉన్నారు, వెంట ఉంటారు, వెంట వెళ్తారు మరియు బ్రహ్మాబాబాతో పాటు రాజ్యం చేస్తారు. ఇది పక్కా ప్రతిజ్ఞయే కదా, మధ్యలో ఆగిపోకూడదు. కల్తీ వస్తువులు ఏమైనా వెంట ఉంటే ఉండిపోతారు. కల్తీ వస్తువులు రావణునివి కదా! రావణుని ఏ సంస్కారం ఉండిపోయినా కానీ ధర్మరాజుపురిలో పట్టుబడిపోతారు. మిగిలిన వారు బాబా వెంట వెళ్ళిపోతారు. ఏమైనా మిగిలి ఉంటే ధర్మరాజుపురిలో ఆగవలసి ఉంటుంది. ఆగటం బావుంటుందా? బావుండదు కదా? బాబాకి కూడా బాగా అనిపించదు. కలిసే ఉంటాం అనేది ప్రతిజ్ఞ కనుక సదా కలిసే ఉండాలి. వెనుక ఉన్నవారి ప్రతిజ్ఞ పక్కాయే కదా! పక్కా ప్రతిజ్ఞ, మంచిది, సరే. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా కానీ బాబా తోడుని ఎప్పుడూ వదలకూడదు. ప్రతి సమయం బాబా మరియు మీరు అలా అయితే ఎంత మజా వస్తుంది! బాబా మరియు మీరు అంటే ఆనందమే కదా! టీచర్స్ చెప్పండి, దీనిలో మజా ఉంది కదా? లేక అప్పుడప్పుడు వేరు అయిపోయినా కానీ మంచిదేనా, బాబా తోడు వదిలేస్తారా? వదిలేయకూడదు. పక్కాయేనా? ఒక్క సెకండు కూడా వదలకూడదు. దానినే సత్యమైన ప్రేమ అని అంటారు. సరేనా? పక్కా పక్కా పక్కా! మీకు ఫోటో తీస్తున్నారు, వతనంలో తీస్తున్నారు. ఈ కెమెరాలో కాదు, వతనం నుండి తీస్తున్నారు. చాలా మంచిది.
నలువైపుల ఉన్న బాప్ దాదా యొక్క మనస్సుకి ఇష్టమైన పిల్లలకు, మనోభిరాముడు కదా, కనుక మనోభిరాముని యొక్క మనస్సుకి ప్రియమైన పిల్లలకు, ప్రేమ యొక్క అనుభవాలలో సదా తేలియాడుతూ ఉండే పిల్లలకు, ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు, స్వప్నంలో కూడా మరెవ్వరూ లేరు అనేటటువంటి బాప్ దాదా యొక్క అతి ప్రియ మరియు దేహాభిమానానికి అతీతమైన, గారాభ పదమాపదమ్ భాగ్యశాలి పిల్లలకు మనస్పూర్వక ప్రియస్మృతులు మరియు పదమాపదమ్ రెట్లు ఆశీర్వాదాలు, వెనువెంట బాలకుల నుండి యజమానులు అయిన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment