02-11-1987 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“స్వ పరివర్తనకు ఆధారము - సత్యమైన హృదయముతో రియలైజ్అవ్వడము”
ఈ రోజు విశ్వపరివర్తకుడు, విశ్వకళ్యాణకారీ అయిన బాప్ దాదా తమ స్నేహీ, సహయోగీ, విశ్వపరివర్తక పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరు స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో నిమగ్నమై ఉన్నారు. అందరి మనసులో ఈ విశ్వాన్ని పరివర్తన చేయాల్సిందే అనే ఒకే ఉల్లాస ఉత్సాహముంది, అంతేకాక పరివర్తన అవ్వాల్సిందే అనే నిశ్చయం కూడా ఉంది లేదా పరివర్తన అయ్యే ఉంది అని కూడా చెప్పవచ్చు. కేవలం నిమిత్తంగా బాప్ దాదాకు సహయోగులుగా, సహజ యోగులుగా అయి వర్తమానమును మరియు భవిష్యత్తును శ్రేష్ఠంగా చేసుకుంటున్నారు.
ఈ రోజు బాప్ దాదా నలువైపులా నిమిత్తంగా ఉన్న విశ్వ పరివర్తక పిల్లలను చూస్తూ ఒక విశేషమైన విషయాన్ని చూస్తూ ఉన్నారు - అందరూ ఒకే కార్యానికి నిమిత్తంగా ఉన్నారు, అందరి లక్ష్యం కూడా స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయడమే కానీ స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తనకు నిమిత్తంగా ఉంటున్నా నంబరువారుగా ఎందుకున్నారు? కొంతమంది పిల్లలు స్వ పరివర్తనను చాలా సులభంగా మరియు శీఘ్రంగా చేసుకుంటారు, కొంతమంది ఇప్పుడిప్పుడే పరివర్తనయ్యే సంకల్పం చేస్తారు కానీ స్వయం యొక్క సంస్కారాలు లేక మాయ మరియు ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితులు లేక బ్రాహ్మణ పరివారం ద్వారా తీరవలసిన లెక్కాచారాలు, శ్రేష్ఠ పరివర్తన యొక్క ఉల్లాసాన్ని బలహీన పరుస్తాయి, మరి కొంతమంది పిల్లలు పరివర్తన చేసుకునే ధైర్యంలో బలహీనంగా ఉన్నారు. ఎక్కడైతే ధైర్యం ఉండదో, అక్కడ ఉల్లాస-ఉత్సాహాలు ఉండవు. స్వ పరివర్తన లేకుండా విశ్వ పరివర్తన కార్యంలో మనసుకు ఇష్టమైన సఫలత ఉండదు ఎందుకంటే ఈ అలౌకిక ఈశ్వరీయ సేవలో ఒకే సమయములో మూడు రకాలైన సేవ సిద్ధిస్తుంది. ఒకేసారి జరిగే ఆ మూడు రకాల సేవలు ఏవి? ఒకటి - వృత్తి, రెండు - వైబ్రేషన్లు, మూడు - వాణి. ఈ మూడూ శక్తిశాలిగా ఉండాలి. వీటి ఆధారముగా నిమిత్తులుగా, నిర్మానులుగా మరియు నిస్వార్థులుగా ఉంటారు, అప్పుడే మనసుకు ఇష్టమైన సఫలత లభిస్తుంది. లేకుంటే సేవ అయితే జరుగుతుంది, స్వయాన్ని మరియు ఇతరులను కొంత సమయము కోసము సేవలో సఫలతతో సంతోషపరుస్తారు కాని బాప్ దాదా ఏదైతే మనసుకు ఇష్టమైన సఫలత అని అంటారో, అది కలగదు. బాప్ దాదా కూడా పిల్లల సంతోషానికి సంతోషిస్తారు కానీ హృదయాభిరాముని హృదయంలో యథాశక్తి రిజల్టు తప్పకుండా నోట్ అవుతూ ఉంటుంది. ‘శభాష్, శభాష్!’ అని తప్పకుండా అంటారు ఎందుకంటే తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరిపై, ఈ పిల్లలు ఇవాళ కాకపోతే రేపు సిద్ధి స్వరూపులుగా అవ్వనే అవుతారు అనే వరదానీ దృష్టి మరియు వృత్తి సదా ఉంటాయి. కానీ వరదాతతో పాటు శిక్షకుడు కూడా ఉన్నారు, అందుకే భవిష్యత్తు కోసం అటెన్షన్ కూడా ఇప్పిస్తారు.
కనుక ఈ రోజు బాప్ దాదా విశ్వ పరివర్తన కార్యము యొక్క మరియు విశ్వ పరివర్తక పిల్లల యొక్క రిజల్టును చూస్తున్నారు. వృద్ధి జరుగుతూ ఉంది, శబ్దము నలువైపులా వ్యాపిస్తూ ఉంది, ప్రత్యక్షతా పరదా తెరుచుకోవడం కూడా ఆరంభమైపోయింది. ఇప్పుడు నలువైపులా ఉన్న ఆత్మలలో సమీపంగా వెళ్ళి చూడాలి అనే కోరిక ఉత్పన్నమవుతూ ఉంది. విన్న విషయాలు ఇప్పుడు చూసే పరివర్తనలోకి మారిపోతున్నాయి. ఈ పరివర్తనంతా జరుగుతోంది. అయినా కూడా డ్రామానుసారంగా ఇప్పటి వరకు బాబా మరియు నిమిత్తమైన కొందరు శ్రేష్ఠ ఆత్మల శక్తిశాలీ ప్రభావము యొక్క ఫలితంగా ఈ పరివర్తన కనిపిస్తోంది. ఒకవేళ మెజారిటీవారు ఈ విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకుంటే చాలా త్వరగా బ్రాహ్మణులందరూ సిద్ధి స్వరూపములో ప్రత్యక్షమైపోతారు. బాప్ దాదా చూశారు - మనసుకు ఇష్టమైన, లోకానికి ఇష్టమైన, బాబాకు ఇష్టమైన సఫలతకు ఆధారమైన ‘స్వ పరివర్తన’లో ఇప్పుడింకా లోటు ఉంది. ‘స్వ పరివర్తన’లో లోటు ఎందుకుంది? దీనికి ముఖ్యమైన ఆధారము - ఒక విశేష శక్తి యొక్క లోటు. ఆ విశేష శక్తి - రియలైజేషన్ శక్తి.
ఏ పరివర్తనకైనా సహజ ఆధారము - రియలైజేషన్ శక్తి. ఎప్పటివరకైతే రియలైజేషన్ శక్తి రాదో, అప్పటివరకు అనుభూతి కలగదు మరియు ఎప్పటివరకైతే అనుభూతి ఉండదో, అప్పటివరకు బ్రాహ్మణ జీవన విశేషత యొక్క పునాది దృఢంగా ఉండదు. ఆది నుండి మీ బ్రాహ్మణ జీవితాన్ని ఎదురుగా తెచ్చుకోండి.
మొదటి పరివర్తన - నేను ఆత్మను, బాబా నా వారు - ఈ పరివర్తన ఏ ఆధారముతో జరిగింది? ఎప్పుడైతే ‘అవును, నేను ఆత్మను, వీరే నా తండ్రి’ అన్నది రియలైజ్ అవుతారో, ఈ రియలైజేషన్ అనుభవాన్ని కలిగిస్తుంది. అప్పుడే పరివర్తన జరుగుతుంది. ఎప్పటివరకైతే రియలైజ్ అవ్వరో, అప్పటివరకు సాధారణ వేగంతో నడుస్తారు మరియు ఏ క్షణమైతే రియలైజేషన్ శక్తి అనుభవీగా తయారుచేస్తుందో, అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. ఇలా, రచయిత గురించి గాని, రచన గురించి గాని పరివర్తనకు చెందిన విశేషమైన విషయాలు ఏవైతే ఉన్నాయో - అవును, ఇది అదే సమయము, అదే యోగము, నేను కూడా అదే శ్రేష్ఠమైన ఆత్మను అని ఎప్పటివరకైతే ప్రతి విషయాన్ని రియలైజ్ అవ్వరో, అప్పటివరకు ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన నడవడిక ఉండదు. ఎవరి వాయుమండల ప్రభావము కారణంగానైనా కొద్ది సమయము కోసము పరివర్తన జరుగుతుంది కానీ సదాకాలానికి జరగదు. రియలైజేషన్ శక్తి సదాకాలమునకు సహజంగా పరివర్తన చేస్తుంది.
ఇదే విధంగా, స్వ పరివర్తనలో కూడా ఎప్పటివరకైతే రియలైజేషన్ శక్తి ఉండదో, అప్పటివరకు సదాకాలమునకు శ్రేష్ఠ పరివర్తన జరగలేదు. ఇందులో విశేషంగా రెండు విషయాల రియలైజేషన్ కావాలి. ఒకటి - తమ బలహీనతల రియలైజేషన్, రెండవది - ఏ పరిస్థితి లేక వ్యక్తి నిమిత్తమవుతారో, వారి కోరిక మరియు వారి మనసులోని భావన మరియు వ్యక్తి యొక్క బలహీనత లేదా పరవశ స్థితి యొక్క రియలైజేషన్. పరిస్థితి ద్వారా వచ్చే పేపరు యొక్క కారణాన్ని తెలుసుకొని అందులో స్వయం పాస్ అయ్యేందుకు - నేను శ్రేష్ఠము, స్వస్థితి శ్రేష్ఠము, పరిస్థితి ఒక పేపరు అని శ్రేష్ఠ స్వరూపము యొక్క రియలైజేషన్ లో ఉండాలి. ఈ రియలైజేషన్ సహజంగా పరివర్తన చేయిస్తుంది మరియు మీరు పాస్ అవుతారు. ఇతరుల కోరిక లేక ఇతరుల స్వ ఉన్నతికి చెందిన రియలైజేషన్ కూడా మీ స్వ ఉన్నతికి ఆధారమవుతుంది. కనుక స్వ పరివర్తన రియలైజేషన్ శక్తి లేకుండా జరగజాలదు. ఇందులో కూడా ఒకటి - సత్యమైన హృదయము యొక్క రియలైజేషన్, రెండవది - చతురతతో కూడా రియలైజేషన్ కూడా ఉంటుంది ఎందుకంటే చాలా జ్ఞానసంపన్నులుగా అయిపోయారు. కనుక సమయాన్ని చూసి తమ పనిని నిరూపించుకునేందుకై, తమ పేరును మంచిగా చేసుకునేందుకై, ఆ సమయంలో రియలైజ్ అవుతారు కానీ ఆ రియలైజేషన్ లో పరివర్తన చేసుకునేంత శక్తి ఉండదు. కనుక హృదయము యొక్క రియలైజేషన్ హృదయాభిరాముని ఆశీర్వాదాన్ని ప్రాప్తి చేయిస్తుంది మరియు చతరుతతో కూడిన రియలైజేషన్ కొద్ది సమయము కోసము ఇతరులను కూడా సంతోషపరుస్తుంది, స్వయాన్ని కూడా సంతోషపరుస్తుంది.
మూడవ రకం రియలైజేషన్ - ఇది కరెక్టు కాదు అని మనసు భావిస్తుంది, ఇది యథార్థం కాదు అని వివేకం చెప్తుంది కానీ బయటకు తమను తాము మహారథులుగా నిరూపించుకునేందుకు, తమ పేరును పరివారంలో ఏ రకంగానూ బలహీనంగా లేక తక్కువగా అవ్వకుండా ఉంచుకునేందుకు వివేకాన్ని హత్య చేస్తూ ఉంటారు. ఇలా వివేకాన్ని హత్య చేయడము కూడా పాపమే. ఎలాగైతే జీవహత్య మహాపాపమో, అలా ఇది కూడా పాపఖాతాలో జమ అవుతుంది కనుక బాప్ దాదా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు మరియు వారి మనసులోని డైలాగులను కూడా వింటూ ఉంటారు. చాలా సుందరమైన డైలాగులు ఉంటాయి. ముఖ్యమైన విషయము - ఇలాంటి రియలైజేషన్ కలవారు, ఎవరికేమి తెలుస్తుంది, ఇలాగే నడుస్తుంది..... అని అనుకుంటారు, కానీ బాబాకు ప్రతి ఆకు గురించి తెలుసు. కేవలం నోటి ద్వారా వింటేనే తెలుస్తుందని కాదు, తెలిసినాగానీ బాబా తెలియనివారిగా అయ్యి అమాయకత్వముతో భోళానాథుని రూపంతో పిల్లలను నడిపిస్తారు. అయితే, తెలిసినా కూడా మళ్ళీ అమాయకంగా ఎందుకవుతారు? ఎందుకంటే బాబా దయాహృదయుడు, పాపము మీద పాపము పెరుగుతూ ఉండకూడదని ఈ దయ చూపిస్తారు. అర్థమైందా? ఇలాంటి పిల్లలు అత్యంత చతురుడైన తండ్రి వద్దకు మరియు నిమిత్తంగా ఉన్న ఆత్మల వద్దకు కూడా చాలా చతురులుగా అయి ఎదురుగా వస్తారు, అందుకే బాబా దయాహృదయునిగా, భోళానాథునిగా అవుతారు.
బాప్ దాదా వద్ద పిల్లల ప్రతి ఒక్కరి కర్మల ఖాతా, మనసా సంకల్పాల ఖాతా ప్రతి సమయములోనూ స్పష్టంగా ఉంటుంది. హృదయాలను తెలుసుకోవలసిన అవసరము లేదు, పిల్లల ప్రతి ఒక్కరి హృదయంలోని ప్రతి గుండెచప్పుడు యొక్క చిత్రము చాలా స్పష్టంగా ఉంది, అందుకే నేను ప్రతి ఒక్కరి హృదయాన్ని తెలుసుకోను అని అంటారు, ఎందుకంటే తెలుసుకునే అవసరమే లేదు, అంతా స్పష్టంగానే ఉంది. ప్రతి క్షణములోని హృదయము యొక్క గుండెచప్పుడు మరియు మనసులోని సంకల్పాల చార్టు బాప్ దాదా ఎదురుగా ఉంది. వారు చెప్పగలరు కూడా, చెప్పలేరని కాదు. తిథి, స్థానము, సమయము మరియు ఏమేమి చేశారు - అన్నీ చెప్పగలరు. కానీ అన్నీ తెలిసినా కూడా తెలియనట్లుగా ఉంటారు. మరి ఈ రోజు మొత్తము చార్టును చూశారు.
స్వ పరివర్తన తీవ్ర వేగముతో జరగకపోవడానికి కారణము - ‘సత్యమైన హృదయముతో రియలైజ్ అవ్వడము’లో లోటు ఉంది. రియలైజేషన్ శక్తి చాలా మధురమైన అనుభవాలను చేయించగలదు. ఇదైతే తెలుసు కదా. అప్పుడప్పుడు, స్వయాన్ని బాబాకు కంటితారలైన ఆత్మలుగా అనగా నయనాలలో ఇమిడి ఉండే శ్రేష్ఠ బిందువుగా రియలైజ్ అవ్వండి. నయనాలలోనైతే బిందువే ఇమడగలదు, శరీరమైతే ఇమడలేదు. అప్పుడప్పుడు, స్వయాన్ని మస్తకంలో మెరిసే మస్తకమణిగా, మెరుస్తున్న నక్షత్రంగా రియలైజ్ అవ్వండి, అప్పుడప్పుడు స్వయాన్ని బ్రహ్మాబాబాకు సహయోగిగా, కుడిభుజంగా, సాకార బ్రాహ్మణ రూపంలో బ్రహ్మాకు భుజాలుగా అనుభవం చెయ్యండి, రియలైజ్ అవ్వండి. అప్పుడప్పుడు, అవ్యక్త ఫరిస్తా స్వరూపాన్ని రియలైజ్ అవ్వండి. ఈ విధంగా రియలైజేషన్ శక్తితో చాలా అద్భుతమైన, అలౌకిక అనుభవాన్ని చెయ్యండి. కేవలం జ్ఞానం చెప్పినట్లుగా వర్ణన చెయ్యకండి, రియలైజ్ అవ్వండి. ఈ రియలైజేషన్ శక్తిని పెంచుకున్నట్లయితే మరోవైపు బలహీనత యొక్క రియలైజేషన్ స్వతహాగానే స్పష్టమవుతుంది. శక్తిశాలీ దర్పణము మధ్యలో చిన్నపాటి మచ్చ కూడా స్పష్టంగా కనిపిస్తుంది కనుక పరివర్తన చేసుకుంటారు. కనుక స్వ పరివర్తనకు ఆధారము రియలైజేషన్ శక్తి అని అర్థమయ్యిందా. శక్తిని కార్యములో ఉపయోగించండి, అంతేకానీ ఈ శక్తి కూడా ఉంది, ఈ శక్తి కూడా ఉంది అని కేవలం లెక్కపెట్టుకుంటూ సంతోషపడకండి. స్వయము పట్ల, సర్వుల పట్ల, సేవ పట్ల, సదా ప్రతి కార్యములోనూ ఉపయోగించండి. అర్థమైందా? చాలామంది పిల్లలు, బాబా ఇదే పని చేస్తూ ఉంటారా ఏమిటి అని అంటూ ఉంటారు. కానీ బాబా ఏమి చేస్తారు, తమతోపాటు అయితే తీసుకునే వెళ్ళాలి కదా. తమతో తీసుకువెళ్ళాలి అన్నప్పుడు సహచరులు కూడా అలాంటివారే అయి ఉండాలి కదా, కనుక చూస్తూ ఉంటారు మరియు సహచరులు సమానంగా అవ్వాలని సమాచారం వినిపిస్తూ ఉంటారు. వెనుక వెనుక వచ్చేవారి విషయమైతే లేనే లేదు, వారైతే అనేకమంది ఉంటారు. కానీ సహచరులైతే సమానులుగా ఉండాలి కదా. మీరు కలిసి వెళ్ళే సహచరులా లేక ఊరేగింపులో వచ్చేవారా? ఊరేగింపు అయితే చాలా పెద్దగా ఉంటుంది, అందుకే శివుని ఊరేగింపు ప్రసిద్ధమైనది. ఊరేగింపులో వచ్చేవారైతే రకరకాలుగా ఉంటారు కానీ సహచరులైతే సమానమైనవారు కావాలి కదా. అచ్ఛా.
ఇది ఈస్టర్న్ జోన్. ఈస్టర్న్ జోన్ ఏం చేస్తూ ఉంది? ప్రత్యక్షతా సూర్యుడిని ఎక్కడి నుండి ఉదయించేలా చేస్తారు? బాబాలో ప్రత్యక్షత జరిగింది అన్న విషయమైతే ఇప్పుడు పాతదైపోయింది. ఇప్పుడేమి చేస్తారు? పాత సింహాసనము - ఈ నషా అయితే మంచిదే కానీ ఇప్పుడేమి చేస్తారు? ఈ ఈస్టర్న్ జోన్ నుండి నవీనతా సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు అని అందరి నోటి నుండి వెలువడేటట్లుగా ఇప్పుడు ఏదైనా నవీనత అనే సూర్యుడిని ఉదయింపజేయండి. ఏ కార్యాన్ని అయితే ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదో, అది ఇప్పుడు చేసి చూపించండి. ఫంక్షన్లు, సెమినార్లు చేశారు, ఐ.పి.ల (విశిష్ట వ్యక్తుల) సేవ చేసారు, వార్తాపత్రికలలో వేసారు, ఇవన్నీ అందరూ చేస్తారు కానీ ఏదైనా నవీనత యొక్క మెరుపును చూపించండి. అర్థమయిందా.
బాబా ఇల్లు అంటే మీ ఇల్లు. అందరూ ప్రశాంతంగా చేరుకున్నారు. మనసు యొక్క ప్రశాంతత స్థూలమైన ప్రశాంతతను కూడా అందిస్తుంది. మనసు ప్రశాంతంగా లేకపోతే ప్రశాంతతను కలిగించే సాధనాలు ఉన్నా కూడా ప్రశాంతత లేనివారిగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉండడం అనగా మనసులో సదా రాముడు తోడుగా ఉండటము, అందుకే ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రశాంతతను అనుభవం చేస్తారు. ప్రశాంతత ఉంది కదా లేదా రావడం, వెళ్ళడంలో ప్రశాంతత లేనట్లుగా అనిపిస్తుందా? అయినా కూడా మధురమైన డ్రామాలో నిశ్చితమై ఉందని భావించండి. మేళా అయితే జరుపుకుంటున్నారు కదా. బాబాను కలవడము, పరివారమును కలవడము - ఈ మిలనమును జరుపుకునే విధి కూడా మధురమైనది. అచ్ఛా.
శక్తిశాలీ శ్రేష్ఠ ఆత్మలందరికీ, ప్రతి శక్తిని సమయానికి కార్యంలో ఉపయోగించే తీవ్ర పురుషార్థీ పిల్లలందరికీ, సదా స్వ పరివర్తన ద్వారా సేవలో మనసుకు ఇష్టమైన సఫలతను పొందే సంతోషకరమైన పిల్లలకు, సదా హృదయాభిరాముడైన తండ్రి ముందు సత్యమైన హృదయముతో స్పష్టంగా ఉండే సఫలతా స్వరూప శ్రేష్ఠ ఆత్మలకు, మనోభిరాముడైన బాప్ దాదాల హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక -
సదా స్వయాన్ని బాబా ఛత్రఛాయలో ఉండే విశేష ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? ఎక్కడైతే బాబా ఛత్రఛాయ ఉంటుందో, అక్కడ సదా మాయ నుండి సురక్షితంగా ఉంటారు. ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. శ్రమ నుండి స్వతహాగానే దూరమైపోతారు, సదా ఆనందంలో ఉంటారు, ఎందుకంటే ఎప్పుడైతే శ్రమ ఉంటుందో, ఆ శ్రమ ఆనందాన్ని అనుభవం చేయనివ్వదు. ఉదాహరణకు పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆ చదువులో శ్రమ ఉంటుంది కదా. పరీక్షల సమయములో చాలా శ్రమ చేస్తారు, అప్పుడు ఆనందంగా ఆడుకోరు. ఎప్పుడైతే శ్రమ సమాప్తమవుతుందో, పరీక్షలు సమాప్తమవుతాయో, అప్పుడు ఆనందంగా గడుపుతారు. కనుక ఎక్కడైతే శ్రమ ఉంటుందో, అక్కడ ఆనందం ఉండదు. ఎక్కడైతే ఆనందము ఉంటుందో, అక్కడ శ్రమ ఉండదు. ఛత్రఛాయలో ఉండేవారు అనగా సదా ఆనందంలో ఉండేవారు ఎందుకంటే ఇక్కడ ఉన్నతమైన చదువును చదువుతారు కానీ ఉన్నతమైన చదువును చదువుతున్నా, మేము విజయులుగా ఉండనే ఉన్నాము, పాస్ అయ్యే ఉన్నాము అనే నిశ్చయము ఉంటుంది కనుక ఆనందంగా ఉంటారు. ఇది కల్ప-కల్పము యొక్క చదువు, ఇది కొత్త విషయమేమీ కాదు. కనుక సదా ఆనందంగా ఉండండి మరియు ఇతరులకు కూడా ఆనందంగా ఉండే సందేశాన్ని ఇస్తూ ఉండండి. సేవ చేస్తూ ఉండండి ఎందుకంటే సేవా ఫలాన్ని ఈ సమయంలోనే కాక భవిష్యత్తులో కూడా తింటూ ఉంటారు. సేవ చేసినప్పుడే కదా ఫలము లభిస్తుంది
Comments
Post a Comment