31-12-2010 అవ్యక్త మురళి

   31-12-2010        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చి నిర్విఘ్నంగా ఉండే దృఢ సంకల్పాన్ని తీసుకోండి మరియు దయా హృదయులుగా, మాస్టర్ దాతలుగా అయ్యి మనసా సేవ ద్వారా దుఃఖము, అశాంతితో ఉన్న ఆత్మలకు ఆధారాన్ని ఇవ్వండి.”

           ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలకు క్రొత్త సంవత్సరము మరియు క్రొత్త ప్రపంచం కోసం శుభాకాంక్షలను తెలపడానికి, సూక్ష్మ వతనము నుండి స్థూల వతనమునకు వచ్చారు. పిల్లలందరూ స్నేహము మరియు ప్రేమతో తమ ఇల్లయిన మధువనమునకు చేరుకున్నారు. ప్రపంచంలోని వారైతే కేవలం నూతన సంవత్సరాన్ని మాత్రమే జరుపుకుంటారు, అది కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. మీరు క్రొత్త ప్రపంచపు సంగమంలో సదా జరుపుకుంటూనే ఉంటారు. మీ ముందు క్రొత్త ప్రపంచము నయనాలలోనే ఇమిడి ఉంది, స్మృతి చెయ్యగానే అక్కడకు చేరుకోగలరు. మీ నయనాలలోనే ఇమిడి ఉంది కదా! ఇప్పుడే సంగమంలో ఉన్నట్లుగా, ఈ రోజు సంగమంలో ఉన్నారు మరియు రేపు తమ రాజ్యంలోకి వెళ్ళిపోనున్నారు! ఇలా నయనాలలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోని వారు ఒకరికొకరు ఒక్క రోజుకు మాత్రమే శుభాకాంక్షలను తెలుపుకుంటారు. కానీ బాప్ దాదా మీకు కానుకగా గోల్డెన్ వరల్డ్ (బంగారు ప్రపంచము)ను ఇచ్చారు. అది ఎంతో కాలం జరుగనుంది. అక్కడకు ఒక్క క్షణములో చేరుకునేంతగా ఆ ప్రపంచము మీ నయనాలలో ఇమిడి ఉంది. అందరి ఎదుట గోల్డెన్ ప్రపంచము తమ తమ నయనాలలో ఇమిడి ఉంది. ఒక్క క్షణములో చేరుకోగలరు కదా! ఈ రోజు సంగమంలో ఉన్నారు, రేపు రాజ్య అధికారులుగా అయ్యి రాజ్యము చేస్తారు.

            మీకు తెలుసు కదా, ఇప్పుడు సమయానుసారంగా మీ భక్తులు దుఃఖంతో, అశాంతితో ఉన్న కారణంగా పూర్వజులైన మిమ్మల్ని ఎంతగా పిలుస్తున్నారు! ఎంతగా దుఃఖ అశాంతులతో పిలుస్తున్నారో వారి మొర వినిపిస్తోందా? మాకు శాంతినివ్వండి, సుఖమునివ్వండి, సంతోషమునివ్వండి... వినిపిస్తోందా? ఇవ్వండి, ఇవ్వండి... కావున ఇప్పుడు ఆత్మలైన మీరు దయా హృదయులై కళ్యాణకారి దాత పిల్లల రూపంలో ఆత్మలకు మనసా సేవ ద్వారా ఇచ్చే కార్యమును చేయండి. ఈ దు:ఖి, అశాంత ఆత్మలపై బాప్ దాదాకు ఎంతో దయ కలుగుతుంది. మీకు కూడా దయ కలుగుతుంది కదా! (దగ్గు వచ్చింది) ఈ రోజు బ్రహ్మా బాబా యొక్క దగ్గు వచ్చింది. మరి మీకు కూడా ఆత్మలపై దయ కలుగుతుంది కదా! ఈ రోజు క్రొత్త సంవత్సరం వస్తుంది, మరియు పాత సంవత్సరం వెళ్తుంది కూడా. మరి వెళ్తున్న ఈ సంవత్సరంలో మీరు ఏ ప్లాన్‌ను తయారు చేసుకున్నారు? సంవత్సరమైతే వెళ్తుంది, కానీ మీ అందరూ మీ కొరకు సంవత్సరంతో పాటు దేనికి వీడ్కోలు చెప్తారు? ఎలా అయితే సంవత్సరం వీడ్కోలు తీసుకోబోతోందో అలాగే మీరు మీ జీవితంలో దేనికి వీడ్కోలు ఇవ్వబోతున్నారు? క్రొత్తగా దేనిని నింపుకుంటారు? సదాకాలికముగా వీడ్కోలు ఇస్తారా లేక కొద్ది సమయం కోసమేనా? ఎందుకంటే బాప్ దాదా ఏమని సూచన ఇచ్చారంటే, ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్న పాత సంస్కారాలను మనసు ద్వారా చూస్తూ, తెలుసుకుని ఇప్పుడిక వాటిని సమాప్తం చేసి తీరాలి. బాప్ దాదాకు ఈ పాత సంస్కారాలు పురుషార్ధంలో విఘ్న రూపంగా కనిపిస్తాయి. పిల్లలు ఒకవైపు, బాబాయే నా ప్రపంచము అని అంటారు, మరి పాత సంస్కారాలు ఎక్కడ నుండి వచ్చాయి? మీ ప్రపంచమే బాబా అయినప్పుడు పురుషార్ధంలో విఘ్నాలు వేసే ఈ పాత సంస్కారాలు సమాప్తమవ్వాలి కదా! అమృతవేళ ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు, అందరూ తమ చార్జును బాబాకు ఇవ్వడం చూసారు. ఇప్పటి వరకు పాత సంస్కారాలే పురుషార్థాన్ని ఢీలా చేస్తున్నాయి. కావున ఈ రోజు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు ఈ సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇవ్వగలరా? ఇవ్వగలరా? చేతులెత్తండి. ఇవ్వవలసి ఉంటుంది. చేతులెత్తడమైతే చాలా సహజము, కానీ మనసు రూపీ చేతిని ఎత్తవలసి ఉంటుంది. ఎత్తుతున్నారు. పాత సంస్కారాలను సదా కాలం కోసం వదిలేయాలి... చేతులెత్తుతున్నారు. మళ్ళీ ఎత్తండి. అచ్ఛా, మెజారిటీ పిల్లలు చేతులెత్తి బాప్ దాదాను సంతోషపరిచారు. పిల్లలు ధైర్యం కలిగినవారు అని బాప్ దాదాకు సంతోషంగా ఉంది. ఎక్కడ ధైర్యము ఉంటుందో అక్కడ బాప్ దాదా సహయోగము సదా ఉంటుంది. మరి ఇప్పుడు చేతులెత్తారు కనుక బాబా యొక్క చిన్న, పెద్ద స్థానాలన్నీ నిర్విఘ్నంగా అయిపోయినట్లే కదా! ఎందుకంటే బాప్ దాదా వద్దకు వచ్చే రిజల్టుకు కారణం పాత సంస్కారాలే. మరి ఈ రోజు సంస్కారాలను సంకల్పంలో కూడా సమాప్తం చేయాలి, అనగా నిర్విఘ్న భవ అన్న వరదానాన్ని తీసుకోవాలి. తీసుకున్నారా? వరదానము తీసుకున్నారా? ధైర్యానికి ఫలితం లభిస్తుంది కదా! ధైర్యముతో కూడిన ఒక్క అడుగు పిల్లలది, అనేక అడుగుల బాబా సహకారము తప్పక లభించే ఉంది అన్నది బాప్ దాదా నుండి లభించిన వరదానము. నేను పాత సంస్కారాన్ని ఇచ్చేసాను అన్న ఈనాటి సంకల్పాన్ని సదా గుర్తుంచుకోండి. ఒకవేళ అది మీ వద్దకు మళ్ళీ తిరిగి వస్తే ఏమి చేస్తారు? ఏమి చేస్తారు? ఇచ్చిన వస్తువును మళ్ళీ తిరిగి తమ వద్ద పెట్టుకోవడం జరుగదు, ఎందుకంటే ఇచ్చేసారు అంటే ఇక అది నాది కాదు. మరి తమది కానప్పుడు తమ వద్ద ఎలా పెట్టుకుంటారు? బాబాకు ఇచ్చేసారు కనుక, తిరిగి బాబాకే ఇచ్చేస్తారు కదా. పక్కా కదా, ఇచ్చేసారు కదా. ఇప్పుడు రెండు-రెండు చేతులు ఎత్తండి. పక్కా, వెనుక ఉన్న వారు కూడా ఎత్తుతున్నారు.

           బాప్ దాదాకు సంతోషము ఏమిటంటే, కలియుగంలో ఉంటూ కూడా బాబా ద్వారా లభించిన ప్రాప్తి యొక్క అనుభవాన్ని ఇప్పుడు సంగమంలో పొందుతున్నారు. ప్రపంచానికి ఇది కలియుగము, కానీ మీ కొరకు మాత్రం ఇది సంగమయుగము అనగా సర్వ ప్రాప్తుల యుగము. పరమాత్మ ప్రాప్తులు, సర్వ శక్తులు, సర్వ గుణాలు, సర్వ జ్ఞాన ఖజానాలు ఏవైతే లభించాయో వాటిని ప్రాక్టికల్ గా అనుభవం చేసుకోండి. మరి ఈ రోజు బాప్ దాదా, ఎవరైతే చేతులెత్తారో ఆ పిల్లలందరికీ సమ్ముఖంలోని వారికైనా, దూరంగా దేశ విదేశాలలో వింటున్న వారికైనా కావచ్చు, పిల్లలందరికీ ఎంతో మనస్ఫూర్తిగా ఏమి ఇస్తున్నారు? అభినందనలైతే ఇస్తున్నారు, కానీ అభినందనలతో పాటు అందరి మస్తకంపై చేయి ఉంచుతున్నారు. మీరు కూడా, బాప్ దాదా కూడా మనసులోనే నాట్యం చేస్తున్నారు, వాహ్ పిల్లలు వాహ్! ఇప్పుడు మీరు కూడా మనసులో నాట్యం చేస్తున్నారు. హాజీ అని అనండి.

           ఇప్పుడు టీచర్లు చూడండి.టీచర్లు చేతులెత్తండి. విదేశీ టీచర్లు కూడా ఉన్నారు కదా! పిల్లల దృఢ సంకల్పము విని బాప్ దాదాకు చాలా సంతోషంగా ఉంది. బాబా సమానంగా సంపన్నంగా, సంపూర్ణంగా అవ్వాలన్న పిల్లల లక్ష్యములో నిర్విఘ్నంగా ఉండాలన్న దృఢ సంకల్పము సమయాన్ని సమీపంగా తీసుకువస్తుంది. పిల్లలు తీసుకున్న సంకల్పాన్ని సంపన్నంగా చేస్తారు అని కూడా బాప్ దాదాకు సంతోషంగా ఉంది. ప్రపంచంలోని దుఃఖిత, అశాంత ఆత్మలకు మనసా సేవను చేసి వారికి కూడా ఏదో ఒక ఆధారాన్ని ఇస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లలు పిలవడము, మొర పెట్టుకోవడము బాప్ దాదా సహించలేరు. వారు మీ పరివారమే కదా! దుఃఖము, అశాంతి ఎంతో పెరుగుతున్నాయి. ఇప్పుడు దయా హృదయులుగా అవ్వండి. దీనితో పాటు నడుస్తూ తిరుగుతూ అమృతవేళ ఆత్మలకు మనసా సేవను తప్పకుండా చేస్తాను అన్న సంకల్పాన్ని తీసుకోగలరా? సంస్కారాలను సదా కాలం కోసం సమాప్తం చేస్తాము అని సంకల్పం తీసుకున్నారు కదా. సదా కాలికముగా సంకల్పం తీసుకున్నారు కదా, కొద్ది సమయం కోసం కాదు కదా! సంస్కారాలను సమాప్తం చేసి ఎలా అయితే బాబా సమానంగా అవుతారో అలాగే దాత పిల్లలుగా అయ్యి మాస్టర్ దాత స్వరూపంతో మనసా సేవను కూడా చెయ్యాలి. ఇందుకు సిద్ధంగా ఉన్నారా? మనసా సేవను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారా? మనసా సేవను చేస్తాము అనేవారు చేతులెత్తండి. రోజతంటిలో సమయం లభించినప్పుడల్లా మనసా సేవను తప్పకుండా చెయ్యండి. ఎందుకంటే సుఖమయ ప్రపంచాన్ని మీరే తీసుకురావాలి. బాబా పిల్లలైన మిమ్మల్ని ఈ సేవ కోసమే తమ కుడి భుజాలుగా చేసుకున్నారు. చేతుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది కదా. మరి మీరు బాబాకు కుడి భుజంగా ఉన్నారు. మరి బాబా రైట్ హ్యాండ్ అనగా తమ చేతుల ద్వారా అందరికీ ఏదో ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నారు. వారు ఇవ్వండి-ఇవ్వండి అని మొర పెట్టుకుంటున్నారు. దుఃఖంలో ఉన్న వారికి సుఖమును, వ్యాకులతలో ఉన్న వారికి శక్తిని ఇచ్చి పుణ్యం చెయ్యండి. ఇప్పుడు పిల్లలైన మీరు మీ గురించి తెలుసుకున్నారు, బాబాను తెలుసుకున్నారు, వారసత్వానికి అధికారులుగా అయ్యారు. ఇప్పుడు ఇక ఇతరులను కూడా తయారు చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు. అందరినీ ముక్తిలోకి పంపించి మీరు బాబా వరదానంతో రాజ్య అధికారులుగా అవుతారు. కావున బాబా పిల్లలందరికీ “నిర్విఘ్న భవ, సేవాధారి భవ" అన్న ఈ సంకల్పమును ఇస్తున్నారు, ఎవరైతే బాబా పిల్లలుగా అయ్యారో వారికి సంగమయుగంలోని బ్రాహ్మణ జీవితపు ఆనందము అనుభవమవుతుంది, అవుతూనే ఉంటుంది. క్రొత్త వారుకానీ, పాతవారు కానీ స్వయాన్ని బాబా వారసత్వానికి అధికారులుగా, అతీంద్రియ సుఖము అనే ఊయలలో ఊగుతూ ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటున్నారు. భవిష్యత్తు కోసం కూడా సంస్కారాలపై విజయునిగా అవ్వాలన్న సంకల్పము తీసుకున్న ఆత్మలన్నీ కోట్లలో కొద్దిమందిగా, కొద్దిమందిలో కూడా కొద్దివారిగా అయ్యారా? జనక్ (జానకి దాదీ) ఏమన్నారంటే 108 మాల, 16, 108 మాలలోకి వచ్చే వారితో ప్రత్యేకంగా కలవండి అని. మేము ఖచ్చితంగా 16 వేలు లేక 108 మాలలోకి వస్తాము అని భావించేవారు చేతులెత్తండి. 

           క్రొత్త క్రొత్తవారు కూడా చేతులెత్తుతున్నారు. అభినందనలు. నిశ్చయబుద్ధి కలవారు విజయులుగా అవుతారు. నిశ్చయ బుద్ధితో ఉండేవారు ముందుకు వెళ్ళగలరు, వెళ్తారు అని బాప్ దాదాకు తెలుసు, అచ్ఛా, ఇక్కడ ఎదురుగా కూర్చుని ఉన్నారు కదా. మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. అందరి తరఫున బాప్ దాదా మీకు అభినందనలు తెలుపుతున్నారు. నిశ్చయం చేసిన వారు, అమృతవేళ సదా ఈ విషయాన్ని రివైజ్ చేస్తూ ఉండండి. అచ్ఛా, టూ లేటు ముందుగానే వచ్చి తమ వారసత్వానికి అధికారులుగా అవుతున్నందుకు బాప్ దాదాకు పిల్లలను చూసి సంతోషంగా ఉంది. అందుకే సర్వ పరివారం తరఫున, ఇక్కడకు వచ్చినవారి మరియు తమ-తమ సెంటర్లలో ఉన్న వారందరి తరఫున కూడా బాప్ దాదా మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు మీరు ఒక అద్భుతాన్ని చేయండి, ధైర్యముందా? ధైర్యముందా? మీరు ముందు నుండే నిర్విఘ్నంగా ఉండండి. నిశ్చయము మరియు నషాలో నంబరువన్ గా ఉండండి. పాత వారు పాతవారే. కానీ క్రొత్తవారు కొద్ది సమయంలోనే అద్భుతాన్ని చేసి చూపిస్తారు. అచ్ఛా!

           ఇప్పుడు బాప్ దాదా క్రొత్తవారికి, పాతవారికి అందరికీ ఒక్క క్షణము యొక్క కార్యాన్ని ఇస్తున్నారు. అందరూ ఇప్పుడిప్పుడే ఒక్క క్షణములో, తమను తాము ఇతర సంకల్పాల నుండి దూరంగా ఒక్క సెకండులో స్వయాన్ని బిందు రూపంలో స్థితి చేసుకోగలరా? చేస్తారా? ఒక్క క్షణములో- నేను బిందువును, మరే ఇతర సంకల్పాలు వద్దు. నేను బిందువును. ఎవరైతే ఒక్క క్షణములో స్వయాన్ని బిందు స్థితిలో స్థిరము చేసుకోగలిగారో వారు చేతులెత్తండి. క్షణములో చేయాలి. అచ్ఛా. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని 15 రోజులు, రోజంతటిలో ప్రతి గంటలో ఒక్క సెకండులో బిందువును పెట్టండి. ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. అక్కడ ఆ వాతావరనంలో ఉంటూ, తమ కార్యాలలో ఉంటూ క్షణములో బిందు రూపంలో సఫలత లభించిందా అని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇక్కడ వాయుమండలం కూడా ఉంది కానీ తమ-తమ స్థానాలలో ఉంటూ కూడా క్షణములో బిందు స్వరూపంలో స్థితులవ్వగలగాలి, ఈ అభ్యాసమును చేయండి ఎందుకంటే ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటామో అంతగా ఒక్క క్షణములో బిందు స్థితిలో స్థితులయ్యే అవసరము వస్తుంది. కావున తమను తామే పరిశీలించుకోండి మరియు తమ తమ స్థానాలలోని టీచర్లకు రిపోర్టును వ్రాసి ఇవ్వండి. ఇక్కడ ఉన్నా లేకున్నా, అన్ని క్లాసుల వారికి ఇది హోమ్ వర్కు. తర్వాత టీచర్ల ద్వారా రిజల్టు బాప్ దాదా ముందుకు వస్తుంది. రోజు యొక్క దినచర్యలో, ఈ క్షణములో చేసే అభ్యాసములో ఎంత సఫలం చేసుకున్నారు అనే దానిని బట్టి, మీరు 108 లేక 16 వేల మాలకు అధికారులా, మీరు ఎందులో యోగ్యులు అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికల్ ధారణ ఆధారంగా మేము 108 లేక 16108 మాలలోకి వస్తాము అని భావించేవారి చేతులను ఎత్తించడం జరుగుతుంది. మీరు కేవలం రిజల్టును వ్రాసి పంపండి, దాని ద్వారా అర్థమైపోతుంది ఎందుకంటే ఒకవేళ దాదీలు పేర్లు వ్రాసి ఇస్తే మేము కూడా అందులో రాగలము కదా అని కొందరు భావించవచ్చు. కావున ఈ రిపోర్టు ద్వారా తెలుస్తుంది.

           సదా క్షణములో ఏ రూపాన్ని అనుభవం చేయాలనుకుంటే దానిని చేయగలుగుతారా? అని బాప్ దాదా అడుగుతున్నారు. సెకండులో? 5 స్వరూపాలు ఏవైతే వినిపించామో, వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణములో ఆ స్వరూపంలోకి రాగలరా? నేను కోరుకున్న స్థితిలో క్షణములో స్థిరము కాగలుగుతున్నానా లేక సమయం పడుతుందా అని ఈ అభ్యాసంతో అర్థమవుతుంది. ఇకపోతే మెజారిటీ చేతులెత్తారు, చేతులెత్తడంలో బాప్ దాదాను సంతోషపరిచారు. ఇప్పుడు చేతిని ఎత్తారు, కానీ అభ్యాసము చేస్తూ చేస్తూ ఇది ఎలా అయిపోతుందంటే ద్వాపర కలియుగాలలో దేహ అభిమానంలోకి రావడం ఎంత నాచురల్ గా జరుగుతుందో అలాగే ఏ స్వరూపంలో స్థితి కావాలనుకుంటే అది కూడా అంతే సహజంగా అయిపోతుంది. ఎందుకంటే రానున్న సమయంలో మీకు ఇటువంటి అభ్యాసము అవసరమవుతుంది. కావున ఈ అభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ తమ-తమ కార్యాలలో ఉంటూ కూడా చేస్తూ ఉండండి మరియు రిజల్టును తమ నిమిత్త టీచరుకు ఇస్తూ ఉండండి. మరి ఈ సంవత్సర సమాప్తిలో ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉండండి. మీకు మీరే చేయండి, మీరే మీకు టీచరుగా అవ్వండి, కానీ రిజల్టు చూపించడానికి మాత్రం తమ చార్టును ఇస్తూ ఉంటే అటెన్షన్ ఉంటుంది. ఈ స్థూల చేతిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచగలరు కదా, అలాగే మనసును ఏ స్థితిలో ఉంచాలనుకుంటే ఆ స్థితిలో ఉంచగలగాలి. సృతిచిహ్నంలో కూడా మన్మనాభవయే మహామంత్రముగా ఇవ్వడం జరిగింది. మనస్సు యొక్క డ్రిల్ లో ఎంత సఫలత లభించింది అని మీకు మీరే అనుభవం చేసుకోండి.

           పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు సంగమయుగపు సుఖము, సంగమయుగపు ప్రాప్తులు... ప్రతి ప్రాప్తిలోనూ అనుభవజ్ఞులుగా అవ్వాలని బాప్ దాదా కోరుకుంటున్నారు. ప్రతి ప్రాప్తి, ప్రతి శక్తి, జ్ఞానములోని ప్రతి రహస్యంలో, యోగము యొక్క ప్రతి విధిలో, ధారణలో కూడా ప్రతి ధారణలో అనుభవజ్ఞులుగా అయ్యామా అని స్వయాన్ని పరిశీలించుకోండి. స్వయం యొక్క పూర్తి చెకింగ్ ను చేసుకుంటూ ఉండండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి. చెకింగ్ మరియు ప్రాప్తిని పరిశీలించుకోమని బాప్ దాదా ఈ రోజు చెప్తున్నారు. ఏ ప్రాప్తిలోనైనా తక్కువగా ఉన్నట్లయితే డ్రామానుసారంగా పరీక్షలు కూడా సమయానుసారంగా అవే వస్తాయి, కావున అన్ని సబ్జెక్టులలో సంపన్నత మరియు సంపూర్ణత యొక్క చెకింగ్ ను చేసుకుంటూ ఉండండి మరియు ఛేంజ్ అవ్వండి.

            మరి ఈ రోజు బాప్ దాదా మీ అందరి సాధారణ స్వరూపాలలో కూడా మీ భవిష్య రూపము, ప్రాప్తుల రూపాన్ని చూస్తున్నారు. అచ్ఛా. అన్ని వైపుల ఉన్న గారాల పిల్లలకు, బాప్ దాదా హృదయ సింహాసనాధికారులకు, బాప్ దాదా యొక్క ఆజ్ఞాకారి, తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్ దాదాల చాలా చాలా హృదయపూర్వక ప్రేమ మరియు బాప్ దాదా యొక్క అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాప్ దాదాకు కూడా పిల్లలను చూసి సంతోషం కలుగుతుంది వాహ్, వాహ్ వాహ్! నా పిల్లలు వాహ్!

సేవ టర్ను ఇండోర్ జోన్ వారిది:- ఇండోర్ నివాసులందరూ సేవ మరియు స్మృతిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ-తమ పురుషార్థము మరియు ప్రాప్తుల అనుభవంతో ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూనే ఉంటారు, కావున బాప్ దాదా సంతోషిస్తున్నారు. ధైర్యము బాగుంది, కావున ఎక్కడ ధైర్యము ఉందో అక్కడ ధైర్యము యొక్క ఫలితము, ధైర్యము యొక్క శక్తి రెండూ ప్రాప్తిస్తాయి. ప్రతి జోను వారు ఏదో ఒక సేవలో లేక తమ స్థితిని నిర్విఘ్నంగా మరియు పురుషార్థాన్ని తీవ్రంగా చేసుకోవడములో బాబాకు ప్రియంగా అయి మున్ముందు కూడా బాబాకు ప్రియంగా అయి ముందుకు సాగుతూ ఉండాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. బాగుంది. ఇండోర్ లో ప్రభుత్వంతో మంచి కనెక్షన్ ఉండటం అక్కడి విశేషత. ఇప్పుడు ప్రభుత్వంలో నిమిత్తంగా అయ్యి కనెక్షన్లో ఉన్నవారిని సేవలో సహయోగులుగా చెయ్యండి. మంచి కనెక్షన్ ఉంది, వారిద్వారా సేవ చేయించండి. ఎటువంటి కార్యంలో వారి తోడును తీసుకోవాలంటే, వారిచ్చిన సహకారంతో ప్రజలపై ప్రభావం పడాలి. సేవలో తోడుగా చేసుకోండి. వారికి ఇష్టము ఉంది, కానీ కొద్దిగా ముందుకు పంపండి, వారిని ఇంటివారిగా చేయండి. రాగలరు. ఇకపోతే సంఖ్య అయితే చాలానే ఉంది. ఇండోర్ నుండి ఈ రోజు మొదటిసారిగా వచ్చినవారు చేతులెత్తండి. మంచిది, ప్రతి జోన్ వారు తమ తమ సేవలో సఫలతను పొందుతూ ఉన్నారు మరియు పొందుతూ ఉంటారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ చూస్తూ సంతోషిస్తున్నారు. ముందుకు వెళ్తున్నారు, వెళ్తూ ఉంటారు.

జ్యూరిస్ట్ వింగ్ :- బాగుంది, జ్యూరిస్ట్ వింగ్ వారు తమ కార్యాన్ని చేస్తున్నారు, ముందు, ముందు కూడా చేస్తారు. బాగుంది. ఇంతకు ముందు కూడా బాప్ దాదా జ్యూరిస్ట్ వింగ్ కు సూచన ఏమిచ్చారంటే- ఎటువంటి జ్యూరిస్ట్ లను తయారు చెయ్యండంటే, పరస్పరంలో వారి గ్రూపును తయారు చేసి గీతా భగవంతుడు పరమాత్మ అని నిరూపించగలగాలి. ఇటువంటి గ్రూపును తయారు చెయ్యండి. ఎలా అయితే ధార్మిక వింగ్ వారికి చెప్పినప్పుడు వారు కొద్ది కొద్దిగా ప్రయత్నించారో అలాగే జ్యూరిస్ట్ వింగ్ కూడా గీతా భగవంతుడు ఎవరు అన్న విషయాన్ని నిరూపించే గ్రూపును తయారు చెయ్యాలి. వీలవుతుంది కదా! వీలవుతుందా? ఎందుకంటే ఇప్పుడు రెండు విషయాలు ప్రపంచంలో ప్రసిద్ధి చెందాలి, ఒకటి గీతా భగవంతుడు, రెండవది పరమాత్మ సర్వవ్యాపి కాదు. ఈ రెండు విషయాలు నెమ్మది నెమ్మదిగా ప్రసిద్ధి చెందాలి. బ్రహ్మాకుమారీలు మనశ్శాంతి కోసం బోధిస్తూ మనసులోని వ్యాకులతను మెడిటేషన్ ద్వారా దూరం చేస్తారు అని ప్రపంచంలో ప్రసిద్ధి అయింది. మనసులో అశాంతితో ఉన్నవారు బ్రహ్మాకుమారీల వద్ద ఇందుకు మంచి సాధనము ఉంది భావిస్తారు. నెమ్మది నెమ్మదిగా ప్రసిద్ధి అవుతూ ఉంటుంది, అలాగే ఈ రెండు విషయాలు అథారిటీ ఉన్నవారి వద్ద ప్రసిద్ధి కావాలి. ఒకరిద్దరు సంతృప్తి చెంది, ఏమాత్రమూ జంకు లేకుండా ఈ విషయాలు అర్థం చేసుకోవలసినవి అని చెప్పినప్పుడు నెమ్మది నెమ్మదిగా వ్యాపిస్తుంది. భాషణ గురించైతే బ్రహ్మాకుమారీల భాషణ పాయింట్ టు పాయింట్ ఉంటుంది అని అంటారు, వినడానికి వస్తారు, అర్థం చేసుకుంటారు. కానీ ఈ ముఖ్య విషయము గురించి సేవ జరగాలి. ఈ రెండు విశేషమైన విషయాలు. దీనిద్వారా వీరికి చదివిస్తున్నది ఎవరు అన్నది నిరూపణ అవుతుంది! వీరికి నేర్పించేది ఎవరో ఒక అథారిటీ అని అర్థమయ్యేలా పురుషార్థం చెయ్యండి. ఇకపోతే అంతా మంచిగా ఉంది, ఈ వర్గాలు తయారైనప్పటి నుండి ప్రతి ఒక్కరూ తమ సేవా బాధ్యతను చక్కగా తీసుకున్నారు. ప్రతి వర్గంవారు తమ తమ సేవలలో ఉన్నారు, కావున ఈ సేవకు నిమిత్తులైన పిల్లలకు బాప్ దాదా మనస్ఫూర్తిగా ప్రేమను అందిస్తున్నారు, సదా ముందుకు సాగుతూ ఉండండి. బాబాను ప్రత్యక్షం చేసేందుకు క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారుచేస్తూ ఉండండి. అచ్ఛా.

డబుల్ విదేశీ సోదర సోదరీలతో :- డబుల్ విదేశీయులకు బాప్ దాదాల విశేష ప్రియస్మృతులు. గుప్తంగానే సేవ యొక్క వృద్ధిని చక్కగా చేస్తూ ఉండటాన్ని బాప్ దాదా చూసారు. బాబాపై హృదయపూర్వక ప్రేమ మరియు జ్ఞానం యొక్క మహత్వం పిల్లలు ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది, అందుకే విదేశీ పిల్లల వృద్ధి కూడా జరుగుతుంది మరియు పురుషార్థంలో కూడా రోజు రోజుకూ ముందుకు సాగుతున్నారు. అందుకే బాప్ దాదాపై హృదయపూర్వక ప్రేమ మరియు మనసులో ధైర్యము ముందుకు తీసుకు వెళ్తున్నాయి. బాప్ దాదా సంతుష్టంగా ఉన్నారు. సేవ వృద్ధి చెందుతుంది, ఇక ముందు కూడా వృద్ధి చేస్తూ ఉంటారు. నలువైపుల ఉన్న పిల్లల సేవలో వృద్ధి జరుగుతోంది. ఇప్పుడు ఇక ముందు ఏమి చెయ్యాలి? ఎలా అయితే పురుషార్థంలో, సేవలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్తున్నారో అలాగే స్మృతి సబ్జెక్టులో మరింత గుహ్య అనుభవాలను పెంచుతూ ఉండండి. కర్మయోగి పాత్రను కూడా మంచిగా నిర్వర్తిస్తున్నారు. అందులో కూడా స్మృతి యాత్రను మరింతగా పెంచండి. స్మృతి యొక్క సబ్జెక్టులో పవర్‌ఫుల్ అనుభవాన్ని ఇంకా పెంచండి. ఒకరికొకరు ఉత్సాహాన్ని పెంచుకుంటూ ఇందులో నంబర్ వన్ గా అవ్వండి. రిజల్టులో వృద్ధి మంచిగా ఉంది. చుట్టుప్రక్కలవారికి కూడా అటెన్షన్ ఇప్పిస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది, ఇందుకోసం బాప్ దాదా విదేశీ పిల్లలందరికీ అభినందనలు తెలుపుతున్నారు.

డబుల్ విదేశీ పిల్లల రిట్రీట్ :- అచ్ఛా పిల్లలందరికీ చాలా చాలా ప్రేమ మరియు స్మృతులు. (చిన్న పిల్లలు పాట పాడారు) మంచి ఉల్లాస ఉత్సాహాలలో ఉన్నారు. ఇప్పుడు అక్కడకు వెళ్లి సేవను చెయ్యాలి మరియు సంతోషమును, యోగాన్ని పెంచుకోవాలి. అచ్ఛా.

యూథ్ రిట్రీట్ వారితో:- బాగుంది. యూత్ లో పరివర్తనను ప్రభుత్వం కూడా చూడాలనుకుంటోంది. కావున యూత్ వారు ఈ గ్రూపును తయారు చెయ్యండి. ఇండియావారిని కూడా కావాలంటే కలుపుకోండి, కానీ ప్రపంచంలో దుఃఖము పెరుగుతున్నా కానీ శివబాబా ద్వారా మాలో సంతోషము పవిత్రత పెరుగుతున్నాయి అన్న విశేషతను అందరికీ చూపించండి. ఏమి జరిగినాకానీ, స్వయం సదాచారులుగా అయ్యి ప్రపంచంలో సదాచారాన్ని వ్యాపింపజేయాలి. ఇందులోనే స్వయం కూడా ముందుకు వెళ్తూ ఇతరులకు కూడా మీ జీవితాన్ని చూపిస్తూ మీ సమానంగా శ్రేషాచారిగా చేయాలి. ఈ కుమారీలు, యూత్ తమ జీవితాన్ని ఎంతో చక్కగా తయారు చేసుకున్నారు అని ప్రభుత్వం కూడా సంతోషిస్తుంది. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా యూత్ ప్రభావం కూడా ప్రభుత్వం వరకు చేరుకుంటుంది. ప్రపంచం చెయ్యలేనిదాన్ని మీరు చేసి చూపించండి. చూపిస్తూనే ఉండండి, సందేశాన్ని వ్యాప్తి చేస్తూనే ఉండండి. బాగుంది. యూత్ గ్రూప్ భవిష్యత్తును ఎంత ఉన్నతంగా చేసుకోగలదో చూసి బాప్ దాదాకు సంతోషంగా ఉంది. ముందుకు వెళ్తున్నారు, వెళ్తూ ఉండండి, తీసుకు వెళ్తూ ఉండండి.

ఇండోర్ హాస్టల్ కుమారీలతో:- ఇండోర్ కుమారీలు కూడా మంచి ప్రోగ్రస్ సాధించారు. సేవాకేంద్రాలలో కూడా సహయోగులుగా అవుతారు. కుమారీలు స్వయాన్ని కాపాడుకోవడంతోపాటు ఇతరులకు కూడా రోజూ తోడును అందిస్తూ ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకు వస్తూ ఉండటాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. అందుకే కుమారీలు విశ్వం ఎదుట ఉదాహరణలు. మీ సమానంగా తయారు చేస్తూ వెళ్ళండి, స్వయాన్ని సేవకు నిమిత్తంగా చేసుకుంటూ ఉండండి. మీ మంచి ప్రగతిని చూసి ఇతరులలో కూడా ఉత్సాహము వస్తుంది. బాబాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉన్నారు మంచిగా చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి.

దాదీలతో:- (పాత సంవత్సరంతో పాటు అన్ని లోపాలను, బలహీనతలను పరివర్తన చేసుకుంటాము) అంశమాత్రము కూడా ఉండకూడదు. వీరు పూర్తిగా మారిపోయారు అని ప్రతి ఒక్కరికీ అనిపించాలి. అందరూ ఇది చూడాలనుకుంటున్నారు.

పర్ దాదీతో :- వీరు చిరునవ్వుతో ఉంటారు. మంచంపై ఉన్నాకానీ నవ్వుతూ ఉంటారు. ఇలాగే అందరూ నవ్వుతూ ఉండండి. ఆరోగ్యం మంచిగా ఉందా! నడిపించడం వచ్చేసింది. వీరికి కూడా నడిపించడం వచ్చేసింది. మంచి ధైర్యముంది. ఆత్మిక ధైర్యము.

 (మన్మోహినివన్ లో స్టూడియోనిర్మించాల్సి ఉంది, దాని మ్యాప్ ను రమేష్ అన్నయ్య బాప్ దాదాకు చూపించారు) మంచిగా చేసారు, మొదలు పెట్టండి కానీ సంభాళించవలసి ఉంటుంది. అందరూ తోడుగా ఉన్నారు, అయిపోతుంది.

           అచ్ఛా - ఈ రోజు క్రొత్త సంవత్సరం ప్రారంభం కావస్తోంది. మధువనంలోని అన్ని స్థానాలు, జ్ఞాన సరోవర్, పాండవ భవనము, లేక ఇక్కడ శాంతివన్ నివాసులు కావచ్చు, వారికి కూడా బాప్ దాదా విశేషంగా ప్రియస్మృతులను ఇస్తున్నారు, ఎందుకంటే ఎవరైతే దగ్గరగా ఉంటారో వారు సదా సేవ ద్వారా స్వయాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉండండి, ఎందుకంటే ఇక్కడి వాయుమండలం నుండి ఆనందము, సుఖాన్ని తీసుకోవడానికి బయట నుండి వస్తారు. మరి ఇక్కడ ఉండేవారు, ఇటువంటి వాయుమండలంలో ఉండేవారు ఎంతటి అదృష్టవంతులు! పిల్లలు ప్రతి ఒక్కరూ సదా బాబా సమానంగా అందరికీ సంతోషాన్ని ఇవ్వాలి మరియు సంతోషాన్ని తీసుకోవాలి అన్నది బాప్ దాదా కోరిక. ఇక్కడి వాతావరణంలోని లాభాన్ని ధారణ చేయాలనుకున్నవారు చేయవచ్చు. మరి ఈ రోజు బాప్ దాదా ఇక్కడ ఉంటున్న అదృష్టవంతులను చూస్తున్నారు. లభించిన భాగ్యాన్ని కార్యంలో పెట్టి ముందుకు వెళ్తున్నందుకు బాబా సంతోషిస్తున్నారు. బాప్ దాదాకు పిల్లలందరినీ చూసి, సేవాధారులనైనా, సమర్పణ అయినవారినైనా చూసి సంతోషంగా ఉంటుంది వాహ్ పిల్లలు వాహ్! మీకు ప్రాప్తించిన భాగ్యాన్ని మీ ముందు ఉంచుకొని అతీంద్రియ సుఖము అనే ఊయలలో ఊగుతూ ఉండండి మరియు ఊగిస్తూ ఉండండి. బాప్ దాదాకు ప్రతి ఒక్కరి భాగ్యంపై గర్వంగా ఉంటుంది. సాధారణ విషయము కాదు, డ్రామానుసారంగా ఈ భాగ్యము ప్రాప్తమవ్వడం కూడా మీ జీవితంలో ఒక అతి పెద్ద ప్రాప్తి. బాప్ దాదా పిల్లలందరినీ ఎగిరే కళలో చూడాలని ఆశిస్తున్నారు. ఎగురుతున్నారు, కానీ ఎగిరే కళలో మరింత ముందుకు వెళ్ళండి మరియు ఇతరులను, మీ తోటి వారిని కూడా ముందుకు తీసుకు వెళ్ళండి. అందరికీ పేరు పేరునా విశేషంగా నూతన సంవత్సరానికి బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు.

హైదరాబాద్ నుండి విచ్చేసిన వి.ఐ.వీ.లతో :- ఇప్పుడు వచ్చిన ఈ గ్రూపు భాగ్యశాలి గ్రూపు అని బాప్ దాదా గమనించారు. రాగానే ఎగిరే కళను అనుభవం చేసుకుంటున్నారు. నెమ్మది నెమ్మదిగా నడిచేవారు కాదు, ఎగిరే వారు. భాగ్యాన్ని తీసుకునే వచ్చారు, చాలా బాగుంది. మీ ఇంటికి చేరుకున్నారు, మీ పరివారంలోకి చేరుకున్నారు. కల్పం క్రితపు భాగ్యము వీరికి ఉంది, మీ కల్ప క్రితపు భాగ్యాన్ని మీరు తీసుకున్నారు. బాగుంది, ఇప్పుడు హైదరాబాదును ఎలా తయారు చెయ్యాలంటే వి.ఐ.పి.ల సేవను చూడాలంటే హైదరాబాదును చూడండి అని బాప్ దాదా ఉదాహరణ ఇచ్చే విధంగా తయారుచెయ్యండి. మంచిది.

       2011 నూతన సంవత్సర శుభ ఆగమనం సందర్భంగా బాప్ దాదా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు

           అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పూర్తి సంవత్సరము నిర్విఘ్నంగా మరియు సంతోషంగా ఉండండి. మీ నడవడిక మరియు ముఖము ద్వారా అందరికీ సంతోషమును మరియు చిరునవ్వును నేర్పించండి. సదా ఎగరండి మరియు ఎగిరించండి. నడవకండి, ఎగరండి. ఎగిరే కళ సర్వులకు ప్రియమైనది. కావున ఎగురుతూ ఎగురుతూ సందేశాన్ని ఇవ్వండి. అందరూ మిమ్మల్ని చూసి సంతోషమనే ఊయలలో ఊగాలి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్.

Comments