30-11-2010 అవ్యక్త మురళి

 30-11-2010        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“ప్రతి గంట మనస్సుతో ఎక్సర్ సైజ్ చేసి దానిని శక్తిశాలిగా చేయండి. బాబాయే ప్రపంచము అయినప్పుడు మరి సంస్కారాలను కూడా బాబా సమానంగా తయారుచేసుకోండి".

          ఈ రోజు బాప్ దాదా పిల్లలందరినీ ఒకే దేశంవారిగా చూస్తున్నారు. మీ అందరి వాస్తవికమైన దేశమేదైతే ఉందో ఆ ఒక్క దేశము ఎంత ప్రియమైనదో మీకు తెలుసు కదా! బాప్ దాదా కూడా అదే దేశం నుండి పిల్లలందరినీ కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలకు బాబాను కలుసుకునే సంతోషము ఉంది మరియు బాబాకు పిల్లలను కలుసుకునే సంతోషం ఉంది. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి స్వరూపాలను, విశేషంగా ఐదు రూపాలను చూస్తున్నారు. కావుననే పంచముఖీ బ్రహ్మ గాయనము కూడా ఉంది. కావున మీకు మీ ఐదు రూపాలను గూర్చి తెలుసు కదా! మొదటిది అందరి జ్యోతి బిందు రూపము. అది మీముందుకు వచ్చేసిందా? అది ఎంతగా ప్రకాశిస్తున్న ప్రియమైన రూపము! రెండవది- దేవతా రూపము, ఆ రూపము కూడా ఎంత ప్రియమైనది మరియు అతీతమైనది! మూడవ రూపము- మధ్యలోని పూజ్యనీయ రూపము, నాల్గవ రూపము సంగమవాసీ బ్రాహ్మణ రూపము, అది కూడా ఎంత మహాన్ రూపము! మరియు ఐదవది- ఫరిశ్తా రూపము. ఈ ఐదు రూపాలు ఎంత ప్రియమైనవి! ఈరోజు బాప్ దాదా పిల్లలకు మనస్సు యొక్క ఎక్సర్ సైజ్ ను నేర్పిస్తున్నారు, ఎందుకంటే మనస్సు అప్పుడప్పుడు పిల్లలను తనవైపుకు లాక్కుంటూ ఉంటుంది. కావున ఈరోజు బాప్ దాదా మనస్సును ఏకరసముగా తయారుచేసుకునే ఎక్సర్‌సైజ్ ను నేర్పిస్తున్నారు. రోజంతటిలో ఈ ఐదు రూపాల ఎక్సర్ సైజ్ ను చేయండి మరియు ఏ రూపమునైతే ఆలోచిస్తారో దానిని మనస్సులో అనుభవం చేసుకోండి. జ్యోతిర్బిందువు అని అనగానే ఆ ప్రకాశిస్తున్న రూపము ముందుకు వచ్చేయాలి. ఇలా ఐదు రూపాలను మీముందుకు తీసుకురండి మరియు ఆ రూపాలను అనుభవం చేసుకోండి. ప్రతి గంటలోను ఐదు సెకండ్లయినా ఈ డ్రిల్లులో ఉపయోగించండి. ఐదు సెకండ్లు కాకపోతే ఐదు నిమిషాలు చేయండి. ప్రతిఒక్క రూపాన్ని మీ ముందుకు తీసుకురండి, అనుభవం చేసుకోండి. మనస్సును ఈ ఆత్మిక ఎక్సర్ సైజ్ లో బిజీగా ఉంచినట్లయితే మనస్సు ఎక్సర్ సైజ్ ద్వారా సదా మంచిగా ఉంటుంది. ఏ విధంగా శారీరిక ఎక్సర్ సైజ్ శరీరమును ఆరోగ్యవంతంగా ఉంచుతుందో అలా ఈ ఎక్సర్ సైజు మనస్సును శక్తిశాలిగా ఉంచుతుంది. ఒక్క క్షణమైనా మనస్సులో ఆ రూపమును తీసుకురండి. ఇది సహజము అని భావిస్తున్నారు కదా! లేక కష్టమనిపిస్తుందా? కష్టమనిపించదు, ఎందుకంటే ఈ ఎక్సర్ సైజ్ ను మీరు అనేకసార్లు చేశారు. ప్రతికల్పమూ చేశారు. మీ రూపాన్నే మీ ముందుకు తెచ్చుకోవడం కష్టమేమీకాదు. ఒక్కొక్క రూపము మీముందుకు రావడంతోనే ప్రతిరూపము యొక్క విశేషత అనుభవమవుతుంది. అప్పుడప్పుడు కొందరు పిల్లలు- మేము ఈ రూపాలలో అనుభవం చేసుకోవాలనుకుంటూ ఉంటాము, కానీ మనస్సు వేరేవైపులకు వెళ్ళిపోతోంది అని అంటారు. ఎంత సమయము ఎక్కడ మనస్సును నిమగ్నం చేయాలనుకుంటే అంత సమయము నిమగ్నం చేసేందుకు బదులుగా వ్యర్థమైన, అయథార్థమైన సంకల్పాలు కూడా వచ్చేస్తాయి. అప్పుడప్పుడు మనస్సులో నిర్లక్ష్యం కూడా వచ్చేస్తుంది. కావున బాప్ దాదా ప్రతీ గంటలోను ఐదు క్షణాలు లేక ఐదు నిమిషాలు ఈ ఎక్సర్ సైజ్ లో అనుభవం చేయించాలనుకుంటున్నారు. ఐదు నిమిషాలు చేసి మనస్సును ఇటువైపుకు నడిపించండి. అలా నడిపించడమైతే మంచిగా ఉంటుంది కదా! ఆ తర్వాత మీ పనిలో నిమగ్నమైపోండి, ఎందుకంటే కార్యమైతే చేయవలసిందే. కార్యము లేకుండా నడవదు. యజ్ఞసేవను మరియు విశ్వసేవను అందరూ చేస్తున్నారు మరియు చేయవలసిందే. ఈ ఐదు నిముషాల డ్రిల్లును చేసిన తరువాత మీ కార్యాలేవైతే ఉన్నాయో వాటిలో నిమగ్నమైపోండి. ఐదు క్షణాలు కాని, ఐదు నిముషాలు కాని... ఇంత సమయం కూడా దొరకనివారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులెత్తండి. ఐదు నిముషాలు కూడా దొరకనివారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కావున అందరూ సమయం తీయగలరు. కావున పదే పదే ఈ ఎక్సర్ సైజ్ చేసినట్లయితే కార్యమును చేస్తూ కూడా ఈ నషా ఉంటుంది. ఎందుకంటే మన్మనాభవ అన్నది బాబా మంత్రము కూడా. ఇదే మంత్రము మనస్సు యొక్క అనుభవం ద్వారా మాయాజీతులుగా అవ్వడంలో మనోయంత్రముగా అయిపోతుంది. ఎందుకంటే, ఎంతగా సమయం ముందుకు వెళుతూ ఉంటుందో దాని అనుసారంగా ఒక్క క్షణంలో స్టాప్ చేయగలగాలి. కావున ఈ ఎక్సర్ సైజ్ చేయడం ద్వారా మన్మనాభవగా అవ్వడంలో సహాయం లభిస్తుంది. మీరు ఏ భాషణలైతే చేస్తారో లేక ఎవరికైనా ఏ సందేశమునైతే ఇస్తారో అప్పుడు ఏమంటారు? మేము విశ్వపరివర్తన చేసేవారము అని అంటారు. మరి విశ్వమును పరివర్తన చేయాలన్నప్పుడు మొదట మీ మనస్సును ఎంత శక్తి శాలిగా చేసుకోవాలంటే ఏ సమయంలో, ఏ సంకల్పం చేయాలనుకుంటే అదే సంకల్పం మనస్సు చేయగలగాలి. క్షణములో ఆర్డర్ చేయండి. ఏ విధంగా ఈ శరీరంలోని కర్మేంద్రియాలకు పైకి వెళ్ళు, క్రిందకు వెళ్ళు అని ఆర్డర్ చేసినప్పుడు అవి చేస్తాయి కదా! అలా మనస్సు వ్యర్థం నుండి, అయథార్థము నుండి సురక్షితమవ్వాలి. మీరు మనస్సుకు యజమానులు. నా మనస్సు అని అంటారు కదా! కావున నా మనస్సు ఇంతగా ఆర్డర్ అనుసారంగా ఉండేందుకు ఈ మనస్సు యొక్క ఎక్సర్ సైజ్ ను తెలియజేశారు.

           బాప్ దాదా ఏమి గమనించారంటే, పిల్లలు ప్రతిఒక్కరూ మేము మనస్సును జయించిన జగత్ జీతులుగా అవ్వాలి అని భావిస్తూ ఉంటారు. కావున రానున్న సమయానికి ముందే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనస్సు నిలిచి ఉండే విధంగా ఈ అభ్యాసం చేయాలి. కావున ఈ రోజు బాప్ దాదా- ఏ సంకల్పం చేస్తే అదేవిధంగా మనస్సు, బుద్ధి, సంస్కారము ఆర్డర్ అనుసారంగా ఉండాలని, పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ విధంగా శక్తి శాలిగా అవ్వాలని కోరుకుంటున్నారు. ఎవరికైతే ఈ అభ్యాసము ఉంటుందో వారు జగత్ జీతులుగా తప్పకుండా అవుతారు. బాప్ దాదాతో, పరివారంతో అందరికీ ప్రేమ ఉంది. ఎంతగా పిల్లలకు బాబాపై ప్రేమ ఉందో అంతకన్నా ఎక్కువగా బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది. పిల్లలు మంచి చతురతను చూపారు. “నా బాబా, నా బాబా” అని అంటూ తమవారిగా చేసేసుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయంతో- "నా బాబా” అని అంటారు, అలాగే బాబా కూడా నా పిల్లలు అని అంటారు. ఈ నా అన్న పదము అద్భుతం చేసేసింది. నా బాబా, ప్రియమైన బాబా అని అంటూ ఉంటే ప్రతిఒక్కరి హృదయంలో ఎంత ఉత్సాహము కలుగుతూ ఉంటుంది! అలాగే బాబా కూడా పదే పదే నా పిల్లలూ అని అంటారు. మాయ యుద్ధం ఎప్పుడు జరిగినా, ఎందుకంటే అర్థకల్పం మాయను మీదానిగా చేసుకున్నారు కదా! మరి మాయకు కూడా మీపై ప్రేమ ఉంటుంది కదా! కావున అది పదే పదే వచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరైతే హృదయపూర్వకంగా నా బాబా అని అంటారో వారికి బాబా సహయోగము లభిస్తుంది. ఒక్కసారి హృదయపూర్వకంగా నా బాబా అని అంటే, వేలాదిసార్లు బాబా శక్తి శాలీ సహయోగమును ఇచ్చేందుకు బంధింపబడి ఉన్నారు. అనుభవం ఉంది కదా! కేవలం సమయానికి ఈ అనుభవమును ప్రాక్టికల్ లోకి తీసుకురండి.

           బాప్ దాదా పిల్లల ఒక్క విషయమును చూసి తమ హృదయంలో నవ్వుకుంటూ ఉంటారు. అది ఏ విషయమో తెలుసా? బాబాయే నా ప్రపంచము అని అందరూ అంటారు. బాబాయే మా ప్రపంచము అని అంటారు కదా! బాబాయే నా ప్రపంచము అని ఎవరైతే అంటారో వారు చేతులెత్తండి. అచ్ఛా, బాబాయే ప్రపంచము, మరొక ప్రపంచము ఏదీ లేదు కదా! మరొక ప్రపంచము లేదు, కానీ మరింకేముంది? సంస్కారము ఉంది. బాబాయే నా ప్రపంచము అయినప్పుడు మరిక ఇంకొక ప్రపంచమంటూ ఏదీలేదు. ప్రపంచమే లేనప్పుడు సంస్కారాలు ఎలా పుడుతాయి? ఈ మధ్య బాప్ దాదా సమయానుసారంగా సంస్కారము అన్న పదాన్ని అంతం చేయాలనుకుంటున్నారు. అది అంతం అవ్వగలదా? అంతం అవ్వగలదా? సంస్కారాలు విఘ్నరూపంగా అవ్వజాలవు అని భావిస్తున్నారా? ఈ దృఢసంకల్పమును చేయగలరా? దృఢ పురుషార్థం ద్వారా, నేడు కూడా వాటిని అంతం చేయవలసిందేనని దృఢ పురుషార్థం చేయగలరా? చేస్తాము, ఆలోచిస్తాము, చూస్తాము.... ఇది కాదు. చేయవలసిందే. సంస్కారాల పని రావడము మరియు పిల్లల పని వాటిని సమాప్తము చేయవలసిందే. అంతటి ధైర్యము ఉందా, ధైర్యము ఉందా? ఇంతకుముందు కూడా చేతులెత్తించారు, కాని ఏ సంకల్పమైతే చేస్తున్నారో అది జరుగుతోందా అని పరిశీలించుకోండి. బాబా చెప్పారు, లక్ష్యమునివ్వడం బాబా పని మరియు పిల్లల పని- బాబా ఏదైతే చెప్పారో దానిని చేసి తీరడం అని ఎవరెవరు భావిస్తున్నారు? దీనికి కూడా ఒక డేట్ ని ఫిక్స్ చేయండి. ఏ విధంగా భక్తులు శివరాత్రిని జరుపుకోవాలి అని డేట్ ఫిక్స్ చేశారో అలా దీనికి కూడా ఒక డేట్ ని ఫిక్స్ చేయండి. అందరి తారీఖు ఒకేసారి కలిసి ఫిక్స్ అవ్వకపోయినా, ముందు ప్రతిఒక్కరూ తమకొరకు ఒక తారీఖును నిర్ణయించుకోవచ్చు కదా! నిర్ణయించుకోగలరు కదా! నిర్ణయించుకోగలరా? చేయగలిగితే చేతులెత్తండి, మరి చేశారా? చేయగలిగినప్పుడు మరి చేశారా? డబుల్ విదేశీయులు తేదీని ఫిక్స్ చేశారా? అచ్ఛా, ముందు ఉన్నవారు ఫిక్స్ చేశారా? మీరు ఏ డేట్ నైతే ఫిక్స్ చేశారో దానిని బాప్ దాదాకు వ్రాసి ఇవ్వండి. బాప్ దాదా కూడా పిల్లలకు పరీక్షను పాస్ అయ్యేందుకు ధైర్యమునైతే ఇస్తారు కదా! ఆ తర్వాత ఓహో నా పిల్లలు, ఓహో అని గానం చేస్తారు. సెర్మనీ (వేడుక) జరుపుతారు. ఎవరైతే సంకల్పము చేసి మళ్ళీ అదే అనుసారంగా ప్రాక్టికల్ గా చేశారో వారి సెర్మనీని జరుపుతారు. ఎందుకంటే తేడా అయితే వస్తూ ఉంటుంది కదా! ఏ డేట్ అయితే ఫిక్స్ చేస్తారో అందులో ముందుకు వెళ్ళేందుకు సమీపంగా అయితే వస్తారు కదా! తేడా రావడం ప్రారంభమవుతుంది. కావున ఎవరైతే డేట్ అనుసారంగా సంపన్నంగా అవుతారో వారి సెర్మనీని బాప్ దాదా జరుపుతారు. మీరు లోపల ఏదైతే చేస్తారో దానిని చూసేవారు కూడా వెరిఫై చేస్తారు, ఎందుకంటే సంపర్కంలోకైతే వస్తారు కదా! సంస్కారాలు ఎవరో ఒకరినుండైతే వెలువడతాయి కదా! ఎందుకంటే పిల్లలు ప్రతిఒక్కరికీ, నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని అన్న నషా ఉండడం బాప్ దాదా గమనించారు. మీరైతే మాస్టర్లే కదా! మీరు సర్వశక్తివంతులైనప్పుడు సంకల్పమును పూర్తిచేయడం ఇది కూడా శక్తియే కదా! అచ్ఛా, ఎవరైతే ఈ రోజు మొదటిసారి వచ్చారో వారు లేవండి. చూడండి, ఎంతమంది వచ్చారు! బాప్ దాదా అభినందనలను తెలుపుతున్నారు. మధువనానికి వచ్చినందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. టూ లేట్ బోర్డును పెట్టేందుకు ముందే వచ్చేసారు, కావున మొత్తం పరివారానికి, బాప్ దాదాకైతే ఉండనే ఉంది కానీ మొత్తం పరివారమంతటికీ కూడా మీరు డబుల్ పురుషార్థం చేసి లాస్ట్ లో వచ్చికూడా ఫస్ట్ లోకి వెళ్ళగలరు అన్న శుభ ఆశ ఉంది. మరి ధైర్యం ఉందా? ఈ రోజు ఎవరైతే వచ్చారో వారిలో ఈ ధైర్యము ఉందా? లాస్ట్ లో వస్తూ కూడా ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ లోకి వచ్చేయాలి అన్న ధైర్యము ఉందా? ఫస్ట్ నెంబర్ లోకి రావాలి. ఒకటో నెంబర్ లోకి కాదు, ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ గా రండి. ఇది జరుగగలదా? మేము ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ గా అవ్వగలము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మీలో మీకు నిశ్చయం ఉందా? అచ్ఛా! వెనుక వచ్చినవారు చేతులెత్తండి, ఇది జరుగగలదు కదా! కొద్దిమందే ఉన్నారు. అయినా మొత్తం పరివారము మరియు బాప్ దాదా మీకు సహయోగాన్ని అందిస్తూ ముందుకు తీసుకు వెళ్ళాలనుకుంటున్నారు. కావున మీరు ఏ సెంటర్లనుండైతే వచ్చారో ఆ సెంటర్లలో మీ ఈ ప్రతిజ్ఞను పదే పదే గుర్తుచేసుకోండి. ఇది జరుగగలదు, అసంభవం కాదు. ఇది సంభవమే కాని డబుల్ అటెన్షన్ కావాలి. లాస్ట్ నుండి ఫాస్ట్ గా వెళ్ళి చూపించినట్లయితే సెంటర్లలో మీ తీవ్ర పురుషార్థపు రోజును జరుపుకుందాం, ఫంక్షన్ చేద్దాము. అందరి హృదయాలలో త్వరత్వరగా బాబా సమానంగా అయి చూపిద్దాము అన్న ఉత్సాహము ఉంది. బాప్ దాదా కూడా అమృతవేళ పిల్లలు బాబాతో మాట్లాడేటప్పుడు ఓహో నా పిల్లలు, ఓహో అని సంతోషిస్తారు. బాబా పిల్లలు ప్రతిఒక్కరికీ, పాతవారైనా లేక కొత్తవారైనా, పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా హృదయపూర్వకమైన దీవెనలు ఎన్నో ఇస్తారు. మీరు ఒక్కడుగు వేస్తే బాబా సహాయంరూపీ వెయ్యి అడుగులు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సమయ పరివర్తన తీవ్రవేగంతో ముందుకు వెళుతోంది. అచ్ఛా!

సేవా టర్న్ ఢిల్లీ మరియు ఆగ్రా జోన్ వారిది:- ఢిల్లీ ప్రారంభం నుండి సేవలో క్రొత్త క్రొత్త విషయాలను తీసుకువస్తూ ఉండడం బాప్ దాదా విన్నారు. చేశారు కదా! ఢిల్లీ వారు చేశారు. కావున ఇప్పుడు సేవ యొక్క ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్‌ను కనుగొనండి. ఏ భాషణలైతే జరుగుతున్నాయో, కార్యక్రమాలేవైతే జరుగుతున్నాయో అవి కూడా బాగున్నాయి, ఎందుకంటే వాటి ద్వారా వృద్ధి జరుగుతోంది మరియు సంబంధంలోకి వస్తారు. ఇప్పుడేవైతే జరుగుతున్నాయో అవి కూడా మంచిగా జరుగుతున్నాయి. కాని, ఇప్పుడు ఈ ప్రోగ్రాంలు ఎంతోకాలంగా జరిగాయి, ఇప్పుడు ఏదైనా కొత్త దానిని కనుగొనండి, తద్వారా సేవచేసేవారిలో క్రొత్త ఉల్లాసము, క్రొత్త ఉత్సాహము రావాలి. చేస్తారు కదా! బాగుంది. అందరినీ ఉత్సాహంలోకి తీసుకువచ్చి అందరినీ అందులో బిజీ చేయండి. పెద్ద ప్రోగ్రాంలేవైతే జరుగుతాయో అందులో భాషణ చేసేవారైతే బిజీగా ఉంటారు, కాని ఇతరులు కేవలం చేయిని అందిస్తారు. అది కూడా అవసరమే కాని ఎటువంటి కార్యమును చేయాలంటే, తద్వారా ప్రతి ఒక్క క్వాలిటీవారు స్వయంచేసి బిజీగా ఉండాలి. ఎందుకంటే ఢిల్లీయే రాజధానిగా అవ్వవలసి ఉంది. కావున ఢిల్లీ వారు ఇటువంటి ఇన్వెన్షన్ నేదైనా కనుగొనాలి. సరేనా, సరేనా, అందరూ చేస్తాం? చేతులెత్తండి. బాగుంది, ఎవరైనా కనుగొనవచ్చు, క్రొత్తవారు కూడా కనుగొనవచ్చు. ఇతరులకెవరికైనా సంకల్పం వచ్చినా వారు కూడా ఇక్కడ హెఢాఫీస్ లో, మధువనం ఆఫీసులో వ్రాయవచ్చు. అందరికీ అవకాశముంది. అచ్ఛా! ఢిల్లీవారు పురుషార్థంలో కూడా నెంబర్ వన్ తీసుకోవాలి. బాప్ దాదా ఎంతోకాలంగా దేశంలో కాని, విదేశంలో కాని ఏదైనా సెంటరు మరియు దాని కనెక్షన్లో ఉన్న సెంటర్లు ఆరు నెలలు నిర్విఘ్నంగా ఉండాలని, ఎటువంటి విఘ్నము రాకుండా నిర్విఘ్నంగా ఉండాలని చెబుతూ వచ్చారు. నెంబర్ వన్ గా అయినట్లయితే నిర్విఘ్నంగా అయ్యే ఆ డేట్ ను కూడా జరుపుకుంటారు. ఇప్పుడు 6 నెలలు అని అంటున్నారు. 6 నెలల అభ్యాసము ఉన్నట్లయితే ముందు ముందు కూడా అలవాటైపోతుంది. కాని, బహుమతిని తీసుకునేందుకు 6 మాసాల సమయమును ఇస్తున్నారు. కావున ఢిల్లీ ఏ నెంబర్‌ను తీసుకుంటారు? మొదటి నెంబర్‌ను తీసుకుంటారా? బాప్ దాదా సంతోషిస్తున్నారు, మొత్తం పరివారమంతటికీ కూడా సంతోషంగా ఉంది. సంతుష్టత యొక్క పేరు ప్రఖ్యాతమై ఉంది. సేవలో కాని, ఏ నియమాలైతే తయారుచేయబడి ఉన్నాయో ఆ నియమాలలో కాని నిర్విఘ్నంగా ఉండాలి. చూద్దాము, బాప్ దాదా అన్నారు కాని ఇప్పటివరకైతే పేర్లు రాలేదు. జోన్లు కాకపోతే, పెద్ద సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి సంపర్కంలో ఉన్న సెంటర్లు ఇంత చేసినా బాప్ దాదా చూస్తారు. ఇప్పుడు త్వరత్వరగా అడుగులు ముందుకువేయండి. ఎందుకు? అకస్మాత్తుగా ఏమైనా జరుగవచ్చు. తారీఖు చెప్పను. అచ్ఛా! ఢిల్లీ వారు కూర్చోండి.

ఆగ్రా సబ్ జోన్:- ఆగ్రా ఎటువంటి కార్యమును, సేవను చేయాలంటే గవర్నమెంట్ లిస్ట్ లో  ఏ ఆగ్రా అయితే ప్రసిద్ధమై ఉందో అలా ఆగ్రావారు ఎటువంటి సేవను వెదకాలంటే, అది ఈశ్వరీయ గవర్నమెంట్ లో కూడా ప్రఖ్యాతమవ్వాలి. కావున ఆగ్రాలో కిరీటంలాగా ఏదైనా చేయండి. అటువంటి ధైర్యము ఉందా? ఆశావాదులుగా ఉన్నందుకు అభినందనలు. ఏంచేస్తారు? ఎంత కాలంలో చేస్తారు? (మేళా చేస్తాము, మెగా ప్రోగ్రాం చేస్తాము.) మెగా ప్రోగ్రాంనైతే అందరూ చేస్తున్నారు, కాని ఏదైనా క్రొత్త ఇన్వెన్షన్ ను ఇంకే జోన్ వారు చేయని ఇన్వెన్షన్ ను కనుగొనండి, ఎందుకంటే ఆగ్రా అందరూ చూడదగినది. ఏ విధంగా అది నేటి ప్రభుత్వానికి కిరీటంలా ఉందో, ఏదైనా ప్రాపగాండా జరిగినప్పుడు అందులో ఆగ్రా ప్రసిద్ధమైనది కదా! అటువంటి కార్యమునేదైనా చేయండి. కాబట్టి ఆలోచించండి. అమృతవేళ కూర్చొని ఆలోచించండి. అప్పుడు ఏదో ఒక టచింగ్ వచ్చేస్తుంది. సరేనా, టీచర్లు చేతులెత్తండి, ఎంతోమంది ఉన్నారు, కావున అద్భుతం చేయండి. బాప్ దాదా అయితే పిల్లలందరికీ ఇప్పుడు ఏదైనా నవీనతను చేయండి అని చెబుతారు. ఏదైతే నడుస్తోందో అది సమయం అనుసారంగా నవీనతయే. కాని, ఇప్పుడు ఇంకా నవీనతను, ఇన్వెన్షన్ ను చేయండి. ఏ జోన్ అయినా చేయవచ్చు, కానీ క్రొత్త దానిని చేయండి. బాప్ దాదాకైతే పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రియమైనవారే, అలాగే బాప్ దాదాకు పిల్లలు ప్రతిఒక్కరి విశేషతను గూర్చి తెలుసు. ప్రతి ఒక్కరి విశేషతా ఉంది. కాని, కొందరు కార్యములో వినియోగిస్తారు, కొందరివి గుప్తమైపోతాయి. కావుననే పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాకు ప్రియమైనవారు, చాలాకాలం తర్వాత కలిసినవారు అని బాబా అంటారు. ఎగురుతూ ఉండండి, అందరినీ ఎగిరిస్తూ ఉండండి, ఇదే బాప్ దాదా కోరుకుంటూ ఉంటారు.

మీటింగ్ లో వచ్చిన అన్నయ్యలు, అక్కయ్యలతో:- మీటింగ్ లో వచ్చినవారు అనగా బాధ్యతగల నిమిత్త ఆత్మలు. నిమిత్త ఆత్మలవైపు అందరి ప్రేమ ఉంది, మరియు మీ అందరి ఆధారమూ ఉంది. నిమిత్తమయ్యేవారి పురుషార్థపు అల ఏదైతే ఉంటుందో దానిని అందరూ అనుసరిస్తారు. కావున ఇప్పుడు నిమిత్తమైనవారిపై బాప్ దాదాకు ఒక ఆశ ఉంది మరియు మీరందరూ ఆశాదీపాలు. ఇప్పుడు మీ ముఖము మరియు నడవడిక ద్వారా ఈ ఆత్మలు అందరిముందూ ఒక శాంపుల్ వంటివారు అని అనిపించాలి. ఇదే ఆశను బాప్ దాదా మీపై ఉంచుతున్నారు. ఏ విధంగా అడుగుపై అడుగు వేయాలనుకుంటే అందరూ బ్రహ్మాబాబావైపుకు చూపిస్తారో, అందరూ ఇది అంగీకరిస్తారో, అలా చూడాలనుకుంటే ఈ ఆత్మను చూడండి అని నిమిత్తులెవరైతే ఉన్నారో వారివైపుకు చూపించాలి. బాబా సమానమైన ఉదాహరణ మూర్తులుగా అవ్వాలి. ఇది జరుగగలదా? ఇది జరుగగలదా లేక ఇంకాస్త సమయం కావాలా? కావున బాప్ దాదాకు ఈ గ్రూపుపై ఈ ఆశ ఉంది. ఎందుకంటే బాబా సమానంగా అవ్వాలనే లక్ష్యమును చేపట్టే ఇటువంటి ఉదాహరణ మూర్తులను బాప్ దాదా కోరుకుంటున్నారు. ఇది జరుగగలదా? జరుగవలసిందే కదా! కావున మేము ఏదైతే చేస్తామో అదే మమ్మల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు అన్న ఈ లక్ష్యమును ఈ గ్రూపువారు ఉంచాలి. ఈ ఆశీర్వాదమును తీసుకోవాలి, నిమిత్తులుగా అవ్వాలి.

డబుల్ విదేశీ సోదరీ సోదరులతో:- మేము బ్రాహ్మణ పరివారానికి మరియు బాప్ దాదాకు విశేషంగా ప్రియమైనవారము అని డబుల్ విదేశీయులు ఎల్లప్పుడూ అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎంతగా దేశములెక్కలో దూరంగా ఉన్నారో అంతగా బాప్ దాదా హృదయంలో ప్రియమైనవారిగా ఉన్నారు. ఈ విశేషత ఉంది, బాబా అని అనడంతోనే అందరి ముఖము ప్రేమలో ఎంతగా లవలీనమైపోతుందంటే, బాబా కూడా చూస్తూ హర్షితమవుతారు మరియు భారతదేశపు నియమాలేవైతే ఉన్నాయో వాటిని చేయడంలో కూడా ధైర్యమును ఉంచే ఇంకొక విశేషత కూడా ఉంది. ప్రారంభంలో ఇది భారతదేశపు కల్చర్ అని భావించేవారు. కాని ఇప్పుడు బాప్ దాదా గమనించిందేమిటంటే, మేము కూడా మొదట భారతదేశంవారమే అని అనడం బాప్ దాదా గమనించారు. భారతదేశపు నషా ఉంది. భారతదేశం రాజధాని కదా! ఇది మంచిగా మనస్సులో కూర్చుండిపోయింది. మేము ఇదైతే కాము కదా అని అడుగుతూ ఉంటారు. మేము ఇలాగైతే లేముకదా అని ఎవరైతే వెళ్ళిపోయారో వారిని గూర్చి అడుగుతూ ఉంటారు. భారతదేశపు తండ్రి, భారతదేశపు పరివారంపైనా ప్రేమ ఉంది. సేవను కూడా ఇప్పటివరకు బాగా చేశారు. తమ చుట్టుప్రక్కల ఎక్కడైతే సేవ లేదో అక్కడ కూడా సేవ చేసే లక్ష్యమును ఉంచడం చూశారు మరియు రిజల్టులో అనేక స్థానాలలో సఫలీకృతులయ్యారు కూడా! అలా జరిగింది కదా! సేవ చేస్తున్నారు కదా! చుట్టుప్రక్కల సేవ చేసేవారు చేతులెత్తండి. బాగుంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా!

           నలువైపులా ఉన్న పిల్లలు బాబా హృదయానికి ప్రియమైనవారు. మేము తీవ్ర పురుషార్ధం చేసి బాబాను ప్రత్యక్షం చేయాలి అన్న లక్ష్యమునే పిల్లలు ప్రతిఒక్కరూ స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉంటారు మరియు తెచ్చుకోవాలి కూడా. మా బాబా వచ్చేశారు అని ప్రతి ఒక్కరి హృదయం నుండి వెలువడాలి. ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలతో కూడుకున్న సంకల్పాలు ఈ మధ్య బాప్ దాదా వద్దకు చేరుకుంటున్నాయి. ఈ ఉల్లాస ఉత్సాహాలు మెజారిటీ హృదయాలలోకి వచ్చేసాయి. ఇప్పుడిక త్వరత్వరగా అందరికీ ఈ సందేశమును చేర్చాలి, ఎవ్వరూ వంచితులుగా ఉండిపోకూడదు. ఎంతో కొంత వారసత్వాన్ని తప్పక తీసుకోవాలి. జీవన్ముక్తి వారసత్వము కాకపోయినా ప్రేమతో ముక్తి యొక్క వారసత్వమునైనా తీసుకోవాలి. ఎందుకంటే బాబా అందరికీ వారసత్వాన్ని ఇవ్వాలి. ఎంతమందికి వారసత్వాన్ని ప్రాప్తింపజేస్తారో అంతగా మీకు కూడా మీ రాజ్యములో రాజ్యాధికారులుగా అయ్యే వారసత్వం లభిస్తుంది. అన్ని వైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరికీ బాప్ దాదాల చాలా చాలా ప్రియస్మృతులు మరియు దీవెనలు.

జానకి దాదీతో:- (బాబా సంస్కారాలను తయారుచేసుకోవాలా!) తయారయ్యే ఉన్నాయి. మీరు రెండువైపులా చూడాలి, ఆరోగ్యాన్ని చూడడం కూడా అవసరము, అలాగే సేవను కూడా చూడడం అవసరము. మీరు సేవను ఎక్కువగా చేస్తున్నారు (బాబా చేయిస్తున్నారు). చేయిస్తున్నారు, కాని మీరు ముందు ముందు ఎంతో చేయాలి. (బాబా, మధువనంలోనే కూర్చోనా?) ఆ సమయం కూడా వస్తుంది, రెండువైపులా చూడండి.

రమేష్ భాయ్ తో:- ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకో. ఇప్పుడింకా ఎంతో పనిచేయాలి. ఎంతగా గవర్నమెంటు ముందుకు వెళుతోందో అంతగా మీ పని కూడా ముందుకు వెళ్ళాలి. కావున ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకోండి మరియు బాబా కూడా, దాదీలు కూడా మీకు సహాయకులుగా ఉంటారు. ఏ విషయం జరిగినా సహాయం తీసుకోండి. (మీటింగులు తక్కువగా జరుగుతున్నాయి) మీటింగ్ చేయండి, కాని ఎప్పుడైతే అందరూ ఫ్రీగా ఉంటారో అప్పుడు మీటింగు జరగాలి కదా! కావున అందరూ పరస్పరం కలిసి ఈ డేట్ ను కూడా తయారుచేసుకోండి. మధువనానికి గ్రూపులు రావడానికి ముందు, గ్రూపులు వెళ్ళిన తరువాత మీటింగ్ ఎప్పుడు చేయాలి అని ఆలోచించండి. పరస్పరం చర్చించుకొని డేట్ తయారుచేయండి. ఎప్పుడైనా ఏదైనా జరిగితే దానిని మార్చండి.

పరదాదీతో:- అనారోగ్యాన్ని కూడా అరిగించేసుకున్నావు. అందరికీ సంతోషంగా ఉంది, చాలా బాగుంది. శరీరాన్ని కూడా సాక్షిగా అయి నడిపిస్తున్నావు, బాగుంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు. (రుక్మిణి అక్కయ్యతో) పాత్రను బాగా పోషిస్తున్నావు, ఎప్పుడూ విసుగు చెందడంలేదు, ఈ విశేషత ఉంది, సదా ఇతరులకు కూడా నేర్పించు.

Comments