29-03-1986 అవ్యక్త మురళి

 29-03-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“డబల్ విదేశీ పిల్లలతో బాప్ దాదా ఆత్మిక సంభాషణ”

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలను వతనంలో ఇమర్జ్ చేసుకొని పిల్లలందరి విశేషతలను చూస్తూ ఉన్నారు, ఎందుకంటే పిల్లలందరూ విశేషమైన ఆత్మలే, అందుకే తండ్రికి చెందినవారిగా అయ్యారు అనగా శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయ్యారు. అందరూ విశేషమైనవారే అయినా నంబరువారు అనే అంటారు. ఈ రోజు బాప్ దాదా డబల్ విదేశీ పిల్లలను విశేష రూపంలో చూస్తున్నారు. నలువైపులా భిన్న-భిన్న ఆచార వ్యవహారాలు, నమ్మకాలు ఉన్నప్పటికీ కొద్ది సమయంలోనే ఒకే నమ్మకము, ఒకే మతానికి చెందినవారిగా అయిపోయారు. బాప్ దాదా విశేషంగా రెండు విశేషతలను మెజారిటీలో చూస్తున్నారు. మొదటిది - స్నేహ సంబంధంలో చాలా త్వరగా బంధింపబడ్డారు. స్నేహ సంబంధంలో, ఈశ్వరీయ పరివారానికి చెందినవారిగా అవ్వడంలో, తండ్రికి చెందినవారిగా అవ్వడంలో మంచి సహయోగమిచ్చారు. కనుక మొదటిది స్నేహంలోకి వచ్చే విశేషత, రెండవది - స్నేహం కారణంగా పరివర్తనా శక్తిని సహజంగా ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చారు. స్వపరివర్తనతో పాటు మీ తోటివారిని పరివర్తన చెయ్యడంలో కూడా మంచి తపనతో ముందుకు వెళ్తున్నారు. కనుక స్నేహ శక్తి మరియు పరివర్తన చేసే శక్తి, ఈ రెండు విశేషతలను ధైర్యంతో ధారణ చేసి మంచి ఋజువును చూపిస్తున్నారు.

ఈ రోజు వతనంలో బాప్ దాదాలు పరస్పరంలో పిల్లల విశేషతల గురించి ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఈ సంవత్సరం అవ్యక్తుడు వ్యక్తంలో కలిసే సీజన్ అనండి లేక మిలనం అనండి, ఇది సమాప్తమవుతూ ఉంది కనుక బాప్ దాదా అందరి రిజల్టును చూస్తూ ఉన్నారు. వాస్తవానికి అవ్యక్త రూపంతో, అవ్యక్త స్థితి ద్వారా సదా మిలనం ఉండనే ఉంది మరియు సదా ఉంటుంది కూడా, కానీ సాకార రూపం ద్వారా మిలనం చేసే సమయం నిశ్చితం చేయాల్సి ఉంటుంది, మరియు ఇందులో సమయానికి హద్దు పెట్టవలసి ఉంటుంది. అవ్యక్త రూపంలో మిలనం చేసేందుకు సమయానికి హద్దు ఉండదు, ఎవరు ఎంత సమయం కావాలంటే అంత సమయం మిలనం చేసుకోవచ్చు. అవ్యక్త శక్తిని అనుభవం చేసి స్వయాన్ని, సేవను సదా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. అయినా నిశ్చిత సమయ ప్రమాణంగా ఈ సంవత్సరపు సీజన్ సమాప్తమవుతూ ఉంది. కానీ ఇది సమాప్తమవ్వడం కాదు, సంపన్నంగా అవుతున్నారు. మిలనం అనగా సమానంగా అవ్వడం. సమానంగా అయ్యారు కదా. కనుక ఇది సమాప్తమవ్వడం కాదు, సీజన్ సమయమైతే సమాప్తమవుతూ ఉంది కానీ స్వయం సమానంగా మరియు సంపన్నంగా అయ్యారు కనుక బాప్ దాదా నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలను వతనంలో చూసి హర్షితులయ్యారు, ఎందుకంటే సాకారంలో అయితే కొంతమంది రాగలరు, కొంతమంది రాలేరు, అందుకే తమ చిత్రాలను గానీ, లేఖలను గానీ పంపిస్తారు. కానీ అవ్యక్త రూపంలో బాప్ దాదా నలువైపులా గల సంగఠనలను సహజంగానే ఇమర్జ్ చెయ్యగలరు. ఒకవేళ ఇక్కడకు (మధువనానికి) అందరినీ పిలిస్తే, వారు ఉండేందుకు మొదలైనవాటికి అన్ని సాధనాలు కావాల్సి ఉంటుంది. కానీ అవ్యక్త వతనంలో ఈ స్థూల సాధనాల అవసరమేమీ లేదు. అక్కడైతే కేవలం డబల్ విదేశీయులే కాదు, మొత్తం భారతదేశంలోని పిల్లలందరినీ కలిపి చేర్చినట్లయితే అనంతమైన అవ్యక్త వతనం వలె అనిపిస్తుంది. అక్కడ ఎన్ని లక్షల మంది ఉన్నా కానీ ఒక చిన్న సంగఠన ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రోజు వతనంలో కేవలం డబల్ విదేశీయులనే ఇమర్జ్ చేశారు.

భిన్న-భిన్న ఆచార-సంప్రదాయాలు ఉన్నప్పటికీ దృఢ సంకల్పంతో మంచి ప్రగతిని పొందారని బాప్ దాదా గమనించారు. మెజారిటీ ఉల్లాస-ఉత్సాహాలలో నడుస్తున్నారు. కొంతమంది ఆట చూపించేవారిగా ఉండనే ఉంటారు కానీ రిజల్టులో ఎటువంటి తేడా చూశారంటే - క్రిందటి సంవత్సరం వరకు ఎక్కువగా కన్ఫ్యూజ్ (తికమక) అయ్యేవారు. కానీ ఈ సంవత్సరం రిజల్టులో, చాలామంది ముందుకంటే దృఢంగా ఉండడాన్ని చూశారు. కొంతమంది బాప్ దాదాకు ఆట చూపించే పిల్లలను కూడా చూశారు. తికమకపడే ఆటను కూడా ఆడతారు కదా. ఆ సమయంలో వీడియో తీసి కూర్చుని చూసినట్లైతే మీకు అది పూర్తిగా డ్రామాలా అనిపిస్తుంది. కానీ ముందుకంటే తేడా ఉంది. ఇప్పుడు అనుభవీలుగా అయి గంభీరంగా కూడా అవుతున్నారు. కనుక చదువుపై ప్రేమ మరియు స్మృతిలో ఉండాలనే ఉత్సాహము, భిన్న ఆచార వ్యవహారాలను, నమ్మకాలను కూడా సహజంగా పరివర్తన చేస్తాయని రిజల్టులో చూశారు. భారతవాసులకు పరివర్తన అవ్వడం సులభము. వారికి దేవతల గురించి తెలుసు, శాస్త్రాల మిక్సడ్ జ్ఞానము గురించి తెలుసు కనుక నమ్మకాలు భారతవాసులకు అంత కొత్తేమీ కావు. అయినా, మొత్తం నలువైపులా ఉన్న పిల్లలలో ఇటువంటి నిశ్చయబుద్ధికల, స్థిరమైన, నిశ్చలమైన ఆత్మలను చూశారు. ఇటువంటి నిశ్చయబుద్ధి కలిగిన ఆత్మలు ఇతరులను కూడా నిశ్చయబుద్ధి కలవారిగా చేయడంలో ఉదాహరణగా ఉన్నారు. ప్రవృత్తిలో ఉంటున్నా శక్తిశాలీ సంకల్పాల ద్వారా తమ దృష్టిని, వృత్తిని పరివర్తన చేసుకుంటారు. అటువంటి విశేషమైన రత్నాలను కూడా చూశారు. అలాగే చాలా మంది పిల్లలు, ఎవరైతే ఇంతకుముందు తమదైన పద్ధతిలో, అల్పకాలిక సాధనాలలో, అల్పకాలిక సుఖాలలో మునిగి ఉండేవారో, అటువంటివారు కూడా ఇప్పుడు రాత్రి-పగలు పరివర్తన చెందడంలో మంచి తీవ్ర పురుషార్థుల లైనులో నడుస్తున్నారు. అటువంటివారు ఎక్కువ మంది లేకపోయినా సరే బాగానే ఉన్నారు. బాప్ దాదా ఝాట్కూ (ఒక్క వేటుతో బలి ఇచ్చే) ఉదాహరణను ఇస్తారు. మనసుతో త్యాగం చేయాలనే సంకల్పం చేసిన తర్వాత, కన్నెత్తి చూడని వారు కూడా ఉన్నారు. ఈ రోజు బాబా పూర్తి రిజల్టును చూస్తూ ఉన్నారు. శక్తిశాలీ ఆత్మలను చూసి బాప్ దాదా చిరునవ్వుతో ఈ విధంగా ఆత్మిక సంభాషణ చేశారు - బ్రహ్మా ద్వారా రచింపబడిన రచన రెండు రకాలుగా మహిమ చేయబడింది. మొదటిది, బ్రహ్మా ముఖకమలం ద్వారా బ్రాహ్మణులు వెలువడ్డారు. రెండవ రచన - బ్రహ్మా తన సంకల్పం ద్వారా సృష్టిని రచించారు. కనుక బ్రహ్మాబాబా ఎంత సమయం నుండి శ్రేష్ఠమైన శక్తిశాలీ సంకల్పాలు చేశారు! బాప్ దాదాలు ఇరువురూ కలిసే ఉన్నారు కానీ రచన గురించి చెప్పేటప్పుడు శివుని రచన అని అనరు. శివ వంశీయులని అంటారు. శివకుమార-శివకుమారీలని అనరు, బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలని అంటారు. కనుక విశేషంగా బ్రహ్మాబాబా శ్రేష్ఠమైన సంకల్పాల ద్వారా ఆహ్వానించారు అనగా రచనను రచించారు. కనుక ఈ బ్రహ్మా చేసిన శక్తిశాలీ సంకల్పాల ద్వారా, ఆహ్వానం ద్వారా సాకారంలో వచ్చి చేరుకున్నారు.

సంకల్పాల రచన కూడా తక్కువైనదేమీ కాదు. సంకల్పాలు శక్తిశాలీగా ఉన్నందుకు, దూరము నుండి, భిన్నమైన పరదాల వెనుక నుండి, ఏ పిల్లలనైతే తమ పరివారంలోకి తీసుకురావాల్సి ఉందో, వారిని శ్రేష్ఠమైన, శక్తిశాలీ సంకల్పాలు ప్రేరేపించి సమీపంగా తీసుకొచ్చాయి. అందువలన, ఈ శక్తిశాలీ సంకల్పాల రచన కూడా శక్తిశాలీగా ఉంది. మా బుద్ధిని విశేషంగా ఎవరో ప్రేరేపించి సమీపంగా తీసుకొస్తున్నారు అనే అనుభవం కూడా చాలా మందికి కలిగింది. బ్రహ్మా యొక్క శక్తిశాలీ సంకల్పాల కారణంగా బ్రహ్మా చిత్రాన్ని చూస్తూనే అందులో చైతన్యత అనుభవమవుతుంది. చైతన్యమైన సంబంధం అనుభవం అవ్వడంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. కనుక బాప్ దాదా రచనను చూసి హర్షిస్తున్నారు. ఇకపై ఇంకా శక్తిశాలీ రచనను ప్రత్యక్ష ఋజువుగా ఇస్తూ ఉంటారు. డబల్ విదేశీయుల సేవా సమయం పరంగా ఇప్పుడు బాల్యతనపు సమయం సమాప్తమయింది. ఇప్పుడు అనుభవీలుగా అయి ఇతరులను కూడా స్థిరంగా, దృఢంగా తయారుచేసే, అనుభవం చేయించే సమయము. ఇప్పుడు ఆటలాడే సమయం సమాప్తమయింది. ఇప్పుడు సదా సమర్థులుగా అయి నిర్బల ఆత్మలను సమర్థులుగా చేస్తూ వెళ్ళండి. మీలోనే నిర్బలతా సంస్కారం ఉంటే ఇతరులను కూడా నిర్బలురుగానే చేస్తారు. సమయం తక్కువగా ఉంది మరియు రచన ఇంకా ఎక్కువగా పెరగాల్సి ఉంది. చాలామంది అయిపోయారు అని ఈ సంఖ్యనే చూస్తూ ఇందులోనే సంతోషపడకండి. ఇప్పుడింకా సంఖ్య పెరగవలసిందే. కానీ ఏ విధంగా మీరు ఇంత సమయం పాలన తీసుకున్నారో మరియు ఏ విధి ద్వారా మీరు పాలన తీసుకున్నారో, అది ఇప్పుడు పరివర్తనవుతూ ఉంటుంది.

ఎలాగైతే 50 సంవత్సరాలు పాలన తీసుకున్న గోల్డెన్ జూబ్లీ వారికి మరియు సిల్వర్ జూబ్లీ వారికి తేడా ఉంది కదా. అలాగే వెనుక వచ్చే వారిలో కూడా తేడా వస్తూ ఉంటుంది. కొద్ది సమయంలోనే వారిని శక్తిశాలీగా తయారుచేయాలి. స్వయం వారి యొక్క శ్రేష్ఠ భావన కూడా ఉండనే ఉంటుంది కానీ మీరందరూ కూడా, కొద్ది సమయంలోనే ముందుకు వెళ్ళే అటువంటి పిల్లలకు మీ సంబంధ-సంపర్కాల సహయోగం ఇచ్చే తీరాలి, దీని ద్వారా వారికి సహజంగా ముందుకు వెళ్ళేందుకు ఉత్సాహము మరియు ధైర్యము కలగాలి. ఇప్పుడు ఈ సేవ చాలా జరగాలి. కేవలం మీ కోసమే శక్తులను జమ చేసుకునే సమయం కాదు. కానీ మీతో పాటు ఇతరుల కోసం కూడా ఎంతగా శక్తులను జమ చేసుకోవాలంటే, వాటి ద్వారా ఇతరులకు కూడా సహయోగమును ఇవ్వగలగాలి. కేవలం సహయోగం తీసుకునేవారిగా కాదు, ఇచ్చేవారిగా అవ్వాలి. ఎవరైతే జ్ఞానంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచి ఉంటుందో, వారికి ఆ రెండు సంవత్సరాల సమయం తక్కువేమీ కాదు. కొంత సమయంలోనే అన్నీ అనుభవం చేయాలి. ఎలాగైతే వృక్షంలో, చివర్లో వచ్చే ఆత్మలు కూడా తప్పకుండా నాలుగు స్టేజీల ద్వారా పాస్ అవుతారని చూపిస్తారు కదా. వారు 10-12 జన్మలు తీసుకోవచ్చు లేక ఎన్నైనా తీసుకోవచ్చు. అలా, వెనుక వచ్చేవారు కూడా కొంత సమయంలోనే సర్వశక్తులను అనుభవం చెయ్యాల్సిందే. విద్యార్థి జీవితాన్ని మరియు దానితోపాటు సేవాధారి జీవితాన్ని కూడా అనుభవం చేయాలి. సేవాధారులు కేవలం కోర్సు చేయించడం లేక భాషణ ఇవ్వడమే కాదు, సేవాధారి అనగా సదా ఉల్లాస-ఉత్సాహాల సహయోగమివ్వాలి. శక్తిశాలీగా తయారుచేసే సహయోగమివ్వాలి. కొద్ది సమయంలోనే అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. ఇంత తీవ్ర వేగంతో చేసినప్పుడే కదా చేరుకుంటారు, అందువలన ఒకరికొకరు సహయోగులుగా అవ్వాలి. ఒకరికొకరు యోగులుగా అవ్వకూడదు, అనగా ఒకరితో ఒకరు యోగం జోడించడం ప్రారంభించకూడదు. సహయోగీ ఆత్మలు సదా సహయోగం ద్వారా తండ్రికి సమీపంగా మరియు సమానంగా తయారుచేస్తారు. తమ సమానంగా కాదు కానీ తండ్రి సమానంగా చేయాలి. మీలో ఏవైతే బలహీనతలున్నాయో వాటిని ఇక్కడే వదిలేసి వెళ్ళండి. విదేశానికి తీసుకువెళ్ళకండి. శక్తిశాలీ ఆత్మలుగా అయి ఇతరులను శక్తిశాలీగా చేయాలి. ఈ విశేషమైన దృఢ సంకల్పం సదా స్మృతిలో ఉండాలి. అచ్ఛా.

నలువైపులా ఉన్న పిల్లలందరికీ విశేషంగా స్నేహ సంపన్న ప్రియస్మృతులను తెలుపుతున్నారు. సదా స్నేహీలు, సదా సహయోగులు మరియు శక్తిశాలీ అయిన ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వెరైటీ ఉన్నప్పటికీ అందరూ ఒక్కరికి చెందినవారిగా అయ్యాము అన్న ఈ సంతోషం అందరికీ ఉంది కదా. ఇప్పుడు వేరు-వేరు మతాలు లేవు. ఒకే ఈశ్వరీయ మతముపై నడిచే శ్రేష్ఠమైన ఆత్మలుగా ఉన్నారు. బ్రాహ్మణుల భాష కూడా ఒక్కటే. మీరు ఒకే తండ్రికి చెందినవారు మరియు తండ్రి యొక్క జ్ఞానాన్ని ఇతరులకు కూడా తెలియజేసి అందరినీ ఒకే తండ్రికి చెందినవారిగా చేయాలి. ఇది ఎంత పెద్ద శ్రేష్ఠమైన పరివారం. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఇది మా ఇల్లు అనే నషా ఉంది. సేవా స్థానము అనగా మీ ఇల్లు. ఇన్ని ఇళ్ళు గలవారెవ్వరూ ఉండరు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా, మీ పరిచయస్థులు ఎక్కడెక్కడ ఉన్నారు అని అడిగితే, పూర్తి ప్రపంచమంతటా ఉన్నారని అంటారు. ఎక్కడికి వెళ్ళినా అందరూ మన పరివారమే. ఎంత అనంతమైన అధికారులుగా అయ్యారు, సేవాధారులుగా అయ్యారు. సేవాధారులుగా అవ్వడం అనగా అధికారులుగా అవ్వడం. ఇది అనంతమైన ఆత్మిక సంతోషము. ఇప్పుడు ప్రతి స్థానము తన శక్తిశాలీ స్థితి ద్వారా విస్తారాన్ని ప్రాప్తి చేసుకుంటుంది. మొదట కొంత శ్రమ అనిపిస్తుంది, తర్వాత కొంతమంది ఉదాహరణలుగా తయారైతే, వారిని చూసి ఇతరులు సహజంగా ముందుకు వెళ్తుంటారు.

బాప్ దాదా పిల్లలందరికీ ఈ శ్రేష్ఠమైన సంకల్పాన్ని పదే-పదే స్మృతినిప్పిస్తున్నారు - సదా స్వయం కూడా స్మృతి మరియు సేవల ఉల్లాస-ఉత్సాహాలలో ఉండండి, ఎంతో సంతోషంగా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉండండి, మరియు ఇతరులను కూడా అలాగే ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. నలువైపులా ఉన్నవారు, ఎవరైతే సాకారంలో ఇక్కడికి చేరుకోలేకపోయారో, వారు పంపిన చిత్రాలు, లేఖలు అన్నీ చేరుకున్నాయి. వాటన్నిటికీ బదులు ఇస్తూ బాప్ దాదా అందరికీ, పదమాపదమ రెట్ల హృదయపూర్వకమైన ప్రియస్మృతులను కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఎంత ఉల్లాస-ఉత్సాహాలు, సంతోషము ఉన్నాయో, వాటిని ఇంకా పదమాల రెట్లు పెంచండి. కొంతమంది తమ బలహీనతల సమాచారాన్ని కూడా వ్రాశారు. వ్రాయడం అనగా తండ్రికి ఇవ్వడం అని వారికి తండ్రి చెప్తున్నారు. ఇచ్చేసిన వస్తువు ఇక మళ్ళీ మీ వద్ద ఉండలేదు. బలహీనతలను ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాటిని సంకల్పంలో కూడా తీసుకురాకండి. మూడవ విషయం - ఎప్పుడూ ఎటువంటి స్వంత సంస్కారాలతో గానీ, సంగఠనలోని సంస్కారాలతో గానీ, వాయుమండలంలోని అలజడితో గానీ నిరాశపడకూడదు. సదా తండ్రిని కంబైండ్ రూపంలో అనుభవం చేసి నిరాశ నుండి శక్తిశాలీగా అయి ముందుకు ఎగురుతూ ఉండండి. లెక్కాచారం తీరిపోయింది అనగా బరువు తగ్గిపోయింది. ఎంతో సంతోషంగా పాత భారాన్ని భస్మం చేస్తూ వెళ్ళండి. బాప్ దాదా సదా పిల్లలకు సహయోగులుగా ఉన్నారు. ఎక్కువగా ఆలోచించకండి కూడా. వ్యర్థ చింతన కూడా బలహీనంగా చేస్తుంది. ఎవరికైతే వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడుస్తాయో, వారు రెండు-నాలుగు సార్లు మురళీ చదవండి. మననం చేయండి, చదువుకుంటూ వెళ్ళండి. ఏదో ఒక పాయింటు బుద్ధిలో కూర్చుండిపోతుంది. శుద్ధ సంకల్పాల శక్తిని జమ చేసుకుంటూ ఉన్నట్లయితే వ్యర్థం సమాప్తమైపోతుంది. అర్థమయిందా.

బాప్ దాదాల విశేష ప్రేరణలు -

నలువైపులా దేశంలో గానీ, విదేశాలలో గానీ ఇటువంటి చిన్న-చిన్న స్థానాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి సమయానుసారంగా సాధారణమైనవారు, కానీ సంపన్నమైన పిల్లలు. నిమిత్తమైన పిల్లలు తమ వద్దకు రావాలి అన్న ఆశను చాలా సమయం నుండి పెట్టుకుని ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు. కానీ వారి ఆశ పూర్తి అవ్వడం లేదు. ఆ ఆశను కూడా బాప్ దాదా ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. విశేషంగా మహారథి పిల్లలు ప్లాన్ తయారుచేసి నలువైపులా ఎవరి ఆశాదీపాలు అయితే తయారై ఉన్నాయో, వాటిని వెలిగించేందుకు వెళ్ళాలి. ఆశాదీపాలను వెలిగించేందుకు బాప్ దాదా విశేషంగా సమయమిస్తున్నారు. మహారథి పిల్లలందరూ కలిసి భిన్న-భిన్న స్థానాలను పంచుకొని, గ్రామాలకు చెందిన ఏ పిల్లల వద్దకైతే సమయం కారణంగా వెళ్ళలేకపోయారో, అటువంటి వారి ఆశలను పూర్తి చేయాలి. ముఖ్యమైన స్థానాలకైతే ముఖ్యమైన ప్రోగ్రాంల కారణంగా వెళ్తూనే ఉంటారు కానీ చిన్న-చిన్న స్థానాలలో జరిగే యథాశక్తి ప్రోగ్రాంలే వారికి పెద్ద ప్రోగ్రాంలు. వారి భావనయే అన్నిటికంటే పెద్ద ఫంక్షన్. బాప్ దాదా వద్ద అటువంటి చాలామంది పిల్లల చాలాకాలపు అర్జీలు ఫైలులో పడి ఉన్నాయి. ఈ ఫైలును కూడా బాప్ దాదా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మహారథి పిల్లలకు చక్రవర్తులుగా అయ్యే విశేషమైన ఛాన్స్ ఇస్తున్నారు. అలాగని అన్ని స్థానాలకు దాదీయే వెళ్ళాలని అనకండి. ఒకవేళ ఒక దాదీయే అన్ని వైపులకూ వెళ్తే 5 సంవత్సరాలు పడుతుంది. మరి ఇక 5 సంవత్సరాలు బాప్ దాదా రారు అని అంటే మీకు అంగీకారమేనా? బాప్ దాదా సీజన్ ఇక్కడ జరుగుతుండగా దాదీ భ్రమణం చేయడానికి వెళ్తే, ఇది కూడా బాగుండదు. కనుక మహారథుల ప్రోగ్రాంను తయారుచేయండి. ఎక్కడికైతే ఎవ్వరూ వెళ్ళలేదో అక్కడికి వెళ్ళేందుకు ప్రోగ్రాం తయారుచేయండి, మరియు విశేషంగా ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా, ఒకరోజు బయటి సేవ, ఒకరోజు బ్రాహ్మణుల తపస్యా ప్రోగ్రాం - ఈ రెండు ప్రోగ్రాంలు తప్పకుండా ఉండాలి. కేవలం ఫంక్షన్కు వెళ్ళి హడావుడిగా పరుగెత్తి రాకండి. ఎంత వీలైతే అంత విశేషంగా బ్రాహ్మణుల రిఫ్రెష్మెంట్ ప్రోగ్రాం ఉండేలా ప్రోగ్రాం తయారుచేయండి. దానితో పాటుగా వి.ఐ.పిలు సంపర్కంలోకి వచ్చే ప్రోగ్రాం ఉండాలి కానీ ఆ ప్రోగ్రాం చిన్నదిగా ఉండాలి. బ్రాహ్మణులకు కూడా విశేషమైన ఉల్లాస-ఉత్సాహాల శక్తి లభించే విధంగా ముందే ప్రోగ్రాం తయారుచేయండి. వారిలో నిర్విఘ్నంగా అయ్యే ధైర్యము, ఉల్లాసము నిండాలి. కనుక నలువైపులా భ్రమణం చేసే ప్రోగ్రాం తయారుచేసేందుకు కూడా విశేషంగా సమయమిస్తున్నాము ఎందుకంటే సమయ ప్రమాణంగా పరిస్థితులు కూడా మారుతున్నాయి, ఇంకా మారుతూ ఉంటాయి, కనుక ఫైలును సమాప్తం చేయాలి. అచ్ఛా.

Comments