25-03-1986 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“సంగమయుగము హోలీ జీవితము యొక్క యుగము”
ఈ రోజు బాప్ దాదా సర్వ స్వరాజ్య అధికారి అలౌకిక రాజ్య సభను చూస్తున్నారు. ప్రతి ఒక్క శ్రేష్ఠ ఆత్మపై మెరుస్తూ ఉన్న ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. ఈ రాజ్య సభయే హోలీ సభ. పరమ పావన పూజ్య ఆత్మలైన ప్రతి ఒక్కరు కేవలము ఈ ఒక్క జన్మ కొరకే పావనంగా అనగా హోలీగా అవ్వలేదు కానీ పావనంగా అనగా హోలీగా అయ్యే రేఖ, అనేక జన్మల పొడవైన రేఖ. మొత్తము కల్పములో ఇతర ఆత్మలు కూడా పావనంగా, హోలీగా అవుతాయి. పావన ఆత్మలు ధర్మపితల రూపంలో ధర్మ స్థాపన చేసేందుకు నిమిత్తులుగా అవుతాయి. అలాగే మహానాత్మలుగా పిలవబడే చాలామంది కూడా పావనంగా అవుతారు కానీ వారు పావనంగా అవ్వటంలో మరియు పావన ఆత్మలైన మీలో తేడా ఉంది. పావనంగా అయ్యేందుకు మీ సాధనము అతి సహజము, ఎటువంటి కష్టమూ లేదు ఎందుకంటే బాబా నుండి ఆత్మలైన మీకు సుఖము, శాంతి, పవిత్రతల వారసత్వము సహజంగా లభిస్తుంది. ఈ స్మృతి ద్వారా సహజంగా మరియు స్వతహాగానే అవినాశీగా అవుతారు! ప్రపంచములోని వారు పావనంగా అవుతారు కానీ కష్టంగా అవుతారు. మరియు వారికి 21 జన్మలకు వారసత్వ రూపములో పవిత్రత ప్రాప్తించదు. ఈ రోజును ప్రపంచము లెక్కలో హోలీ రోజు అని అంటారు. వారు హోలీని జరుపుకుంటారు మరియు మీరు స్వయమే పరమాత్మ సాంగత్యపు రంగులో రంగరింపబడే హోలీ ఆత్మలుగా అవుతారు. జరుపుకోవటము కొద్ది సమయము కొరకు ఉంటుంది, అవ్వటము జీవితము కొరకు ఉంటుంది. వారు రోజును జరుపుకుంటారు మరియు మీరు హోలీ జీవితాన్నే తయారుచేసుకుంటారు. ఈ సంగమయుగము హోలీ జీవితము యొక్క యుగము. మరి రంగులో రంగరింపబడ్డారు అనగా తొలగించుకునే అవసరం లేని అవినాశీ రంగు పడింది. సదాకాలము కొరకు బాబా సమానంగా అయ్యారు. సంగమయుగములో నిరాకార తండ్రి సమానంగా కర్మాతీత, నిరాకారీ స్థితిని అనుభవము చేస్తారు మరియు 21 జన్మలు బ్రహ్మా తండ్రి సమానంగా సర్వగుణ సంపన్నమైన, సంపూర్ణ నిర్వికారి శ్రేష్ఠ జీవితం సమానంగా అనుభవం చేస్తారు. కనుక మీ హోలీ ఏమిటంటే సాంగత్యపు ప్రభావంలో తండ్రి సమానంగా అవ్వటము. కనుక సమానంగా తయారుచేసే అటువంటి దృఢమైన రంగు ఉండాలి. ఇటువంటి హోలీని ప్రపంచంలో ఎవరైనా ఆడతారా? తండ్రి, సమానంగా తయారుచేసే హోలీని ఆడేందుకు వస్తారు. తండ్రి ద్వారా ప్రతి ఆత్మపై రకరకాలైన ఎన్ని అవినాశీ రంగులు పడతాయి. జ్ఞాన రంగు, స్మృతి రంగు, అనేక శక్తుల రంగు, గుణాల రంగు, శ్రేష్ఠ దృష్టి, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ భావన, శ్రేష్ఠ కామనలు స్వతహాగానే సదా తయారై ఉండాలి, ఈ ఆత్మిక రంగు ఎంత సహజంగా పడుతుంది! హోలీ (పవిత్రం) గా అయ్యారు అనగా హోలీ జరుపుకున్నట్లు. అటువంటి హోలీని జరుపుకుంటారు, ఎటువంటి గుణమో అటువంటి రూపము తయారవుతుంది. ఆ సమయములో ఎవరైనా వారి ఫోటో తీసినట్లయితే ఎలా అనిపిస్తుంది! వారు హోలీని జరుపుకుని ఎలా అవుతారు మరియు మీరు హోలీని జరుపుకుంటే ఫరిస్తాల నుండి దేవతలుగా అవుతారు. నిజానికి అన్నీ మీ స్మృతిచిహ్నాలే కానీ ఆధ్యాత్మిక శక్తి లేని కారణంగా ఆధ్యాత్మిక రూపంతో జరుపుకోలేరు. బాహ్యముఖత ఉన్న కారణంగా బాహ్యముఖ రూపంతోనే జరుపుకుంటూ ఉంటారు. మీ యథార్థ రూపంతో మంగళ మిలనమును జరుపుకోవాలి.
హోలీ విశేషత కాల్చటము, తరువాత జరుపుకోవటము, ఆ తర్వాత మంగళ మిలనము చెయ్యటము. ఈ మూడు విశేషతలతో స్మృతిచిహ్నము తయారై ఉంది ఎందుకంటే మీరందరూ హోలీగా అయ్యేందుకు ముందుగా పాత సంస్కారాలు, పాత స్మృతులు అన్నింటినీ యోగాగ్నితో కాల్చారు, అప్పుడే సాంగత్యపు రంగులో హోలీని జరుపుకున్నారు అనగా తండ్రి సమానంగా సాంగత్యపు రంగును వేసారు. ఎప్పుడైతే తండ్రి సాంగత్యపు రంగు పడుతుందో, అప్పుడు ప్రతి ఆత్మ పట్ల, విశ్వములోని సర్వాత్మలు పరమాత్మ పరివారంగా అవుతారు. పరమాత్మ పరివారమైన కారణంగా ప్రతి ఆత్మ పట్ల శుభ కామన స్వతహాగానే నేచురల్ సంస్కారంగా తయారవుతుంది కనుక సదా పరస్పరములో మంగళ మిలనమును జరుపుకుంటూ ఉంటారు. శత్రువైనాగానీ, అసుర సంస్కారాలు కలవారైనాగానీ, వారిపై కూడా ఈ ఆత్మిక మంగళ మిలనం ద్వారా పరమాత్మ రంగు అనే చుక్కలను తప్పకుండా జల్లుతారు. ఎవరైనా మీ వద్దకు వస్తే ఏం చేస్తారు? అందరినీ ఆలింగనం చేసుకోవడం అంటే అర్థం అందరినీ శ్రేష్ఠ ఆత్మగా భావించి ఆలింగనం చేసుకోవడం. వీరు బాబా పిల్లలు. ఈ ప్రేమ మిలనము, శుభ భావన మిలనము ఆ ఆత్మలకు కూడా పాత విషయాలను మరిపింపజేస్తుంది. వారు కూడా ఉత్సాహంలోకి వస్తారు కనుకనే ఉత్సవము రూపంలో స్మృతిచిహ్నాన్ని తయారుచేసారు. కనుక తండ్రితో హోలీని జరుపుకోవటము అనగా అవినాశీ, ఆత్మిక రంగులో తండ్రి సమానంగా అవ్వటము. వారైతే ఉదాసీనంగా ఉంటారు కనుక సంతోషాన్ని జరుపుకోవడం కోసం ఈ రోజును పెట్టుకున్నారు. మీరైతే ఎల్లప్పుడూ సంతోషంలో ఆడుతూ-పాడుతూ, ఆనందంగా ఉంటారు. ఏమయింది, ఎందుకు అయింది, ఎలా అయింది అన్న ఈ తికమకలో ఎవరైతే ఎక్కువగా ఉంటారో వారు ఆనందంగా ఉండలేరు. మీరు త్రికాలదర్శులుగా అయ్యారు కనుక ఇక ఏమిటి, ఎందుకు, ఎలా అన్న ఈ సంకల్పాలు తలెత్తలేవు ఎందుకంటే మీకు మూడు కాలాల కోసం తెలుసు. ఎందుకు జరిగింది? ముందుకు వెళ్ళేందుకు ఇది పరీక్ష అని తెలుసు. ఎందుకు జరిగింది? నథింగ్ న్యూ అనగా ఇది కొత్తేమీ కాదు. కనుక ఏమయింది అన్న ప్రశ్నే ఉండదు. ఎలా అయింది? మాయ ఇంకా దృఢంగా తయారుచేసేందుకై వచ్చింది మరియు వెళ్ళిపోయింది. కనుక త్రికాలదర్శి స్థితి కలవారు ఇందులో తికమకపడరు. ప్రశ్నతోపాటుగా సమాధానం వస్తుంది ఎందుకంటే త్రికాలదర్శులు. పేరేమో త్రికాలదర్శి, కానీ ఎందుకైంది, ఎలా అయింది అని వర్తమానాన్ని కూడా తెలుసుకోలేనట్లయితే వారిని త్రికాలదర్శి అని ఎలా అంటారు! అనేక సార్లు విజయులుగా అయ్యారు మరియు విజయులుగా అవుతారు కూడా. మేము బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఫరిస్తాల నుండి దేవతలుగా అయ్యేవారిమి అని పాస్ట్ మరియు ఫ్యూచర్ (గతం, భవిష్యత్తు) కూడా తెలుసు. ఇది నేడు మరియు రేపటి విషయము. ప్రశ్న సమాప్తమై ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది.
హోలీ అన్నదాని అర్థమే హో-లీ అనగా గతం గతః. ఇలా బిందువును పెట్టడం వచ్చు కదా! ఇది కూడా హోలీ అర్థము. కాల్చే హోలీ కూడా వస్తుంది. రంగులో రంగరింపబడే హోలీ కూడా వస్తుంది మరియు బిందువును పెట్టే హోలీ కూడా వస్తుంది. మంగళ మిలనమును జరుపుకునే హోలీ కూడా వస్తుంది. నాలుగు రకాల హోలీ వస్తుంది కదా! ఒకవేళ ఒక రకము తక్కువైనాకానీ ప్రకాశ కిరీటము సరిగ్గా నిలవదు. పడిపోతూ ఉంటుంది. కిరీటము టైట్ గా లేనట్లయితే పడిపోతూ ఉంటుంది కదా. నాలుగు రకాల హోలీని జరుపుకోవటంలో పాస్ అయ్యారా? మరి తండ్రి సమానంగా అవ్వాలి అంటే తండ్రి సంపన్నులు మరియు సంపూర్ణులు కూడా. పర్సంటేజ్ స్థితి కూడా ఇంకెప్పటి వరకు? ఎవరి పట్లనైతే స్నేహము ఉంటుందో, ఆ స్నేహితుని సమానంగా అవ్వటంలో కష్టముండదు. తండ్రికి సదా స్నేహీలుగా ఉన్నట్లయితే సదా సమానంగా ఎందుకు లేరు! సహజం కదా. అచ్ఛా!
సదా హోలీ మరియు హ్యాపీగా ఉండే హోలీ హంసలందరికీ ఉన్నతోన్నతమైన తండ్రి సమానంగా హోలీగా అయ్యేందుకు అవినాశీ అభినందనలను ఇస్తున్నారు. సదా తండ్రి సమానంగా అయ్యేందుకు, సదా హోలీ యుగములో ఆనందాలను జరుపుకునేందుకు అభినందనలను ఇస్తున్నారు. సదా హోలీ హంసలుగా అయ్యి జ్ఞాన రత్నాలతో సంపన్నంగా అయ్యేందుకు అభినందనలను ఇస్తున్నారు. సర్వ రంగులలో రంగరింపబడిన పూజ్య ఆత్మగా అయ్యేందుకు అభినందనలను ఇస్తున్నారు. సదాకాలమునకు అభినందనలు కూడా మరియు ప్రియస్మృతులు కూడా. మరియు సేవాధారి తండ్రి యొక్క యజమాని పిల్లలకు సదాకాలము కొరకు నమస్తే కూడా. కనుక ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈ రోజు మలేషియా గ్రూప్ ఉంది. సౌత్ ఈస్ట్. మేము ఎక్కడెక్కడో చెల్లాచెదురై ఉన్నాము అని అందరూ భావిస్తున్నారు. పరమాత్మ పరివారము అనే స్టీమర్ నుండి దిగి ఎక్కడెక్కడికో మూలలకు వెళ్ళిపోయారు. సంసార సాగరములో మునిగిపోయారు ఎందుకంటే ద్వాపరములో ఆత్మిక బాంబుకు బదులుగా శరీర భానమనే బాంబు తగిలింది. రావణుడు బాంబు వేసాడు కనుక స్టీమర్ విరిగిపోయింది. పరమాత్మ పరివారము అనే స్టీమర్ విరిగిపోయింది. ఎక్కడ ఆధారం దొరికితే అక్కడకు వెళ్ళిపోయారు. మునిగిపోయేవారికి ఏదైనా ఆధారం దొరుకుతుందంటే, అది అందుకుంటారు కదా. మీ అందరికీ కూడా ఏ ధర్మము, ఏ దేశము నుండి కాస్త ఆధారం దొరికితే అక్కడకు చేరుకున్నారు. కానీ సంస్కారమైతే అదే కదా కనుక ఇతర ధర్మములోకి వెళ్ళినా కూడా మీ వాస్తవిక ధర్మము యొక్క పరిచయము లభించటం వలన చేరుకున్నారు. మొత్తము విశ్వములో వ్యాపించారు. ఇలా విడిపోవటము కూడా కళ్యాణకారి అయింది, అనేక ఆత్మలను బయటకు తీసేందుకు ఒకరు కార్యమును చేసారు. విశ్వములో పరమాత్మ పరివారము యొక్క పరిచయమును ఇచ్చేందుకై కళ్యాణకారిగా అయ్యారు. అందరూ ఒకవేళ భారతదేశములోనే ఉన్నట్లయితే విశ్వములో సేవ ఎలా జరుగుతుంది, అందుకే మూలమూలలకు చేరుకున్నారు. అన్ని ముఖ్య ధర్మాలలోకి ఎవరో ఒకరు చేరుకున్నారు. ఒక్కరు వెలువడినాగానీ వారు తమ తోటివారిని తప్పకుండా మేల్కొలుపుతారు. తప్పిపోయిన పిల్లలను 5000 సంవత్సరాల తర్వాత చూస్తుంటే బాప్ దాదాకు కూడా సంతోషంగా ఉంటుంది. మీ అందరికీ కూడా సంతోషం కలుగుతుంది కదా. చేరుకోవడం అయితే చేరుకున్నారు. కలుసుకున్నారు కదా.
మలేషియాకు చెందిన వి.ఐ.పి. ఎవ్వరూ ఇప్పటివరకు రాలేదు. సేవ లక్ష్యంతో వారిని కూడా నిమిత్తులుగా చేయడం జరుగుతుంది. వారు సేవలో తీవ్రగతికి నిమిత్తులుగా అవుతారు కనుక వారిని ముందు పెట్టవలసి వస్తుంది. తండ్రి కొరకైతే మీరే శ్రేష్ఠ ఆత్మలు. ఆత్మిక నషాలోనైతే మీరు శ్రేష్ఠులు కదా. పూజ్య ఆత్మలైన మీరెక్కడ, మాయలో చిక్కుకుపోయిన వారెక్కడ! బాబా గురించి తెలియనివారికి కూడా పరిచయమును ఇవ్వాలి కదా. సింగపూర్లో కూడా ఇప్పుడు వృద్ధి జరుగుతుంది. ఎక్కడికైతే తండ్రి యొక్క అనన్య రత్నాలు చేరుకుంటారో, ఆ రత్నాలు రత్నాలనే వెలికితీస్తారు. ధైర్యం పెట్టి సేవలో తపనతో ముందుకు వెళ్తున్నారు. కనుక కష్టానికి ఫలము శ్రేష్ఠమైనదే లభిస్తుంది. తమ పరివారమును ఒకచోటికు చేర్చాలి. పరివారము నుండి చెల్లాచెదురైపోయినవారు మళ్ళీ పరివారంలోకి చేరుకుంటే ఎంత సంతోషపడతారు మరియు హృదయపూర్వకంగా ధన్యవాదాలను గానము చేస్తారు. కనుక వారు కూడా పరివారంలోకి వచ్చి ఎన్ని ధన్యవాదాలను గానము చేస్తూ ఉండవచ్చు. నిమిత్తంగా అయి తండ్రికి చెందినవారిగా తయారుచేసారు. సంగమయుగములో ధన్యవాదాలతో కూడిన మాలలు చాలా వస్తాయి. అచ్ఛా!
అవ్యక్త మహావాక్యాలు - అఖండ మహాదానులుగా అవ్వండి
మహాదాని అనగా లభించిన ఖజానాలను స్వార్థము లేకుండా సర్వాత్మలకు ఇచ్చేవారు - నిస్వార్థీ. స్వయము యొక్క స్వార్థము నుండి దూరంగా ఉన్న ఆత్మయే మహాదానిగా అవ్వగలరు. ఇతరుల సంతోషంలో స్వయము యొక్క సంతోషాన్ని అనుభవము చెయ్యటము కూడా మహాదానిగా అవ్వటము. ఏవిధంగానైతే సాగరము సంపన్నమైనదో, తరగనిదో, అఖండమైనదో, అలా పిల్లలైన మీరు కూడా మాస్టర్లు, అఖండమైన, తరగని ఖజానాలకు యజమానులు. కనుక ఖజానాలేవైతే లభించాయో, వాటిని మహాదానులుగా అయ్యి ఇతరుల కొరకు కార్యములో వినియోగిస్తూ ఉండండి. సంబంధములోకి వచ్చే భక్త ఆత్మల పట్లగానీ లేక సాధారణ ఆత్మల పట్లగానీ, వీరికి భక్తి ఫలము లభించాలి అన్న తపననే ఉండాలి. ఎంతగా దయాహృదయులుగా అవుతారో, అంతగా భ్రమిస్తున్న ఆత్మలకు సహజమార్గమును తెలియజేస్తారు.
మీ వద్ద అన్నిటికన్నా అతి పెద్ద ఖజానా అయిన సంతోషము ఉంది, మీరు ఈ సంతోషపు ఖజానాను దానము చేస్తూ ఉండండి. ఎవరికైతే సంతోషాన్ని ఇస్తారో, వారు పదే పదే మీకు ధన్యవాదాలు చెప్తారు. దుఃఖిత ఆత్మలకు సంతోషాన్ని దానంగా ఇచ్చినట్లయితే వారు మీ గుణాలను గానము చేస్తారు. ఇందులో మహాదానులుగా అవ్వండి. సంతోషపు ఖజానాను పంచండి. మీ తోటివారిని మేల్కొలపండి. మార్గాన్ని చూపండి. ఇప్పుడు సమయ ప్రమాణంగా మీ ప్రతి కర్మేంద్రియము ద్వారా మహాదానిగా లేక వరదానిగా అవ్వండి. మస్తకము ద్వారా సర్వులకు స్వ స్వరూపపు స్మృతిని కలిగించండి. నయనాల ద్వారా స్వదేశము మరియు స్వరాజ్యము యొక్క మార్గాన్ని చూపించండి. నోటి ద్వారా రచయిత మరియు రచనల విస్తారమును స్పష్టము చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే వరదానమును ఇవ్వండి. హస్తముల ద్వారా సదా సహజయోగి, కర్మయోగిగా అయ్యే వరదానమును ఇవ్వండి. చరణ కమలాల ద్వారా ప్రతి అడుగులోనూ ఫాలో ఫాదర్ చేసి ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకునే వరదానులుగా అవ్వండి, ఇలా ప్రతి కర్మేంద్రియము ద్వారా మహాదానమును, వరదానమును ఇస్తూ వెళ్ళండి. మాస్టర్ దాతలుగా అయ్యి పరిస్థితులను పరివర్తన చేసేందుకు, బలహీనంగా ఉన్నవారిని శక్తిశాలీగా చేసేందుకు, వాయుమండలము మరియు వృత్తులను తమ శక్తుల ద్వారా పరివర్తన చేసేందుకు, సదా స్వయాన్ని కళ్యాణార్థము బాధ్యత కలిగిన ఆత్మగా భావించి ప్రతి విషయములో సహయోగము లేక శక్తి యొక్క మహాదానము లేక వరదానమును ఇచ్చే సంకల్పమును చెయ్యండి. నేను ఇవ్వాలి, నేను చెయ్యాలి, నేను మారాలి, నేను నిర్మాణముగా అవ్వాలి. ఇలా “ఓటే సో అర్జున్” (ముందుగా ఎవరు బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు) అనగా దాతాతనపు విశేషతను ధారణ చెయ్యండి.
ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మ పట్ల విశేష అనుభవీ మూర్తులుగా అయ్యి, విశేష అనుభవాల గనిగా అయ్యి, అనుభవీ మూర్తులుగా తయారుచేసే మహాదానమును చెయ్యండి, దీని ద్వారా ప్రతి ఆత్మ అనుభవము యొక్క ఆధారముపై అంగద సమానంగా అయిపోవాలి. నడుస్తున్నాము, చేస్తున్నాము, వింటున్నాము, వినిపిస్తున్నాము, ఇలా కాదు. కానీ అనుభవాల ఖజానాను పొందాము - ఇటువంటి పాటను పాడుతూ సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉండండి. పిల్లలైన మీకు తండ్రి ద్వారా ఏ ఖజానాలైతే లభించాయో వాటిని పంచుతూ ఉండండి అనగా మహాదానిగా అవ్వండి. సదా ఎవరు వచ్చినాగానీ మీ భండారీ నుండి ఖాళీగా వెళ్ళకూడదు. మీరందరూ బహుకాలపు సహచరులు మరియు బహుకాలపు రాజ్య అధికారులు. కనుక అంతిమములో ఉన్న బలహీన ఆత్మలకు మహాదానులు, వరదానులుగా అయ్యి అనుభవాల దానాన్ని మరియు పుణ్యమును చెయ్యండి. ఈ పుణ్యము అర్థకల్పము కొరకు మిమ్మల్ని పూజ్యనీయులు మరియు గాయనయోగ్యులుగా తయారుచేస్తుంది. మీరందరూ జ్ఞాన ఖజానాతో సంపన్నంగా ఉన్న ధనం యొక్క దేవీలు. ఎప్పటినుండైతే బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటి నుండి జన్మసిద్ధ అధికారంగా జ్ఞానపు ఖజానా, శక్తుల ఖజానా లభించింది. ఈ ఖజానాలను స్వయము కొరకు మరియు ఇతరుల కొరకు ఉపయోగించినట్లయితే సంతోషం పెరుగుతుంది, ఇందులో మహాదానులుగా అవ్వండి. మహాదాని అనగా సదా అఖండమైన భండారా నడుస్తూ ఉండాలి.
ఈశ్వరీయ సేవ యొక్క అతి పెద్ద పుణ్యము - పవిత్రతా దానమును ఇవ్వటము. పవిత్రంగా అవ్వటము మరియు పవిత్రంగా తయారుచెయ్యటమే పుణ్య ఆత్మగా అవ్వటము, ఎందుకంటే ఏ ఆత్మనైనా ఆత్మహత్య మహాపాపము నుండి మీరు విడిపిస్తారు. అపవిత్రత ఆత్మహత్య వంటిది. పవిత్రత ప్రాణదానము వంటిది. పవిత్రంగా అవ్వండి మరియు పవిత్రంగా చెయ్యండి - ఈ మహాదానమును చేసి పుణ్య ఆత్మగా అవ్వండి. మహాదాని అనగా పూర్తిగా నిర్బలమైన, దుఃఖిత, అసమర్థ ఆత్మలకు అదనపు బలాన్ని ఇచ్చి ఆత్మిక దయాహృదయులుగా అవ్వటము. మహాదాని అనగా పూర్తిగా హోప్లెస్ కేస్ లో హోప్ (ఆశ) ను కలిగించటము. కనుక మాస్టర్ రచయితలుగా అయ్యి ప్రాప్తించిన శక్తులు మరియు ప్రాప్తించిన జ్ఞానము, గుణాలు మరియు సర్వ ఖజానాలు మహాదానులై ఇతరులకు ఇస్తూ వెళ్ళండి. పూర్తి నిరుపేదలకు దానము ఇవ్వటం జరుగుతుంది. నిస్సహాయులకు సహాయము ఇవ్వటం జరుగుతుంది. కనుక ప్రజల పట్ల మహాదానులుగా మరియు అంతిమములో భక్త ఆత్మల పట్ల మహాదానులుగా అవ్వండి. పరస్పరములో ఇతరులపట్ల బ్రాహ్మణ మహాదానిగా కాదు. మీరైతే పరస్పరంలో సహయోగులు, సహచరులు. సోదరులు, తమ సమానమైన పురుషార్థీలు. వారికి సహయోగమును ఇవ్వండి. అచ్ఛా!
Comments
Post a Comment