24-10-2010 అవ్యక్త మురళి

                      24-10-2010        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “సమయపు వేగము అనుసారంగా ఇప్పుడు విశేషంగా స్వభావ   సంస్కారాలను పరివర్తన చేయడంలో తీవ్రతను తీసుకురండి, మనసా   ద్వారా ఆత్మలకు భిన్న భిన్న కిరణాలను ఇవ్వండి.”

           ఈ రోజు నలువైపులా ఉన్న పరమాత్మ హృదయ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు మరియు విశ్వరాజ్యసింహాసనాధికారులైన పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. ఈ పరమాత్మ హృదయసింహాసనము కేవలం బ్రాహ్మణులైన మీకొరకే ఉంది. భృకుటి సింహాసనమైతే అందరి వద్దా ఉంది. కాని, పరమాత్మ హృదయ సింహాసనము కేవలం బ్రాహ్మణ ఆత్మల భాగ్యములోనే ఉంది. ఈ పరమాత్మ సింహాసనము విశ్వసింహాసనమును ప్రాప్తింపజేస్తుంది. కావున ఈ మూడు సింహాసనాల అధికారీ ఆత్మలు బ్రాహ్మణులైన మీరే. ఈ పరమాత్మ సింహాసనము ఎంత శ్రేష్ఠమైనదంటే, ఇది ఇంకే యుగములోనూ ప్రాప్తమవ్వదు. పరమాత్మ సింహాసనము ఎంతో మహిమ చేయబడుతుంది కూడా, పరమాత్మ సింహాసనానికి అధికారులైనవారు భక్తిమార్గంలో కూడా మాలలోని మణుల రూపంలో గానం చేయబడతారు మరియు పూజింపబడతారు. కోట్లాదిమందిలో ఏ కొందరి రూపంలోనో గానం చేయబడతారు. ఎంతో భావనతో ఒక్కొక్క మణిని ఎంతో ఉన్నతమైన దృష్టితో చూస్తూ ఉంటారు. మరి మీ అందరికీ నషా ఉంది కదా! నషా ఉందా? మేము తప్ప ఇంకెవ్వరూ ఈ సింహాసనమును అనుభవం చేసుకోలేరు అన్న నషా ఉందా? ఇది బ్రాహ్మణులైన మీ అందరి జన్మసిద్ధ అధికారము. మీకొరకు ఈ సింహాసనము కంఠహారము వంటిది. కావున మేము భగవంతుడి హృదయ సింహాసనాధికారులము అన్న ఈ నషా మరియు సంతోషము అందరికీ సదా స్మృతిలో ఉంటోందా? మేము ఎవరము అన్న నషా మరియు నిశ్చయము ఉంటోందా?

           బాప్ దాదా ఇటువంటి మూడు సింహాసనాధికారులైన పిల్లలను చూసి, 'ఓహో నా శ్రేష్ఠ అధికారీ పిల్లలూ ఓహో' అని సంతోషిస్తూ ఉంటారు. 'ఓహో నా బాబా ఓహో' అని పిల్లలు అంటారు, మరియు బాబా- 'ఓహో పిల్లలూ ఓహో' అని అంటారు. స్వయంగా బాబా కూడా ఇటువంటి పిల్లల మహిమను గానం చేస్తారు. కావున మేము ఎవ్వరము అన్న నషా ఉందా? ఎంతగా నిశ్చయం ఉంటుందో అంతగానే నషా ఉంటుంది మరియు నిశ్చయం యొక్క నషా మీ ముఖము మరియు నడవడిక ద్వారా కనిపిస్తోంది. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో వారికి నషా తప్పకుండా ఉంటుంది. బాప్ దాదా కూడా ఇప్పుడు పిల్లల ప్రతి ఒక్కరి ముఖము ద్వారా మరియు నడవడిక ద్వారా ఆత్మలకు అనుభవం చేయించాలనుకుంటున్నారు. వాణి ద్వారా అయితే అనుభవం చేసుకుంటున్నారు. ఇప్పుడు అనుభవం చేసుకునే కార్యము ప్రారంభమైపోయింది. ఇంతకుముందు వినేవారు, ఆలోచించేవారు. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీ స్థితి యొక్క ప్రభావమును అనుభవం చేసుకుంటున్నారు. కావున రోజంతటిలో ఎంత సమయము పరమాత్మ సింహాసనంపై ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే ఈ హృదయసింహాసనము విశ్వరాజ్యాన్ని ప్రాప్తింపజేసేందుకు ఆధారము. ఎందుకంటే ఈ హృదయసింహాసనం ఆధారంపై విశ్వరాజ్యము ప్రాప్తింపజేసుకోవడం ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈ హృదయసింహాసనం ఆధారంపై ఎంత సమయం మీరు హృదయసింహాసనాధికారులుగా ఉంటారో అంత ఎక్కువ సమయం భవిష్యత్తులో రాజ్యవంశములో అధికారులుగా అవుతారు. కావున ఎప్పటినుండైతే నేను బ్రాహ్మణునిగా అయ్యానో అప్పటి నుండి ఎంత సమయము హృదయ సింహాసనాధికారిగా అయ్యాను అని పరిశీలించుకోండి. దీని ఆధారంపై సింహాసనంపై నెంబర్ వారీగా కూర్చుంటారు. కాని, సదా రాజ్యకుటుంబంలో రాజ్యవంశానికి అధికారులుగా అవుతారు. దీన్ని ఎప్పుడైనా పరిశీలించారా? హృదయ సింహాసనంనుండైతే దిగిపోవడం లేదు కదా! మీ లెక్కను చూడండి! ఎందుకంటే దీని ఆధారంపైనే మీరు సదా రాజ్యవంశంలోకి వస్తారు. సింహాసనమును వదిలి అప్పుడప్పుడు మట్టిలోనైతే కాళ్ళుపెట్టడం లేదు కదా! అని పరిశీలించుకోండి. 63 జన్మల సంస్కారమైన దేహాభిమానరూపీ మట్టిలో కాళ్ళుమోపారు. ఒకటేమో-దేహబానము, ఇంకొకటి-దేహఅభిమానము, దేహఅభిమానరూపీ మట్టి గాఢమైనది. కాని, దేహబానము కూడా మట్టే. ఎప్పుడైతే మనుష్యులు వెళ్ళిపోతారో మరియు వారిని తగులబెడతారో అప్పుడు మట్టి మట్టిలో కలిసిపోయింది అనే అంటారు. కావున మట్టిలోకైతే కాళ్ళు వెళ్ళడం లేదు కదా అని పరిశీలించుకోండి. దేహబానములోకి రావడము అనగా మట్టిలో కాళ్ళుమోపడము.

           బాప్ దాదా శ్రేష్ఠ ఆత్మలైన మీకొరకు మూడు సింహాసనాలు ఇచ్చారు. ఎందుకంటే మీరు ప్రియమైనవారు, చాలాకాలం తర్వాత కలిసినవారు, అతిప్రియమైనవారు కూడా. అల్లారుముద్దు పిల్లలను ఊయలలోనో లేక ఒడిలోనో ఉంచుతారు. వారిని మట్టిలో కాళ్ళుమోపనివ్వరు. కావున మూడు సింహాసనాలకు అధికారులైన పిల్లలకు ఎన్ని భిన్న భిన్న ఊయలలను ఇచ్చారు! కాసేపు శాంతి అనే ఊయలలో ఊగండి, కాసేపు సుఖము అనే ఊయలలో ఊగండి, కాసేపు ప్రేమ అనే ఊయలలో ఊగండి. సింహాసనము మరియు ఊయలలు, వీటిలోనే మీ పాదాలను ఉంచాలి. మేము భవిష్యత్తులో ఎక్కడకువస్తాము, ఏమౌతాము అని కొందరు పిల్లలు అడుగుతారు. మీరు ఎంత సమయం నుండైతే వచ్చారో అంత సమయం నుండి, నా పాదాలు ఊయలలు లేక బాబా హృదయసింహాసనంపైనే ఉన్నాయా? అని పరిశీలించుకోండి, ఎందుకంటే అంతే సమయము భవిష్యత్తులో రాయల్ వంశంలో ఉంటారు. రాయల్ ప్రజలలో కూడా కాదు, రాయల్ వంశంలోకే వస్తారు. కావున ఈ లెక్కను ప్రతి ఒక్కరూ తమది తాము పరిశీలించుకోండి. ఇతరులను చూడకూడదు, మీ లెక్కను మీరు చూసుకోవాలి. ప్రతిఒక్కరూ ఏమి కోరుకుంటారు? రాయల్ వంశము, రాజ్యవంశంలోనే ఉండాలని కోరుకుంటారు. కావున ఇప్పుడు కూడా ఎంత సమయం లభిస్తుందో అంత సమయము అలా ఉండండి. ఎందుకంటే సమాప్తి అకస్మాత్తుగా జరుగనున్నది. కావున ఎప్పటివరకైతే సమాప్తి రానున్నదో అప్పటివరకు ఇప్పుడు కూడా పరిశీలించుకున్నట్లయితే ఎంత ఎక్కువ సమయము బాబా ఒడిలో హృదయ సింహాసనంపై, ఊయలలో ఉంటారో అంత సమయము రాజ్యకుటుంబంలో, రాజ్యవంశంలో భాగ్యమును పొందుతారు.

           బాప్ దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరికీ మొత్తం సమయమంతా, 21 జన్మలూ రాజ్యవంశంలో లేక సూర్యవంశము, చంద్రవంశములో రెండు యుగాలలోను రాయల్ ఫామిలీలో ఉండే అధికారమును ఇస్తున్నారు. కాని, అధికారమును తీసుకోవడము పిల్లలు ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది, కావున బ్రహ్మాబాబాకు కూడా పిల్లలైన మీపై ప్రేమ ఉంది. బ్రహ్మాబాబా పిల్లలైన మిమ్మల్ని కూడా తమతోపాటు రాజ్యవంశంలో చూడాలనుకుంటున్నారు. మీరేమి భావిస్తున్నారు- బ్రహ్మాబాబాకు సమీపంగా రాయల్ వంశంలో ఉండేవారా లేక కొద్ది సమయం ఉంటారా? ఆ తర్వాత దూరంగా అయితే వెళ్ళిపోవాలనుకోవడం లేదు కదా! సంగమయుగముదే ఆధారము అని వినిపించారు కదా! బాప్ దాదాకు పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది! మీతోడుగా ఉంటాము, తోడుగా వెళతాము అని అంటారు కదా! ఇప్పుడు బ్రహ్మాబాబా మరియు బ్రాహ్మణులు తోడుగా ఉన్నారు. అవ్యక్త రూపంలో ఉన్నాకాని తోడుగా ఉన్నారు.

           పిల్లలను మాయ కూడా ఇప్పటివరకు వదలడం లేదు, తనకు కూడా ప్రేమ ఉంది అని బాప్ దాదా గమనించారు మరియు ఈ మధ్య రెండు రూపాలలో విశేషంగా మాయ కూడా అవకాశాన్ని తీసుకుంటోంది. రెండు రూపాలలో వస్తూ ఉంటుంది. ఒకటేమో- వ్యర్థ సంకల్పాలు మరియు ఇంకొకటి అక్కడక్కడా అప్పుడప్పుడూ, నేను ఏదైతే చేశానో లేక ఆలోచించానో అదే రైటు, నేను తక్కువేమీ కాదు... అన్న అల కనిపిస్తోంది. నేనే రైటు అన్న అల వ్యాపించి ఉంది. కాని, ఎవరైతే సంబంధంలోకి వస్తారో లేక నిమిత్తమై ఉన్నారో వారు కూడా మీ ఆలోచనను అంగీకరిస్తున్నారా? ఇతరుల వెరిఫికేషన్ కూడా లభించాలి. ఈ వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వ్యర్థం చేస్తాయి. కావుననే బాప్ దాదా ప్రతిరోజూ మురళిని మననం చేసుకునేందుకు, సేవ చేసేందుకు హోంవర్క్ రూపంలో రోజూ ఇస్తారు. మననం చేయండి లేక మననం చేస్తూ చేస్తూ మగ్నమైపోండి. కావున ప్రతిరోజూ ఇచ్చే ఈ హోంవర్కు మనస్సును బిజీ చేసేందుకు సాధనము. వినడము మరియు మననం చేయడము లేక మగనమైపోవడము ప్రతిరోజూ ఈ హోంవర్క్ ను బాప్ దాదా అందుకే ఇస్తారు. ఏ విధంగా పిల్లలకు స్కూళ్ళలో ఎంత హోంవర్క్ ను ఇస్తారంటే, దానిద్వారా వారి బుద్ధి దానిని చేయడంలో బిజీగా ఉంటుంది. అలాగే రోజూ మురళిలో నాలుగు సబ్జెక్టుల హోంవర్క్ ఉంది. మనసుకు కూడా ఉంది, వాణికి కూడా ఉంది, కర్మలపై కూడా ధ్యానమివ్వవలసినవి ఉన్నాయి, అలాగే దివ్యతను కూర్చిన సూచనలు కూడా హోంవర్క్ లో ఉన్నాయి. కావున హోంవర్క్ లో బిజీగా ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు వచ్చే అవకాశం ఉండదు. ఈ విధిని ధారణ చేస్తూ ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు స్వతహాగానే మీ నుండి వీడ్కోలు తీసుకుంటాయి. ఎందుకంటే స్మృతియాత్రపై అందరికీ నెంబర్ వారీగా అటెన్షన్ ఉంది, వాచా సేవలో కూడా అటెన్షన్ ఉంది కానీ ఇప్పుడు తమ సంస్కారాలు లేక ఇతరుల సంస్కారాలను పరివర్తన చేయడంపై అటెన్షన్ కావాలి... ఈ స్వభావ సంస్కారాలను మీరు రాయల్ రూపంలో నేచర్ అని, నా నేచర్ అని అంటారు. భావం కాదు, నేచర్. ఈ ధారణ సబ్జెక్టు కూడా ఇప్పటివరకు రాయల్ రూపంలో వస్తూ ఉంటుంది. కావున బాప్ దాదా ఈ మధ్య ధారణలలో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఇప్పుడు విశేషంగా అటెన్షన్ ఇవ్వండి అని సూచనను ఇస్తున్నారు.

           బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. ఇప్పుడు ధారణలలో ఈ ముఖ్యధారణపై అటెన్షన్ ను ఇవ్వండి- ఏదైనా విషయము జరిగిపోతే క్షణములో ఫుల్ స్టాప్ ను దిద్దగలుగుతున్నారా లేక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నా ప్రశ్నార్థకం పెట్టేస్తున్నారా? ఫుల్ స్టాప్ కాకుండా సగం స్టాపవుతోందా? లేక ఇంకే చిహ్నముగానైనా మారిపోతోందా? అని పరిశీలించుకోండి. ముందు ముందు ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే మీరు క్షణంలో ఫుల్ స్టాప్ దిద్దవలసి ఉంటుంది. ఆ సమయంలో ప్రశ్నార్థకాలను, ఆశ్చర్యార్థకాలను సరిదిద్దేందుకు ప్రయత్నించే సమయం దొరకదు. క్షణంలో ఫుల్ స్టాప్ ను దిద్దవలసిన అవసరం ఉంటుంది. దీని అభ్యాసము చాలా సమయం ముందు నుండే కావాలి, అప్పుడే సమయానికి విజయులుగా అవ్వగలుగుతారు. కావున అలజడి సమయంలో ఎప్పుడైతే సంస్కారాల, స్వభావాల పరీక్షలు వస్తాయో ఆ సమయం కొరకు ఇప్పటినుండే అభ్యాసము చేసినట్లయితే బహుకాలపు అభ్యాసము ముందు ముందు మీకు ఎంతో సహయోగిగా అవుతుంది.

           కావున బాప్ దాదా అమృతవేళ విహరిస్తూ, ప్రతిఒక్కరి పురుషార్థమును పరిశీలిస్తారు, నాలుగు సబ్జెక్టులలోనూ పురుషార్థము తీవ్రంగా ఉందా లేక సాధారణంగా ఉందా అని పరిశీలిస్తారు. అప్పుడు వారు ఏంచూశారు? సమయపు వేగము అనుసారంగా ఇప్పుడు పురుషార్థంలో సదా తీవ్ర పురుషార్థపు అవసరం ఉంది. సమయము ఇప్పుడు తీవ్రగతితో సామీప్యతకు సమీపంగా వస్తోంది, ఆ లెక్కతో చూస్తే ఇప్పుడు విశేష స్వభావము మరియు సంస్కార పరివర్తనలో తీవ్రగతి కావాలి.

           ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరినీ సమానంగా తయారుచేయాలనుకుంటున్నారు. బాబా సమానంగా అవ్వడం మీ లక్ష్యము కూడా కదా! దీనికొరకు అన్నింటికన్నా సహజ సాధనము- బ్రహ్మాబాబాను అనుసరించండి, పోల్చిచూడండి. ఏ కర్మ చేసినా మొదట పోల్చిచూడండి, కలిపి చూడండి. ఈ కర్మలు లేక మాటలు లేక సంకల్పాలు బ్రహ్మాబాబా సమానంగా ఉన్నాయా? మొదట ఆలోచించండి ఆ తర్వాత చేయండి, మాట్లాడే ముందు తూచి తూచి మాట్లాడండి అని కూడా అంటారు కదా! కావున ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారో విన్నారా, మీరు కూడా కోరుకుంటారు కదా! ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలా మధురాతి మధురమైన మాటలను బాప్ దాదా వింటూ ఉంటారు. ఇది చేసి చూపిస్తాము, ఇది చేయవలసిందే, ఇది జరగవలసిందే... అంటూ ఉత్సాహపు మాటలను కూడా ఎన్నో వినిపిస్తారు. చాలా ఉత్సాహంతో కూడిన మాటలు ఉంటాయి. కాని, కర్మవరకు రావడంలో కొన్ని మారిపోతాయి, కొన్ని జరుగుతాయి. బాప్ దాదా భిన్న భిన్న రకాల సేవా ప్లాన్లనేవైతే తయారుచేస్తారో వాటన్నింటినీ ఇష్టపడతారు. కార్యక్రమాలు కూడా అన్నిచోట్లా బాగా జరుగుతున్నాయి. కాని ఇప్పుడు వాచా ద్వారా భిన్న భిన్న విధుల ద్వారా ఏదైతే చేస్తున్నారో, సఫలత కూడా లభిస్తుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు కూడా, కాని ఇప్పుడు కేవలం మనసా ద్వారా అనేక ఆత్మలకు సుఖపు కిరణాలను, శాంతి కిరణాలను, సంతోషపు కిరణాలను, ప్రేమ కిరణాలను చేర్చాలి. ఈ సేవను ఇప్పుడు దానితోపాటు చేయండి. మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవడం లేక ఇతరుల సంస్కారాలకు సహయోగమునివ్వడము... ఇందులో చాలామంది సమయం ఎక్కువగా పోతోంది. కావున మనసా సేవ ద్వారా భిన్న భిన్న కిరణాలను ఆత్మలకు ఇవ్వండి. దీని అటెన్షన్ ముందు ముందు ఎంతో అవసరమవుతుంది. దీనిపై కూడా ధ్యానమునిస్తూ ఉండండి. ఈ సేవను మేము చేస్తూ ఉన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అచ్చా! చేస్తున్నారు, వారికి అభినందనలు. కాని, ఎవరైతే చేయడం లేదో వారు చేయాలి, ఎందుకంటే ముందు ముందు పరిస్థితులు ఎలా తయారవుతాయంటే వినేవారు, వినిపించేవారు ఇరువురూ కలుసుకోవడమే కష్టమైపోతుంది. కావున ఈ రెండు సేవలను ఇప్పటినుండే ఎంత వీలైతే అంత అలవాటు చేసుకోండి. తద్వారా మనస్సు బిజీగా కూడా ఉంటుంది మరియు మన్మనాభవగా అవ్వడం సహజమైపోతుంది. మనస్సు బిజీగా ఉండడం ద్వారా సంస్కారాలకు, స్వభావాలకు పరివర్తన అవ్వడంలో సహాయం లభిస్తుంది.

           ఈరోజు విశేషంగా డబుల్ విదేశీయులను కలుసుకునే రోజు. ఓహో డబుల్ విదేశీయులు, ఓహో అని బాప్ దాదాకు సంతోషంగా ఉంది. విశ్వంలోని మూలమూలలలో ఉన్న బాబా యొక్క కల్పపూర్వపు పిల్లలెవరైతే దాగి ఉన్నారో వారి విశ్వసేవలో డబుల్ విదేశీయులు నిమిత్తులయ్యారు. మరి ప్రతి ఒక్కరూ తమ తమ స్థానంలో, గ్రామ గ్రామాలలో లేక నగరాలలో ఎవరైతే మిగిలి ఉన్నారో వారిని చేరుకునే ప్లానును తయారు చేస్తూ ఉన్నారని బాప్ దాదా విన్నారు. అందుకు అభినందనలు, అభినందనలు. లేకపోతే సమాప్తి జరిగినప్పుడు, పరిస్థితులు మారేటప్పుడు భారతదేశంవారికైనా లేక విదేశంవారికైనా మా తండ్రి వచ్చారు. కాని మీరు మాకు తెలియజేయను కూడా తెలియజేయలేదు అని ఫిర్యాదులు వస్తాయి. సందేశమునైతే ఇస్తారు, కాని ఎన్నో ఫిర్యాదులు వారు చేస్తారు. కావున ఇప్పుడే చేస్తున్నారు. ఇంకేమూలా మిగిలిపోకుండా ప్రయత్నం చేయండి. డబుల్ విదేశీయులు లేక దేశంవారు, ఇద్దరు పిల్లలూ ఎవరైతే నలువైపులా తమ పురుషార్థం చేస్తున్నారో వారిని చూసి బాప్ దాదా ఎంతో సంతోషిస్తున్నారు, చాలా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకు? ఎందుకు సంతోషిస్తున్నారు. ఇప్పుడు దేశంలోను, విదేశంలోను ఈ ప్లానును తయారుచేస్తున్నారు. ఇది బాప్ దాదాకు నచ్చింది. ఏ సాధనము ద్వారానైనా సందేశము చేరుకోవాలి. వాస్తవానికి ఈ సైన్సు మీకు సమయానికి చాలా చాలా సహాయం చేస్తుంది. సాధనాలు దిన ప్రతిదినము క్రొత్త క్రొత్తవి వెలువడుతూ ఉంటాయి. వాటిని నిర్విఘ్నులుగా అయి కార్యములో వినియోగిస్తూ ఉండండి. సేవను పెంచేందుకు ఎక్కడెక్కడైతే మీరు మీటింగులు చేస్తారో వాటిని చూసి బాబా పిల్లల బుద్ధి ఇప్పుడు ఆల్ రౌండ్ గా వెళుతోంది అని, సాధనాలను సేవలో వినియోగించేందుకు పిల్లల బుద్ధి అల్ రౌండ్ గా వెళుతోంది అని సంతోషిస్తారు. కావున మీరు ఏ ప్లానులనైతే తయారుచేస్తారో వాటిని బాప్ దాదా వింటారు. అందరినీ చుట్టివస్తారు కదా! మీరు ఎక్కడైనా మీటింగు చేయండి, ఢిల్లీలో చేయండి, దేశంలో చేయండి. ఏ నగరంలోనైనా చేయండి, లేక విదేశంలోనైనా లేక ఎక్కడైనా చేయండి, బాప్ దాదా అన్నీ వింటూ ఉంటారు! బాప్ దాదా వద్ద కూడా సాధనాలు ఉన్నాయి. కావున బాప్ దాదా విదేశాల నుండి, ఒక్కొక్క దేశం నుండి ఎవరెవరైతే వచ్చారో ఆ ప్రతి ఒక్కరికీ ఏమిస్తారు? చాలా చాలా ప్రేమను ఇస్తున్నారు. కేవలం ఇప్పుడు ఇంకొద్ది తీవ్రతను తీసుకురండి. ప్లానును ప్రాక్టికల్ లోకి, క్రొత్త క్రొత్త విషయాలలోకి తీసుకువస్తూ ఉండండి. ఈ ఇన్వెన్షన్ లన్నీ  మీ యజ్ఞము ప్రారంభమయ్యే కొద్ది సంవత్సరాల ముందే జరిగాయి. విజ్ఞానం కూడా మీ సేవలో సహాయకారిగా ఉంది. దాన్ని బాగా ఉపయోగించుకోండి. ఇవన్నీ మీకొరకే వెలువడ్డాయి. దినప్రతిదినము ఎన్ని క్రొత్త క్రొత్త విషయాలు ఇప్పటికీ వెలువడుతున్నాయో చూడండి. ఈ డ్రామా మీకు సహయోగాన్ని అందిస్తోంది. సాధనాలు మీకు సహయోగమునిస్తున్నాయి. అచ్ఛా!

           సదా అందరూ సంతోషముగా ఉన్నారు కదా! సదా సంతోషంగా ఉన్నారా? ఎవరైతే సదా సంతోషంగా ఉంటున్నారో వారు చేతులెత్తండి. సదా సంతోషంగా ఉన్నారా? ఏదైనా విషయం జరిగినా కూడా సంతోషంగా ఉంటున్నారా? విషయాలైతే వస్తూ ఉంటాయి కదా! అయినా సంతోషంగా ఉంటున్నారా, ఉంటున్నారా? చేతులు పెద్దగా ఎత్తండి, వాటిని ఆహ్వానిస్తారు కదా! వ్యాకులత చెందరు, స్వాగతం పలుకుతారు, అనుభవజ్ఞులుగా అవుతారు. ఈ విఘ్నాలు అనుభవాల అథారిటీని పెంచుతాయి. మాయ వచ్చేసింది, మాయ వచ్చేసింది అని అనకండి, ఇది పరీక్ష మాయ, మాయ అంటూ మాయను ముందుకు తీసుకువెళతారు! ఇది పరీక్ష మాయనైతే మీరు తెలుసుకున్నారు. ఎన్ని సంవత్సరాలుగా తెలుసుకున్నారు! అసలు మాయ ఏమిటి? కావున మాయను చూసి భయపడకండి. పరీక్షలుగా భావిస్తూ సంతోషంగా ఈ పరీక్షలు వ్రాయండి మరియు అనుభవం యొక్క క్లాసులో ముందుకు వెళ్ళండి. ఈ క్లాసు ముందుకు తీసుకువెళ్ళాలి. ఏమి చేయను, ఎలా చేయను, ఎందుకు, ఏమిటి అని తికమకపడకూడదు. ఇది బ్రాహ్మణులు ఆలోచించవలసిన పనికాదు. మీరు త్రికాలదర్శులు. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. పరీక్ష రాగానే అనుభవం యొక్క క్లాసులో ముందుకు వెళ్ళండి, సంతోషంగా ఉండండి. ఇప్పుడైతే అనుభవజ్ఞులుగా అయిపోయారు మరియు ఇంకా అవుతూ ఉంటారు. అచ్ఛా!

           విదేశపు టీచర్లు చేతులెత్తండి, అందరూ ఎవరెవరైతే నిమిత్తులుగా అయ్యారో అందరినీ బాప్ దాదా- టీచర్లు అనగా బాబా సమానమైనవారు అని అంటారు. ఎందుకంటే బాబా ఏవిధముగా రోజూ మురళి వినిపిస్తూ ఉంటారో అలా మీరు కూడా మురళి వినిపించేందుకు సింహాసనాధికారులుగా ఉన్నారు. కావున బాబాకు సహచరులుగా ఉన్నారు. కావున సహచరుల స్వరూపంలో బాప్ దాదా టీచర్లయిన మీ అందరికీ భారతదేశంవారైనా లేక విదేశంవారైనా టీచర్లందరికీ విశేషంగా ఏమిస్తున్నారు? శభాష్ పిల్లలూ, శభాష్, అచ్ఛా! ఇప్పుడు ఎవరెవరైతే ఈ హాలులో కూర్చున్నారో మీరు ఎక్కడివారైనా కాని, మళ్ళీ మధువనానికి వచ్చేటప్పుడు, బాప్ దాదాతో కలుసుకునేటప్పుడు బావ్ దాదా మీలో ఏమి చూడాలనుకుంటున్నారు? చెప్పమంటారా? పురుషార్థంలో ఏదో ఒకటి, దేనినైతే ఇది ఉండకూడదు అని స్వయం భావిస్తారో, ఇది ఉండకూడదు అని అందరూ భావిస్తారు, దానిని పరివర్తన చేసి రండి. అలా చేస్తారా? ఈ విధంగా మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎందుకంటే ఇతరులెవ్వరూ చూడలేరు. కావున ఇది చేసేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు? రెండు చేతులూ ఎత్తండి. బిందువును దిద్దేసారు కదా! అయితే బాప్ దాదా వారికి చిన్నదైనా లేక పెద్దదైనా ఒక కానుకను ఇస్తారు. పరివర్తన సెరిమనీని జరుపుతారు. మీకు ఇష్టమేనా? మీ మీ క్లాసులవారికి కూడా చెప్పండి. ఎంత పరివర్తన చేస్తే అంత మంచిది. సమయాన్ని సమీపంగా తీసుకువస్తారు. అచ్ఛా!

80 దేశాల నుండి 2,200 మంది డబుల్ విదేశీయులు వచ్చారు. కావున బాప్ దాదా పిల్లలు ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ప్రేమతో కూడిన కానుకను ఇస్తున్నారు. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు లేవండి. మీ అందరికీ మీ ఆధ్యాత్మిక జన్మదినమునకు అభినందనలు, అభినందనలు. ఎందుకంటే మీరందరూ పరివారానికి శోభ, సింగారము. కావుననే బాప్ దాదా- ఆలస్యంగా వచ్చినా కాని టూ లేట్ అవ్వకముందే వచ్చేసారు, అందుకు ఈ విశేష పరివారానికి మీరు రావడం ఎంతో సంతోషంగా ఉంది అని అంటారు. వచ్చేసారు, మా తప్పిపోయిన పరివారపు సభ్యులు వచ్చేసారు! ఇప్పుడు సమయానుసారంగా మీరు తీవ్ర పురుషార్థము చేయాలి, స్లో పురుషార్థము, డీలా పురుషార్థము కాదు. తీవ్ర పురుషార్థము చేసినట్లయితే లాస్ట్ నుండి ఫాస్ట్ గా, ఫాస్ట్ నుండి ఫస్ట్ వచ్చేయగలరు, చేస్తారు కదా! అచ్ఛా! పరివారం తరఫు నుండి బాప్ దాదాల తరఫు నుండి చాలా, చాలా, చాలా ప్రియస్మృతులు తీసుకుంటూ ఉండండి మరియు ముందుకు వెళుతూ ఉండండి. అచ్ఛా!

మీడియావారితో:- బాగుంది, మీడియా ఒక సాధనము, సాధనాలను సేవలో వినియోగించడం మీ పని. మంచిగా మీటింగ్ జరిపారని బాప్ దాదా విన్నారు. మీడియా ద్వారా మూలమూలలవరకు సందేశము చేరుకోవాలని బాప్ దాదా కూడా కోరుకుంటున్నారు. ఫిర్యాదులు రాకూడదు. మంచిగా చేశారు. మంచిగా చేస్తూ ఉంటారు మరియు నలువైపులా ఆత్మలకు తమ తండ్రి సందేశము లభిస్తూ ఉంటుంది. ఏయే కార్యక్రమాలనైతే నడుపుతున్నారో బాప్ దాదా గమనించారు. ఇతడు కూడా కార్యక్రమాన్ని నడుపుతున్నాడు కదా! (నిజార్ భాయ్). ఇది కూడా బాగుంది, మరియు ఈ మధ్య వివిధ స్థానాలలో భవిష్యత్తు యొక్క సందేశమును ఇచ్చే కార్యక్రమాలనేవైతే జరుపుతున్నారో అవి కూడా బాగా జరుగుతున్నాయి. రిజల్టు ఎంతో కొంత వెలువడుతోంది, అభినందనలు. అచ్చా!

           ఉత్తరాలు, ఫోన్లు, ఎవరెవరి ప్రియస్మృతులు లేక సందేశాలైతే బాప్ దాదా వద్దకు వచ్చాయో ఆ పిల్లలందరినీ బాప్ దాదా తమ నయనాలలో ఇముడ్చుకుంటూ ప్రియస్మృతులను లేక సేవా సమాచారాన్ని లేక మనస్సు యొక్క పురుషార్థపు సమాచారాన్ని ఏదైతే ఇచ్చారో వారందరినీ బాప్ దాదా మనసా ద్వారా ఎమర్జ్ చేసుకొని సుఖము, శాంతి, సంతోషముల కిరణాలను ఇస్తున్నారు. ఎవరైనా ఇక్కడకు పంపకపోయినా తమ హృదయాలలో కూడా సంకల్పం చేసుకున్నా ఆ సంకల్పాలు కూడా బాబా వద్దకు చేరుకున్నాయి.

           నలువైపులా ఉన్న, ధైర్యమును ఉంచి బాబా సహాయమును పొందే మధురాతి మధురమైన పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులను తెలుపుతున్నారు మరియు ఈ సంవత్సరం స్వయముకోసం లేక సేవాకేంద్రం కోసం లేక విశ్వంలోని ఆత్మలకోసం ఏదో ఒక ప్లానును ఎటువంటి దానిని తయారుచేయాలంటే, సేవా బలము మరియు ఫలము సర్వాత్మలకు ప్రాప్తమవ్వాలి. నలువైపులా ఉన్న పిల్లలు బాప్ దాదాల విశేష హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు ప్రేమను స్వీకరించండి. ఓం శాంతి.

మున్నీ బెహన్ తో:- బాగుంది, ఈ జన్మదినాన్ని సేవ కొరకు జరుపుకున్నావు, సేవకు రిటర్న్ అన్నివైపుల నుండి సేవ యొక్క బలము మరియు సేవ యొక్క ఫలంగా లభిస్తూ ఉంటుంది. ఇప్పుడిక సమాప్తంచేయి, ఇక చాలు, బాగా జరుపుకున్నావు.

జానకి దాదీతో:- బాబా నాట్యం చేయిస్తున్నారు మరియు నీవు నాట్యం చేస్తున్నావు, సమయానికైతే లేపుతున్నారు కదా!

మోహినీ బెహన్ తో:- ప్రతి ఒక్కరూ చాలా చాలా బాగున్నారు (బాబా, ఈ శరీరపు లెక్కాచారం ఎప్పటివరకు?) త్వరత్వరగా తీరిపోతోంది, ఇక తీరిపోతుంది, కొద్దిగా సమయం పడుతుంది, గతకాలపు లెక్క కదా! అది ఇప్పటిది కాదు, గతానికి సంబంధించినది. గతించినదానిని వెనుక వదులుతూ వెళతారు.

దాదీలతో:- అందరూ మహారథులు. మంచిగా ఉన్నారు, ఇంకా మంచిగా ఉంటారు. 
         
రుక్మిణి దాదీతో(తానూ దాదీయే):- అవును ప్రారంభం నుండి ఉంది, నిమిత్తంగా ఉంది. 
       
పరదాదీతో:- బాగుంది, అందరిముందూ లెక్కాపత్రాలను సంతోషంగా తీర్చుకోవడంలో శాంపుల్ గా ఉన్నావు, రోగగ్రస్థంగా లేవు, శాంపుల్ గా ఉన్నావు. మిమ్మల్ని చూసి అందరూ ధైర్యవంతులైపోతారు, నీవు శాంపుల్ గా ఉన్నావు.

రమేష్ భాయితో :- ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని సంభాళించుకోవాలి, అలా నడిపించివేయకు, కొద్దిగా ధ్యానమునిచ్చి, సమయాన్ని కేటాయించి కూడా ఆరోగ్యాన్ని సరిచేసుకో. చాలా పరుగులు తీసావు కదా, కొద్దిగా విశ్రాంతిగా ఆరోగ్యాన్ని సరిచేసుకో, పనిలో ముందుకు వెళ్ళాలి, ముందు ముందు బాధ్యతలు తీసుకోవాలి, యజ్ఞాన్ని నడిపించాలి, కావున శరీరాన్ని సరిచేసుకో, విశేష ధ్యానమును ఉంచు, ఈ శరీరమైతే పాతది కదా! (నిర్వేర్ భాయ్) ఇతడు కూడా ధ్యానమును ఉంచుతున్నాడు, ధ్యానమునుంచాలి, కాని సేవలో ఎటువంటి లోటును రానివ్వకూడదు. ప్రోగ్రామ్ ను అలా తయారుచేసుకోవాలి. బాగున్నావా (బ్రిజ్ మోహన్ భాయ్ తో) ముగ్గురూ నిమిత్తులుగా ఉన్నారు, ముగ్గురూ నిమిత్తులే. స్వయమును బాధ్యత కలవారిగా భావిస్తున్నారు కదా! (రమేష్ భాయ్ తో) పరీక్షను ఎదుర్కోన్నావు, అందుకు అభినందనలు, చాలా బాగా దాటివేశావు.

డబుల్ విదేశీయులైన అక్కయ్యలు, అన్నయ్యలు బాప్ దాదాకు పుష్పగుచ్చితాన్ని మరియు మాలను సమర్పించారు. మీరు ఇక్కడివారే కావున ఇక్కడికే వచ్చి చేరుకున్నారు. చాలా బాగుంది. మంచి పాత్రను పోషించారు. అందరూ తమ తమ పాత్రలను పోషిస్తున్నారు. అచ్ఛా!

విదేశపు పెద్ద అక్కయ్యలతో:- ఈ గ్రూప్ కూడా బాగుంది, నిమిత్తంగా అయి ఒకరికొకరు సహయోగమునిస్తూ ముందుకు వెళుతున్నారు. భారతదేశానికి చెందిన పక్కా ఆత్మలు కదా! అనుభవజ్ఞులుగా ఉన్నారు, కావున నిమిత్తులుగా అయ్యారు. నిర్విఘ్నంగా నడుస్తోంది కదా! ఎటువంటి కష్టము లేదు కదా! సెట్ అయిపోయారు. నియమ నిబంధనలలో కూడా సెట్ అయిపోయారు. (చక్రధారి అక్కయ్యతో) తనది కూడా నడుస్తోంది, చాలా బాగుంది. భారతదేశంవారైనా కాని మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మిక్సయిపోయారు. భారతదేశానికి మరియు విదేశానికి తేడా లేదు, ఇది బాగుంది. భారతదేశపు అనుభవజ్ఞులుగా ఉన్న కారణంగా హాండ్లింగ్ కూడా మంచిగా లభిస్తుంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు. (భారతదేశంలో కూడా సేవకు అవకాశాలు లభిస్తున్నాయి). అవకాశాలు లభిస్తాయి, విషయం ఒక్కటే, ఎక్కడైనా సేవ చేయండి, బాప్ దాదా సంతోషిస్తున్నారు! ముందుకు వెళుతున్నారు, గ్రామ గ్రామాలలో మీరు ఏదైతే ముందుకు వెళుతున్నారో అది చాలా బాగుంది. ఎక్కడైతే సెంటర్లు లేవో అక్కడ సెంటర్లను లేక ఏదో ఒకవిధంగానైనా సందేశమును చేర్చండి.

Comments