22-03-1986 అవ్యక్త మురళి

22-03-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సుఖము, శాంతి మరియు సంతోషములకు ఆధారము - పవిత్రత”

ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ హోలీనెస్ మరియు హ్యాపీనెస్ (పవిత్రత, సంతోషము కల) పిల్లలందరినీ చూస్తున్నారు. ఇంత పెద్ద సంగఠిత రూపంలో హోలీ మరియు హ్యాపీ, ఈ రెండు విశేషతలు కలవారు, ఈ మొత్తము డ్రామాలో ఇంత పెద్ద సభగానీ లేక ఇంత పెద్ద సంఖ్యగానీ మరేదీ ఉండడం జరగదు. ఈరోజుల్లో ఎవరికైనా హైనెస్ (ఉన్నతత్వము) మరియు హోలీనెస్ అన్న టైటిల్ ను ఇస్తారు కూడా కానీ ప్రత్యక్ష ప్రమాణ రూపంలో చూసినట్లయితే ఆ పవిత్రత, మహానతలు కనిపించవు. ఇంతమంది మహాన్ పవిత్ర ఆత్మల సంగఠన ఇంకెక్కడైనా ఉండగలదా అన్నదానిని బాప్ దాదా చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో కేవలము కర్మల ద్వారానే కాకుండా మనసు-వాణి-కర్మలు, మూడింటిలోనూ పవిత్రంగా అవ్వవలసిందే అన్న ఈ దృఢ సంకల్పము ఉంది. ఇలా పవిత్రంగా అవ్వాలి అనేటటువంటి శ్రేష్ఠ దృఢ సంకల్పము బయట మరెక్కడా ఉండదు. అవినాశీగా ఉండదు, సహజంగా ఉండదు. మరి మీరందరూ పవిత్రతను ధారణ చెయ్యటాన్ని ఎంత సహజంగా భావిస్తారు. ఎందుకంటే బాప్ దాదా ద్వారా జ్ఞానము లభించింది మరియు జ్ఞానము యొక్క శక్తితో ఆత్మనైన నా అనాది మరియు ఆది స్వరూపము ఉన్నదే పవిత్రత అన్నదానిని తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఆది, అనాది స్వరూపపు స్మృతి వచ్చిందో, ఆ స్మృతి సమర్థంగా చేసి సహజ అనుభవాన్ని చేయిస్తూ ఉంది. మా వాస్తవిక స్వరూపము పవిత్రత అని తెలుసుకున్నారు. సాంగత్యదోషపు స్వరూపము అపవిత్రత. కనుక వాస్తవికతను అలవరచుకోవడం సహజమైపోయింది కదా.

స్వ ధర్మము, స్వ దేశము, స్వయము యొక్క తండ్రి మరియు స్వ స్వరూపము, స్వ కర్మ అన్నిటి జ్ఞానము లభించింది. కనుక జ్ఞానము యొక్క శక్తి ద్వారా కష్టమనేది అతి సహజమైపోయింది. ఈరోజుల్లో మహానాత్మలుగా పిలవబడేవారు ఏ విషయాన్ని అయితే అసంభవము అని భావిస్తారో, అసహజము అని భావిస్తారో, ఆ అసంభవాన్ని పవిత్ర ఆత్మలైన మీరు ఎంత సహజంగా అనుభవం చేసారు. పవిత్రతను అలవరచుకోవడం సహజమా లేక కష్టమా? పవిత్రత మా స్వ స్వరూపము అని మొత్తం విశ్వం ముందు ఛాలెంజ్ చేసి చెప్పగలరు. పవిత్రతా శక్తి కారణంగా ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, అక్కడ సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటాయి. పవిత్రత పునాది. పవిత్రతను తల్లి అని అంటారు. మరియు సుఖము, శాంతి అన్నవి పవిత్రతకు పిల్లలు. కనుక ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, అక్కడ సుఖము, శాంతి స్వతహాగా ఉండనే ఉంటాయి కనుక హ్యాపీగా కూడా ఉంటారు. ఎప్పుడూ ఉదాసీనులుగా కాలేరు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారిగా ఉంటారు. ఎక్కడైతే హోలీ (పవిత్రత) ఉంటుందో అక్కడ హ్యాపీ (సంతోషము) కూడా తప్పకుండా ఉంటుంది. పవిత్ర ఆత్మల లక్షణము సదా సంతోషముగా ఉండటము. కావున ఎంత నిశ్చయబుద్ధి కల పవిత్ర ఆత్మలు కూర్చుని ఉన్నారు అని బాప్ దాదా చూస్తున్నారు. ప్రపంచములోనివారు సుఖశాంతుల వెనుక పరుగులు తీస్తున్నారు. కానీ సుఖశాంతులకు పునాదియే పవిత్రత. ఆ పునాది గురించి తెలియదు కనుక, పవిత్రతా పునాది దృఢంగా లేని కారణంగా, అల్పకాలము కొరకైతే సుఖము మరియు శాంతి ప్రాప్తిస్తుంది, కానీ ఇప్పుడిప్పుడే ఉంటుంది, ఇప్పుడిప్పుడే ఉండదు. కానీ సదాకాలపు సుఖ శాంతుల ప్రాప్తి పవిత్రత లేకుండా అసంభవము. మీరు పునాదిని తమదిగా చేసుకున్నారు కనుక సుఖశాంతుల కొరకు పరుగులు పెట్టాల్సిన అవసరము ఉండదు. పవిత్ర ఆత్మల వద్దకు సుఖ శాంతులు వాటంతటవే స్వతహాగా వస్తాయి. పిల్లలు తల్లి వద్దకు స్వతహాగానే వెళ్తారు కదా! ఎంతగా వారిని వేరు చేసినా మళ్ళీ తల్లి వద్దకు తప్పకుండా వెళ్తారు. మరి సుఖ శాంతులకు జనని పవిత్రత. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, అక్కడకు సుఖము, శాంతి, సంతోషములు స్వతహాగానే వస్తాయి. అప్పుడు మీరు ఎవరిగా అయ్యారు? నిశ్చింతపురి చక్రవర్తి. ఈ పాత ప్రపంచపు చక్రవర్తి కాదు, కానీ నిశ్చింతపురికి చక్రవర్తి. ఈ బ్రాహ్మణ పరివారము నిశ్చింతపురి అనగా సుఖపు ప్రపంచము. కనుక ఈ సుఖ ప్రపంచపు నిశ్చింతపురి చక్రవర్తిగా అయ్యారు. హిజ్ హోలీనెస్ (మహాశయులు) కూడా కదా. కిరీటము కూడా ఉంది, సింహాసనము కూడా ఉంది. ఇంకేమి తక్కువ ఉంది! ఎంత గొప్ప కిరీటము! ప్రకాశ కిరీటము పవిత్రతకు గుర్తు. మరియు బాప్ దాదా హృదయ సింహాసనాధికారులు. మరి నిశ్చింతపురి చక్రవర్తుల కిరీటము కూడా అతీతమైనది మరియు సింహాసనము కూడా అతీతమైనది. రాజ్యము కూడా అతీతముగా ఉంది కావున చక్రవర్తులైన మీరు కూడా అతీతముగా ఉన్నారు.

ఇంతగా పరుగులు పెడుతున్న నేటి మనుష్యాత్మలను చూసి బాప్ దాదాకు పిల్లలపై జాలి కలుగుతుంది. ఎంత ప్రయత్నం చేస్తుంటారు! ప్రయత్నము అనగా పరుగులు పెట్టడము, కష్టపడటము కూడా ఎక్కువగా చేస్తుంటారు కానీ ప్రాప్తి ఏమిటి? సుఖము ఉన్నా సుఖముతోపాటు ఏదో ఒక దుఃఖము కూడా కలిసి ఉంటుంది. వేరే ఏమీ లేకపోయినా నేటి సుఖముతోపాటు చింత మరియు భయం, ఈ రెండూ అయితే ఉండనే ఉన్నాయి. ఎక్కడైతే చింత ఉంటుందో, అక్కడ ప్రశాంతత ఉండదు. ఎక్కడైతే భయం ఉంటుందో, అక్కడ శాంతి ఉండదు. కనుక సుఖముతోపాటుగా ఈ దుఃఖము, అశాంతులకు గల కారణాలు ఉండనే ఉన్నాయి. మీ అందరికీ దుఃఖానికి కారణము మరియు నివారణ లభించాయి. ఇప్పుడు మీరు సమస్యలకు సమాధానమును ఇచ్చే సమాధాన స్వరూపులుగా అయ్యారు కదా. మీతో ఆడుకునేందుకు సమస్యలు ఆటబొమ్మలుగా అయ్యి వస్తాయి. ఆడుకునేందుకు వస్తాయి కానీ భయపెట్టేందుకు కాదు. గాభరాపడేవారైతే కాదు కదా. ఎక్కడైతే సర్వ శక్తుల ఖజానా జన్మసిద్ధ అధికారంగా అయిపోయిందో, అక్కడ ఇక ఏమి లోటు ఉంది? నిండుగా ఉన్నారు కదా. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు సమస్య అన్నదే లేదు. ఏనుగు కాలి కిందకు ఒకవేళ చీమ వచ్చినట్లయితే అది కనిపిస్తుందా? మరి ఈ సమస్యలు కూడా మహారథులైన మీ ముందు చీమ సమానమైనవి. ఆట అని అనుకుంటే సంతోషం ఉంటుంది, ఎంత పెద్ద విషయమైనా చిన్నదైపోతుంది. ఈరోజుల్లో పిల్లలకు ఎటువంటి ఆటలను ఆడిస్తున్నారు, బుద్ధికి సంబంధించినవి ఆడిస్తున్నారు. మామూలుగా పిల్లలను లెక్కలు చేయండి అని అంటే విసుక్కుంటారు, కానీ ఆటలా చేయిస్తే ఎంతో సంతోషంగా చేస్తారు. మరి మీ అందరికీ కూడా సమస్యనేది చీమ సమానమైనది కదా. ఎక్కడైతే పవిత్రత, సుఖ శాంతుల శక్తి ఉంటుందో, అక్కడ స్వప్నములో కూడా దుఃఖము, అశాంతుల అల రాలేదు. ఈ దుఃఖము, అశాంతి, శక్తిశాలీ ఆత్మల ముందుకు రావటానికి ధైర్యము చేయలేవు. పవిత్ర ఆత్మలు సదా హర్షితంగా ఉండే ఆత్మలు, ఇది ఎల్లప్పుడూ స్మృతిలో పెట్టుకోండి. అనేకరకాల సమస్యల నుండి, భ్రమించటం నుండి, దుఃఖ అశాంతుల వల నుండి బయటపడి వచ్చారు, ఎందుకంటే దుఃఖమనేది కేవలము ఒక్కటి రాదు. ఒక్క దుఃఖము వచ్చినాసరే, అది వంశ సహితంగా వస్తుంది. కనుక ఆ వల నుండి బయటపడి వచ్చారు. ఇలా మిమ్మల్ని మీరు భాగ్యవంతులుగా భావిస్తారు కదా!

ఈరోజు ఆస్ట్రేలియావారు కూర్చుని ఉన్నారు. బాప్ దాదా ఎల్లప్పుడూ ఆస్ట్రేలియావారి సదాకాలపు తపస్య మరియు మహాదానీతనము యొక్క విశేషతలను వర్ణిస్తారు. సదా సేవ పట్ల తపన అనే తపస్య అనేక ఆత్మలకు మరియు తపస్వీ ఆత్మలైన మీకు ఫలాన్ని ఇస్తూ ఉంది. ధరణి ప్రమాణంగా విధి మరియు వృద్ధి, రెండింటినీ చూసి బాప్ దాదాకు ఎక్స్ ట్రా సంతోషం ఉంటుంది. ఆస్ట్రేలియా ఉన్నదే ఎక్స్ ట్రా ఆర్డినరీ. త్యాగ భావన, సేవ కొరకు అందరిలోనూ చాలా త్వరగా ఈ భావన వస్తుంది, కనుకనే ఇన్ని సెంటర్లను తెరిచారు. మనకు ఏవిధంగా భాగ్యము లభించిందో, అలా ఇతరుల భాగ్యమును తయారుచెయ్యాలి. దృఢ సంకల్పము చెయ్యటమే తపస్య. కనుక త్యాగము మరియు తపస్యల విధితో వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. సేవాభావము అనేక హద్దు భావాలను సమాప్తము చేసేస్తుంది. ఈ త్యాగము మరియు తపస్యయే సఫలతకు ఆధారంగా అయ్యాయి, అర్థమైందా! సంగఠనకు శక్తి ఉంది. ఒకరు చెప్పారు - మరొకరు చేసారు. ఒకరు చెప్తే మరొకరు ఇది సాధ్యం కాదు అని చెప్పటము, ఇలా ఉండకూడదు. ఇందులో సంగఠన విడిపోతుంది. ఒకరు చెప్పారు, మరొకరు ఉల్లాసముతో సహయోగిగా అయ్యి ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చారు. ఇదే సంగఠన శక్తి. పాండవుల సంగఠన కూడా ఉంది, ఎప్పుడూ నువ్వు, నేను అని అనవద్దు. కేవలం బాబా-బాబా అని అన్నట్లయితే అన్ని విషయాలు సమాప్తమైపోతాయి. నువ్వు-నేను, నాది-నీది అన్నదానిలోనే ఘర్షణ కలుగుతుంది. బాబాను ఎదురుగా ఉంచుకున్నట్లయితే ఏ సమస్యా రాలేదు మరియు సదా నిర్విఘ్న ఆత్మలు తీవ్ర పురుషార్థము ద్వారా ఎగిరేకళను అనుభవము చేస్తారు. బహుకాలపు నిర్విఘ్న స్థితి, దృఢమైన స్థితిగా ఉంటుంది. ఎవరైతే పదే పదే విఘ్నాలకు వశమవుతారో, వారి పునాది బలహీనంగా అయిపోతుంది మరియు బహుకాలపు నిర్విఘ్న ఆత్మల పునాది దృఢంగా ఉన్న కారణంగా స్వయము కూడా శక్తిశాలిగా ఉంటారు మరియు ఇతరులను కూడా శక్తిశాలిగా తయారుచేస్తారు. పగిలిపోయిన వస్తువును మళ్ళీ అతికించినా అది బలహీనంగానే ఉంటుంది. బహుకాలపు శక్తిశాలి ఆత్మ, నిర్విఘ్న ఆత్మ అంతిమంలో కూడా నిర్విఘ్నంగా అయ్యి పాస్ విత్ ఆనర్ గా అవుతుంది మరియు ఫస్ట్ డివిజన్లోకి వస్తుంది. కనుక బహుకాలపు నిర్విఘ్న స్థితిని తప్పకుండా అనుభవము చేయాలి అన్న ఈ లక్ష్యమునే ఎల్లప్పుడూ పెట్టుకోండి. విఘ్నం వచ్చింది, పోయింది కదా, ఏమీ ఫరవాలేదు అని ఇలా అనుకోకండి. కానీ పదే-పదే విఘ్నము రావటము మరియు దానిని తొలగించుకోవటము, ఇందులో టైమ్ వేస్ట్ అయిపోతుంది. ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఆ టైమ్ మరియు ఎనర్జీని సేవలో వినియోగించినట్లయితే ఒకటికి పదమాలగుణాలు జమ అయిపోతుంది. కనుక బహుకాలపు నిర్విఘ్న ఆత్మలు విఘ్న వినాశక రూపములో పూజింపబడతాయి. విఘ్న వినాశకులు అన్న టైటిల్ పూజ్య ఆత్మలది. నేను విఘ్న వినాశక పూజ్య ఆత్మను అన్న ఈ స్మృతితో సదా నిర్విఘ్నులుగా అయ్యి ఎగిరే కళ ద్వారా ముందుకు ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ వెళ్ళండి. అర్థమైందా! మీ విఘ్నాన్ని అయితే వినాశనం చేసుకున్నారు కానీ ఇతరుల కొరకు విఘ్న వినాశకులుగా అవ్వాలి. మీకు నిమిత్త ఆత్మ కూడా ఎటువంటివారు లభించారో చూడండి, (డాక్టర్ నిర్మల) వారు ప్రారంభము నుండీ ఎటువంటి విఘ్నములోకి రాలేదు. సదా అతీతముగా మరియు ప్రియమైనవారిగా ఉన్నారు. కాస్త స్ట్రిక్ట్ గా ఉంటారు. ఇది కూడా తప్పనిసరి. ఒకవేళ ఇటువంటి స్ట్రిక్ట్ టీచర్ లభించకపోతే ఇంతగా వృద్ధి అవ్వదు. దీని అవసరము కూడా ఉంటుంది. ఏవిధంగానైతే వ్యాధికి చేదు మందు అవసరం పడుతుంది కదా. కనుక డ్రామా అనుసారంగా నిమిత్త ఆత్మల సాంగత్యము కూడా ఉంటుంది. వీరు (నిర్మల దీదీ) రావటంతోనే స్వయం సేవకు నిమిత్తులుగా అయ్యారు కనుక ఆస్ట్రేలియాలో కూడా రావటంతోనే సెంటర్ తెరిచే సేవలో నిమగ్నమవుతారు. త్యాగ భావనతో కూడిన ఈ వైబ్రేషన్లు మొత్తము ఆస్ట్రేలియా మరియు సంపర్కములో ఉన్న స్థానాలన్నిటిలోనూ ఆ రూపంతోనే వృద్ధి అవుతున్నాయి. ఎవరిలోనైతే తపస్య మరియు త్యాగము ఉంటాయో, వారే శ్రేష్ఠ ఆత్మలు. ఆత్మలందరూ అయితే తీవ్ర పురుషార్థులే కానీ పురుషార్థులుగా ఉంటూ కూడా విశేషతలు తమ ప్రభావమును తప్పకుండా వేస్తాయి. ఇప్పుడు అందరూ సంపన్నంగా అయితే అవుతున్నారు కదా. సంపన్నంగా అయిపోయారు అన్న ఈ సర్టిఫికేట్ ఎవ్వరికీ లభించలేదు. కానీ సంపన్నతకు సమీపంగా చేరుకున్నారు, ఇందులో నంబరువారుగా ఉన్నారు. కొంతమంది చాలా సమీపంగా చేరుకున్నారు, కొంతమంది నంబరువారుగా ముందు వెనుక ఉన్నారు. ఆస్ట్రేలియా వారు అదృష్టవంతులు. త్యాగం యొక్క బీజము భాగ్యమును ప్రాప్తి చేయిస్తూ ఉంది. శక్తి సైన్యం కూడా బాప్ దాదాకు అతి ప్రియమైనవారు ఎందుకంటే వారు ధైర్యము కలవారు. ఎక్కడైతే ధైర్యము ఉంటుందో, అక్కడ బాప్ దాదాల సహాయము ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. సదా సంతుష్టంగా ఉండేవారే కదా. సంతుష్టత సఫలతకు ఆధారము. మీరందరూ సంతుష్ట ఆత్మలు కనుక సఫలత మీ జన్మ సిద్ధ అధికారము. అర్థమైందా! కనుక ఆస్ట్రేలియావారు నియరెస్ట్ మరియు డియరెస్ట్ (అతి దగ్గరైనవారు, అతి ప్రియమైనవారు), అందుకే ఎక్స్ ట్రా హక్కు ఉంది. అచ్ఛా!

అవ్యక్త మురళీలనుండి ఎన్నుకోబడిన మహావాక్యాలు (ప్రశ్నోత్తరాలు)

ప్రశ్న:- శక్తి సైన్యం పేరు మొత్తము విశ్వములో ఎప్పుడు ప్రసిద్ధమవుతుంది?

జవాబు:- సంగఠిత రూపంలో ఏకరస స్థితి మరియు ఏక శుద్ధ సంకల్పములో స్థితులయ్యే అభ్యాసము ఉన్నప్పుడు. సంగఠనలో ఏ ఒక్కరికీ కూడా వేరే సంకల్పమేదీ ఉండకూడదు. అందరూ ఒకే తపనలో, అశరీరులుగా అయ్యే ఒకే శుద్ధ సంకల్పములో స్థితులయ్యే అభ్యాసులుగా అయినప్పుడు మొత్తము విశ్వములో శక్తి సైన్యం పేరు ప్రసిద్ధమవుతుంది.

ప్రశ్న:- స్థూల సైనికులు యుద్ధ మైదానములో ఏ ఆధారంతో విజయులుగా అవుతారు? మీ విజయ ఢంకా ఎప్పుడు మ్రోగుతుంది?

జవాబు:- స్థూల సైనికులు యుద్ధ మైదానములోకి వెళ్ళినప్పుడు ఒకే ఒక ఆర్డర్ తో నలువైపులా తమ తుపాకీ గుండ్లను వదలటం మొదలుపెడతారు. ఎప్పుడైతే ఒకే సమయములో, ఒకే ఆర్డర్ తో నలువైపులా చుట్టుముడతారో, అప్పుడు విజయులుగా అవుతారు. అలాగే ఆత్మిక సైన్యం, సంగఠిత రూపములో, ఒకే సూచనతో మరియు ఒకే క్షణములో, అందరూ ఏకరస స్థితిలో స్థితులైపోవాలి, అప్పుడే విజయ ఢంకా మ్రోగుతుంది.

ప్రశ్న:- బాబా ఇచ్చే ఏ ఆర్డర్ను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు ఎవర్రెడీగా అయినట్లయితే ఈ కలియుగ పర్వతము ఎత్తబడుతుంది?

జవాబు:- ఒక్క క్షణములో అందరూ ఏకరస స్థితిలో స్థితులైపోండి అన్న ఈ ఆర్డర్ నే బాబా ఇస్తారు. ఎప్పుడైతే అందరి యొక్క సర్వ సంకల్పాలు ఒక్క సంకల్పములో ఇమిడిపోతాయో, అప్పుడు ఈ కలియుగ పర్వతము ఎత్తబడుతుంది. ఆ ఒక్క క్షణము సదాకాలపు క్షణంగా అవుతుంది. అంతేకానీ ఒక క్షణం స్థితులవ్వటము, మళ్ళీ కిందకు వచ్చేయటము, ఇలా కాదు.

ప్రశ్న:- బ్రాహ్మణ పిల్లల ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి?

జవాబు:- మొత్తము సంగఠనను ఏకరస స్థితిలో స్థితులుగా చెయ్యటంలో సహయోగులుగా అవ్వటము - ఇది బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి బాధ్యత. ఏవిధంగానైతే అజ్ఞానీ ఆత్మలకు జ్ఞాన ప్రకాశమును ఇచ్చేందుకై ఎల్లప్పుడూ శుభ భావన మరియు కళ్యాణపు భావనను పెట్టుకుంటూ ప్రయత్నము చేస్తూ ఉంటారో, అలాగే తమ ఈ దైవీ సంగఠనను కూడా ఏకరస స్థితిలో స్థితపరచేందుకు మరియు సంగఠన శక్తిని పెంచేందుకు ఇతరుల కొరకు భిన్న-భిన్న రూపాలతో ప్రయత్నము చెయ్యండి. దీనికి ప్లాన్లు తయారుచెయ్యండి. నేను నావైపునుండైతే బాగానే ఉన్నాను అని సంతోషపడిపోవటం కాదు.

ప్రశ్న:- పరమాత్మ జ్ఞానము యొక్క విశేషత ఏంటి?

జవాబు:- సంగఠన శక్తియే పరమాత్మ జ్ఞానము యొక్క విశేషత. ఈ బ్రాహ్మణ సంగఠన యొక్క విశేషత దేవతా రూపంలో ప్రాక్టికల్ గా ఒకే ధర్మము, ఒకే రాజ్యము, ఒకే మతము రూపంలో నడుస్తుంది.

ప్రశ్న:- ఏ ఒక విషయపు సంపూర్ణ పరివర్తనయే సంపూర్ణతను సమీపంగా తీసుకువస్తుంది?

జవాబు:- ప్రతి ఒక్కరిలో దేహ అభిమానపు మూల సంస్కారము ఏదైతే ఉందో, దేనినైతే మీరు నేచర్ అని అంటారో, ఆ సంస్కారము అంశమాత్రము కూడా ఉండకూడదు. మీ ఈ సంస్కారాలను పరివర్తన చేసి బాప్ దాదా సంస్కారాలను ధారణ చెయ్యటము - ఇదే చివరి పురుషార్థము.

ప్రశ్న:- ఏ ఆధారంపై బాప్ దాదా ప్రత్యక్షత జరుగుతుంది?

జవాబు:- ప్రతి ఒక్కరిలో బాప్ దాదా సంస్కారము కనిపించినప్పుడు. బాప్ దాదా సంస్కారాలను కాపీ చేసి, వారి సమానంగా అయినట్లయితే సమయము మరియు శక్తులు మిగులుతాయి మరియు మొత్తము విశ్వములో బాప్ దాదాను సహజంగా ప్రత్యక్షము చెయ్యగలరు. ఎక్కడ చూసినా అంతా నువ్వే నువ్వు అని భక్తి మార్గములో అయితే కేవలము సామెత ఉంది కానీ ఇక్కడ ప్రాక్టికల్ లో ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా అక్కడ బాప్ దాదాల సంస్కారమే కనిపించాలి.


Comments