18-01-2010 అవ్యక్త మురళి

             18-01-2010        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

   “బ్రహ్మా బాబా సమానంగా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వటానికి      మనసు యొక్క టైమ్ టేబులును తయారు చేసుకుని కర్మలను చేస్తూ కర్మయోగి అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని చెయ్యండి”

           ఈ రోజు నలువైపుల ఉన్న పిల్లల్లో విశేషంగా స్నేహం నిండి ఉంది. ఈ రోజును స్మృతి దివసము అని అంటాము. బాప్ దాదా అమృతవేళ నుండి నలువైపుల చూసారు, దేశంలో కానీ, విదేశాలలో కానీ పిల్లలందరి హృదయాలలో తండ్రిపై ఉన్న స్నేహ చిత్రము కనిపిస్తుంది. మరియు బాబా హృదయంలో కూడా పిల్లలందరి పై ఉన్న స్నేహ చిత్రము దాగి ఉంది. ఈ రోజును విశేషంగా స్నేహ, స్మృతి దివసము అని అంటాము. బాప్ దాదా అమృతవేళకన్నా కూడా ముందునుండే పిల్లల నుండి అనేకమైన స్నేహమనే ముత్యాల మాలలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయము నుండి స్వతహాగా నా బాబా, బ్రహ్మా బాబా, మధురమైన బాబా అన్న గీతము మ్రోగుతోంది. మరియు బాప్ దాదా హృదయంలో- మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ అన్న గీతము వినిపిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరిలో ఇతర శక్తులకన్నా స్నేహ శక్తి ఎక్కువగా నిండి ఉంది. ఈ పరమాత్మ స్నేహము, ఈశ్వరీయ స్నేహము కేవలం సంగమయుగంలోనే అనుభవమవుతుంది. ఈ పరమాత్మ స్నేహమునుగూర్చి అనుభవం కలిగిన వారికే తెలుసు, ఇది ప్రతి ఒక్కరినీ సహజయోగిగా చేసేస్తుంది. పిల్లలందరిలో స్నేహ అనుభవం చాలా చాలా నిండి ఉండటాన్ని బాప్ దాదా చూసారు. మీ అందరి జన్మకు అధికారము స్నేహము. ఇతర శక్తులు తక్కువగా ఉన్నా కానీ తండ్రిపై స్నేహము లేక నిమిత్తమైన విశేష ఆత్మలపై స్నేహము యొక్క అనుభవం మెజారిటీ అందరి హృదయాలలో, ముఖంలో కనిపిస్తోంది! ఇది లేని పిల్లలు ఎవ్వరూ కనిపించలేదు! ఇప్పుడు మీ అందర్నీ ఇక్కడకు విశేషంగా ఏది తీసుకు వచ్చింది? ఏ విమానంలో వచ్చారు? ట్రైనులో వచ్చారా లేక విమానంలో వచ్చారా? అందరి ముఖాలలో స్నేహమనే విమానంలో వచ్చినట్లు తెలుస్తోంది. ఏమి చెయ్యాల్సి వచ్చినా కానీ స్నేహమనే విమానంలో అందరూ చేరుకున్నారు.

           ఈ రోజును స్మృతి దివసము అని అంటారు, కానీ స్మృతి దివసముతో పాటు దీనిని సమర్థ దివసము అని కూడా అంటారు. ఈ రోజును పట్టాభిషేకపు రోజు అని కూడా అంటాము, ఎందుకంటే ఈ రోజు బాప్ దాదా విశేషంగా బ్రహ్మా బాబా నిమిత్తమై ఉన్న మహావీరులైన పిల్లలకు విశ్వ సేవ అనే కిరీటాన్ని పెట్టారు. బాబా, బ్రహ్మా బాబా స్వయం గుప్తమైపోయారు మరియు పిల్లలకు విశ్వ సేవకై స్మృతి తిలకాన్ని దిద్దారు. పిల్లలను చేసేవారిగా తయారు చేసారు మరియు స్వయం చేయించేవారిగా అయ్యారు. తమ సమానంగా ఫరిస్తా స్వరూపులుగా అవ్వండి అని వరదానాన్ని ఇచ్చి ప్రకాశ కిరీటాన్ని పెట్టారు. బాప్ దాదా పెట్టిన కిరీటము, తిలకము మరియు వరదానము అనుసారంగానే ఉన్న పిల్లల కర్తవ్యాలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు సేవా వరదానాన్ని కార్యంలోకి తీసుకువచ్చారు. ఇది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పాత్రనైతే వహించారో, ఇక మీదట ఏ పాత్రనైతే వహించబోతున్నారో అందుకు పదమారెట్ల అభినందనలను బ్రహ్మా బాబా తెలుపుతున్నారు. వాహ్ పిల్లలు వాహ్! విదేశాలలో కూడా తిరిగివచ్చాము, అక్కడ ఏమి చూసాము? పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహంలో మునిగి ఉన్నారు. బాబా ద్వారా లభించిన సమర్థతలను, ఎందుకంటే ఈ రోజు విశేషంగా స్నేహంతో సమర్థతల వరదానాలను ప్రాప్తి చేసుకునే రోజు. కొంత మంది పిల్లలు ఎంతో మంచి తపనతో స్మృతిలో, సేవలో ఉండటం బాప్ దాదా చూసారు. అమృతవేళ చాలా బాగా అనుభవం చేసుకుంటున్నారు. అశరీరి స్థితిని కూడా అనుభవం చేస్తున్నారు, కానీ కర్మయోగిగా అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు రెండు పనులు - యోగిగా కూడా మరియు కర్మ కూడా, రెండు పనులు కలిపి చేయడంలో తేడా కనిపిస్తుంది. కర్మ మరియు యోగంలో బ్యాలెన్సు ఉండాలి అని పురుషార్థం చేస్తున్నారు, కానీ ఎలా అయితే అమృతవేళ శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుంటున్నారో అలా కర్మలోకి వచ్చేసరికి తేడా కనిపిస్తుంది. శ్రమ పడాల్సి వస్తుంది. విశ్వవినాశనము అకస్మాత్తుగా జరుగనుంది అని బాప్ దాదా ముందే చెప్పి ఉన్నారు. ఒకవేళ రోజంతా అటెన్షన్ కు బదులుగా, ఏదైనా ఒక ధారణలో లోపం ఉన్న కారణంగా కర్మయోగి స్థితిలో తేడా వస్తుంది. విశ్వ వినాశనము యొక్క డేట్ ను అయితే బాప్ దాదా ప్రకటించరు కానీ, మీ జీవిత కాలం ఎప్పుడు సమాప్తమవుతుందో మీకు తెలుసా? నా మృత్యువు ఫలానా తారీఖున జరుగుతుంది అని ఎవరికైనా తెలుసా? తెలుసా? వారు చేతులెత్తండి. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. అందుకు ప్రకృతి కారణమైతే ఒకేసారి ఎందరి మృతువు జరుగుతుంది! కావున, విశ్వ డేట్ ను ఆలోచిస్తూ నిర్లక్ష్యంగా ఉండవద్దు. మీ జగదంబ స్లోగన్ ఉంది కదా - ఎప్పుడు కూడా 'అప్పుడు' అని అనవద్దు, 'ఇప్పుడు'. రేపు ఏమి జరిగినా కానీ నేను ఎవరెడీగా ఉండాలి. మరి ఇంతటి ఏర్పాట్లు అందరి అటెన్షన్ లో  ఉన్నాయా? తమ కర్మల లెక్కాచారాలను పూర్తి చేసుకున్నారా? నాలుగు సబ్జెక్టులు- జ్ఞానము, యోగము, సేవ మరియు ధారణ, నాలుగు వైపుల, నాలుగింటిలో ఇటువంటి ఏర్పాట్లు చేసారా? పూర్తి అనంతమైన వైరాగ్యపు అనుభవాన్ని పరిశీలించుకున్నారా? నేను ఎవరెడీగా ఉన్నానా అని మీ హృదయాన్ని పరిశీలించుకున్నారా? నష్టోమోహ స్మృతి స్వరూపము, ఎందుకంటే బ్రహ్మా బాబా కూడా స్వయంగా పురుషార్థం చేసి ఇలా అయ్యారు. అనుభవీ పిల్లలు చూసినట్లుగా ఏ వైపు కూడా లెక్కాచారాల వాతావరణం లేదు, అశరీరిగా అయ్యే అభ్యాసము అకస్మాత్తుగా అశరీరిగా చేసి ఎగిరిపోయింది. బ్రహ్మా బాబా వెళ్ళనున్నారు అని ఎవరైనా అనుకున్నారా! కానీ నష్టోమోహులైన, పిల్లల చేతిలో చేయి ఉన్నప్పటికీ ఎక్కడైనా ఆకర్షణ ఉన్నదా? ఫరిశ్తాగా అయిపోయారు. పిల్లలకు ఫరిశ్తాలుగా అయ్యే తిలకాన్ని ఇచ్చి వెళ్ళారు. బహుకాలపు అశరీరి అభ్యాసమే ఇందుకు కారణము. తోడుగా ఉన్న కొందరు అనుభవీ పిల్లలు-వారు కర్మలను చేస్తూ కూడా ఎలా అశరీరులుగా అయిపోయేవారో అనుభవం చేసుకున్నారు. పిల్లల్లోని కర్మయోగంలో కనిపించిన తేడాకు కారణం - కర్మ చేస్తూ కూడా నేను ఆత్మను అన్న స్మృతి ఇమర్జ్ కాకపోవడము. నేను ఆత్మను అని అందరికీ తెలుసు, కానీ ఎటువంటి ఆత్మను? నేను ఆత్మను- చేయించేవాడను, ఈ కర్మేంద్రియాలు చేసేవి. చేసేవాడిని అన్న స్వమానము కర్మ చేస్తూ స్మృతి స్వరూపంలో ఉండాలి. కర్మేంద్రియాలతో కర్మను చేయించాల్సి వచ్చినా కానీ, నేను చేయించేవాడను, యజమానిని, ఈ సీట్ పై ఒకవేళ సెట్ అయి ఉంటే ఏ కర్మేంద్రియమైనా ఆర్డర్ లో ఉంటుంది. సీట్ పై సెట్ కానంతవరకు ఎవ్వరూ ఏ మాటను వినరు. నేనే చేయించే ఆత్మను, చేసేవి ఈ కర్మేంద్రియాలు, చేయించేవి కావు. బ్రహ్మా బాబా అనుభవాన్ని విన్నారు కదా, ప్రారంభంలో బ్రహ్మా బాబా ప్రతి రోజు సమాప్తి సమయంలో ఈ కర్మేంద్రియాలతో రాజ దర్బారును ఏర్పాటు చేసేవారు. పాత పిల్లలు ఆ డైరీని చూసి ఉంటారు. రోజూ దర్బారును పెట్టి, చేయించే యజమానిగా అయ్యి ప్రతి కర్మేంద్రియం నుండి సమాచారాన్ని తీసుకునేవారు, ఇచ్చేవారు. ఇంతటి అటెన్షన్ ను బ్రహ్మా బాబా కూడా ప్రారంభంలోనే ఉంచారు. మీరు కూడా చేయించేవాడిని, యజమానిని అని భావించాలి, ఎందుకంటే ఆత్మ రాజు, ఈ కర్మేంద్రియాలు దాని సహచరులు. మరి ఈ రోజు విశేషంగా మనసు-బుద్ధి సంస్కారములు, స్వభావం అనండి లేక సంస్కారము అనండి- వీటి పరిస్థితి ఎలా ఉంది? అని విశేషముగా పరిశీలించుకోవాలి. వెంటనే పరిశీలించడం ద్వారా- మా రాజు మమ్మల్ని అడుగుతాడు అని కర్మేంద్రియాలకు అటెన్షన్ ఉంటుంది. కావున ఆత్మ రాజుగా అయి చేసే కర్మేంద్రియాలను చేయించేవాడిగా అయి పరిశీలించండి. లేకపోతే- మేము కర్మేంద్రియాలను ఆర్డర్ చేస్తున్నాము, కానీ మళ్ళీ జరిగిపోతున్నాయి అని అంటారు. పురుషార్థము చేస్తున్నారు కానీ, ఏదోఒక సంస్కారము లేక స్వభావము ఆర్డర్ లో ఉండదు. ఇందుకు కారణం- తమ స్వమానము అన్న సీట్ పై సెట్ కాకపోవడం. సీట్ పై కూర్చోకుండా ఎన్ని ఆర్డరులు చేసినా కానీ అవి ఆర్డరులను పాటించేవిగా ఉండవు. కావున కర్మలను చేస్తూ చేయించేవాడను, యజమానిని అన్న సీట్ పై సెట్ అయ్యి ఉండండి. కొంతమంది పిల్లలు బాప్ దాదాతో ఈ విధంగా కూడా ఆత్మిక సంభాషణ చేస్తారు- బాబా, మీరు మమ్మల్ని సర్వశక్తిమంతునిగా తయారు చేసారు, శక్తిమంతులుగా కూడా కాదు, సర్వశక్తిమంతులు అన్న వరదానము ప్రతి ఒక్కరికీ బ్రాహ్మణ జన్మను తీసుకోగానే ఇచ్చారు. స్మృతి అనేది తమ జన్మ అధికారము. పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా మాస్టర్ సర్వశక్తిమాన్ భవ అన్న వరదానాన్ని ఇచ్చారు. వరదానమును ఎవరు ఇచ్చారు? ఆల్ మైటి అథారిటీ. కానీ ఏ సమయంలో ఏ శక్తి కావాలో అది సమయానికి రావడం లేదు అని కంప్లెయింట్ చేస్తారు. ఆజ్ఞను పాటించడం లేదు అని అంటారు. ఇలా ఎందుకు? ఆల్ మైటీ అథారిటీ అన్న వరదానం ఉన్నప్పుడు అంతకు మించినది మరొకటి లేదు. కావున వరదానం యొక్క స్థితిలో స్థితులయ్యి ఒకవేళ ఆర్డర్ చేస్తే మీరు ఆర్డర్ చేస్తే శక్తులు ఒప్పుకోకపోవడం అన్నది జరగదు. ఒకటి ఆత్మ యజమాని, సర్వశక్తిమంతుని వరదానం లభించి ఉంది, ఆ స్వరూపంలో స్థితులై- నేను యజమానిని, నాకు వరదానాలు ఉన్నాయి - అన్న ఈ రెండింటి స్వరూప స్మృతిలో ఉండి ఆర్డర్ చెయ్యండి. శక్తి మీ మాట వినకపోవడము అన్నది అసంభవము, ఎందుకంటే వరదానము మరియు తండ్రి ఆస్తికి అధికారము. సంగమయుగములో మీ అందరికీ సర్వశక్తిమంతులు అన్న టైటిల్ లభిస్తుంది. కేవలం ఆ స్థితిలో స్థితులై ఉండటం లేదు, సదా ఉండటం లేదు. అప్పుడప్పుడూ వస్తుంది. ఈ 'అప్పుడప్పుడు' అన్న మాటను బ్రాహ్మణ డిక్షనరీ నుండి తీసివెయ్యండి. ఇప్పుడిప్పుడే హాజరు. బాబా, మేము మిమ్మల్ని తల్చుకున్న వెంటనే మీరు హాజరైపోతారు అని అంటారు కదా. అనుభవం ఉంది కదా? చేతులెత్తండి. అనుభవం ఉందా? ఇప్పుడు చూడండి, చేతులైతే ఎత్తుతున్నారు. బాబా హాజరవుతారు. హజూరు హాజరు అవుతారు, మరి ఈ శక్తి ఏమిటి? ఈ శక్తులు కూడా మీకు బాబా ద్వారా ప్రాపర్టీగా లభించినవి. కావున, యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి. యజమానిగా అయి ఆర్డర్ ఇవ్వరు, శక్తి తగ్గిపోతుంది కదా. కావున అటువంటి స్థితిలో ఉంటూ ఆర్డర్ చేస్తే, యజమానే లేని కారణంగా అవి ఆజ్ఞను పాటించవు.

           మరి బాప్ దాదా ఇప్పుడు ఏమి ఆశిస్తున్నారు? తెలుసు కదా! ఇప్పుడు బాప్ దాదా కోరుకునేదేమిటంటే, నా పిల్లలు ప్రతి ఒక్కరూ కర్మలను చేస్తూ కూడా రాజా పిల్లలుగా అయి, స్వరాజ్య అధికారిగా అయి స్వరాజ్యమనే సీట్ ను ఎప్పుడూ వదిలి పెట్టకూడదు. మరి రాజు ఈ విధంగా రోజంతా రాజుగానే ఉంటాడు, అంతేకానీ ఒక్కోసారి రాజుగా ఉండటము, మరోసారి రాజుగా ఉండకపోవటం అనేది ఉండదు కదా! సింహాసనంపై కూర్చుంటారా లేదా అన్నది వేరే విషయము కానీ ఇంట్లో ఉంటూ కూడా నేను రాజును అని మర్చిపోకండి, కావున, కర్మయోగిగా ఉండటము మరియు అమృతవేళలోని యథార్థ యోగంలో ఉండాల్సిన శక్తిశాలి స్థితిలో తేడా కనిపించకూడదు. ఇది డబుల్ పనే, కానీ మీరు ఎవరు? మీరైతే విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారులు. అందుకే బాప్ దాదా కోరుకునేదేమిటంటే- నడుస్తూ, తిరుగుతూ రాజును అన్న స్మృతిని మర్చిపోకండి, సీట్ ను వదలకండి, సీట్ లేకపోతే ఎవ్వరూ ఆర్డర్ ను వినరు. ఈరోజుల్లో సీట్ కోసం ఏమేమి చేసుకుంటున్నారు? తమ హక్కును తీసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తారు! తమహక్కును ఎవ్వరూ వదుల్కోవాలని అనుకోరు. మరి మీరు మీ పరమాత్మ హక్కును, నేను ఎవరిని అన్నది గుర్తుంచుకోండి. అన్నివేళలా ఏ పని చేస్తున్నా, కర్మలను చేస్తూ కూడా మీ మనసు యొక్క టైమ్ టేబుల్ ను తయారు చేసి పెట్టుకోండి. ఈ కర్మను చేస్తూ మనసు యొక్క స్వమానము ఏది ఉండాలి? ఈ రోజు ఏ లక్ష్యం ఉండాలి? ప్రతి కర్మను చేసే సమయంలో స్వమానాల లిస్టును చూసుకోండి. భిన్న, భిన్న టైమ్ టేబుళ్ళను తయారు చేసుకోండి. స్థూలకర్మలకోసం ఎలా అయితే టైమ్ టేబులను ఫిక్స్ చేసుకుంటారో అలాగే మనస్సుకు టైమ్ టేబుల్‌ను ఫిక్స్ చెయ్యండి. ఈ సమయంలో ఈ పనిని చెయ్యాలి అని అయితే తెలుసు కదా, ఈ కర్మతోపాటు ఏస్వమానాన్ని పెట్టుకోవాలి? యజమానిని అన్న అధికారాన్ని ఏ స్వమాన రూపంలో పెట్టుకోవాలి. ఈ విధంగా మనసుకు టైమ్ టేబులను తయారు చేసుకోండి, టైమ్ టేబులను తయారు చెయ్యడం వచ్చు కదా? మాతలకు వ్చ? మాతలు మీ అంతట మీరే ప్రోగ్రామును తయారు చేసుకోండి. మంచి భోజనాన్ని తయారు చెయ్యాలి, ఆ సమయంలో ఏ స్వమానాన్ని మీ బుద్ధిలో ఇమర్జ్ చేసుకోవాలి? స్వమానాలది పెద్ద మాలయే. ఎంత పెద్ద మాల అంటే- స్వమానాలను లెక్కిస్తూ లెక్కిస్తూ మాలలో ఇమిడిపోవాలి. ఇప్పుడు బహుకాలము గురించి కూడా కొంతమంది పిల్లలు ఏమంటారు, ఇప్పటి వరకు వినాశనం కనిపించడం లేదు అని అంటారు. ఇప్పుడైతే డేట్ ఫిక్స్ అవ్వలేదు, చెద్దాము, అయిపోతుందిలే..... ఇది నిర్లక్ష్యము. సందేశం ఇవ్వడంలో కూడా విశ్వ కళ్యాణకారిగా కావచ్చు. కానీ ఇప్పుడింకా సమయము ఉంది, ముందు ముందు సందేశాన్ని ఇద్దాము అని భావించకండి. ఎవరికైతే మీరు సందేశాన్ని ఆలస్యంగా ఇస్తారో, వారు కూడా మీ పై ఫిర్యాదు చేస్తారు. ఏ ఫిర్యాదు చేస్తారు? మీరు మాకు ముందుగానే చెప్పి ఉంటే మేము కూడా ఏదైనా చేసేవారము కదా! ఇప్పుడైతే మీరు లాస్ట్ లో చెప్పారు, మేమైతే కేవలం గుర్తించి- అహో ప్రభూ, మీ లీలలు అని మాత్రమే అనుకోగలము. బహుకాలపు అభ్యాసం కావాలి. మీరందరూ వారసులు కూర్చున్నారు కదా! వారసులేనా? నేను వారసుడను అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అచ్ఛా, వారసులైతే మీరు పూర్తి వారసత్వాన్ని పొందుతారా లేక కొంచమా? అందరూ పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము అనే అంటారు. పూర్తి వారసత్వము అనగా పూర్తిగా 21 జన్మలు, ఆది నుండి అంతిమం వరకు రాయల్ ప్రజలోకి కూడా కాదు, రాయల్ ఫ్యామిలీలోకి రావాలి. సింహాసనంపై అయితే ఒక్కరే కూర్చుంటారు. యుగళ్ కూర్చుంటారు. అక్కడ సభ ఎప్పుడు ఏర్పాటు అయినా కానీ రాయల్ ఫ్యామిలీలోని విశేషమైన నిమిత్తమైనవారు కిరీటాలను ధరించి కూర్చుంటారు. కిరీటం లేకుండా కూర్చోరు మరియు ప్రతి కార్యంలో సలహాను ఇచ్చేవారూ ఉంటారు, కేవలం తాను మాత్రమే రాజ్యం చేయడు, తోటివారి సలహాలతోనే జరుగుతుంది. అందుకే ఒకవేళ సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే మొదటి జన్మ నుండి అంతిమం వరకు 21 జన్మలు, పూర్తిగా, సగం కూడా కాదు, మధ్యలో అయితే వెళ్ళకూడదు, అకాల మృత్యువులు ఉండవు. మరి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలా లేక కొద్దిలోనే సంతోషించాలా? మీ మాతేశ్వరి జగదంబ సదా ఈ లక్ష్యాన్ని పెట్టుకునేవారు - ఏ శ్రీమతాన్నైనా మనసా, వాచ లేక కర్మణ, ఏ శ్రీమతం లభించినా కానీ అది మనం చెయ్యాల్సిందే.. ఇలా పూర్తిగా వారసత్వాన్ని తీసుకునేవారు ఈ లక్ష్యాన్నే బుద్ధిలో పెట్టుకోండి- అకస్మాత్తుగా, ఎవరెడీగా మరియు బహుకాలము... ఈ మూడు మాటలను కలిపి గుర్తు పెట్టుకోండి. అందుకే బాప్ దాదాకు ఆశా దీపాలైన పిల్లల పట్ల ఇదే వరదానము వస్తుంది - సదా ఈ మూడు మాటలు గుర్తుంచుకొని అందరూ ఆశాదీపాలుగా అవ్వడంలో ప్రత్యక్ష ప్రమాణమును ఇవ్వండి.

           పిల్లలు భిన్న భిన్న రకాల కోర్సులను తయారు చెయ్యడం బాప్ దాదా చూసారు. బాగుంది. బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు కానీ ఇప్పుడు సమయం అనుసారంగా కోర్సుకు బదులుగా ఫోర్సు అనే కోర్సును చేయించండి. ఎంతగా ఫోర్సు అనే కోర్సును చేయిస్తారో వారు బాబాకు స్నేహీ- సహయోగిగా మాత్రమే కాక శ్రీమతాన్ని పాటించే ఫోర్సు, సర్వ ఫోర్సులను నింపుకునే ఆత్మలుగా అవ్వాలి, సమీప రత్నాలుగా అవ్వాలి. ఇది వీలవుతుందా? ఇప్పుడు ఫోర్సు యొక్క కోర్సును చేయించండి. ఎందుకంటే బాప్ దాదా ఏమి చూస్తున్నారంటే ఇప్పుడు ప్రకృతి అలజడిలోకి వచ్చేసింది, అందుకే ఏదో ఒక కారణంతో ప్రకృతి అలజడి తన ప్రభావాన్ని చూపిస్తోంది, చూపిస్తూ ఉంటుంది. ఆలోచనలో, స్వప్నంలో కూడా లేని విషయాలను ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటారు. మరి ప్రకృతిని కూడా సతో ప్రధానంగా చెయ్యాలి. ఇప్పడైతే తమ తమ ప్రభావాలను వేస్తున్నాయి, అందుకే సమయాన్ని బట్టి అన్నీ క్రొత్త క్రొత్త విషయాలు జరుగుతూఉంటాయి. కానీ మీరైతే వారసులు కదా! కేవలం స్నేహి సహయోగి కాదు వారసులు, ఫుల్ అధికారులు. అవునా? వారసులే కదా? డబుల్ విదేశీయులు కూడా వారసులే. వారసులేనా? మీరు పూర్తి వారసత్వాన్ని తీసుకునేవారు, సగం కాదు. పాండవులు పూర్తి వారసత్వాన్ని తీసుకునేవారే కదా?

           నేను బాప్ దాదాల ఆశాదీపాన్ని..... ఇదే గుర్తుంచుకోండి -సృతి దివసం నాడు పిల్లలు ప్రతి ఒక్కరూ ఇక్కడకు వచ్చిన వారైనా, ఇక్కడకు రానివారైనా, దూరంగా కూర్చుని హృదయంలో ఇమిడి ఉన్నవారైనా, ప్రతి ఒక్కరికీ బాబా ఆజ్ఞ ఏమిటంటే- నేను 'ఎప్పుడో' అన్న మాటను ఉపయోగించకూడదు. ఈ విషయంలో ఇలా అవ్వాలి మరియు ఒప్పుకోవాలి... ఇప్పుడిప్పుడే, రేపు కూడా ఎవరు చూసారు, ఈ రోజు. ఏదైతే చెయ్యాలో అది చెయ్యాల్సిందే, ఆలోచించకూడదు. ఆలోచిద్దాము, చేద్దాము, అయిపోతుందిలే అంటూ బాబాను కూడా ఓదారుస్తూ ఉంటారు. బాబా, మీరు ఆలోచించకండి, మేము సమయానికి సరిగ్గా అయిపోతాము అని అంటారు. కానీ ఇప్పుడే ఏదైనా పరీక్ష వస్తే పిల్లలు అందరూ ఫుల్ పాస్ అయిపోవాలన్నది బాప్ దాదా కోరుకుంటున్నారు. వీలవుతుందా? వీలవుతుందా? పూర్తిగా పాస్ అవ్వగలరా? అచ్ఛా, ఈ రోజు మొదటిసారిగా వచ్చినవారు లేవండి. మొదటిసారిగా వచ్చినవారికి వచ్చినందుకు బాప్ దాదా చాలా చాలా అభినందనలు ఇస్తున్నారు మరియు వరదానమును ఇస్తున్నారు - తీవ్ర పురుషార్థిగా అయి మీరు కావాలనుకుంటే ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. ఈ వరదానాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకు రావాలనుకుంటే బాప్ దాదాల వరదానము ఉంది. ఇందు కోసం మొదటిసారిగా వచ్చినవారికి బాప్ దాదా ఏ శుభవార్త వినిపిస్తున్నారంటే- లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్, ఈ దిల్ ఖుష్ మిఠాయిని తీసుకోండి.

            టూ లేట్ బోర్డుకన్నా ముందే వచ్చినందుకు బాప్ దాదాకు సంతోషంగా ఉంది. ఇది చాలా సంతోషకరమైన విషయము. మీరు ఒకవేళ ముందుకు వెళ్తే మేమందరం సంతోషిస్తాము. మీరెందుకు, మేమెందుకు వెళ్ళకూడదు అని అనము. ముందు మీరు. అచ్ఛా - కూర్చోండి. దిల్ ఖుష్ మిఠాయి తిన్నారు కదా!

సేవా టర్ను ఇండోర్ టర్ను వారిది:- ఇండోర్ అంటేనే గీత లోపల ఉండేవారు. బాప్ దాదాకు ప్రతి జోన్ వారికి సేవపట్ల ఉన్న ఉల్లాస ఉత్సాహాలను చూసి సంతోషంగా అనిపిస్తుంది. అవకాశం కూడా అందరూ మంచిగా తీసుకుంటున్నారు ఎందుకంటే సేవకు మేవా(ప్రతిఫలం) లభిస్తుంది అని మీకు తెలుసు. ఎటువంటి మేవా లభిస్తుంది? అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. లోకులైతే ఒక్క బ్రాహ్మణుడికి తినిపించి చాలా పుణ్య కార్యం చేసాము అని అనుకుంటారు. కానీ మీరు ఎంతమంది బ్రాహ్మణులకు తినిపిస్తున్నారు! ఎంత పుణ్యం! అందులోనూ అందరూ సత్యమైన బ్రాహ్మాణులు. మరి మీరందరూ సేవ యొక్క మేవాను తిన్నారా? తిన్నారా? మరి ఆరోగ్యంగా ఉన్నారు కదా! మేవా తినడంవలన ఆరోగ్యంగా అవుతారు. బాగుంది. ప్రతి జోనులో సంఖ్య పెరుగుతూ ఉండటాన్ని చూసాము, కానీ బాప్ దాదా ముందు కూడా చెప్పి ఉన్నారు - సంఖ్య పెరుగుతోంది, ఇది మంచిదే. సందేశం లభించింది, బాబాకు పిల్లలుగా అయ్యారు ఇందుకు చాలా చాలా అభినందనలు కానీ ఇప్పుడు సమయం అనుసారంగా వారసులను తయారు చెయ్యండి అని ముందు కూడా బాబా అన్నారు. ఇండోర్ పక్కా వారసులను తయారు చేస్తుంది. ఎందుకంటే బాప్ దాదా ఆ వారసుల పరీక్ష తీసుకుంటారు. ముందుగా వారి పేర్లని పంపండి, తర్వాత వారస క్వాలిటీ ఎంతగా తమ వారసత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు అని బాప్ దాదా చూస్తారు. రెండవది, బాప్ దాదా అన్నారు, అనుభవీలు, ప్రసిద్ధి చెందినవారు, వారి అనుభవాన్ని విని నేను కూడా అలా అవ్వాలి అన్నంతగా ఇతరులకు ఉల్లాసం రావాలి, అటువంటి మైక్ క్వాలిటీని కూడా తయారు చెయ్యాలి. మరి చేసారా, ఆ పని చేసారా? ఇండోర్ చేసిందా? ఇప్పటివరకు బాప్ దాదా వద్దకు లిస్ట్ రాలేదు. అచ్ఛా! (ఛత్తీస్ గఢ్ లోని ప్రభుత్వమంతా ఇక్కడకు వచ్చింది, వారు ఇప్పుడు మైక్ గా అయి మంచి సేవను చేస్తున్నారు) బాగుంది. వీరంతా ఇండోర్ వారు. పెద్ద సంఖ్య ఉంది. బాగుంది. అచ్ఛా! బాప్ దాదాకు ఇండోర్ పై విశేషంగా ఒక ఆశ ఉంది, ఎందుకంటే బ్రహ్మా బాబా అంతిమ సమయాలలో స్వయంగా బాప్ దాదా ఇండోర్ సెంటరును తెరిపించారు, అందుకే ఈ రోజు స్మృతి దివసమును జరుపుకుంటున్నారు. కావున ఇండోర్ వారు ఇప్పుడు ఏదైనా అతీతమైన, ప్రియమైనదానిని చెయ్యాలి. అన్ని జోన్లు పురుషార్థం చేస్తున్నాయి, బాగుంది. బాప్ దాదా వద్దకైతే అందరి సమాచారము వస్తుంది. కానీ బాప్ దాదా ఇప్పుడు ఫాస్ట్ గా, ముందుకు వెళ్ళాలన్న కోరికను కలిగి ఉన్నారు. నిర్విఘ్న జోన్, ప్రతి జోనులో ఎన్ని సేవాకేంద్రాలున్నా, ఎన్ని ఉప సేవాకేంద్రాలున్నా... ప్రతి ఏరియా నిర్విఘ్న సేవాకేంద్రం కావాలి. ప్రతి ఒక్కరిలో తీవ్ర పురుషార్థపు అలరావాలి. మరి నంబర్ ఇండోర్ తీసుకోవాలి. ఇందులో నంబర్‌వన్‌గా ఏజోను కూడా, మా జోనంతా నిర్విఘ్నంగా ఉంది అని రిపోర్టును ఇవ్వలేదు. పురుషార్ధం చేస్తున్నారు కానీ నలువైపుల గీతా పాఠశాలలు కావచ్చు, కానీ అన్నీ నిర్విఘ్నంగా ఉండాలి. ఈ రిపోర్టును బాప్ దాదా ఆశిస్తున్నారు. అచ్ఛా.

మెడికల్ వింగ్:- ఈ వింగ్ లో ప్రాక్టికల్ డాక్టర్లు ఎంతమంది? డాక్టర్లు చేతులెత్తండి. అచ్ఛా, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే సమయానుసారంగా డాక్టర్ల సేవ ఇంకా ఎంతో ముందుకు వెళ్ళనుంది ఎందుకంటే ఈ రోజుల్లో చింత, భయము వ్యాపించి ఉన్నాయి. మరి డాక్టర్లు, మీరైతే డబుల్ డాక్టర్లు కదా. డబుల్ డాక్టర్ అయిన డాక్టర్లు చేతులెత్తండి. మనసుకు మరియు శరీరానికి కూడా. ఈ రోజుల్లో మనసు యొక్క రోగం పెరుగుతూ ఉంది. అందుకే డబుల్ డాక్టర్ల సేవ మరింత పెరుగుతుంది. ప్రకృతి అలజడుల కారణంగా కొత్త కొత్త రోగాలు వస్తాయి. ఇటువంటి సమయంలో డబుల్ డాక్టర్ల అవసరం ఉంటుంది. మరి మీరందరూ ఎవరెడీ కదా, ఎక్కడకు పిలుపు వచ్చినా కానీ అక్కడ మీ సేవలను అందిస్తారు కదా? ఎవరైతే సేవను ఇవ్వగలరో వారు చేతులెత్తండి. చాలా మంచిది. పేర్లను నోట్ చేసుకోని ఇవ్వండి ఎందుకంటే ఆహ్వానం వచ్చినప్పుడు సమయాన్ని కేటాయించగలరా? కేటాయించగలరా?ఎవరైతే సమయానికి సిద్ధంగా ఉంటారో వారు చేతులెత్తండి. అచ్ఛా. అక్కయ్యలు తక్కువగా చేతులెత్తుతున్నారు. సేవాకేంద్రాలను నడపాలి. వీరి పేరును నోట్ చేసుకుని ఇవ్వండి. బాప్ దాదా డాక్టర్లను మహిమ చేస్తారు, ఎందుకని మహిమ చేస్తారు? ఎందుకంటే డాక్టర్లు కూడా బాప్ దాదా సమానంగా దు:ఖాన్ని తీసుకుని సుఖాన్ని ఇస్తారు. కానీ మీరు అల్పకాలానికి ఇస్తారు. బాబా సదాకాలం కోసం ఇస్తారు అందుకే డబుల్ డాక్టరుగా అయి సమయాన్ని కేటాయించగలిగితే మీకు ముందు ముందు డబుల్ డాక్టర్లుగా విలువ పెరుగుతుంది. డాక్టర్లకు ఖాళీ ఉండదు అని బాప్ దాదా విన్నారు. కానీ డాక్టర్లు బిజీగా ఉన్న కానీ, ఎంతో పెద్ద సేవను చెయ్యవచ్చు. డాక్టర్లు ప్రతి ఒక్కరూ కార్డును అచ్చు వేయించుకుంటారు. కార్డును వేయించుకుంటారు కదా? ఒకవైపు మీ పరిచయం ఉంటుంది, మరో వైపు ఖాళీగా ఉంటుంది, ఆ ఖాళీగా ఉన్న వైపున మనసు కోసం మందు కావాలంటే ఫలానా అడ్రసుకు రండి అని వేయించండి. ఈ కార్డులను ఎంతమంది పేషంట్లు ఉంటారో వారందరికీ ఇస్తే మీరు ఇంట్లో కూర్చునే సేవ చేసేస్తారు. ఎందుకంటే డాక్టర్లు చెప్పేది అందరూ వింటారు. ఇది తినవద్దు అని ఎవరు ఎంత చెప్పినా కానీ తింటూనే ఉంటారు కానీ ఒకవేళ డాక్టర్లు- ఇది అవుతుంది, అది అవుతుంది అని అంటే చేస్తారు. తప్పనిసరి అయి చేస్తున్నా లేక ప్రేమగా చేస్తున్నా కానీ మొత్తానికైతే చేస్తారు. అందుకే డాక్టర్లు చాలా సేవను చెయ్యవచ్చు అని బాప్ దాదా వినిపిస్తున్నారు. చూసి ఉంటే ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు కానీ కొంచం మరింత వేగంగా చెయ్యండి. మీ వద్ద భిన్న భిన్న జోన్ల డాక్టర్లు తమ జోన్ లో ఎటువంటి ప్రోగ్రామ్ ను తయారు చెయ్యాలంటే- అక్కడే ప్రోగ్రాము కలిసి చేస్తూ ఉండండి. ఇలా మీరు చాలా సేవను చెయ్యగలరు. డాక్టర్ల సేవ అవసరమని బాప్ దాదాకు అనిపిస్తుంది. ఎందుకంటే రోగాలు పెరగనున్నాయి. మనసు రోగమైతే నలువైపుల వ్యాప్తి చెంది ఉంది, మీ వృత్తిని చూసి భయంతోనైనా ఒప్పుకుంటారు. బాగుంది. బాప్ దాదాకు నచ్చింది, ఈ వర్గమువారి సేవలను మరింతగా, పెంచండి. అచ్ఛా!

డబుల్ విదేశీయులు- (40 దేశాల నుండి వచ్చారు):- ఈ రోజు విశేషంగా సెరిమనీ (వేడుక)ను జరుపుకునేందుకు వచ్చారు. మధువనంలో వేడుగ జరుపుకోవాలని అందరికీ ఉల్లాస ఉత్సాహాలు కలుగుతాయి. సెరిమనీ జరుపుకోవడానికి వచ్చినవారు చేతులెత్తండి. అచ్ఛా! ఎవరి సిరిమనీ ఉందో వారు చేతులెత్తండి. రెండు చేతులు ఎత్తండి. చాలా మంచిగా చేసారు. ఆహ్వానము ఇవ్వడము, ఆబూ యాత్రను చేయించే ఈ అవకాశాన్ని మంచిగా తీసుకున్నారు. ఎందుకంటే బాప్ దాదా అవతరణ సింధ్ లో జరిగింది. పునాది సింధ్. మరి సింధ్ వారు మేము సింధీలము అన్న హక్కును కలిగి ఉంటారు కదా, అందరితో యాత్ర చేయించడానికి ఇది కూడా మంచి విధి. ఇందుకు బాప్ దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. మంచిగా ఉంది కదా మీ ఇల్లు, మంచిగా అనిపించిందా? ఎందుకంటే ఇక్కడ చూసి ఉంటారు, ఎక్కడ కూడా ఏ గదిపైనా ఎవ్వరి పేరు లేదు. ఎందుకంటే ఇది తండ్రి ఇల్లు, మరి తండ్రి పిల్లలైన మీరు ఎక్కడకు వచ్చారు? మీ ఇంటికి.

(హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎదురుగా కూర్చుని ఉన్నారు) వీరు కూడా ఇప్పుడు వచ్చారు కదా? ఎక్కడకు వచ్చారు? మీ ఇంటికి వచ్చారు, మీ పరివారంలోకి వచ్చారు. రాజ్యము మరియు ఆధ్యాత్మికత... రెండూ కలిసి విశేషంగా బాపూ గాంధీ సంకల్పాన్ని పూర్తి చెయ్యాలనుకుంటే చెయ్యవచ్చు. సహజంగా చెయ్యవచ్చు, మరియు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక సాంగత్యంవల్ల నేతలలో కూడా పేరు వ్యాప్తి చెందుతోంది. మూడు శక్తులు - సైన్సు, ఆధ్యాత్మికత మరియు రాజ్యసత్తా, మూడు సత్తాలు కలిసి ఒకే సంకల్పం చెయ్యాలి, సహయోగిగా కావాలి, అప్పుడు మనం బాపూ గాంధీజీ మరియు బాపూకు కూడా బాపు అయిన పరమాత్మ ఇద్దరు తండ్రుల ఆశలను పూర్తి చెయ్యగలము అప్పుడు చాలా సహజమైపోతుంది. అచ్ఛా!

డబుల్ విదేశీయులు:- విదేశాలలో కూడా భిన్న భిన్న రకాల సేవలు జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయి. క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారుచేస్తూ ఉంటారు, ప్రాక్టికల్ లో కూడా చేస్తూ ఉంటారు. ఫారెన్ వారు ఇండియావారికి తమ అనుభవాన్ని వినిపించి సేవ చేస్తున్నారు. ఇండియావారు ఫారెన్ వారికి తమ అనుభవాన్ని వినిపించి దేశ విదేశాలలో సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రోగ్రామును చేస్తున్నారు కదా! బాగుంది. ఇప్పుడు రెండవ నంబరు (ఇప్పుడు సర్వ్ ఇండియా ప్రోగ్రామ్ చెన్నైలో ఉంది) బాప్ దాదా వద్దకు అందరి ఉల్లాస ఉత్సాహాలతో కూడిన ఉత్తరాలు మరియు ప్రియస్మృతులు ముందుగానే చేరుకున్నాయి. ఏది చేసినా, ప్రారంభంలో చిన్నగానే ఉంటుంది, తర్వాత పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ అవసరమని అనిపిస్తుంది. మూడు సత్తాలు ఉన్నప్పటికీ - ధర్మ సత్తా కూడా ఉంది, ఆధ్యాత్మికత వేరు, ధర్మ సత్తా ఉంది కానీ సత్తానే కదా. కానీ ఏది కావాలనుకుంటున్నారో అది జరగడం లేదు. లోపం ఎవరిది అని అందరూ ఆలోచిస్తున్నారు. మూడూ పని చేస్తున్నాయి కానీ ఏది అనుకుంటున్నారో అది జరగడం లేదు. ఇప్పుడు అనుకుంటున్నారు కానీ సమయం సాకుగా చెప్తున్నారు. సమయం లేదు. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు... కానీ ఇలా ఒకట్రెండు గ్రూపులను తమకు సహయోగులుగా చేసుకుంటే బాప్ దాదా వరదానం అనుసారంగా భారతదేశం స్వర్గంగా అవ్వాల్సిందే. ఇద్దరు బాపూల ఆశ నెరవేరుతుంది. మరి ఫారెన్ వారు కూడా మనసా సేవతో సహయోగులే కదా! అన్ని ధర్మాలలో వృద్ధి జరుగుతుండటం బాప్ దాదా చూసారు. ఒక్క ధర్మం కాదు, కేవలం హిందూధర్మం కాదు, ముస్లిం, బౌద్ధ మతం, క్రిస్టియన్ మతం, అన్నీ నెమ్మది నెమ్మదిగా ఆధ్యాత్మికత వైపుకు అభిరుచి చూపిస్తున్నాయి. ముందు చూడండి, బ్రహ్మాకుమారీల పేరు వినగానే వినాశనం-వినాశనం అని ఏమి చెప్తూ ఉంటారు అని భయపడేవారు. మరి ఇప్పుడేమంటారు? ఇప్పుడు, వినాశనం ఎప్పుడవుతుంది, ఎలా జరుగుతుంది మరియు ఏమి చేయాలి... అని అడుగుతారు. అందుకే ఎలాగూ జరుగనుంది, ఇదైతే గ్యారంటీ. మీ అందరికీ అయితే గ్యారంటీ ఉంది కదా, విదేశాల వారు కావచ్చు. భారతదేశం వారుకావచ్చు, మీ సహయోగం ఉండనే ఉంది. జరిగేదే ఉంది. చప్పట్లు కొట్టండి. అందరి ఉత్సాహము మంచిగా ఉంది, నిమిత్తంగా ఉన్న ఆత్మలు పాండవులు కావచ్చు, శక్తులు కావచ్చు ఇద్దరిలో ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం బాప్ దాదా ఇచ్చిన సూచనను అనగా పురుషార్థాన్ని తీవ్రం చెయ్యండి. పురుషార్థం కాదు, పురుషార్థానికి సమయం అయిపోయింది. ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థానికి సమయము. తర్వాత, తర్వాత అని అనవద్దు, ఇప్పుడే. ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడే అవ్వాలి. అవ్వాల్సిందే. అచ్చా!..

కలకత్తా వారు ఈ రోజు పూలతో అలంకరించారు:- మనసుతో చేస్తుండటం బాప్ దాదా చూసారు. అలంకరించడం పెద్ద విషయం కాదు, మీకన్నా ఇంకా బాగా చేసేవారు కూడా ఉన్నారు, కానీ మీకు బాబా పై ప్రేమ ఉంది, తండ్రి గురించి ఎంతోకొంత తెలుసు. అందుకే ఏ అలంకారం చేసినా కానీ, అందులో కేవలం పని మాత్రమే కాదు, ప్రేమ కూడా ఉంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడి ప్రేమ సుగంధం అందరికీ నచ్చుతుంది. ప్రతిసారీ వస్తారు. తమ డ్యూటీ అని కాదు, ఇది నా పని అని అనుకుని చేస్తున్నారు. మరి మీ అందరికీ అభినందనలు. నిమిత్తమై ఉన్నవారు ఉల్లాస ఉత్సాహాలను కలిగిస్తారు. చాలా బాగా చేస్తారు. స్మృతి దివసము వచ్చిందంటే కలకత్తాను గుర్తు చేసుకుంటారు, విశేషత అది. అభినందనలు అచ్ఛా!

           నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థులు, సదా ఉల్లాస ఉత్సాహాలతో అడుగులు ముందుకు వేసేవారికి ఎవరైతే సత్యమైన హృదయంతో చేస్తారో వారి మస్తకంపై ఉన్న విజయీ తిలకాన్ని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. అందరికీ నిశ్చయము ఉంది. మేము విజయులము అని నషా ఉంది. విజయులుగా ఉండేవారము, విజయులుగా ఉన్నాము మరియు విజయులుగా ఉంటాము. అందుకే ప్రతి ఒక్కరి మస్తకంలో బాప్ దాదా విజయీ తిలకాన్ని చూస్తున్నారు. నలువైపుల స్నేహితులు కూడా ఉన్నారు. ఈ రోజు అమృతవేళ నుండి చాలా చాలా స్నేహ మాలలు బాప్ దాదా వద్దకు వచ్చాయి మరియు బాప్ దాదా పిల్లలందరికీ రిటర్నులో సదా విజయులుగా అయ్యే మాలను వేస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలు కూడా చూస్తున్నారు ఎందుకంటే సైన్సు ఈ సాధనాలన్నిటినీ మీ కోసం కూడా తయారు చేసింది. ఎక్కడైనా కూర్చొని చూడవచ్చు, వినవచ్చు. ప్రతి చోటా ఎలా చూస్తున్నారు, వింటున్నారు అని బాప్ దాదా చూస్తున్నారు. నలువైపుల ఉన్న పిల్లలకు స్మృతి దివసం సందర్భంగా బాప్ దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. బాప్ దాదా హృదయంలో పిల్లలందరూ ఇమిడి ఉన్నారు మరియు పిల్లల హృదయంలో బాబా ఇమిడి ఉన్నారు. తండ్రి హృదయంలో పిల్లలు ఇమిడి ఉన్నారు, ఇందుకు అభినందనలు, అభినందనలు అభినందనలతోపాటు నమస్తే కూడా.

దాదీలతో:- ప్రియమైన సంతానపు పాత్రను వహిస్తున్నారు, వీరిని చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు (మోహిని అక్కయ్యతో) ధైర్యం కలదానివి మరియు ధైర్యమే నీకు విశేషమైన మందు.

దాదీ రతనమోహినితో:- వీరు కూడా మంచిగా ఉన్నారు, ప్రతి కార్యంలో హాజీ, హాజీ, హాజీ అంటూ కలుపుకు పోతున్నారు, కలుపుకు పోతూ ఉంటారు.

చెన్నైలో సర్వ్ ఇండియా కార్యక్రమం జరుగనుంది, అందరూ విశేష స్మృతిని అందించారు:- ముఖ్యమైన విషయమేమిటంటే గవర్నర్ హౌస్ లభించింది, అక్కడివారు కూడా ఇందులో చాలా ఇంటరెస్ట్ కలవారు. ఇది సేవకు ఋజువు. అందుకే బాప్ దాదా పిల్లలందరికీ, బీనా అక్కయ్యతో పాటు నిమిత్తంగా ఉన్న పిల్లలందరికీ లక్ష రెట్లు అభినందనలు తెలుపుతున్నారు. మరియు నిజార్ పిల్లవాడు కూడా ఉత్సాహం కలిగినవారు. ఇంకా ఏమేమి చెయ్యగలను అని ఆలోచిస్తూ ఉంటాడు. గవర్నర్ సహయోగిగా అయితే ఉన్నారు కానీ పాదం ముందుకు పెట్టాలి అంటే ముందుగా ఒక పాదం ముందు పెట్టి ఆ తర్వాత మరో పాదం పెడ్తారు, అలాగే వారు స్నేహి మరియు సహయోగి, కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రిజల్టులో అడుగులు మరింత ముందుకు వేసి మీకు తోడుగా నిలవాలి. ఇప్పుడు స్నేహి, సహయోగిగా ఉన్నారు సేవా మహత్వం తెలుసుకున్నారు ఇప్పుడు మహత్వం వరకు తెలుసు, ఇప్పుడు మరో అడుగు ముందుకు వెయ్యాలి.

గౌరవనీయులు ముఖ్యమంత్రి సో.ప్రొ. ప్రేమ్ కుమార్ ధూమల్, హిమాచల్ ప్రదేశ్ :- సంకల్పాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి మంచి పని చేసారు. మీ ఇల్లుగా భావిస్తున్నారు కదా! ఎందుకంటే తండ్రి ఇల్లు అంటే మీ ఇల్లు అని అర్థం. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మీ ఇంటికి వచ్చేయండి. మీరు కూడా సంతోషంగా ఉన్నారు కదా. మీరు కూడా వస్తూ ఉండండి. ఇప్పుడు కేవలం వీరితో వచ్చారా? కాదు, అలా వస్తూ ఉండండి.

Comments