15-12-2010 అవ్యక్త మురళి

 15-12-2010        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “నాది అన్నదానిని నీదిగా పరివర్తనచేసి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి, క్షణములో వ్యర్థమునకు బిందువును దిద్దే అభ్యాసకులుగా అయి ప్రతి సంకల్పమును మరియు సమయమును సఫలం చేసుకోండి.”

           ఈరోజు నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తులైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి నిశ్చింత చక్రవర్తుల సభ ఇప్పుడే కనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మాత్రమే తండ్రి చింతను తీసుకొని నిశ్చింత చక్రవర్తులుగా తయారుచేస్తారు. కావున ఈ సభ ఈ సమయంలోనే కనిపిస్తుంది. మీరందరూ ఉదయం లేచినప్పుడు నిశ్చింత స్థితిలో స్థితులవుతారు. తింటూ తాగుతూ కర్మ చేస్తూ ఎటువంటి చింతా ఉండదు. నిదురించే సమయంలో కూడా నిశ్చింతులుగా ఉంటారు. ఇటువంటి మహారాజులుగా మరియు నిశ్చింతులుగా లేస్తూ, నిదురిస్తూ కూడా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే మీరందరూ బాబాకు చింతలను ఇచ్చేసి నషాను తీసుకున్నారు. కావున నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు. ఒకవేళ నడుస్తూ, నడుస్తూ ఏదైనా చింత వచ్చినట్లయితే ఆ చింత మిమ్మల్ని ఎలా తయారుచేస్తుంది? నషా ఉన్నట్లయితే మీ మస్తకములో లైట్ యొక్క ప్రకాశము ప్రకాశిస్తుంది. ఒకవేళ చింత వచ్చినట్లయితే భారము మీ శిరస్సుపైకి వచ్చేస్తుంది. కావున మీకు ప్రకాశపు మెరుపు మంచిగా అనిపిస్తుందా లేక భారపు బరువు మంచిగా అనిపిస్తుందా? నిశ్చింత చక్రవర్తులు స్వయమునకు కూడా ప్రియంగా అనిపిస్తారు మరియు ఎవరైతే ఇటువంటి స్థితిలో ఎగురుతారో వారి ప్రకాశిస్తున్న వెలుతురును చూసి ఇతరులకు కూడా ఎంత ప్రేమ కలుగుతుంది! కావున బాప్ దాదా సదా పిల్లలకు నిశ్చింత చక్రవర్తీ స్థితిలో ఉండడం నేర్పిస్తారు, ఈ స్మృతి స్వరూపంలో నిలుపుతూ ఉంటారు. కావున మీ చిత్రాలను కూడా భక్తిమార్గంవారు డబుల్ కిరీటధారులుగా చూపిస్తారు. ఒకటేమో- ప్రకాశ కిరీటము, ఇంకొకటి- వికారాలను జయించిన మహారాజస్థితి యొక్క కిరీటము. డబుల్ కిరీటమును చూపిస్తారు, కావున బాప్ దాదా సదా పిల్లలకు ఇదే శిక్షణను ఇస్తారు. సదా ఆనందంలో ఉండడం చాలా సహజము. ఏమిటి సహజము? కేవలం హద్దులోని నాది అన్నదానిని బాబాకు ఇచ్చేయండి. నాది అన్నదానిని బాబాకు ఇచ్చేస్తే నిశ్చింత మహారాజులుగా అయిపోతారు. ఒకే పదము యొక్క తేడా నీది-నాది. నీ మరియు నా ఈ ఒక్క పదములోని తేడాతో నిశ్చింత చక్రవర్తులుగా అయిపోతారు, ఇది సహజము కదా! నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు కదా! లేక ఇప్పటికీ చింత ఉంటుందా? ఎప్పుడైనా నషాకు బదులుగా చింత వచ్చినట్లయితే, తేడా కేవలం నీది అనడానికి బదులుగా నాది అని భావించడమే. దీనిద్వారానే చింత వస్తుంది. కావున అందరి యొక్క లక్ష్యము ప్రాక్టికల్ గా ఉందా? చింతను ఇచ్చేసారా లేక మధ్య మధ్యలో నషాను వదిలి చింతలోకి వచ్చేస్తారా? చింత వస్తోందా లేక నిశ్చింతగానే ఉంటున్నారా? ఎవరైతే సదా నిశ్చింత మహారాజులుగా ఉంటున్నారో వారు చేతులెత్తండి. నిశ్చింత మహారాజులుగా ఉన్నారా? పక్కాగానా లేక అప్పుడప్పుడా! నిశ్చింత మహారాజులు చేతులు పైకెత్తండి. అప్పుడప్పుడు నిశ్చింతులుగా ఉండేవారు కూడా ఉన్నారు. సేవను గూర్చిన చింత వేరే విషయం. కాని, ఆ చింత ఇతరులను కూడా నిశ్చింతులుగా తయారుచేసే సాధనము. మీ సంస్కారంలో చింత వచ్చినట్లయితే, దానిని ఆ సమయంలోనే నాది అన్నదానిని నీదిగా మార్చివేయండి. బాబాకు చింతను ఇచ్చేయండి మరియు నషాను తీసుకోండి. ఎందుకంటే పిల్లల చింతను తీసుకొని వారికి నషాను ఇచ్చేందుకే బాబా వచ్చారు. కావున నాలో అప్పుడప్పుడు ఈ బహుకాలపు సంస్కారాలు ప్రత్యక్షమవ్వడం లేదు కదా అని పరిశీలించుకోండి. ఎందుకంటే బాప్ దాదా కొంతకాలంగా వర్తమాన సమయానుసారంగా ఎప్పుడైనా, ఏమైనా జరుగవచ్చని మరియు అది ఎప్పుడైనా జరుగవచ్చని తెలియజేస్తున్నారు. కావున పిల్లలు ప్రతిఒక్కరూ ఒక్క క్షణంలో బిందువును పెట్టాలనుకుంటే పెట్టగలమా అన్న విషయముపై అటెన్షన్‌ను ఇవ్వాలి. ఉదాహరణకు ఏదైనా వ్యర్థ సంకల్పాము వచ్చినట్లయితే బిందువు ద్వారా ఒక్క క్షణములో వ్యర్థమును సమాప్తం చేయగలరా? ఇంతటి అభ్యాసం ఉందా లేక ఆ సమయంలో, ఆ పరిస్థితుల అనుసారంగా పురుషార్థము చేసి వ్యర్థమును అంతం చేయవలసిన అవసరం ఏర్పడుతుందా? మీరు బిందువును పెడితే అది ఎందుకు, ఏమిటి, ఎలా... అన్న ప్రశ్నల్లా అయిపోవడం లేదు కదా... ఆ సమయంలో ఇది ఆలోచిస్తూ ఉన్నట్లయితే బాబాతో పాటు వెళతాము అన్న లక్ష్యమేదైతే ఉందో అది సిద్ధించదు. బాబా అయితే క్షణములో బిందువుగా ఉంటారు అలాగే ఒక్క క్షణం కూడా బిందువే, అలాగే ఫుల్ స్టాప్ కూడా బిందువే, ఇంతటి అభ్యాసము ఉందా? రానున్న సమయంలో బాబాతో వెళ్ళాలి అన్న లక్ష్యము ఏదైతే ఉందో దానికొరకు ఇప్పటినుండే ఈ అభ్యాసపు అభ్యాసులుగా ఉన్నట్లయితేనే బాబా సమానంగా శ్రీమతంరూపీ చేతిలో చేయి వేస్తూ మన ఇంటికి చేరుకుంటారు. కావుననే బాప్ దాదా ఇంతకుముందు కూడా విషయాల యొక్క అటెన్షన్‌ను అండర్‌లైన్ చేయండి అని తెలియజేశారు. ఆ రెండు విషయాలూ ఏమిటి? ఒకటేమో- సంకల్పము యొక్క ఖజానా, ఇంకొకటి- సమయపు ఖజానా, ఖజానాలైతే ఎన్నో లభించాయి, జ్ఞానపు ఖజానా, శక్తుల ఖజానా, యోగము ద్వారా సంపన్నముగా అయ్యే ముఖ్యమైన ఖజానా.... యుక్తులేవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రాప్తింపజేశారు. ఎందుకంటే ఈ సంగమయుగపు సమయము మొత్తం కల్పంలోకి అమూల్యమైన విశేష సమయము. ఈ సమయంలోనే ఎంతగా ప్రాప్తిని పొందాలనుకుంటే అంతగా పొందగలుగుతారు. ఎందుకంటే ఈ ఒక్క జన్మ మహాన్ జన్మ. ఈ ఒక్క జన్మలో అనేక జన్మల పాలబ్ధమును తయారుచేసుకోవాలి. సంగమయుగపు సమయమును ఒక్క క్షణము కూడా వ్యర్థం చేసుకోకూడదు. ఒక్క క్షణపు సంబంధము అనేక జన్మలతో ఉంటుంది. జమ చేసుకునే ఒక్క సంవత్సరము అనేక సంవత్సరాల ప్రాప్తికి సంబంధించినది. కావున ఈ సమయపు విలువ ఒక్క క్షణము లేక నిమిషము కాదు, ఒక్క గంట కూడా ఎంతో ఉన్నతమైనది, ఒక్క క్షణము కూడా ఉన్నతమైనది మరియు సంకల్పాలు ఈ సమయపు జన్మ యొక్క విశేష ఆధారము. చూడండి, మీరు ఏ యోగమునైతే జోడిస్తారో, మన్మనాభవ అని ఏదైతే అంటారో అది పునాదికి ఆధారము. సంకల్పము చేయడము మనసు పని. సంకల్పము ద్వారానే స్మృతి యాత్రను అనుభవం చేసుకుంటారు. ఒక్క క్షణం పరస్పరంలో కూడా విశేషంగా భిన్న భిన్న సంకల్పాలను అందించుకుంటూ అభ్యాసము చేయిస్తారు కదా! కావున అందరూ సమయం యొక్క వేగము రోజంతటిలో నడుస్తూ, తిరుగుతూ, కర్మచేస్తూ, సంబంధంలోకి వస్తూ అమూల్యరూపంగా ఉందా అని పరిశీలించుకోండి. ఎందుకంటే సమయము అమూల్యమైనది మరియు సంకల్పాలు సర్వశక్తివంతంగా తయారుచేస్తాయి.

           కావున హే బాప్ దాదాల ప్రియమైన పిల్లలూ, హృదయంలో ఇమిడి ఉండే పిల్లలూ, ఇప్పుడిక వ్యర్థ ఖాతాను సమాప్తం చేయండి, సఫలం చేసుకోండి అని బాప్ దాదా పదే పదే చెబుతున్నారు. సఫలం చేసుకోవడమే సఫలత. ఒక్క క్షణం పోయింది అని భావించకండి, ప్రతిక్షణము, ప్రతి సంకల్పము సఫలమైందా అని ఇంతటి అటెన్షన్‌ను మీపై మీరు తప్పకుండా ఉంచి తీరాలి. ఇంతగా ఫుల్ స్టాప్ ను దిద్దే చెకింగ్ చేయండి, నిర్లక్ష్యులుగా అవ్వకండి. బాప్ దాదా చెప్పారు కానీ మేము అర్థం చేసుకోలేదు, సమయమును గూర్చి అలా భావించలేదు అని అనకండి. ఇంతగా సమయం వేగంగా వెళుతోంది, ఇంకా వెళుతుంది, ఇప్పుడు నిర్లక్ష్యమును బాప్ దాదా ప్రతిఒక్కరి నుండి తీసుకోవాలనుకుంటున్నారు, నేను అర్థం చేసుకోలేదు, అలా ఆలోచించలేదు అన్నది వినాలనుకోవడం లేదు. ఇప్పుడు సంవత్సరం కూడా క్రొత్తది రానున్నది, కావున ఈ క్రొత్త సంవత్సరం ప్రారంభం అవ్వకముందే బ్రాహ్మణ ప్రపంచం నుండి ఈ నిర్లక్ష్యంతోపాటు బద్దకము కూడా పోవాలి, ఈ బద్దకము కూడా రకరకాలుగా ఉంటుంది, దీనిని ఈ సంవత్సరం సమయమేదైతే ఉందో ఇందులో అభ్యాసం ప్రారంభించండి మరియు ఎప్పుడైతే క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుందో అప్పుడు బాప్ దాదా ముందు ధైర్యమును ఉంచి సంకల్పము చేయండి మరియు దీనికి వీడ్కోలు చెప్పండి. సంవత్సరంతో పాటు దీనికి కూడా వీడ్కోలు చెప్పేయండి. వీడ్కోలు చెప్పగలరా? చెప్పగలరా? ఎవరైతే వీడ్కోలు చెప్పగలరో వారు చేతులెత్తండి (అందరూ చేతులెత్తారు). ఓహో! పిల్లలూ ఓహో! చేతులెత్తడంలో బాప్ దాదాను ఎంతో సంతోషపెడతారు. చాలామంది పిల్లలకు చేతులు ఎత్తిన విషయంలో రిటర్న్ ను ఇవ్వాలి అన్నది గుర్తుండడం బాప్ దాదా గమనించారు. మరికొందరు దీనిని గుర్తుంచుకోవడంలో కూడా నిర్లక్ష్యులుగా అయిపోతారు. బాప్ దాదాతో ఆత్మిక సంభాషణ చాలా బాగా చేస్తూ ఉంటారు. అయిపోతుందిలేండి, బాబా, మీరు చూడండి, ఇప్పుడిక అవుతుంది, ఇప్పుడే అవుతుంది... అంటూ బాప్ దాదాతో ఆత్మిక సంభాషణ చాలా బాగా చేస్తారు. బాప్ దాదా కూడా ఇటువంటి నిర్లక్ష్యులుగా ఉన్న పిల్లల మాటలు వింటూ నవ్వుకుంటారు, ఇంకేం చేయగలరు! అచ్ఛా! బాగుంది, చేయాలి, చేయాలి, చేయాలి... అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఎంతో ఆలోచిస్తారు కానీ చేస్తున్నారా, లేక చేయడం లేదా అన్న విషయంలో చెకింగ్ లో ఏంచేస్తారు? నిర్లక్ష్యులుగా అయిపోతారు.

           కావున ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలు తమ తమ దేశాలలో, తమ తమ స్థానాలలో చూస్తూ ఉన్నారని, అది కూడా మంచిగా కనిపిస్తోందని, వినిపిస్తోందని బాప్ దాదా విన్నారు. కావున బాప్ దాదా సమ్ముఖంగా వచ్చే పిల్లలకు మరియు తమ స్థానాలలో వినే, చూసే పిల్లలకు- ఇప్పుడు పురుషార్థం చేయండి, సంకల్పాన్ని మరియు సంగమ సమయాన్ని అండర్ లైన్ చేయండి అని చెబుతున్నారు, పిల్లలందరూ ప్రేమ విషయంలో మెజారిటీ పాసై ఉన్నారు, ప్రేమ ఆధారంపై స్వయమును మంచిగా ప్రోగ్రెస్ చేసుకుంటున్నారు. ప్రేమ కారణంగా బాబా ప్రేమ యొక్క స్పందన లభించిన కారణంగా ముందుకు కూడా వెళుతున్నారు. కాని - ఏ విధంగా ప్రేమలో అనుభవజ్ఞులుగా అయి ముందుకు వెళుతున్నారో అలాగే సృతి అనే సబ్జెక్టులో కూడా అనేక జన్మల వికర్మలను వినాశనం చేయడంలో ఇంకా అటెన్షన్ ను ఇవ్వండి అని బాబా చెబుతున్నారు. ఎందుకు? వికర్మలు వినాశనమయుతే కలిసి వెళతారు, లేకపోతే వెనుకవస్తారు మరియు ప్రేమకు రెస్పాన్స్ ఏమిటంటే ప్రేమించే ఆత్మ ఏదైతే చెబుతుందో అది చేసి తీరుతారు. ఎప్పుడైతే పిల్లల ప్రేమ బాబాతో ఉందో మరి వారు తోడుగా ఉండాలని బాబా కూడా కోరుకుంటారు. రాజధానిలో కూడా బ్రహ్మాబాబాతో కలిసి రాజధానిలోకి రావాలని కోరుకుంటారు. రాజధానిలోకి రావడము అనగా రాయల్ ఫామిలీలోకి రావాలి. సింహాసనంపై కూర్చోకోకపోయినా రాయల్ ఫామిలీలోని రాజ్యకుటుంబంలోని సహచరులుగా అయినా అవ్వాలి. దీనిని ఎలా గుర్తించగలము అన్నది బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు. మీరు ఎప్పటినుండైతే వచ్చారో, మీ జ్ఞాన ఆయువు ఎంతైతే ఉందో అంత కాలంలో మీరు బాప్ దాదాల హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారా? కావున ఎవరైతే ఎక్కువ సమయం హృదయ సింహాసనంపై ఉన్నారో, మట్టిలో పాదం మోపలేదో వారు దాని అనుసారంగా రాయల్ ఫామిలీలో సమీప సంబంధంలో ఉంటారు, రాయల్ ఫామిలీ వారిగా ఉంటారు. కావున ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నవారు తోడుగా ఉండడంలో వెనుక ఉండరు. ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారు ద్వాపర, కలియుగాలలో కూడా సంబంధంలో ఉంటారు, సమీపంగా ఉంటారు. కావున ప్రేమను నిలబెట్టుకునేవారిగా, సదా హృదయ సింహాసనాధికారులుగా ఉండండి మరియు జన్మజన్మల హక్కును తీసుకోండి. కావుననే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు. ప్రేమ సబ్జెక్టులో మెజారిటీ పాసై ఉన్నారని బాప్ దాదా సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడిక అన్ని సబ్జెక్టులలోను పాస్ అవ్వవలసిందే. పాస్ అవ్వాలి మరియు పాస్(సమీపం)గా ఉండాలి. అచ్ఛా!

           ఏ పిల్లలైతే మొట్టమొదటిసారిగా వచ్చారో వారు లేవండి, మొదటిసారి వచ్చినవారు! సగంక్లాసు క్రొత్తవారే! వచ్చారు, సంతోషం, బాప్ దాదా వచ్చినవారందరికీ స్వాగతం పలుకుతున్నారు. అభినందనలు. మొదటిసారి వచ్చినందుకు అభినందనలు. ఆలస్యంగా వచ్చినా కానీ టూ లేట్ బోర్డు పడకముందే వచ్చారు. కొద్ది సమయంలో తీవ్ర పురుషార్థులుగా అయి మీ భవిష్యత్తును ఎంతగా పెంచుకోవాలనుకుంటే అంతగా తీవ్ర పురుషార్థం ద్వారా ముందుకు వెళ్ళవచ్చు, ఇప్పుడు ఈ అటెన్షన్ ను ఉంచాలి. అయినా ఇప్పుడింకా పురుషార్థము చేసే మార్జిన్ ఉంది. ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే అంతగా ముందుకు వెళ్ళవచ్చు. బాప్ దాదా మరియు ఈ దైవీ పరివారము మీకు తోడుగా ముందుకు వెళ్ళేందుకు వైబ్రేషన్లు ఇస్తారు. కావున ముందుకు వెళ్ళండి, ధైర్యమును ఉంచండి. ధైర్యం మీది మరియు సహాయం బాప్ దాదా , మరియు పరివారముది. ముందుకు వెళ్ళండి. సరేనా! అవును అనండి, ముందుకు వెళ్ళండి. అచ్ఛా!

సేవా టర్న్ గుజరాత్ జోన్ వారిది:- గుజరాత్ వారు లేవండి, చేతులూపండి, గుజరాత్ వారి సంఖ్యయే ఈ హాలులో సగంకన్నా ఎక్కువగా ఉంది. బాగుంది. ఎవరైతే గుజరాత్ నుండి మొదటిసారి వచ్చారో వారు లేచి నిల్చోండి. అచ్ఛా, ఎవరైతే మొదటిసారి వచ్చారో వారిలో కూడా గుజరాత్ వారు ఎక్కువగా ఉన్నారు, అచ్ఛా. అభినందనలు.

           ఇప్పుడు గుజరాత్ నుండి రెగ్యులర్‌గా వచ్చేవారు మరియు టీచర్లు లేవండి, అచ్ఛా, గుజరాత్ సేవలో అయితే ముందుకు వెళుతున్నారు, ఇప్పుడిక ఏ విషయంలో నెంబర్ తీసుకోవాలి? సంఖ్యలో అయితే నెంబర్ తీసుకున్నారు, ఇప్పుడిక నిర్విఘ్నులుగా అవ్వడంలో నెంబరు తీసుకోవాలి. బాప్ దాదా ఏదైతే చెబుతున్నారో అందులో ఇప్పటివరకు ఏ జోన్ వారి పేరు రిజల్ట్ లో రాలేదు. అందరి లక్ష్యము ఉంది కానీ ఇప్పటివరకు ఈ విషయంలో నెంబర్ తీసుకోలేదు. ఈ నెంబరును తీసుకోవాలి అన్న లక్ష్యమునుంచడం బాప్ దాదా గమనించారు. కానీ, ప్రాక్టికల్ లో ఇప్పటివరకు ప్లాన్ నే తయారు చేస్తున్నారు మరియు ఇప్పుడు ప్రతి ఒక్కరూ- మేము నెంబర్ తీసుకోవాలి అని భావించాలి. తీసుకుంటారా? తీసుకోవాలన్నప్పుడు మరి ముఖ్యులు ఇంతమంది ఎవరైతే లేచారో వారంతా తమ తమ సెంటర్‌ను, ప్రతి ఒక్కరూ తమ తమ ఏరియాను అటెన్షన్ ను ఉంచి క్రొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళేందుకు యోగ్యముగా ఏర్పాట్లు చేయవచ్చు కదా! అక్కడైతే రాజులు, ప్రజలు అందరూ ఒకే విధంగా ఉంటారు, నిర్విఘ్నంగా ఉంటారు. కాని, సంస్కారాలనైతే అక్కడ నింపుకోరు కదా! ఇక్కడే నింపుకోవాలి. కావున బాప్ దాదా అందరినీ చిన్న జోన్ వారైనా లేక పెద్ద జోన్ వారైనా అందరిలోను ఈ రిజల్టును చూడాలనుకుంటున్నారు! చెప్పండి, నిమిత్తమై ఉన్న దాదీలు లేక దాదాలు ఈ మొదటి బహుమతిని ఎవరు తీసుకుంటారు? గుజరాత్ వారు తీసుకుంటారా? ఎప్పటిలోపు తీసుకుంటారు? 6 మాసాలు కావాలా? 6 మాసాలకన్నా త్వరగా చేసేస్తారా? అభినందనలు. మొదటి నెంబరు ఎప్పుడు కనిపిస్తుందో దాదీలు చెప్పండి- కనిపిస్తుంది కదా!

మధువనంవారు లేవండి, మధువనంవారు:- అచ్ఛా! చేతులు ఊపండి. మధువనంవారు చేతులెత్తండి. శాంతివనము లేక పైన పాండవ భవనము, పైన ఉన్న మూడు స్థానాలు మరియు ఒకటేమో క్రింద ఉన్న శాంతివనము మరియు ఐదవది- హాస్పటల్ కూడా ఉంది, కావున ఐదుగురు పాండవులు ఉన్నారు కదా! కావున మొదట మధువనంవారు చేస్తారా? ఎవరైతే చేస్తారో వారు చేతులెత్తండి. కలపడమైతే తెలుసు కదా! మధువనంవారు అదృష్టవంతులు. ఎంతో కొంత సంఘటనను పక్కా చేసుకొని సహచరులను తయారుచేసుకోండి. వేరే విషయాలలో తోటివారిగా చేసుకోకండి, ఈ విషయంలో పరస్పరం తోటివారిగా అయి మొదటి నెంబరు మధువనంవారు తీసుకోవాలి. తీసుకుంటారు కదా! ఇప్పుడు ఇలా చేతులూపండి. గతించిందేదో గతించిపోయింది, ఏదైతే జరిగిందో అందరూ చూశారు, విన్నారు మరియు మధువనంవారికి చాలా స్వర్ణిమ అవకాశము ఉంది. మధువనము అని అన్నప్పుడు ఇందులో అందరూ వచ్చేశారు. మధువనం వారందరూ కలిసి చేయండి, పాండవ భవనంవారు వేరు లేక ఇంకొక స్థానంవారు వేరు అని కాదు. మధువనము అని అంటే అందరూ ఒక్కటే, కావున మధువనంవారు చేస్తాము అని భావిస్తున్నారా? ఎవరైతే చేస్తారో వారు చేతులెత్తండి, అందరూ చేతులెత్తారు, చేయడం ఏమంత పెద్ద విషయం, బాప్ దాదా ఉన్నారు, దాదీలు ఉన్నారు కావున ఇదేమంత పెద్ద విషయం కాదు అని భావించేవారందరూ చేతులెత్తారు. దాదీలు ఏమని భావిస్తున్నారు? మధువనంవారైతే నెంబర్ వన్, బాగుంది. బాబా అందరికీ ఇది చేసి చూపించాలని చెప్పారు. కాని, మధువనంవారు మధువనంవారే కదా! గుజరాత్ వారు చేసి చూపిస్తాము అని అన్నారు, బాగుంది, అందరూ వైబ్రేషన్లు ఇవ్వండి, అయిపోతుంది, ఇదేమంత పెద్ద విషయం కాదు, విఘ్నాల నామరూపాలు కూడా ఉండకూడదు. ఏదైనా విషయం జరిగి, మాటలు జరిగినా ఇక సమాప్తం. కొంతకాలం క్రితం దాదీ ఉన్నప్పుడు ఒకసారి అందరూ హాజీ పాఠమును పక్కా చేసుకున్నారు. కాదు అన్న పదమే ఉండకూడదు. కేవలం హాజీ, చాలా బాగుంది. మధువనం మొదటి నెంబర్ లోకి వెళుతుంది. బాప్ దాదాకు మధువనము అంటే నషా ఉంది కదా! ప్రతి ఒక్క జోన్ వారిపైనా గర్వముగా ఉంది, ఇప్పుడు మధువనము ముందుకు వచ్చింది, కాని బాప్ దాదా అన్ని జోన్లవారికి హాజీ అన్న పాఠమును పక్కా చేసుకోమని చెబుతున్నారు. మధురమైన ఆత్మ అన్న పాఠము అందరికీ పక్కాగా ఉంది. మధువనంవారైతే బహుమతి తీసుకోవాలి. ఒక్క క్షణంలో గతానికి బిందువును పెట్టగలరా! పోనీ పురుషార్థులు, ఏదైనా జరిగిపోయినా, ఇక గతానికి బిందువును పెట్టేసి ఎగరండి, ఎగిరేవారు వెనుక ఉన్నదానిని(గతాన్ని) వదిలివేస్తారు, అప్పుడే ఎగురగలుగుతారు. కావున చాలా బాగుంది.

          ఇప్పుడు గుజరాత్ వారు ఏదైనా నవీనతను చేయాలి. బాప్ దాదా ఢిల్లీ వారికి కూడా ఇప్పుడు ఏదైనా నవీనతను చేయండి అని చెప్పారు. ఇప్పుడు విదేశము మరియు దేశంవారు కలిసి యువత ఈ కార్యక్రమమునైతే చేశారో అందులో మంచి రిజల్టు రాగలదని బాప్ దాదాకు సమాచారం లభించింది. ఇప్పుడైతే ఇన్వెన్షన్ ను ప్రారంభించారు. కాని, భారతదేశము లేక విదేశము ఇరువురూ కలిసి ఇంకా అద్భుతమును చేయవచ్చు. ఇప్పుడైతే ప్రారంభించారు కాని ఢిల్లీవారు మంచి ధైర్యమును ఉంచారు. ప్రారంభించారు, ఇప్పుడిక విశ్వంలో ఇది వ్యాపించిపోతే విదేశము మరియు దేశము కలిసి ఒక్క బ్రాహ్మణ పరివారంగా అయ్యారు మరియు విశ్వమును కూడా ఒకటిగా చేస్తారు. ప్రారంభమైతే జరిగింది, ఇప్పుడు ముస్లింలు కూడా ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ముఖ్య దేశాల నుండి అందరూ వచ్చే కార్యక్రమమును ఒకటి తయారుచేయండి మరియు దాని ద్వారా ఒక్క తండ్రి పిల్లలు పరస్పరంలో సోదరీ సోదరులు, బ్రదర్ హుడ్ మరియు సిస్టర్ హుడ్ అన్నది విశ్వంలో ప్రసిద్ధమవ్వాలి, ఈ శబ్దము వ్యాపిస్తూ ఉండాలి. ఒకే స్టేజీపై అన్నివైపులా ఉన్నవారి విశేష అనుభవము ఉండాలి. అందరూ ప్లాన్లనైతే తయారుచేస్తున్నారు. ఇప్పుడు బేహద్ లోకి వెళుతున్నారు. ఇదంతా ఒకే ఈశ్వరీయ కుటుంబమని అందరికీ తెలియాలి, ఇది ప్రసిద్ధమవ్వాలి. మీరందరూ వస్తున్నారు. సేవ కూడా చేస్తున్నారు, స్వపురుషార్థం కూడా చేస్తున్నారు మరియు ఇది ఈశ్వరీయ కార్యము, ఇది ఒకే కుటుంబము అన్నది కూడా ప్రపంచం ముందు ప్రసిద్ధమైపోతుంది. అచ్ఛా!

           గుజరాత్ వారు సంకల్పమునైతే చేశారు. చాలా బాగుంది, ఇప్పుడు ఏదైనా నవీనతను కూడా చేయండి. ప్రతి జోన్ వారు ఏదైనా క్రొత్త ప్లాన్‌ను తయారుచేయండి. కేవలం మధువనం లేక పెద్ద నగరాలు చేయడం కాదు, అందరి ప్లాన్లలో ఏదో ఒక విశేషత ఉంటుంది. ఆ విశేషతలనన్నింటినీ కలిపి ఎటువంటి ప్లానును తయారుచేయాలంటే, ఇది మా కార్యక్రమము అని అందరూ భావించాలి. ఇందులో ఏదైనా కలపాలనుకుంటే అందరూ తమ తమ ఆలోచనలను ఇవ్వవచ్చు. ఇప్పుడు కేవలం శబ్దమును త్వరత్వరగా వ్యాపింపజేయండి. ఎవరైతే మిగిలిపోయారో వారికి కూడా ఎంతో కొంత సమయమైతే లభించాలి కదా! ఎంతో కొంత వారసత్వాన్నైతే పొందాలి కదా! అంతిమంలో వస్తే ఏం పొందుతారు? కావున ఆలోచించండి, త్వరత్వరగా ఎంతో కొంత వారసత్వాన్ని పొందాలి, లేకపోతే- మాకు చివరిలో ఎందుకు చెప్పారు, ఎంతో కొంత వారసత్వమునైతే తీసుకునేవారము కదా అని మిమ్మల్నే తప్పుపడతారు. అందరికీ ముక్తి యొక్క వారసత్వమైతే తప్పక లభిస్తుంది, కాని జీవన్ముక్త వారసత్వాన్ని పొందాలి. అచ్ఛా!

గుజరాత్ కు చెందిన 50 మంది కన్యలు సమర్పితమయ్యారు:- అచ్చా, శక్తి లభించిందా! సమర్పితమవ్వడము అనగా బాప్ దాదా ఏదైతే అన్నారో అది చేయడము. కావున సంకల్పం చేశారా? బాప్ దాదా చెప్పడము మరియు మేము చేయడము... ఈ సంకల్పమును చేశారా? చేతులెత్తండి. ముందుకు వెళ్ళి సమర్పణ సమారోహమునైతే చేశారు, ఇప్పుడిక ముందు ఏ ట్రైనింగ్ చేస్తారు లేక సమర్పణ చేస్తారు? ఏ విఘ్నమునైనా నిర్విఘ్నముగా తయారు చేసేందుకు నిమిత్తులుగా అవుతారా? ఈ శక్తి వచ్చింది కదా! సమర్పణలో ఇది కూడా ఉంది కదా! కావున సమర్పణ అయ్యారు, అలాగే నిర్విఘ్నంగా ఉంటాము మరియు స్థానమును కూడా నిర్విఘ్నంగా తయారుచేస్తాము, నెంబరు తీసుకుంటాము.-- ఇందులో కూడా మంచి నెంబర్ ను తీసుకోవాలి. బాగుంది, ఒక్క అడుగైతే వేసారు, ఇంకా ముందు ముందు ముందుకు అడుగులు వేస్తూనే ఉండండి. బాగుంది. ముందు ముందుకు వెళుతూ ఉంటారు మరియు తీసుకువెళుతూ ఉంటారు. అచ్ఛా, ఇప్పుడు మీరు నోరు తెరవండి మరియు గులాబ్ జామూన్ తినండి, బాప్ దాదా కూడా సమర్పణ సందర్భంగా టోలీ తినిపిస్తారు.

డబుల్ విదేశీయులతో:- డబుల్ విదేశీయులు అనగా డబుల్ పురుషార్థులు, డబుల్ తీవ్ర పురుషార్థులు. ఉల్లాస ఉత్సాహాలు ఎంతగానో ఉండడం బాప్ దాదా చూశారు. ఎలా ఉన్నా కాని, మెజారిటీ మధువనానికి ప్రతి సంవత్సరము చేరుకుంటారు. పరివారంతో మరియు బాప్ దాదాతో సమ్ముఖంగా మిలనము జరిపే ఉత్సాహము ఎంతగానో ఉంది. ఎలా జమ చేసుకున్నా కాని, వీరి టికెట్‌ను జమ చేసుకునే భిన్న భిన్న విధానాలు చాలా మంచిగా ఉంటాయి అన్నది బాప్ దాదా చూశారు. ఎలాగైనా చేసి ప్రతి సంవత్సరం మెజారిటీ వచ్చి చేరుకుంటారు. విదేశాన్ని కూడా భారతదేశంగా చేసేశారు, మధువనవు వాయుమండలంతో, బాప్ దాదాలపై కూడా ప్రేమ ఉంది. వీరి ఉల్లాస ఉత్సాహాలను మరియు వీరి జమ చేసుకునే భిన్న భిన్న విధానాలను చూసి ఓహో విదేశీలయులు, ఓహో! అని బాప్ దాదాలకు కూడా హృదయపూర్వకంగా ఎంతో ప్రేమ కలుగుతుంది. ప్రారంభంలో అది పెద్ద విషయంలా అనిపించేది. ఇప్పుడు ఏ విధంగా భారతదేశపు ఇతర గ్రూపులు వస్తూ ఉంటాయో అలా విదేశీయులు రాని గ్రూపంటూ ఏదీ ఉండదు. కావున ఇది మధువనంపై మరియు మొత్తం విశ్వపు పరివారంపై ఉన్న ప్రేమకు గుర్తు. బాప్ దాదాపై ప్రేమ అయితే ఉండనే ఉంది. బాప్ దాదాను కూడా హృదయపూర్వకంగా నా బాబా అని అంటారు. ఎందుకంటే బాప్ దాదా అమృతవేళలో కూడా విదేశంలో చుట్టివస్తారు. బాప్ దాదాకు రావడము, వెళ్ళడంలో ఎంత సమయం పడుతుంది? ఎలా ఉన్నారో చూసేందుకు బాప్ దాదా అక్కడ కూడా తిరిగివస్తారు. లగనము ఉంది, మగనముగా అయ్యేందుకు పురుషార్థం బాగుంది. ఇప్పుడు విదేశంవారిలో మెజారిటీలో ఒక లగనమును చూశారు. ఏ విధంగా భారతదేశంలో మిగిలి ఉన్న స్థానాలు ఉండిపోకూడదు అని భావిస్తున్నారో అలాగే విదేశంలో కూడా ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఎంత వీలైతే అంత తిరిగివస్తూ కూడా సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇప్పుడు విదేశాలలో ఎన్ని దేశాలలో సెంటర్లు ఉన్నాయి? (137 దేశాలలో సేవ జరుగుతూ ఉంది). ఎన్ని సంవత్సరాలలో ఇన్ని తయారయ్యాయి (లండన్ వారు. 2011లో 40 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకుంటారు.) బాగుంది, చప్పట్లు కొట్టండి. స్పెయిన్, మెక్సికో మొదలైన అన్ని స్థానాలలో 30 సంవత్సరాల సేవా వేడుకలను జరుపుకుంటున్నారు). బాగుంది, మీ అందరికీ కూడా ఇదంతా విని సంతోషంగా అనిపిస్తోంది కదా! ఎందుకు? ఏ దేశమైనా, భారతదేశమైనా, విదేశమైనా తక్కువలో తక్కువ తండ్రి వచ్చారన్న ఈ సందేశమన్నా చేరుకోవాలి. మా తండ్రి వచ్చారు. కానీ మాకు సందేశము కూడా ఇవ్వలేదు అని ఎవరూ అనకూడదు. భారతదేశంలో అయినా, విదేశంలో అయినా ఎక్కువ సమయం కాకపోయినా కనీసం భగవంతుడు వచ్చేశారు అన్న సందేశమైనా అందరికీ లభించాలి. భగవంతుడు వచ్చారు మరియు వారసత్వాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు...! ఇందులో మిగిలిపోకూడదు. సందేశము ఇవ్వడం మీ పని, దానిపై నడవడం వారి పని. కాని, ఎవరు ఎక్కడ ఉంటే అక్కడకు సందేశాన్ని చేర్చడం మీ పని. ఇప్పుడు విజ్ఞాన సాధనాలు పెరుగుతూ ఉన్నాయి, చాలా త్వరత్వరగా ఏ సందేశమైనా వ్యాపించిపోతోంది, కావున ఎటువంటి ప్లానును తయారు చేయాలంటే, దానిద్వారా సందేశము అందరివరకు చేరుకోవాలి. ఇది జరుగగలదా? జరుగగలదా? కష్టమా? కాదు. కావున ఇప్పుడు లిస్టు తయారుచేయండి. భారతదేశంలో ఎంతవరకు సందేశం చేరుకుంది. విదేశంలో ఎంతవరకు చేరుకుంది. ఏదైనా సాధనాన్ని తయారుచేయండి. సైన్స్ యొక్క సాధానాలైనా లేక సంబంధాన్ని ఉంచే సాధనమైనా కాని ఫిర్యాదు రాకూడదు. ఇప్పుడు సందేశం చేరని దేశాలు అనేకం వెలువడతాయి. చాలా మంచి సాధనాలు వెలువడుతున్నాయి, కానీ వాటిని ఎలా ఉపయోగించాలి అన్న ప్లానును తయారుచేయవలసి ఉంటుంది. అచ్ఛా!

            నలువైపులా ఉన్న పిల్లలకు బాప్ దాదా ఇప్పుడు అభినందనలు తెలుపుతున్నారు. ప్రతిరోజు, ప్రతి గంట ముందుకు వెళ్లేందుకు అభినందనలు. సమయం మీకోసం ఎదురుచూస్తోంది, మీరు సమయం కోసం ఎదురుచూడకండి. మీరు సమయమును ఎంత సమీపంగా తీసుకురావాలనుకుంటే, సమాప్తిని ఎంత సమీపంగా తీసుకురావాలనుకుంటే అంత సమీపంగా తీసుకురావచ్చు. సమయం వచ్చినప్పుడు సిద్ధమవుతాము అన్న సంకల్పం బ్రాహ్మణులకు ఉండకూడదు. మీరు సమయాన్ని సమీపంగా తీసుకురండి. ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలు సమయమునైన నన్ను సమీపంగా తీసుకురావాలి అని సమయం బాబాకు చెబుతోంది. ఇప్పుడు సమాప్తిని సమీపంగా తీసుకురమ్మని ప్రకృతి కూడా బాబాతో అంటోంది. మరి బాప్ దాదా ఏమని జవాబు చెప్పాలి? ఏమని జవాబు చెప్పాలి? సమయం ఇక వచ్చేసింది అని అనాలా? మీవైపు నుండి జవాబు ఏమిటి? ఏం జవాబు చెప్పాలి? చెప్పండి. ఇప్పుడు సమాప్తిని సమీపంగా తీసుకురావడం అనగా స్వయమును సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారుచేయడం.. ఎందుకంటే బాప్ దాదా ఒంటరిగా వెళ్ళరు, పిల్లలతో కలిసే వెళతారు. కావున డేట్ ఫిక్స్ చేయండి ఎప్పటివరకు? బాబా పనినైతే ఇచ్చేశారు, పరస్పరంలో సలహా తీసుకోండి. ప్రకృతికి బాప్ దాదా ఏమని జవాబు చెప్పాలి? ప్రకృతి చాలా వ్యాకులతతో ఉంది. దు:ఖిత ఆత్మలు మనస్సులో ఎంతగానో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పుడు మనసా సేవను ఎక్కువగా పెంచండి. మనసా సేవ చేస్తున్నారు కానీ అది ఇంకా, ఇంకా పెరుగుతూ ఉండాలి. దాన్ని ఇంకా పెంచండి, ఎందుకంటే ప్రకృతి మరియు దు:ఖిత ఆత్మలు బాబా వద్దకు వస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. కావున వారికి మీరు ఎంతో కొంత శాంతి లేక సుఖము యొక్క అనుభూతిని కలిగించండి. వారు ఒక్క క్షణకాలపు శాంతిని కూడా కోరుకుంటారు, కొద్ది శాంతిని ఇచ్చేయండి అని కోరుకుంటూ ఉంటారు. ఎవరైతే ఆకలితో ఉంటారో వారు ఎంతో కొంత లభించాలని, కొద్దిగా అయినా దొరకాలని భావిస్తారు. కావున ఇప్పుడు మనసా సేవను కూడా పెంచండి. వాచా సేవ అయితే జరుగుతోంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా, బాప్ దాదా ఏ హోంవర్క్ అయితే ఇచ్చారో అది గుర్తుంచుకోండి మరియ గుర్తుచేయండి, అచ్ఛా!

           బాప్ దాదాల హృదయ సింహాసనాధికారులైన పిల్లలకు, విశ్వకళ్యాణ కర్తవ్యంలో సదా ముందుకు వెళ్ళేవారికి బాప్ దాదా దృష్టిని ఇస్తూ, హృదయపూర్వకమైన ప్రేమను మరియు అభినందనలను ఇస్తున్నారు. అభినందనలు, అభినందనలు. పిల్లలు ప్రతిఒక్కరూ దూరంగా కూర్చొని కూడా సమ్ముఖంగా అనుభవం చేసుకుంటున్నారు మరియు బాప్ దాదా పిల్లలందరినీ తమ హృదయంలో ఇముడ్చుకుంటూ పిల్లలందరికీ నమస్తే, నమస్తే అని చెబుతున్నారు.

దాదీలతో:-(బాబా ఇచ్చే ఫోర్సు అందరినీ ప్రేరేపిస్తోంది, తొందరగా అందరికీ సందేశము లభిస్తుంది.) చేరుకుంటోంది, కాని ఈ సంస్కారమేదైతే ఉందో అది వింటూ ఫోర్సు వస్తుంది కాని సంస్కారము మధ్యలో పరదా వేసేస్తుంది. బాబా అయితే చేస్తున్నారు, కాని అందరూ సంఘటనలో- మేమందరమూ కలిసి చూపిస్తాము అని ప్రతిజ్ఞ చేయాలి మరియు రోజూ పరస్పరం ఎవరైతే కలిసి ఉంటారో వారందరూ కలిసి చర్చించుకొని పడుకున్నట్లయితే తమ రోజు సంపన్నమవుతుంది.

మోహినీ అక్కయ్యతో:- అయిపోతుంది, మధ్యలో చిన్న పొరపాటు చేశావు కావుననే పెరిగిపోయింది, కొద్దిగా తినడము, తాగడముపై ధ్యానమును ఉంచు, ఏడైరెక్షన్ అయితే లభిస్తుందో దాని అనుసారంగా చేయి, అప్పుడు మంచిగా అయిపోతుంది.(బాబా ఈ శరీరాలను యవ్వనంగా చేసెయ్యండి కదా!) ఇది డ్రామా చేతిలో ఉంది, బాబా చేతిలో లేదు. (బాప్ దాదా చేతిలోనే ఉంది.) అది అల్పకాలికంగా పని నడిపేందుకే ఉంది.

పరదాదీతో:- చూడండి, తాను సంతోషంగా ఉంటుంది.        

రమేష్ భాయ్ తో:- మీరు ఏ ప్లాన్ అయితే తయారుచేశారో అది బాగుంది, అది చేయవచ్చు, కూర్చొని మీ ప్లాన్ తయారు చేసి ప్రారంభించవచ్చు మరియు క్రొత్త క్రొత్త ఇన్వెన్షన్ లేవైతే వెలువడుతున్నాయో అవి ఏమేం వెలువడుతున్నాయో, మనకు వాటివల్ల ఉపయోగము ఏమి ఉండవచ్చో చూడండి. ఏదైతే నడుస్తోందో అదైతే నడుస్తోంది, నవీనతను తీసుకురండి.

శాంతి అక్కయ్యతో:- అనారోగ్యంలో స్వయాన్ని నడుపుకోవడం మంచిగా వచ్చింది. నేను అనారోగ్యంగా ఉన్నాను, నేను అనారోగ్యంగా ఉన్నాను అని కొందరు కూర్చుండిపోతారు. కాని, మీకు నడిపించడం వచ్చేసింది. (బాబా, మీకు థాంక్స్) శరీరమును నడిపించడం వచ్చినందుకు మీకు కూడా థాంక్స్.

గోలో భాయ్ శాంతివనంలో సోలార్ ను పెట్టిస్తున్నారు:- ముందు ముందు ఏమౌతుంది అన్న భయం ఇప్పుడు తొలగిపోయింది కదా! ఎలా అవుతుంది అన్న భయం లేదు కదా! ఎందుకంటే, ఇది జరగాలి అని అందరి సంకల్పము ఉంది, అందరి ఉత్సాహము ఉంది, కావుననే అందరి సంకల్పము తీసుకువస్తోంది.

Comments