11-04-1986 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“శ్రేష్ఠ భాగ్యముయొక్క చిత్రమును తయారుచేసుకునే యుక్తి”
భాగ్యాన్ని తయారుచేసే బాప్ దాదా ఈ రోజు పిల్లలందరి శ్రేష్ఠ భాగ్యమునకు చెందిన చిత్రమును చూస్తున్నారు. అందరూ భాగ్యవంతులుగా అయ్యారు, కానీ ప్రతి ఒక్కరి భాగ్యమునకు చెందిన చిత్రము యొక్క మెరుపు ఎవరిది వారిది. చిత్రాలను తయారుచేసేవారు చిత్రాలను తయారుచేసినప్పుడు వాటిలో కొన్ని చిత్రాలు వేల రూపాయల విలువగలవిగా, అమూల్యమైనవిగా ఉంటే, మరికొన్ని సాధారణమైనవిగా కూడా ఉంటాయి. ఇక్కడ బాప్ దాదా ద్వారా లభించిన భాగ్యమును, అదృష్టమును చిత్రములోకి తీసుకురావటము అనగా ప్రాక్టికల్ జీవితములోకి తీసుకురావటము. ఇందులో తేడా వచ్చేస్తుంది. భాగ్యాన్ని తయారుచేసేవారు ఒకే సమయములో అందరికీ భాగ్యాన్ని పంచారు మరియు ఒక్కరే అందరికీ భాగ్యాన్ని పంచారు. కానీ భాగ్యాన్ని చిత్రములోకి తీసుకువచ్చే ఆత్మలు ప్రతి ఒక్కరు వేరు-వేరుగా ఉన్న కారణంగా వారు తయారుచేసుకున్న చిత్రాలలో నంబరువారుగా కనిపిస్తారు. ఏ చిత్రము యొక్క విశేషత అయినా నయనాలలో, మందహాసంలో ఉంటుంది. ఈ రెండు విశేషతలతోనే చిత్రము యొక్క విలువ ఉంటుంది. మరి ఇక్కడ కూడా భాగ్యము యొక్క చిత్రములో ఈ రెండు విశేషతలే ఉన్నాయి. నయనాలు అనగా ఆత్మిక విశ్వ కళ్యాణి, దయాహృదయ, పరోపకార దృష్టి. ఒకవేళ దృష్టిలో ఈ విశేషతలు ఉన్నట్లయితే భాగ్యము యొక్క చిత్రము శ్రేష్ఠంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలు దృష్టి, మందహాసము మరియు ముఖంలోని మెరుపు. ఇదే సదా సంతుష్టంగా ఉండేందుకు, సంతుష్టత మరియు ప్రసన్నతల మెరుపు. ఈ విశేషతల ద్వారానే ముఖంపై సదా ఆత్మిక మెరుపు వస్తుంది, ఆత్మిక మందహాసం అనుభవమవుతుంది. ఈ రెండు విశేషతలే చిత్రము యొక్క విలువను పెంచుతాయి. కనుక ఈరోజు ఇదే చూస్తూ ఉన్నారు. భాగ్యము యొక్క చిత్రమునైతే అందరూ తయారుచేసారు. చిత్రాన్ని వేసే కలము నైతే బాబా అందరికీ ఇచ్చారు. ఆ కలము - శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ కర్మల జ్ఞానము. శ్రేష్ఠ కర్మ మరియు శ్రేష్ఠ సంకల్పము అనగా స్మృతి. ఈ జ్ఞాన కలము ద్వారా ప్రతి ఆత్మ తన భాగ్యము యొక్క చిత్రమును తయారు చేసుకుంటుంది మరియు తయారుచేసుకుంది కూడా. చిత్రమైతే తయారైంది. ముఖకవళికలు కూడా తయారయ్యాయి. ఇప్పుడు “సంపూర్ణత” మరియు బాబా సమానంగా అవ్వడము యొక్క చివరి టచింగ్ మిగిలి ఉంది. డబల్ విదేశీయులు చిత్రాలను తయారుచేయడం ఎక్కువగా ఇష్టపడతారు కదా! మరి బాప్ దాదా కూడా ఈరోజు అందరి చిత్రాలను చూస్తున్నారు. నా చిత్రము ఎంతవరకు విలువైనదిగా తయారైంది అన్నది ప్రతి ఒక్కరూ తమ చిత్రంలో చూసుకోగలరు కదా! సదా తమ యొక్క ఈ ఆత్మిక చిత్రాన్ని చూసుకుంటూ ఇందులో సంపూర్ణతను తీసుకొస్తూ వెళ్ళండి. విశ్వములోని ఆత్మలతో చూసుకుంటే మీరు శ్రేష్ఠ భాగ్యవంతులుగా, కోట్లలో కొద్దిమందిగా, కొద్దిమందిలో కూడా కొద్దిమందైన అమూల్యమైనవారిగా మరియు శ్రేష్ఠ భాగ్యవంతులుగా అయితే ఉండనే ఉన్నారు, కానీ ఒకటేమో శ్రేష్ఠము, ఇంకొకటి శ్రేష్ఠాతి శ్రేష్ఠము. మరి శ్రేష్ఠంగా అయ్యారా లేక శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా అయ్యారా? దీనిని చెక్ చేసుకోవాలి. అచ్ఛా!
ఇప్పుడు డబల్ విదేశీయులు రేస్ చేస్తారు కదా! ముందు నంబరును తీసుకోవాలా లేక ముందున్నవారిని చూసి సంతోషపడాలా! వారిని చూస్తూ-చూస్తూ సంతోషపడటము కూడా అవసరము, కానీ స్వయం వెనుక ఉంటూ చూడకండి, వారితో కలిసి ఉంటూ వారిని చూసి హర్షితులుగా ఉండండి. స్వయము కూడా ముందుకు వెళ్ళండి మరియు వెనుకనున్న వారిని కూడా ముందుకు తీసుకువెళ్ళండి. దీనినే పర ఉపకారి అంటారు. స్వార్థ భావం నుండి సదా ముక్తులై ఉండటమే పర ఉపకారిగా ఉండటంలోని విశేషత. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యములో, ప్రతి సహయోగి సంగఠనలో ఎంత నిస్వార్థముగా ఉంటారో, అంతగానే పరోపకారులుగా ఉంటారు. స్వయాన్ని సదా నిండుగా అనుభవము చేసుకుంటారు. సదా ప్రాప్తి స్వరూప స్థితిలో ఉంటారు. అప్పుడు పరోపకారి యొక్క అంతిమ స్థితిని అనుభవము చేసి, ఇతరులకు కూడా అనుభవము చేయించగలరు. బ్రహ్మాబాబాను చూసారు కదా, చివరి సమయపు స్థితిలో “ఉపరామము” మరియు “పరోపకారము” అన్న ఈ విశేషతలను సదా చూసారు. స్వయము కొరకు ఏమీ స్వీకరించలేదు. మహిమనూ స్వీకరించలేదు, వస్తువులనూ స్వీకరించలేదు, ఉండే స్థానాన్ని కూడా స్వీకరించలేదు. స్థూలముగా మరియు సూక్ష్మముగా సదా “ముందు పిల్లలు” అన్నట్లు ఉన్నారు. దీనినే పరోపకారము అని అంటారు. ఇదే సంపన్నతకు, సంపూర్ణతకు గుర్తు. అర్థమైందా!
మురళీలనైతే చాలానే విన్నారు. ఇప్పుడు మురళీధరులుగా అయ్యి సదా నాట్యము చేస్తూ, నాట్యము చేయిస్తూ ఉండాలి. మురళీ ద్వారా పాము విషాన్ని కూడా అంతము చేస్తారు. కనుక మీరు ఎటువంటి మురళీధరులుగా ఉండాలంటే, ఎవరిలో ఎటువంటి కఠిన స్వభావ-సంస్కారాలున్నా కానీ, వాటిని కూడా వశము చేసుకోవాలి అనగా వారిని వాటినుండి విముక్తులుగా చేసి వారిచేత నాట్యము చేయించండి. హర్షితులుగా చేయండి. ఎవరెవరు ఇటువంటి యోగ్యమైన మురళీధరులుగా అవుతారు అన్న రిజల్టును ఇప్పుడు చూస్తాము. మురళీపట్ల కూడా ప్రేమ ఉంది, మురళీధరునిపట్ల కూడా ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమకు ఋజువు ఏమిటంటే - మురళీధరునికి పిల్లలు ప్రతి ఒక్కరిపట్ల ఏదైతే శుభమైన ఆశ ఉందో, దానిని ప్రాక్టికల్ లో చూపించాలి. ప్రేమకు గుర్తు - ఏదైతే చెప్పారో, అది చేసి చూపించటము. ఇటువంటి మాస్టర్ మురళీధరులే కదా! ఇలా తయారవ్వవలసిందే, ఇప్పుడు తయారవ్వకపోతే మరెప్పుడు తయారవుతారు! చేస్తాములే అన్న ఆలోచన చెయ్యకండి. చెయ్యాల్సిందే. ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచించాలి - మేము చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? మేము చెయ్యాల్సిందే. తయారవ్వాల్సిందే. కల్పములోని ఈ ఆటను గెలవాల్సిందే, పూర్తి కల్పానికి చెందిన విషయము. కనుక ఫస్ట్ డివిజన్లోకి రావాలి అన్న ఈ దృఢత్వాన్ని ధారణ చెయ్యాలి. ఏదైనా కొత్త విషయాన్ని చేస్తున్నారా ఏంటి? ఎన్నోసార్లు చేసిన విషయాన్ని మళ్ళీ చేస్తున్నారు, కేవలము గీతపై గీతను గీస్తున్నారు. డ్రామా యొక్క గీత గీయబడి ఉంది. ఈ గీత సరిగ్గా ఉంటుందా, ఉండదా అని ఆలోచించటానికి మీరు కొత్త గీతనేమీ గీయడం లేదు. కేవలము కల్పకల్పము తయారై ఉన్న ప్రారబ్ధాన్ని తయారుచేసుకుంటున్నారు ఎందుకంటే ఇది కర్మ ఫలము యొక్క లెక్క. ఇక కొత్త విషయమేముంది? ఇదైతే చాలా పాతది, తయారయ్యే ఉంది. చలించని నిశ్చయము అంటే ఇదే. దీనిని దృఢత అంటారు, వీరిని తపస్వీమూర్తులు అంటారు. ప్రతి సంకల్పములో దృఢత అనగా తపస్య. అచ్ఛా!
బాప్ దాదా హైయ్యెస్ట్ హోస్ట్ (ఉన్నతోన్నతమైన ఆతిథ్యమునిచ్చేవారు) మరియు గోల్డెన్ గెస్ట్ (బంగారు అతిథి) కూడా. హోస్ట్ గా అయ్యి కూడా కలుస్తారు మరియు గెస్ట్ గా అయ్యి వస్తారు. కానీ వారు గోల్డెన్ గెస్ట్. కాంతివంతమైనవారు కదా! గెస్ట్ లను అయితే చాలామందినే చూసారు కానీ గోల్డెన్ గెస్ట్ ను చూడలేదు. ఛీఫ్ గెస్ట్ ను పిల్చినప్పుడు వారు థ్యాంక్స్ చెప్తారు. మరి బ్రహ్మాబాబా కూడా హోస్ట్ గా అయ్యి సూచననిచ్చారు మరియు గెస్ట్ గా అయ్యి అందరికీ అభినందనలను ఇస్తున్నారు. ఎవరైతే మొత్తము సీజన్లో సేవ చేసారో, వారందరికీ గోల్డెన్ గెస్ట్ రూపంలో అభినందనలను ఇస్తున్నారు. మొట్టమొదటి అభినందనలు ఎవరికి? నిమిత్త దాదీలకు. బాప్ దాదా, నిర్విఘ్న సేవ సమాప్తికి అభినందనలను ఇస్తున్నారు. నిర్విఘ్నంగా, హర్షితులుగా అతిథి సత్కారములు చేసినందుకు మధువన నివాసులకు కూడా విశేషమైన అభినందనలను ఇస్తున్నారు. భగవంతుడు కూడా అతిథిగా అయ్యి వచ్చారు, పిల్లలు కూడా. ఎవరి ఇంటికైతే భగవంతుడు అతిధిగా అయ్యి వచ్చారో, వారు ఎంతటి భాగ్యశాలురు! రథానికి కూడా అభినందనలు ఎందుకంటే ఈ పాత్రను పోషించటము కూడా ఏమీ తక్కువ విషయము కాదు. ఇంత సమయము ప్రవేశించినప్పుడు ఇంతటి శక్తులను ధారణ చెయ్యటము కూడా విశేషమైన పాత్రయే. కానీ ఈ ఇముడ్చుకునే శక్తి యొక్క ఫలము మీ అందరికీ లభిస్తూ ఉంది. కనుక ఇముడ్చుకునే శక్తి యొక్క విశేషత ద్వారా బాప్ దాదా యొక్క శక్తులను ఇముడ్చుకోవటము, దీనిని విశేష పాత్ర అని అనండి లేక గుణము అని అనండి. కావున సేవాధారులందరిలో వీరు కూడా సేవ యొక్క పాత్రను పోషించడంలో నిర్విఘ్నులుగా ఉన్నారు. దీనికోసం అభినందనలు మరియు పదమాపదమాల థ్యాంక్స్. డబల్ విదేశీయులకు కూడా డబల్ థ్యాంక్స్ ఎందుకంటే డబల్ విదేశీయులు మధువన శోభను ఎంత బాగా చేసారు! బ్రాహ్మణ పరివారము యొక్క అలంకారము డబల్ విదేశీయులు. బ్రాహ్మణ పరివారములో దేశములోని వారితోపాటు విదేశీయులు కుడా ఉన్నారు, కనుక పురుషార్థమునకు కూడా అభినందనలు మరియు బ్రాహ్మణ పరివారమునకు అలంకారముగా అయినందుకు కూడా అభినందనలు. మీరు మధువన పరివారము యొక్క విశేష కానుక కనుక డబల్ విదేశీయులకు డబల్ అభినందనలను తెలుపుతున్నారు. ఎక్కడ ఉన్నాగానీ, ఎదురుగా అయితే కొద్దిమందే ఉన్నారు కానీ నలువైపులా ఉన్న భారతవాసీ పిల్లలకు మరియు డబల్ విదేశీ పిల్లలకు పెద్ద మనసుతో అభినందనలు ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ చాలా బాగా పాత్రను అభినయించారు. ఇప్పుడు కేవలము ఒకే విషయము మిగిలి ఉంది “సమానత మరియు సంపూర్ణతల విషయము”. దాదీలు కూడా చాలా బాగా శ్రమిస్తారు. బాప్ మరియు దాదా, ఇరువురి పాత్రను సాకారములో పోషిస్తున్నారు కనుక బాప్ దాదాలు మనస్ఫూర్తిగా స్నేహముతోపాటు అభినందనలను కూడా ఇస్తున్నారు. అందరూ చాలా మంచి పాత్రను పోషించారు. ఆల్ రౌండ్ గా ఉన్న సేవాధారులందరూ, అది చిన్నపాటి సాధారణ సేవ అయినాగానీ అది కూడా గొప్పది. ప్రతి ఒక్కరూ తమకొరకు కూడా జమా చేసుకున్నారు మరియు పుణ్యమును కూడా చేసారు. దేశ విదేశములలోని పిల్లలందరూ చేరుకునే విశేషత కూడా అభినందన యోగ్యమైనది. మహారథులందరూ కలిసి సేవకు చెందిన శ్రేష్ఠ సంకల్పమును ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చారు మరియు తీసుకువస్తూ ఉంటారు. సేవకు నిమిత్తులైనవారికి కూడా కష్టమునివ్వకూడదు. మీ నిర్లక్ష్యముతో ఇతరులను కష్టపడేటట్లు చెయ్యకూడదు. మీ వస్తువులను సంభాళించుకోవటము, ఇది కూడా నాలెడ్జ్. బ్రహ్మాబాబా ఏం చెప్పేవారో గుర్తుంది కదా? చేతిరుమాలును పోగొట్టుకున్నారంటే ఎప్పుడో ఒకప్పుడు స్వయాన్ని కూడా పోగొట్టుకుంటారు. ప్రతి కర్మలో శ్రేష్ఠంగా మరియు సఫలురుగా ఉండటము, దీనినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. శరీరమును గురించి కూడా నాలెడ్జ్, ఆత్మ గురించి కూడా నాలెడ్జ్. ప్రతి కర్మలో ఈ రెండింటి నాలెడ్జ్ ఉండాలి, శారీరిక అనారోగ్యం గురించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. ఏ విధితో నా శరీరము సరిగ్గా నడవగలదు అని తెలిసి ఉండాలి. ఆత్మ అయితే శక్తిశాలిగా ఉంది కదా, శరీరము ఎలా ఉన్నా ఫర్వాలేదు అని ఇలా అనుకోకూడదు. శరీరము సరిగ్గా లేనట్లయితే యోగము కూడా కుదరదు. అప్పుడు శరీరము తనవైపుకు లాగుతుంటుంది కనుక నాలెడ్జ్ ఫుల్ లో ఈ అన్ని నాలెడ్జ్ లు వస్తాయి. అచ్ఛా!
కొంతమంది కుమారీల సమర్పణ సమారోహము బాప్దాదా ముందు జరిగింది
బాప్ దాదా విశేష ఆత్మలందరినీ చాలా సుందరమైన అలంకరణలో చూస్తున్నారు. దివ్యగుణాల అలంకారము ఎంత గొప్పగా అందరినీ శోభాయమానం చేస్తూ ఉంది. ప్రకాశ కిరీటము ఎంత సుందరంగా మెరుస్తూ ఉంది! అవినాశిగా అలంకరించబడిన రూపాలను బాప్ దాదా చూస్తున్నారు. ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన పిల్లల ఈ సంకల్పమును చూసి బాప్ దాదాకు సంతోషం కలుగుతుంది. బాప్ దాదా అందరినీ సదాకాలం కోసం ఇష్టపడ్డారు. మీరు కూడా పక్కాగా ఇష్టపడ్డారు కదా! దృఢ సంకల్పమనే బంధం బంధింపబడింది. బాప్ దాదా వద్దకు అందరి మనసులలోని స్నేహ సంకల్పాలు అన్నిటికంటే ముందు చేరుకుంటాయి. ఇప్పుడు సంకల్పమాత్రంగా కూడా ఈ శ్రేష్ఠ బంధనము ఢీలా అవ్వకూడదు. అంత గట్టిగా బంధించారు కదా! ఎన్ని జన్మలకు ప్రమాణము చేసారు? బ్రహ్మాబాబాతోపాటు సదా సంబంధములో వచ్చే దృఢ ప్రతిజ్ఞ ఉంది మరియు సదా భిన్న నామ, రూప, సంబంధాలలో 21 జన్మల వరకు తోడుగా తప్పకుండా ఉంటాము అని గ్యారంటీ ఉంది. మరి ఎంత సంతోషము ఉంటుంది, లెక్క ఉందా? దీని లెక్కను వేసేవారు ఎవ్వరూ వెలువడలేదు. ఇప్పుడు ఇలాగే సదా అలంకరింపబడి ఉండండి, సదా కిరీటధారులుగా ఉండండి మరియు సదా సంతోషములో నవ్వుతూ పాడుతూ ఆత్మిక ఆనందములో ఉండండి. అడుగుపై అడుగు వేసేవారిగా అవుతాము అని ఈరోజు అందరూ దృఢ సంకల్పము చేసారు కదా! వారైతే స్థూల అడుగుపై అడుగులు వేస్తారు కానీ మీరందరూ సంకల్పంరూపీ అడుగుపై అడుగు వేసేవారు. బాబా సంకల్పము ఏదో, అదే పిల్లల సంకల్పము, ఇటువంటి సంకల్పము చేసారా? ఒక్క అడుగు కూడా బాబా అడుగుపై తప్ప ఇక్కడ అక్కడ వెయ్యకూడదు. ప్రతి సంకల్పమును సమర్థంగా చెయ్యాలి అనగా బాబా సమానంగా అడుగు వెనక అడుగు వెయ్యటము. అచ్చా!
విదేశీ సోదరీ సోదరులతో -ఏవిధంగానైతే విమానంలో ఎగురుతూ ఎగురుతూ వచ్చారో, అదే విధంగా బుద్ధిరూపీ విమానము కూడా అంత వేగంగా ఎగురుతూ ఉంటుంది కదా, ఎందుకంటే పరిస్థితుల కారణంగా ఆ విమానము దొరకకపోయినాగానీ బుద్ధిరూపీ విమానమైతే సదా తోడుగా ఉంటుంది మరియు సదా శక్తిశాలిగా ఉంటుంది కనుక క్షణంలో ఎక్కడకు కావాలనుకుంటే అక్కడకు చేరుకోగలరు. మరి ఈ విమానానికి యజమానులు కదా! ఈ బుద్ధి రూపీ విమానము సదా ఎవరెడీగా ఉండాలి అనగా బుద్ధి లైన్ సదా క్లియర్ గా ఉండాలి. బుద్ధి సదా బాబాతో పాటు ఉంటూ శక్తిశాలిగా ఉన్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణములో చేరుకుంటారు. ఎవరి బుద్ధిరూపీ విమానము చేరుకుంటుందో, వారి ఆ విమానము కూడా నడుస్తుంది. బుద్ధి రూపీ విమానము సరిగ్గా లేనట్లయితే ఆ విమానము కూడా నడవదు. అచ్ఛా!
పార్టీలతో - 1. సదా స్వయమును రాజయోగీ శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవము చేస్తున్నారా? రాజయోగీ అనగా సర్వ కర్మేంద్రియాలకు రాజు. రాజుగా అయ్యి కర్మేంద్రియాలను నడిపించేవారు, అంతేగానీ కర్మేంద్రియాలకు వశమై నడిచేవారు కారు. ఎవరైతే కర్మేంద్రియాలకు వశమై నడుస్తారో, వారిని ప్రజాయోగీ అని అంటారు, రాజయోగీ అని అనరు. ఈ కర్మేంద్రియాలు నా కర్మచారులు (పనివాళ్ళు), నేను యజమానిని అన్న జ్ఞానము లభించింది కనుక యజమాని ఎప్పుడూ సేవాధారులకు వశమవ్వలేరు. ఎవరు ఎంత ప్రయత్నించినాగానీ రాజయోగీ ఆత్మలు సదా శ్రేష్ఠంగా ఉంటారు. సదా రాజ్యమును చేసే సంస్కారమును ఇప్పుడు రాజయోగీ జీవితంలో నింపుకోవాలి. ఏం జరిగినాగానీ - నేను రాజయోగీని అన్న మీ ఈ టైటిల్ను సదా గుర్తుంచుకోవాలి. సర్వ శక్తివంతుడి బలము, నమ్మకము ఉన్నట్లయితే సఫలత అధికారము రూపములో లభిస్తుంది. అధికారము సహజంగా ప్రాప్తిస్తుంది, కష్టంగా కాదు. సర్వ శక్తుల ఆధారంతో ప్రతి కార్యము సఫలము అయ్యేదే ఉంది. నేను హృదయ సింహాసనాధికారి ఆత్మను అన్న ఈ ఆత్మిక నషా సదా ఉండాలి. ఈ ఆత్మిక నషా అనేకరకాల చింతలను దూరం చేస్తుంది. నషా లేకపోతే చింతలే ఉంటాయి. కనుక సదా నషాలో ఉంటూ వరదానులుగా అయ్యి వరదానాలను పంచుతూ వెళ్ళండి. స్వయం సంపన్నంగా అయ్యి ఇతరులను కూడా సంపన్నంగా చెయ్యాలి. ఇతరులను తయారుచెయ్యటము అనగా స్వర్గములోని సీట్ యొక్క సర్టిఫికేట్ ఇస్తారు. కాగితపు సర్టిఫికేట్ కాదు, అధికారమునకు చెందిన సర్టిఫికేట్. అచ్ఛా!
2. ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునేవారిగా, తరగని ఖజానాలకు అధికారులుగా అయ్యారు. ఇంతటి సంతోషాన్ని అనుభవము చేస్తున్నారా! ఎందుకంటే ప్రస్తుతం ఉన్నదే మోసపు ప్రపంచం. మోసపు ప్రపంచము నుండి పక్కకు వచ్చేసారు. మోసగించే ప్రపంచము పట్ల ఆకర్షణ అయితే లేదు కదా! సేవ కోసం కనెక్షన్ పెట్టుకోవటము వేరే సంగతి కానీ మనసు యొక్క ఆకర్షణ ఉండకూడదు. కనుక సదా స్వయమును తుచ్ఛమైనవారిగా కాదు, సాధారణమైనవారిగా కాదు, కానీ శ్రేష్ఠమైన ఆత్మను, సదా బాబాకు ప్రియమైనవాడిని అన్న ఈ నషాలో ఉండండి. తండ్రి ఎటువంటివారో పిల్లలూ అటువంటివారు - అడుగుపై అడుగు వేస్తూ అనగా ఫాలో చేస్తూ నడుచుకున్నట్లయితే బాబా సమానులుగా అయిపోతారు. సమానులుగా అవ్వటము అనగా సంపన్నంగా అవ్వటము. ఇదే బ్రాహ్మణ జీవితము యొక్క కార్యము.
3. సదా స్వయమును బాబా యొక్క ఆత్మిక పూదోటలోని ఆత్మిక గులాబీగా భావిస్తున్నారా! అన్నిటికంటే సువాసనభరితమైన పుష్పము గులాబీ. గులాబీ జలాన్ని ఎన్ని కార్యాలలో వాడుతారు, రంగు-రూపంలో కూడా గులాబీ అందరికీ ప్రియమైనది. మరి మీరందరూ ఆత్మిక గులాబీలు. మీ ఆత్మిక సుగంధము ఇతరులను కూడా స్వతహాగా ఆకర్షిస్తుంది. ఎక్కడ ఎటువంటి సుగంధభరితమైన వస్తువు ఉన్నాగానీ అందరి అటెన్షన్ స్వతహాగానే అటువైపు వెళ్తుంది, కనుక ఆత్మిక గులాబీలైన మీ సుగంధము విశ్వమును ఆకర్షించేది, ఎందుకంటే విశ్వమునకు ఈ ఆత్మిక సుగంధము యొక్క అవసరము ఉంది కనుక నేను అవినాశీ పూదోటలోని అవినాశీ గులాబీని అన్నది సదా స్మృతిలో ఉండాలి. ఎప్పుడూ ముడుచుకుపోను, సదా వికసించి ఉంటాను. ఇటువంటి వికసించి ఉన్న ఆత్మిక గులాబీ సదా సేవలో స్వతహాగానే నిమిత్తంగా అవుతుంది. స్మృతి యొక్క, శక్తుల యొక్క, గుణాల యొక్క ఈ అన్ని పరిమళాలను అందరికీ ఇస్తూ ఉండండి. స్వయంగా బాబానే వచ్చి పుష్పాలైన మిమ్మల్ని తయారుచేసారు, మరి మీరు ఎంతటి అల్లారు ముద్దు పిల్లలు! అచ్ఛా!
Comments
Post a Comment