10-03-1986 అవ్యక్త మురళి

 10-03-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“నిశ్చింత చక్రవర్తులుగా అయ్యేందుకు యుక్తి”

ఈ రోజు బాప్ దాదా నిశ్చింత చక్రవర్తుల సభను చూస్తున్నారు. ఈ రాజ్య సభ పూర్తి కల్పంలోకల్లా విచిత్రమైన సభ. చక్రవర్తులుగా అయితే చాలా మంది అయ్యారు కానీ నిశ్చింత చక్రవర్తుల యొక్క ఈ విచిత్ర సభ ఈ సంగమయుగంలోనే ఉంటుంది. ఈ నిశ్చింత చక్రవర్తుల సభ సత్యయుగ రాజ్య సభకన్నా శ్రేష్ఠమైనది ఎందుకంటే అక్కడ చింత మరియు నషా మధ్యన ఉన్న భేదముకు సంబంధించిన జ్ఞానము ఇమర్జ్ అయి ఉండదు. చింత అన్న మాటే వారికి తెలియదు. ఇప్పుడు పూర్తి ప్రపంచం ఏదో ఒక చింతలో ఉంది - ఉదయం లేచినప్పటి నుండి, పరివారము, కార్య వ్యవహారాలు, మిత్ర సంబంధీకులు, వీటికి సంబంధించిన ఏదో ఒక చింత ఉంటుంది కానీ మీరందరూ అమృతవేళ నుండి నిశ్చింత చక్రవర్తులై రోజును ఆరంభిస్తారు మరియు నిశ్చింత చక్రవర్తులై ప్రతి కార్యాన్ని చేస్తారు. నిశ్చింత చక్రవర్తులై ప్రశాంతంగా నిద్రిస్తారు. మీకు సుఖమైన నిద్ర, ప్రశాంతమైన నిద్ర ఉంటుంది. ఇటువంటి నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారు. ఈ విధంగా అయ్యారా లేదా ఏదైనా చింత ఉందా? తండ్రికి బాధ్యత ఇచ్చేసారు కనుక నిశ్చింతగా అయిపోయారు. మీపై బాధ్యత ఉందని అనుకుంటే చింత ఉంటుంది. బాధ్యత తండ్రిది మరియు నేను నిమిత్త సేవాధారిని. నేను నిమిత్త కర్మయోగిని. చేయించేవారు తండ్రి, నిమిత్తంగా చేసేది నేను. ఒకవేళ ఈ స్మృతి ప్రతి క్షణము స్వతహాగా ఉంటే, ఇక సదా నిశ్చింత చక్రవర్తులే. ఒకవేళ పొరపాటునైనా ఏదైనా వ్యర్థ భావపు భారాన్ని మీ మీదకు తీసుకుంటే, అప్పుడు కిరీటానికి బదులుగా చింతల యొక్క అనేక బుట్టలు తల మీదకు వచ్చేస్తాయి. లేదంటే మీరు సదా ప్రకాశ కిరీటధారులు, నిశ్చింత చక్రవర్తులు. కేవలం తండ్రి మరియు నేను, మూడవ వారే లేరు. ఈ అనుభూతి సహజంగా నిశ్చింత చక్రవర్తులుగా చేస్తుంది. మరి కిరీటధారులా లేక బుట్టధారులా? బుట్టను ఎత్తడం మరియు కిరీటం ధరించడం, ఎంత తేడా ఉంది! కిరీటధారిగా ఉన్న ఒకరిని ఎదురుగా నిలబెట్టండి మరియు భారాన్ని మోస్తూ బుట్ట ఎత్తుకుని నిలబడి ఉన్న ఇంకొకరిని నిలబెట్టండి, ఏమి నచ్చుతుంది! కిరీటమా లేక బుట్టనా? అనేక జన్మల అనేక భారాల బుట్టలను బాబా వచ్చి దించి, తేలికగా చేస్తారు. కనుక నిశ్చింత చక్రవర్తులు అనగా సదా డబల్ లైట్ గా ఉండేవారు. ఎప్పటివరకైతే చక్రవర్తిగా అవ్వరో, అప్పటివరకు ఈ కర్మేంద్రియాలు కూడా మీ వశంలో ఉండవు. రాజుగా అయినప్పుడే మాయాజీతులుగా, కర్మేంద్రియజీతులుగా, ప్రకృతిజీతులుగా అవుతారు. కనుక రాజ్య సభలో కూర్చున్నారు కదా! అచ్ఛా.

ఈ రోజు యూరప్ వారి టర్ను. యూరప్ వారు బాగా విస్తరించారు. యూరప్ తమ ప్రక్కదేశాల కళ్యాణం కోసం మంచి ప్లాన్ ను తయారుచేసారు. ఎలా అయితే తండ్రి సదా కళ్యాణకారియో, అలా పిల్లలు కూడా తండ్రి సమానంగా కళ్యాణ భావనను పెట్టుకునేవారు. ఇప్పుడు ఎవరినైనా చూస్తే, వీరు కూడా తండ్రికి చెందినవారిగా అవ్వాలని దయ కలుగుతుంది కదా. చూడండి, బాప్ దాదా స్థాపన సమయం నుండి విదేశీ పిల్లలందరినీ ఏదో ఒక రూపంలో గుర్తు చేసుకుంటూ ఉన్నారు. బాప్ దాదా స్మృతితో సమయం వచ్చినప్పుడు నలువైపుల ఉన్న పిల్లలు చేరుకున్నారు. కానీ బాప్ దాదా అయితే చాలా కాలం నుండి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆహ్వానం కారణంగా మీరు కూడా అయస్కాంతం వలె ఆకర్షితమై చేరుకున్నారు. తండ్రికి చెందినవారిగా ఎలా అయ్యామో మాకే తెలియదు అని అంటారు కదా. తండ్రికి చెందినవారిగా అయినందుకు బాగా అనిపిస్తుంది, కానీ ఎలా అయ్యారు, ఏమి జరిగింది, ఇది కూడా కూర్చుని ఆలోచించండి, ఎక్కడి నుండి ఎక్కడకు వచ్చి చేరుకున్నారు, ఆలోచిస్తే విచిత్రంగా అనిపిస్తుంది కదా! డ్రామాలో విధి నిర్ణయించబడి ఉంది. డ్రామా విధి అందరినీ మూల మూలల నుండి వెలికి తీసి ఒక పరివారంలోకి చేర్చింది. ఇప్పుడు ఈ పరివారమే నాది అనిపిస్తున్న కారణంగా అతి ప్రియంగా అనిపిస్తుంది. తండ్రి ప్రియాతి ప్రియమైనవారు కావున మీరందరూ కూడా ప్రియంగా అయిపోయారు. మీరు కూడా తక్కువేమీ కాదు. మీరందరూ కూడా బాప్ దాదా సాంగత్యపు ప్రభావంతో అతి ప్రియంగా అయ్యారు. ఎవరిని చూసినా ప్రతి ఒక్కరూ, ఒకరిని మించి మరొకరు ప్రియంగా అనిపిస్తారు. ప్రతి ఒక్కరి ముఖంలో ఆత్మికత యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఫారెనర్స్ కు మేకప్ చేసుకోవడం ఇష్టము! మరి ఇది ఫరిశ్తా స్థితి అనే మేకప్ ను వేసుకునే స్థానము. ఈ మేకప్ ఎటువంటిదంటే దీనితో మీరు నిజంగానే ఫరిశ్తాగా అయిపోతారు. మేకప్ వేసుకున్న తర్వాత ఎవరు ఎలా ఉన్నా కానీ పూర్తిగా మారిపోతారు కదా. మేకప్ తో చాలా సుందరంగా కనిపిస్తారు. ఆత్మిక మేకప్ చేసుకున్నారు కావున ఇక్కడ కూడా అందరూ మెరుస్తున్న ఫరిశ్తాలుగా కనిపిస్తారు. ఆ మేకప్ తో అయితే నష్టం కూడా జరుగుతుంది. ఇందులో ఎటువంటి నష్టము లేదు. మరి అందరూ మెరుస్తున్నవారు, సర్వులకు స్నేహీ ఆత్మలే కదా! ఇక్కడ స్నేహము తప్ప మరేమీ లేదు. లేచినా స్నేహంగా గుడ్ మార్నింగ్ చెప్తారు, తిన్నా స్నేహంగా బ్రహ్మా భోజనం తింటారు. నడిచినా స్నేహంగా తండ్రితో కలిసి చేతిలో చేయి వేసి నడుస్తారు. ఫారెనర్స్ కు చేతిలో చేయి వేసి నడవడం ఇష్టం కదా! కనుక బాప్ దాదా కూడా సదా తండ్రి చేతిలో చేయి వేసి నడవమని అంటారు. ఒంటరిగా నడవవద్దు. ఒంటరిగా నడిస్తే ఒక్కోసారి బోర్ అవుతారు మరియు ఒక్కోసారి ఎవరి దృష్టి అయినా పడుతుంది. తండ్రితో పాటుగా నడిచినట్లైతే ఎప్పుడూ మాయ దృష్టి పడదు, పైగా తోడు ఉన్న కారణంగా సదా సంతోషంగా, ఆనందంగా తింటూ-నడుస్తూ ఆనందిస్తారు. మరి ఈ సహచరుడు అందరికీ ఇష్టమే కదా! లేక ఇంకెవరైనా కావాలా! మరొక కంపేనియన్ (సహచరుడు) అవసరం లేదు కదా! ఎప్పుడైనా మనసును ఆహ్లాదపరచడానికి ఇంకెవరైనా కావాలా? మోసం చేసే సంబంధాల నుండైతే దూరమయ్యారు. వాటిలో మోసం కూడా ఉంది మరియు దుఃఖం కూడా ఉంది. ఇప్పుడు ఎటువంటి సంబంధంలోకి వచ్చారంటే, ఇక్కడ మోసం లేదు, దుఃఖం లేదు. రక్షింపబడ్డారు. సదా కోసం రక్షింపబడ్డారు. ఈ విధంగా పక్కాగా (పరిపక్వంగా) ఉన్నారా? ఎవరూ కచ్చాగా (అపరిపక్వంగా) అయితే లేరు కదా? మళ్ళీ అక్కడకు వెళ్ళాక ఏమి చేయను, ఎలా చేయను, మాయ వచ్చింది అని వ్రాయరు కదా.

యూరప్ వారు విశేషంగా ఏ అద్భుతాన్ని చేసారు? ప్రతి సంవత్సరం తండ్రి ముందుకు పుష్పగుచ్ఛాన్ని తీసుకురావాలని తండ్రి ఏదైతే చెప్తారో, ఆ తండ్రి మాటలను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు అందరూ బాగా అటెన్షన్ పెట్టడాన్ని బాప్ దాదా సదా చూస్తుంటారు. ప్రతి సంవత్సరం తప్పిపోయిన తండ్రి పిల్లలను తమ ఇంటికి చేర్చాలి, తమ పరివారంలోకి చేర్చాలి అనే ఈ ఉల్లాసము సదా ఉంది మరియు ఇప్పుడు కూడా ఉంది. యూరప్ కూడా ఈ లక్ష్యాన్ని పెట్టుకుని బాగా వృద్ధి చేయడాన్ని బాప్ దాదా చూస్తున్నారు. మరి తండ్రి మహావాక్యాలను, ఆజ్ఞను పాటించేవారిని ఆజ్ఞాకారి అని అనడం జరుగుతుంది మరియు ఆజ్ఞాకారి పిల్లలపై విశేషంగా తండ్రి ఆశీర్వాదాలు సదా ఉంటాయి. ఆజ్ఞాకారి పిల్లలు స్వతహాగానే ఆశీర్వాదాలకు పాత్రులైన ఆత్మలుగా ఉంటారు. అర్థమైందా! కొన్ని సంవత్సరాల క్రితం ఎంత కొద్దిమంది ఉండేవారు, కానీ ప్రతి సంవత్సరం వృద్ధిని పొందుతూ చాలా పెద్ద పరివారంగా అయిపోయింది. ఒకటి నుండి రెండు, రెండు నుండి మూడు, ఇప్పుడు ఎన్ని సెంటర్లు అయిపోయాయి. యు.కే. ఒక్కటే విడిగా పెద్దది, అందరి కనెక్షన్ అయితే యు.కే. తో ఉంది కదా, ఎందుకంటే విదేశాలకు పునాది అక్కడే ఉంది. ఎన్ని శాఖలు వచ్చినా కానీ, వృక్షం విస్తరించినా కానీ, కనెక్షన్ అయితే పునాదితోనే ఉంటుంది. ఒకవేళ పునాదితో కనెక్షన్ లేకపోతే విస్తారము ఎలా వృద్ధి చెందుతుంది! లండన్ లో విశేషంగా అనన్య రత్నాలను నిమిత్తంగా చేసారు ఎందుకంటే పునాది కదా. మరి అందరి కనెక్షన్, డైరెక్షన్ సహజంగా లభించడం వలన పురుషార్థం మరియు సేవ, రెండూ కూడా సహజం అయిపోతాయి. బాప్ దాదా అయితే ఉండనే ఉన్నారు. బాప్ దాదా లేకుండా ఒక్క సెకండు కూడా నడవలేరు అనేంత కంబైన్డ్ గా ఉండండి. అయినప్పటికీ సాకార రూపంలో, సేవా సాధనాలలో, సేవా ప్రోగ్రాం ప్లాన్లలో మరియు తోడు-తోడుగా తమ స్వ ఉన్నతి కోసం కూడా ఎవరికైనా ఏదైనా డైరెక్షన్ అవసరమంటే, అందుకోసం కనెక్షన్ పెట్టడం జరిగింది. ఇది నిమిత్తంగా తయారుచేయబడిన మాధ్యమము, దీనితో సహజంగానే పరిష్కారం లభిస్తుంది. చాలాసార్లు ఎటువంటి మాయ తుఫాన్లు వస్తాయంటే, బుద్ధి క్లియర్ గా లేని కారణంగా బాప్ దాదా డైరెక్షన్లను, శక్తిని క్యాచ్ చేయలేరు. ఇటువంటి సమయం కోసం సాకార మాధ్యమాన్ని నిమిత్తంగా పెట్టడం జరిగింది. వారిని మీరు దాదీలు, దీదీలు అని అంటారు, వీరు నిమిత్తము, దీనివలన సమయం వృధా అవ్వదు. అయితే మీరు ధైర్యవంతులు అని బాప్ దాదాకు తెలుసు. అక్కడి నుండే వెలువడి అక్కడే సేవకు నిమిత్తంగా అయ్యారు, అంటే ధర్మము ఇంటి నుండే ఆరంభమవుతుంది అన్న పాఠాన్ని బాగా పక్కా చేసుకున్నారు, అక్కడే నిమిత్తంగా అయ్యి వృద్ధిని ప్రాప్తి చేసుకోవడమన్నది చాలా మంచిది. కళ్యాణ భావనతో ముందుకు వెళ్తున్నారు. ఎక్కడైతే దృఢ సంకల్పం ఉంటుందో, అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. ఏమి జరిగినా కానీ సేవలో సఫలత పొందవలసిందే - ఈ శ్రేష్ఠ సంకల్పం ఈరోజు ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చింది. ఇప్పుడు మన శ్రేష్ఠ పరివారాన్ని చూసి విశేషమైన సంతోషం కలుగుతుంది మరియు విశేషంగా పాండవులే టీచర్లు. శక్తులు సదా సహయోగులుగా ఉండనే ఉన్నారు. పాండవుల ద్వారా సదా సేవలో విశేష వృద్ధి అనే ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. మరియు సేవకన్నా ఎక్కువగా సేవాకేంద్రాల సందడి, సేవాకేంద్రాల ప్రకాశము శక్తులతో ఉంటుంది. శక్తులకూ తమ పాత్ర ఉంది, పాండవులకూ తమ పాత్ర ఉంది, అందుకే ఇద్దరూ అవసరమే. ఏ సెంటరులో అయితే కేవలం శక్తులే ఉంటారో, పాండవులు ఉండరో, అక్కడ అంత శక్తిశాలిగా ఉండదు, అందుకని ఇద్దరూ అవసరమే. ఇప్పుడు మీరు మేల్కొన్నారు కనుక ఒకరిద్దరి ద్వారా సహజంగానే అనేకులు మేల్కొంటారు. శ్రమ మరియు సమయమైతే పట్టాయి కానీ ఇప్పుడు మంచి వృద్ధిని పొందుతున్నారు. దృఢ సంకల్పం సఫలమవ్వకపోవడము అన్నది ఎప్పుడూ ఉండదు. ఇందుకు ప్రాక్టికల్ ప్రూఫ్ ను చూస్తున్నారు. ఇక్కడైతే సేవ జరిగేలా లేదు అని ఒకవేళ కొంచెమైనా నిరాశ చెంది ఉంటే, ఆ కొద్ది బలహీన సంకల్పం కూడా సేవలో తేడాను తీసుకొస్తుంది. దృఢత్వము అనే నీరు ఫలాన్ని తొందరగా ఇస్తుంది. దృఢత్వమే సఫలతను తీసుకొస్తుంది.

“పరమాత్మ ఆశీర్వాదాలను పొందాలంటే ఆజ్ఞాకారిగా అవ్వండి” (అవ్యక్త మురళీల నుండి)

తండ్రి ఏ విధంగా చెప్పారో అదే విధంగా చేయడము, తండ్రి చెప్పడము మరియు పిల్లలు చేయడము - వీరిని నంబర్ వన్ ఆజ్ఞాకారులు అని అంటారు. తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ను, శ్రీమతాన్ని యథార్థంగా అర్థం చేసుకుని పాటించడము - దీనిని ఆజ్ఞాకారిగా అవ్వడము అని అంటారు. శ్రీమతంలో సంకల్పమాత్రంలో కూడా మన్మతము లేక పరమతము మిక్స్ అవ్వకూడదు. 'నన్నొక్కడినే స్మృతి చేయండి' అన్నది తండ్రి ఆజ్ఞ. ఒకవేళ ఈ ఆజ్ఞను పాటిస్తే, ఆజ్ఞాకారి పిల్లలకు తండ్రి ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు అన్నీ సహజంగా అయిపోతాయి.

బాప్ దాదా అమృతవేళ నుండి రాత్రి పడుకునే వరకు మనసా-వాచా-కర్మణా మరియు సంబంధ-సంపర్కాలలో ఎలా నడుచుకోవాలి మరియు ఎలా ఉండాలి అని అన్నిటికీ శ్రీమతాన్ని అనగా ఆజ్ఞలను ఇచ్చారు. ప్రతి కర్మలో మనసా స్థితి ఎలా ఉండాలి అన్న డైరెక్షన్ లేక ఆజ్ఞ లభించి ఉంది. ఆ ఆజ్ఞానుసారంగానే నడుచుకుంటూ వెళ్ళండి. ఇదే పరమాత్మ ఆశీర్వాదాలను పొందేందుకు ఆధారము. ఈ ఆశీర్వాదాల కారణంగా ఆజ్ఞాకారి పిల్లలు సదా డబల్ లైట్ గా ఉంటూ ఎగిరే కళను అనుభవం చేసుకుంటారు. ఏ ఆత్మకూ దుఃఖమును ఇవ్వకండి, దుఃఖమును తీసుకోకండి అన్నది బాప్ దాదా యొక్క ఆజ్ఞ. అయితే కొంతమంది పిల్లలు దుఃఖమునివ్వరు కానీ తీసుకుంటారు. ఇది కూడా వ్యర్థ సంకల్పాలు నడిచేందుకు కారణం అవుతుంది. ఏదో వ్యర్థ మాటను విని దుఃఖితులుగా అవుతారు, ఇటువంటి చిన్న-చిన్న ఆజ్ఞల ఉల్లంఘన కూడా మనసును భారీగా చేసేస్తుంది మరియు భారీగా అయిన కారణంగా ఉన్నత స్థితి వైపుకు ఎగరలేరు.

పిల్లలూ, వ్యర్థం ఆలోచించవద్దు, చూడవద్దు, వ్యర్థం వినవద్దు, వ్యర్థం మాట్లాడవద్దు, వ్యర్థ కర్మలలో సమయాన్ని వృధా చేసుకోవద్దు అని బాప్ దాదా ఆజ్ఞ లభించి ఉంది. మీరు చెడునైతే దాటేసారు. ఇప్పుడు ఇటువంటి ఆజ్ఞాకారి చరిత్ర కలిగిన చిత్రాన్ని తయారుచేసుకోండి, అప్పుడు పరమాత్మ ఆశీర్వాదాలకు అధికారులుగా అవుతారు. పిల్లలూ, అమృతవేళ విధిపూర్వకంగా శక్తిశాలి స్మృతిలో కూర్చోండి, ప్రతి కర్మను కర్మయోగిగా అయి చేయండి, నిమిత్త భావంతో, నిర్మానులుగా అయి చేయండి అని తండ్రి ఆజ్ఞ లభించింది. ఈ విధంగా దృష్టి, వృత్తి మొదలైన అన్ని విషయాల కోసం ఆజ్ఞలు లభించి ఉన్నాయి. ఆ ఆజ్ఞలను విధిపూర్వకంగా పాటిస్తూ ఉన్నట్లయితే సదా అతీంద్రియ సుఖం మరియు సంతోషంతో సంపన్నమైన శాంతి స్థితిని అనుభవం చేసుకుంటూ ఉంటారు.

పిల్లలూ, తనువు-మనసు-ధనము మరియు జనము - వీటన్నిటినీ తండ్రి సంపదగా భావించండి. ఏ సంకల్పం చేసినా అది పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ ఆలోచించండి, శుభ భావనతో సంకల్పాలు చేయండి అన్నది తండ్రి ఆజ్ఞ. దేహ అభిమానపు "నేను మరియు నాది" అన్నవాటి నుండి దూరంగా ఉండండి, ఇవే మాయ వచ్చేందుకు రెండు ద్వారాలు. సంకల్పం, సమయం మరియు శ్వాస బ్రాహ్మణ జీవితానికి అమూల్యమైన ఖజానాలు, వీటిని వృధాగా పోగొట్టుకోకండి. జమ చేసుకోండి. సమర్థంగా ఉండేందుకు ఆధారము - సదా మరియు స్వతహాగా ఆజ్ఞాకారిగా అవ్వడము. పవిత్రంగా అవ్వండి, కామజీతులుగా అవ్వండి అన్నది బాప్ దాదా మొట్టమొదటగా ఇచ్చే ముఖ్యమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాలన చేయడంలో మెజారిటీ పాస్ అవుతారు. కానీ దాని రెండవ సోదరుడు క్రోధము - ఇందులో ఒక్కోసారి సగం మంది ఫెయిల్ అయిపోతారు. క్రోధం చేయలేదు కానీ కాస్త ఆవేశాన్ని చూపించాను అని కొందరు అంటారు, మరి ఇది కూడా ఆజ్ఞను ఉల్లంఘన చేసినట్లే, ఇది సంతోషాన్ని అనుభవం చేయనివ్వదు.

ఏ పిల్లలైతే అమృతవేళ నుండి రాత్రి వరకు రోజంతటి దినచర్యలో, ప్రతి కర్మలోనూ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారో, వారు ఎప్పుడూ శ్రమను అనుభవం చేయరు. వారు ఆజ్ఞాకారిగా ఉన్నందుకు విశేష ఫలంగా తండ్రి ఆశీర్వాదాలు అనుభవం అవుతాయి, వారి ప్రతి కర్మ ఫలప్రదంగా ఉంటుంది. ఆజ్ఞాకారి పిల్లలుగా ఉన్నవారు సదా సంతుష్టతను అనుభవం చేసుకుంటారు. వారికి మూడు రకాల సంతుష్టతలు స్వతహాగా మరియు సదా అనుభవం అవుతాయి. 1 - వారు స్వయం సంతుష్టంగా ఉంటారు. 2 - విధిపూర్వకంగా కర్మ చేసినందుకు సఫలత రూపి ఫలము ప్రాప్తి అయిన కారణంగా కూడా సంతుష్టంగా ఉంటారు. 3 - సంబంధ సంపర్కంలో కూడా వారితో అందరూ సంతుష్టంగా ఉంటారు. ఆజ్ఞాకారి పిల్లల ప్రతి కర్మ ఆజ్ఞానుసారంగా ఉన్న కారణంగా శ్రేష్ఠంగా ఉంటుంది కనుక ఏ కర్మ కూడా బుద్ధిని కానీ, మనసును కానీ విచలితం చేయదు, సరిగ్గా చేసానా, చేయలేదా అన్న సంకల్పం కూడా వారికి రాదు. వారు ఆజ్ఞానుసారంగా నడుచుకున్న కారణంగా సదా తేలికగా ఉంటారు ఎందుకంటే వారు కర్మ బంధనానికి వశమై ఏ కర్మనూ చేయరు. ప్రతి కర్మను ఆజ్ఞానుసారంగా చేసిన కారణంగా, పరమాత్మ ఆశీర్వాదాల ప్రాప్తి యొక్క ఫల స్వరూపంగా, వారు సదా ఆంతరిక విల్ పవర్ ను (మనోబలము), అతీంద్రియ సుఖాన్ని మరియు నిండుదనాన్ని అనుభవం చేసుకుంటారు. అచ్ఛా.

Comments