09-04-1986 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
‘‘సత్యమైన సేవాధారుల గుర్తులు’’
ఈ రోజు జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు భూమిపై ఉన్న తారామండలములోని తమ నక్షత్రాలన్నిటినీ చూస్తున్నారు. నక్షత్రాలన్నీ మెరుస్తూ తమ మెరుపును మరియు ప్రకాశాన్ని ఇస్తున్నాయి. రకరకాల నక్షత్రాలున్నాయి. కొన్ని విశేషంగా జ్ఞాన నక్షత్రాలు, కొన్ని సహజయోగి నక్షత్రాలు, కొన్ని గుణదానమూర్త నక్షత్రాలు. కొన్ని నిరంతర సేవాధారి నక్షత్రాలు. కొన్ని సదా సంపన్న నక్షత్రాలు. ప్రతి సెకండు సఫలత నక్షత్రాలుగా ఉండేవే అన్నిటికన్నా శ్రేష్ఠమైనవి. వీటితోపాటు కొన్ని కేవలం ఆశా నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఆశా నక్షత్రాలెక్కడ, సఫలతా నక్షత్రాలెక్కడ! రెండిటికీ మధ్యన చాలా వ్యత్యాసముంది కానీ రెండూ నక్షత్రాలే, మరియు రకరకాలుగా ఉన్న నక్షత్రాలలో ప్రతి ఒక్క దాని ప్రభావము విశ్వాత్మల పైన, ప్రకృతి పైన పడుతుంది. సఫలతా నక్షత్రాలు నలువైపులా తమ ఉల్లాస-ఉత్సాహాల ప్రభావాన్ని వేస్తున్నాయి. ఆశా నక్షత్రాలు స్వయం కూడా అప్పుడప్పుడు ప్రేమ, అప్పుడప్పుడు శ్రమ, రెండిటి ప్రభావంలో ఉన్నందుకు, ఇతరులు కూడా ముందుకు వెళ్తారనే ఆశను పెట్టుకొని ముందుకు వెళ్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరు నేను ఎటువంటి నక్షత్రాన్ని అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అందరిలో జ్ఞానము, యోగము, గుణాల ధారణ మరియు సేవా భావమైతే ఉన్నాయి కానీ, అన్నీ ఉన్నా కొందరిలో జ్ఞాన ప్రకాశముంటే కొందరిలో విశేషంగా స్మృతి మరియు యోగ ప్రకాశముంది. మరి కొందరు తమ గుణమూర్త ప్రకాశముతో విశేషంగా ఆకర్షిస్తున్నారు. నాలుగు ధారణలు ఉన్నప్పటికీ పర్సంటేజ్ (శాతము) లో వ్యత్యాసముంది కనుక నక్షత్రాలు రకరకాలుగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇది విచిత్రమైన ఆత్మిక తారామండలము. ఆత్మిక నక్షత్రాలైన మీ ప్రభావము విశ్వంపై పడుతుంది కావున విశ్వంలోని స్థూల నక్షత్రాల ప్రభావం కూడా విశ్వంపై పడుతుంది. నక్షత్రాలైన మీరు స్వయం ఎంతగా శక్తిశాలిగా అవుతున్నారో, అంతగా విశ్వాత్మలపై ప్రభావం పడుతూ ఉంది, ఇకపై కూడా పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు గాఢాంధకారం ఎంతగా ఉంటుందో, అంతగా నక్షత్రాల ప్రకాశము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అప్రాప్తి అనే అంధకారము పెరుగుతూ ఉంది, ఎంతగా పెరుగుతూ ఉందో మరియు పెరుగుతూ ఉంటుందో, అంతగా ఆత్మిక నక్షత్రాలైన మీ విశేషమైన ప్రభావాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. అందరికీ భూమిపై ఉన్న మెరిసే నక్షత్రాలు జ్యోతిర్బిందు రూపంలో, ప్రకాశమయ శరీరం కలిగిన ఫరిస్తాల రూపంలో కనిపిస్తారు. ఎలాగైతే ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాల వెనుక వారు తమ సమయాన్ని, శక్తిని, ధనాన్ని ఉపయోగిస్తున్నారో, అలా ఆత్మిక నక్షత్రాలైన మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలాగైతే ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తారో, అలా ఈ భూమండలములో నలువైపులా ఫరిస్తాల మెరుపును మరియు జ్యోతిర్మయ నక్షత్రాల మెరుపును చూస్తారు, వీరు ఎవరు, ఎక్కడి నుండి తమ చమత్కారాన్ని చూపించేందుకు ఈ భూమి పైకి వచ్చారని అనుభవం చేస్తారు. స్థాపన యొక్క ఆది సమయంలో నలువైపులా బ్రహ్మా మరియు కృష్ణుని సాక్షాత్కారాల అల వ్యాపించడాన్ని అనుభవం చేసారు. వీరు ఎవరు? ఇక్కడ కనిపిస్తుంది ఏమిటి? ఇది అర్థం చేసుకోవడానికి అనేకుల అటెన్షన్ వెళ్ళింది. అలాగే ఇప్పుడు అంతిమంలో నలువైపులా ఈ రెండు రూపాలు ‘‘జ్యోతి మరియు ఫరిస్తా’’ వీటిలో బాప్ దాదా మరియు పిల్లలందరి మెరుపు కనిపిస్తుంది. ఒకరి నుండి అనేకులకు తెలిసి అందరి అటెన్షన్ స్వతహాగా ఇటువైపుకే వస్తుంది. ఇప్పుడు ఈ దివ్యమైన దృశ్యము మీరందరూ సంపన్నమయ్యేంతవరకు ఆగి ఉంది. ఫరిస్తాతనపు స్థితిని సహజంగా మరియు స్వతహాగా అనుభవం చేసినప్పుడే సాక్షాత్తు ఫరిస్తాలు సాక్షాత్కారంలో కనిపిస్తారు. ఈ సంవత్సరం విశేషంగా ఫరిస్తాతనపు స్థితి కోసమే ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలు, మేము కేవలం స్మృతి చేసే అభ్యాసమే చెయ్యాలా లేక సేవ కూడా చెయ్యాలా లేక సేవ నుండి ముక్తులై తపస్యలోనే ఉండాలా అని ఆలోచిస్తున్నారు. బాప్ దాదా సేవ యొక్క యథార్థమైన అర్థాన్ని వినిపిస్తున్నారు:-
సేవా భావము అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శ్రేష్ఠ కామనల భావము. సేవా భావము అనగా ప్రతి ఆత్మకు వారి భావన అనుసారంగా ఫలాన్ని ఇవ్వడము. హద్దు భావన కాదు, శ్రేష్ఠమైన భావన. సేవాధారులైన మీ పట్ల ఒకవేళ ఎవరైనా ఆత్మిక స్నేహ భావనను పెట్టుకుంటే, శక్తుల సహయోగము కావాలనే భావనను పెట్టుకుంటే, సంతోషము కావాలనే భావనను పెట్టుకుంటే, శక్తులు ప్రాప్తించాలనే భావనను పెట్టుకుంటే, ఉల్లాస-ఉత్సాహాల భావనను పెట్టుకుంటే, ఇలా రకరకాల భావనలకు ఫలము ఇవ్వడము అనగా సహయోగము ద్వారా అనుభూతిని చేయించడమే సేవా భావమని అంటారు. కేవలం ఉపన్యసించి రావడం, లేక గ్రూపుకు అర్థం చేయించి రావడం, కోర్సు పూర్తి చేసి రావడం, లేక సెంటరు ప్రారంభించి రావడం, దీనిని సేవా భావమని అనరు. సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తి అనే ఫలాన్ని అనుభవం చేయించడం, ఇటువంటి సేవలో తపస్య సదా కలిసి ఉంటుంది.
దృఢ సంకల్పముతో ఏదైనా కార్యాన్ని చేయడమే తపస్య యొక్క అర్థము అని వినిపించాము. ఎక్కడైతే యథార్థమైన సేవా భావముంటుందో, అక్కడ తపస్యా భావము వేరుగా ఉండదు. త్యాగము, తపస్య, సేవ ఈ మూడింటి కంబైండు రూపమే సత్యమైన సేవ, పేరుకు మాత్రమే చేసే సేవకు అల్పకాలిక ఫలమే ఉంటుంది. అక్కడే సేవ చేశారు, అక్కడే అల్పకాలిక ప్రభావము అనే ఫలము ప్రాప్తించి వెంటనే సమాప్తమైపోయింది, అల్పకాలిక ప్రభావానికి ఫలము అల్పకాలికమైన మహిమ - చాలా బాగా ఉపన్యసించారు, చాలా బాగా కోర్సు చేయించారు, చాలా బాగా సేవ చేశారు. కనుక బాగుంది-బాగుంది అనే అల్పకాలికమైన ఫలము లభించింది మరియు వారికి మహిమ వినేటటువంటి అల్పకాలికమైన ఫలము లభించింది. కానీ అనుభూతి చేయించడమంటే తండ్రితో సంబంధాన్ని జోడింపజేయడం, శక్తిశాలిగా చెయ్యడం - ఇది సత్యమైన సేవ. సత్యమైన సేవలో త్యాగము, తపస్య లేకపోతే అది 50 శాతము సేవ కూడా చేసినట్టు కాదు, 25 శాతము సేవ చేసినట్టు.
సత్యమైన సేవాధారులకు గుర్తు - త్యాగము అనగా నమ్రత మరియు తపస్య అనగా ఒక్క తండ్రిపై నిశ్చయము, నషాలో దృఢంగా ఉండడం. దీనినే యథార్థమైన సేవ అని అంటారు. బాప్ దాదా నిరంతరం సత్యమైన సేవాధారులుగా అవ్వాలని అంటారు. సేవ అనే పేరు చెప్తూ స్వయం కూడా డిస్టర్బ్ అవుతూ, ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తే - అటువంటి సేవ నుండి ముక్తులవ్వమని బాప్ దాదా చెప్తున్నారు. అటువంటి సేవ చెయ్యకపోవడమే మంచిది ఎందుకంటే సేవ యొక్క విశేషమైన గుణము ‘సంతుష్టత’. ఎక్కడైతే సంతుష్టత ఉండదో, అది స్వయంతో కావచ్చు, సంపర్కంలోని వారితో కావచ్చు, ఆ సేవ స్వయానికి కూడా ఫలాన్ని ప్రాప్తి చేయించదు, ఇతరులకు కూడా చేయించదు. దీని కంటే ముందు మిమ్మల్ని మీరు సంతుష్టమణిగా చేసుకొని తర్వాత సేవలోకి రావడం మంచిది. లేకపోతే సూక్ష్మమైన భారము తప్పకుండా ఉంటుంది. అటువంటి అనేక రకాల భారములు ఎగిరేకళలో విఘ్నరూపంగా అవుతాయి. భారమును పెంచుకోకూడదు, భారమును తగ్గించుకోవాలి. ఇలా అనుకుంటే, దీని కంటే ఏకాంతవాసిగా అవ్వడం మంచిది ఎందుకంటే ఏకాంతవాసిగా అయితే స్వపరివర్తన పట్ల అటెన్షన్ వెళ్తుంది. కనుక బాప్ దాదా ఏదైతే తపస్య చెయ్యమని చెప్తున్నారో - అది కేవలం రాత్రింబవళ్ళు కూర్చుని-కూర్చుని తపస్య చేయమని చెప్పడం లేదు. తపస్యలో కూర్చోవడం కూడా సేవయే. లైట్హౌస్, మైట్హౌస్ గా అయి శాంతి మరియు శక్తుల కిరణాల ద్వారా వాయుమండలాన్ని తయారుచెయ్యాలి. తపస్యతో పాటు మనసా సేవ జోడింపబడి ఉంది. అది వేరుగా లేదు. లేదంటే ఇంకెటువంటి తపస్య చేస్తారు! శ్రేష్ఠ ఆత్మలుగా, బ్రాహ్మణాత్మలుగా అయితే అయిపోయారు. ఇప్పుడు తపస్య అనగా స్వయం సర్వ శక్తులతో సంపన్నమై, దృఢమైన స్థితి, దృఢ సంకల్పం ద్వారా విశ్వానికి సేవ చేయడం. కేవలం వాచా సేవయే సేవ కాదు. ఎలాగైతే సుఖ-శాంతులకు, పవిత్రతకు పరస్పరము సంబంధముందో అలా త్యాగము, తపస్య, సేవలకు సంబంధముంది. బాప్ దాదా తపస్వీ రూపాన్ని అనగా శక్తిశాలీ సేవాధారి రూపాన్ని తయారుచేసుకోవాలని అంటారు. తపస్వీ రూపము యొక్క దృష్టి కూడా సేవ చేస్తుంది, వారి శాంతస్వరూప ముఖము కూడా సేవ చేస్తుంది. తపస్వీ మూర్తిని కేవలం దర్శనం చేసుకున్నా కూడా ప్రాప్తి అనుభవమవుతుంది, అందుకే ఈ రోజుల్లో ఎవరైతే హఠంతో తపస్య చేస్తారో వారిని దర్శించుకోవడానికి ఎంత మంది చేరుకుంటున్నారో చూడండి. ఇది మీ తపస్య ప్రభావం యొక్క స్మృతిచిహ్నమే, ఇది చివరి వరకు నడుస్తూ వస్తుంది. కనుక సేవాభావమని దేనినంటారో అర్థమయిందా. సేవా భావమనగా అందరి బలహీనతలను ఇముడ్చుకునే భావము. బలహీనతలను ఎదుర్కునే భావము కాదు, ఇముడ్చుకునే భావము. స్వయం సహనం చేసి ఇతరులకు శక్తినిచ్చే భావము, అందుకే సహనశక్తి అని అనడం జరుగుతుంది. సహనం చెయ్యాలి, శక్తిని నింపుకోవాలి మరియు శక్తినివ్వాలి. సహనం చెయ్యడమనగా మరణించడం కాదు. చాలామంది మేము సహనం చేస్తూ చేస్తూ మరణిస్తామని అనుకుంటారు. మేమేమైనా మరణించాలా ఏమిటి! కానీ ఇది మరణించడం కాదు. ఇది అందరి హృదయాలలో స్నేహంతో జీవించడం. ఎటువంటి శత్రువైనా, రావణుని కంటే తీక్షణమైనవారైనా కానీ, ఒక్కసారి కాదు, పది సార్లు సహనం చేయాల్సి వచ్చినా, సహనశక్తికి ఫలము అవినాశీగా మరియు మధురంగా ఉంటుంది. వారు కూడా తప్పకుండా మారిపోతారు. నేను ఇంత సహనం చేశాను కనుక వీరు కూడా కొంత చేయాలనే భావన మాత్రం పెట్టుకోకండి. అల్పకాలికమైన ఫలము లభించాలనే భావన పెట్టుకోకండి. దయా భావన పెట్టుకోండి - దీనినే ‘‘సేవా భావము’’ అని అంటారు. కనుక ఈ సంవత్సరం ఇటువంటి సత్యమైన సేవకు ఋజువునిచ్చి సుపుత్రుల లిస్టులోకి వచ్చే గోల్డెన్ ఛాన్సును ఇస్తున్నాము. ఈ సంవత్సరం మేళాలు మరియు ఫంక్షన్లు చాలా బాగా చేశారా అని చూడము, కానీ సంతుష్టమణులుగా అయి సంతుష్టతతో సేవ చేయడంలో నంబరు ముందు ఉండాలి. ‘‘విఘ్నవినాశకులు’’ అనే టైటిల్ తీసుకునే సమారోహంలో బహుమతి తీసుకోండి. అర్థమయిందా! దీనినే ‘‘నష్టోమోహా స్మృతి స్వరూపము’’ అని అంటారు. కనుక 18 సంవత్సరాల సమాప్తిలో విశేషంగా సంపన్నంగా అయ్యే ఈ అధ్యాయాన్ని స్వరూపంలో చూపించండి. దీనినే ‘‘తండ్రి సమానంగా అవ్వడం’’ అని అంటారు. అచ్ఛా!
సదా మెరుస్తూ ఉండే ఆత్మిక నక్షత్రాలకు, సదా సంతుష్టతా అలలను వ్యాపింపజేసే సంతుష్టమణులకు, సదా ఒకే సమయంలో త్యాగము, తపస్య, సేవల ప్రభావాన్ని వేసే ప్రభావశాలీ ఆత్మలకు, సదా ఆత్మలందరి ఆత్మిక భావనకు ఆత్మిక ఫలాన్ని ఇచ్చే బీజస్వరూపుడైన తండ్రి సమానమైన శ్రేష్ఠమైన పిల్లలకు, సంపన్నంగా అయ్యేందుకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పంజాబ్ మరియు హర్యానా జోన్ సోదర-సోదరీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక
సదా స్వయాన్ని స్థిరమైన, దృఢమైన ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? ఎటువంటి అలజడిలోనైనా స్థిరంగా ఉండడమే శ్రేష్ఠమైన బ్రాహ్మణాత్మల గుర్తు. ప్రపంచమంతా అలజడిలో ఉన్నా శ్రేష్ఠ ఆత్మలైన మీరు అలజడిలోకి రాలేరు. ఎందుకు? డ్రామాలోని ప్రతి దృశ్యము గురించి మీకు తెలుసు. జ్ఞానసంపన్నమైన ఆత్మలు, శక్తిశాలీ ఆత్మలు సదా స్వతహాగానే స్థిరంగా ఉంటారు. కనుక ఎప్పుడూ వాయుమండలానికి భయపడటం లేదు కదా! నిర్భయంగా ఉన్నారా? శక్తులు నిర్భయంగా ఉన్నారా? లేక కొద్ది-కొద్దిగా భయమనిపిస్తుందా? ఎందుకంటే మొదటి నుండే, స్థాపనా సమయం నుండే భారతదేశంలో గృహయుద్ధాలు జరుగుతాయని మీకు తెలుసు. ఇది మీ చిత్రాలలో ప్రారంభంలోనే చూపించడం జరిగింది. కనుక ఏదైతే చూపించారో అది జరగాల్సిందే కదా! భారతదేశంలో గృహయుద్ధాల పాత్రయే ఉంది కనుక నథింగ్ న్యూ (కొత్తదేమీ కాదు). కనుక నథింగ్ న్యూ అని గుర్తుందా లేక భయపడతారా? ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఇది జరిగింది...... సమాచారాన్ని వింటున్నా, చూస్తున్నా, డ్రామాలో తయారై ఉన్న విధిని శక్తిశాలిగా అయి చూస్తూ, ఇతరులకు కూడా శక్తినివ్వడము - ఇదే మీ అందరి కర్తవ్యము కదా. ప్రపంచంలోని వారు భయపడుతూ ఉంటారు, మీరు ఆ ఆత్మలలో శక్తిని నింపుతారు. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా, వారికి శక్తుల దానమిస్తూ ఉండండి. శాంతిని దానమిస్తూ ఉండండి.
ఇప్పుడిది అశాంతి సమయంలో శాంతినిచ్చే సమయము. మీరు శాంతి సందేశకులు. శాంతి దూతలని గాయనం ఉంది కదా! కనుక ఎప్పుడైనా, ఎక్కడ ఉన్నాసరే, నడుస్తున్నా, సదా స్వయాన్ని శాంతి దూతలమని భావించి నడుచుకోండి. మీరు శాంతి దూతలు, శాంతి సందేశాన్ని ఇచ్చేవారు కనుక స్వయం మీరు కూడా శాంతస్వరూప శక్తిశాలి స్థితిలో ఉంటారు, ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు. వారు అశాంతినిస్తే మీరు శాంతినివ్వండి. వారు నిప్పు అంటిస్తే మీరు నీరు వేయండి. ఇదే మీ పని కదా. ఇటువంటి వారినే సత్యమైన సేవాధారులని అంటారు. కనుక ఇటువంటి సమయంలో ఈ సేవయే అవసరము. శరీరమైతే వినాశీ, కానీ ఆత్మ శక్తిశాలిగా ఉంటే ఒక శరీరము వదిలినా మరొక శరీరంలో స్మృతి యొక్క ప్రారబ్ధము కొనసాగుతుంది. కనుక ఇతరులకు అవినాశీ ప్రాప్తి చేయిస్తూ వెళ్ళండి. కనుక మీరెవరు? శాంతి దూతలు. శాంతి సందేశకులు, మాస్టర్ శాంతి దాతలు, మాస్టర్ శక్తి దాతలు. ఈ స్మృతి సదా ఉంటుంది కదా! సదా స్వయాన్ని ఇదే స్మృతి ద్వారా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళండి, ఇదే మీ సేవ. ఏవైనా గవర్నమెంటు వారి నియమాలు ఉంటే వాటిని పాలన చేయాల్సి వస్తుంది కానీ ఎప్పుడైనా కొద్ది సమయం లభించినా మనసా ద్వారా, వాచా ద్వారా తప్పకుండా సేవ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనసా సేవ చేసే అవసరము చాలా ఉంది, కానీ ఎప్పుడైతే స్వయంలో శక్తి నిండి ఉంటుందో అప్పుడే ఇతరులకు ఇవ్వగలరు. కనుక సదా శాంతిదాత పిల్లలు, శాంతి దాతలుగా అవ్వండి. మీరు దాతలు కూడా మరియు విధాతలు కూడా. నడుస్తూ-తిరుగుతూ గుర్తుంచుకోండి - నేను మాస్టర్ శాంతిదాతను, మాస్టర్ శక్తిదాతను - ఈ స్మృతి ద్వారానే అనేక ఆత్మలకు వైబ్రేషన్లు ఇస్తూ ఉండండి. అప్పుడే వీరి సంపర్కంలోకి రావడంతో శాంతి అనుభవమవుతుందని వారు అనుభూతి చేస్తారు. కనుక తండ్రి సమానంగా మాస్టర్ శాంతిదాతలుగా, శక్తిదాతలుగా అవ్వాలి అనే వరదానాన్ని గుర్తుంచుకోండి. అందరూ ధైర్యవంతులే కదా! అలజడిలో కూడా వ్యర్థ సంకల్పాలు నడవకూడదు ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు సమర్థంగా అవ్వనివ్వవు. ఏమవుతుంది, ఇలా అయితే జరగదు కదా...... ఇది వ్యర్థము. ఏది జరుగుతుందో దానిని శక్తిశాలిగా అయి చూడండి మరియు ఇతరులకు శక్తినివ్వండి. ఇటువంటి సైడ్ సీన్స్ కూడా వస్తాయి. ఇది కూడా ఒక బై ప్లాట్ (ఉపకథ) నడుస్తుంది. ఉపకథగా భావించి చూసినట్లయితే భయపడరు. అచ్ఛా!
వీడ్కోలు సమయంలో (అమృతవేళ)
ఈ సంగమయుగము అమృతవేళ. పూర్తి సంగమయుగమంతా అమృతవేళగా ఉన్నందున ఈ సమయం యొక్క గొప్పతనం సదాకాలానికి గాయనం చేయబడుతుంది. కనుక పూర్తి సంగమయుగము అనగా అమృతవేళ అనగా డైమండ్ మార్నింగ్. సదా తండ్రి పిల్లలతో ఉన్నారు మరియు పిల్లలు తండ్రితో ఉన్నారు కనుక అనంతమైన డైమండ్ మార్నింగ్. బాప్ దాదా సదా చెప్తూనే ఉంటారు కానీ వ్యక్త స్వరూపంలో, వ్యక్త దేశం లెక్క ప్రకారం ఈ రోజు కూడా పిల్లలందరికీ సదా కలిసి ఉన్నందుకు గుడ్ మార్నింగ్ అనండి, గోల్డెన్ మార్నింగ్ అనండి, డైమండ్ మార్నింగ్ అనండి, ఇంకేమైనా అనండి, దానిని బాప్ దాదా పిల్లలందరికీ ఇస్తున్నారు. స్వయం మీరు కూడా డైమండ్, మార్నింగ్ కూడా డైమండ్, ఇంకా డైమండ్ గా చెయ్యాలి, కనుక సదా కలిసి ఉన్నందుకు గుడ్ మార్నింగ్. అచ్ఛా!
Comments
Post a Comment