07-04-1986 అవ్యక్త మురళి

 07-04-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“తపస్వీ మూర్తులు, త్యాగ మూర్తులు, విధాతలే విశ్వ రాజ్య అధికారులు”

ఈ రోజు ఆత్మిక దీపము తమ ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు. ఆత్మిక దీపపు పురుగులందరూ దీపముతో మిలనం జరుపుకునేందుకు నలువైపుల నుండి వచ్చి చేరుకున్నారు. ఆత్మిక దీపపు పురుగుల ప్రేమ ఆత్మిక దీపానికి తెలుసు మరియు ఆత్మిక దీపపు పురుగులకే తెలుసు. పిల్లలందరి హృదయపూర్వక స్నేహము ఆకర్షించి అందరినీ ఈ అలౌకిక మేళాలోకి తీసుకొచ్చిందని బాప్ దాదాకు తెలుసు. ఈ అలౌకిక మేళా గురించి అలౌకిక పిల్లలకు తెలుసు మరియు తండ్రికి తెలుసు! ప్రపంచంలోని వారికి ఈ మేళా గుప్తమైనది. మేము ఆత్మిక మేళాకు వెళ్తున్నామని ఒకవేళ ఎవరికైనా చెప్తే వారికేమి అర్థమవుతుంది? ఈ మేళా సదాకాలానికి సంపన్నంగా చేసే మేళా. ఈ పరమాత్మ మేళా సర్వ ప్రాప్తి స్వరూపులుగా చేసే మేళా. బాప్ దాదా పిల్లలందరి మనసులోని ఉల్లాస-ఉత్సాహాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మనసులో స్నేహసాగరుని అలలు వస్తున్నాయి. ఈ అలలను బాప్ దాదా చూస్తూ కూడా ఉన్నారు, అంతేకాక ఈ తపన విఘ్నవినాశకులుగా చేసి మధువన వాసులుగా చేసిందని కూడా తెలుసు. అందరి యొక్క అన్ని విషయాలు స్నేహంలో సమాప్తమైపోయాయి. ఈ స్నేహము ఎవర్రెడీగా ఉండే రిహార్సల్ ను చేసి చూపించింది. ఎవర్రెడీగా అయ్యారు కదా. మధురమైన డ్రామాలోని ఈ మధురమైన పాత్రను చూసి బాప్ దాదా మరియు బ్రాహ్మణ పిల్లలు హర్షితులవుతున్నారు. స్నేహములో అన్ని విషయాలు సహజంగా కూడా అనిపిస్తాయి మరియు ప్రియంగా కూడా అనిపిస్తాయి. ఏదైతే డ్రామా తయారయిందో, ఆ డ్రామా వాహ్! అన్నట్లుగా ఉంది. ఇలా ఎన్నిసార్లు పరుగు-పరుగున వచ్చారు. ట్రైన్ లో వచ్చారా లేక రెక్కలతో ఎగురుతూ వచ్చారా? ఎక్కడైతే మనసుంటుందో అక్కడ అసంభవం కూడా సంభవమవుతుందని దీనినే అంటారు. స్నేహ స్వరూపమునైతే చూపించారు, ఇక మున్ముందు ఏం చెయ్యాలి? ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది శ్రేష్ఠంగా ఉంది మరియు శ్రేష్ఠంగా ఉంటుంది.

ఇప్పుడు సమయ ప్రమాణంగా సర్వ స్నేహీలు, సర్వ శ్రేష్ఠమైన పిల్లల నుండి బాప్ దాదా ఇంకా విశేషంగా ఏం ఆశిస్తున్నారు? పూర్తి సీజన్లో ఎప్పటికప్పుడు బాప్ దాదా సూచనలైతే ఇస్తారు. ఇప్పుడు ఆ సూచనలను ప్రత్యక్ష రూపంలో చూసే సమయం వస్తుంది. మీరు స్నేహీ ఆత్మలు, సహయోగీ ఆత్మలు, సేవాధారి ఆత్మలు కూడా. ఇప్పుడు మహా తపస్వీ ఆత్మలుగా అవ్వండి. మీ సంగఠిత స్వరూప తపస్సు యొక్క ఆత్మిక జ్వాల ద్వారా ఆత్మలందరినీ దుఃఖము, అశాంతుల నుండి ముక్తులుగా చేసే మహోన్నతమైన కార్యము చేసే సమయము. ఒకవైపు అనవసర రక్తపాతము జరిగే ఆట యొక్క అలలు పెరుగుతూ ఉన్నాయి, ఆత్మలందరూ తమను తాము ఆధారహీనులుగా అనుభవం చేస్తున్నారు, ఇటువంటి సమయంలో అందరికీ ఆధారాన్ని అనుభూతి చేయించేందుకు మహాతపస్వీ ఆత్మలైన మీరు నిమిత్తంగా ఉన్నారు. నలువైపులా ఈ తపస్వీ స్వరూపం ద్వారా ఆత్మలకు ఆత్మిక ప్రశాంతతను అనుభూతి చేయించాలి. పూర్తి విశ్వంలోని ఆత్మలు ప్రకృతితో, వాయుమండలంతో, మనుష్యాత్మలతో, తమ మనసులోని బలహీనతలతో, తనువుతో కలత చెంది ఉన్నారు. అటువంటి ఆత్మలకు ఒక్క సెకండు కొరకైనా సుఖ-శాంతుల స్థితిని అనుభవం చేయిస్తే వారు మీకు పదే పదే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతారు. వర్తమాన సమయంలో సంగఠిత రూపంలో జ్వాలా స్వరూపము యొక్క ఆవశ్యకత ఉంది. ఇప్పుడు విధాత పిల్లలైన మీరు విధాత స్వరూపంలో స్థితులై, ప్రతి సమయము ఇస్తూ వెళ్ళండి. అఖండమైన మహా లంగరు వేయండి ఎందుకంటే రాయల్ బికారులు చాలామంది ఉన్నారు. కేవలం ధనం లేనివారే బికారులు కాదు, కానీ మానసిక బికారులు కూడా అనేక రకాలుగా ఉన్నారు. ప్రాప్తి యొక్క బిందువు కొరకు దప్పికతో ఉన్న అప్రాప్త ఆత్మలు ఎంతోమంది ఉన్నారు కనుక ఇప్పుడు సంగఠనలో విధాతాతనపు అలను వ్యాపింపజేయండి. ఏ ఖజానాలనైతే జమ చేసుకున్నారో వాటిని మాస్టర్ విధాతలుగా అయి ఎంతగా ఇస్తూ ఉంటారో అంతగా నిండుతూ ఉంటాయి. ఎంత విన్నారు. ఇప్పుడిది చేసేటటువంటి సమయము. తపస్వీ మూర్తులంటే అర్థము - తపస్సు ద్వారా శాంతి శక్తి యొక్క కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నట్లు అనుభవమవ్వాలి. కేవలం స్వయం కోసం స్మృతి స్వరూపులుగా అయి శక్తిని తీసుకోవడం లేక మిలనం జరుపుకోవడం వేరే విషయము. కానీ తపస్వీ స్వరూపము అనగా ఇతరులకు ఇచ్చేటటువంటి స్వరూపము. ఎలాగైతే సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని మరియు అనేక వినాశీ ప్రాప్తులను అనుభవం చేయిస్తాడో, అలా మహాన్ తపస్వీ రూపము ద్వారా ప్రాప్తుల కిరణాలను అనుభవం చేయించండి. దీని కొరకు మొదట జమా ఖాతాను పెంచుకోండి. స్మృతి ద్వారా లేక జ్ఞాన మననం ద్వారా స్వయాన్ని శ్రేష్ఠంగా తయారుచేసుకున్నాము, మాయాజీత్ విజయులుగా తయారుచేసుకున్నాము అని కేవలం ఇందులోనే సంతోషపడకండి. కానీ అన్ని ఖజానాలతో రోజంతటిలో ఎంతమంది పట్ల విధాతలుగా అయ్యారు. అన్ని ఖజానాలను ప్రతి రోజు కార్యంలో ఉపయోగించారా లేక కేవలం జమా అయ్యింది చూసుకొని సంతోషిస్తున్నారా. ఇప్పుడు సంతోషపు ఖజానా, శాంతి యొక్క ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞానపు ఖజానా, గుణాల ఖజానా, సహయోగమునిచ్చే ఖజానా, వీటిని ఎంత పంచారు అనగా ఎంత పెంచుకున్నారు అనే చార్టును పెట్టండి, దీని ద్వారా ఏదైతే సాధారణమైన చార్టును పెడుతున్నారో, అది స్వతహాగానే శ్రేష్ఠంగా అవుతుంది. పరోపకారులుగా అయితే స్వ ఉపకారులుగా స్వతహాగానే అవుతారు. అర్థమయిందా - ఇప్పుడు ఏ చార్టును పెట్టాలి? ఈ తపస్వీ స్వరూపము యొక్క చార్టుయే విశ్వ కళ్యాణకారులుగా అవ్వడము. కనుక ఎంతమంది కళ్యాణం చేశారు? లేక స్వకళ్యాణములోనే సమయము గడిచిపోతుందా? స్వకళ్యాణము చేసుకునే సమయము చాలా గడిచిపోయింది. ఇప్పుడు విధాతలుగా అయ్యే సమయం వచ్చేసింది కనుక బాప్ దాదా మళ్ళీ సమయం యొక్క సూచన ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పటివరకు కూడా విధాతాతనపు స్థితిని అనుభవం చెయ్యలేదంటే అనేక జన్మలు విశ్వరాజ్యాధికారులుగా అయ్యే పదమాపదమ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోలేరు, ఎందుకంటే విశ్వంపై రాజ్యం చేసేవారు, విశ్వానికి మాత-పితలు అనగా విధాతలుగా ఉంటారు. ఇప్పటి విధాతాతనపు సంస్కారమే అనేక జన్మలకు ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇప్పటివరకు ఏ రూపంలోనైనా తీసుకునే సంస్కారము ఉంటే - పేరు తీసుకునే, హోదా తీసుకునే లేక ఏ రకమైన తీసుకునే సంస్కారమున్నా, అది విధాతలుగా అవ్వనివ్వదు.

తపస్యా స్వరూపమనగా లేవత (తీసుకునే సంస్కారం) యొక్క త్యాగమూర్తులు. ఈ హద్దులోని లేవత (తీసుకునే సంస్కారం), త్యాగమూర్తులుగా, తపస్వీమూర్తులుగా అవ్వనివ్వదు కనుక తపస్వీమూర్తులనగా హద్దు యొక్క ఇచ్ఛా మాత్రం అవిద్య (కోరికలంటే తెలియని) రూపము. ఎవరైతే తీసుకోవాలనే సంకల్పం చేస్తారో, వారు అల్పకాలానికి తీసుకుంటారు కానీ సదాకాలానికి పోగొట్టుకుంటారు కనుక బాప్ దాదా పదే-పదే ఈ విషయం పట్ల సూచన ఇస్తున్నారు. తపస్వీ రూపంలో విశేషంగా ఈ అల్పకాలిక కోరికలే విఘ్నరూపంగా అవుతాయి కనుక ఇప్పుడు విశేషంగా తపస్సు యొక్క అభ్యాసం చెయ్యండి. సమానంగా అయ్యేటటువంటి ఈ ఋజువునివ్వాలి. స్నేహానికైతే ఋజువునిచ్చారు, ఇది సంతోషకరమైన విషయమే. ఇప్పుడు తపస్వీ మూర్తులుగా అయ్యే ఋజువునివ్వండి. అర్థమయిందా. భిన్న సంస్కారాలు ఉన్నప్పటికీ విధాతతనపు సంస్కారము ఇతర సంస్కారాలను అణిచివేస్తుంది. కనుక ఇప్పుడు ఈ సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోండి. అర్థమయిందా. ఎలాగైతే మధువనానికి పరుగెత్తుకుని వచ్చి చేరుకున్నారో, అలా తపస్వీ స్థితి అనే గమ్యం వైపు పరుగెత్తండి. అచ్ఛా, తప్పకుండా విచ్చేయండి. ఇప్పుడే వినాశనమవుతుందేమో అన్నట్లు అందరూ పరుగెత్తుకుని వచ్చారు. ఏదైతే చేశారో, ఏదైతే జరిగిందో అది బాప్ దాదాకు ప్రియమే, ఎందుకంటే పిల్లలు ప్రియమైనవారు. ప్రతి ఒక్కరు మేము వెళ్తున్నాము అనే ఆలోచించారు కానీ ఇతరులు కూడా వస్తున్నారా అన్నది ఆలోచించలేదు. సత్యమైన కుంభమేళా అయితే ఇక్కడే ఏర్పడింది. అందరూ అంతిమ మిలనము జరుపుకునేందుకు, అంతిమ మునక వేసేందుకు వచ్చారు. ఇంతమంది వెళ్తున్నాము అంటే మిలనము జరుపుకునేటటువంటి విధి ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుండి కూడా అతీతమైపోయారు. స్థానాన్ని చూడలేదు, రిజర్వేషన్ కూడా చూడలేదు. ఇకమీదట ఎప్పుడూ కూడా రిజర్వేషన్ దొరకదు అనే సాకును చెప్పలేరు. డ్రామాలో ఇది కూడా ఒక రిహార్సల్ లా జరిగింది. సంగమయుగంలో మన రాజ్యము లేదు. స్వరాజ్యమైతే ఉంది కానీ భూమిపై రాజ్యము లేదు, బాప్ దాదాకు తమ స్వంత రథము కూడా లేదు, పరాయి రాజ్యము, పరాయి శరీరము కనుక సమయ ప్రమాణంగా కొత్త విధిని ప్రారంభించేందుకు ఇది సీజన్ గా అయింది. ఇక్కడైతే నీటి కోసం కూడా ఆలోచిస్తూ ఉంటారు, అక్కడైతే జలపాతాలలో స్నానం చేస్తారు. ఎవరెవరైతే వచ్చారో, వారందరి స్నేహానికి బదులుగా బాప్ దాదా స్నేహంతో స్వాగతం చేస్తారు.

ఇప్పుడు విశేషంగా ఫైనల్ పరీక్షకు ముందు తయారీ కోసం సమయమిచ్చారు. ఫైనల్ పరీక్షకు ముందు సమయాన్ని ఇస్తారు. సెలవులు ఇస్తారు కదా. కనుక బాప్ దాదా అనేక రహస్యాలతో ఈ విశేషమైన సమయాన్ని ఇస్తున్నారు. కొన్ని రహస్యాలు గుప్తంగా ఉంటాయి, కొన్ని రహస్యాలు ప్రత్యక్షంగా ఉంటాయి. కానీ విశేషంగా ప్రతి ఒక్కరు సదా బిందువు పెట్టాలనే అటెన్షన్ ఉంచాలి అనగా గడిచిపోయిందేదో గడిచిపోయిందన్న బిందువును పెట్టాలి. మరియు బిందువు స్థితిలో స్థితులై రాజ్యాధికారిగా అయి కార్యాన్ని చెయ్యాలి. సర్వ ఖజానాల బిందువు, సర్వుల పట్ల విధాతగా అయ్యి, సింధువుగా (సాగరంగా) అయ్యి అందరినీ సంపన్నంగా చెయ్యాలి. కనుక బిందువు మరియు సింధువు, ఈ రెండు విషయాలను విశేషంగా స్మృతిలో ఉంచుకొని శ్రేష్ఠమైన సర్టిఫికెట్ తీసుకోవాలి. సదా శ్రేష్ఠ సంకల్పాల సఫలత ద్వారా ముందుకు వెళ్తూ ఉండాలి. కనుక బిందువుగా అవ్వాలి, సింధువుగా అవ్వాలి అనేదే పిల్లలందరికీ వరదాత ఇచ్చే వరదానము. వరదానము తీసుకునేందుకు పరుగెత్తుకుంటూ వచ్చారు కదా. వరదాత ఇచ్చిన ఈ వరదానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. అచ్ఛా!

నలువైపులా ఉన్న సర్వ స్నేహీ, సహయోగీ పిల్లలకు, సదా తండ్రి ఆజ్ఞను పాలన చేసే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా ప్రాక్టికల్ గా విశాల హృదయంతో అందరికీ సర్వ ఖజానాలను పంచే చాలా గొప్ప పుణ్యాత్మలైన పిల్లలకు, సదా తండ్రి సమానంగా అవ్వాలనే ఉల్లాస-ఉత్సాహాలతో ఎగిరేకళలో ఎగిరే పిల్లలకు, విధాత, వరదాత, సర్వ ఖజానాలకు సాగరుడైన బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదాతో పార్టీల కలయిక

1. స్వయాన్ని పదమాపదమ భాగ్యవంతులుగా అనుభవం చేస్తున్నారా! ఎందుకంటే ఇచ్చేటటువంటి తండ్రి ఎంత ఇస్తారంటే ఒక జన్మకైతే భాగ్యవంతులుగా అవ్వనే అవుతారు కానీ అనేక జన్మల వరకు ఈ అవినాశీ భాగ్యము నడుస్తూనే ఉంటుంది. ఇటువంటి అవినాశీ భాగ్యము గురించి ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా! అసంభవమని అనిపించేది కదా? కానీ ఈ రోజు సంభవమైంది. కనుక ఇటువంటి శ్రేష్ఠమైన ఆత్మలము అనే సంతోషముందా? ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోనూ సంతోషము మాయమైపోవడం లేదు కదా! ఎందుకంటే తండ్రి ద్వారా సంతోషపు ఖజానా ప్రతిరోజు లభిస్తూనే ఉంటుంది, ఏ వస్తువైతే ప్రతిరోజు లభిస్తుందో, అది పెరుగుతుంది కదా. ఎప్పుడూ సంతోషం తక్కువ అవ్వలేదు ఎందుకంటే సంతోష సాగరుని ద్వారా లభిస్తూనే ఉంటుంది, తరగనంత ఉంది. ఎప్పుడూ ఏ విషయంలోనూ చింతలో ఉండేవారు కాదు. ఆస్తి ఏమవుతుంది, పరివారం ఏమవుతుంది అనే చింత కూడా లేదు, నిశ్చింత! పాత ప్రపంచానికి ఏమవుతుంది! పరివర్తనే అవుతుంది కదా! పాత ప్రపంచంలో ఉంటూ ఎంత శ్రేష్ఠంగా ఉన్నా, అన్నీ పాతవే కనుక చింతలేని వారిగా అయ్యారు. ఈ రోజు ఉన్నాము, రేపు ఉంటామో లేదో తెలియదు అనే చింత కూడా లేదు. ఏది జరిగినా అంతా మంచే జరుగుతుంది. బ్రాహ్మణులకు అంతా మంచిదే. చెడు అనేది ఏమీ లేదు. మీరైతే ముందు కూడా చక్రవర్తులుగా ఉండేవారు, ఇప్పుడు కూడా చక్రవర్తులు, భవిష్యత్తులో కూడా చక్రవర్తులు. సదా కొరకు చక్రవర్తులుగా అయ్యారు కనుక చింతలేని వారిగా అయ్యారు. ఈ చక్రవర్తి పదవిని ఎవ్వరూ లాక్కోలేరు. ఎవ్వరూ తుపాకీతో మీ చక్రవర్తి పదవిని తియ్యలేరు. ఈ సంతోషము సదా ఉండాలి, అంతేకాక ఇతరులకు కూడా ఇస్తూ ఉండండి. ఇతరులను కూడా చింతలేని చక్రవర్తులుగా చెయ్యండి. అచ్ఛా.

2. సదా స్వయాన్ని తండ్రి స్మృతి అనే ఛత్రఛాయలో ఉండే శ్రేష్ఠమైన ఆత్మలగా అనుభవం చేస్తున్నారా? ఈ స్మృతి అనే ఛత్రఛాయ అన్ని విఘ్నాల నుండి సురక్షితంగా చేస్తుంది. ఏ రకమైన విఘ్నమైనా సరే ఛత్రఛాయలో ఉండేవారి వద్దకు రాలేదు. ఛత్రఛాయలో ఉండేవారు నిశ్చిత విజయులుగా ఉండనే ఉంటారు. మరి అలా అయ్యారా? ఛత్రఛాయ నుండి ఒకవేళ సంకల్పమనే పాదము బయటకు వచ్చినా కూడా మాయ దాడి చేస్తుంది. ఏ విధమైన పరిస్థితి వచ్చినా, ఛత్రఛాయలో ఉండేవారికి అతి కష్టమైన విషయం కూడా సహజమైపోతుంది. పర్వత సమానమైన విషయాలు దూది సమానంగా అనుభవమవుతాయి. ఛత్రఛాయ ఇటువంటి అద్భుతాన్ని చేస్తుంది. ఇటువంటి ఛత్రఛాయ లభించినప్పుడు ఏం చేయాలి. దేనిపట్లనైనా అల్పకాలికమైన ఆకర్షణ ఉన్నా, ఛత్రఛాయ నుండి బయటకు వచ్చారంటే, ఇక అంతా సమాప్తమయినట్లే. కావున అల్పకాలికమైన ఆకర్షణ గురించి కూడా తెలుసుకున్నారు. ఈ ఆకర్షణ నుండి సదా దూరంగా ఉండండి. హద్దు ప్రాప్తి అయితే ఈ ఒక్క జన్మలోనే సమాప్తమైపోతుంది. అనంతమైన ప్రాప్తి సదా తోడుగా ఉంటుంది. కనుక మీరు అనంతమైన ప్రాప్తిని చేసుకునేవారు అనగా ఛత్రఛాయలో ఉండే విశేషమైన ఆత్మలు, సాధారణమైనవారు కాదు. ఈ స్మృతి సదా కొరకు శక్తిశాలిగా చేస్తుంది.

ఎవరైతే చాలా కాలం దూరమై తర్వాత కలిసినవారో, ప్రియమైనవారో, వారు సదా ఛత్రఛాయ లోపల ఉంటారు. స్మృతియే ఛత్రఛాయ. ఈ ఛత్రఛాయ నుండి సంకల్పమనే పాదము బయటకు వచ్చినా కానీ మాయ వచ్చేస్తుంది. ఈ ఛత్రఛాయ మాయను ఎదురుగా రానివ్వదు. ఛత్రఛాయ లోపలకు వచ్చే శక్తి మాయకు లేదు. వారు సదా మాయపై విజయులుగా అవుతారు. పిల్లలుగా అవ్వడము అంటే ఛత్రఛాయ లోపల ఉండటము. సదా పిల్లలను ఛత్రఛాయలో ఉంచడం కూడా తండ్రి ప్రేమయే. కనుక “ప్రియమైన వారిగా అయ్యాము, ఛత్రఛాయ లభించింది” అన్న ఈ విశేషమైన వరదానాన్ని గుర్తుంచుకోండి. ఈ వరదానము సదా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది.

వీడ్కోల సమయంలో

అందరూ జాగరణ చేశారా! మీ భక్తులు జాగరణ చేస్తున్నారంటే, ఆ భక్తులకు నేర్పించేవారు ఇష్టదేవతలే, ఎప్పుడైతే ఇక్కడ ఇష్టదేవతలు జాగరణ చేస్తారో, అప్పుడు భక్తులు కాపీ చేస్తారు. అందరూ జాగరణ చేశారు అనగా తమ ఖాతాలో సంపాదన జమా చేసుకున్నారు. కనుక ఈ రాత్రి, సంపాదన చేసుకునే సీజన్లోని రాత్రిగా అయింది. ఎలాగైతే సంపాదించే సీజన్ ఉన్నప్పుడు, సీజన్లో మేల్కొని ఉండవలసి వస్తుంది. ఇది సంపాదించే సీజన్ కనుక మేల్కోవడం అనగా సంపాదించడం. కనుక ప్రతి ఒక్కరు యథాశక్తి తమ జమా చేసుకున్నారు, అంతేకాక ఇలా జమా చేసుకున్న దానిని మహాదానులుగా అయి ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు మరియు స్వయం కూడా అనేక జన్మలకు తింటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలందరికీ పరమాత్మ మిలనమనే గోల్డెన్ ఛాన్స్ యొక్క గోల్డెన్ మార్నింగ్ చెప్తున్నారు. చెప్పాలంటే ఇది గోల్డెన్ కంటే కూడా డైమండ్ మార్నింగ్ అయింది. స్వయం కూడా డైమండ్ గా ఉన్నారు, మార్నింగ్ కూడా డైమండ్ గా ఉంది మరియు జమా కూడా డైమండ్ గా చేసుకుంటున్నారు కావున డైమండ్ మార్నింగ్ చెప్తున్నాము. అచ్ఛా.

Comments