02-02-2011 అవ్యక్త మురళి

   02-02-2011        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “మీ భాగ్యాన్ని మరియు ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని సదా హర్షితంగా మరియు సంతుష్టంగా ఉండండి, దృష్టి, వృత్తి మరియు ప్రవృత్తి ద్వారా సంతుష్టతను అనుభవం చేయించండి.”

           ఈ రోజు బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పరమాత్మ ప్రేమ ద్వారా చేరుకున్నారు. ఈ రోజు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్య రేఖలను చూస్తున్నారు. ఇటువంటి భాగ్యము మరియు ఇంత పెద్ద భాగ్యము పూర్తి కల్పములో మరెవ్వరికీ లభించదు, ఎందుకంటే మీకు భాగ్యమును ఇచ్చేది స్వయంగా భాగ్య దాతయే. ముందుగా ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న భాగ్య సితార మెరుస్తోంది. నోటిపై మధుర వాణి యొక్క రేఖ మెరుస్తోంది. పెదవులపై మధురమైన చిరునవ్వు రేఖ మెరుస్తోంది. హృదయంలో హృదయరాముడైన బాబా యొక్క లవలీన రేఖ మెరుస్తోంది. చేతులలో సర్వఖజానాల శ్రేష్ఠత రూపీ రేఖ మెరుస్తోంది. పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖ మెరుస్తోంది. ఇప్పుడు ఆలోచించండి, ఇటువంటి భాగ్యము ఇంకెవరికైనా లభించిందా! అందుకే మీ స్మృతిచిహ్న చిత్రాలకు కూడా భాగ్యాన్ని వర్ణించడం జరుగుతుంది. అలాగే ఈ భాగ్యాన్ని స్వయంగా భాగ్య విధాత తన పిల్లలందరికీ తయారు చేసారు.

           బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి పిల్లలు ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుతున్నారు - వాహ్ పిల్లలు వాహ్! ఈ భాగ్యము ఈ సంగమయుగంలోనే లభిస్తుంది, మరియు నడుస్తుంది. సంగమయుగపు సుఖము అన్ని యుగాలలోకి శ్రేష్ఠమైనది. సత్యయుగ భాగ్యము కూడా సంగమంలోని పురుషార్థానికి ప్రాలబ్ధమే. కావున సంగమయుగపు ప్రాప్తి సత్యయుగ ప్రాలబ్ధానికన్నా ఎక్కువ. మీకు లభించిన భాగ్యంలో మునిగిపోండి. ఏమి జరుగుతున్నా కానీ మీ భాగ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే ఏమని వెలువడుతుంది? వాహ్ నా భాగ్యము! ఎందుకంటే స్వయంగా భాగ్య దాత మీ తండ్రి. మరి భాగ్య దాత ద్వారా ప్రతి ఒక్కరికీ తమ భాగ్యము లభించింది. మీరు ఎంతటి భాగ్యవంతులో తెలుసా లేక అప్పుడప్పుడూ తెలుస్తుందా? సదా నషా ఉంటుందా? మీకు ఏమి లభించింది అని ప్రపంచంవారు మిమ్మల్ని చూసి అడుగుతారు. అప్పుడు మీరు ఏమని జవాబు చెప్తారు? పొందాల్సినదంతా పొందేసాము, పొందేసారు కదా, చేతులెత్తండి, పొందేసారా, మంచిది. పొందారా? నషాతో చెప్తారు కదా, ఎటువంటి అప్రాప్తి వస్తువు లేదు, నషా ఉంది కదా? అది ఎలా లభించింది? కేవలం బాబాను తెలుసుకున్నారు, ఒప్పుకున్నారు, తమవారిగా చేసుకున్నారు, కావున భాగ్యము లభించింది. ఈ భాగ్యాన్ని ఎంతగా స్మృతిలోకి తెచ్చుకుంటూ ఉంటారో అంతగా హర్షితంగా ఉంటారు. భాగ్యశాలి ఆత్మ ముఖము సదా హర్షితంగా ఉంటుంది. ఉండాలి కాదు, ఉంటుంది. వారి దృష్టి, వృత్తి మరియు వారి ప్రవృత్తి సదా సంతుష్ట ఆత్మగా అయ్యి స్వయం సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులను కూడా సంతుష్టంగా చేస్తారు. మరి మీ అందరికీ సంతుష్టత యొక్క నషా ఉందా? ఎందుకంటే సంతుష్టతకు ఆధారము సర్వ ప్రాప్తి. అప్రాప్తి అసంతుష్టతకు ఆధారము. మరి మీరు ఏమి అనుభవం చేస్తున్నారు? అప్రాప్త వస్తువు ఏదైనా ఉందా లేక సర్వ ప్రాప్తులు ఉన్నాయా? ప్రాప్తి యొక్క నషా ఉందా? ఉందా, సదా ఉందా లేక అప్పుడప్పుడూ ఉందా? పొందాల్సింది పొందేసాము అనే అంటారు కదా, మరి ఎక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ అసంతుష్టత నామమాత్రానికి కూడా ఉండదు.

           బాప్ దాదా ఈ రోజు దేశ విదేశాలు, ఎన్ని దేశాల నుండి పిల్లలందరూ వచ్చి కలిసారు! కానీ అందరికన్నా దూరం నుండి వచ్చేది ఎవరు? అమెరికా వారు దూరం నుండి వచ్చారా? అమెరికా వారు దూరం నుండి వచ్చారు కదా! మరి బాబా ఎక్కడి నుండి వచ్చారు? అమెరికా అయితే ఈ లోకంలోనే ఉంది, కానీ బాప్ దాదా ఎక్కడినుండి వచ్చారు? పరంధామం నుండి, బ్రహ్మా బాబా కూడా సూక్ష్మవతనం నుండి వచ్చారు. మరి ఎవరు దూరంనుండి వచ్చినట్లు? అందరికన్నా దూరంనుండి ఎవరు వచ్చారు? ఇది తండ్రి మరియు పిల్లల ప్రేమ దృశ్యము. మీరు 'నా బాబా' అని అంటారు మరియు 'నా పిల్లలు' అని బాబా అంటారు. కేవలం ఒక్కరిని తెలుసుకోవడం వలన ఎంత వారసత్వం లభించింది! ప్రపంచంవారు సుఖం కోసం, శాంతి కోసం - ఎక్కడ శాంతి లభిస్తుంది, ఎక్కడ సుఖము లభిస్తుంది అని వెతుకుతున్నారు, కానీ మీ జీవితము మాత్రం సుఖశాంతుల సంపన్నంగా అయిపోయింది. బాప్ దాదా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు? అని అడుగుతుంటారు. ఇప్పుడు బాప్ దాదా చెబుతున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సదా స్వరాజ్య అధికారులుగా అయి ఉండాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. అప్పుడప్పుడూ కాదు, ఎందుకంటే ఇప్పటి స్వరాజ్య అధికారపు వరదానము బాబా ఈ సంగమయుగంలో పూర్తిగా ఇచ్చారు, కొద్దిగా కాదు, అప్పుడప్పుడూ కాదు, సదా. మరి ఆలోచించండి, సదా కొరకు స్వరాజ్య అధికారి అయ్యి ఉంటున్నారా? ఎందుకంటే మీరు ఈ కర్మేంద్రియాలకు, మనసు- బుద్ధి- సంస్కారాలకు కూడా యజమాని అని బాప్ దాదా చెప్పారు. అన్నింటికీ నాది అన్న పదాన్ని ఉపయోగిస్తారు, నేను అని అనరు, నాది అని అంటారు. మనసు- బుద్ధి- సంస్కారాలు నావి, నా వాటిపై సదా అధికారము ఉంటుంది. ఇలా మనసు, బుద్ధి, సంస్కారాలపై పూర్తిగా అధికారులుగా ఉండటాన్నే స్వరాజ్యధారి అని అంటారు. మీరు ఏది ఆర్డరు చేస్తే దాని అనుసారంగానే ఇవి కార్యము చెయ్యడానికి నిమిత్తంగా ఉన్నాయి. కానీ ఇందు కోసం నడుస్తూ తిరుగుతూ యజమానిని అన్న నషా ఉండాలి. నిశ్చయము మరియు నషా.

           ఇప్పుడైతే ఇది ఆత్మలకు మనస్సు ద్వారా సేవను ఇచ్చే సమయము. హే పూర్వజులారా! మాకు కొద్దిగా సుఖశాంతుల కిరణాలను అందించండి అని మొరపెట్టుకుంటూ ఉన్నారు. మరి హే పూర్వజులారా! దు:ఖంలో ఉన్నవారి మొర వినిపిస్తోంది కదా! ఎటువంటి ఆపద అయినా అకస్మాత్తుగా రానున్నది అని బాప్ దాదా ముందుగానే సూచన ఇచ్చి ఉన్నారు, ఇందుకోసం క్షణములో ఫుల్ స్టాప్. ఆ అభ్యాసాన్ని కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆ సమయంలో పురుషార్థానికి సమయముండదు. అభ్యాసం చేసి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే ఆశ్యర్యార్థకం వస్తుంది, కావున పురుషార్థానికి ఇప్పుడే సమయం లభించింది. ఆ సమయంలో ప్రాక్టికల్ గా చేయవలసి ఉంటుంది. ఇప్పటి నుండే ఈ అభ్యాసాన్ని చేస్తూ ఉన్నారు, బాప్ దాదా రిజల్ట్ కూడా చూస్తున్నారు, అటెన్షన్‌లో ఉన్నారు, చేస్తున్నారు కూడా, కానీ అటెన్షన్‌ను మరింత అండర్‌లైన్ చేయండి. చూడండి, పురుషార్థం ఎంత సహజమైనదో! నేను కూడా బిందువునే, పెట్టవలసింది కూడా బిందువే కేవలం అటెన్షన్ ఇవ్వాలి.

           పిల్లలూ, నేను సదా మీకు తోడుగా ఉన్నాను అని బాప్ దాదా పిల్లలకు విశేషమైన కానుకను ఇస్తున్నారు. బాబా అని అనగానే తండ్రి సదా పిల్లల కోసం హాజరవుతారు. హజూర్ హాజరు అని ఏదైతే అంటారో దాని అర్థం సర్వవ్యాపి కాదు, కానీ పిల్లల ఎదుట హజూర్ హాజర్ అయి ఉంటారు. మరి సదా విజయులుగా అవ్వండి, ఎక్కడ భగవంతుడు సదా తోడుగా ఉంటారో అక్కడ విజయులుగా అవ్వడం ఏమంత కష్టము! విజయము మీ జన్మ సిద్ధ అధికారము. కేవలం నా బాబా అని అనడం ద్వారా విజయులుగా అయ్యే ఉన్నారు. కావున, ఎవరైతే స్మృతిలో ఉంటారో వారికి సదా విజయులుగా అవ్వడము అతి సహజము, కష్టము కాదు. ఎక్కడ భగవంతుడు ఉంటారో అక్కడ విజయము ఉండనే ఉంది. ఈ రోజు బాప్ దాదా పిల్లలందరినీ చూసి చాలా సంతోషిస్తున్నారు, ఎంతో స్నేహముతో, ఏ సాధనముతో చేరుకున్నారు? రైలు లేక విమానము, అవి శరీరము ద్వారా చేరుకోవడం కోసం కానీ హృదయపూర్వక ప్రేమ మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది. ధైర్యం మీది, తండ్రి సహాయం ఉండనే ఉంది. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతి కర్మలో తమ స్వరాజ్యము అనే సీటుపై స్థితులవ్వాలని బాప్ దాదా ఆశిస్తున్నారు.

           ఈరోజు మొదటిసారిగా వచ్చినవారు చేతులెత్తండి, లేచి నిల్చొండి. చాలామంది ఉన్నారు. అచ్ఛా, మొదటిసారి వచ్చినట్లుగా మొదటి నంబరులోకి కూడా వెళ్ళాలి కదా! వెళ్ళాలా? బాబా వరదానము ఏమిటంటే- ఎవరైతే ధైర్యమును ఉంచుతారో వారికి తండ్రి సహాయము కూడా లభిస్తుంది మరియు ధైర్యముతో ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే అందుకు అవకాశము ఉంది ఎందుకంటే టూ లేట్ బోర్డు ఇంకా పెట్టలేదు. స్మృతిలో ఉండండి మరియు ఏదైతే ప్రాప్తించిందో దానితో ఇతరుల సేవను చెయ్యండి. ఎంతగా సేవను చేస్తారో అంతగా ఆశీర్వాదాలు లభిస్తాయి, ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి. సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి, ఆ తర్వాత వారి వారి అదృష్టము. కానీ మీరు సందేశాన్ని ఇవ్వండి, మీ పుణ్యాన్ని జమ చేసుకోండి. ఆ పుణ్యము మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. బాగుంది.

           వీరు కరాచీ నుండి వచ్చారా! చూడండి, ఆది స్థానము నుండి వచ్చారు. ఎక్కడ స్థాపన జరిగిందో అక్కడినుండి వచ్చారు. బాప్ దాదా ఇచ్చే వరదానమేమిటంటే- సదా ఆది రత్నముగా అయ్యి సదా సంతోషంగా ఉండటాన్ని, సదా డబుల్ లైట్ గా ఉండటాన్ని ఏదైతే అనుభవం చేసుకున్నారో దానిని ఇతరులకు కూడా అనుభవం చేయిస్తూ ఉండండి. ఇకపోతే బాప్ దాదా ఏమి చూసారంటే- నిశ్చయము మాత్రం అచలంగా ఉంది, ముందుకు వెళ్ళగలరు, వెళ్తున్నారు కూడా మరియు వెళ్ళగలరు కూడా, ఎంత కావాలంటే అంత ముందుకు వెళ్ళే వరదానాన్ని తీసుకోవచ్చు. అచ్ఛా! వీరు తోడుగా వచ్చారు. సంతోషంగా ఉన్నారు కదా! ఇక్కడి నుండి సంతోషాన్ని తీసుకు వెళ్ళండి. ఎంత సంతోషాన్ని తీసుకు వెళ్లాలంటే ఎప్పుడూ సంతోషము తగ్గకూడదు. మీరు సంతోషంగా ఉండటాన్ని చూసి ఇతరులు కూడా సంతోషిస్తారు. మరి వెళ్ళి ఏమి పంచుతారు! ఎక్కడికి వెళ్ళినా కానీ పంచుతారు కదా, మరి మీరు ఏమి సంచుతారు? సంతోషాన్ని పంచండి, అవినాశి సంతోషము. ఎవరికైతే సంతోషము లభిస్తుందో వారు కూడా సదా సంతోషంగా ఉంటారు. బాప్ దాదా అయితే సంతోషంగానే ఉన్నారు, కానీ ఇక్కడకు వచ్చిన మీరు కూడా సంతోషాన్ని తీసుకువెళ్తున్నారు. సంతోషాన్ని తీసుకువెళ్ళేంతగా సంతోషమును జమ చేసుకున్నారా? చేసుకున్నారు కదా! మరి బాగా పంచండి. మీ అనుభవాన్ని వినిపిస్తారు కదా, ఎక్కడినుండి వచ్చారో వినిపించండి. సంతోష స్థానం నుండి వచ్చారు, మీ కోసం కూడా సంతోషాన్ని తీసుకువచ్చాము. బాగుంది. ఈ రోజుల్లో చాలామంది వస్తున్నారు. సగం క్లాసు మొదటిసారి వచ్చినవారితో నిండిపోతుంది. మీరందరూ మొదటిసారి వచ్చారు, మంచిది. చాలా బాగుంది. బాప్ దాదా పూర్తి పరివారం తరఫున మీ అందరికీ మీ ఇంటికి వచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నారు. నా బాబా అని మాత్రం గుర్తుంచుకోండి, నా బాబా అన్నది మర్చిపోకండి ఎందుకంటే బాబా నుండి వారసత్వము లభిస్తుంది. అప్రాప్త వస్తువు ఏదైనా ఉంటే అది ప్రాప్తిస్తుంది. అచ్ఛా! మా సోదరులు తమ ఇంటికి చేరుకున్నారని అందరూ సంతోషిస్తున్నారు. (చప్పట్లు కొట్టండి). అచ్ఛా!

సేవ టర్ను :- ఈస్టర్న్ జోన్ (అస్సాం, ఒరిస్సా, బెంగాల్, బీహార్) నేపాల్, తమిళనాడు, బంగ్లాదేశ్ వారిది (మొత్తం 17 వేలమంది వచ్చారు) సెంటరులో ఉండే వారందరూ నిల్చుని మిగతా వారందరూ కూర్చోండి. చాలా బాగుంది. ఈ జోన్ అన్నిటికన్నా పెద్ద జోన్. తోడుగా ఉన్న జోన్లు కూడా తక్కువేమీ కావు ఎందుకంటే టీచర్లు ఎవరైతే వచ్చారో లేక ఎవరైతే సెంటర్లలో ఉంటున్నారో వారికి బాప్ దాదా విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. సేవాధారులు తమ సేవ యొక్క చైతన్య చిత్రాన్ని తమతో తీసుకువచ్చారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ స్థానంలో వృద్ధి యొక్క లక్ష్యాన్ని మంచిగా ఉంచారు. శ్రమ అయితే చేసారు, కానీ శ్రమకు ఫలితం కూడా లభిస్తోంది, ఇందుకు అభినందనలు. ఇప్పుడు ఏమి చెయ్యాలి? బాప్ దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు, ఎవరైతే వారసత్వ క్వాలిటీవారిగా ఉన్నారో, తమ ప్రభావాన్ని ప్రపంచంపై చూపే మైకులను, ఇటువంటి మైకులను మరియు వారసులను ఎంత పెద్ద జోన్ ఉందో అంతగా రెండు రకాల పెద్ద వారిని తయారు చెయ్యండి. ఏ వర్గం వారైనా కావచ్చు, కానీ మీది పెద్ద జోను. పెద్ద జోనుతో కలిసి ఇంత సంఖ్య, ఇల్లయిన మధువనానికి రావాలి. ఇప్పుడు ఎలా తయారు చెయ్యాలంటే, మీ జోన్ నంబరు ముందుకు రావాలి. చేస్తూ ఉండవచ్చు, ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారు సేవ లేనిదే ఉండలేరు అని బాబాకు తెలుసు, కానీ ఇక్కడి వరకు చేరుకునే రిజల్టును బాప్ దాదా చూడాలని ఆశిస్తున్నారు. ఇకపోతే మీరైతే చాలా మంచివారు, ఎందుకంటే బాబా సింహాసనానికి అధికారులుగా అయిపోయారు. బాబా టీచర్లను గురుభాయి అని అంటారు. కావున హే గురుభాయి! ఇప్పుడు ప్రతి స్థానము నుండి రావాలి. సరేనా! మంచిది, పురుషార్ధం చేస్తున్నారు మరియు సఫలత లభించవలసిందే. అదేమంత పెద్ద విషయము కాదు. కనెక్షన్లు పెరిగే విధంగా ఏదైనా పెద్ద ప్రోగ్రాము చేయండి. ఈ రోజుల్లో ఏ జోన్ సేవ చేస్తున్నా, వారి రిజల్టు వింటే సహజంగా వృద్ధి కూడా జరుగుతుంది మరియు మైకులు కూడా తయారవుతున్నారు కావున ఈ జోనులో కూడా సఫలత లభించే ఉంది. అచ్ఛా!

డబుల్ విదేశీయులు:- మధువనానికి వస్తారు, పరస్పరంలో కలుసుకుంటారు, బాబాను కూడా కలుస్తారు మరియు సేవ గురించి కూడా చర్చించుకుంటారు, ఇది బాప్ దాదాకు బాగా నచ్చింది. ఈ సాధనము బాబాకు నచ్చుతుంది అని బాబా ఇంతకు ముందు కూడా వినిపించి ఉన్నారు. ఎన్ని దేశాల నుండి వచ్చారు? (76 దేశాల నుండి వచ్చారు) ఇక్కడ మధువనానికి వచ్చి మీరు ఎన్ని దేశాలవారితో కలుస్తారు! ఇండియావారి దేశాలనుండి ఎంతమందైతే వచ్చారో వారి పేర్లు తీసుకుంటే చాలామందే ఉంటారు. మిమ్మల్ని చూసి ఇండియావారు సంతోషిస్తారు మరియు మీరు ఇండియావారిని చూసి సంతోషిస్తారు. ఇద్దరి మిలనము మంచిగా ఉంది. పరస్పరంలో కలుసుకోవడము అంటే ఉత్సాహాన్ని నింపుకోవడము. మరెక్కడా ఇంత పెద్ద పరివారము కలుసుకోవడాన్ని చూడలేరు, మధువనంలోనే ఇంత పెద్ద పరివారాన్ని చూడగలరు. మరి మనసులో ఏమని అనిపిస్తుంది? వాహ్ బాబా మరియు వాహ్ నా ఈశ్వరీయ పరివారము! తమ పిల్లలను చూసి బాప్ దాదాకు ఎంత సంతోషంగా ఉంటుంది! బాప్ దాదా అమృతవేళ అన్ని వైపులకు వెళ్తారు, వారికి అన్ని వైపులకు వెళ్ళడము ఏమంత పెద్ద విషయము! నాలుగు గంటల సమయంలో చేసుకునే మిలనములో విశేషత ఏమిటంటే- 4 గంటలకు బాప్ దాదా పిల్లలందరికీ సహజంగా వరదానాలను ఇస్తారు. వరదాన దాత యొక్క పాత్ర విశేషంగా అమృతవేళ ఉంటుంది. ఏ వరదానము కావాలన్నా అది బాప్ దాదా ఇచ్చేస్తారు. ట్రయల్ చేసి చూడండి. కానీ మీరందరూ కూడా వరదానాలు తీసుకోవడానికి అలర్టుగా ఉండాలి. ఒకవేళ అలర్టుగా లేకపోతే బాప్ దాదా వచ్చి వెళ్ళిపోతారు, మీరు ఆలోచిస్తూనే ఉంటారు. కావున అమృతవేళకు మహత్వాన్ని ఇస్తున్నారు కానీ మరింత అటెన్షన్ ఇవ్వండి. బాప్ దాదా ఏమి చూసారంటే- సమయానుసారంగా సేవ కూడా పెరుగుతోంది, సేవ కారణంగా బాబా నుండి వరదానాలను తీసుకోవడంనుండి దూరం కావడానికి వీల్లేదు. డబుల్ విదేశీయులు మెజారిటీ పురుషార్థం చేస్తున్నారు, కానీ అటెన్షన్‌ను అండర్ లైన్ చేయండి. మధువనానికి ఎలా అయినా చేరుకుంటారు, ఇందుకు బాప్ దాదా విశేషంగా పిల్లలందరికీ అభినందనలు తెలుపుతున్నారు. సంస్కారాల విషయంలో బాప్ దాదా ఏదైతే సూచన ఇచ్చారో, దాని గురించి- మేము చెయ్యవలసిందే అని భావిస్తారు మరియు అది చెయ్యడానికి రోజూ అమృతవేళ స్వమానంలో ఉండటంతో పాటు ఏదైనా ఒక సంస్కారంపై భిన్న భిన్న విధాలుగా అటెన్షన్‌ను ఉంచండి. ఈరోజు ఫలానా సంస్కారంపై విశేషమైన అటెన్షన్ ఉంచండి, మళ్ళీ రాత్రి పడుకునే ముందు బాప్ దాదాకు తమ రోజంతటి చార్టును ఇచ్చేటప్పుడు ఆ సంస్కారం యొక్క రిజల్టును విశేషంగా వినిపించండి, అప్పుడు విశేషమైన అటెన్షన్ ఉంటుంది. ఏదో ఒక సంస్కారంపై అటెన్షన్ ఉంచాలి, ఎలా అయితే స్మృతి పై అటెన్షన్ ఉంచుతారో దానితో పాటు అదే సమయంలో ఈ రిజల్టును కూడా బాప్ దాదాకు ఇవ్వండి. ఒకవేళ ఆ రోజు మీ ఎదురుగా ఫలానా సంస్కారాన్ని తొలగించుకోవడానికి ఏ సందర్భము రాకపోతే బాబా తరఫున మీకు మీరే అభినందనలు తెలుపుకోండి. ఇలా రోజూ ఆ సంస్కారం గురించి బాబా నుండి విశేషమైన అభినందనలను తీసుకోండి, అప్పుడు సంస్కారము కార్యంలోకే రావడంలో బలహీనమవుతుంది. ఎలా అయితే యోగము విషయంలో చెక్ చేసుకుంటారో అలాగే సంస్కారాలు గురించి పరిశీలించుకోండి, అవి రోజూ రాకపోయినా, అప్పుడప్పుడూ వస్తాయి. ఎవరైతే పురుషార్థులుగా ఉంటారో వారికి బైఛాన్స్ పరీక్ష వస్తుంది, రోజూ రాదు. కానీ చెకింగ్ జరుగుతూ ఉంటే ఈ అటెన్షన్ కూడా టెన్షన్ ను సమాప్తం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బాప్ దాదా ఏమి చూసారంటే విదేశీయులలో కొంతమంది పిల్లలు ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు అటెన్షన్ ఉంచుతారు. అటెన్షన్ ఉంచేవారే ముక్తిని పొందగలరు. బాబా వరదానము కూడా ఉంది. అర్థమయిందా! ఇప్పుడు దీని వెనుక పడండి, రిజల్టును రోజూ చెకింగ్ చేసుకుంటారు కదా! అప్పుడు సంస్కారము స్వయంగానే ఢీలా పడిపోతుంది. సంస్కారాల సబ్జెక్టులో నంబరువన్ లోకి వెళ్ళాలన్నది బాప్ దాదా ఆశ, ఏ సంస్కారము కావాలంటే అదే కార్యంలోకి రావాలి. అయిపోతుంది. అటెన్షన్‌లోకి వచ్చారు కదా, అయితే అయిపోతుంది. కానీ అటెన్షన్ ఇవ్వాలి. అటెన్షన్ లేకుండా జరుగదు, అటెన్షన్ ఇవ్వవలసి ఉంటుంది. సంగఠనలోనే ఈ సంస్కారాలు ఎందుకు వస్తాయి? మీ చిత్రాలను పూజించేవారు మీ సంస్కారాల గురించి ఎంత మంచిగా పాడుతారు! అంటే మీరు అలా అయ్యారు కావుననే పాడుతున్నారు కదా! మీ దైవీ చిత్రాన్ని ఇమర్జ్ చేసుకోండి , ఏమని పాడుతున్నారు? ఇటువంటి దేవతగా అవ్వవలసిందే కదా! అచ్ఛా, ఇకపోతే డబుల్ విదేశీయులందరూ పురుషార్ధంలో సఫలతను అనుభవం చేస్తున్నారు కదా! చేస్తున్నారా? సఫలతను అనుభవం చేస్తున్నాము అని భావించేవారు చేతులెత్తండి. వాహ్! చేతులైతే మంచిగా ఎత్తుతున్నారు. ఇప్పుడు దీనిపై అటెన్షన్ పెట్టవలసిందే అన్న లక్ష్యాన్ని ఉంచండి. ఇందులో కూడా నంబరు తీసుకోవలసిందే. మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా ఉత్సాహం వస్తుంది, ఎందుకంటే మీరు నిమిత్తులు కదా. నిమిత్తంగా ఉన్నవారికి బాప్ దాదా సహాయము విశేషంగా లభిస్తుంది. సెంటర్లు వృద్ధి చెందుతున్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు పరివర్తనకు నిమిత్తులుగా అయ్యేవారిగా అవ్వండి, అప్పుడు మిమ్మల్ని చూసి ఇతరులకు కూడా పరివర్తన శక్తి యొక్క ఉత్సాహము కలుగుతుంది. పురుషార్థంలో నంబరువారీగా అయితే ఉంటారు, అది అర్థమయ్యే విషయమే, కానీ పురుషార్థం వైపు అటెన్షన్ ఉంది, అందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. అటెన్షన్‌ను మరింత పెంచండి ఇకపోతే బాప్ దాదా నుండి ప్రియస్మృతులైతే రోజూ లభిస్తూనే ఉంటాయి. చూడండి, ఇంట్లో కూర్చుని కూడా బాప్ దాదా ప్రియస్మృతులను ఒక్కరోజు కూడా మిస్ అవ్వరు, ఒకవేళ విధిపూర్వకంగా మురళిని చదివినట్లయితే. ఒక్కరోజు కూడా ప్రియసృతులు మిస్ అవ్వరు. లభిస్తుంది కదా! లభిస్తుందా? రోజూ ప్రియస్మృతులు లభిస్తున్నాయి. అందరికీ లభిస్తాయి కదా? ఇదే బాప్ దాదా ప్రేమకు గుర్తు. మురళి మిస్ అయితే ప్రియస్మృతులను మిస్ చేసుకున్నట్లే. కేవలం మురళిని మిస్ చేసుకోలేదు, బాప్ దాదా ప్రియస్మృతులను, వరదానాలను మిస్ చేసుకున్నారు. మురళి అయితే చదువుకుంటారు కానీ బాప్ దాదా ప్రియసృతులను తీసుకోవడానికి ఏ సమయమైతే నిశ్చితమై ఉందో అదైతే మిస్ అయినట్లే. కావున ఉత్సాహము ఉన్నందుకు, బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా, మురళిని మిస్ చేసేవారున్నారా? "డబుల్ విదేశీయులలో ఉన్నారా? మురళి మిస్ చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఏకారణంగా అయినా మిస్ చేసేవారు ఉన్నారా? లేరు. మిస్ చేయరు. ఒక్కరు చేతులెత్తారు. ఇప్పుడిక మిస్ చేయకండి, మురళిని మిస్ చేయకండి. కావాలంటే ఫోన్ ద్వారా అయినా వినండి. చదవలేకపోతే ఎలాగైనా వినండి. హాజరు తప్పక వేసుకోండి. అచ్ఛా, సభలో ఎవరైతే వచ్చారో, క్రొత్తవారు కూడా ఉన్నారు, పాతవారు కూడా ఉన్నారు, ఈ విషయాన్ని పక్కా, పక్కా, పక్కా నోట్ చేసుకోండి- మురళి మిస్ అవ్వకూడదు. ఎందుకంటే బాబా రోజూ పరంధామం నుండి వస్తారు, ఎంత దూరం నుండి వస్తారు! పిల్లల కోసం వస్తారు కదా! ఎలా అయితే బాబా మురళి మిస్ చెయ్యరో అలాగే పిల్లలు కూడా మురళిని మిస్ చెయ్యకూడదు. అచ్ఛా!

            ఇప్పుడు మధువనానికి వచ్చేటప్పుడు ఫారమ్ నింపుతారు కదా, అందులో మురళి రోజూ చదివారా లేక ఎన్ని రోజులు మిస్ అయ్యారు అన్నది కూడా వ్రాయండి. ఒప్పుకుంటారా? ఎవరైతే ఒప్పుకుంటారో వారు చేతులెత్తండి. మధువనంవారు కూడా చేతులెత్తండి, ఏ కారణం చేతకూడా మురళి మిస్ అవ్వకూడదు. ఎలా అయితే భోజనం మిస్ చెయ్యరో, అలాగే ఇది కూడా భోజనమే కదా, అది శరీరానికి భోజనమైతే ఇది ఆత్మకు భోజనము, మంచిగా అనిపించిందా, క్రొత్తగా వచ్చినవారు కూడా, రావడానికైతే లభించింది కదా! వారు కూడా ఈ నియమాన్ని పాటించాలి, ఎలా అయితే ఇతర నియమాలు ఉన్నాయో అలా ఇది కూడా నియమమే. బ్రాహ్మణులు అంటేనే మురళి వినేవారు, సేవ చేసేవారు. అచ్ఛా! ఏ ఏ జోన్ల నుండి వచ్చారో, వారిని ఒక్కొక్కరిగా లేపండి.

తమిళనాడు :- వీరు సేవ కోసం వచ్చారు. చాలా మంచిది. సేవ అంటే ఫలము తినడము.

నేపాల్ :- చాలా బాగుంది. సేవ కోసం ఇంతమంది రావడము బాప్ దాదాకు చాలా బాగా నచ్చింది. సేవలో రావడము అంటే యజ్ఞంపై ప్రేమ ఉన్నట్లు. ఎవరైతే వచ్చారో అందరికీ బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు, అందరూ యజ్ఞ స్నేహులు, యజ్ఞ సహయోగి ఆత్మలు.

బెంగాల్ :- బాగుంది, ఎవరైతే వచ్చారో వారు మంచి సంఖ్యలో రావడం, మంచి ఉల్లాస ఉత్సాహాలతో రావడం బాప్ దాదా చూసారు. సదా యజ్ఞ స్నేహులుగా, యజ్ఞ సేవకులుగా అయి ఉండండి. తనువు ద్వారా కావచ్చు, మనసు ద్వారా కావచ్చు లేక ధనము ద్వారా కావచ్చు. యజ్ఞాన్ని ఎవరు రచించారు? బాబా రచించారు. ఎవరికోసం రచించారు? పిల్లలకోసం రచించారు. బ్రాహ్మణులైన మీరు లేకపోతే యజ్ఞాన్ని రచించడం జరుగదు. మరి అందరూ సేవ మంచిగా చేసారు కదా! నిమిత్తంగా ఉన్నవారి ద్వారా అందరికీ సర్టిఫికేట్ కూడా లభిస్తోంది. చాలా బాగా సేవ చేసారు, ఇక ముందు కూడా చేస్తూ ఉంటారు. అమరంగా ఉంటారు.

బీహార్ :- పేరు ఉన్నదే బీహార్, చూడండి పేరు ఎంత మంచిగా ఉందో! బీహార్ అంటే సదా బహార్.

ఒడిస్సా :- ప్రతి ఒక్కరూ మంచి సంఖ్యను తీసుకువచ్చారు. ఏ జోన్ అయితే వచ్చిందో అందరి సంఖ్యను చూసి, సేవపై ప్రేమ ఉన్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. సదా ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు వెళ్తున్నారు, వెళ్తూ ఉండండి.

అస్సాం:- ఒకరిని మించి మరొకరు ముందుండటాన్ని బాప్ దాదా చూసారు. ఎవరైతే వచ్చారో వారిలో ఒకరిని మించి మరొకరికి ఉల్లాస ఉత్సాహాలున్నాయి. సేవకు పుణ్యము ఉంటుంది, మరి పుణ్యాన్ని సంపాదించుకునే ఆత్మలు మీరు, ఎందుకంటే సేవతో ఆశీర్వాదాలు లభిస్తాయి. కావున మీరు సేవ చెయ్యలేదు కానీ పుణ్యాన్ని జమ చేసుకుని వెళ్తున్నారు. అచ్ఛా!

బంగ్లాదేశ్ :- కొద్దిమంది ఉన్నారు. ఎవరైతే సేవ చేసారో, వారందరూ యజ్ఞ స్నేహము మరియు యజ్ఞ సేవ యొక్క స్టాంపును తమపై వేసుకున్నారు. మీకు యజ్ఞ స్నేహి అన్న టైటిల్ ఉంది. అచ్ఛా, చాలా బాగా చేసారు.

ఝార్ఖండ్ :- కొద్దిమంది ఉన్నా కూడా సేవ అయితే ప్రేమగా చేసారు. ఎవరైతే ఉన్నారో వారు తమ భవిష్యత్తును తయారు చేసుకున్నారు. తయారు చేసుకుంటూ ఉండండి, ఎంతగా యజ్ఞ సేవను చేస్తారో అంతగా జమ చేసుకుంటారు. ఎక్కువ సేవ, ఎక్కువ జమ. అచ్ఛా!

           ఇప్పుడు మీరైతే సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు, కానీ మీకన్నా కూడా ఎక్కువ సంఖ్యను, భిన్న భిన్న స్థానాల వారిని బాప్ దాదా చూస్తున్నారు. మీరు సమ్ముఖంలో ఉన్నారు, వారు దూరంగా కూర్చున్నా కూడా హృదయంలో ఇమిడి ఉన్నారు. మీరైతే ఉండనే ఉన్నారు, అందుకే ఇక్కడకు వచ్చి చేరుకున్నారు కదా. కానీ బాప్ దాదా ఏమి చూసారంటే, దూరంగా కూర్చున్నా కూడా ప్రేమగా వింటున్నారు, మరియు అందరూ బాగా చూస్తున్నారు కూడా. ఈ సైన్సు మీకు పనికివస్తుంది అని బాబా ప్రారంభంలోనే చెప్పారు. మరి చూడండి, దూరంగా కూర్చుని కూడా సమీపతను అనుభవం చేయించేది ఈ సైన్సు సాధనము. ఇది వినాశనంలో కూడా సహాయపడుతుంది, అది కూడా అవసరమే. మీ బ్రాహ్మణ జీవితంలో కూడా బంగారు అవకాశన్ని ఇచ్చింది. మరి సైన్సువారు కూడా మీకు సహయోగులుగా ఉన్నారు. సైన్సువారు ఏమి చేస్తున్నారు అని వారిని చెడుగా భావించవద్దు. ఎవరికి ఏ పని ఉంటుందో అది చెయ్యవలసి ఉంటుంది. సైన్సు కూడా మీకు సహయోగిగా ఉంది, ఇకముందు కూడా అవుతుంది. అచ్ఛా!

           మీటింగ్ వగైరా చేసేవారు ఎవరైతే ముందు కూర్చున్నారో, విదేశీ టీచర్లు, నిమిత్తులు... బాప్ దాదా అన్నీ వింటారు. తప్పకుండా అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటారు, తిరుగుతూ సారాన్ని అర్థం చేసేసుకుంటారు. ఏ సమయంలో అయితే అవసరమైన విషయాన్ని మీరు ఫైనల్ చేస్తుంటారో అప్పుడు బాప్ దాదా తిరుగుతూ వినేస్తారు మరియు అభినందనలు కూడా తెలుపుతారు, కానీ మీరు చాలా బిజీగా ఉంటారు. కానీ బాప్ దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పెద్ద సెంటర్లు విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. భాషలు కూడా భిన్న భిన్నమైనవి ఉన్నాయి. ఇండియాలో కూడా భిన్న భిన్న భాషలు ఉన్నాయి కానీ విదేశాలలో కూడా భిన్న భిన్న భాషలున్నప్పటికీ అందరినీ కలుపుకుంటూ ఒక్కటిగా చేస్తున్నారు, అవుతున్నారు, అందరికీ ఇది మంచిగా అనిపిస్తుంది కూడా, కావున బాప్ దాదా సంతోషిస్తున్నారు. రండి, మీటింగ్ చేయండి, అందరినీ ఒక్క నియమంలో, ఒక్క పద్ధతిలో, ఒక్క విధంగా చెయ్యండి. బాప్ దాదాకు ఒక విషయంలో చాలా సంతోషంగా ఉంది, మొదట్లో కల్చర్, ఇది ఇండియన్ కల్చర్... అన్న మాట వినిపించేది, కానీ ఇప్పుడు ఆ మాట లేదు. అందరూ బ్రాహ్మణ కల్చర్ వారిగా అయిపోయారు, ఇందుకు అభినందనలు. కృషి చేసారు. ఇండియావారు కూడా చాలా కాన్ఫరెన్సులు చేస్తారు, మీటింగ్ లు కూడా చేస్తారు.

           బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు, కానీ రోజూ రాత్రి స్వయానికి బాప్ దాదాల ప్రియస్మృతులను మరియు అభినందనలను ఇచ్చుకోండి, బాప్ దాదాల అభినందనలను రోజూ తీసుకోండి. బాప్ దాదా ఇస్తారు మరియు మీరు కూడా మీకు మీరే ఇచ్చుకోండి. బాప్ దాదా వదిలిపెట్టరు, ఇండియావారైనా విదేశీయులైనా సరే, ఎలా అయితే అమృతవేళ తిరుగుతారో అలాగే రాత్రి కూడా అందరికీ గుడ్ నైట్ చెప్తారు అందుకే స్వయానికి అభినందనలు ఇచ్చుకుని తర్వాత పడుకోండి. అచ్ఛా!

           ఇప్పుడు అన్ని వైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులతో పాటు అభినందనలను తెలుపుతున్నారు. సదా ఉల్లాస ఉత్సాహాలలో ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ, ఏ కారణం చేత కూడా మీ ఉల్లాస ఉత్సాహాలను తగ్గించుకోవద్దు. విషయము, విషయమే కానీ పురుషార్థము మరియు బాబా ప్రేమ మనవి. కావున ఎప్పుడూ కూడా మీ బుద్ధిని బాబాపై కాకుండా ఇతర విషయాలలో బిజీగా ఉంచకండి. బాబా, బాబా మురళి మరియు బాబా ద్వారా లభించిన సేవను చేస్తూ ఉండండి. అచ్చా. ఇప్పుడు ఏమని చెప్పమంటారు, తోడుగా ఉండవలసిందే కదా! సెలవు తీసుకుంటాము అని అయితే చెప్పలేము కదా. కలిసి ఉంటాము, కలిసి నడుస్తాము మరియు కలిసి వస్తాము. అచ్ఛా! ఇప్పుడు సమాప్తి.

మోహిని అక్కయ్యతో :- అకస్మాత్తుగా జరిగేవాటిలో ఏదో ఒక విధమైన అలసట ఉంటుంది, అది బుద్ధి యొక్క అలసట కావచ్చు లేక శారీరక అలసట కావచ్చు. విశ్రాంతిగా ఉండండి. ఎక్కువ పరిగెత్తడమును, అభిరుచి ఉంటే చెయ్యండి, లేకపోతే వద్దు. ఒక్కోసారి ఒంటరిగా అయినప్పుడు తిరగాలనిపిస్తుంది కానీ ముందు మీ ఆరోగ్యాన్ని చక్కగా చేసుకోండి. ఎక్కువ అటెన్షన్‌ను పెట్టండి. ఇప్పుడు త్వరత్వరగా అవుతోంది, విశ్రాంతి తీసుకోండి. బుద్ధికి విశ్రాంతిని ఇవ్వండి. ఆ విశ్రాంతి పెద్ద విషయము కాదు, బుద్ధికి విశ్రాంతిని ఇవ్వండి.

దాదీ రతన్‌మోహిని దుబాయ్ వారి స్మృతిని అందించారు :- అందరికీ స్మృతిని ఇవ్వండి.

పర్ దాదీతో:- చూసారా, మీ జోన్ ఎంత పెద్దగా ఉందో! (బాబా కూర్చున్నారు) కానీ నిమిత్తమైతే మీరే కదా, స్థాపన చేసారు కదా! చెప్పడమైతే పర్ దాదీ జోన్ అనే అంటారు కదా! అందరూ ఒప్పుకుంటారు.

ఆంటీ అంకుల్ స్మృతులు పంపారు:- బాప్ దాదా ముగ్గురు, నలుగురు ఎవరైతే సేవలో ఉన్నారో, ప్రత్యేకంగా అంకుల్ కు హృదయపూర్వకమైన చాలా, చాలా, చాలా అభినందనలు తెలుపుతున్నారు. (ఆంటీ ఆరోగ్యం కూడా మంచిగా ఉండటం లేదు) చూడండి, మీరు కూడా మీది సంభాళించుకోండి, సేవ చెయ్యండి కానీ స్వయాన్ని కూడా సంభాళించుకోండి ఎందుకంటే మీరు యజ్ఞానికి స్పెషల్ నిమిత్త ఆత్మ. ఇప్పటివరకు ఎవ్వరూ పొజిషన్ లో ఉంటూనే జ్ఞానంలోకి రాలేదు. విదేశాలలో సేవలో ఉన్నత హోదాలో ఉంటూ కూడా పరివారాన్ని కూడా తీసుకువచ్చిన మొట్టమొదటి యుగళ్ మీరే. కేవలం ఇద్దరే రాలేదు, పూర్తి పరివారం సహితంగా వచ్చారు, కావున మీరిద్దరూ స్పెషల్. మరి బాప్ దాదా ఎంతని చెప్పాలి! వేయి సార్లు, లక్ష సార్లు చాలా చాలా ప్రేమతో స్మృతి కూడా చేస్తారు మరియు ఇప్పుడు కూడా చాలా, చాలా, చాలా, చాలా ప్రియస్మృతులను అందిస్తున్నారు.

ప్రీతమ్ బెహన్ ఆరోగ్యం మంచిగా లేదు, కుల్ దీప్ బెహన్ స్మృతిని అందించారు :- ఇప్పుడు నడవనివ్వండి, ఈ సూచనయే సరైనది. బాప్ దాదా కూడా సహయోగిగా ఉన్నారు.

దాదీ జానకితో :- సమయానికి మంచిగా అయిపోయారు కదా. ఇదే బాబా సహాయము. (హంసా అక్కయ్యతో) సేవ మంచిగా చేస్తారు, తనకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. ఇంకొకరు ఎక్కడ? (ప్రవీణ అక్కయ్య) ఇద్దరికీ బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. శ్రమించి సమయానికి మంచిగా చేసేసారు, అందరికీ లాభం కలిగింది. ఎవ్వరూ వంచితమవ్వలేదు, క్లాస్ లభించింది. కావున సంభాళించేవారికి అభినందనలు.

నీలు అక్కయ్యతో :- ఇంత కాలం రథాన్ని నడిపించడము, సమయానికి సేవా అవకాశాన్ని ఇప్పించడము, ఇందుకు అభినందనలు. రథం యొక్క అద్భుతం కూడా ఉండటాన్ని బాప్ దాదా చూసారు. 42 సంవత్సరాలు రథం నుండి సేవను తీసుకున్నారు, తీసుకునేది బాప్ దాదాయే, కానీ సేవ సమయంలో నిమిత్తమైన రథము హాజరు అవ్వడము, ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. సరళ స్వభావము ఉన్న కారణంగా రథాన్ని నడిపించడము వీలవుతుంది. ( దాదీ జానకితో) వీరు కూడా సేవలో ఎంతో ఉల్లాస ఉత్సాహాలు కలిగినవారు. అందుకే సేవ సమయానికి మంచిగా అయిపోతారు. (బాబా మంచిగా చేసేస్తారు. ఇది కూడా బాబా..) చతురత.

            బ్రహ్మా బాబా అంత పెద్ద వయస్సులో కూడా నడిపించారు, ఇప్పటికీ నడిపిస్తున్నారు. ఎప్పటివరకు నడిపిస్తారో అది డ్రామాలో చూస్తూ ఉంటారు. బాప్ దాదాల అద్భుతాలను చూస్తూ ఉండండి మరియు ప్రపంచంలోని ధమాల్ ను వింటూ ఉండండి. మీకైతే ఏ చింత లేదు, నిశ్చింత చక్రవర్తులు. బ్రాహ్మణులైన మీకు ఏది జరుగుతుందో అంతా మంచే జరుగుతుంది. మీకైతే ఇదే సంగమము, అమృతవేళ జరుగుతోంది. అమృతవేళ తర్వాత ఏమి వస్తుంది? పగలు వస్తుంది కదా! మరి పగలు రావలసిందే. ఏమవుతుంది అన్న సంకల్పము కూడా రానివ్వద్దు. పగలు రావలసిందే, మన రాజ్యము రావలసిందే. నిశ్చితమైనది. నిశ్చితమైన విషయము ఎప్పుడూ మారదు.

కుంజ్ దాదీతో :- అన్ని లెక్కాచారాలను సమాప్తం చేసుకుంటున్నారు. మంచిగా ఉన్నారు కదా. అచ్ఛా! మంచిగా అయిపోతారు. విశ్రాంతిగా కూర్చోండి. బుద్ధికి విశ్రాంతి మరియు శరీరానికి కూడా విశ్రాంతి. ఈ రోజుల్లో రెండింటికీ విశ్రాంతి కావాలి. ఎందుకంటే బుద్ధిలోని అలజడి శరీరంపై ప్రభావం చూపుతుంది. మంచిగా అయిపోతారు. అవ్వవలసిందే.

డా. అశోక్ మెహతా స్మృతిని అందించారు, వారికి హార్ట్ సర్జరీ అవ్వనుంది :- మంచిది, ధైర్యము కలవారు. ధైర్యము సహాయాన్ని అందిస్తుంది, ఇప్పిస్తుంది కూడా. ధైర్యాన్ని కోల్పోయేవారు కాదు, కొద్దిగా ఏదైతే ఉందో అది కూడా మంచిగా అయిపోతుంది కానీ కొద్దిగా విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలి. ఇలాంటి విషయాలలో కొంత సమయము విశ్రాంతి తప్పనిసరి. హాస్పిటల్ కు వెళ్ళవలసిందే అని కాదు, కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే ముందు ముందు సహాయం లభిస్తుంది. లేకపోతే అలసట అన్నది ఏదో ఒక విధంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. కొద్ది రోజులు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి.

ఈ రోజు ఉష జన్మదినము అని రమేష్ అన్నయ్య అన్నారు:- వారిని అప్పుడప్పుడూ వతనంలోకి పిలుస్తాము, సంతోషంగా ఉంది, ఎటువంటి కష్టము లేదు.

           వెనుక కూర్చుని ఉన్న పిల్లలను బాప్ దాదా తమ హృదయంలో చూస్తున్నారు. హాల్ లో వెనుక కూర్చుని ఉన్నా కూడా ప్రేమలో సమీపంగా మరియు హృదయంలో కూడా సమీపంగా ఉన్నారు.

కొంతమంది వి.ఐ.పీలు బాప్ దాదాను కలుస్తున్నారు :- ఎక్కడ ఏ కార్యం చేస్తున్నా కానీ మీ జీవితంలో సంతోషాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. సదా సంతోషంగా ఉండండి, ఎందుకంటే సంతోషం వంటి ఔషధం లేదు అని అంటారు. జీవితాన్ని జీవించాలి. చాలా మంది జీవిస్తున్నారు కానీ సంతోషంగా జీవించినప్పుడు జీవితంలోని ఆనందాన్ని పొందగలరు. సంతోషం లేకపోతే ఒకసారి ఒక విధంగా, మరోసారి మరో విధంగా ఉంటారు. (మీ ఆశీర్వాదం కావాలి) అది కావాలంటే, కళ్ళు తెరుచుకున్నప్పుడల్లా, పరుపుపై ఉన్నా కానీ కళ్ళు తెరుచుకోగానే పరమాత్మతో గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇదైతే చెయ్యగలరు కదా, కేవలం ఉదయాన్నే ఒకవేళ పరమాత్మను స్మృతి చేసినట్లయితే రోజంతా మీకు మంచిగా అవుతుంది. ఇందులో కష్టం కూడా లేదు, లేవవలసిందే కదా. కేవలం గుడ్ మార్నింగ్ శివబాబా. మీరు నిమిత్తులు కదా. మరి మిమ్మల్ని చూసినప్పుడు ఇతరులలో కూడా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే జీవితంలో ఏదో ఒక ప్రాప్తి కావాలి కదా. కావున అన్నిటికన్నా పెద్దది సంతోషము. సంతోషాన్ని ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. డబ్బులు పోయినా కానీ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. డబ్బులు వచ్చేస్తాయి. సంతోషంతో డబ్బులు డబుల్ అవుతాయి. వస్తూ ఉండండి. ఎక్కడ ఉన్నా కానీ ఫోన్ ద్వారా సంపర్కంలో ఉండండి. ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే ఏదైతే విన్నారో, వరదానాలను విన్నారో దానిని గురించి ఆలోచించండి.

సదా ఉదయాన్నే శివబాబాకు గుడ్ మార్నింగ్ చెయ్యండి. ఉదయాన్నే ఎవరి ముఖమైతే చూస్తామో రోజంతా అలాగే ఉంటుంది అని అంటారు కదా. కావున సదా సంతోషంగా ఉండండి. ఏ విషయము వచ్చినాకానీ దానిని సంతోషంగా తొలగించండి.

డబుల్ విదేశీ ఆర్.సి.ఓ. మీటింగ్ కు వచ్చిన సోదరీసోదరులతో :-(ఈ రోజుకి 25 సంవత్సరాల పూర్తయ్యాయి) అభినందనలు. 25 సంవత్సరాలు మీటింగ్ చేస్తూ వచ్చారు. ఏ మీటింగ్ అయితే చేస్తారో ఆ మీటింగును ప్రాక్టికల్ లోకి తీసుకురావడంలో సఫలత లభిస్తూ ఉంది కదా! సఫలత ఉంది కదా! ఎందుకంటే ఏమి చేసినా కానీ దాని రిజల్టు మంచిగానే అవ్వనున్నది. మరి మీరు ఏదైతే చేస్తారో, సమయాన్ని కేటాయిస్తున్నారో, సంగమ సమయము చాలా విలువైనది. మరి రిజల్టు ఎంత వచ్చింది? అని రిజల్టును పరిశీలించుకోండి. రిజల్టుతో సంతోషం కలుగుతుంది. మీరు అన్నారు మరియు అది జరిగింది. ఎందుకంటే జ్ఞానము అంటే చెయ్యడము మరియు జరగడము రెండూ కలిసి ఉండటము. మరి ఇంత సమయంలో ఏదైతే చేసారో, మంచిగానే చేసారు, ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారి ద్వారా ఏ కార్యమైతే జరుగుతుందో అది మంచిగానే జరుగుతుంది అని బాబాకు కూడా తెలుసు. అందుకే మిమ్మల్ని నిమిత్తంగా చెయ్యడం జరుగుతుంది. లేకపోతే నిమిత్తంగా చేసేవారు కాదు. ప్రతి సంవత్సరం చెయ్యాలి అన్న మీ భావన కూడా మంచిగా ఉంది. కావున ఏదైతే చేస్తారో దాని రిజల్టును చూడండి. ప్రాబ్లమ్ అయితే వస్తుంది, కానీ ప్రాబ్లమ్ తొలగిపోతుంది. ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ గా ఉండకూడదు, పరిష్కరింపబడటమే సఫలత, ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో మంచిగా జరిగింది. అందుకే ఇన్ని సంవత్సరాలు కొనసాగింది, లేకపోతే ఆగిపోయేది కదా. జరుగుతూ వచ్చింది. ఏ విషయము ఎలా ఉన్నా కానీ దాని చింత లేదు, నడుస్తూ ఉన్నారంటే తప్పకుండా ఏదో ఒక సఫలత లభించి ఉంటుంది! మరి నడిపిస్తూ ఉండండి, కానీ ఎంత సమయమైతే మహారథులందరూ ఇచ్చారో, మీ సమయము కూడా విలువైనది కదా. అంతగా ప్రాక్టికల్ లోకి తీసుకురండి. ఒక్కసారిగా అవ్వదు, కొద్దిగా సమయము పడుతుంది, అయినా ఫర్వాలేదు కానీ సమయానుసారంగా, ఎంతమంది మహారధులున్నారు? అందరి సమయము ఎంత విలువైనది, దాని అనుసారంగా రిజల్టు ఉందా? రిజల్టును పదే పదే వారి ముందు రిపీట్ చెయ్యండి. ఇది మిగిలి ఉంది దీనిని మేము పూర్తి చెయ్యాలి... అప్పుడు వచ్చే సంవత్సరంలో మీటింగ్ చేసి దానికోసం ప్లాన్ తయారుచేసి చేయవలసిందే. ఈ అటెన్షన్ అవసరము. పరస్పరంలో కలుసుకుంటూ ఉండటం బాప్ దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సమయం దూరంగా ఉంటారు కదా, మధువనంలో వచ్చి కలుసుకుంటారు. ఇది కూడా మంచిది, నష్టమేమీ లేదు, లాభమే ఉంది. బాప్ దాదా సంతోషిస్తున్నారు, చేస్తూ ఉండండి.

విదేశీ సేవలకు 40 సంవత్సరాలు పూర్తయ్యాయి :- వృద్ధి కూడా మంచిగా అయింది. ఏదైతే కష్టపడ్డారో దానినుండి ఫలితం వెలువడింది. కావున ముందుకు వెళ్తూ ఉండండి. బాప్ దాదా సంతోషిస్తున్నారు. (ఢిల్లీలో పెద్ద ప్రోగ్రాము జరుగనున్నది) వీలైనంతవరకు ఇందులో విదేశము మరియు ఇండియాను కలుపుకుంటూ చేస్తే మంచిది. (వన్ గాడ్, వన్ ఫామిలీ అనే ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది) ప్రారంభంలో లండన్ లో ఈ విషయము యొక్క ప్రభావము చాలా బాగా పడింది. వీరి స్టేజిపైన తెల్లవారు-నల్లవారు అన్ని ధర్మాలవారు కలిసి కూర్చుంటారు, వీరిలో ఆ భేదభావాలు లేవు, అందరూ కలిసి ఒక్కరినే నమ్ముతారు... ఈ ప్రభావము చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే సేవలు నలువైపుల జరుగుతున్నాయో, వీరు అందరినీ ఒప్పుకుంటారు అన్న మంచి అభిప్రాయం ఉంది. గాడ్ ఈజ్ వన్ అని ఏదైతే అంటారో, వారు ఈ వన్ ను తీసుకువస్తారు. ప్రోగ్రామ్ ఢిల్లీలో కదా, మరి స్టేజిపైన అందరూ ఉండాలి. ఎలా అయితే (బాహ్ రేన్ లో) అన్ని రకాల డ్రస్సులవారు వచ్చారో, అలా వారివారి డ్రస్ లో రావాలి. ఎక్కడ ఏ డ్రస్ వారున్నాకానీ స్టేజీపై కలిసి కనిపించాలి. (గాయత్రి అక్కయ్యతో) మీరు కూడా కృషి చేస్తున్నారు కదా, నిమిత్తంగా అవుతున్నారు. బాబా అయితే తోడుగా ఉండనే ఉన్నారు.

Comments