31-12-2008 అవ్యక్త మురళి

  31-12-2008         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 "ఈ నూతన సంవత్సరంలో పరివర్తనశక్తి అనే వరదానము ద్వారా నెగిటివ్ ను పాజిటివ్ లోకి పరివర్తన చేసి, సంకల్పము, శ్వాస, సమయములను సఫలం చేసుకోండి, సఫలతామూర్తులుగా కండి.”

           ఈ రోజు నూతన జీవితాన్ని ఇచ్చే బాబా తమ నలువైపుల ఉన్న నూతన జీవితాన్ని ధారణ చేసుకునే పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఈ నూతన జీవితము ఉన్నది నూతన యుగమును తయారు చేసేందుకే. మనుష్యులు నూతన  సంవత్సరాన్ని జరుపుకుంటారు, నూతన జీవితంతో ఉన్న పిల్లలైన మీరందరూ ఆత్మలందరికీ అభినందనలు తెలుపుతారు మరియు దీనితో పాటు నూతన యుగము రానున్నది అన్న శుభవార్తను కూడా తెలుపుతారు. పిల్లలైన మీ  అందరికీ బాబా వారసత్వంగా స్వర్ణిమ ప్రపంచాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ స్వర్ణిమ ప్రపంచంలో అనేక స్వర్ణిమ కానుకలు ఉండనే ఉన్నాయి. ఈ స్వర్ణిమ ప్రపంచమనే కానుక మా జన్మ సిద్ధ అధికారము అన్న నషా మీ అందరికీ  ఉంది కదా! ఈనాటి ప్రపంచంలో ఎవరు ఎవరికి ఎంత గొప్ప కానుకను ఇచ్చినా కానీ, ఏమివ్వగలరు? కిరీటము లేక సింహాసనమే కదా. కానీ మీ స్వర్ణిమ ప్రపంచపు బహుమతి ముందు అది ఏమంత పెద్దది? అది ఏమైనా పెద్దదా? మా  తండ్రి మాకు అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన నూతన యుగాన్ని కానుకగా ఇచ్చారు అని మీకు మనసులో సంతోషం ఉంది. నిశ్చయము ఉంది మరియు ఇది నిశ్చితము. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. ఈ అచంచల  నిశ్చయము సదా స్మృతిలో ఉంటుందా? సదా ఉంటుందా లేక అప్పుడప్పుడూ తగ్గుతుందా? జన్మ సిద్ధ అధికారము అన్నప్పుడు జన్మ సిద్ధ అధికారము ఎప్పుడూ చలించదు.

           ఈ రోజు మీరందరూ వేరు వేరు స్థానాల నుండి నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. కానీ ఈ నూతన సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు. ఈ నూతన సంవత్సరంలో ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారు? ఈ నూతన  సంవత్సరంలో విశేషంగా ఏమి చెయ్యాలి? ఈ నూతన సంవత్సర విశేషత - బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా కావలసిందే. ఏ పురుషార్థం చేయవలసి వచ్చినా కానీ, బాబా సమానంగా కావలసిందే అన్నది  నిశ్చితము. చెప్పండి, అందరి మనసులలో ఈ పక్కా సంకల్పమే ఉంది కదా! అవునా? తల ఊపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా కావాలి అన్నదే బాబా కూడా కోరుకుంటున్నారు. బాబా అయితే బాబాయే, కానీ పిల్లలు  తండ్రికన్నా ఉన్నతులు! మరి బాబా సమానంగా కావాలన్న లక్ష్యాన్ని పూర్తి చెయ్యడానికి బాబాను ఫాలో చెయ్యవలసి ఉంటుంది. ఆలోచించండి, బ్రహ్మా బాబా ఎలా సంపూర్ణమయ్యారు? వారి విశేషత ఏమిటి? సంపూర్ణతకు విశేషంగా  ఏది ఆధారంగా నిలిచింది? బ్రహ్మాబాబా తమ ప్రతి సమయాన్ని సఫలం చేసారు. శ్వాస-శ్వాస, క్షణ-క్షణము సఫలం చేసుకున్నారు. మరి బాబా సమానంగా కావడానికి ఈ సంవత్సరము ఏ లక్ష్యాన్ని తీసుకుంటారు? సఫలం  చేసుకోవాలి మరియు సఫలతామూర్తులుగా కావలసిందే. సఫలత మన మెడలోని హారము. సఫలత మన తండ్రి ఇచ్చిన వారసత్వము. మరి ఈ లక్ష్యముతో పరిశీలించుకోండి - సఫలతామూర్తులుగా అయి సమయము, శ్వాస,  ఖజానాలు, శక్తులు, గుణాలు అన్నింటినీ సఫలం చేసామా అని ప్రతి రోజూ స్వయాన్ని పరిశీలించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న సఫలతతో భవిష్యత్తు కూడా జమ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సఫలం చేసుకుంటారో 21  జన్మలకు దాని ఫలితము జమ అవుతుంది. తెలుసు కదా, ముందు కూడా వినిపించి ఉన్నాము - ఒకవేళ మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు రాజ్య భాగ్యము పూర్తి సమయము ప్రాప్తిస్తుంది. శ్వాసలను  సఫలం చేసుకుంటే 21 జన్మలు స్వస్థతతో ఉంటారు. ఎప్పుడూ ఏ విధంగానూ స్వస్థతలో లోటు ఉండదు. అలాగే ఏ ఖజానాలైతే జమ చేసుకుంటారో, అన్నింటికన్నా పెద్ద ఖజానా- జ్ఞానము. జ్ఞానము అనగా వివేకము. మరి జ్ఞాన  ఖజానాను సఫలం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు ఎంత వివేకవంతులుగా అవుతారంటే, మీకు మంత్రుల నుండి సలహా తీసుకోవలసిన అవసరం రాదు. స్వయమే రాజ్యాన్ని అఖండంగా, అచలంగా నడిపిస్తారు, మీ  రాజ్యంలో ఎటువంటి విఘ్నాలు ఉండవు. నిర్విఘ్నము, అఖండము, అచలము. జ్ఞాన ఖజానాను జమ చేసుకోవడం వలన లభించే ఫలితము ఇది. ఒక్క జన్మ సఫలం చేసుకొని అనేక జన్మలు సఫలతలోని ఫలితాన్ని  అనుభవిస్తారు. అలాగే ప్రాప్తించిన శక్తులను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల సఫలం చేసుకుంటే భవిష్యత్తులో మీ రాజ్యంలో సర్వ శక్తులు ఉంటాయి, ఎప్పుడూ శక్తి తగ్గదు, ఏ శక్తిలోనూ లోటు ఉండదు. అలాగే ఒకవేళ గుణాలు  దానం చేస్తే మీ అంతిమ జన్మలోనూ, 84 జన్మలలోనూ మీ జడ చిత్రాలు ఏవైతే తయారుచేస్తారో వాటి ద్వారా అంతిమం వరకు మీ మహిమను ఏమని గాయనం చేస్తారు? సర్వగుణ సంపన్నులు. కావున ఒక్కొక్క దాన్ని సఫలం చేసి  అనేక జన్మలు ప్రాప్తికి అధికారులుగా అయిపోతారు మరి ఈ సంవత్సరం ఏమి చెయ్యాలి? ఒక్క శ్వాస, ఒక్క క్షణం కూడా అసఫలం కాకూడదు అన్న లక్ష్యమును ఉంచుకోవాలి. జమ చేసుకోవాలి, జమ చేసుకునే సమయము ఒక  చిన్నని జన్మ మరియు ఫలితమును పొందే సమయము 21 జన్మలు, మరి ఈ సంవత్సరంలో బాబా సమానంగా అయ్యే లక్ష్యము ఉందా? అందరికీ బాబా సమానంగా అయ్యి తీరాలి అన్న లక్ష్యము ఉందా? అవ్వాలి- కాదు, అయ్యి  తీరాలి. అయ్యి తీరాలి అన్నది అండర్‌లైన్. అచ్ఛా! పిల్లలు కూడా అవుతారా? చిన్న చిన్న పిల్లలు కూడా అవుతారు. పిల్లల కిరీటము బాగుంది. (పిల్లలందరూ కిరీటము ధరించి ఉన్నారు). చాలా బాగుంది. మరి ఈ సంవత్సరానికి  లక్ష్యమునూ తీసుకున్నాము, దీనితో పాటు బాబాను అనుసరించేందుకు - సఫలం చేసి సఫలతామూర్తులుగా కావాలి అన్న మంత్రమును కూడా తీసుకున్నారు. ఇందుకోసం ఎక్కువ శ్రమ పడవలసిన అవసరము లేదు. బాప్ దాదా  పిల్లలకు కష్టాన్ని ఇవ్వరు, చాలా సహజమైన విధిని చెబుతారు, సహజమైన విధి ఏమిటి? ఏ సంకల్పం చేసినా కూడా బాబాకు ఈ సంకల్పము ఉండేదా అని ముందు పరిశీలించుకోండి. మాట మాట్లాడినప్పుడు బాబా సమానంగా  ఉందా అని పరిశీలించుకోండి. మరి సంకల్పము, మాట మరియు కర్మ, సంబంధ సంపర్కములలో బాబా ఇలా ఉండేవారా అని ముందు ఆలోచించండి, పరిశీలించుకోండి, అటువంటి స్వరూపంగానే కండి. బ్రహ్మాబాబాను ఫాలో  చెయ్యండి. ఫాలో ఫాదర్ అని అయితే గాయనము ఉంది కదా! కొంతమంది పిల్లలు చాలా మంచి మంచి ఆటలను చూపిస్తారు. ఎటువంటి ఆటలను చూపిస్తారో తెలుసా? అనుసరించరు కాని ఏమంటారు? అనుకోలేదు కానీ,  అయిపోయింది. ముందు ఆలోచించి, కేవలం ఆలోచించడమే కాదు దాని స్వరూపంలోకి రండి. ఒకవేళ స్వరూపంగా అయితే, అనుకోలేదు కానీ అయిపోయింది అని అనరు. చేసే, ఆలోచించే మీరు శ్రేష్ఠ ఆత్మలు, యజమానులు.  అయిపోయింది అంటే- కర్మేంద్రియాలపై నియంత్రణ లేదు అని అర్థం.

           మరి ఈ నూతన సంవత్సరంలో బాబా సమానంగా చేయవలసిందే, కావలసిందే... అన్న ఇదే స్లోగన్ ను గుర్తుంచుకోండి. కష్టమైతే కాదు కదా? బాబా ఎలా చేసారో అలాగే చెయ్యండి. కాపీ చెయ్యడమైతే సహజమే కదా. ఆలోచించే  అవసరము కూడా లేదు. ఎలా అయితే బాబా- బ్రహ్మా బాబా ఫరిస్తాగా అయ్యారో, కావున ఫరిస్తా నుండి దేవతలగా కావాలన్నది నిశ్చితము. మీరు కూడా ఫరిస్తాలనుండి దేవతలుగా కావాలసిందే, కొంతమంది పిల్లలు- నడుస్తూ,  నడుస్తూ చాలా అపోజిషన్(విరుద్ధము) వస్తోంది, అపోజిషన్ కారణముగా పొజిషన్ నుండి కిందకు వచ్చేస్తున్నాము అని అంటారు. కానీ గుర్తుంచుకోండి, బాబా సమానంగా కావాలంటే- స్థాపన ఆదిలో బ్రహ్మాబాబా ఎన్ని అపోజిషన్లను  పొజిషన్లలోకి మార్చారు? ప్రతి విషయము ఒక క్రొత్త ఛాలెంజ్ లా ఉండేది. ఇప్పుడైతే కాలమెంతో మారిపోయింది. కానీ ఒంటరిగా బ్రహ్మాబాబా ఎంతగా స్వమానము అనే సీటిపై కూర్చుని పొజిషన్ ద్వారా అపోజిషన్ ను  ఎదుర్కొన్నారు! ఎక్కడ పొజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏమీ చెయ్యలేదు. ముందు ఏమనేవారు? ధమాల్ చేస్తున్నారు అని అనేవారు, మరి ఇప్పుడు ఏమని అంటున్నారు? కమాల్ చేస్తున్నారు అని అంటున్నారు! ఇంత  తేడా వచ్చింది. దానికి కారణము ఏమిటి? బ్రహ్మాబాబా స్వయం స్వమానము అనే సీట్ మరియు దృఢ నిశ్చయము అనే శస్త్రాల ద్వారా అపోజిషన్ ను సమాప్తం చేసారు. మరి మీరు ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు? సమానంగా  కావాలి కదా, మరి సదా ఒకవేళ అపోజిషన్ ఉన్నప్పటికీ స్వమానము అనే సీట్ పై కూర్చుండిపోండి అప్పుడు అపోజిషన్, పొజిషన్లోకి మారిపోతుంది. ధైర్యముందా? బ్రహ్మాబాబా సమానంగా కావలసిందే, ఇందులో అయితే  చేతులెత్తారు, కానీ అంత ధైర్యముందా? ముందు స్వ పరివర్తన, తర్వాత అనేక సంబంధ సంపర్క ఆత్మలు, ఆ తర్వాత విశ్వ ఆత్మలు. వీరందరినీ మీ మనసా శుభ భావన, శుభ కామన ద్వారా, దృఢ సంకల్పం ద్వారా పరివర్తన  చెయ్యండి.

           మరి ఈ సంవత్సరంలో బాప్ దాదా విశేషంగా ఒక శక్తిని వరదానంగా కూడా ఇస్తున్నారు. 'నా బాబా' అని హృదయపూర్వకముగా అంటే శక్తి హాజరైపోతుంది, ఊరికే నా బాబా అని కాదు, హృదయపూర్వకముగా అంటే, అధికారము  ఉంచితే, నా బాబా అనగానే శక్తి మీ ఎదుట హాజరు అయిపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. పరివర్తన శక్తితో విశేషంగా నెగిటివ్ ను పాజిటివ్ లోకి మార్చండి. నెగిటివ్ సంకల్పము, నెగిటివ్ నడవడికను చూస్తూ కూడా పాజిటివ్ లోకి  మార్చండి. పాజిటివ్ చూడటం, మాట్లాడటం, చెయ్యడం కేవలం శుభ భావన, శుభ కామనల ద్వారానే సహజమవుతుంది. ఎందుకంటే ఈ అపోజిషన్ అయితే వస్తుంది, కానమీ పరివర్తన శక్తి మీకు సహజంగా సఫలతను  ప్రాప్తింపజేస్తుంది. మరి అర్థమయ్యిందా, ఈ సంవత్సరపు విశేష వరదానమైన పరివర్తన శక్తిని దృఢ సంకల్పంతో కార్యంలో వినియోగించండి. పరివర్తన చెయ్యగలరు కదా? మీ ఛాలెంజ్ గుర్తుంది కదా! మీరు విశ్వ పరివర్తకులు కదా!  విశ్వ పరివర్తకులు అన్న టైటిల్ ఉన్నప్పుడు మరి స్వయాన్ని పరివర్తన చేసుకోవడము కష్టమా! మనసులో ఎటువంటి కష్టము వచ్చినా, నిజానికి కష్టము అనేది ఏదీ ఉండదు, కానీ మీరు అలా చేసుకుంటారు. మాస్టర్  సర్వశక్తిమంతులముందు కష్టమైనది ఏమిటి? కానీ మీరు ఒక పొరపాటు చేస్తారు, దానితో కష్టంగా చేసేసుకుంటారు. ఎలా అయితే ఒకవేళ ఇక్కడ అకస్మాత్తుగా అంధకారమైపోతే, ఎవరైనా ఆ అంధకారాన్ని పారద్రోలాలని చూస్తే ఆ  అంధకారము పోతుందా? దానికి సరైన విధి- మీరు ప్రకాశమును ఇచ్చే స్విచ్ ను ఆన్ చేస్తే అంధకారం క్షణములో పారిపోతుంది. మీరు కూడా ఇదే పొరపాటు చేస్తారు, ఏ విషయమైతే అయిపోయిందో, దానిని ఎందుకు, ఏమిటి,  ఎప్పుడు, ఎలా.... అంటూ ఈ ప్రశ్నల క్యూ లోకి వెళ్ళిపోతారు. చిన్న విషయాన్ని పెద్దగా చేసేసుకుంటారు, అప్పుడు పెద్ద విషయము కష్టంగానే అనిపిస్తుంది కదా. చిన్న విషయముగా చేసేసుకోండి, అప్పుడు సహజమైపోతుంది. ఏ  శక్తినయినా కార్యంలో వినియోగించడానికి బాబా సహజమైన విధిని చెప్పారు - నేను మాస్టర్ సర్వశక్తిమంతుడను అన్న మీఈ స్మృతి రూపీ సీట్ పై కూర్చోండి, ఒకవేళ ఈ సీట పై కూర్చుంటే అప్ సెట్ అవ్వరు. సీటు లేకపోతే అప్  సెట్  అవుతారు, సీట్ ఉంటే అప్ సెట్  అవ్వరు. 63 జన్మల సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. 63 జన్మలు ఎలా ఉండేవి? ఒకసారి సెట్, ఒకసారి అప్ సెట్ . కావున సదా స్వమానము అనే సీట్ పై సెట్ అయి ఉండండి. ఇంకా ఈ  సంవత్సరంలో ఏమి చేస్తారు? నూతన సంవత్సరంలో అందరికీ కానుకలు ఇస్తారు కదా. మరి ఏ బహుమతిని ఇస్తారు? అభినందనలతోపాటు ఏ బహుమతిని ఇస్తారు? మీ వద్ద అయితే కానుకలు చాలానే ఉన్నాయి. ఎన్ని  ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వగలరు. స్థూలమైన కానుకలైతే అల్పకాలం వరకే ఉంటాయి, కానీ అవినాశీ బాబా సమానంగా అయ్యే మీరు అవినాశి కానుకను ఇవ్వండి. మనస్సు ద్వారా శక్తుల కానుకను ఇవ్వండి, వాచ ద్వారా జ్ఞానాన్ని  కానుకగా ఇవ్వండి మరియు కర్మణ ద్వారా గుణాలను కానుకగా ఇవ్వండి. ఇవి అందరి వద్దా ఉన్నాయి కదా? ఉంటే తల ఊపండి. ఖజానాలు చాలా ఉన్నాయి, తక్కువైతే లేవు కదా! ఎవరితో అయినా కార్యంలోకి రండి, కార్యంలోకి  రావలసి ఉంటుంది కదా, అలా కార్యములోకి వచ్చినప్పుడు వారికి ఈ సంవత్సరం చాలా కానుకలను ఇవ్వండి. కానీ అవినాశి కానుకలను ఇవ్వండి. వినిపించాము కదా, ఎవ్వరినీ ఖాళీగా పోనివ్వద్దు. మనసా కానుకలను ఇవ్వండి, లేక  వాణి, కర్మణ ఏదైనా కావచ్చు. ఇందుకోసం మీరు సదా ఒక అటెన్షన్ ను ఉంచవలసి ఉంటుంది, అన్ని వేళలా మనస్సులో శక్తుల స్టాకును ఇమర్జ్ చేసుకుని పెట్టుకోవాలి, ఎన్ని శక్తులున్నాయి? లిస్టు అయితే ఉంది కదా! వాచ  కారణంగా సదా మనస్సులో మనన శక్తిని, జ్ఞానాన్ని మననం చేసే శక్తిని స్మృతిలో ఉంచుకోవలసి ఉంటుంది. నడవడికలో, ముఖంలో, కర్మలో గుణ స్వరూపులుగా కావాలి. సదా స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపాన్ని  ఇమర్జ్ చేసుకోవలసి ఉంటుంది. అంతే కానీ శక్తులైతే ఉన్నాయి కదా, జ్ఞానము ఉంది కదా... అని భావించడం కాదు, కానీ వాటి స్వరూపంగా కావాలి. ప్రతి ఒక్కరినీ ఈశ్వరీయ పరివారపు దృష్టి, వృత్తితో చూడాలి. ఈ సంవత్సరం  సమానంగా కావలసిందే అన్నప్పుడు అందులో అయితే చేతులెత్తారు, బాప్ దాదాకు వతనంలో అందరి చేతులు కనిపిస్తాయి. అక్కడ ఈ చిన్న టి.వి ఉండదు, చాలా పెద్దది ఉంటుంది. ఒక్క క్షణములో అన్ని సెంటర్ల రిజల్టును  చూడగలరు. మరి బాబా సమానంగా కావాలన్న మీ ఉత్సాహాన్ని చూసి సంతోషిస్తున్నారు. మీరు అదృష్టవంతులు, సంతోషపు ముఖాన్ని కలిగినవారు, ఎప్పుడూ ఆవేశపు ముఖాన్ని పెట్టుకోకండి. సదా సంతోషముగా ఉండండి, మీరు  ఎంతగా పనిలో బిజీగా ఉన్నా, పొరపాటును సరిదిద్దుతున్నా, అర్థం చేయిస్తున్నా కానీ ఆవేశముతో ఉన్న ముఖము, మాటలు ఉండకూడదు. ఈ సంవత్సరంలో ఈ పరివర్తనను చేసి చూపండి, బహుమతి ఇస్తాము. ఎటువంటి  విషయము వచ్చినా, మొత్తం సంవత్సరంలో ఎవరైతే సదా చిరునవ్వుతో ఉంటారో వారికి బహుమతి ఇద్దాము. కొంతమంది సోదరసోదరీలు ఇలా అంటారు. అందరూ పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఏమంటారంటే  ఆవేశంతో చెప్పకపోతే అర్థం చేసుకోరు, మారనే మారరు అని అంటారు. వీరు మారరు అన్న భావనను మీరు ముందుగానే పెట్టుకున్నప్పుడు మీ వైబ్రేషన్ ముందుగానే చేరుకుటుంది. కావున ఈ సంవత్సరంలో క్రోధానికి, దాని  సంతానానికి వీడ్కోలు ఇవ్వాలి. వీలవుతుందా? ఆవేశము కూడా వద్దు. సమయ ప్రతి సమయము ఎవరైతే పని కావడానికి, బాగు చెయ్యడానికి క్రోధము చేస్తున్నారో, అక్కడ బాగవుతుందా? క్రోధం వలన ఎవరైనా మారారా? ఆ లిస్టు  చూపించండి అని బాబా అడుగుతున్నారు. మరింత విసుగు చెందుతారు, బాగుపడరు. మనసులో అపోజిషన్ చేస్తారు. ఒకవేళ చెప్పేవారు పెద్దవారైతే మనసులో అపోజిషన్ జరుగుతుంది, చెప్పలేరు కదా. చిన్నవారైతే ఏడుస్తారు.  మరి ఈ సంవత్సరం ఏమేమి చెయ్యాలో అన్నీ వినిపిస్తున్నాము. ఇష్టమేనా? చేస్తారా? ఇప్పుడు చేతులెత్తండి, చేస్తారా? టి.వి.వారు ఈ ఫోటోను తియ్యండి. చేతులెత్తండి. కొంచెం ఎత్తి ఉంచండి, టి.వి.వారు తీస్తున్నారు.

           బాప్ దాదా, ప్రతి ఒక్కరికీ ఏఏ విషయాలైతే వినిపించారో, వాటిని ఈ సంవత్సరంలో చెయ్యాల్సిందే. ప్రతి నెలలోని చివరి తారీఖున, ప్రతి ఒక్కరూ తమ చార్టును వరదానము లభించే చిన్నని కాగితంలో ఓ.కే. అని వ్రాయండి.  ఒకవేళ వినిపించిన ఈ విషయాలలో రెండు విషయాలు చేసి, రెండు చెయ్యలేకపోతే, ఓ.. మధ్యలో గీత పెట్టండి. అంతే, కేవలం ఇలా రిజల్టును వ్రాయండి. పెద్ద కాగితంలో వ్రాయవద్దు. ఒకవేళ పెద్ద కాగితంలో వ్రాస్తే చదివే వారి  సగం సమయము అందులోనే పోతుంది. అందుకే చిన్నని చీటీలో ఓ.కే అని వ్రాయండి, అప్పుడు చదవడానికి సహజంగా ఉంటుంది. మరి ఓ.కే అని వ్రాయడము, గీత పెట్టడము. సహజము కదా. విశేషంగా ఈ క్రోధము అనే  భూతాన్ని ఈ సంవత్సరం పారద్రోలాలి. ఆవేశము కూడా వద్దు, కొందరు కళ్ళతో కూడా క్రోధము చేస్తారు, చూసారా? ముఖముతో కూడా క్రోధము చేస్తారు. మరి ఏమి చేస్తారు? దేనికైనా విడాకులు ఇవ్వాలి కదా. ఇస్తారా?  మధువనంవారు ఇస్తారా? మధువనంవారు చేతులెత్తండి. అచ్ఛా, ఇంతమంది కూర్చుని ఉన్నారు! అచ్ఛా, ఇక్కడ కూర్చుని ఉన్నారు. మరి ముందుగా మధువనంవారికి బాప్ దాదా చెప్తున్నారు, ఇందులో ముందు నేను అని  అనాలి. ముందు మధువనం నుండి వీడ్కోలు ఇద్దాము. మధువనపు ప్రభావము సెంటర్లపై ఆటోమేటిక్ గా పడుతుంది. మధువనము బీజము, కాండము. కానీ మీ అందరి పర్మనెంట్ అడ్రెస్ ఏమిటి? మధువనం కదా! మరి మీరూ  అర్థం చేసుకుంటున్నారా లేక కేవలం మధువన నివాసులే చేస్తారా! మీరందరూ మధువన నివాసులు. ఎందుకంటే మీ పర్మనెంట్ అడ్రెస్ అయితే మధువనము. ఇదంతా సేవ కోసం మీరంతా భిన్న భిన్న స్థానాలకు వెళ్ళారు.  ఫారెనుకు  వెళ్ళేవారు తమ జన్మించిన గ్రామాన్ని మర్చిపోతారా? ఫారెన్లో ఉన్న భారతీయులు, ఎవరికైతే భారతదేశంలో వారి గ్రామము ఉందో, స్థానము ఉందో, వారు ఫారెన్లో ఉంటూ కూడా తమ జన్మ భూమిలో, గ్రామమైనా,  నగరమైనా సెంటర్లను స్థాపన చేయించారు, బాప్ దాదా ఆ పిల్లలకు చాలా చాలా పుణ్య ఆత్మలు అన్న టైటిల్ ఇస్తున్నారు. కమాల్ చేసారు, అలాగే అక్కడ ఏ కష్టమూ లేదు కదా, అంతా బాగుందా? అని కూడా అడుగుతూ  ఉంటారు. ఇది పుణ్య ఆత్మల కర్తవ్యము. ఇది పరివారము, ఒకే పరివారము. రెండు పరివారాలు కాదు, ఒకే పరివారము. ఈ రోజు మీరు లండనుకు ఏ కారణం చేతనైనా వెళ్తే మీరు ఏమని అంటారు? మా సెంటరు అని అంటారా లేక  లండను వారిది అని అంటారా? మాది అని అంటారు కదా! మనది అంటే దాని భావము అక్కడకు వెళ్ళిపోయి ఉండండి అని కాదు. బాబా అయితే ప్రతి ఒక్కరికీ వారి సేవా స్థానాలను ఇచ్చి ఉన్నారు. మరి విన్నారా ఏమి  చెయ్యాలో? మధువనంవారు మరియు మిగతా అందరూ తమ సర్టిఫికేటును తీసుకోవాలి. అచ్చా! చాలా పని ఇచ్చేసాము కదా! కానీ బ్పాదా మీకు తోడుగా ఉన్నారు, ఎక్కడ కష్టం వచ్చినా హృదయపూర్వకముగా బాబా, నా బాబా, నా  తోడు రండి, సహాయం చెయ్యండి అని అనండి. అప్పుడు బాబా కూడా బంధింపబడి ఉంటారు. కేవలం మనసుతో అనాలి. ఎందుకంటే సమయాన్ని, స్వయాన్ని రెండింటినీ చూడాలి. సమయం ఛాలెంజ్ చేస్తోంది మరియు మీరు  మాయను ఏమి చేస్తావు అని ఛాలెంజ్ చేయండి!

           మరి సమయ ప్రమాణంగా ఇప్పుడు సమయపు వేగము ఈ సమయంలో తీవ్రంగా ఉండటం బాప్ దాదా చూసారు. మరి సమయాన్ని ఎవరు ఎదుర్కోగలరు? మీరే కదా. దుఃఖితుల పిలుపును, భక్తుల పిలుపును, సమయపు పిలుపును  పిల్లలు తక్కువగా వినడం బాప్ దాదా చూసారు. పాపం ధైర్యహీనులుగా ఉన్నారు, వారికి రెక్కలను ఇస్తే కదా ఎగిరేది. ధైర్యము అనే రెక్కలు, ఉత్సాహ ఉల్లాసాలనే రెక్కలను ఇవ్వండి. అచ్ఛా!

           బాప్ దాదా అన్ని వైపుల నుండి వచ్చిన కార్డులు, ఈమెయిల్స్, అభినందనలను స్వీకరించారు కూడా మరియు ఇక్కడ కూడా చూసారు. మీ హృదయపూర్వక అభినందనలను బాప్ దాదా వజ్రాలకన్నా కోటాను రెట్లు ఎక్కువ  విలువైనవిగా స్వీకరించారు. దూరంగా కూర్చుని ఉన్న పిల్లలు కూడా బాబా హృదయం ముందే ఉన్నారు. బాప్ దాదా దృష్టిని ఇచ్చేటప్పుడు కేవలం ఈ హాల్ లో మాత్రమే ఇవ్వరు, బాప్ దాదా ఎదురుగా అన్ని స్థానాలలోని పిల్లలు  హృదయం ఎదుట హాజరై ఉంటారు. కావున పదమారెట్ల అభినందనలు కూడా మరియు బంగారు బహుమతికి అయితే బాప్ దాదా అందరినీ అధికారులుగా చేసేసారు. ఈ బంగారు బహుమతిలో అనేక బహుమతులు ఇమిడి  ఉన్నాయి. ఏది తలుచుకుంటే అది హాజరైపోతుంది. ఇక్కడి అనుసారంగా 12 గంటలకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది, మన కొరకైతే సదా నయనాలలో, హృదయంలో ఏమి గుర్తుంటుంది? స్వర్ణిమ ప్రపంచము.  ఇప్పుడే ఇక వచ్చేయనుంది. అలా అనిపిస్తుంది కదా! ఈ రోజు ఇక్కడ ఉన్నాము, మరి కొద్ది సమయంలో మన ప్రపంచంలోకి వెళ్తాము. అచ్ఛా! ఇప్పుడు చెప్పండి.
   
          *సేవటర్నుఢిల్లీ మరియు ఆగ్రావారిది*- చాలా మంచిది, సుందరమైన దృశ్యము కనిపిస్తోంది. సేవా పుణ్యము జమ చేసుకోవడం ద్వారా మనసు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటుంది కదా! అచ్ఛా. టీచర్లు కూడా చాలా మంది  ఉన్నారు. టీచర్లు చేతులు ఊపండి. బాగుంది, సంగఠన బాగుంది. ఇప్పుడు ఢిల్లీ ఏమి చేస్తుంది? ముందు కూడా వినిపించి ఉన్నాము, ఈ మేళా చెయ్యడము, ప్రోగ్రాము చెయ్యడము ఇవైతే కామన్ అయిపోయాయి, రీతి ప్రమాణంగా  అయిపోయాయి. సీజన్ అయిపోగానే వర్గాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు బాప్ దాదా రెండు విషయాలలో సూచనను ఇచ్చి ఉన్నారు, వి.ఐ.పి.ల సేవ బాగా చేసారు, సమయానికి సహయోగులుగా కూడా  అవుతున్నారు, మంచి సహయోగాన్ని కూడా ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఇటువంటి సహయోగుల నుండి వారసులుగా చేయండి. వాస్తవానికి ఢిల్లీలో కూడా చాలా సమయం నుండి వారస క్వాలిటీ వెలువడ్డారు. కానీ అది  ఇంతకుముందు. ఇప్పుడు మైకులుగానూ ఉండాలి మరియు వారస క్వాలిటీగానూ ఉండాలి, సహయోగి కాదు, సహయోగిగా అయితే చేస్తారు, అవుతున్నారు కూడా, కానీ వారస క్వాలిటీ కావాలి. ఇప్పుడు నలు వైపుల నుండి మైక్ కూడా  కావాలి, సహయోగులు కూడా కావాలి కానీ వారస క్వాలిటీవారిగా ఉండాలి. వారు గుప్తంగా ఉన్నా కానీ, వారసులు గుప్తంగా ఉన్నా కూడా ప్రత్యక్షంగానే ఉంటారు. ఇటువంటి గ్రూపును ఎక్కడినుండైనా తయారు చెయ్యండి, ఏ  వర్గంవారైనా కావచ్చు, దేశమువారు కానీ, ఎక్కడివారైనా కానీ ఇటువంటి క్వాలిటీ వారు మాలగా కాకపోయినా సరే, కంకణముగానన్నా తయారు చెయ్యండి. ఎలా అయితే పూర్వ కాలంలో అతి త్వరగా వారసులుగా అయ్యారో, అలాగే  ఇప్పుడు మిగతా అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నా కానీ వారస క్వాలిటీ ప్రతి శ్రీమతము, ప్రతి డైరెక్షన్ పై మనసుతో గుప్తంగా అయినా నడవాలి. భిన్న భిన్న స్థానాల నుండి ఇటువంటి గ్రూపును తయారు చెయ్యడానికి ఎవరైనా నిమిత్తం  కావాలి అని బాప్ దాదా ఆశ. ఈ నవీనతను ఏసెంటరు అయినా, ఏ వర్గమయినా చేసి చూపించండి. సహయోగులుగా ఉన్నారు, సమయానికి సహయోగమును ఇస్తున్నారని బాప్ దాదాకు తెలుసు, కానీ వారసులుగా అవ్వాలి,  గుప్తముగా ఉన్నా ఫరవాలేదు.ఢిల్లీ వారు ఏమిచేస్తారు? ఇటువంటి కంకణమును తయారుచేస్తారా? బాప్ దాదా మాల తయారుచేయమనడంలేదు, కంకణమునన్నా తయారుచేసి తీసుకురండి. ఈ సంవత్సరము ఏదైనా  అద్భుతమును చేసి చూపించండి. విదేశాల నుండి వెలువడినా, భారతదేశం నుండి వెలువడినా, వీలవుతుంది కదా! వీలవుతుందా? టీచర్లు చెప్పండి వీలవుతుందా? ఢిల్లీ వారు చేతులెత్తండి. వాహ్! బాప్ దాదా అభినందనలు  తెలుపుతున్నారు. మంచి ధైర్యాన్ని ఉంచారు. ఇప్పుడు ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నాము. ఎప్పుడైతే ప్రాక్టికల్ గా చేస్తారో అప్పుడు ఎటువంటి అభినందనలు ఇస్తాము? వాహ్! ప్రియమైన పిల్లలు వాహ్! ఎవ్వరైనా  చెయ్యండి, బాంబే చెయ్యండి, మహారాష్ట్ర చెయ్యండి, ఆంధ్ర చెయ్యండి, ఎవ్వరైనా చెయ్యండి, మధువనం చెయ్యండి. సరేనా! బాగుంది. ఢిల్లీలో బ్రహ్మాబాబా, బ్రహ్మాబాబాతో పాటు శివబాబా అయితే ఉండనే ఉన్నారు, కానీ విశేషంగా  బ్రహ్మాబాబాకు ఢిల్లీ, బాంబే, కలకత్తాలపై మొదటినుండి బాప్ దాదాకు  ఆశ ఉంది. కలకత్తావారు కూడా చెయ్యగలరు, ప్రారంభం నుండి బాప్ దాదా ఆశను ఉంచారు. అచ్ఛా! ఇప్పుడు కమాల్ చేసి, మరు సంవత్సరం వచ్చినప్పుడు  సిద్ధమై రండి. సరేనా? పాండవులందరూ చేతులెత్తండి. చూడండి, ఎంతమంది పాండవులు ఉన్నారో! మరి ఢిల్లీ పాండవులు కమాల్ చేసి వస్తారు కదా, చేస్తారా? బాప్ దాదా ఎప్పుడూ పదే పదే ఢిల్లీ పేరు తీసుకుంటూ ఉంటారు.  అందరికోసం, బ్రాహ్మణులందరికోసం ఢిల్లీలో దర్బారు తయారు చేస్తారు కదా, రాజ్యం చేస్తారు కదా. రాజ్య సభ ఢిల్లీలో ఉంటుంది కదా! మరి ఢిల్లీ వారు ఢిల్లీని ఎంతగానో తయారు చెయ్యవలసి ఉంటుంది. అందరికీ మహలు  ఇవ్వాలి కదా. మహలు ఢిల్లీలో లభిస్తుంది. అచ్ఛా, కమాల్ ను చూద్దాము. ఏదైనా నవీనత చెయ్యండి. ఇప్పుడు పదే పదే ఫంక్ష్ న్లు, మేళా జరగడం అందరూ చూసేసారు. అచ్ఛా!

          *జ్యూరిస్ట్ వింగ్, కల్చరల్ వింగ్ మరియు మీడియా వింగ్ వారు వచ్చారు* - ముందుగా జ్యూరిస్ట్ వారు లేవండి. లా అండ్ ఆర్డర్‌ను పటిష్టంగా చెయ్యడము జ్యూరిస్టుల పని. మరి మీరందరూ ఈ పాత ప్రపంచంలో కూర్చొని క్రొత్త  ప్రపంచపు లా అండ్ ఆర్డర్‌ను తయారు చేస్తున్నారు. ప్లాను మంచిగా చేసారు. ఈ డిపార్టుమెంటులో కూడా భిన్న భిన్న స్థానాల నుండి సహయోగులు ఉన్నారు. అన్ని వైపులవారు కలిసి చేస్తే వాటి ద్వారా, భాషణ ద్వారా ఎటువంటి  వాతావరణాన్ని తయారు చెయ్యండంటే అనేకులు మీకు తోడుగా అయి, అశాంతి సమయంలో మేము శాంతిని కాపాడుతాము అనే విధంగా ముందుగా వారు సహయోగులుగా కావాలి. శాంతి స్థాపకులుగా అయి మీకు తోడుగా  నిలవాలి. ఇలా సంతకం తీసుకోండి. మేము శాంతిగా ఉంటాము, లా అండ్ ఆర్డర్ లో నడుచుకుంటాము మరియు ఇతరులను నడిపిస్తాము అని అనేక స్థానాలలో మీ సేవ ద్వారా వ్రాయించుకోండి. ఇటువంటి లిస్టును తయారు  చెయ్యండి, మరియు మీరు ఏమి చేస్తున్నారో దానిని ప్రభుత్వానికి చూపించండి. ఆ గ్రూపు ప్రాక్టికల్ గా లా అండ్ ఆర్డర్ అనుసారంగా నడుస్తుందా లేదా అని మధ్య మధ్యలో పరిశీలిస్తూ ఉండండి. ఇటువంటి సహయోగి గ్రూపు,  యువకులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు (కానీ వివేకముగల పిల్లలు)..... వారి సంఖ్యను ప్రోగు చెయ్యండి. వీరిని యాత్ర చేయించాల్సిన అవసరం లేదు, కానీ సమయప్రతి సమయము ఎక్కడైనా పెద్ద స్థానములో  వారి సంగఠనను చేస్తూ ఉండండి. అన్ని వర్గాలవారు ఉండే విధంగా సంగఠనను తయారు చెయ్యండి. ప్రభుత్వం కూడా వీరు ఏమి చేస్తున్నారు అని చూడాలి. ప్రభుత్వం కోరుకుంటుంది కానీ చెయ్యలేకపోతోంది, మీరు చేసి  చూపించండి. బాగుంది. సంగఠన బాగుంది మరియు చేస్తూనే ఉంటారు, కానీ ఇప్పుడు గర్జన పెంచాలి. ఎవరైతే నిమిత్తమయ్యారో వారికి బాబా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు, చేస్తూ ఉండండి, ముందుకు సాగుతూ  ఉండండి, ముందుకు నడిపిస్తూ ఉండండి. ఇప్పుడు ప్రభుత్వం చెవిలో వేయండి, కొద్దిగా వారి చెవిని కదపండి. ఎన్ని వర్గాలు ఉన్నాయో అవన్నీ తమ తమ సేవల ద్వారా వారికి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వండి. తమ  చిక్కుముళ్ళలోనే బిజీగా ఉండేవారిని లేపండి, ఏదైతే చేస్తున్నారో అది బాగుంది, ఇప్పుడు ఇంకా మంచిగా చెయ్యండి. బాప్ దాదాల విశేషమైన ప్రియస్మృతులు మరియు అభినందనలు కూడా ఈ గ్రూపుకు ఉన్నాయి.

          *మీడియావింగ్ వారితో*- మీడియావారు ఇప్పుడు కొద్ది కొద్దిగా ప్రజల చెవులను తెరిచారు. ఇప్పుడు వినడం మంచిగా అనిపిస్తుంది, కొందరు అలా అవడం కూడా ప్రారంభించారు. ఎంతమంది వింటున్నారో అందరూ అయిపోతే  ఎమవుతుంది? మీడియా కమాల్ చెయ్యగలదు అని బాప్ దాదా సాకారంలో కూడా అనేవారు. కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో చూస్తున్నారు, కొద్దిగా ఆలస్యంగా చేసారు, కానీ ఆలస్యంలో కూడా సరైన రీతిలో ఉంది. సందేశాన్ని  వ్యాపింప చేసే సాధనము ఇంట్లో కూర్చునే చెయ్యగలగడము మీడియానే చెయ్యగలదు! ఎందుకంటే ఈ రోజుల్లో మనుష్యులు సమయము ఉండి కూడా- బాగుంది, కానీ సమయం లేదు అని సాకులు చెబుతారు. ఈ సాకును కూడా  మీడియావారు సమాప్తం చెయ్యగలరు. కేవలం మంచిగా అనిపించింది కాదు, మంచిగా చేసి చూపించండి. ప్రారంభమయింది, మంచి ప్రభావముంది, శ్రమ కూడా బాగా చేస్తున్నారు, కానీ ఇప్పుడు కొంచెం ధ్వనిని మరింత పెంచండి.  క్రొత్త క్రొత్త ప్లాన్లను తయారు చెయ్యండి. ధ్వనిని పెంచడంలో మీకు సహయోగులుగా అయ్యేవారిని తయారు చెయ్యండి. ఇటువంటివారిని కూడా తయారు చెయ్యండి. కొందరు చేయించేవారు, కొందరు చేసేందుకు  నిమిత్తమయ్యేవారు, బాగుంది. మీడియాకు అనేక రకాల సేవలు ఉన్నాయి, కావున భిన్న భిన్న రకాలుగా ధ్వని వ్యాపిస్తూ ఉండాలి. సంబంధ సంపర్కాలలోకి తీసుకు వస్తూ ఉండండి. మరి మీడియా డిపార్టుమెంటుకు కూడా, ఎంతైతే  చేసారో, బాగా చేసారు, అందుకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. బాప్ దాదా విని, సంతోషంగా ఉండటం చూసి సంతోషిస్తారు, ఎందుకంటే దుఃఖీ ఆత్మల దుఃఖాన్ని చూసి దయ కలుగుతుంది. ఎంతైనా పిల్లలే కదా,  సొంతవారైనా, పరాయివారైనా కానీ అందరూ పిల్లలే కదా అందుకే ప్లాను తయారు చేస్తూ వెళ్ళండి. అఛ్ఛా!

           అచ్ఛా, ఈ రోజు 12గంటల వరకు జరగాలి కదా. మీరందరూ 12 గురించి ఎదురు చూస్తున్నారు. తండ్రితో ప్లిలలు కలవడం, జరుపుకోవడం ఎంత బాగుంది! అచ్ఛా.

           *మొదటిసారి వచ్చినవారు* లేచి నిల్చోండి. మొదటిసారి వచ్చినవారికి తమ జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు ఎలా అయితే మొదటిసారి వచ్చారో అలాగే మొదటి నంబరును తీసుకోండి. లాస్టులో వచ్చినా కానీ ఇప్పుడు లేట్ అన్న  బోర్డు పడ్డది, టూ లేట్ ఇంకా రాలేదు. బాప్ దాదా ప్రతిజ్ఞ ఏమిటంటే- ఎవరైనా లాస్ట్ ఈజ్ ఫాస్ట్ మరియు ఫాస్ట్ ఈజ్ ఫస్ట్ గా అవ్వవచ్చు (చివరిలో వచ్చినా వేగంగా ముందుకు వెళ్ళవచ్చు, వేగంగా వెళ్ళేవారు మొదటిలోకి రావచ్చు.  మేము ఆలస్యంగా వచ్చాము అని అనుకోకండి. ఇప్పుడైనా డబుల్ తీవ్ర పురుషార్థులు లక్ష్యమును, లక్షణాలను సమానంగా చేసుకుంటే చేరుకోగలరు. లక్ష్యము ఉన్నతంగా మరియు లక్షణములు తక్కువగా ఉంటే ఫస్టులోకి  వెళ్ళలేరు. కానీ లక్ష్యము మరియు లక్షణమును సమానంగా చేసుకుని నడిస్తే మీరు లాస్ట్ మరియు ఫస్టు ఉదాహరణగా అవుతారు. కావున పురుషార్థమునకు లక్ష్యాన్ని పెట్టుకోండి. తర్వాత టూ లేట్ బోర్డు పడిపోతే ఫస్ట్ నంబరులోకి  రాలేరు. ధైర్యాన్ని ఉంచి ఉల్లాస ఉత్సాహాలతో సమ్ముఖానికి చేరుకున్నందుకు బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు కూడా, ఎక్కడ ఉన్నాకానీ సదా మర్యాదలను(నియమాలను) పాటిస్తూ ముందుకు వెళుతూ ఉండండి మరియు  బాబా హృదయానికి సమీపంగా ఉండండి, అప్పుడు అతి కొద్ది సమయంలోనే అనుభవం చెయ్యగలరు. ఇప్పుడు బంగారు అవకాశము, ఎవ్వరైనా చెయ్యవచ్చు. భారతదేశంలో కావచ్చు, విదేశాలలో కావచ్చు. మరి అర్థమయిందా,  డబుల్, ట్రిపుల్ పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. సదా బాబాతో పాటు కంబైన్డ్ గా ఉండాలి. ఏ కష్టము వచ్చినా, భారము వచ్చినా బాబాకు ఇవ్వడమైతే వచ్చు కదా, అప్పుడు నిశ్చింత చక్రవర్తిగా అయి ఎగురుతూ ఉంటారు.  మనసులో భారాన్ని పెట్టుకోకండి. కొంతమంది పిల్లలు, నెల అయిపోయింది, 15 రోజులు అయిపోయాయి ఇది నడుస్తూనే ఉంటుంది అని అంటారు. ఆ 15 రోజులలోనే ఒక వేళ మీ మృత్యువు వచ్చేస్తే?  అందుకే అదే సమయంలోనే  భారాన్ని బాబాకు ఇచ్చేయండి. ఇవ్వడం వచ్చా? ఇవ్వడం తప్పకుండా నేర్చుకోండి. తీసుకోవడం వచ్చు, కానీ ఇవ్వడం కూడా నేర్చుకోండి. మరి ఏమి చేస్తారు? ఇవ్వడం నేర్చుకున్నారా? బాప్ దాదా వచ్చిందే ఎందుకు? పిల్లల  భారాన్ని తీసుకోవడానికి. ఇంతటి ధైర్యాన్ని ఉంచేవారు ఎవరో చేతులెత్తండి. శరీరపు చేతిని ఎత్తుతున్నారా లేక మనస్సు రూపీ చేతిని ఎత్తుతున్నారా? మనసా చేతిని ఎత్తండి. అచ్ఛా! బాప్ దాదా ఇటువంటి పిల్లలకు పదమా  పదమారెట్ల అభినందనలు ఇస్తున్నారు. అచ్ఛా!

           ఈ సంవత్సరానికి హోమ్ వర్కు అయితే బాప్ దాదా ఇచ్చేసారు. ఈ సంవత్సరాన్ని ఈ విధితో జరుపుకోండి. బాప్ దాదా ఈ తారీఖు వరకు ఇచ్చిన హోమ్ వర్కును కూడా చూసారు, విన్నారు. కేవలం చేసిన సంకల్పంలో  దృఢత్వాన్ని తీసుకురండి. నిర్లక్ష్యం వద్దు, నిర్లక్ష్యపు మాటలు ఎలా ఉంటాయి అని బాప్ దాదా వినిపించి ఉన్నారు. ఒకటి- లే, లే, రెండు- తే, తే.... చెయాలిలే...... ఈ రెండు మాటలు నిర్లక్ష్యానివి. ఏ సంకల్పమైతే చేసారో, దానిని  ఇప్పుడైతే సంతకం చేసారు, కానీ దానికి ఎవ్వరూ చెరపలేని దృఢ సంకల్పము అనే ప్రభుత్వ స్టాంపు వేయండి. దృఢత్వమును ఈ జన్మలో అన్నిటికన్నా పెద్ద బహుమతిగా భావించండి. అచ్ఛా!

            సదా సఫలతకు తాళంచెవి అయిన దృఢత్వాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే ఈ తాళంచెవి మాయకు కూడా చాలా ప్రియమైనది. కావున హృదయము అనే డిబ్బీలో దీనిని భద్రంగా పెట్టుకోండి. దృఢత్వమే సఫలతకు  తాళంచెవి. సఫలత బాబా సమానంగా కావడానికి సహజ సాధనము. సదా నిశ్చయము మరియు నిశ్చితమై ఉన్న విధి. స్వరాజ్య అధికారి మరియు విశ్వ రాజ్యాధికారి ఈ రెండూ నిశ్చితమై ఉన్నాయి. ఇటువంటి నషాలో సదా  గర్వంగా ఎగురుతూ ఉండండి. ఈ రోజు ఎలా అయితే ఈ సంవత్సరమునకు వీడ్కోలు మరియు అభినందనలు తెలుపుతామో అలాగే రోజూ మీ లోపల ఉన్న బలహీనతలకు వీడ్కోలు చెప్పండి మరియు బాప్ దాదా నుండి  విశేషమైన అభినందనలు తీసుకోండి. ఈ సంగమయుగము వీడ్కోలు మరియు అభినందనల సమయము. సంగమయుగములోని ప్రతి రోజూ అభినందనలకు పాత్రులుగా అవుతూ ఉండండి. బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరూ  అతి ప్రియమైనవారు. నంబరువారీగా ఉన్నా, నంబర్ వన్‌గా లేకపోయినా కానీ వారు బాప్ దాదాకు ప్రతి కల్పము అతి గారాల పిల్లలు. కావున అతి ప్రియంగా అవ్వడము అనే మీ భాగ్యాన్ని సదా గుర్తుంచుకోండి. చిన్న విషయము- ఏ  కష్టము వచ్చినా మనస్ఫూర్తిగా నా బాబా అని ఆర్డరు చెయ్యండి, బాబా తప్పక బంధింపబడి ఉన్నారు. కానీ మనస్సులో మరేదీ పెట్టుకోవద్దు. నా బాబా అని అంటూ మనసులో బలహీనత కూడా పెట్టుకుంటే బాబా సహయోగమును  ఇవ్వరు. హృదయము స్వచ్ఛంగా ఉంటే కోరిక నెరవేరుతుంది. చెత్తతో ఉన్న హృదయంలోకి బాబా రారు. స్నేహంతో గుర్తు చెయ్యండి. కేవలం జ్ఞానం ఆధారంతో కాదు, జ్ఞానము బీజము వంటిది మరియు స్నేహము నీరు వంటిది  అని వినిపించాము కదా! కేవలం జ్ఞానంతో తెలుసుకున్నారు కానీ హృదయపూర్వక ప్రేమను అనుభవం చెయ్యలేదు. ప్రేమతో బాబాను గుర్తు చెయ్యలేకపోతే ప్రాక్టికల్ లో ఫలితాన్ని అనుభవం చెయ్యలేరు. అనుభవి స్వరూపమే  ఫలితము. నీరు లేకపోతే ఎండిన చెరుకు గెడలా అయిపోతుంది. కోర్సులు చేయించినా, భాషణ చేసి వచ్చినా మరియు కానుకలు కూడా తీసుకువచ్చినా, రోజుకు నాలుగు నాలుగు భాషణలు చేసినా కానీ హృదయపూర్వక  స్నేహము లేదు! ఎందుకంటే బాబాపై హృదయపూర్వక స్నేహానికి గుర్తు- బ్రాహ్మణ పరివారంలోని ప్రతి ఒక్కరిపై స్నేహము. స్నేహము లేకపోతే మాయ విఘ్నాలు చాలా వస్తాయి. ఎందుకంటే నీరే పొయ్యకపోతే ఫలము ఎలా  వస్తుంది! జ్ఞానమైతే అర్థమైంది, బాబాతో సర్వ సంబంధాలు కూడా ఉన్నాయి, కానీ అనుభవం జరగడం లేదు అని కొంతమంది పిల్లలంటారు. అనుభవము ఫలము, ఎండిపోయిన జ్ఞానిగా కావద్దు. స్నేహిగా అవ్వండి, బాబాకు  స్నేహిగా ఉన్నవారు పరివారానికి కూడా స్నేహిగా స్వతహాగా అవుతారు ఎందుకంటే బాబా సమానముగా ఉంటారు కదా. బాబాకు లాస్ట్ సంతానముపై కూడా ప్రేమ ఉంది. ప్రతి ఒక్కరినీ స్నేహ వృత్తితో చూస్తారు. కావున కేవలం  జ్ఞానిగా మాత్రమే కావద్దు, భాషణ ఇచ్చేవారిగా కావద్దు, అనూభూతి స్వరూపులుగా కండి. బాబాతో హృదయపూర్వకమైన ప్రేమ ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. లేక ఎప్పుడు అవసరముంటుందో అప్పుడు మాత్రమే స్నేహము  వస్తుందా! అటువంటివారు జ్ఞానీ భక్తులు. మరి ఈ సంవత్సరం ఏమి చేస్తారు? స్నేహ వాతావరణము- ఎవ్వరిని చూసినా, బలహీనమైనవారైనా కానీ వారు కూడా పురుషార్థులే కదా, పరివారంవారే కదా, పడిపోయిన వారిని  పడవేయకండి, ఉల్లాస ఉత్సాహాలను పెంచండి, స్నేహ వాతావరణాన్ని తయారు చెయ్యండి, అచ్ఛా!

           ప్రియస్మృతులైతే నలువైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా ఇచ్చేసారు. నలువైపుల ఉన్న పిల్లలు ఇప్పుడు బాప్ దాదా ఇచ్చిన హోమ్ వర్కును ప్రాక్టికల్ లో చేసి ప్రమాణమును ఇచ్చే సుపుత్రులుగా అయి తమ ప్రభావాన్ని  చూపిస్తారు. నలువైపుల ఉన్న పిల్లలు చాలా చాలా హృదయపూర్వక ప్రేమను మరియు హృదయపూర్వకమైన కోటానురెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యులైన, శ్రేష్ఠ పిల్లలకు బాప్ దాదాల నమస్తే.

           *దాదీలతో:* ఎంతో ప్రేమ కూడా ఉంది మరియు ఆశలు కూడా ఉన్నాయి. ఏది కావాలంటే అది చెయ్యగలరు. మీ అందరి దాదీ నిమిత్తమయ్యారు కదా! ఎవరు చెప్పినా చెప్పకపోయినా పాలనకు నిమిత్తమయ్యారు కాబట్టి  ఆటోమేటిక్ గా గుర్తుకు వస్తారు. బాప్ దాదా విషయమైతే వదిలిపెట్టండి, దాదీ  అయితే మీవలె ఉండేవారు కదా. కానీ చేసి చూపించారు. బ్రహ్మాబాబా అవ్యక్తమయిన సమయంలో దాదీ  అన్నింటికన్నా పెద్ద పరీక్షను ఎదుర్కొన్నారు.  అటువంటి వాతావరణం అకస్మాత్తుగా రావడము, అంతటి ధైర్యమును ఉంచడము మరియు అందరినీ సహయోగులుగా చేయడము, ఇదైతే అద్భుతమే కదా. అందరూ ఆ సమయంలో తోడు నిలిచారు, కానీ నిమిత్తమైతే దాదీ  అయ్యారు కదా. దాదీ విశేషత ఏమిటి? స్వచ్ఛమైన హృదయముతో కోరిక నెరవేర్చారు! ఎవరి విషయమునూ మనస్సులో పెట్టుకోలేదు. నిర్లక్ష్యంగా ఉన్నవారిని చూస్తూ, వారికి ఉల్లాసాన్ని ఇచ్చేవారు. నిర్లక్ష్యంగా ఉన్నారు  వదిలేద్దాము అని అనుకోలేదు, ధైర్యాన్ని ఇచ్చారు. అందుకే అందరి మనసుల నుండి మా దాదీ అని వెలువడుతుంది. మా దాదీ అని అందరూ మనస్ఫూర్తిగా అంటారు కదా. అందుకే మీరు గ్రూపు తయారు చెయ్యండి, బాబా  సమానంగా అవ్వాలన్న లక్ష్యమునైతే పెట్టుకున్నారు, కానీ కనీసం దాదీ సమానమైన అనుభూతినైతే ఇవ్వాలి. ఇటువంటి గ్రూపు కావాలి, ఒకరు కాదు. ఒకరికొకరు తోడుగా నిలిచి ఇటువంటి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించండి,  అప్పుడు బాప్ దాదా ఆ గ్రూపుకు విశేషమైన బహుమతిని ఇస్తారు. ఏమి ఇస్తారో చెప్పరు, కానీ ఇస్తారు. తీసుకోవలసిందే. ఇటువంటి ఆత్మిక సంభాషణను చెయ్యండి. మీటింగ్ చేస్తారు, అదికూడా అవసరమే, కానీ ఇటువంటి ఉల్లాస  ఉత్సాహాల ఆత్మిక సంభాషణను కూడా చెయ్యండి అప్పుడే సరైనదిగా ఉంటుంది. గ్రూపు చేయవలసిందే. ఎలా అయితే ఈ 6-7మంది సమయాన్ని కేటాయించి అంతర్ముఖులుగా అయ్యారు కదా (అక్కయ్యలు భట్టి చేసారు),  సమయము లభించింది కదా, ప్రాక్టికల్ గా చేసి చూపించారు. మరి ఏది వీలవ్వదు! దాని ప్రభావము కూడా ఉంది, ప్రాక్టికల్ గా ప్రమాణము కూడా ఉంది. ఇది అవసరము. మీరైతే(దాదీ జానకితో) ఆత్మిక సంభాషణ చేయడంలో  చురుకైనవారు. ఇతరులకు సహయోగిగా అయితే ఉండనే ఉన్నారు, అంటే ఏదైనా నవీనతను చూపించండి, ఎలా నడుస్తుందో అలాగే నడవనివ్వకండి అనకండి. దీని ద్వారా సమయము సమీపంగా వస్తుంది. ఇప్పుడు చూడండి  భయంతో కూడా మొర పెట్టుకుంటున్నారు, పొడిగిస్తున్నారు, ఏది కావాలంటే అది చేసుకోనివ్వండి అని కాదు, ఏదో ఒక కారణంతో చల్లబడిపోతుంది. అందుకే ఇది చెయ్యాలి, ఈ సంవత్సరం ప్రారంభమయితే ప్లాను తయారు  చెయ్యండి.

           దాదీ జానకి బాప్ దాదాకు అంకుల్, ఆంటీల స్మృతిని అందించారు :- బాదాదా ఈ రోజు వి.ఐ.పిగా ఉండాలి, మైకుగా ఉండాలి మరియు వారసులుగా ఉండాలి అని చెప్పినట్లుగా- ఇందుకు ప్రాక్టికల్ లో వీరు నిమిత్తమయ్యారు  మరియు పరివారానికి కూడా కళ్యాణం చేసారు. రత్నాలను కూడా అలాగే వెలికితీసారు.

           పెద్ద అన్నయ్యలతో- ఒక్క బ్రహ్మాబాబా అద్భుతం చేసి చూపించారు కదా, మరి మీరు ఎంతమంది ఉన్నారు! అయిపోతుంది, అయి ఉంది, కేవలం నిమిత్తం చేస్తున్నారు. నిమిత్తమైన వారికే విశేషమైన ప్రాప్తి లభిస్తుంది.  సాధారణంగా అయితే అందరికీ లభిస్తుంది, కానీ ఎవరైతే నిమిత్తమవుతారో వారికి విశేషమైన ప్రాప్తి ఉంటుంది. మరి వీరికి(దాదీలకు) పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోమని చెప్పాము. మీటింగ్ చేసుకోండి, కానీ ఆత్మిక సంభాషణ  కూడా చెయ్యండి. సమయము కేటాయించవలసి ఉంటుంది, అదైతే జరుగుతూనే ఉంటుంది, మీ టైమును సెట్ చేసుకోవలసి ఉంటుంది.

          *2008కి వీడ్కోలు, 2009కి అభినందనలు - రాత్రి 12 గంటల తర్వాత బాప్ దాదా పిల్లలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు :-*

           అందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. ఈ సంవత్సరంలోని ప్రతి రోజును స్వ పరివర్తన మరియు విశ్వ పరివర్తన రూపంలో జరుపుకుంటూ ఉండండి. ప్రతి రోజు క్రొత్త పరివర్తన, ప్రతి రోజు క్రొత్త సేవ, ప్రతి రోజూ సదా  ఉల్లాస ఉత్సాహాలు. ఒక్క రోజు కూడా చింత, చింతనతో ఉండకూడదు. ఎల్లప్పుడూ ఉల్లాస ఉత్సాహాలతో రాత్రింబగళ్లు గడపండి. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రతి రోజూ ఏదో ఒక క్రొత్త దానిని స్వయం పట్ల, లేక విశ్వము పట్ల, సేవ పట్ల  చేయవలసిందే. ఈ దృఢ సంకల్పం చేసి సమయాన్ని సమీపానికి తీసుకువస్తూ సంపూర్ణముగా బాబా సమానంగా అయి ఎగరాలి మరియు ఎగిరించాలి. గుడ్ నైట్, అచ్ఛా!

Comments