30-11-2008 అవ్యక్త మురళి

  * 30-11-2008         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “ఫుల్ స్టాప్ పెట్టి, సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి, మనసా శక్తిని ఇవ్వడం ద్వారా సుఖశాంతుల అంచలిని ఇచ్చే సేవ చేయండి."

           ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న మహాన్ ఆత్మలను చూస్తున్నారు. ఏ మహానతను చేశారు. ప్రపంచం దేనినైతే అసంభవం అని అంటుందో దానిని సహజంగా సంభవం చేసి చూపించారు, అది పవిత్రతా వ్రతము. మీరందరూ పవిత్రతా వ్రతమును ధారణ చేశారు కదా! బాప్ దాదా ద్వారా పరివర్తన అవుతామనే దృఢసంకల్పమును చేపట్టారు. వ్రతము చేపట్టడము అనగా వృత్తి ద్వారా పరివర్తన చేయడము. ఏ వృత్తిని పరివర్తన చేశారు? ఈ వృత్తి పరివర్తన ద్వారా, మేమంతా సోదరులము అన్న సంకల్పము చేశారు. ఎన్ని విషయాలలో, భక్తిలో కూడా వ్రతమును చేపడతారు! కాని, మీరందరూ బాబాతో దృఢ సంకల్పం చేశారు ఎందుకంటే బ్రాహ్మణ జీవితపు పునాది పవిత్రత మరియు పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ మరియు సర్వ పరమాత్మ ప్రాప్తులు లభిస్తున్నాయి. మహాత్ములు దేనినైతే కఠినంగా భావిస్తారో, అసంభవంగా భావిస్తారో ఆ పవిత్రతను మీరు స్వధర్మంగా భావిస్తారు. కొంతమంది మంచి మంచి పిల్లలు సంకల్పం చేసి దృఢ సంకల్పము ద్వారా ప్రత్యక్షంగా పరివర్తన చేసి చూపించడం బాప్ దాదా చూస్తున్నారు. నలువైపులా ఉన్న ఇటువంటి మహాన్ పిల్లలకు బాప్ దాదా హృదయపూర్వకంగా చాలా చాలా దీవెనలు ఇస్తున్నారు.

           మీరందరూ కూడా మనసా, వాచా, కర్మణా మీ వృత్తి, దృష్టి ద్వారా పవిత్రతను అనుభవం చేసుకుంటున్నారు కదా! పవిత్రతతో కూడిన వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభకామన. దృష్టి అనగా ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడడం. స్వయమును కూడా సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేసుకోవడం. బ్రాహ్మణ జీవితపు మహత్వము మనసా, వాచా, కర్మణలలో పవిత్రత. పవిత్రత లేకపోతే బ్రాహ్మణ జీవితపు గాయనము లేదు. సదా పవిత్రతా శక్తితో స్వయమూ స్వయమునకు దీవెనలు ఇచ్చుకుంటారు. ఏ దీవెనలు ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయమును కూడా సంతోషంగా అనుభవం చేసుకుంటారు మరియు ఇతరులకు కూడా సంతోషషమును ఇస్తారు. పవిత్ర ఆత్మకు మూడు విశేష వరదానాలు లభిస్తాయి. ఒకటి స్వయం స్వయమునకు వరదానమును ఇస్తారు, తద్వారా సహజంగా బాబాకు ప్రియమైనవారిగా అయిపోతారు. రెండవది వరదాత అయిన బాబాకు అతి సమీమైన మరియు ప్రియమైన పిల్లలుగా అయిపోతారు. కావున బాబా దీవెనలు స్వతహాగా ప్రాప్తిస్తాయి మరియు సదా ప్రాప్తిస్తాయి. మూడవది బ్రాహ్మణ పరివారంలో విశేషంగా ఎవరైతే నిమిత్తులయ్యారో వారి ద్వారా కూడా దీవెనలు లభిస్తూ ఉంటాయి. ఈ మూడు దీవెనల ద్వారా సదా ఎగురుతూ ఉంటారు మరియు అందరినీ ఎగిరేలా చేస్తూ ఉంటారు. కావున మీరందరూ పవిత్రతా బలము మరియు పవిత్రతా ఫలములను సదా అనుభవం చేసుకుంటున్నామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పరిశీలించుకోండి. సదా ఆత్మిక నషా, హృదయంలో నషా ఉంటున్నాయా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు అమృతవేళ మిలనము జరిపేటప్పుడు ఆత్మిక సంభాషణలో ఏమంటారో తెలుసా? పవత్రత ద్వారా అతీంద్రియ సుఖపు ఫలమేదైతే లభిస్తుందో అది సదా ఉండడం లేదు అని అంటారు. కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు! ఎందుకంటే అతీంద్రియ సుఖము పవిత్రత యొక్క ఫలమే. కావున నేను ఎవరిని? అతీంద్రియ సుఖపు అనుభూతిలో సదా ఉంటున్నానా లేక అప్పుడప్పుడు ఉంటున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అందరూ మిమ్మల్ని మీరు ఏమని పిలిపించుకుంటారు? అందరూ మీ పేరును వ్రాసేటప్పుడు ఏమని వ్రాస్తారు? బి.కె.ఫలానా అని వ్రాస్తారు కదా! మరియు స్వయమును మాస్టర్ సర్వశక్తివంతులుగా పిలుచుకుంటారు. అందరూ అలా ఉన్నారు కదా! మాస్టర్ సర్వశక్తివంతులేనా? ఎవరైతే మేము సదా మాస్టర్ సర్వశక్తివంతులము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కాదు. సదా, చూడండి, ఆలోచించండి, అలా సదా ఉన్నారా? డబుల్ విదేశీయులు చేతులెత్తడం లేదు, కొంతమంది ఎత్తుతున్నారు. టీచర్లు చేతులెత్తండి, సదా అలా ఉన్నారా? ఏదో అలా ఎత్తేయకండి, ఎవరైతే సదా ఉన్నారో అలా సదా ఉన్నవారు మాత్రమే ఎత్తండి. చాలా కొద్ది మంది ఉన్నారు. పాండవులు ఎత్తండి. వెనుక ఉన్నవారు ఎత్తండి, చాలా కొద్ది మందే ఉన్నారు. మొత్తం సభ అంతా చేతులేత్తడం లేదు! అచ్ఛా! మరి మీరు మాస్టర్ సర్వశక్తివంతులైనప్పుడు ఆ సమయంలో శక్తులు ఏమవుతున్నాయి? మీరు మాస్టర్ లు, మాస్టర్ అంటే తండ్రి కన్నా ఉన్నతంగా ఉంటారు అని అర్థము. మరి పరిశీలించుకోండి - తప్పక పవిత్రతా  పునాదిలో కొంత బలహీనంగా ఉన్నారు. ఏ బలహీనత? మనసులో అనగా సంకల్పాలలో బలహీనత ఉందా, మాటలలో బలహీనత ఉందా, కర్మలలో బలహీనత ఉందా లేక స్వప్నాలలో బలహీనత ఉందా? ఎందుకంటే పవిత్ర ఆత్మల మనసా-వాచ-కర్మణలు, సంబంధ-సంపర్కాలు, స్వప్నాలు స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి. వృత్తిని మార్చుకోవాలి అని వ్రతాన్ని తీసుకున్నప్పుడు మరి అప్పుడప్పుడూ ఎందుకు? సమయాన్ని  చూస్తున్నారు, సమయపు పిలుపు, భక్తుల పిలుపు, ఆత్మల పిలుపు వింటున్నారు మరియు అకస్మాత్తుగా అనే పాఠమైతే అందరికీ పక్కాగానే ఉంది. మరి పునాదిలో బలహీనత అనగా పవిత్రతలో బలహీనత ఉంది. ఒకవేళ మాటలలో కూడా శుభ భావన, శుభ కామన లేనట్లయితే, పవిత్రతకు విపరీతంగా ఉన్నట్లయితే,  అప్పుడు సంపూర్ణ పవిత్రతలోని సుఖమును, అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకోలేరు. ఎందుకంటే అసంభవాన్ని సంభవం చెయ్యడమే బ్రాహ్మణ జీవితపు లక్ష్యము. అందులో అంత, ఇంత అన్న మాటలు ఉండవు. ఎంత కావాలో అంత లేదు. కావున రేపు అమృతవేళ విశేషంగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని, ఇతరుల  గురించి ఆలోచించకండి, ఇతరులను చూడకండి, ఎంత శాతంలో పవిత్రతా వ్రతాన్ని పాటిస్తున్నాను?  అని స్వయాన్ని పరిశీలించుకోండి. నాలుగు విషయాలను పరిశీలించుకోండి. ఒకటి వృత్తి, రెండవది - సంబంధ సంపర్కాలలో శుభభావన, శుభకామన. వీరు ఉన్నదే అలా అని భావించకండి. ఆ ఆత్మ పట్ల  కూడా శుభభావనను ఉంచండి. మీరందరూ మిమ్మల్ని మీరు విశ్వపరివర్తకులుగా భావిస్తారు... అందరూ  అలా ఉన్నారా? మేము విశ్వపరివర్తకులము అని మిమ్మల్ని గూర్చి మీరు భావిస్తున్నారా? చేతులెత్తండి. ఇందులో చేతులెత్తుతున్నారు. ఇందులో చాలా బాగా చేతులెత్తారు, ఇందుకు అభినందనలు. కాని బాప్ దాదా మిమ్మల్నందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నారు, అడగమంటారా? మీరు విశ్వపరివర్తకులైనప్పుడు  విశ్వపరివర్తనలో ఈ ప్రకృతి, పంచతత్వాలు కూడా వచ్చేస్తాయి కదా! వాటిని పరివర్తన చేయగలిగినప్పుడు  మరి స్వయమును లేక సహచరులను, పరివారమును పరివర్తన చేయలేరా? విశ్వపరివర్తకులు అనగా  ఆత్మలను, ప్రకృతిని అందరినీ పరివర్తన చేయడము. కావున మీ ప్రతిజ్ఞను గుర్తు చేసుకోండి. అందరూ  బాబాతో అనేకసార్లు ప్రతిజ్ఞ చేశారు. కాని, సమయం చాలా త్వరగా ముందుకు వస్తోందని, అందరి  పిలుపులు ఎంతగానో పెరుగుతున్నాయని బాప్ దాదా గమనిస్తున్నారు. మరి ఆ పిలుపును వినేవారు మరియు పరివర్తన చేసే ఉపకారీ ఆత్మలు ఎవరు? వారు మీరే కదా!

           పర ఉపకారులు లేక విశ్వ ఉపకారులుగా అయ్యేందుకు మూడు విషయాలను అంతం  చేయాలని బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. అవేంటో మీకు తెలుసు కదా! తెలుసుకోవడంలో చురుకుగా ఉన్నారు. తెలుసుకోవడంలో అందరూ చురుకుగా ఉన్నారని బాప్ దాదాకు తెలుసు. అందులోని మొదటి పదము - పరచింతన, రెండవది - పరదర్శన మరియు మూడవది  పరమతము. ఈ మూడు పర అన్న పదాలను సమాప్తము చేసినట్లయితే పర ఉపకారులుగా అవుతారు విఘ్నరూపంగా అయ్యేవి ఈ మూడు పదాలే. ఇవి గుర్తున్నాయి కదా! ఇవి కొత్త విషయాలేమీ కావు. కావున రేపు అమృతవేళ పరిశీలించుకోండి. అప్పుడు బాప్ దాదా కూడా తిరుగుతారు, ఏం చేస్తున్నారో చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా, పిలుపుల అనుసారంగా ప్రతి ఒక్క దు:ఖిత ఆత్మకు మనసా  శక్తి ద్వారా సుఖశాంతుల అంచలిని ఇవ్వడం అవసరము. దానికి కారణం ఏమిటి? బాప్ దాదా అప్పుడప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అని అకస్మాత్తుగా చూస్తారు. ఎందుకంటే పిల్లలపై ప్రేమ ఉంది కదా! అలాగే పిల్లలతో కలిసి వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళరు, మీ తోడుగా వస్తారు కదా! వస్తారా? తోడుగా వస్తారా?  ఈ ముందు ఉన్నవారు చేతులెత్తడం లేదు, మరి మీరు వెళ్ళరా? కలిసివెళ్ళాలి కదా! పిల్లల కారణంగా బాప్ దాదా కూడా, అడ్వాన్స్ పార్టీవారు కూడా, మీ దాదీలు, మీ విశేష పాండవులు కూడా మీ అందరి కోసం  ఎదురుచూస్తున్నారు. వారు కూడా మేమందరము కలిసే వెళతాము అని మనసులో పక్కా ప్రతిజ్ఞ చేసుకున్నారు. కొద్దిమంది కాదు, అందరూ కలిసి వెళతాము. కావున రేపు అమృతవేళ, ఏ విషయంలో లోపం ఉంది అని అందరూ పరిశీలించుకోండి. మనస్సులోనా లేక వాణిలోనా లేక కర్మణాలోకి రావడంలోనా అని పరిశీలించుకోండి. బాప్ దాదా ఒకసారి అన్ని సెంటర్లను చుట్టి వచ్చారు. అప్పుడు ఏమి చూశారో చెప్పనా? లోపం ఏ విషయంలో ఉంది? ఒక్క క్షణంలో పరివర్తన చేసి ఫుల్ స్టాప్ పెట్టడంలో లోపం ఉంది అన్నదే కనిపించింది. ఫుల్ స్టాప్ పెట్టేలోపే ఏమేమి జరిగిపోతాయో తెలియదు! చివరి సమయంలో, చివరి ఒక్క ఘడియ మాత్రమే ఉంటుందని, ఆ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుందని బాప్ దాదా వినిపించారు. కాని, వారు గమనించింది ఏమిటి? ఫుల్ స్టాప్ పెట్టాలి కాని అందుకు బదులుగా కామా(,) పెట్టేస్తారు. ఇలా ఎందుకు జరుగుతోంది, ఇది జరుగుతోందేమిటి!... అంటూ ఇతరుల విషయాలను స్మృతి చేస్తారు. ఇందులో ఆశ్చర్యార్థకపు గుర్తు పడుతుంది. కావున ఫుల్ స్టాప్ పెట్టకుండా కామా, ఆశ్చర్యార్థకం మరియు ఎందుకు అన్న ప్రశ్నల క్యూ ఏర్పడుతుంది. కావున దీనిని పరిశీలించండి. ఫుల్ స్టాప్ పెట్టే అలవాటు లేకపోతే అంతమతిని బట్టి గతి శ్రేష్ఠంగా ఉండదు, ఉన్నతంగా ఉండదు. కావున బాప్ దాదా విశేషంగా రేపు అమృతవేళ పరిశీలించుకోండి మరియు పరివర్తన చేసుకోండి అని హోంవర్క్ ఇస్తున్నారు. ఒక వారం రోజులు క్షణంలో ఫుల్ స్టాప్ దిద్దడం పదే పదే అభ్యాసం చేయండి మరియు జనవరి మాసంలో అందరికీ బాబా సమానంగా అవ్వాలనే ఉత్సాహము కలుగుతుంది, కావున జనవరి 18 నాటికి ఎటువంటి రిజల్టు ఏర్పడింది, ఫుల్ స్టాప్ పెట్టారా లేక ఇతర గుర్తులు దిద్దబడ్డాయా అన్నది అందరూ చీటీ వ్రాసి జనవరి 18న బాక్స్ లో వేయండి. మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? చేతులూపండి, ఎందుకంటే బాప్ దాదాకు పిల్లలపై ఎంతో ప్రేమ ఉంది, వారు ఒంటరిగా వెళ్ళాలనుకోవడం లేదు, మరి ఏం చేస్తారు? ఇప్పుడు త్వరగా తీవ్ర పురుషార్థం చేయండి. ఇప్పుడు ఢీలాడాలా పురుషార్థము సఫలతను ప్రాప్తింపజేయదు. పవిత్రతను పర్సనాలిటీ, రియాలిటీ మరియు రాయల్టీ అని అంటారు. కావున మీ ఈ రాయల్టీని స్మృతి చేయండి. అనాది రూపంలో ఆత్మలైన మీరు బాబాతో కలిసి మన దేశంలో విశేష ఆత్మలుగా ఉన్నారు. ఏ విధంగా ఆకాశంలో విశేష సితారలు ప్రకాశిస్తున్నాయో అలా మీరు అనాది రూపములో విశేష సితారలుగా ప్రకాశిస్తారు. కావున మీ అనాది కాలపు రాయల్టీని స్మృతి చేసుకోండి. మళ్ళీ సత్యయుగంలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు దేవతారూపపు రాయల్టీని స్మృతి చేయండి. అందరి శిరస్సుపై రాయల్టీ యొక్క ప్రకాశ కిరీటము ఉంది. అనాది మరియు ఆది కాలపు రాయల్టీ ఎంతగా ఉంది! మళ్ళీ ద్వాపరయుగంలోకి వస్తే మీ చిత్రాలకు ఉన్నంత రాయల్టీ ఇంకెవ్వరికీ ఉండజాలదు. నేతల, అభినేతల, ధర్మాత్మల చిత్రాలు కూడా ఎన్నో తయారవుతాయి, కాని మీ చిత్రాల పూజ మరియు మీ చిత్రాల విశేషత ఎంత హుందాగా ఉంటుంది! చిత్రాలను చూసే అందరూ ఎంతో సంతోషిస్తారు. చిత్రాల ద్వారా కూడా ఎన్నో దీవెనలు తీసుకుంటారు. కావున ఈ రాయల్టీ అంతా పవిత్రతకు చెందినదే. పవిత్రత బ్రాహ్మణజీవితపు జన్మసిద్ధ అధికారము. పవిత్రతలో లోపము సమాప్తమైపోవాలి. ఆ సమయంలో వైరాగ్యం వస్తే అది అయిపోతుందిలే అని భావించడం కాదు. ఎన్నో మంచి మంచి మాటలు వినిపిస్తారు. బాబా, మీరు చింతించకండి, అయిపోతుందిలెండి అని అంటారు. కాని బాప్ దాదా ఈ జనవరి మాసంలో విశేషంగా పవిత్రతా విషయంలో ప్రతి ఒక్కరినీ సంపన్నం చేయాలనుకుంటున్నారు. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, వ్యర్థమైన సంకల్పాలు కూడా అపవిత్రతయే. వ్యర్థమైన మాటలు, మాటల వ్యర్థరూపమైన క్రోధపు అంశరూపమగు ఆవేశము.... అవీ అపవిత్రతయే. ఎటువంటి సంస్కారాన్ని తయారుచేసుకోవాలంటే దూరం నుండే మిమ్మల్ని చూసి వారు పవిత్రతా వైబ్రేషన్లను తీసుకోవాలి. ఎందుకంటే మీ వంటి పవిత్రతను, రిజల్టులో ఆత్మ కూడా పవిత్రంగా, శరీరం కూడా పవిత్రంగా అయి డబుల్ పవిత్రతను పొందుతారు. కొత్తగా ఏ పిల్లలు వచ్చినా వారికి మొట్టమొదట బాబా నుండి ఏ వరదానము లభిస్తుంది, గుర్తుందా? పవిత్రభవ, యోగీభవ. కావున ఈ రెండు విషయాలు ఒకటి పవిత్రత మరియు రెండవది ఫుల్ స్టాప్, యోగి. ఇవి ఇష్టమేనా? బాప్ దాదా అమృతవేళ చుట్టూ తిరుగుతారు, సెంటర్లను కూడా సందర్శిస్తారు. బాప్ దాదా ఒక్క క్షణంలో నలువైపులా తిరిగి రాగలరు. కావున ఈ జనవరి అవ్యక్త మాసంలో ఏదైనా కొత్త ప్లానును తయారుచేయండి. మనసా సేవ, మనసా స్థితి మరియు అవ్యక్త కర్మలు మరియు అవ్యక్తమైన మాటలు, వీటిని పెంచండి. కావున జనవరి 18న బాప్ దాదా అందరి రిజల్టును చూస్తారు. మీకు ప్రేమ ఉంది కదా! జనవరి 18న అమృతవేళ నుండి ప్రేమతో కూడిన మాటలే మాట్లాడతారు. బాబా ఎందుకు అవ్యక్తమయ్యారు? అని అందరూ ఫిర్యాదు చేస్తారు. సాకారంలో ఉంటూ బాబా సమానంగా ఎప్పటికి అవుతారు అని బాబా కూడా ఫిర్యాదు చేస్తున్నారు.

           కావున ఈ రోజున కొద్దిగా విశేషంగా అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు. ప్రేమ కూడా ఇస్తున్నారు, కేవలం అటెన్షన్ ను మాత్రమే ఉంచమనడం లేదు, ప్రేమ కూడా ఉంది. నా పిల్లలు ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అన్నదే బాబా కోరుకుంటున్నారు. ప్రతి కర్మ యొక్క శ్రీమతమును పరిశీలించండి. అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మ యొక్క శ్రీమతమేదైతే లభించిందో దానిని పరిశీలించండి. దృఢంగా ఉన్నారు కదా! కలిసి వెళ్ళాలి కదా! కలిసి వెళ్ళాలా? చేతులెత్తండి. కలిసి వెళ్ళాలా? అచ్ఛా! టీచర్లు అచ్ఛా! వెనుక ఉన్నవారు చేతులెత్తండి, కుర్చీలో కూర్చున్నవారు చేతులెత్తండి. పాండవులు చేతులెత్తండి. కావున సమానంగా అయినప్పుడే చేతిలో చేయివేసి వెళతారు కదా! చేయవలసిందే, అలా అవ్వవలసిందే అన్న దృఢ సంకల్పం చేయండి. 15-20 రోజులు ఈ దృఢత్వం ఉంటుంది, ఆ తరువాత మెల్లమెల్లగా నిర్లక్ష్యం వచ్చేస్తుంది. కావున నిర్లక్ష్యమును సమాప్తం చేయండి. ఎక్కువలో ఎక్కువ ఒక్క నెల పూర్తి ఉత్సాహము ఉంటుంది, దృఢత్వము ఉంటుంది, ఆ తరువాత ఒక నెల తరువాత కొద్ది కొద్దిగా నిర్లక్ష్యము ప్రారంభమవుతుంది. కావున ఇప్పుడు ఈ సంవత్సరం సమాప్తమైనప్పుడు ఏం సమాప్తం చేస్తారు? సంవత్సరమును సమాప్తం చేస్తారా లేక సంకల్పంలో, ధారణలో ఏ బలహీనతలైతే ఉన్నాయో వాటిని సమాప్తం చేస్తారా? చేస్తారు కదా! చేతులు ఎత్తడం లేదు! కావున ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అన్న రికార్డు దానంతట అదే హృదయంలో మ్రోగాలి. కేవలం వెళ్ళడం కాదు, రాజ్యంలోకి కూడా రావాలి. అచ్ఛా! బాప్ దాదాలను కలిసేందుకు ఎవరైతే మొట్టమొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి.

           మొదటిసారి వచ్చినవారికి విశేషంగా అభినందనలు తెలుపుతున్నారు. లేట్ గా (ఆలస్యంగా) వచ్చారు కాని టూ లేట్ గా(అతి ఆలస్యంగా) రాలేదు. కాని, తీవ్ర పురుషార్థపు వరదానమును సదా గుర్తుంచుకోండి. తీవ్ర పురుషార్థము చేయవలసిందే. చేస్తాములే, చేస్తాములే.... అలా లే, లే అని అనకండి. చేయవలసిందే. చివరిలో వచ్చినా ఫాస్ట్ గా రావాలి మరియు ఫస్ట్ గా రావాలి. అచ్ఛా! ఇప్పుడేం చేయాలి?

           సేవా టర్న్ పంజాబ్ జోన్ వారిది. (పంజాబ్, హర్యాన, హిమాచల్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాంచల్ ) బాగుంది. ఈ అవకాశమేదైతే లభిస్తుందో అది మంచిగా అనిపిస్తోందా? ఇది స్పెషల్ అవకాశము. ఏ  విధంగా స్థూలమైన నదులు పావనంగా చేస్తాయి అని అంటారో పంజాబ్ లోని పతిత పావనులైన పిల్లలు పంజాబ్ వారిని పావన ఆత్మలుగా చేయడంలో మొదటి నెంబరువారిగా అవుతారు కదా! చూడండి పంజాబ్ కు ఒక విషయంలో విశేషత ఉంది. మొట్టమొదట ఆదిలో ఏ భాషణ అయితే చేశారో దానిని మహాత్మల ఆహ్వానంపై చేశారు అది మీకు గుర్తుంది కదా! (జానకీదాదీకి గుర్తుంది). స్టేజ్ పై భాషణ  చేసేందుకు మహాత్ముల నుండి ఆహ్వానము లభించడమనేది ప్రారంభంలో ఇంకెక్కడా జరుగలేదు. పంజాబ్ షేర్ (పులి) అని అంటారు. మరి పులి లాంటి పనినైతే చేశారు కదా! సాధుసన్యాసులందరి మధ్య గర్జన చేశారు. మరి పంజాబ్ పులి అయింది కదా! ఇప్పుడు కూడా తాను (అమీర్ చంద్ భాయ్) లిస్టును  ఇచ్చాడు. ప్రతి ఒక్కరి సంబంధంలో ఎంతమంది వి.ఐ.పి.లు ఉన్నారు అన్నది ప్రతి వర్గం వారు లిస్ట్ ఇవ్వమని  బాప్ దాదా ఏదైతే అడిగారో ఆ లిస్టును తాను అందించాడు. బాప్ దాదాకు ఆ లిస్ట్ అందింది, చప్పట్లు  కొట్టండి, బాగుంది. ఇప్పుడు వీరందరి లిస్టును చూడడం జరిగింది, బాగుంది. కాని, ఇప్పుడు వీరిని  కలుస్తూ ఉండండి. వి.ఐ.పి.లు వి.ఐ.పి.లుగానే ఉండిపోకూడదు. మొదటి స్టేజీవరకైతే తీసుకువచ్చారు,  ఇప్పుడిక రెండవ స్టేజీలో ప్రతి కార్యంలోను సమయ ప్రతిసమయము స్నేహులుగా, సహయోగులుగా  అవ్వాలి, ఆ తరువాత మళ్ళీ బ్రాహ్మణ పరివారమునకు సహచరులుగా అవ్వాలి. స్వయమును ఈ పరివారమునకు చెందినవారిగా భావించాలి. కొన్నిచోట్ల వి.ఐ.పి.లు కూడా ముందుకువెళ్ళారు. బాప్ దాదా వారికి అభినందనలను కూడా తెలుపుతున్నారు. కాని, ఎంత సేవ అయితే ఈ జ్ఞాన సరోవరము ప్రారంభమైన తరువాత జరిగిందో, ఎన్ని వర్గాలైతే తయారయ్యాయో, ఎంత సమయము, ఎంత సేవ అయితే జరిగిందో దాని అనుసారంగా చూస్తే వి.ఐ.పి.లు ఇంటివారిగా అయిపోవాలి. ఫోన్ చేయగానే హాజీ, హాజీ అంటూ వచ్చి చేరుకోవాలి. సహచరులుగా అయితే అవ్వాలి. ఇప్పుడు ప్రతి వర్గం వారు సహజంగా సహయోగులుగా అవ్వాలి అన్న లక్ష్యమును ఉంచాలి. గౌరవమునిస్తే, విశేషమైన సీటును ఇస్తేనే వస్తాము అన్నట్లుగా ఉండకూడదు. కాస్త హోమ్లీగా (ఇంట్లోని వారిగా) చేయండి. అబూకి రాలేకపోతే మీ సెంటర్ కు, మీ జోన్ లోని పెద్ద పెద్ద సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి వద్దకు తీసుకురండి. తక్కువలో తక్కువ మూడు నెలలకొకసారి లేక ఆరు నెలలకొకసారి వారిని కలుస్తూ ఉండండి. ఇంటివారిగా చేస్తూ ఉండండి, అప్పుడు సమయానికి ఎప్పుడైతే ఈ పరిస్థితులు మారుతాయో అప్పుడు సమయానికి ఉపయోగపడగలరు. కావున అన్నివర్గాల వారు వింటున్నారు కదా! అక్కడక్కడ అలా అయ్యారు కూడా! కాని కొద్దిమందే అలా అయ్యారు. కావున పంజాబ్ వారు పులులే కదా! అవును రెండు చేతులెత్తండి, అందరూ పులులే. కావున మొట్టమొదట అది మీరు చేయండి. పంజాబ్ వి.ఐ.పి.లు ఇంటివారిగా అయిపోవాలి. మహాత్ములు కూడా ఇంట్లోని వారిగా అయిపోవాలి. ఆహ్వానంపై రావడం కాదు, మేము వస్తాము అని వారు స్వయం అనాలి. బాగుంది, పంజాబ్ లో మంచిగా వృద్ధి చేస్తున్నారు. బాప్ దాదాలకు కూడా పంజాబ్ అంటే ఎంతో ప్రేమ ఉంది. ప్రేమ ఎందుకు ఉంది? జమ్మూకాశ్మీర్ ని కూడా తమ వారిగా చేసుకున్నారు. ఇంకా కొద్దిగా చేయాలి, జమ్మూకాశ్మీర్ కు పేరు ప్రసిద్ధమై ఉంది, అది పాకిస్థాన్ లో అవ్వవచ్చు, అమెరికాలో అవ్వవచ్చు, అందరి దృష్టి జమ్మూకాశ్మీర్ పై ఉంది. అక్కడ ఏదైనా శక్తి చూపించండి. అక్కడి అక్కయ్యలే చేయాలని కాదు, మీరు సహయోగమును ఇచ్చి అక్కడ ఏదైనా అద్భుతమైన విషయాన్ని చేసి చూపించండి. కొద్దిగా అటెన్షన్ ను ఉంచండి, అప్పుడు పేరు ప్రఖ్యాతమైపోతుంది. ఎక్కడైతే గొడవ ఉందో అక్కడ శాంతి ధ్వజమును ఎగురవేయండి. సరేనా! సంఖ్య అయితే ఎంతో ఉంది. ఒకటేమో నిర్విఘ్నులుగా అవ్వండి, ఇంకొకటి సేవలో శాంతి ధ్వజాన్ని ఎగురవేయండి. జెండా అందరికీ కనిపించాలి. అశాంతి స్థానంలో శాంతి ధ్వజము ఎగురుతోంది అని జెండా అందరికీ కనిపించాలి, సరేనా! అచ్ఛా!

డబుల్ విదేశీయులు - ఇప్పుడు మీరు డబుల్ విదేశీయులు కారు, డబుల్ తీవ్ర పురుషార్థులు, సరేనా! మీరు డబుల్ పురుషార్థులేనా? బాగుంది. ఇన్ని దేశాల నుండి వస్తుంటారు? ఇన్ని దేశాలలో సేవాకేంద్రాలు ఉన్నాయి అని మీ పేరు విని కూడా అందరూ ఎంతో సంతోషిస్తారు. తమ తమ దేశాలలో జెండా ఎగురవేయకపోయినా ఒక్క లండన్లో జెండా ఉంది. ఒక్క లండన్లోనే జెండా ఉంది, ఇంకేదేశాలలోనైనా జెండాలు ఉన్నాయా? ఉంటే చేతులెత్తండి. స్వేచ్ఛగా జెండా ఎగురవేయబడి ఉందా? ఎటువంటి అభ్యంతరము లేదా, అచ్ఛా! ఎన్ని దేశాలలో అలా ఉంది? 10-12 దేశాలలో అలా ఉందా! ఇది కూడా మంచిది. అనేక ఆత్మల హృదయాలలో జెండా ఎగురవేశారని బాప్ దాదాకు సంతోషంగా ఉంది. మీరు విశ్వసేవాధారులు, కేవలం భారతదేశానికి సేవాధారులు కాదు, మొత్తం విశ్వానికి సేవాధారులు అని మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. విశ్వసేవాధారి అన్న టైటిల్ ఉంది కదా! కావున కేవలం భారతదేశంలోనే కాదు విశ్వంలో మూలమూలలలోను ఉన్నారు, ఇంకా ఇప్పుడు సేవను మంచిగా పెంచుతున్నారు కదా! ముస్లిం దేశాలలో కూడా సేవ బాగా జరుగుతోంది, బాప్ దాదా సమాచారమును విన్నారు, బాగుంది. కరాచీలో సేవకు కూడా ప్లానింగ్ తయారుచేశారు, బాగుంది. ఏదైతే జరుగుతోందో డ్రామా, చాలా బాగా జరుగుతుంది. కొత్త కొత్త నగరాలలో ఏ పిల్లలైతే మిగిలి ఉన్నారో అక్కడ ఇంకా సేవ చేయాలనే ఉల్లాస ఉత్సాహాలలో ఉన్నారు మరియు అందరికన్నా ధైర్యవంతురాలైన ఒక బిడ్డ ఉంది, తాను ధైర్యవంతురాలు, బాప్ దాదా తనకు రోజూ అమృతవేళ వరదానమును ఇస్తారు మరియు ఆ బిడ్డ కూడా అక్యురేట్ గా ఉంది(వజీహా). అటువంటి పని చేసి చూపించండి, ధైర్యవంతురాలు, భయపడదు, తన ఇంటివారిని కూడా యుక్తిగా సరిచేసింది, తెలివైనది. అలాగే నైరోబీవారు కూడా చాలా మంచి పురుషార్థం చేశారు, అది వారి విశేషత. నైరోబీవైపు ఉన్నవారి విశేషత ఏమిటంటే అక్కయ్యలు తక్కువైనప్పుడు విద్యార్థులెవరైతే వెలువడ్డారో వారు సెంటర్లను సంభాళిస్తారు, ఇది కూడా విశేషత, కావున అందరి విశేషతలను కలిపి ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలను విశేషంగా చేయండి, బాగుంది. డబుల్ పురుషార్థులు మంచిగా పురుషార్థం చేసి పెరుగుతున్నారు, కాని బాబా చార్టును చూస్తారు. సమాచారమును చెప్పారు కదా! ఆ సంపూర్ణ పవిత్రత యొక్క చార్టును చూస్తారు, బాగుంది, అందరి లక్ష్యము చాలా బాగుంది. కాని మధ్యలో నిర్లక్ష్యపు మాయ ఎంతో వస్తుంది, ఇప్పుడు దానికి వీడ్కోలు చెప్పండి. నిర్లక్ష్యానికి వీడ్కోలు మరియు ఫుల్ స్టాప్ కు ఆహ్వానము. సరేనా, చేస్తారు కదా! నిర్లక్ష్యమును చూపించకండి. బాప్ దాదా నిర్లక్ష్యపు ఆటలను ఎన్నో చూశారు. ఇప్పుడు క్షణంలో ఫుల్ స్టాపు పెట్టే ఆటను చూపించండి. లెక్కలలో కూడా చూడండి అన్నింటికన్నా సహజమైనది ఫుల్ స్టాపే. పెన్సిల్ పెట్టగానే ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. అచ్చా! డబుల్ విదేశీయులు సదా టర్న్ తీసుకుంటూ ఉంటారు, అది చాలా బాగుంది, అలా తీసుకుంటూ ఉండండి. అచ్ఛా!

దిల్ వాలే కాడ్ గ్రూప్ - అచ్ఛా! కొత్త ప్లానునేదైనా తయారుచేశారా? (గుప్తాజీతో) అచ్ఛా, కార్యమైతే నడుస్తోంది. ఎటువంటి ఖర్చు లేకుండా హృదయం బాగుపడగలదన్నది అందరికీ గవర్నమెంట్ ద్వారా అఫీషియల్ గా తెలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొదట అందరూ చూస్తారు, ఒక ప్రశ్న అడుగుతారు, బాప్ దాదాను కూడా ఒక ప్రశ్న అడిగారు, చెప్పమంటారా! బ్రాహ్మణ పిల్లల హృదయము ఎందుకు సరిచేయరు, వారు అక్కడికి ఎందుకు వెళుతున్నారు? అని అడుగుతారు. వారిని కూడా సరిచేసే ప్రయత్నం చేయండి కదా! అది వారి పొరపాటు కూడా. ఎందుకంటే నియమాలపై నడవరు. ఏ పత్యమునైతే చెబుతారో దానిని ఇతరులు పూర్తిగా పాటిస్తారు. కాని బ్రాహ్మణులు తమ ఇల్లుగా భావిస్తూ పత్యమును తక్కువగా చేస్తారు. కాని, బ్రాహ్మణులలో కూడా ఇటువంటి విశేషమైన ఉదాహరణను తయారు చేయండి తద్వారా బ్రాహ్మణులు కూడా తామూ చేయమని భావించగల్గాలి. పని చాలా బాగుంది, శబ్దం చేరుకుంది, కాని ఇప్పుడా శబ్దమును ఇంకాస్త పెంచండి తద్వారా నలువైపులా చేరుకుంటుంది. శుభభావన, శుభకామన కూడా కార్యం చేస్తుంది. ప్రతి వర్గం వారు అందరి కన్నా ముందుకు వెళ్ళాలి, బాగుంది. ఇంకా ముందుకు వెళ్ళండి మరియు తీసుకువెళుతూ ఉండండి. అచ్ఛా!

           నలువైపులా ఉన్న మహాన్ పవిత్ర ఆత్మలకు బాప్ దాదాల విశేష హృదయపూర్వక దీవెనలు, హృదయపూర్వక ప్రేమ మరియు హృదయంలో ఇముడ్చుకున్నందుకు అభినందనలు. బాప్ దాదాల అవతరణ ఎప్పుడు జరిగినా ఈమెయిలు, ఉత్తరాలు, భిన్న భిన్న సాధనాల ద్వారా నలువైపులా ఉన్న పిల్లలు ప్రియస్మృతులు పంపుతారని బాప్ దాదాకు తెలుసు. బాప్ దాదాకు వినిపించకముందే, ఎవరైనా అవి తెచ్చిఇచ్చేందుకు ముందే అందరి ప్రియస్మృతులు చేరుకుంటాయి ఎందుకంటే ఇటువంటి స్మృతిచేసే ప్రియమైన పిల్లల కనెక్షన్ చాలా త్వరగా చేరుకుంటుంది. మీరు మూడు, నాలుగు రోజుల తరువాత సమ్ముఖంగా కలుసుకుంటారు. కాని, సత్యమైన పాత్రులైన ఆత్మల ప్రియస్మృతులు అదే ఘడియలో బాప్ దాదాల వద్దకు చేరుకుంటాయి. కావున ఎవరెవరైతే సాధనాలు లభించని కారణంగా తమ హృదయంలోనే స్మృతి చేసినా వారి ప్రియ స్మృతులు కూడా చేరుకున్నాయి మరియు బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ కోటానురెట్లుగా ప్రియస్మృతులు తెలుపుతున్నారు.

           ఇప్పుడు నలువైపులా రెండు పదాలపై శ్రద్ధను పెంచండి. ఒకటేమో సంపూర్ణ పవిత్రతను మొత్తం బ్రాహ్మణ పరివారంలో వ్యాపింపజేయాలి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారికి సహయోగమునిచ్చి కూడా తయారుచేయండి. ఇది చాలా పుణ్యము. వీరు ఇలాగే ఉంటారు, వీరు మారేలా లేరు అని వదిలివేయకండి, ఈ శాపమును ఇవ్వకండి. పుణ్యకార్యమును చేయండి. మార్చి చూపిస్తాము, మార్చి తీరవలసిందే. వారి ఆశను పెంచండి పడిపోయినవారిని ఇంకా పడవేయకండి, ఆధారమును ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. కావున నలువైపులా ఉన్న అదృష్టవంతులైన, హర్షితముఖులైన, సంతోషమును పంచే పిల్లలకు చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో (దాదీల సేవా సహచరులైన బ్రాహ్మణీ అక్కయ్యలతో బాప్ దాదా కలుస్తున్నారు)- మీరందరూ  కూడా రహస్యమునెరిగినవారే కదా! నిమిత్తులైన మీరు మీ రూపమును కూడా అలా తయారుచేసుకోండి, స్థితిని తయారుచేసుకోండి. దాదీల వైపు నుండి వీరి ద్వారా కూడా ఎంతో కొంత లభించింది అని అందరూ భావించాలి. కేవలం ప్రోగ్రాం లభించింది అని కాదు, వీరి ద్వారా కూడా కొంత లభించింది అని భావించాలి. మీరు దృష్టి ద్వారా అయితే ఇవ్వగలరు కదా, మీ ముఖము ద్వారా కూడా ఇవ్వగలరు. ముఖము మరియు నడవడిక ద్వారా సేవలో నెంబర్‌ వన్‌గా అవ్వండి, ఇది జరుగగలదా? బాప్ దాదా అందరినీ విశేషంగా ప్రేమిస్తారు. (ఈ ముగ్గురూ చేతులెత్తడంలేదు). బాబా చెప్పినప్పుడు చేతులెత్తాలి, అప్పుడు అది గుర్తుంటుంది. ఈ రోజు మీరు నలుగురూ ప్రియమైనవారు, వీరి (మోహినీ బహన్, మున్నీ బహన్) బ్రాహ్మణీలు ఎక్కడ ఉన్నారు? వారిని కూడా పిలువండి. చూడండి, మీ అందరికీ చాలా మంచి డ్యూటీ లభించింది, అందరితో పరిచితులైపోతారు. ఎవ్వరూ ఎవ్వరికీ పూర్తిగా పరిచితులవ్వరు. కాని, మీ డ్యూటీ ఎటువంటిదంటే, మొత్తం బ్రాహ్మణ పరివారమంతటితోను మీరు పరిచితులైపోతారు. ఎవరైనా నీలు, హంస, ప్రవీణ, లీల, రుక్మిణి అన్న పేర్లు ప్రస్తావిస్తే, ఆ పేర్లు మాకు తెలుసు అని అంటారు. కావున మీరు ఒక శాంపుల్ వంటివారు. కావున శాంపుల్ చూసే వస్తువును కొంటారు కదా! కావున ఎవరెవరైతే నిమిత్తులుగా అయ్యారో వారందరూ మేము ఉదాహరణ మూర్తులము అని భావించండి. దాదీల ఉదాహరణ మూర్తులు. వీరు కూడా అలానే ఉన్నారు అని అంటారు. మోహజీత రాజు కథను గూర్చి విన్నారు కదా! ద్వారము వద్ద ఉన్నవారు కూడా మోహజీతులే, మరి లోపల ఇంకెలా ఉంటారు! అని అంటారు. కావున మీరు నిమిత్తులు కదా! ఇది కూడా ఒక వరదానము, ఈ డ్యూటీ లభించడం కూడా ఒక వరదానమే. మీరు ఎంత సమీపంగా ఉన్నారు! కావున ఆ సామీప్యత నుండి లాభాన్ని పొందాలి కదా! కావున బాగుంది, మిమ్మల్ని చూసి బాప్ దాదాకు సంతోషంగా ఉంది. మీరందరూ బాగున్నారు, ఇంకాస్త దాదీల గుణాలను ధారణ చేస్తూ ఉండండి. అచ్ఛా!

పరదాదీతో - నీ ముఖము కూడా సేవ చేస్తుంది, నిన్ను చూసి అందరికీ బ్రహ్మాబాబా ఎక్కువగా గుర్తుకు వస్తారు. ఎందుకంటే బాబాను అనుసరించావు. వేరే పిల్లలలో ఇటువంటి అనుభూతి కలుగదు. కాని, నీవు బాగా అనుసరించారు. ఎంతైనా మధువన నివాసిగా అయిపోయావు, నీవు మధువన నివాసివి, చాలా బాగుంది, మంచిగా సంభాళిస్తున్నారు, వీరికి కూడా సర్టిఫికెట్ లభించింది, మంచిగా ప్రేమతో చేస్తున్నారు.

శాంతమణి దాదీతో- (కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు) ఆది బాగైపోతుంది, కాని ధైర్యము ఉంది. మీ అందరి ధైర్యమును చూసి ఇతరులలో కూడా ధైర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే బీజమైన పునాది చాలా బాగుంది. ఫీలింగ్ లోకి రాదు, అనారోగ్యపు ఫీలింగ్ లేదు, తన ఆనందంలోనే ఉంటుంది. చదువుపై అటెన్షన్ ఉంది, సేవపై అటెన్షన్ ఉంది, వాటి దీవెనలు లభిస్తున్నాయి. డాక్టర్లు కూడా ఎంతో సంతోషిస్తున్నారు, ఎందుకంటే అయ్యో, అయ్యో అంటూ అరవరు కదా!

నిర్వర్ భాయ్ హైదరాబాద్ అకాడమీలో జరుగుతున్న నిర్మాణ కార్యమును గూర్చి బాప్ దాదాకు వినిపించారు - ఏ కార్యమైతే మిగిలి ఉందో అందులో ఆంధ్రప్రదేశ్ కి చెందిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కలపండి. ఎందుకంటే ధనము వినియోగింపబడితే మనసు కూడా అటువైపుకు వెళుతుంది, అందరూ సహయోగమునివ్వాలి, ఏదైనా తక్కువయితే యజ్ఞమైతే ఉండనే ఉంది. కాని, వారి ధనము అందులోకి రాకపోతే మనసు కూడా అటువెళ్ళదు. కావున వారి సంగఠనను కలపండి మరియు ప్రతి ఒక్కరికీ ఉత్సాహమును కలిగించండి. మిగిలి ఉన్న కార్యమును సమాప్తం చేయాలి, అందులో మీరు ఏ సహయోగమునైతే ఇవ్వదలిచారో అది తప్పక ఇవ్వండి. కావున అందరినీ కలపండి, ఆంధ్రప్రదేశ్ కొద్దిగా ముందుకు రావాలి. బాగుంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వారి టర్న్ వస్తుంది కదా, అందులో కూడా మీరు విశేషంగా ఆంధ్రప్రదేశ్ వారి సంగఠనను జరుపండి మరియు ప్రతి మాసము లేక ఆరుమాసాలకు ఒకసారి ఎవరో ఒకరు వెళ్ళండి, లేక ఏదైనా మీటింగ్ కు పిలవండి. అన్ని జోనులు కలుస్తున్నప్పుడు మరి వీరు కూడా కలవాలి కదా! అప్పుడు అది మంచిగా అవుతుంది, సరేనా!

రమేష్ భాయ్ తో- ఆరోగ్యం బాగుందా? (బొంబాయి సమాచారమును వినిపించారు) సెంటర్లన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఎంతైనా బాంబే బాబాకు చెందినదే, అంతా బాబా పరివారమే, కాని బాబా ఫుల్ స్టాప్, తపస్య అని ఏదైతే చెప్పారో వాటిని తప్పకుండా పెంచాలి. ఇదైతే అసలు ఏమంత పెద్దది కాదు. ఇంటి నుండి కూడా బైటకు రాలేరు, కిటికీ కూడా తెరువలేరు, అప్పుడేం చేస్తారు? దీనికన్నా ఎంతో జరుగనున్నది.

బ్రిజమోహన్ భాయ్ తో (ఓ.ఆర్.సి.లో జరుగుతున్న సింధీ సమ్మేళనం గూర్చి వినిపించారు) కనెక్షనైతే ఏర్పడింది, ఇప్పుడు వారిని సంపర్కంలోకి తెస్తూ ఉండండి, ఇంకా సంబంధంలోకి తీసుకురావాలి. ఈ ఫిలిమ్ నుండి వచ్చిన వ్యక్తి మీకు ఉపయోగపడగలడు, వీరు (సింధీవారు) ఉండిపోకూడదు. ఎంతైనా బాబా అవతరణ అక్కడ జరిగింది, కావున వారు మిగిలిపోకూడదు. సందేశము ఇవ్వడం మీ పని. మాకు వినిపించలేదు అని వారు అనకూడదు. (ఆశా బెహన్ తో) కొద్దిగా కష్టపడవలసి ఉంటుంది. బాబాపై ప్రేమ ఉంది, కావున కష్టమనిపించదు. (ఓ.ఆర్.సి. సేవలో రేస్ చేస్తోంది) నలువైపులా పరిగెత్తాలి. ఏ జోన్లైతే కొద్దిగా బలహీనంగా ఉన్నాయో, పరస్పరం కలువవో అక్కడకు ఎవరో ఒకరు ప్రతి నెలా వెళ్ళాలి, అందరినీ కలపాలి (ఇందులో గుల్జార్ దాదీ సహయోగము కావాలి అని జానకీదాదీ అన్నారు) పరస్పర సహయోగమైతే  కావాలి కదా!

ఎనిమిది మంది పెద్ద అక్కయ్యలు ఐదు రోజుల పాటు మౌనబట్టీ చేశారు, వారు బాప్ దాదాల  ముందుకువచ్చారు. అచ్ఛా! వీరు ఫరిస్తాలుగా వచ్చారు. మీరు ఫరిస్తాలు కదా! ఇది ఫరిస్తాల సభ.  స్వయంలో ఉల్లాస, ఉత్సాహాలను ఉంచి చేశారు కదా! కావున అందుకు చాలా, చాలా అభినందనలు కొద్దిమంది ఉన్నారు. వద్దామా, వద్దా అని ఆలోచించలేదు. చేసి తీరాలి అనుకున్నారు, కావున  అష్ట రత్నాలైపోయారు. కావున ఈ 8 రత్నాలను చూసి అందరికీ ఉత్సాహము కలుగుతుంది. ఈ జనవరి  మాసపు కార్యక్రమమేదైతే తయారుచేస్తారో అందులో అందరికీ ఉత్సాహము కలిగే విధంగా ఇటువంటి  విషయమేదైనా ఉంచండి, అలాగే దానిని ఫాలో చేస్తూ ఉండండి. మీరు స్వయం బాధ్యులుగా ఉన్నారు  కదా! మీరు మీ బాధ్యతను నిర్వర్తించారు. కాని, ఇతరులను ఆకర్షించాలి వాయుమండలము ఎలా  తయారవ్వాలంటే - మధువనంలో ప్రత్యక్షంగా మార్పు వచ్చేయాలి. ప్రతి ఒక్కరూ సెంటర్లో ఎటువంటి  వాయుమండలమును తయారుచేయాలంటే - ప్రతి ఇల్లు మందిరము అన్న గాయనమేదైతే ఉందో అలా  అయిపోవాలి. కావున ఇంటింటిలోను చైతన్య ఫరిస్తాల మందిరమైపోవాలి. బాప్ దాదా సంతోషిస్తున్నారు,  మీరందరూ ఏ ధైర్యమునైతే ఉంచి చేశారో అది బాగా చేశారు. బాప్ దాదా ధైర్యము కల గ్రూపు అని  అంటారు, ఉదాహరణ మూర్తులుగా అయ్యారు. మీకు మంచిగా అనిపించింది, సహజంగానూ  అనిపించింది, కష్టపడవలసిన అవసరం రాలేదు. మీకు లేవడం కూడా మంచిగా అనిపించకపోవచ్చు! అటువైపుకు తిరగండి (అందరూ చప్పట్లు కొట్టండి). చూడండి, వీరు ఏ విషయంలో ధైర్యమును  ఉంచారు? బాప్ దాదా మరియు పరివారం కూడా సహయోగిగా అయ్యారు. వీరు 5 రోజులు ఫుల్ స్టాప్  దిద్దే బట్టీ జరిపారు మరియు 5 రోజులు వరుసగా ఎవ్వరూ మిస్ చేయలేదు. ప్రారంభించారు మరియు  అంతిమం వరకు మీ ముందు ఉన్నారు. కావున ఈ పురుషార్థమును బాగా చేశారు, అలాగే మీరు కూడా  గ్రూపులు గ్రూపులుగా అయి లోలోపల పురుషార్థము చేయండి. ఇద్దరైనా సరే సెంటర్లో ఎవరినైన ఒక  స్నేహిని తోడుగా చేసుకొని మీ పెద్దవారికి చెప్పండి. మరి ఏం చేస్తారు? బట్టీ చేస్తారు కదా! విశేష  నియమాలను తయారుచేసుకున్నట్లయితే దాని సహాయం లభిస్తుంది. కావున బాప్ దాదాకు మంచిగా  అనిపించింది. ఇప్పుడు సహజ పురుషార్థం జరిగింది కదా! ఇప్పుడు అక్కడకు వెళ్ళి మరిచిపోకండి.  మాటలలోకి వచ్చేయకండి, ఫుల్ స్టాప్ లో నెంబర్ వన్ పదవిని తీసుకోండి. ఇతరులకు కూడా చేయించండి మరియు మీ అనుభవాన్ని కూడా వినిపించండి. అచ్ఛా!

Comments