22-02-2009 అవ్యక్త మురళి

   22-02-2009         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“జన్మదినం రోజున ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ డివిజన్ లోకి వచ్చే బహుమతిని తీసుకోవడానికి      ప్రతి శ్వాస, సంకల్పము సమర్థంగా ఉండాలి, హృదయము విశాలంగా మరియు         సత్యంగా ఉండాలి, అప్పుడు ప్రతి అవసరము పూర్తవుతుంది."

            ఈరోజు జీరో అయిన బాబా తమ హీరో పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. ఈ రోజు మీరందరూ బాబా జన్మదినము మరియు మీ జన్మదినాన్ని కూడా జరుపుకోవడానికి వచ్చారు. బాప్ దాదా పిల్లలందరికీ, సమ్ముఖంలో ఉన్నవారికి మరియు దూరంగా కూర్చున్నా కూడా హృదయానికి సమీపంగా ఉన్నవారికి, నలువైపుల ఉన్న పిల్లలకు సర్వ సంబంధాలతో అభినందనలు అందిస్తున్నారు. అందులోనూ విశేషంగా మూడు అభినందనలు- తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు రూపాలలో పాలన, చదువు మరియు వరదానాలతో నలువైపుల ఉన్న పిల్లలకు మూడు అభినందనలు విశేషంగా ఇస్తున్నారు. పిల్లలందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు.

           ఈ రోజు ఈ విశేష జన్మను భక్తులు కూడా జరుపుకుంటారు, కానీ ఈ జన్మదినం తండ్రి మరియు పిల్లల అవినాశీ స్నేహానికి జన్మ దినము అని పిల్లలైన మీకు తెలుసు. ఆది నుండి తండ్రి మరియు పిల్లలు కలిసి ఉన్నారు, దీనితోపాటు విశ్వ పరివర్తనా కార్యంలో కూడా బాబా పిల్లలతో కలిసి ఉన్నారు. ఎందుకంటే తండ్రి మరియు పిల్లల స్నేహము చాలా చాలా ఉంది. ఇప్పుడు కూడా కలిసి ఉన్నాము మరియు మన ఇంటికి వెళితే అక్కడకు కూడా కలిసే వెళతాము. పిల్లలు లేకుండా బాబా వెళ్ళలేరు మరియు బాబా లేకుండా పిల్లలు వెళ్ళలేరు ఎందుకంటే హృదయపూర్వక స్నేహము తోడుగా ఉంది. ఇంటి తర్వాత రాజ్యంలోకి వచ్చినప్పుడు కూడా బ్రహ్మాబాబాతో కలిసి రాజ్యం చేస్తారు. అన్ని జన్మలలోకి ఈ జన్మ అతి ప్రియమైనది మరియు అతీతమైనది. ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పంలోని 84 జన్మలలో లేదు. ఇటువంటి స్నేహపూర్వకమైన మరియు కలిసి ఉండే విశేషమైన వజ్ర సమాన జన్మ ఇది. మరి మీరందరూ మీ జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారా లేక బాబాది జరపడానికి వచ్చారా! లేక తండ్రి పిల్లల జన్మదినాన్ని మరియు పిల్లలు తండ్రి జన్మదినాన్ని జరపడానికి వచ్చారా? నలువైపుల భక్తులు కూడా శివ జయంతిని లేక శివరాత్రిని జరుపుకుంటారు, ఎంతో ప్రేమతో జరుపుకుంటారు. బాప్ దాదా భక్తులను చూసి భక్తులకు కూడా భక్తికి ఫలితాన్ని ఇస్తారు. కానీ మీరు జరుపుకోవడములో మరియు భక్తులు జరుపుకోవడములో తేడా ఉంది. వారు రాత్రి జరుపుకుంటారు, మీరు అమృతవేళ జరుపుకుంటారు. అమృతవేళ శ్రేష్ఠమైనది. అమృతవేళలోనే బాప్ దాదా పిల్లలందరి జోలెను వరదానాలతో నింపుతారు. అందరి జోలె వరదానాలతో నిండి ఉంది కదా! ప్రతిరోజూ వరదాత అయిత తండ్రి నుండి వరదానము లభిస్తూనే ఉంటుంది. పిల్లలు ఒక్కొక్కరికీ బాప్ దాదా ద్వారా ఎన్నెన్ని వరదానాలు లభించాయి! ఆ వరదానాలతో జోలె నిండి ఉంది కదా. అందరూ ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంతో చేరుకున్నారు. బాప్ దాదా కూడా పిల్లలను చూసి చాలా సంతోషిస్తున్నారు మరియు ఓహో పిల్లలు ఓహో! అంటూ గానంచేస్తున్నారు. పిల్లలు ఓహో బాబా ఓహో! అని అంటారు మరియు బాబా ఓహో పిల్లలు ఓహో! అని అంటారు. ఎందుకంటే బాబా పిల్లలుగా అయినవారందరూ కోట్లలో కొద్ది మంది ఆత్మలు. విశ్వంలో ఎన్ని కోట్ల ఆత్మలు ఉన్నారు! అందులో పిల్లలైన మిమ్మల్ని బాబా లక్కీ మరియు లవ్లీ పిల్లలు అంటారు, ఆ కోట్లాదిమందిలో మీరు కొద్ది పిల్లలు. పిల్లలైన మేమే కల్ప కల్పమూ కోట్లలో కొద్ది మంది ఆత్మలము అన్న నషా ఉందా! వర్తమానసమయంలో కూడా ఎంత పెద్ద పెద్ద పదవులు ఉన్న ఆత్మలు ఉన్నా కానీ బాబాను గుర్తించి, బాబా జన్మదినాన్ని జరుపుకునే, నలువైపులా ఉన్న గుర్తించిన పిల్లలు కోట్లాది మందిలో ఏ కొందరో ఉన్నారు. కావున మేము కోట్లాదిలో ఏ కొందరమో అన్న సంతోషము ఉందా? నషా ఉందా? చేతులెత్తండి. అవినాశి నషా ఉంది కదా! అప్పుడప్పుడూ ఉండటం కాదు. సదా ఉంది మరియు సదా ఉంటుంది. మాయ పరీక్షనైతే తీసుకుంటుంది, అనుభవం ఉంది కదా. మాయకు కూడా పరమాత్ముని పిల్లలంటే చాలా ప్రేమ. కానీ పరమాత్ముని పిల్లలతో మాయకు ఆది నుండి సంబంధం ఉంది అని పిల్లలకు తెలుసు. మాయ మరియు పరమాత్మ పిల్లలు ఇద్దరికీ పరస్పరంలో సంబంధం ఉంది. మాయ పని రావడము, పిల్లలైన మీ పని ఏమిటి? మాయను దూరంనుండే పారద్రోలడము. దానిని రానివ్వకూడదు. లేక రానిస్తూ ఉంటారా? అలా కాదు, దూరం నుండే పారద్రోలండి. మీరు రానిస్తే రావడం దానికి అలవాటైపోతుంది. రానిస్తున్నారు కదా, వెళ్లాము అని అది కూడా భావిస్తుంది. కానీ, బాబా ఏమి చూసారంటే కొంతమంది పిల్లలు మాయను రానిస్తారు, అంతేకాక దానికి ఆతిథ్యం కూడా చేస్తారు. టీ, నీళ్ళు ఇస్తారు, ఎటువంటి ఆతిథ్యాన్ని ఇస్తారో తెలుసా? మాయా ప్రభావంలోకి వచ్చి ఏమి ఆలోచిస్తారంటే- ఇప్పుడైతే ఇంకా టూ లేట్ బోర్డు రాలేదు కదా, ఇప్పుడింకా సమయము ఉంది, పురుషార్థం చేస్తున్నాము, చేరుకుంటాములే అని ఆలోచిస్తారు. అప్పుడు మాయ కూడా నన్ను రానివ్వడమే కాక నాకు సహాయం చేస్తున్నారు. ఆతిథ్యాన్ని ఇస్తున్నారు అని అనుకుంటుంది. ఎవరైతే మాయను గుర్తిస్తారో - ఎందుకంటే మాయను గుర్తించడంలో కూడా కొందరు పొరపాటు చేస్తుంటారు. అది మాయ మతమా లేక బాబా మతమా అని గుర్తించలేని కారణంగా మాయ ప్రభావంలోకి వచ్చేస్తుంటారు. కానీ బాప్ దాదా తమ లక్కీ మహావీర మరియు విజయి పిల్లలకు- మాయను రానివ్వకండి అని చెప్తున్నారు, ఇప్పుడు వస్తే దానిని పారద్రోలండి. ఇందులో సమయాన్ని కేటాయించకండి. ఎందుకంటే సమయము తక్కువగా ఉంది. విశ్వ పరివర్తకులుగా అయి, విశ్వ సేవకులుగా అయి విశ్వాత్మలకు బాబా పరిచయాన్ని ఇచ్చి ముక్తి వారసత్వాన్ని ఇప్పిస్తాము అన్న మీ ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ కార్యము ఇంకా పూర్తి కాలేదు. ఆ కార్యాన్ని సమాప్తం చెయ్యడానికి సమయాన్ని కేటాయించండి, ఒకవేళ మాయను పారద్రోలడంలోనే సమయాన్ని కేటాయిస్తే, విశ్వ పరివర్తకులము అన్న ప్రతిజ్ఞను ఎలా పూర్తి చేస్తారు! తండ్రికి సహచరులుగా ఉన్నారు కదా, ఇప్పుడు కూడా తోడుగా ఉంటాము, తోడుగా నడుస్తాము.... అని జన్మించగానే ప్రతిజ్ఞ చేసారు. కావున ఇప్పుడు బాబానుండి ఏ శక్తులైతే లభించాయో ఆ శక్తుల ఆధారంతో మాయను దూరం నుండే పారద్రోలండి. ఇందులో సమయము ఎక్కువ తీసుకోవద్దు, చూడండి, 70 సంవత్సరాలు పురుషార్థం చేస్తూ వచ్చారు. ఇంకా మాయ రావడము మళ్ళీ దానిని పారద్రోలడము ఇప్పుడు 'అందుకు సమయము కాదు. ఎందుకంటే మీకు తెలుసు, మీరు నాలెడ్జ్ ఫుల్ కదా. పూర్తి డ్రామా జ్ఞానం ఉంది. కావుననే నాలెడ్జ్ పుల్ పిల్లలూ, ఇప్పుడు సమయాన్ని ఎందులో వెచ్చించాలి? రెండు ఖజానాలను చాలా జమ చేసుకోవాలి. ఏ రెండు ఖజానాలు? ఒకటి- సంకల్పము, రెండవది సమయము. ఈ రెండు ఖజానాలు గొప్పవే. మీ అందరికీ తెలుసు కూడా ఎందుకంటే మీరు నాలెడ్జ్ ఫుల్ తండ్రికి నాలెడ్జ్ ఫుల్ పిల్లలు. మీరు మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ కదా! ఫుల్ గా ఉన్నారా? నాలెడ్జ్ బుల్ కాదు. కొందరు నాలెడ్జ్ బుల్ (జ్ఞానవంతులు)గా ఉన్నారు, నాలెడ్జ్ ఫుల్ (జ్ఞానసంపన్నులు)గా లేరు. మీరు ఎవరు? నాలెడ్జ్ ఫుల్ కదా, చేతులెత్తండి. నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారా లేక నాలెడ్జ్ బుల్ గా ఉన్నారా? అందరూ నాలెడ్జ్ ఫుల్లే కదా? చేతులెత్తారా, మంచిది. వాహ్! ఫుల్ నాలెడ్జ్ వచ్చేసింది కదా. మాయను పారద్రోలే జ్ఞానం ఉందా? వెనుక కూర్చున్న వారికి ఉందా? అచ్ఛా! జెండాలు ఊపుతున్నారు. మాతలకు ఉందా? మాతలు నాలెడ్జ్ ఫుల్ యేనా? డబుల్ విదేశీయులు, డబుల్ విదేశీయులు కూడా జెండాలు ఊపుతున్నారు. అచ్ఛా, చూడండి ఎంత మంచి దృశ్యం కనిపిస్తుందో! జెండాలు మంచిగా ఉన్నాయి. మరి నాలెడ్జ్ ఫుల్ అంటే మాయను దూరం నుండే పారద్రోలేవారు. మరి అలా ఉన్నారు కదా? ఎందుకంటే బాప్ దాదా ముందుగానే చెప్పి ఉన్నారు- ఖజానాలను జమ చేసుకునే బ్యాంకు కేవలం ఈ సమయంలో, సంగమయుగంలోనే ఉంది, తర్వాత పూర్తి కల్పమంతటిలో జమ చేసుకునేందుకు బ్యాంకు లభించదు. ఇప్పుడు జమ చేసుకున్నదే కార్యంలో ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ జమ చేసుకునే బ్యాంకు ఇప్పుడు సంగమ యుగములో తెరుచుకుంటుంది. అందుకే మీరేమంటారు, అందరికీ సందేశంలో ఏమని వినిపిస్తారు, ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు అని అంటారు. మరి మీ అందరికీ గుర్తుంది కదా! ఇప్పుడు లేకున్న మరెప్పుడూ లేదు, ఇది సదా గుర్తుంటుందా? ఎందుకంటే సంగమయుగ జన్మ అన్నింటికన్నా చాలా చిన్నది, కానీ అమూల్యమైన జన్మ ఈ జన్మకు ఉన్న విలువ పూర్తి కల్పం వరకు కొనసాగుతుంది. మరి మా జమ ఖాతా ఎంత ఉందని పరిశీలించుకుంటున్నారా? ఎంత అనుకుంటున్నారో అంత జమ అవుతోందా? ఎందుకంటే బాప్ దాదా- ఇప్పుడు నడిచే సమయము సమాప్తం అయ్యింది, ఇది ఎగిరే సమయము అని ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నారు. పురుషార్థం చేసే సమయం పూర్తయింది, కానీ ఇప్పుడు ఇది తీవ్ర పురుషార్థం యొక్క సమయము. అది కూడా కొద్దిమందే ఉన్నారు. అందుకే బాప్ దాదా డబుల్ విదేశీయులకు డబుల్ తీవ్ర పురుషార్థులు అన్న టైటిలును ఇవ్వడం జరిగింది. చెప్పండి, డబుల్ పురుషార్థులు, చేతులెత్తండి. అచ్చా. బాప్ దాదా అయితే జన్మ దిన శుభాకాంక్షలతో పాటు మీకు కూడా అభినందనలు అందిస్తున్నారు. పదమా పదమ రెట్లు అభినందనలు. అభినందనలు, అభినందనలు.

            బాప్ దాదా ఓ.కే. గురించి ఇచ్చిన హోమ్ వర్కుపై కొంతమంది పిల్లలు అటెన్షన్ ఉంచారు. కానీ 100 మార్కులు చాలా కొద్దిమందికి మాత్రమే వచ్చాయి. 50 శాతంవారు ఎక్కువగా ఉన్నారు. కానీ బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారంటే, ఏమి కోరుకుంటున్నారో వినిపించమంటారా? ఆశా దీపాలైన ప్రతి ఒక్కరిపై, ఆశలను తీర్చే మహావీరులైన పిల్లలపై బాబాకు ఉన్న ఆశ ఏమిటంటే సమయం అనుసారంగా ఒకవేళ ఇప్పటి నుండి తీవ్ర పురుషార్థపు బహుకాలపు చార్టును జమ చేసుకోకపోతే మూడు పదాలను బాప్ దాదా సమయానుసారంగా గుర్తు తెప్పిస్తున్నారు - ఒకటి అచానక్ (అకస్మాత్తుగా), రెండవది- ఎవరెడీ మరియు మూడవది- బహుకాలంగా ఖాతా జమ చేసుకోవడం. ఎందుకంటే మన రాజ్యంలో, మన రాజ్యం ఇక వచ్చేస్తోంది అని ఇప్పుడు సంతోషమైతే ఉంది కదా. ఏ విధంగా ఇప్పుడు బాబా వచ్చారు అన్న సందేశాన్ని ఇస్తున్నారో అలా మన దైవీ రాజ్యము, సుఖశాంతిమయ రాజ్యము వచ్చేస్తోంది అని అందరికీ ఈ సందేశాన్ని ఇస్తున్నారు. మరి అందరికీ ఈ సందేశాన్ని ఇస్తున్నప్పుడు మరి మీ పురుషార్థం కూడా తీవ్రంగా, ఎంతో కాలం నుండి జమ చేసుకుంటే, మన రాజ్యంలో అంతిమం వరకు ఫస్ట్ జన్మ నుండి 21 జన్మలు పూర్తి రాజ్య భాగ్యానికి అధికారులుగా అవుతారు. ఈ లెక్కను ఎంతోకాలం స్మృతిలో ఉంచుకోవాలి. ఎందుకంటే క్రొత్త ఇంట్లోనే ఆనందము వస్తుంది. ఒకవేళ రెండు మూడు నెలల తర్వాత వస్తే, రెండు మూడు నెలల ఇంటిని ఏమంటారు, క్రొత్తది అని అంటారా లేక 3 నెలలది అని అంటారా? మరి బాప్ దాదా ఏమని ఆశిస్తున్నారంటే, బాప్ దాదా యొక్క ఒక్కొక్క గారాల పిల్లలు వాహ్ వాహ్ పిల్లలూ, బాబా హృదయ సింహాసనాధికారులైన పిల్లలు, మొదటి జన్మలో బ్రహ్మా బాబాకు సహచరులుగా అయి రావాలి, మరి ఇష్టమేనా! ఇష్టమేనా? అచ్ఛా! మరి ఏమి చెయ్యవలసి ఉంటుంది? చెయ్యవలసి ఉంటుంది కదా. ఇష్టమే కదా, బాబాకు ఇష్టమే కానీ ఏమి చెయ్యవలసి ఉంటుంది? ఇప్పటి నుండి, సరే, గడిచిందేదో గడిచిపోయింది, బాప్ దాదా క్షమించేస్తున్నారు, గడిచిపోయింది. ఇప్పటి నుండి జన్మ దిన కానుకగా తండ్రికి ఏమి ఇస్తారు? బాబాకు ఏదో ఒక కానుకను ఇవ్వాలి కదా. బాబా జన్మ దినాన్ని జరుపుకోవడానికి వచ్చారు, మరి బాబాకు ఏ కానుకను ఇస్తారు? పిల్లలందరిపై బాబాకు ఆశ ఉన్నది, లాస్ట్ లో ఫాస్ట్ గా వెళ్ళవచ్చు. మొదటిసారి వచ్చినవారు చేతులెత్తండి. అచ్ఛా!

           బాప్ దాదా లాస్ట్ లో వచ్చే పిల్లలకు, మొదటిసారి వచ్చినందుకు అభినందనలు. కానీ ఒక భాగ్యం గురించి చెప్తున్నాము, భాగ్యాన్ని చేసుకోవడానికి మార్జిన్ ఉంది, ఎందుకంటే టూ లేట్ బోర్డు ఇంకా పెట్టలేదు. ఒకవేళ ఎవరైనా లాస్ట్ వచ్చిన వారు కూడా పురుషార్ధం చేస్తే లాస్ట్ లోనూ ఫాస్ట్ గా మరియు ఫాస్ట్ గా ఫస్ట్ డివిజన్లోకి రాగలరు. ఫస్ట్ నంబరు కాదు, వారైతే ప్రసిద్ధమైపోయారు, కానీ ఫస్ట్ డివిజన్లోకి వెళ్ళగలరు. ఇష్టమేనా? క్రొత్తగా వచ్చిన పిల్లలకు ఇష్టమేనా? అవకాశం ఉంది, బాప్ దాదా సీటును ఇచ్చేస్తారు, కానీ కొంత చెయ్యవలసి ఉంటుంది కూడా. ఒక్కొక్క శ్వాస, ఒక్కొక్క సంకల్పము, అటెన్షన్, ప్రతి శ్వాస, ప్రతి సంకల్పము సమర్థంగా ఉండాలి. వ్యర్థం ఉండకూడదు ఎందుకంటే మీ అందరూ మొదటిసారిగా వచ్చినవారైనా, తర్వాత వచ్చినవారైనా అందరి టైటిల్ ఏమిటి? సమర్థులైన పిల్లలు మీరు, బలహీన పిల్లలు కాదు. బాప్ దాదా ప్రియస్మృతులలో ఏమని అంటారు? రోజూ ఉండే ప్రియస్మృతులు- గారాల పిల్లలు, చాలాకాలం తరువాత కలిసిన పిల్లలు, హృదయ సింహాసనాధికారి పిల్లలు అంటారు. అందుకే బాబా ఈ స్వర్ణిమ అవకాశాన్ని ఇస్తున్నారు కావున తీసుకోదల్చుకున్నవారు తీసుకోవచ్చు. బాబా ఇస్తారు, బంధింపబడి ఉన్నారు. తీవ్ర పురుషార్థులు కొందరు ఉన్నారు, అవకాశం ఉంది. టూ లేట్ బోర్డు పడితే ఇంక సమాప్తమే. కానీ బాప్ దాదాకు జన్మదినం సందర్భంగా ఎటువంటి బహుమతిని ఇస్తారు? జన్మ ఉత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చారు కదా! బాప్ దాదా అయితే పిల్లలైన మీ జన్మదినం సందర్భంగా మీ అందరికీ విశేషమైన కానుకను ఏమిస్తున్నారంటే- మీ తీవ్ర పురుషార్థం ఈ రోజు నుండి అంతిమం వరకు 90 శాతం ఉన్నట్లయితే మిగిలిన 10శాతం బాప్ దాదా పెంచేస్తారు. సరేనా! ఇప్పుడు వ్యర్థము సమాప్తము. చూడండి, ఎలా అయితే సత్యయుగపు దేవతలు వచ్చినప్పుడు, వారికి ఇక్కడ ఏ భాషలో మాట్లాడుకుంటారో తెలియదు. పురుషార్థం మాట వినగానే పురుషార్థం అంటే ఏమిటి అని వారు అంటారు. ఎందుకంటే వారు ప్రాలబ్ధము ఉన్నవారు కదా. ఇటువంటి తీవ్ర పురుషార్థులైన మీకు స్వప్నంలో మరియు సంకల్పంలో, లేక ప్రాక్టికల్ కర్మలో వ్యర్థం ఏమిటి అన్నంతగా దానిని సమాప్తం చెయ్యండి. ధైర్యముందా? 10 శాతం మార్కులు బాబా గ్రేస్ గా ఇస్తారు. సరేనా! చేతులెత్తండి. ఎంత శాతం పక్కాగా ఉన్నారు? 100 శాతం కాదు, 101 శాతం, ఎందుకంటే బాప్ దాదాకు పిల్లలు లేకుండా, పిల్లల తోడు లేనిదే నచ్చదు. నా బాబా అని అన్నప్పుడు బాబా కూడా నా పిల్లలూ అని అంటారు. మరి బాబా సమానంగా కావలసిందే కదా. ఇప్పుడు దృఢ సంకల్పం యొక్క అవసరం ఉంది. దృఢ సంకల్పం సఫలతకు తాళంచెవి అని మీరు ఒక పుస్తకాన్ని ముద్రించారు కదా. కావున సాధారణ సంకల్పాన్ని చెయ్యొద్దు. మీరు ఎవరు? ఒకవేళ ఇక్కడి ప్రెసిడెంటు సాధారణ నడవడిక నడుచుకుంటే బాగుంటుందా! మరి మీరెవరు? మీరైతే మూడు సింహాసనాల నివాసులు. అన్నిటికన్నా పెద్దది బాప్ దాదా హృదయ సింహాసనము. మరి హృదయ సింహాసనంపై ఉన్నవారు మొదటి జన్మలో సహవాసులుగా అయితే అవుతారు కదా! సింహాసనంపై ఒక్కరే కూర్చున్నప్పటికీ రాయల్ ఫ్యామిలీ మరియు ఫ్యామిలీ రాజ్య అధికారిగా అయితే అవ్వవచ్చు. మరి తోడుగా నిలిచేవారు, ఇంటి వరకైతే తోడుగా వెళతారు కదా. బాప్ దాదా ఎలా అయినా తీసుకువెళతారు. వయా తీసుకువచ్చినా లేక నేరుగా తీసుకువెళ్ళినా కానీ తప్పక తీసుకుని వెళ్తారు. మరి అప్పుడు ఇంట్లో కూర్చుండిపోతారా, బ్రహ్మా బాబా వెళ్ళిపోయి మీరు ఉండిపోతే బాగుంటుందా? మీరు రాజయోగులు కదా! మీరు స్వయానికి ఏ టైటిల్ ను ఇచ్చుకుంటారు? అలాగే ఇతరులకు కూడా ఏమి నేర్పిస్తారు? రాజయోగమా లేక ప్రజాయోగమా? రాయల్ ప్రజలైనా కానీ ప్రజాయోగులైతే కాదు కదా! మీరు రాజయోగులు. మరి బాబా పిల్లలందరికీ ఇచ్చిన బహుమతి మీ అందరికీ గుర్తుంటుంది కదా! ఎప్పటి వరకు? అంతిమం వరకు. పురుషార్థం చాలానే చేస్తూ ఉండటం, పిల్లలు కష్టపడటం బాబా చూసారు. పిల్లల కష్టం చూస్తే తండ్రికి నచ్చదు. కావున ప్రేమలో ఉన్నట్లయితే కష్టం సమాప్తమైపోతుంది. నా బాబా, కానీ నేను మరియు నాది సమాప్తము. నా బాబా అన్నప్పుడు అనేక నావి అన్నవి అందులో సమాప్తమైపోతాయి. ఒక బొమ్మను తీసుకువస్తూంటారు కదా, దాని లోపల మరొక బొమ్మ, అందులో మరో బొమ్మ ఉంటుంది. ఒక్కదానిలో 10-12 ఇమిడిపోయి ఉంటాయి... ఒక్క నా బాబా, మీరు నా బాబా అని అనేవారే కదా. నా బాబా కదా! మహారథుల బాబా కాదు కదా! నా బాబా. నా బాబా అన్నప్పుడు హద్దులోని "నాది" అన్నవాటిని “మీది"లో ఇమిడ్చివేయండి. నాది అన్నదానికి బదులుగా మీది అన్నది తీసుకురండి. నాది మరియు మీది అనడంలో ఎంత తేడా ఉంది! నే మరియు మీ. ఒక్క అక్షరంలో తేడా ఉంది. మరి నా బాబా అన్నది పక్కాగా ఉంది కదా. పక్కాగా ఉందా? ఎంత శాతము? 100 శాతం, 101! ఇలా ఒక్క వేలిని చూపించండి. 101 శాతం అనేవారు అలా చూపించండి. బాప్ దాదా చూస్తున్నారు. టి.వి.లో కూడా చూస్తున్నారు.

           మరి ఇప్పుడు శివరాత్రిని, శివ జయంతిని జరుపుకుంటున్నారు. అందులో విశేషంగా మూడు విషయాలను జరుపుకుంటాము. ఈ విధులు, ఉత్సవం జరుపుకునే వారు ఎవరైతే కాపీ చేసారో వారిది అద్భుతము అని బాప్ దాదా అంటారు వారికి కూడా అభినందనలు తెలుపుతున్నారు. విశేషంగా 3 విషయాలను జరుపుకుంటున్నారు-మెదటిది వ్రతాన్ని పాటించడం. వారు మిమ్మల్ని కాపీ చేసారు, కానీ అల్పకాలికంగా. మీరు కూడా బాబా పిల్లలుగా అయినప్పటి నుండి రెండు వ్రతాలను ధారణ చేశారు. ఒకటి- పవిత్రత, కేవలం బ్రహ్మచర్యము కాదు, బ్రహ్మాచారి. కొంతమంది పిల్లలు ఏమి చేస్తారు? ముఖ్యమైన పెద్ద పెద్ద వికారాల వ్రతమైతే చేపడతారు కానీ చిన్న చిన్నవాటిని వదిలేస్తుంటారు. చిన్నవే మహాబలిగా అయిపోతాయి. చిన్నవి తక్కువేమీ కావు. సమయానికి మోసం చేసేవి చిన్నవే. ఎలా అయితే ఎలుక ఉంది కదా, అది చిన్నదే అయినా కానీ, కొరకడంలో మాత్రం నంబర్‌వన్. గాలి ఊదుతుంది, అలాగే కొరుకుతుంది. అయినా ఏమీ తెలియదు. కావున చిన్న చిన్న వికారాలు, కొంతమంది పిల్లలు క్రోధము గురించి- ఇదైతే జరుగుతూనే ఉంటుంది, చేయాల్సి వస్తుంది అని అనుకుంటారు. మరి వారిని సంపూర్ణ ఆత్మ అనవచ్చా? పిల్లాజల్లలతో సహా చిన్న, పెద్దవాటితో పాటు అన్నింటిని వదులుతూ మేము సదా పవిత్రంగా ఉంటాము అని వ్రతాన్ని తీసుకున్నారు కదా? ప్రతిజ్ఞ చేసారు కదా? లేక కేవలం ఒక్క బ్రహ్మచర్య వ్రతమును మాత్రమే తీసుకున్నారా? మీ టైటిల్ ఏమిటి? సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు, ఇదే కదా మీ టైటిల్? లేక కొద్ది కొద్దిగా మర్యాద తక్కువ ఉంది అని అంటారా? నా బాబా అని అన్నాము అని ఎవరైతే భావిస్తున్నారో, నా బాబా అని అన్నప్పుడు అందరూ చేతులెత్తారు, నా బాబా అన్నప్పుడు బాబా సమానంగా అయితే అవ్వాలి కదా. కేవలం ఒక్క అక్షరం మార్చండి- ఎక్కడ నాది అని వస్తుందో అక్కడ నీది అని గుర్తు చేసుకోండి. ఈ ఒక్క పదమును గుర్తుంచుక్నుట్లయితే మూడు సింహాసనాల నివాసులుగా అవుతారు. మరి మొదటి వ్రతము సదా కోసం పవిత్రత. మర్యాద పురుషోత్తములు అన్నదానిని మీరు సదా కాలికముగా ధారణ చేసారు. వారు ఒక్క రోజు చేస్తారు. కాపీ అయితే చేసారు, పిండిలో ఉప్పంత చేసారు. అయినప్పటికీ చేసారు కదా. తెలివైనవారే కదా! రెండవ వ్రతము- ఆహార విషయము. మరి మీరందరూ శుద్ధమైన భోజనము యొక్క వ్రతాన్ని తీసుకున్నారు, వారు కాపీ చేసారు కదా. మీరు పూర్తిగా చేసారా లేక ఎప్పుడైనా అలసిపోయి తినేద్దాములే అని అనుకుంటున్నారా? ఇలా అయితే లేరు కదా? అలసిపోయినా, విసుగెత్తిపోయినా, యూథ్ వారు ఏమి చేస్తారు? కుమారులు చేతులెత్తండి. అచ్ఛా! చాలా మంచిది. కుమారీలు చేతులెత్తండి. విదేశీయులలో కుమారీలు, లైట్ పెట్టుకున్న కుమారీలు, (తలపైన చిన్నని బల్బును పెట్టుకున్నారు) కుమారులు పూర్తి వ్రతాన్ని పాటిస్తున్నారా లేక ఎప్పుడైనా అలసిపోతున్నారా? కుమారులు ఎవరైతే వచ్చినప్పటి నుండి, ఇప్పుడు కూడా విధిపూర్వకమైన ఆహారపానీయాల వ్రతాన్ని పాటిస్తున్నారో వారు చేతులెత్తండి. పాస్ అయ్యారు, అచ్ఛా, అభినందనలు. మీకు కోటానురెట్ల అభినందనలు. కొంచెం కష్టపడవలసి వస్తుంది, కానీ బాబా ప్రేమలో ఇది కష్టం కాదు, మరి చూడండి, కాపీ చేసారు కదా. ఒక్క రోజు వ్రతాన్ని తీసుకుంటారు. మరి మీరు వ్రతాన్ని పూర్తి జీవితానికి తీసుకుంటారు. జీవితం యొక్క వ్రతము సదా దానంతట అదే జరుగుతుంది. తర్వాత కష్టపడవలసిన అవసరము ఉండదు. ఈ చిన్నని జన్మలో కష్టం తప్పకుండా ఉంటుంది, త్యాగము. త్యాగానికి భాగ్యము తయారవుతుంది. దీనితో పాటు ఇంకేమి చేస్తారు? జాగరణ. మీరు ఏ జాగరణ చేసారు? వారు నిద్రను త్యాగం చేస్తారు, మీరు కూడా అజ్ఞాన నిద్రను త్యాగం చేసారు. అజ్ఞాన నిద్రను, వేళకాని వేళలో నిద్రను రానివ్వము, కునుకుపాట్లు పడము అని త్యాగం చేసారు. ఇలా ఇలా కాదు. ఇలా, ఈ వ్రతాన్ని కూడా తీసుకున్నారు కదా. కొందరికి ఇలా ఇలా చేసే(కునుకుపాట్లు పడే) అలవాటు ఉంటుంది. త్యాగం చేసారు, దృఢ సంకల్పం చేసారు మరి దృఢ సంకల్పాన్ని ఢీలా ఎందుకు చేస్తారు? అని బాప్ దాదా అంటారు. స్క్రూను టైట్ చెయ్యడం రాదా? దీనిని టైట్ చేసేందుకు స్క్రూ డ్రైవర్- ప్రతిజ్ఞ. ఇప్పుడు ఏ కార్యమైతే మిగిలి ఉందో, ఏది మిగిలి ఉందో చెప్పండి? చెప్పండి. ప్రత్యక్షత. దీని కోసమే పురుషార్థం చేస్తున్నారు కదా. నా బాబా వచ్చేసారు, ఈ జెండాను ఎందుకు ఎగురవేస్తారు? ఏ కార్యం చేసినా జెండాను ఎగురవేస్తారు. ఈ రోజు కూడా జెండాను ఎగురవేస్తాము కదా. ఎవరి జెండాను ఎగురవేస్తాము? బాప్ దాదా, సేవ మరియు జన్మ దినపు జెండాను ఎగురవేస్తాము. జెండాను ఎగురవేసినప్పుడు అది పూర్తిగా తెరుచుకునే వరకు దానిని ఊపుతూ ఉంటారు. పూలు కురవడంతో జెండా ఎగురవేయడం పూర్తవుతుంది. మరి మీరు కూడా ఏ ప్రత్యక్షతను ఆశిస్తున్నారు? బాబా ప్రత్యక్షత జరగాలి. మరి ఎంతగా జాగరణ చేసే, వ్రతాన్ని తీసుకునే ప్రతిజ్ఞను పక్కా చేసుకుంటారో అంతగా ప్రత్యక్షత ఎంతో త్వరగా అయిపోతుంది. మరి ప్రత్యక్షతను కోరుకుంటున్నారు కదా! మరి సమయాన్ని సమీపంలోకి తీసుకువచ్చేది ఎవరు? మీరందరూ కదా! సమయాన్ని సమీపంలోకి తీసుకువచ్చే వారు సత్యమైన సేవాధారులు, విశ్వ పరివర్తకులు అయిన పిల్లలగు మీరే. మరి జన్మ దిన కానుకను ఒప్పుకున్నట్లేనా. ఇవ్వాలి కూడా, తీసుకోవాలి కూడా. రెండూ చెప్పాము. కేవలం ఇవ్వడమే కాదు, తీసుకోవాలి కూడా. రెండూ చేస్తాము అని భావించేవారు చేతులెత్తండి. అచ్చా! చాలా మంచిది. అచ్ఛా! మీ చిత్రం ఇందులో (టి.విలో) వస్తోంది. ఎక్కడైనా కొంచెం ఫెయిల్ అయితే, వారికి ఈ చిత్రాన్ని పంపిద్దాము. మళ్ళీ చేతులెత్తండి. బాగుంది, అభినందనలు, అభినందనలు, అభినందనలు.

           బాప్ దాదా వద్దకు నలువైపుల నుండి పదమా పదమరెట్ల అభినందనలు చేరుకున్నాయి. ప్రతి ఒక్కరు మనస్సుద్వారా లేక ఉత్తరము ద్వారా లేక ఈ-మెయిల్ చేస్తూ మా అభినందనలు అందరికన్నా ముందు ఉండాలి అని భావిస్తారు. బాప్ దాదా అందరి అభినందనలను ముందుగా స్వీకరించేసారు. నంబరు పెట్టలేదు, అందరి హృదయపూర్వక అభినందనలను స్వీకరించారు. చూడండి, దూరంగా కూర్చుని చూస్తున్నవారు కూడా చప్పట్లు కొడ్తున్నారు. నలువైపుల అభినందనలు, అభినందనలు అన్న గానము హృదయాలలో మ్రోగుతూ ఉంది. ఇది గీతము కాదు హృదయపుగానం కష్టం లేకుండా సంతోషం కలుగగానే మొదలైపోతుంది. సంతోషము హృదయగానపు తాళం చెవి. ఓహో బాబా, మధురమైన బాబా-ఇదే తాళం చెవి. ఈ తాళం చెవి ఉంది కదా? అప్పుడప్పుడూ తాళంచెవి కాదు.సదా సంతోషము. పిల్లల ముఖము, మాటలు మరియు కర్మ కొంచెం కూడా చింతనతో, చింతతో, వ్యర్థ సంకల్పంతో, దువిధతో ఉంటే బాప్ దాదాకు మంచిగా అనిపించదు. భగవంతుని పిల్లలు ఒకవేళ సదా సంతోషంగా లేకపోతే మరింకెవరు ఉంటారు! మీరే కదా! ముఖము ఎప్పుడూ చింతతో ఉండకూడదు, శుభ చింతన. ఏ విధమైన చింత వచ్చినా కానీ, అప్పుడు నా బాబా కంబైన్డ్ గా ఉన్నారు అని అనుకొండి. చింత బాబాకు ఇచ్చేయండి, మీరు శుభ చింతకులుగాకండి. ఎందుకంటే బాప్ దాదా సదా హర్షితంగా ఉంటారు కదా, మరి పిల్లలు వాడిపోయినట్లు ఉంటే ఎలా, మీరు ఎవరి పిల్లలు భగవంతుని పిల్లలు. ముఖము ఎప్పుడూ వాడిపోకూడదు, పర్వతం వంటి సమస్య వచ్చినా కానీ ఆ పర్వతాన్ని దూది పింజలా మార్చగలరు. బాబాతో మిమ్మల్ని మీరు జోడించుకున్నట్లయితే ఏమి జరుగుతుంది? పర్వతం దూదిపింజ అయిపోతుంది. ఎందుకంటే సర్వశక్తిమంతుడిని తోడుగా పెట్టుకున్నారు కదా. మీరు బలహీనంగా ఉన్న కానీ సర్వశక్తిమంతుడు మీతో కంబైన్డుగా ఉన్నారు, కావున సమయానికి కార్యంలో వినియోగించండి. చెప్పడం వరకే కాక కార్యంలోకి తీసుకురండి. అప్పుడు సదా సంతోషకర ముఖము మరియు హృదయము సదా అదృష్టంతో ఉంటుంది. ఒకవేళ సంతోషకరమైన మరియు అదృష్టవంతుల ముఖాన్ని చూడాలంటే భగవంతుడి సెంటర్లలో చూడండి అని బాప్ దాదాను ఛాలెంజ్ చెయ్యమంటారా? చెయ్యమంటారా ఛాలెంజ్? ఎప్పుడూ వాడిపోవలసిన అవసరము రాదు. ఎందుకు వాడిపోవాలి? ఏదైనా లోటు ఉంటే వాడిపోతారు. ఏ లోటు? సంతోషము ఔషధము. ఉదాహరణకు మీకు ఆరోగ్యంలో కానీ, ధనంలో కానీ లోటు ఉన్నట్లయితే, సంతోషము గురించి ఏమని చెప్తారు? సంతోషమువంటి ఖజానా మరొకటి లేదు అని అంటారు. మరి అది సంపదే కదా. మీ వద్ద సంపద ఉందా? సంతోషము ఉందా? చేతులెత్తండి. సంతోషం ఉంది కదా! మరి సంపద ఉంది! అలాగే సంతోషము వంటి భోజనము లేదు, సంతోషము వంటి ఔషధము లేదు. 36 రకాల భోజనం ఉన్నా కానీ సంతోషము లేకపోతే ఎండిపోయినట్లే. సంతోషం ఉంటే ఎండిపోయిన రొట్టె కూడా 36 రకాల భోజన సుఖాన్ని ఇస్తుంది. బాబా ప్రతిజ్ఞ కూడా ఉంది - సత్యమైన హృదయము, స్వచ్ఛమైన హృదయము, విశాలమైన హృదయము... ఈ మూడు విషయాలను గుర్తుంచుకోండి. ఇవి గుర్తున్నట్లయితే ఏ సమయంలోనైనా, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ మూడు విషయాలు గుర్తుంటే మీ అందరికీ పప్పు, రొట్టె... బాబా తినిపిస్తారు. రెండు, నాలుగు కూరలు తినిపించరు, పప్పు, రొట్టె... తినిపిస్తారు. పప్పు, రొట్టె... తినండి ప్రభు గుణ గానం చెయ్యండి. అనుభవం చేసారు కదా! పాతవారు మొదట్లో వచ్చినవారు అనుభవం చేసుకున్నారు. ఎప్పుడైనా ఆకలితో ఉన్నారా? ఇంకా బెల్లాన్ని బోర్న్ వీటాగా చేసి బాప్ దాదా తన చేతులతో తినిపించేవారు. బాప్ దాదా చేతుల మీదుగా తిన్నప్పుడు అందరి ఆకలి తీరిపోయేది. బోర్న్ వీటా చెయ్యడం వస్తుందా, రాదా? ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఈ బెల్లము, కూరగాయలు, పప్పు ఏదీ లేకపోయినా ఈ బోర్న్ వీటా ఎంతో సుఖాన్ని ఇస్తుంది. చెయ్యడం నేర్చుకోండి. అందరూ ఇక్కడ నేర్చుకోండి. అత్యవసర పరిస్థితుల్లో ఈ బోర్న్ వీటా చాలా పనికివస్తుంది. కానీ నాలుగు విషయాలు గుర్తించండి. ఒక్క విషయంలో లోటు ఉన్నా వెతుక్కోవలసి వస్తుంది, సహజంగా లభించదు. కావున పరిశీలించుకోండి - సత్యత - తనువు, మనసు, ధనము, సంబంధ సంపర్కాలు, సత్యమైన హృదయము, విశాలమైన హృదయము... హృదయము పెద్దదిగా చేసుకుంటే ఏది కోరుకున్నా, అవసరం ఉన్నా అది పూర్తయిపోతుంది. చేసి చూడండి. ఎక్కడ హృదయము పెద్దగా ఉంటుందో అక్కడ అన్ని కోరికలు పూర్తవుతాయి. హృదయము చిన్నదిగా చేసుకుంటే రచన అంతా చిన్నదైపోతుంది. బాబా తృప్తిగా ఉంటే మరింకే లోపము ఉంటుంది? మరి పురుషార్ధం  చెయ్యండి. అలాగే అభినందనల చప్పట్లు కొట్టండి.

           *(సేవా టర్ను కర్ణాటక వారిది, 8వేల మంది కర్ణాటక నుండి వచ్చారు) -* టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. టీచర్లందరికీ బాప్ దాదా విశేషంగా జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకు విశేషంగా ఇస్తున్నారు? ఎందుకంటే ఎంతటి యోగ్యులుగా చేస్తున్నారంటే యజ్ఞసేవకు యోగ్యులుగా చేస్తున్నారు ఎందుకంటే యజ్ఞ సేవ 10 రోజులు ఉండచ్చు లేక 11 రోజులు ఉండవచ్చు, కానీ యజ్ఞసేవను విధిపూర్వకంగా, విధానపూర్వకంగా చేసినట్లయితే 11 రోజుల యజ్ఞసేవ 11 జన్మలకు ప్రాప్తినిస్తుంది. కావున యజ్ఞసేవ యొక్క పుణ్యము వర్తమాన సమయంలో ఇప్పుడు ఎలా అయితే మీకు సంతోషంగా ఉందో, ఉంది కదా సంతోషము ఎక్సాట్రా సంతోషము. మధువనానికి చేరుకోవడము అంటే ఎక్స్ ట్రా సంతోషపు ఖజానా లభించడమే. మరి ఇంతటి యోగ్యులుగా చేసుకుని వచ్చారు, పురుషార్థం చేయించారు, కావున టీచర్లకు అభినందనలు. మరియు మాతలు, మాతలు చేతులెత్తండి, జోన్ వారు, మాతలు చాలామంది ఉన్నారు. మాతలకు కూడా అభినందనలు. ఎందుకు? ఎందుకంటే మాతలు మధువనాన్ని అయితే సంభాళిస్తున్నారు, కానీ సెంటర్లను కూడా సంభాళిస్తారు. బాప్ దాదా ఆది నుండి చెప్తూ ఉన్నారు, ఎక్కడ మాతలు ఉంటారో అక్కడ ఆ సెంటర్ల భండారా మరియు భండారీ సదా నిండుగా ఉంటాయి. అచ్ఛా, వారికి విశేషంగా అభినందనలు. మరియు పాండవులు, అధర్ కుమారులు లేచి నిల్చోండి. అధర్ కుమారులు, చూడండి, మీ విశేషత కూడా ఒకటి ఉంది. ఎలా అయితే మాతల విశేషత ఉందో అలాగే అథర్‌ కుమారుల విశేషత కూడా ఉంది. ఎందుకు? ఏ విశేషత? ఎవరైతే ఇద్దరూ వస్తారో, ఒకరికొకరు తోడుగా నిలుస్తారు, ఎటువంటి విఘ్నము ఉండదు, ఏకమతము ఉంటుంది. లేకపోతే రెండు మతాలలో గొడవ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇద్దరూ ఒకే మతంలోకి వచ్చేస్తారో అప్పుడు అధర్ కుమారులు సేవలో ఎంతో ముందుకు వెళ్ళగలరు. సమయాన్ని కేటాయించగలరు. యూథ్ కూడా సమయాన్ని కేటాయిస్తారు, కానీ అధర్ కుమారులు డబుల్ పని చేస్తారు. డబుల్ పని ఏమిటి? ఒకటి - విశ్వ సేవలో సమయం ఎక్కువ ఇవ్వగలరు. రెండవది- తమ ధనాన్ని కూడా ఎంత కావాలంటే అంత సఫలం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరూ రాజీ అయి ఉంటారు. కావున అధర్ కుమారులు ఎంతగా జమ చేసుకోవాలనుకుంటే, ఎంతగా సఫలం చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు. కారణము ఏమిటి? ఏ విఘ్నమూ ఉండదు. మనసు యొక్క విఘ్నము మరో విషయము, కానీ సంబంధాల విఘ్నము ఉండదు. అందుకే యజ్ఞంలో మీ అందరికీ విశేషమైన పాత్ర ఉంది. అధర కుమార్ కుమారీలను చూసి వృద్ధి ఎంతో త్వరగా జరుగుతుంది. అన్ని వర్గాలవారు రావడము, పరివారంలో కూడా ఉండటము, అన్నీ చేస్తూ కూడా తమ భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఇల్లు వాకిళ్ళ నుండి దూరం చేసేస్తారు అని ఇంతకు ముందు ఉన్న వాతావరణం, భయము ఇప్పుడు లేదు. అంతేకాక డబుల్ పని చెయ్యవచ్చు మరియు సహాయము లభిస్తుంది. అర్థమయ్యిందా! అచ్ఛా!

           *80 దేశాల నుండి 1200మంది డబుల్ విదేశీయులు వచ్చారు-* డబుల్ విదేశీయులు అని అనకండి, డబుల్ తీవ్ర పురుషార్థులు అనండి. టైటిల్ నచ్చింది కదా. డబుల్ విదేశీయులు అన్నది సాధారణము. అలా అయితే చాలా మంది డబుల్ విదేశీయులు ఉన్నారు. బాప్ దాదాకు విదేశీయుల గురించి సంతోషము కలుగుతుంది, ఎందుకంటే వీరు మధువనానికి అలంకారంగా అవుతారు. చూడండి. ఇండియాలోని భిన్న భిన్న స్థానాల నుండి వస్తూ ఉంటే మరి విదేశీయులు తక్కువగా ఎంధుకు ఉండాలి, ఇందులో కూడా మంచి రేసును చేసారు. 80 దేశాల నుండి వచ్చారు. బాప్ దాదా ఒక్క విషయాన్ని మెజారిటీలో చూసి సంతోషిస్తున్నారు-ఎవరు వచ్చినా కానీ, వారందరూ ఇప్పుడు ఒకే కల్చర్ వారిగా అయిపోయారు. అందరూ ఒక్క బ్రాహ్మణ కల్చర్ వారిగా అయిపోయారు, అవును కదా! చేతులెత్తండి. ఇప్పుడు విదేశీ కల్చర్ వారు కాదు, అందరూ బ్రాహ్మణ కల్చర్ వారే, కదా! వచ్చినప్పుడు భిన్న భిన్న కల్చర్ల నుండి వచ్చారు, కానీ కల్చర్‌లను కూడా ధాటివేసారు, ఈ పెద్ద గోడ ఉండేది, కానీ ఈ పెద్ద గోడను క్రాస్ చేసేసారు, ఇప్పుడు వీరేదో వేరు అని అనిపించదు. ఒకసారి టి.వి.లో బ్రాహ్మణ కల్చరావారందరిని చూడండి. ఒకే కల్చర్ వారిని చూస్తే బాగుంది కదా. ఎలా అయితే ఆదిలో పిల్లలు వచ్చినప్పుడు, భిన్న భిన్న వృక్షాల కొమ్మలుగా వచ్చారు. తమ తమ ఇళ్ళ నుండి తమవాళ్ళతో కలిసి వచ్చారు, కానీ బాప్ దాదా ప్రారంభంలోనే- మీరు భిన్న భిన్న వృక్షాల కొమ్మలుగా వచ్చారు, కానీ ఇక్కడ ఒక్క చందనపు వృక్షంలో కలిసిపోతారు, ఒక్క చందన వృక్షంగా తయారవుతారు. ఆదిలో వచ్చిన ఆదిరత్నాలైన పిల్లలు ఒక్క చందన వృక్షంలా అయ్యారు, అప్పుడే కదా చందనపు సుగంధమును వ్యాపింపజేసారు. విదేశాలవరకు కూడా చేరుకుంది కదా, అప్పుడే వచ్చారు కదా! అలాగే విదేశీయులు కూడా భిన్న భిన్న కల్చర్ల నుండి వచ్చారు, కానీ ఇప్పుడు ఒకే కల్చర్. ఇష్టమే కదా! ఇష్టమైతే చేతులెత్తండి. అప్పుడప్పుడు కష్టంగా అనిపించడం లేదు కదా? కానీ పనిలో రంగు వస్త్రాలు ధరించడానికి అనుమతి ఉంది. బాప్ దాదాకు విదేశీయుల మరో విషయము ఎంతో బాగా నచ్చుతుంది! ఎవరైతే సేవకు నిమిత్తంగా ఉంటారో, సెంటర్లను సంభాళిస్తారో వారి విశేషత- వారు తమ భోజనాన్ని కూడా తయారుచేసుకుంటారు, క్లాస్ కూడా చేయిస్తారు, జిజ్ఞాసువులను కూడా సంభాళిస్తారు మరియు బయట ఉద్యోగం కూడా చేస్తారు. భారతదేశంవారు మొదట్లో వెళ్ళినప్పుడు ఏమి చూసారు.? విశేషత చూసారు, అక్కడ క్లాసు పూర్తవగానే 7 రోజులకు పిండి తడిపి పెట్టుకుంటారు, బ్రెడ్ తయారు చేసి పెట్టుకుంటారు, క్లాస్ పూర్తి కాగానే పాలల్లో వేసుకోవడానికి లభించే భిన్న, భిన్న మంచి వస్తువులను వేసుకుని అవి తిని ఇక పరిగెడ్తారు. మరి అన్ని కార్యాలు ఎంతో చురుకుగా చేసారు మరియు వృద్ధిని పొందారు. మొదట కేవలం లండన్ మాత్రమే ఉండేది, లండన్ వారు చేతులెత్తండి. ఒక్కరి నుండి అనేకులుగా అయిపోయారు కదా! కావున బాప్ దాదా డబుల్ పురుషార్థులు అన్న టైటిల్‌ను ఇచ్చారు, మరియు విదేశసేవ ఇతర ధర్మాలవారిని కూడా తయారుచేసింది! క్రిస్టియన్లు ఉండనే ఉన్నారు కానీ ముస్లిం దేశాలలో కూడా ఎంతమంది దాగి ఉన్న బాబా పిల్లలు బయటకు వచ్చారు. మరింత ముందుకు సాగుతున్నారు. ఇంకో పద్ధతిలో చేస్తున్నారు. బాప్ దాదా ఆ బిడ్డను గుర్తు చేసుకున్నారు. ఏం పేరు? సెంటర్ తెరుస్తున్నారు - (వజీహా అక్కయ్య) నైరోబీ వారు కూడా మంచిగా చేస్తున్నారు. వారు కూడా తయారు చేస్తున్నారు. మరి టైటిల్ నచ్చింది కదా? డబుల్ పురుషార్థులేనా? డబుల్ పురుషార్థులు. అచ్ఛా! నిమిత్తమై ఉన్న టీచర్లు బాగా కష్టపడ్డారు. అందుకే బాప్ దాదా నిమిత్త టీచర్లందరికీ కూడా విశేషమైన అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడైతే శ్రమ యొక్క ఫలితాన్ని తీసుకుంటున్నారు. బాప్ దాదాకు విశ్వ కళ్యాణకారి అన్న టైటిల్ విదేశసేవ ద్వారా లభించింది అని ఇంతకు ముందు కూడా వినిపించడం జరిగింది. మరి విశేషంగా వేర్వేరు దేశాల నుండి వచ్చిన పిల్లలకు, తమ దేశ వాసులతో సహా, బ్రాహ్మణ పరివారముతో సహా, జన్మ దినము సందర్భముగా కోటాను రెట్ల అభినందనలు. అందరూ కలిసి విశేషంగా మీటింగ్ చేసుకుని, ఆర్.సి.ఓలు..యన్.సి.ఓలు పరస్పరం కలిసి పూర్తి సంవత్సరానికి ప్లాన్ వేసుకుని తీసుకువెళ్తున్నారు ఇది విశేషంగా బాప్ దాదాకు నచ్చింది. అంతేకాక మధువన వాతావరణంలో బాప్ దాదా మరియు విశేషంగా నిమిత్త బ్రాహ్మణుల శుభ భావన, శుభ కామనలను తీసుకువెళ్తున్నారు. దీని రిజల్టు చాలా బాగుంది. బాప్ దాదా ఏదైతే ఆశించారో ఆ రిజల్టు ఇప్పుడు ముందుకు వస్తోంది, ఇందుకు కూడా అభినందనలు. మరి బాప్ దాదా ఓహో పిల్లలు ఓహో! లవ్లీ పిల్లలు ఓహో! లక్కీ పిల్లలు ఓహో! అంటూ ఓహో, ఓహో అన్న గీతమును గానం చేస్తూ అందరికీ అభినందనలు తెలుపుతున్నారు.

            వర్గాలవారు ఎవరైతే వచ్చారో వారు తమ , మీటింగులు చేసుకుంటున్నారు కదా! మీటింగ్ చేసుకోండి, మీటింగ్ చేసుకోవాలి ఎందుకంటే బాప్ దాదా ఏదైతే చెప్పారో అది ఇంకా చెయ్యలేదు. అందుకే మీటింగ్ పెట్టాలి. ఎలా అయితే బాప్ దాదా చెప్పారో, ఏదైనా స్థానంలో సమావేశం కండి, వర్గీకరణ సంబంధంలో ఉన్న స్నేహి, సహయోగి పిల్లలు ఎంతమంది వెలువడ్డారు మరియు ఎటువంటివారు వెలువడ్డారు! అంతా బాగుంది, నడిపిస్తున్నారు, నడిపిస్తూ ఉండండి. అచ్ఛా!

           నలువైపుల ఉన్న బాప్ దాదాల హృదయ సింహాసనాధికారి పిల్లలకు, నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థులైన పిల్లలకు, నలువైపుల ఉన్న బాప్ దాదా ఇచ్చిన కానుకను స్వీకరించే పిల్లలకు, ఏ పిల్లలైతే బాప్ దాదాకు సంకల్పంతో కానుకను ఇచ్చారో, ఆ సంకల్పాన్ని సదా దృఢం చేసుకునే అటువంటి దృఢ పురుషార్థులకు, ప్రతిజ్ఞ చేసి ప్రత్యక్షతను తీసుకువచ్చే పిల్లలందరూ బాప్ దాదాల చాలా చాలా హృదయపూర్వక ప్రేమను మరియు హృదయపూర్వక ప్రియస్మృతులను స్వీకరించగలరు. పిల్లలందరికీ మళ్ళీ మళ్ళీ అభినందనలు, అభినందనలు, అభినందనలు.
 
*దాదీలతో-* పరస్పరంలో కూర్చున్నారు, అందరూ తమ తమ అభిప్రాయాలను తెలిపారు, అభిప్రాయాలైతే వేరు వేరుగా ఉంటాయి, కానీ అభిప్రాయాలను అర్థం చేసుకొని గౌరవాన్ని ఇవ్వండి, పరస్పరంలో స్పష్టం చేసుకోండి. స్పష్టం చేసుకోకుండా లోపల పెట్టుకోవద్దు. లోపల పెట్టుకుంటే చెత్త తయారవుతుంది. ఏ వస్తువునైనా లోపల ఉంచి శుభ్రపరచకపోతే ఏమవుతుంది? మరి నిమిత్తంగా ఉన్న పిల్లలైన మిమల్ని బాప్ దాదా మురబ్బీ పిల్లలు అని అంటారు, పాండవులు కూడా ఉన్నారు, కానీ నిమిత్తమైన వారు మురబ్బీ పిల్లలు, మురబ్బీ పిల్లల సంగఠన చాలా త్వరగా అందరినీ ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువస్తుంది. బాప్ దాదా చూసారు, మేము అందరినీ నాట్యం చేయించాలి అని అందరూ మంచి సంకల్పాన్ని తీసుకున్నారు. బాప్ దాదా చెప్పిన నాలుగు విషయాలను ఒక్కొక్కరిలోకి తీసుకురావాలి. ఒకవేళ నాలుగు విషయాలు మెజారిటీ లోకి వచ్చేస్తే సమయం వచ్చేసినట్లే. మరి మీరు నిమిత్తంగా ఉన్నారు, వీరు 10-12 మంది కాదు, ఒక్కరు అని అందరూ అనుకోవాలి. అందరి మనసులలో ఈ సంకల్పం ఉంది. లేదు అని కాదు. కానీ ఈ సంకల్పాన్నే పెంచుతూ వెళ్ళండి. అందరూ మీకు తోడుగా ఉన్నారు. అచ్ఛా! (మోహిని అక్కయ్య, మున్నీ అక్కయ్య ఇండోర్ జోన్ కు వెళ్ళి వచ్చారు) ఎక్కడికైనా ఏ మహారథి అయినా వెళ్ళి వస్తే రిఫ్రెష్ అయితే అవుతారు, ఇంకా కూడా అవుతూ ఉంటారు, అచ్ఛా!

(జానకి దాదీ శిరస్సుపై బాప్ దాదా చేయి పెట్టారు) బాప్ దాదా చేయి అందరి శిరస్సుపైకి వస్తుంది. తాను విశేషముగా నిమిత్తమై ఉంది. ఇది నిమిత్తమైన గ్రూపు, కావున విశేషంగా ఉన్నారు. శిరస్సు ఎప్పుడూ భారీగా కానే కాదు. బాబా కంబైన్డుగా ఉన్నారు కదా. (భగీరథుని మస్తకంపై గంగలమైన మేము ఉన్నాము) ఈ పాండవులు కూడా గంగలే, అందుకే సేవ చేస్తున్నారు, అచ్ఛా!

*ఎల్ అండ్ టి వైజ్ ప్రెజిడెంట్-* మఖీజా అన్నయ్య మరియు వారి పరివారంతో - బాప్ దాదా ఏమి చూసారంటే, సంకల్పాన్ని ఏదైతే చేసారో, దానిని పూర్తి చేసే ధైర్యమును మంచిగా ఉంచారు. ధైర్యము ఉన్నవారికి బాబా నుండి ఎక్స్ ట్రా సహాయము లభిస్తుంది. విన్నారా, ధైర్యము ఉంచారు కదా. అయిపోయింది కదా! ఇప్పుడు ఏ విషయములోనూ ధైర్యము కోల్పోవద్దు. ఏం చెయ్యాలి అనకూడదు, చేసితీరాలి అని అనాలి. ఏం చెయ్యాలి అని అంటే మరింత విఘ్నాలు వస్తాయి, చెయ్యాల్సిందే అన్నప్పుడు అన్నీ తొలగిపోతాయి. ఏవిధముగా దోమలు వచ్చినప్పుడు ధూపము వెలిగిస్తే దోమలు పారిపోతాయో అలాగే మాయా విషయాలు వస్తూ ఉంటాయి, కానీ మీరు ధైర్యము అనే ధూపాన్ని వెలిగించితే దోమలు ఏమి చేస్తాయి? పారిపోతాయి. తాను ధైర్యవంతురాలు, సహయోగానికి పాత్రురాలిగా అయ్యింది. మీది సహాయము, వారిది ధైర్యము. పురుషార్థంలో ముందుకు వెళ్లారని బాప్ దాదా భావిస్తున్నారు. ఇద్దరూ ఒకరికొకరు సహాయాన్ని అందించుకునేవారే. ఈ విశేషతయే ఇక్కడ వరకు చేర్చింది. బాగున్నారు. అచ్ఛా!

*మున్నీ అక్కయ్యగారి సోదరీ సోదరులతో-* మున్నీ అక్కయ్య సోదరీ సోదరులు, సరే కానీ బాప్ దాదా- మీరు లక్కీ, లవ్లీ కూడా అని అంటారు. మీ భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. చూడండి, ( పిల్లవాడిని చూస్తూ) ఇతనిది ఎంత చక్కని ముఖము, ఫోటో తీయండి, ఇది ఇలాగే ఉంచుకోవాలి. మంచిపని చేసారు, తనకు సహయోగులుగా కావడము అంటే బాబా కార్యంలో సహయోగులుగా కావడము. యజ్ఞసేవ ఎంత పుణ్యము! ఎందరికో పుణ్యం కలుగుతుంది. చాలా లక్కీగా ఉన్నారు. చాలా మంచిది.
 
*డాక్టర్ అశోక్ మెహతాతో -* బాప్ దాదా చూసారు, హాస్పిటల్ లో కూడా తిరుగుతారు, నిమిత్తంగా ఉన్న మీ ధైర్యం బాగుంది, అందుకే మీకు ఆఫర్ వస్తుంది. ధైర్యంతో ఉండేవారికి సహకారం స్వతహాగానే లభిస్తుంది. మీకు ఆఫర్ రావడము ఇది ధైర్యానికి గుర్తు. బాగుంది. (యుగళ్ షిరీన్ అక్కయ్య, కూతురు సోనల్ అక్కయ్యతో) మీ గుండె ధైర్యం వీరిని నడిపించింది. నిమిత్తమయ్యావు, పరివారాన్ని నడిపించావు. ఇంకెప్పుడూ పురుషార్థంలో విఘ్నం రాదు. మీరు విఘ్నాన్ని పారద్రోలేవారు, వీరు చాలా ధైర్యమున్నవారు. కొద్దిమందిలోని ధైర్యం కారణంగా ఆఫర్ వస్తుంది, ఇది బాప్ దాదాకు చాలా బాగా నచ్చింది. స్వయంగా దానంతటదే ఆఫర్ రావడము ఇది ధైర్యానికి ఫలితము. మరియు మీరు సహచరులు. ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. వీరు ఇందులో సహవాసులు. పరివారమే లక్కీ.

*(గుల్జార్ దాదీ సేవలో నిమిత్తంగా ఉన్న అక్కయ్యలను బాప్ దాదా స్టేజి మీదకు పిలిచారు)* ఎవరైతే రాత్రి మేలుకుని సేవ చేసారో, వారందరికీ అభినందనలు. రథాన్ని తయారు చేసారు, చాలా మంచిది. గుప్తంగా ఉన్నారు, కొంచెం ప్రత్యక్షం కండి, సహచరులుగా కండి.

*బాప్ దాదా తమ హస్తాలతో జెండాను ఎగురవేసారు.*

           ఈనాటి జన్మదిన శుభాకాంక్షలైతే బాప్ దాదా ఇచ్చేసారు, ఈ జెండా సదా ఉన్నతంగా ఉండాలి, ఆత్మలందరి హృదయాలలో ఎగురుతూ ఉండాలి, ఇదే మీ అందరి మనస్సులోని మాట. ఇప్పుడు బాబా వచ్చారు, వారసత్వాన్ని తీసుకోవడానికి రండి అన్న సందేశాన్ని అన్ని వైపుల అందించండి. ఈ సందేశాన్ని ఇస్తూ, ఇస్తూ చివరకు ఏ రోజు వస్తుందంటే, అందరూ మా బాబా వచ్చారు, వారసత్వం ఇవ్వడానికి వచ్చారు అని అంటారు. మరియు మీ అందరికీ తమ ధైర్య దృష్టి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించినట్లయితే మీ అందరి హృదయాలలో జెండా ఎగరాలి, ఇప్పుడు ఆ రోజు కూడా రానున్నది. ఓం శాంతి.
 
           డబుల్ విదేశీ అక్కయ్యలతో - బాప్ దాదా మీ సంగఠన చూసి సంతోషిస్తున్నారు. (డా.నిర్మల దీదీని జ్ఞాన సరోవరంలో మనోహర్ దాదీ స్థానంలో స్థాయి రూపంలో నిమిత్తం చేయడం జరిగింది) వీరు బాధ్యతా కిరీటాన్ని ధరించారు, ధైర్యాన్ని ఉంచారు. ఇందుకు విశేషమైన అభినందనలు. (బాప్ దాదా శిరస్సుపై చేయి పెట్టారు)

           మీ అందరూ కలుసుకునే విధానము, మీ సంగఠనను చూసి బాప్ దాదాకు బాగా నచ్చుతుంది. గాయత్రి మరియు మరొక జంట ఎవరైతే ఉన్నారో వారిని కూడా బాప్ దాదా గుర్తు చేసారు. గాయత్రి మంచి ధైర్యాన్ని చూపించింది. లౌకిక పరివారానికి మరియు చుట్టుప్రక్కల ఎవరైతే ఉంటారో వారికి ఉదారహణగా అయి చూపించారు. సమయానికి మీరు ఎలా సహయోగులుగా కావచ్చు, వీరు(అంకుల్) కూడా చాలా యోగయుక్తంగా ఉన్నారు, తనకు విశేషముగా, విశేషముగా బాప్ దాదా శక్తులు నిండిన కిరణాలను ఇస్తూ ప్రియ స్మృతులు అందిస్తున్నారు. తోడుగా పరివారమంతటికీ ప్రియస్మృతులు. (శివ జయంతికి రాలేకపోవడం ఇదే మొదటిసారి) అందుకే బాప్ దాదా వారికి స్మృతిని అందించారు.

           మీటింగ్ రూపం మారుతూ వస్తోంది, ఎంతో బాగా అవుతోంది, ఇండియావారు కూడా మిక్స్ అవుతున్నారు. ఇది చాలా బాగుంది. మీరు ధైర్యమును ఉంచుతున్నారు, కాబట్టి సహయోగులుగా అవుతున్నారు, మరియు అవుతూ ఉంటారు కావున నడిపిస్తూ ఉండండి. కావున బాప్ దాదా ముఖ్యంగా ఎవరైతే నిమిత్తమయ్యారో వారికి అభినందనలు తెలుపుతున్నారు. ముందుకు సాగుతూ ఉండండి, సాగుతూ ఉండండి.

           (లండన్ మహేశ్ అన్నయ్య విశేష స్మృతిని అందించారు) సమయాన్ని బట్టి డైరెక్షన్ అనుసారంగా ఎవరైతే సఫలం చేసుకుంటారో వారికి సఫలత లభిస్తుంది. నిశ్చయబుద్ధి గల మంచి పరివారము, సదా ముందుకు సాగుతూ ఉంటారు. పాలన కూడా ఎంత బాగుంది! మరి పాలనకు రిటర్ను ఇస్తున్నారు. టోలి పంపించండి.

Comments